జింబాబ్వే రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ బ్రాడ్ ఈవాన్స్ పొట్టి క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరుసగా 28 ఇన్నింగ్స్‌ల్లో వికెట్ తీసిన తొలి బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా వెస్టిండీస్‌తో నిన్న (ఫిబ్రవరి 24) జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.
గతంలో ఈ రికార్డు శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ, ఐర్లాండ్ పేసర్ మార్క్ అదైర్ పేరిట ఉండేది. మలింగ, అదైర్ వరుసగా 27 టీ20 ఇన్నింగ్స్‌ల్లో కనీసం ఓ వికెటైనా తీశారు. తాజాగా ఈవాన్స్.. మలింగ, అదైర్ పేరిట సంయుక్తంగా ఉండిన రికార్డును బద్దలు కొట్టాడు.
ఈ రికార్డుకు సంబంధించి ఈవాన్స్, మలింగ, అదైర్‌ను సమీపించేందుకు పాకిస్తాన్ వివాదాస్పద బౌలర్ ఉస్మాన్ తారిక్ అతి సమీపంలో ఉన్నాడు. తారిక్ ఇప్పటివరకు వరుసగా 25 ఇన్నింగ్స్‌ల్లో కనీసం ఓ వికెటైన తీశాడు.
వెస్టిండీస్-జింబాబ్వే మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. హెట్‌మైర్ (85), రోవ్‌మన్ పావెల్ (59), రూథర్‌ఫోర్డ్ (31 నాటౌట్), షెపర్డ్ (21), హోల్డర్ (13) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే 17.4 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. బ్రాడ్ ఈవాన్స్ (43), నగరవ (7 నాటౌట్) చివరి వికెట్‌కు 44 పరుగులు జోడించి జింబాబ్వేను 100 పరుగుల మార్కును దాటించారు. మోటీ (4-1-28-4), అకీల్ హొసేన్ (4-1-28-3) తమ స్పిన్ మాయాజాలంతో జింబాబ్వే పతనాన్ని శాశించారు.


