తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్- 2026 తుది అంకానికి చేరుకుంది. ఉప్పల్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో కరీంనగర్ డైమండ్స్- రంగారెడ్డి రైజర్స్ తలపడుతున్నాయి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన కరీంనగర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
కాగా లీగ్ దశలో ఏడింట చెరో నాలుగు విజయాలతో కరీంనగర్, రంగారెడ్డి మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. నెట్‌రన్‌రేటు పరంగా రంగారెడ్డి (1.211) కంటే మెరుగ్గా ఉండి కరీంనగర్ (1.535) మూడో స్థానంలో నిలవగా.. ఇరుజట్ల మధ్య గురువారం నాటి ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు తదుపరి దశకు అర్హత సాధిస్తుంది.
తుదిజట్లు
కరీంనగర్
తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), సాత్విక్ రెడ్డి, హెచ్‌కే సింహా, రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్), చందన్ సహాని, టీవీఎస్ నారాయణ తేజ, హరీశ్ ఠాకూర్, శుభం శర్మ, రత్లావత్ దినేశ్, ఆశిష్ శ్రీవాస్తవ్, సతీశ్ కుమార్.
రంగారెడ్డి
తనయ్ త్యాగరాజన్ (కెప్టెన్), ఆరోన్ జార్జ్ వర్గీస్, అలంకృద్ రాపోలు (వికెట్ కీపర్), జ్ఞానప్రకాశ్ రెడ్డి, వెంకట్ కార్తిక్, ఆదిత్య జవ్వాజి, నితిన్‌సాయి యాదవ్, అరుణ్ కుమార్, హితేశ్ యాదవ్, సచేత్ బింజ్రాజ్క, ఆర్యన్ కరియప్ప.


