breaking news
Brad Evans
-
ఆఫ్గన్‌ను కాపాడని వీరోచిత సెంచరీ.. జింబాబ్వే సంచలన విజయం
షార్జా వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టెస్టులో జింబాబ్వే 57 పరుగుల తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. ఆద్యంతం నువ్వా నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో జింబాబ్వే పైచేయి సాధించింది. అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ నసీర్ ఖాన్ మరుఫ్ఖిల్ (242 బంతుల్లో 101 నాటౌట్) వీరోచిత సెంచరీ సాధించినప్పటికీ, ఆఫ్గన్‌ను ఓటమి నుంచి తప్పించలేకపోయాడు.418 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 360 పరుగులకు ఆలౌటైంది. మిగిలిన బ్యాటర్లలో అఫ్సర్ జజయ్ (87), అర్థసెంచరీ సాధించాడు. మిగతా బ్యాటర్లలో హష్మతుల్లా షాహిది (35), రహ్మత్ షా (30), వికెట్ కీపర్ ఇక్రమ్ అలిఖిల్ (26), ఆఖర్లో మొహమ్మద్ సలీమ్ (22)తో కలిసి నసీర్ పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవన్స్, బ్లెసింగ్ ముజరబానీ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, విన్సెంట్ మసికేస, గ్రేమీ క్రీమర్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇక ఆఫ్గన్ ఆల్‌రౌండర్ నసీర్ ఖాన్‌కు టెస్టుల్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. అయితే మ్యాచ్‌లో ఒక దశలో జింబాబ్వే ఏడు క్యాచ్‌లు మిస్ చేసి చేజేతులా గెలుపును దూరం చేసుకుంటుందా అనిపించింది. కానీ చివరికి 57 పరుగుల తేడాతో గెలిచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-0తో సొంతం చేసుకుంది. అంతకముందు జింబాబ్వే తమ తొలి ఇన్నింగ్స్‌లో 339 పరుగులకు ఆలౌటయ్యింది. బదులుగా అఫ్గానిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకే పరిమితం కావడంతో జింబాబ్వేకు వంద రన్స్‌కు పైగా ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసి ఆఫ్గన్ ముందు 418 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. ఇక జింబాబ్వే కెప్టెన్‌గా బ్రియాన్ బెన్నెట్‌కు ఇదే తొలి టెస్టు విజయం కావడం విశేషం.In probably the last over of the game, Zimbabwe grab the final wicket needed. The Afghans put on a monumental fight but Zimbabwe come out on top in Sharjah by 57 runs. What an epic game of test cricket 🇿🇼 https://t.co/dAaVAiOlHG— Adam Theo🇿🇼🏏 (@AdamTheofilatos) November 17, 2026 𝐇𝐔𝐍𝐃𝐑𝐄𝐃 𝐎𝐍 𝐓𝐄𝐒𝐓 𝐃𝐄𝐁𝐔𝐓 𝐅𝐎𝐑 𝐍𝐀𝐒𝐄𝐄𝐑 𝐊𝐇𝐀𝐍! 💯 Naseer Khan Maroof Khail has carved his name into Afghanistan’s cricket history, becoming only the third Afghan player to score a century on his Test debut! 👏👏 The talented young all-rounder produced a magnificent display of grit and determination to reach a fighting hundred in the fourth innings of the second Test against Zimbabwe. 🙌 #AfghanAtalan | #AFGvZIM | #GloriousNationVictoriousTeam— Afghanistan Cricket Board (@ACBofficials) November 17, 2026 AfghanAtalan showed tremendous fight and determination throughout Day 5, but Zimbabwe ultimately claimed the second Test by 57 runs. A special mention goes to debutant Naseer Khan, whose unbeaten 101 off 242 balls, and Afsar Khan Zazai, who scored 87 off 202 balls, took the match down to its final moments. A heartbreaking result after such a courageous effort. #AfghanAtalan | #AFGvZIM | #GloriousNationVictoriousTeam— Afghanistan Cricket Board (@ACBofficials) November 17, 2026ఇదీ చదవండి: IND vs NZ: కివీస్‌తో తొలి టెస్టు.. భారత తుదిజట్టు ఇదే! ధోని వీడ్కోలు.. వైరల్‌గా మారిన రుతురాజ్ లెటర్! -
బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన జింబాబ్వే
ముక్కోణపు వన్డే సిరీస్‌లో జింబాబ్వే బోణీ కొట్టింది. శనివారం అబుదాబి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 93 పరుగుల తేడాతో జింబాబ్వే ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో వెటరన్ బ్రెండన్ టేలర్(81), క్రెయిగ్ ఎర్విన్(93) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. బంగ్లా బౌలర్లలో టాస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. షోర్ఫుల్ ఇస్లాం, సైఫ్ హసన్ తలా వికెట్ సాధించారు.నిప్పులు చెరిగిన ఎవాన్స్అనంతరం 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు జింబాబ్వే బౌలర్లు చుక్కలు చూపించారు. బ్రాడ్ ఎవాన్స్ నాలుగు వికెట్లు పడగొట్టి బంగ్లాను దెబ్బ తీశాడు. అతడితో పటు సికందర్ రజా, వెల్లింగ్టన్ మసకాద్జా తలా రెండు వికెట్లు సాధించారు. ఫలితంగా బంగ్లా జట్టు 33.4 ఓవర్లలో కేవలం 172 పరుగులకే కుప్పకూలింది.బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో టాంజిద్ హసన్(46) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కాగా ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ లిట్టన్ దాస్, వైస్ కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ గాయం కారణంగా దూరమయ్యారు. దీంతో బంగ్లా జట్టు కెప్టెన్‌గా తహిద్ హ్రిదోయ్ వ్యవహరించాడు. ఇక రెండో మ్యాచ్‌లో అబుదాబి వేదికగా సోమవారం అఫ్గానిస్తాన్, జింబాబ్వే జట్లు తలపడనున్నాయి.చదవండి: వర్షం కారణంగా భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 రద్దు -
ZIM vs AUS: ట్రవిస్ హెడ్‌కు దిమ్మతిరిగే షాక్!
జింబాబ్వేతో తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రవిస్ హెడ్ పూర్తిగా విఫలమయ్యాడు. ఐదు బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్ కేవలం ఒక ఫోర్ బాది పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో జింబాబ్వే గడ్డ మీద అత్యల్ప స్కోరుకే అవుటైన ఆసీస్ ఓపెనర్‌గా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.మూడు వన్డేల సిరీస్‌కాగా వన్డే ప్రపంచకప్-2027 సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేల సిరీస్‌ను మంగళవారం మొదలుపెట్టింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా తొలి వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.క్లీన్ బౌల్డ్ఈ క్రమంలో రెండో ఓవర్లో జింబాబ్వే పేసర్ బ్రాడ్ ఎవాన్స్ బంతితో రంగంలోకి దిగగా.. రెండో బాల్‌కు ఫోర్ బాది హెడ్ తన పరుగుల ఖాతా తెరిచాడు. అయితే, అదే ఓవర్లో ఐదో బంతికే ఎవాన్స్ అద్భుత బంతితో హెడ్‌ను బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో షాట్‌కు యత్నించిన హెడ్ బౌల్డ్ అయి తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు.భారీ అంచనాలతో బరిలోకి దిగిన మొత్తంగా ఐదు బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేసి నిష్క్రమించాడు. దీంతో హెడ్ షాట్ సెలక్షన్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. జింబాబ్వే గడ్డ మీద అత్యల్ప వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆసీస్ ఓపెనర్‌గా ట్రవిస్ హెడ్ అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. ఇక ఇదే మ్యాచ్‌లో మరో ఓపెనర్, ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ 36 పరుగులు చేసి అవుటయ్యాడు. తద్వారా హెడ్‌తో పాటు ఈ జాబితాలో చేరిపోయాడు.A familiar dismissal for Travis Head!😬He edges one onto the stumps — and Brad Evans strikes! 🎯🔥#ZIMvAUS #Australia #Zimbabwe #ODI #Harare #TravisHead pic.twitter.com/C2qqleXPM5— lightningspeed (@lightningspeedk) September 15, 2026జింబాబ్వే గడ్డ మీద అత్యల్ప వ్యక్తిగత స్కోర్లు నమోదు చేసిన ఆసీస్ ఓపెనర్లు👉ట్రవిస్ హెడ్- 4 పరుగులు (హరారే, 2026)👉ఆడం గిల్‌క్రిస్ట్- 14 పరుగులు(బులవాయో, 1999)👉మాథ్యూ హెడెన్- 34 పరుగులు (బులవాయో, 2003)👉మిచెల్ మార్ష్- 36 పరుగులు (హరారే, 2026)👉బ్రాడ్ హాడిన్- 46 పరుగులు (హరారే, 2014).చదవండి: టీమిండియాలో కొందరు కోహ్లిని వ్యతిరేకించారు: భువీ -
8వ స్ధానంలో సరికొత్త చరిత్ర.. ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాని రికార్డ్
నమీబియా వేదికగా జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్ విజేతగా సౌతాఫ్రికా నిలిచింది. ఆదివారం విండ్‌హోక్ వేదికగా జరిగిన ఫైనల్లో జింబాబ్వేను 48 పరుగుల తేడాతో ఓడించి ట్రోఫీని సౌతాఫ్రికా సొంతం చేసుకుంది. 206 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక జింబాబ్వే చతికల పడింది.జింబాబ్వే ఆల్‌రౌండర్ బ్రాడ్ ఎవాన్స్ ఒంటరి పోరాటం చేసినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. లక్ష్య చేధనలో 67 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి రజా సేన పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఎవాన్స్.. సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మైదానం నలుమూలలా బౌండరీలు బాదుతూ అభిమానులను అలరించాడు. 31 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో ఎవాన్స్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 సిరీస్ / ఓ టోర్నమెంట్ ఫైనల్లో 6వ స్ధానం లేదా ఆ తర్వాత స్ధానంలో బ్యాటింగ్‌కు దిగి అర్ధసెంచరీ చేసిన తొలి ఐసీసీ ఫుల్ మెంబర్ టీమ్ ప్లేయర్‌గా ఎవాన్స్ నిలిచాడు.ఇప్పటివరకు ఐసీసీ టెస్టు హోదా ఉన్న ఏ జట్టు ఆటగాడు కూడా ఈ ఫీట్ సాధించలేదు. ఓవరాల్‌గా అయితే 6వ లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు అత్యధిక స్కోర్ చేసిన రికార్డు నేపాల్‌కు చెందిన బసీర్ అహ్మద్ పేరిట ఉంది. క్వాడ్రాంగులర్ టీ20 సిరీస్ ఫైనల్లో కువైట్‌పై నేపాల్ తరఫున అతడు 80 పరుగులు చేశాడు. -
జింబాబ్వే ఓపెనర్ సూపర్ సెంచరీ.. బంగ్లాదేశ్‌కు పరీక్ష!
సొంతగడ్డపై జింబాబ్వే అదరగొడుతోంది. బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టులో అనూహ్య రీతిలో ఇన్నింగ్స్ మీద 85 పరుగుల తేడాతో గెలిచిన జింబాబ్వే.. వన్డేల్లోనూ శుభారంభం అందుకుంది.హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా తొలి వన్డేలో పర్యాటక బంగ్లా జట్టును 25 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగి 141 పరుగులకే జింబాబ్వే ఆలౌట్ అయింది. అయితే, స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో మాత్రం ఆతిథ్య జట్టు సఫలమైంది.బంగ్లాదేశ్‌ను 116 పరుగులకే ఆలౌట్ చేసి.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య అదే వేదికపై గురువారం నాటి రెండో వన్డేలో జింబాబ్వే.. తొలి మ్యాచ్‌తో పోలిస్తే భారీ స్కోరే సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 247 పరుగులు సాధించింది.ఓపెనర్లలో బ్రియాన్ బెనెట్ డకౌట్ కాగా.. బెన్ కర్రాన్ సెంచరీతో చెలరేగాడు. మొత్తంగా 135 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్ల సాయంతో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగిలిన వారిలో సికిందర్ రజా చెప్పుకోగదగ్గ స్కోరు (33) చేయగా.. లోయర్ ఆర్డర్లో బ్రాడ్ ఎవాన్స్ మెరుపులు మెరిపించాడు.కేవలం 38 బంతుల్లోనే రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాది 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. బెన్ కర్రాన్, ఎవాన్స్ ఇన్నింగ్స్ కారణంగా జింబాబ్వే 247 పరుగులు చేయగలిగింది. బంగ్లాదేశ్ బౌలర్లలో కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్, టస్కిన్ అహ్మద్ తలా రెండు వికెట్లు తీయగా.. నహీద్ రాణా, రిషాద్ హొసేన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇక తొలి వన్డేలో 116 పరుగులకే ఆలౌట్ అయిన బంగ్లాదేశ్.. ఈసారి 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంటే ఒక రకంగా కఠిన పరీక్షే!! -
T20 WC 2026: జింబాబ్వే ప్లేయర్ వరల్డ్ రికార్డు
జింబాబ్వే రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ బ్రాడ్ ఈవాన్స్ పొట్టి క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరుసగా 28 ఇన్నింగ్స్‌ల్లో వికెట్ తీసిన తొలి బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా వెస్టిండీస్‌తో నిన్న (ఫిబ్రవరి 24) జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.గతంలో ఈ రికార్డు శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ, ఐర్లాండ్ పేసర్ మార్క్ అదైర్ పేరిట ఉండేది. మలింగ, అదైర్ వరుసగా 27 టీ20 ఇన్నింగ్స్‌ల్లో కనీసం ఓ వికెటైనా తీశారు. తాజాగా ఈవాన్స్.. మలింగ, అదైర్ పేరిట సంయుక్తంగా ఉండిన రికార్డును బద్దలు కొట్టాడు.ఈ రికార్డుకు సంబంధించి ఈవాన్స్, మలింగ, అదైర్‌ను సమీపించేందుకు పాకిస్తాన్ వివాదాస్పద బౌలర్ ఉస్మాన్ తారిక్ అతి సమీపంలో ఉన్నాడు. తారిక్ ఇప్పటివరకు వరుసగా 25 ఇన్నింగ్స్‌ల్లో కనీసం ఓ వికెటైన తీశాడు.వెస్టిండీస్-జింబాబ్వే మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. హెట్‌మైర్ (85), రోవ్‌మన్ పావెల్ (59), రూథర్‌ఫోర్డ్ (31 నాటౌట్), షెపర్డ్ (21), హోల్డర్ (13) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే 17.4 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. బ్రాడ్ ఈవాన్స్ (43), నగరవ (7 నాటౌట్) చివరి వికెట్‌కు 44 పరుగులు జోడించి జింబాబ్వేను 100 పరుగుల మార్కును దాటించారు. మోటీ (4-1-28-4), అకీల్ హొసేన్ (4-1-28-3) తమ స్పిన్ మాయాజాలంతో జింబాబ్వే పతనాన్ని శాశించారు. -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన జింబాబ్వే ఆటగాళ్లు
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 24) జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఓడినా, ఆ జట్టు ఆటగాళ్లు ఓ ప్రపంచకప్ రికార్డును సాధించారు. ఓటమి ఖరారైన వేల బ్రాడ్ ఈవాన్స్-రిచర్డ్ నగరవ పదో వికెట్‌కు 44 పరుగులు జోడించి, ప్రపంచకప్ చరిత్రలో పదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా నిలిచారు.సిక్సర్లతో విరుచుకుపడ్డారుజింబాబ్వే ఓటమి ఖరారయ్యాక ఈవాన్స్, నగరవ సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఈవాన్స్ 5, నగరవ ఓ సిక్సర్‌తో విధ్వంసం సృష్టించారు. షమార్ జోసఫ్ వేసిన 17వ ఓవర్లో ఈవాన్స్ మూడు సిక్సర్లు బాదాడు. అంతకుముందు జేసన్ హోల్డర్ వేసిన 16వ ఓవర్లోనూ రెండు సిక్సర్లు కొట్టాడు. దీనికి ముందు ఓవర్ చివరి బంతికి నగరవ ఓ సిక్సర్ బాదాడు.ప్రపంచకప్ రికార్డుఈ మ్యాచ్‌లో మరో ప్రపంచకప్ రికార్డు కూడా నమోదైంది. ఇరు జట్లు కలిపి ఏకంగా 31 సిక్సర్లు బాదాయి. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఓ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక సిక్సర్లు ఇవే. గతంలో ఈ రికార్డు 2014 ఎడిషన్ నెదర్లాండ్స్-ఐర్లాండ్ మ్యాచ్ పేరిట ఉండేది. ఆ మ్యాచ్‌లో 30 సిక్సర్లు నమోదయ్యాయి.ముగిసిన జైత్రయాత్రఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ కూడా ఓ ప్రపంచకప్ రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు (180) చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 5 పరుగుల వద్ద ఔట్ కావడంతో ప్రస్తుత ప్రపంచకప్‌లో బెన్నెట్ అజైత్రయాత్ర ముగిసింది. ఈ మ్యాచ్‌కు ముందు బెన్నెట్ 3 ఇన్నింగ్స్‌ల్లో 175 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు.కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. హెట్‌మైర్ (85), రోవ్‌మన్ పావెల్ (59), రూథర్‌ఫోర్డ్ (31 నాటౌట్), షెపర్డ్ (21), హోల్డర్ (13) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే 17.4 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. బ్రాడ్ ఈవాన్స్ (43), నగరవ (7 నాటౌట్) చివరి వికెట్‌కు 44 పరుగులు జోడించి జింబాబ్వేను 100 పరుగుల మార్కును దాటించారు. మోటీ (4-1-28-4), అకీల్ హొసేన్ (4-1-28-3) తమ స్పిన్ మాయాజాలంతో జింబాబ్వే ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. -
T20 WC: ఆసీస్‌కు షాకిచ్చిన పసికూన.. సంచలన విజయం
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో మరో సంచలనం నమోదైంది. మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాకు ‘పసికూన’ జింబాబ్వే ఊహించని షాకిచ్చింది. గ్రూప్-‘బి’లో భాగంగా కొలంబో వేదికగా ఆసీస్- జింబాబ్వే జట్లు శుక్రవారం నాటి ఉదయం మ్యాచ్‌లో తలపడ్డాయి.ఆర్.ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 169 పరుగులు సాధించింది. ఓపెనర్లలో బ్రియాన్ బెనెట్ అజేయ అర్ధ శకతం (56 బంతుల్లో 64) సాధించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ తాడివనాషే మరుమణి 21 బంతుల్లో 35 పరుగులు చేశాడు.రజా మెరుపు ఇన్నింగ్స్వన్డౌన్లో వచ్చిన ర్యాన్ బర్ల్ (30 బంతుల్లో 35) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ సికందర్ రజా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 13 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 25 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో మార్కస్ స్టొయినిస్, కామెరాన్ గ్రీన్ తలా ఒక వికెట్ తీశారు.చెలరేగిన ముజర్బానీఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూ జట్టుకు జింబాబ్వే బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. బ్లెసింగ్ ముజర్బానీ జోష్ ఇంగ్లిస్ (8)ను.. బ్రాడ్ ఎవాన్స్ కెప్టెన్ ట్రవిస్ హెడ్ (17)ను వెనక్కి పంపించారు.వన్‌డౌన్‌లో వచ్చిన గ్రీన్‌ను ఎవాన్స్ డకౌట్ చేయగా.. ముజర్బానీ సైతం టిమ్ డేవిడ్‌ను పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు పంపాడు. పవర్ హిట్టర్లు ఇద్దరూ డకౌట్ కావడంతో ఆసీస్ కష్టాల్లో కూరుకుపోయింది. అయితే, గ్లెన్ మాక్స్వెల్ (31)తో కలిసి మ్యాచ్ రెన్షా ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.HISTORY MADE IN COLOMBO! 🤯🔥Composure. Belief. Zimbabwe have beaten Australia! 👏💥ICC Men’s #T20WorldCup | #CANvUAE | LIVE NOW 👉 https://t.co/xRf3Nc9OQ0 pic.twitter.com/1BXNa0ftxS— Star Sports (@StarSportsIndia) February 13, 2026ఈ క్రమంలో 34 బంతుల్లో రెన్షా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, 19వ ఓవర్లో ముజర్బానీ బౌలింగ్‌లో రెన్షా (44 బంతుల్లో 65) అవుట్ కావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అదే ఓవర్లో ఆఖరి బంతికి ముజర్బానీ ఆడం జంపా (2)ను కూడా వెనక్కి పంపాడు. దీంతో ఆసీస్ విజయ సమీకరణం ఆరు బంతుల్లో 29 పరుగులుగా మారింది.146 పరుగులకే ఆలౌట్అయితే, ఆఖరి ఓవర్లో ఎవాన్స్ బౌలింగ్‌లో తొలి బంతికే నాథన్ ఎల్లిస్ ఫోర్ బాదాడు. కానీ ఆ తర్వాత ఎవాన్స్ ఆసీస్‌ను కోలుకోనివ్వలేదు. మూడో బంతికి మాథ్యూ కుహ్నెమన్ రనౌట్ (0) కావడంతో ఆసీస్ పదో వికెట్ కోల్పోయింది. జింబాబ్వే విధించిన 170 పరుగుల లక్ష్య ఛేదనలో 19.3 ఓవర్లలో కేవలం 146 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా జింబాబ్వే 23 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.జింబాబ్వే బౌలర్లలో ముజర్బానీ నాలుగు వికెట్లు, ఎవాన్స్ మూడు వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. మసకజ్ద, ర్యాన్ బర్ల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. కాగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో తొలి ఎడిషన్ 2007లో ఆసీస్‌ను తొలిసారి ఓడించిన జింబాబ్వే.. మళ్లీ ఆసీస్‌పై గెలుపొందడం ఇదే మొదటిసారి.చదవండి: టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. నేపాల్‌పై ఇటలీ గెలుపుAND ANOTHER ONE GONE! 🔥Head pushes at it and chops it back onto his stumps! 🎯💥The SIUUU celebration is out in Colombo as Zimbabwe tighten their grip early! 🙌 Is there an upset on the cards?ICC Men’s #T20WorldCup | #AUSvZIM | LIVE NOW 👉 https://t.co/WBa4qbbxs0 pic.twitter.com/kzJ8M8j5ut— Star Sports (@StarSportsIndia) February 13, 2026


