జింబాబ్వే ఓపెనర్‌ సూపర్‌ సెంచరీ.. బంగ్లాదేశ్‌కు పరీక్ష! | Curran unbeaten ton Evan blitz power Zimbabwe to 247 6 Vs BAN in 2nd ODI | Sakshi
Sakshi News home page

జింబాబ్వే ఓపెనర్‌ సూపర్‌ సెంచరీ.. బంగ్లాదేశ్‌కు పరీక్ష!

Jul 9 2026 6:09 PM | Updated on Jul 9 2026 6:17 PM

Curran unbeaten ton Evan blitz power Zimbabwe to 247 6 Vs BAN in 2nd ODI

సొంతగడ్డపై జింబాబ్వే అదరగొడుతోంది. బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టులో అనూహ్య రీతిలో ఇన్నింగ్స్‌ మీద 85 పరుగుల తేడాతో గెలిచిన జింబాబ్వే.. వన్డేల్లోనూ శుభారంభం అందుకుంది.

హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌ వేదికగా తొలి వన్డేలో పర్యాటక బంగ్లా జట్టును 25 పరుగుల తేడాతో ఓడించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగి 141 పరుగులకే జింబాబ్వే ఆలౌట్‌ అయింది. అయితే, స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో మాత్రం ఆతిథ్య జట్టు సఫలమైంది.

బంగ్లాదేశ్‌ను 116 పరుగులకే ఆలౌట్‌ చేసి.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో  ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య అదే వేదికపై గురువారం నాటి రెండో వన్డేలో జింబాబ్వే.. తొలి మ్యాచ్‌తో పోలిస్తే భారీ స్కోరే సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 247 పరుగులు సాధించింది.

ఓపెనర్లలో బ్రియాన్‌ బెనెట్‌ డకౌట్‌ కాగా.. బెన్‌ కర్రాన్‌ సెంచరీతో చెలరేగాడు. మొత్తంగా 135 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్ల సాయంతో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగిలిన వారిలో సికిందర్‌ రజా చెప్పుకోగదగ్గ స్కోరు (33) చేయగా.. లోయర్‌ ఆర్డర్‌లో బ్రాడ్‌ ఎవాన్స్‌ మెరుపులు మెరిపించాడు.

కేవలం 38 బంతుల్లోనే రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాది 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. బెన్‌ కర్రాన్‌, ఎవాన్స్‌ ఇన్నింగ్స్‌ కారణంగా జింబాబ్వే 247 పరుగులు చేయగలిగింది. బంగ్లాదేశ్‌ బౌలర్లలో కెప్టెన్‌ మెహదీ హసన్‌ మిరాజ్‌, టస్కిన్‌ అహ్మద్‌ తలా రెండు వికెట్లు తీయగా.. నహీద్‌ రాణా, రిషాద్‌ హొసేన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఇక తొలి వన్డేలో 116 పరుగులకే ఆలౌట్‌ అయిన బంగ్లాదేశ్‌.. ఈసారి 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంటే ఒక రకంగా కఠిన పరీక్షే!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement