ఇంగ్లండ్‌ గడ్డపై అడుగుపెట్టిన రోహిత్‌ శర్మ | Rohit Sharma arrives in England, starts practice for IND vs ENG ODIs | Sakshi
Sakshi News home page

IND vs ENG: ఇంగ్లండ్‌ గడ్డపై అడుగుపెట్టిన రోహిత్‌ శర్మ

Jul 6 2026 4:57 PM | Updated on Jul 6 2026 5:09 PM

Rohit Sharma arrives in England, starts practice for IND vs ENG ODIs

ఇంగ్లండ్‌-భార‌త్ మ‌ధ్య మూడు వ‌న్డేల సిరీస్ మ‌రో 8 రోజుల్లో ప్రారంభం కానుంది. తొలి వ‌న్డే ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా జూలై 14న జ‌ర‌గ‌నుంది. ఈ సిరీస్ కోసం భార‌త స్టార్ ఓపెన‌ర్‌, మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఇంగ్లండ్ గ‌డ్డ‌పై అడుగుపెట్టాడు. ఇంగ్లండ్‌కు చేరుకున్న రోహిత్ ఏ మాత్రం ఆల‌స్యం చేయకుండా త‌న ప్రాక్టీస్‌ను మొద‌లు పెట్టాడు. 

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ స‌న్నాహ‌కాల్లో భాగంగా జ‌ర‌గ‌బోయే ఈ సిరీస్‌లో స‌త్తాచాటాల‌ని హిట్‌మ్యాన్ ఉవ్విళ్లూరుతున్నాడు. చివ‌ర‌గా అఫ్గానిస్తాన్‌తో వ‌న్డేల్లో కూడా ఈ ముంబైక‌ర్ రాణించాడు. ఇప్పుడు అదే ఫామ్‌ను ఇంగ్లీష్ గ‌డ్డ‌పై కొన‌సాగించేందుకు రోహిత్ స‌న్న‌ద‌మ‌వుతున్నాడు. మ‌రోవైపు అఫ్గానిస్తాన్‌తో వ‌న్డే సిరీస్‌కు గాయం కార‌ణంగా దూర‌మైన స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి సైతం ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. 

దీంతో ఇంగ్లండ్‌తో వ‌న్డేల్లో కోహ్లి ఆడ‌నున్నాడు. ప్ర‌స్తుతం లండ‌న్‌లో ఉన్న విరాట్ త్వ‌ర‌లోనే భార‌త జ‌ట్టుతో క‌లిసే అవ‌కాశ‌ముంది. స్టార్ పేస‌ర్ జస్ప్రీత్ బుమ్రా సైతం జ‌ట్టుతో చేర‌నున్నాడు. అత‌డు కూడా త‌న బౌలింగ్ ప్రాక్టీస్‌ను మొద‌లు పెట్టాడు. అయితే ఇంగ్లండ్ టూర్‌కు స్టార్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి గాయం కారణంగా దూరమయ్యారు. నితీశ్ స్ధానంలో సూర్యన్ష్ షెడ్గేని జట్టులోకి తీసుకున్నారు.

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత జట్టు
శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌, సూర్యన్ష్ షెడ్గే , కుల్దీప్ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ, హర్షిత్‌ రాణా, అర్ష్‌దీప్‌ సింగ్‌, గుర్నూర్‌ బ్రార్.
చదవండి: శ్రీలంక గడ్డపై ద్రవిడ్‌ కుమారుడి విశ్వరూపం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement