breaking news
TANMAY AGARWAL
-
ఎలిమినేటర్ మ్యాచ్‌లో శతక్కొట్టిన కెప్టెన్
రంగారెడ్డి రైజర్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో కరీంనగర్ డైమండ్స్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ దంచికొట్టాడు. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో అద్భుత శతకంతో అదరగొట్టాడు. కేవలం 61 బంతుల్లోనే 11 ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో ఏకంగా 137 పరుగులు రాబట్టాడు. కాగా తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్-2026లో తన్మయ్‌కు ఇది మూడో సెంచరీ. సింహా అర్ధ శతకంఇక రంగారెడ్డితో మ్యాచ్‌లో ఓపెనర్లలో తన్మయ్ ఇలా సెంచరీతో చెలరేగగా.. సాత్విక్ రెడ్డి మాత్రం 15 పరుగులకే నిష్క్రమించాడు. అయితే, తన్మయ్‌తో కలిసి వన్‌డౌన్ బ్యాటర్ హెచ్‌కే సింహా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 28 బంతుల్లోనే ఐదు ఫోర్లు, రెండు సిక్స్‌లు బాది సింహా అర్ధ శతకం (50) పూర్తి చేసుకుని అవుటయ్యాడు. తన్మయ్, సింహా కలిసి రెండో వికెట్‌కు 69 బంతుల్లో ఏకంగా 139 పరుగులు జోడించారు. ఇక వీరిద్దరు అవుటైన తర్వాత కరీంనగర్ ఇన్నింగ్స్ నెమ్మదించింది. వైస్ కెప్టెన్ చందన్ సహానీ 3, వికెట్ కీపర్ బ్యాటర్ రాహుల్ రాదేశ్ 14 పరుగులు చేసి అవుట్ కాగా.. నారాయణ తేజ డకౌట్‌గా వెనుదిరిగాడు.కరీంనగర్ భారీ స్కోరుమిగిలిన వారిలో హరీశ్ ఠాకూర్ 9 పరుగులు చేయగా.. శుభం శర్మ ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్ల ఆట ముగిసే సరికి కరీంనగర్ ఏడు వికెట్ల నష్టానికి 238 పరుగులు మేర భారీ స్కోరు సాధించింది.రంగారెడ్డి బౌలర్లలో ఆర్యన్ కరియప్ప రెండు వికెట్లు తీయగా.. అరుణ్ కుమార్, కెప్టెన్ తనయ్ త్యాగరాజన్, సచేత్, నితిన్ సాయి యాదవ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.Absolute Cinema! ✋🤩🤚There is literally no stopping Tanmay Agarwal! 🔥3rd 💯 of the season! 🥊#Eliminator #KDvRRR #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/JuWbLnjU2z— tg20official (@tg20official) July 9, 2026 -
ఎలిమినేటర్ మ్యాచ్.. కరీంనగర్ బ్యాటింగ్
తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్- 2026 తుది అంకానికి చేరుకుంది. ఉప్పల్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో కరీంనగర్ డైమండ్స్- రంగారెడ్డి రైజర్స్ తలపడుతున్నాయి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన కరీంనగర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.కాగా లీగ్ దశలో ఏడింట చెరో నాలుగు విజయాలతో కరీంనగర్, రంగారెడ్డి మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. నెట్‌రన్‌రేటు పరంగా రంగారెడ్డి (1.211) కంటే మెరుగ్గా ఉండి కరీంనగర్ (1.535) మూడో స్థానంలో నిలవగా.. ఇరుజట్ల మధ్య గురువారం నాటి ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు తదుపరి దశకు అర్హత సాధిస్తుంది. తుదిజట్లుకరీంనగర్తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), సాత్విక్ రెడ్డి, హెచ్‌కే సింహా, రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్), చందన్ సహాని, టీవీఎస్ నారాయణ తేజ, హరీశ్ ఠాకూర్, శుభం శర్మ, రత్లావత్ దినేశ్, ఆశిష్ శ్రీవాస్తవ్, సతీశ్ కుమార్.రంగారెడ్డితనయ్ త్యాగరాజన్ (కెప్టెన్), ఆరోన్ జార్జ్ వర్గీస్, అలంకృద్ రాపోలు (వికెట్ కీపర్), జ్ఞానప్రకాశ్ రెడ్డి, వెంకట్ కార్తిక్, ఆదిత్య జవ్వాజి, నితిన్‌సాయి యాదవ్, అరుణ్ కుమార్, హితేశ్ యాదవ్, సచేత్ బింజ్రాజ్క, ఆర్యన్ కరియప్ప. -
కరీంనగర్ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు!
తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్ అరంగేట్ర సీజన్లో కరీంనగర్ డైమండ్స్ ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. పాలమూరు స్ట్రైకర్స్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో కరీంనగర్ ఆటగాళ్లు దుమ్ములేపారు. ఈ క్రమంలో ప్రత్యర్థిని ఏకంగా 73 పరుగుల తేడాతో చిత్తు చేసింది కరీంనగర్.ఉప్పల్ వేదికగా మంగళవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్‌లో పాలమూరు- కరీంనగర్ తలపడ్డాయి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన పాలమూరు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కరీంనగర్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 216 పరుగులు సాధించింది.తన్మయ్ అగర్వాల్ అద్భుత శతకం ఓపెనర్లలో కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ అద్భుత శతకం (58 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు; 109) సాధించాడు. సాత్విక్ రెడ్డి 22 బంతుల్లో 32 పరుగులు చేశాడు. మిగిలిన వారిలో నారాయణ తేజ మెరుపులు (8 బంతుల్లో 23 నాటౌట్) మెరిపించాడు.ఇక లక్ష్య ఛేదనలో పాలమూరును కరీంనగర్ 143 పరుగులకే కట్టడి చేసింది. కరీంనగర్ బౌలర్లలో రత్లావత్ దినేశ్, శుభం శర్మ మూడేసి వికెట్లతో చెలరేగి పాలమూరు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. నారాయణ తేజ, ఆశిష్ శ్రీవాస్తవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.A true all-rounder! 😍This return catch deserves a place in the greatest museums of the world! 🥵#KDvPS #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/dgGVkLTZ6M— tg20official (@tg20official) July 7, 2026సంహిత్ రెడ్డి మెరుపులు వృథాపాలమూరు బ్యాటర్లలో సంహిత్ రెడ్డి టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. 46 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 67 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా షాదాబ్ అహ్మద్ (16 బంతుల్లో 24) రాణించాడు. కానీ మిగతా వాళ్లంతా తేలిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో పాలమూరు తొమ్మిది వికెట్లు నష్టపోయి 143 పరుగులకే పరిమితమైంది. దీంతో ఓటమితోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.కాగా లీగ్ దశలో ఆడిన ఏడు మ్యాచ్‌లలో పాలమూరుకు ఇది ఐదో ఓటమి. మరోవైపు.. కరీంనగర్‌కు ఏడింట ఇది నాలుగో గెలుపు. ఇక ఇప్పటికే హైదరాబాద్, ఖమ్మం ప్లే ఆఫ్స్ చేరగా.. మూడు, నాలుగు స్థానాల కోసం కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి బరిలో నిలిచాయి. అయితే, మంగళవారం జరిగే రంగారెడ్డి- వరంగల్ మ్యాచ్ ఫలితంతో మూడు, నాలుగు స్థానాల్లో ఎవరు నిలిచారో అధికారికంగా తేలుతుంది. కరీంనగర్ ఎనిమిది పాయింట్లతో పాటు మెరుగైన నెట్‌రన్‌రేటు (+1.424)తో బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. -
సెంచరీతో చెలరేగిన కెప్టెన్
పాలమూరు స్ట్రైకర్స్‌పై కరీంనగర్ డైమండ్స్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ శతక్కొట్టాడు. మొత్తంగా 58 బంతులు ఎదుర్కొని పదకొండు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 109 పరుగులు సాధించాడు. ఫలితంగా.. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కరీంనగర్ భారీ స్కోరు చేయగలిగింది.తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్‌లో భాగంగా మంగళవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్‌తో కరీంనగర్ డైమండ్స్ తలపడుతోంది. ఉప్పల్ వేదికగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన పాలమూరు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుని.. కరీంనగర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.తన్మయ్ శతకంతో చెలరేగడంతోఈ క్రమంలో ఓపెనర్లు కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (109), సాత్విక్ రెడ్డి (22 బంతుల్లో 32) శుభారంభం అందించారు. ముఖ్యంగా తన్మయ్ శతకంతో చెలరేగడంతో మిగతా బ్యాటర్లు విఫలమైనా కరీంనగర్ స్కోరు 200 దాటింది. చందన్ సహాని 16, సింహా 15, రాహుల్ రాదేశ్ 10 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచారు.Brutal hitting! 💥Tanmay Agarwal upped the ante with 2️⃣0️⃣ off the over, putting the Diamonds in a position of stength! 💪#KDvPS #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/mNgmtOh5lc— tg20official (@tg20official) July 7, 2026ఆఖర్లో నారాయణ తేజ మెరుపు ఇన్నింగ్స్ (8 బంతుల్లో 23 నాటౌట్) ఆడాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి కరీంనగర్ డైమండ్స్ 216 పరుగులు చేసింది. పాలమూరు బౌలర్లలో అశ్వద్ రాజీవ్ రెండు వికెట్లు తీయగా.. మహ్మద్ ఆఫ్రిది, రిషభ్ బిస్లాస్, నిశాంత్ రెడ్డి తలా ఒక వికెట్ పడగొట్టారు.ఇక ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే కరీంనగర్ ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. మరోవైపు.. పాలమూరు ఇప్పటికి ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఒక్కటి మాత్రమే గెలిచి ఇప్పటికే ఎలిమినేట్ అయింది.తుదిజట్లుపాలమూరు స్ట్రైకర్స్ప్రజ్ఞయ్ రెడ్డి (కెప్టెన్, వికెట్ కీపర్), విఘ్నేశ్ రెడ్డి, రోహిత్ రాయుడు, మణికంఠేశ్వర్‌రెడ్డి, రిషభ్ బిస్లాస్, ఎండీ ఆఫ్రిదీ అహ్మద్, సంహిత్ రెడ్డి, ఎండీ షాదాబ్ అహ్మద్, నిపుణ్ రెడ్డి, అశ్వద్ రాజీవ్, నిశాంత్ సేన్ రెడ్డి.కరీంనగర్ డైమండ్స్తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), సాత్విక్ రెడ్డి, హెచ్‌కే సింహ, రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్), చందన్ సహాని, టీవీఎస్ నారాయణ తేజ, హరీశ్ ఠాకూర్, శుభం శర్మ, రత్లావత్ దినేశ్, ఆశిష్ శ్రీవాస్తవ్, సతీశ్ కుమార్. -
కరీంనగర్‌కు చావోరేవో.. టాస్ గెలిచిన పాలమూరు
తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్‌లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్- కరీంనగర్ డైమండ్స్ తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన పాలమూరు తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా.. కరీంనగర్ బ్యాటింగ్‌కు దిగింది. ఇరుజట్లకు లీగ్ దశలో ఇదే ఆఖరి మ్యాచ్ కావడం గమనార్హం.కాగా హైదరాబాద్ ఇ- చాంపియన్స్ లీగ్ దశలో ఏడింట ఏడు గెలిచి.. 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక హైదారాబాద్‌తో పాటు ఖమ్మం ఏసెస్ (ఏడింట ఐదు గెలిచి) తమ ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో మిగిలిన రెండు బెర్తుల కోసం కరీంనగర్ డైమండ్స్, నల్గొండ నైట్స్, రంగారెడ్డి రైజర్స్ పోటీలో ఉన్నాయి.ఇక మంగళవారం కరీంనగర్ పాలమూరుతో మ్యాచ్‌లో గెలిస్తేనే రేసులో ఉండగలుగుతుంది. అనంతరం రంగారెడ్డి- వరంగల్ మ్యాచ్ ఫలితంతో ప్లే ఆఫ్స్ చేరిన మిగిలిన రెండు జట్లు ఏవో తేలుతుంది. తుదిజట్లుపాలమూరు స్ట్రైకర్స్ప్రజ్ఞయ్ రెడ్డి (కెప్టెన్, వికెట్ కీపర్), విఘ్నేశ్ రెడ్డి, రోహిత్ రాయుడు, మణికంఠేశ్వర్‌రెడ్డి, రిషభ్ బిస్లాస్, ఎండీ ఆఫ్రిదీ అహ్మద్, సంహిత్ రెడ్డి, ఎండీ షాదాబ్ అహ్మద్, నిపుణ్ రెడ్డి, అశ్వద్ రాజీవ్, నిశాంత్ సేన్ రెడ్డి.కరీంనగర్ డైమండ్స్తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), సాత్విక్ రెడ్డి, హెచ్‌కే సింహ, రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్), చందన్ సహాని, టీవీఎస్ నారాయణ తేజ, హరీశ్ ఠాకూర్, శుభం శర్మ, రత్లావత్ దినేశ్, ఆశిష్ శ్రీవాస్తవ్, సతీశ్ కుమార్. -
కరీంనగర్ భారీ స్కోరు.. రంగారెడ్డి లక్ష్యం ఎంతంటే?
తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్- 2026లో భాగంగా గురువారం నాటి మధ్యాహ్నం మ్యాచ్‌లో కరీంనగర్ డైమండ్స్- రంగారెడ్డి రైజర్స్ తలపడుతున్నాయి. ఉప్పల్ వేదికగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన రంగారెడ్డి మొదట బౌలింగ్ ఎంచుకోగా.. కరీంనగర్ బ్యాటింగ్‌కు దిగింది.కరీంనగర్ భారీ స్కోరు.. రంగారెడ్డి లక్ష్యం ఎంతంటే?ఓపెనర్లు సాత్విక్ రెడ్డి (24), కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (29) ఫర్వాలేదనిపించగా.. సింహా, రాహుల్ రాదేశ్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. సింహా 38 బంతుల్లోనే 60 పరుగులు చేయగా.. రాహుల్ 37 బంతుల్లోనే 72 పరుగులు సాధించాడు. చందన్ సహానీ (19), శుభం శర్మ (17 నాటౌట్) రాణించారు. ఫలితంగా నిర్నీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి కరీంనగర్ 230 పరుగులు సాధించింది. రంగారెడ్డి బౌలర్లలో తనయ్ జడ్డు రెండు వికెట్లు తీయగా.. తనయ్ త్యాగరాజన్, నితిన్ సాయి యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.తుదిజట్లుకరీంనగర్ డైమండ్స్తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), హెచ్‌కే సింహ, రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్), చందన్ సహానీ, టీవీఎస్ నారాయణ తేజ, హరీశ్ ఠాకూర్, శుభం శర్మ, రత్లావత్ దినేశ్, ఆశిష్ శ్రీవాస్తవ్, సతీశ్ కుమార్.రంగారెడ్డి రైజర్స్తనయ్ త్యాగరాజన్ (కెప్టెన్), ఆరోన్ జార్జ్ వర్గీస్, అవినాశ్ రావు (వికెట్ కీపర్), అలంకృత్ రాపోల్, జ్ఞానప్రకాశ్ రెడ్డి, ఆదిత్య జవ్వాజి, నితిన్ సాయి యాదవ్, నానావత్ రాకేశ్, అరుణ్ కుమార్, తనయ్ జడ్డు, ఆర్యన్ కరియప్ప. -
నరాలు తెగే ఉత్కంఠ.. బోణీ కొట్టిన కరీంనగర్
తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20)- 2026లో కరీంనగర్ డైమండ్స్ ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. వరంగల్ వారియర్స్‌తో ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో.. రెండు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఉప్పల్ వేదికగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన వరంగల్ వారియర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా.. కరీంనగర్ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కరీంనగర్ డైమండ్స్ 209 పరుగులు స్కోరు చేసింది.తన్మయ్ అగర్వాల్ అద్భుత శతకంకరీంనగర్ బ్యాటర్లలో ఓపెనర్, కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ అద్భుత రీతిలో రాణించాడు. 52 బంతుల్లోనే వంద పరుగులు చేసుకున్న తన్మయ్.. మొత్తంగా 61 బంతులు ఎదుర్కొని పదిహేను ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 133 పరుగులు సాధించాడు. కిరణ్ బౌలింగ్‌లో LBW కావడంతో తన్మయ్ మెరుపు ఇన్నింగ్స్‌కు తెరపడింది. Simply outstanding! 🤩A ton to savour for Tanmay, standing up and leading the fight for his side! 💥What a time to do it for the Diamonds! ⚡️#WWvKD #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/b3Cc3pqvEr— tg20official (@tg20official) June 28, 2026మిగిలిన వారిలో వన్‌డౌన్ బ్యాటర్ హెచ్‌కే సింహ (24) ఫర్వాలేదనిపించాడు. వరంగల్ బౌలర్లలో ముదస్సర్ రెండు వికెట్లు తీయగా.. ఆది మణి కిరణ్, శౌనక్ కులకర్ణి, మురుగన్ అభిషేక్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వరంగల్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 207 పరుగులకు పరిమితమైంది.గెలుపు ఆశలపై నీళ్లుఓపెనర్లు హర్షిత్ చౌదరి (31), కెప్టెన్ అమన్ రావు (12) స్వల్ప స్కోర్లకే వెనుదిరగగా.. వన్‌డౌన్ బ్యాటర్ రిషికేత్ సిసోడియా అర్ధ శతకం (31 బంతుల్లో 65)తో రాణించాడు. మిగిలిన వారిలో భవేశ్ సేత్ కూడా హాఫ్ సెంచరీ (27 బంతుల్లో 53 నాటౌట్) బాదాడు. శౌనక్ (6 బంతుల్లో 14) దూకుడుగా ఆడగా.. ఆఖరి ఓవర్లలో మూడు సిక్సర్లు బాది భవేశ్ గెలుపు ఆశలు రేపాడు. కానీ విజయ లాంఛనం పూర్తి చేయలేకపోయాడు. దీంతో రెండు పరుగుల తేడాతో వరంగల్ ఓటమిపాలైంది.కరీంనగర్ బౌలర్లలో సతీశ్ కుమార్ రెండు... శుభం శర్మ, రత్లావత్ దినేశ్, హరీశ్ ఠాకూర్, ఆశిష్ శ్రీవాస్తవ తలా ఒక వికెట్ పడగొట్టారు. కాగా ఇప్పటికి కరీంనగర్ మూడు మ్యాచ్‌లు ఆడగా ఇదే తొలి గెలుపు.తుదిజట్లుకరీంనగర్ డైమండ్స్సాత్విక్ రెడ్డి , తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), హెచ్‌కే సింహా , రాహుల్ రాధేష్ (వికెట్ కీపర్), హరీష్ ఠాకూర్ , చందన్ సహాని , శుభం శర్మ , నారాయణ తేజ , ఆశిష్ శ్రీవాస్తవ్ , రత్లావత్ దినేష్ , పగడాల లోకేష్వరంగల్ వారియర్స్హర్షిత్ చౌదరి, అమన్ రావు పేరాల (కెప్టెన్), రిషికేత్ సిసోడియా, మురుగన్ అభిషేక్, భవేష్ సేథ్ (వికెట్‌కీపర్), ఆది మణి కిరణ్, ఎండీ ఆసిఫ్ మన్సూరి, శౌనక్ కులకర్ణి, ముదస్సర్ హుస్సేన్, అబ్దుల్ మాలిక్, పల్లెపాటి క్రాంతి. -
కెప్టెన్ సూపర్ సెంచరీ.. 200 దాటిన స్కోరు
తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20)- 2026లో కరీంనగర్ డైమండ్స్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ సెంచరీతో సత్తా చాటాడు. వరంగల్ వారియర్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో 52 బంతుల్లోనే శతక్కొట్టాడు. కాగా ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన వరంగల్ వారియర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కరీంనగర్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ముదస్సర్ బౌలింగ్‌లో ఓపెనర్ సాత్విక్ రెడ్డి సింగిల్ డిజిట్ స్కోరుకే (4) వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్, కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. 133 పరుగులుఈ క్రమంలో 52 బంతుల్లోనే వంద పరుగులు చేసుకున్న తన్మయ్.. మొత్తంగా 61 బంతులు ఎదుర్కొని పదిహేను ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 133 పరుగులు సాధించాడు.అయితే, కిరణ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోవడంతో తన్మయ్ మెరుపు ఇన్నింగ్స్‌కు తెరపడింది. వన్‌డౌన్ బ్యాటర్ హెచ్‌కే సింహ (24) ఫర్వాలేదనిపించగా.. మిగతా వాళ్లంతా పూర్తిగా నిరాశపరిచారు. వైస్ కెప్టెన్ చందన్ సహాని 16 పరుగులు చేయగా.. హరీశ్ ఠాకూర్ 1, శుభం శర్మ 2 (రిటైర్డ్ అవుట్) పరుగులకే నిష్క్రమించారు.రాహుల్ రాధేశ్ 15, నారాయణ తేజ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కరీంనగర్ డైమండ్స్ 209 పరుగులు స్కోరు చేసింది. కాగా కరీంనగర్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడి రెండూ ఓడిపోయింది. వరంగల్‌పై గెలిచి బోణీ కొట్టాలని పట్దుదలగా ఉంది.తుదిజట్లుకరీంనగర్ డైమండ్స్సాత్విక్ రెడ్డి , తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), హెచ్‌కే సింహా , రాహుల్ రాధేష్ (వికెట్ కీపర్), హరీష్ ఠాకూర్ , చందన్ సహాని , శుభం శర్మ , నారాయణ తేజ , ఆశిష్ శ్రీవాస్తవ్ , రత్లావత్ దినేష్ , పగడాల లోకేష్వరంగల్ వారియర్స్హర్షిత్ చౌదరి, అమన్ రావు పేరాల (కెప్టెన్), రిషికేత్ సిసోడియా, మురుగన్ అభిషేక్, భవేష్ సేథ్ (వికెట్‌కీపర్), ఆది మణి కిరణ్, ఎండీ ఆసిఫ్ మన్సూరి, శౌనక్ కులకర్ణి, ముదస్సర్ హుస్సేన్, అబ్దుల్ మాలిక్, పల్లెపాటి క్రాంతి.Simply outstanding! 🤩A ton to savour for Tanmay, standing up and leading the fight for his side! 💥What a time to do it for the Diamonds! ⚡️#WWvKD #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/b3Cc3pqvEr— tg20official (@tg20official) June 28, 2026 -
కరీంనగర్ డైమండ్స్‌పై ఖమ్మం ఏసెస్ విజయం
శుక్రవారం కరీంనగర్ డైమండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్వితా ఖమ్మం ఏసెస్ 8 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఆద్యంతం థ్రిల్లర్‌ను తలపించిన మ్యాచ్‌లో 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరీంనగర్ డైమండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ సాత్విక్ రెడ్డి (63) టాప్ స్కోరర్‌గా నిలవగా, చివర్లో శుభమ్ శర్మ (54 నాటౌట్) ఆఖరి వరకు నిలిచినప్పటికీ గెలిపించలేకపోయాడు. ఖమ్మం ఏసెస్ బౌలర్లలో కెప్టెన్ సీవీ మిలింద్ 4 వికెట్లతో చెలరేగగా, సాహేంద్ర మల్లు రెండు వికెట్లు తీయగా, వాఫీ కచ్చీ, వేద్ రెడ్డి చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అన్వితా ఖమ్మం ఏసెస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది.భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కరీంనగర్ డైమండ్స్ విజయం కోసం పోరాడుతోంది. 12 ఓవర్లు ముగిసేసరికి కరీంనగర్ డైమండ్స్ 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. కరీంనగర్ విజయానికి 48 బంతుల్లో 76 పరుగులు కావాలి.మూడో వికెట్ కోల్పోయిన కరీంనగర్214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరీంనగర్ డైమండ్స్ 7 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. ఓపెనర్ సాత్విక్ రెడ్డి (23 బంతుల్లో 60 నాటౌట్) ధాటిగా ఆడుతుండగా, హరీశ్ఠాకూర్ 8 పరుగులతో క్రీజులో ఉన్నాడు.టీజీ20 లీగ్‌లో భాగంగా శుక్రవారం ఉప్పల్ వేదికగా కరీంనగర్ డైమండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అన్వితా ఖమ్మం ఏసెస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ మికిల్ జైస్వాల్ (34 బంతుల్లో 64 నాటౌట్) అజేయ ఫిఫ్టీతో మెరిశాడు. అంతకముందు కొడిమెల హిమతేజ (56) అర్ధశతకంతో మెరవగా, జీఎస్కే రెడ్డి (43) రాణించాడు. 👉 17 ఓవర్లు ముగిసేసరికి ఖమ్మం ఏసెస్ 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సీవీ మిలింద్ (14), జైస్వాల్ (25) ఆడుతున్నారు.👉14 ఓవర్లు ముగిసేసరికి ఖమ్మం ఏసెస్ 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. మికిల్ జైస్వాల్ (20), ప్రతీక్‌రెడ్డి (11) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు కొడిదెల హిమతేజ (56) అర్ధసెంచరీ చేయగా, జీఎస్కే రెడ్డి (43) పరుగులతో రాణించాడు.👉 6 ఓవర్లు ముగిసేసరికి ఖమ్మం అన్వితా ఏసెస్ 2 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. హిమతేజ (42), జీఎస్కే రెడ్డి (19) పరుగులతో ఆడుతున్నారు.👉టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అన్వితా ఖమ్మం ఏసెస్ జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. నాలుగు పరుగులకే ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోయింది. వాఫి కాచీ దినేశ్ బౌలింగ్‌లో డకౌట్ కాగా, మరో ఓపెనర్ మయాంక్ గుప్తా 2 పరుగులు చేసి హరీష్ ఠాకూర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 2 ఓవర్లు ముగిసేసరికి ఖమ్మం ఏసెస్ 2 వికెట్లు కోల్పోయి 12 పరుగులు చేసింది.టీజీ20 లీగ్‌లో భాగంగా శుక్రవారం 11వ మ్యాచ్‌లో అన్వితా ఖమ్మం ఏసెస్, కరీంనగర్ డైమండ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కరీంనగర్ డైమండ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక లీగ్‌లో అన్వితా ఖమ్మం జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక విజయం, ఒక గెలుపు సాధించగా, కరీంనగర్ డైమండ్స్ ఆడిన ఒక్క మ్యాచ్‌లో పరాజయం చవిచూసింది.తుది జట్లుఖమ్మం ఏసెస్: కృష్ణ రెడ్డి, వాఫీ కచ్చీ, మిలింద్(కెప్టెన్), జైశ్వాల్, హిమతేజ, వెంకట్ ధాత్రక్, సిద్దు నాయక్,విశాల్ యాదవ్, వేద్ రెడ్డి అమిష్టాపురం, విద్యా నంద రెడ్డి, అనంత్ ప్రతీక్ రెడ్డికరీంనగర్ డైమండ్స్:తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), సాయి శరణ్ రావూరి, సాత్విక్ రెడ్డి, రాహుల్ రాదేశ్, చందన్ సహాని, నారాయణ తేజ టీవీఎస్, హరీశ్ ఠాకూర్, శుభమ్ శర్మ, సతీశ్ కుమార్, ఆశిష్ శ్రీవాస్తవ్, దినేశ్ రాథోడ్ -
మా బ్యాటింగ్ బాగుంది.. ఛేజింగ్‌లో బెటర్: తన్మయ్ అగర్వాల్
తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20) ద్వారా స్థానిక ఆటగాళ్లకు చక్కటి వేదిక దొరికిందని కరీంనగర్ డైమండ్స్ కోచ్ సుమంత్ కొల్లా అన్నారు. తమ జట్టులో మంచి బ్యాటర్లు ఉన్నారని.. వారు తప్పక రాణిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ డైమండ్స్ జట్టు గురువారం సాక్షి మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా కోచ్ సుమంత్ మాట్లాడుతూ.. ‘‘పిచ్ స్వభావం, ప్రత్యర్థిని బట్టి మా వ్యూహాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాము.అందుకు అనుగుణంగానే జట్టు కూర్పు కూడా ఉంటుంది. ఏదేమైనా ప్రతీ మ్యాచ్‌లో దూకుడుగా ఆడుతూ ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదం పంచేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నా ఆఖరి వరకు మేము పోరాడతాము. మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా వెంట నిలిచే అభిమానులను గర్వపడేలా చేయడమే మా లక్ష్యం.ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారుహైదరాబాద్ ఇ- చాంపియన్స్ జట్టును ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నాము. ఆ జట్టుతో మ్యాచ్‌లో మరింత జాగ్రత్తగా ఆడతాము. ఇక తిలక్ వర్మ (మెదక్ ఫాల్కన్స్), మహ్మద్ సిరాజ్ (వరంగల్ వారియర్స్) వంటి టీమిండియా స్టార్లపై ఆడేందుకు మా ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. వాళ్లతో పోటీని కూడా మా వాళ్లు పూర్తిగా ఆస్వాదిస్తూ.. సత్తా చాటగలరనే నమ్మకం ఉంది’’ అని సుమంత్ పేర్కొన్నారు.ఇక కరీంనగర్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘‘అభిమానుల మద్దతు మాకు చాలా అవసరం. నా భార్య కూడా స్టేడియానికి వచ్చి మ్యాచ్ చూస్తుంది. కుటుంబం నుంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అయితే, మైదానంలో దిగిన తర్వాత మాత్రం దృష్టి మొత్తం ఆట మీదే ఉంటుంది. మేము మా యాజమాన్యం పట్ల కృతజ్ఞులమై ఉంటాము. మ్యాచ్ ఓడినా.. గెలిచినా... నా సహచర ఆటగాళ్ల పట్ల నాకు కృతజ్ఞతాభావం ఉంటుంది. మేమంతా కలిస్తే జట్టు. కాబట్టి గెలుపోటములలో అందరికీ సమాన భాగం ఉంటుంది’’ అని తెలిపాడుడ్రెసింగ్రూమ్ వాతావరణంఅదే విధంగా.. ‘‘మ్యాచ్‌కు ముందు ఒత్తిడి ఉండటం సహజం. అప్పుడు మా టీమ్మేట్ ఆశిష్ శ్రీవాస్తవ్ మమ్మల్ని కూల్ చేస్తాడు (నవ్వులు). ఇక మా బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. కాబట్టి మా జట్టు ఛేజింగ్‌లో మరింత గొప్పగా రాణించగలదని చెప్పగలను. మా ఆల్‌రౌండర్ హరీశ్ ఠాకూర్ ఏడో స్థానంలో చక్కగా బ్యాటింగ్ చేయగలడు.గత మ్యాచ్‌లో కూడా మేము బాగానే బ్యాటింగ్ చేశాం. కానీ 8-9 తొమ్మిది బంతుల్లో వరుసగా వికెట్లు కోల్పోవడం ప్రతికూల ప్రభావం చూపింది. ఆటలో ఇవన్నీ సహజం. మేము సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతాము. ఆటగాడిగా నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాలని అనుకుంటున్నా.ఇక కెప్టెన్‌గా జట్టును సమన్వయం చేసుకుంటూ ముందుకు నడిపించడం అత్యంత ముఖ్యం. గత పదిహేనేళ్లుగా నేను క్రికెట్ ఆడుతున్నా. మా జట్టు సభ్యుల సందేహాలు తీర్చడం, ఎప్పటికప్పుడు పరిస్థితులకు తగ్గట్లుగా వ్యూహాలు మార్చడం నా విధి. అంతిమంగా జట్టును విజేతగా నిలపడమే నా లక్ష్యం. యాజమాన్యం మాపై ఒత్తిడి పెట్టదు. టీజీ20 ద్వారా మాకు మంచి ప్లామ్ఫామ్ దొరికింది. మేము చాలా సంతోషంగా ఉన్నాము’’ అని తన్మయ్ అగర్వాల్ పేర్కొన్నాడు.చదవండి: కరీంనగర్‌పై నల్గొండ గెలుపు -
Buchi Babu Trophy: హైదరాబాద్ హ్యాట్రిక్ విజయం.. టేబుల్ టాపర్‌గా
చెన్నై: బ్యాటర్లు విజృంభించడంతో బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు మూడో విజయం ఖాతాలో వేసుకుంది. గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన పోరులో హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్ 59 పరుగుల తేడాతో మధ్యప్రదేశ్‌ను చిత్తుచేసింది. దీంతో గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన హైదరాబాద్ 19 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో నిలిచింది. తన్మయ్, వరుణ్ సెంచరీలుమధ్యప్రదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌట్ కాగా... హైదరాబాద్ 87 ఓవర్లలో 414/7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తన్మయ్ అగర్వాల్ (162 బంతుల్లో 130; 18 ఫోర్లు, 2 సిక్స్‌లు), వరుణ్ గౌడ్ (110 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు) సెంచరీలతో కదంతొక్కారు. కెప్టెన్ రాహుల్ సింగ్ (100 బంతుల్లో 59; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్‌సెంచరీతో ఆకట్టుకున్నాడు. మధ్యప్రదేశ్ బౌలర్లలో రోహిత్ రజావత్ 3... అన్వేశ్, విష్ణు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం మధ్యప్రదేశ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. సక్షమ్ పురోహిత్ (121 బంతుల్లో 78; 4 ఫోర్లు), ఆర్యన్ తివారి (91 బంతుల్లో 65; 6 ఫోర్లు) అర్ధశతకాలు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి, వరుణ్ గౌడ్ చెరో వికెట్ పడగొట్టారు. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ప్రైమ్ వాలీబాల్ లీగ్సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్ పోటీలకు రంగం సిద్ధమైంది. నగరంలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 2 నుంచి ఈ టోర్నమెంట్ జరుగుతుంది. టోర్నీ సెమీఫైనల్స్, ఫైనల్ సహా మొత్తం 38 మ్యాచ్‌లను ఇక్కడే నిర్వహిస్తారు. పీవీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నగరంలో క్రీడలపై అభిమానులకు చాలా ఆసక్తి ఉందని, ఇదే క్రమంలో వాలీబాల్ లీగ్ కూడా పెద్ద స్థాయిలో విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు సీఎం చెప్పారు. టోర్నీ సమర్థ నిర్వహణకు తమ వంతుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎండీ సోనీబాలాదేవి, ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు లీగ్‌లో పాల్గొంటున్న హైదరాబాద్ హాక్స్ జట్టు యజమాని కంకణాల అభిషేక్ రెడ్డి పాల్గొన్నారు. -
తన్మయ్ అగర్వాల్ సెంచరీ.. హైదరాబాద్ ఘన విజయం
చెన్నై: బుచ్చిబాబు ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. పంజాబ్‌తో జరిగిన మూడు రోజుల మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ హోరాహోరీ పోరులో హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (127 బంతుల్లో 163; 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) భారీ సెంచరీతో చెలరేగాడు.పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేయగా... హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 355 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్ 39.5 ఓవర్లలో 298/8 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కెప్టెన్ అన్మోల్ ప్రీత్ సింగ్ (55 బంతుల్లో 73; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (48 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), సలీల్ అరోరా (47 బంతుల్లో 68; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధశతకాలతో రాణించడంతో పంజాబ్ జట్టు వేగంగా పరుగులు సాధించింది.హైదరాబాద్ బౌలర్లలో రవితేజ 3 వికెట్లు పడగొట్టగా... తనయ్, నిశాంత్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం 292 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 41 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 294 పరుగులు చేసి గెలిచింది. తన్మయ్‌కు హిమతేజ (44 బంతుల్లో 50; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) సహకరించాడు.చదవండి: ఆసియాకప్ జట్టులో నో ఛాన్స్.. పాకిస్తాన్ కెప్టెన్ కీలక నిర్ణయం -
తిలక్ వర్మ విధ్వంసకర సెంచరీ.. టీ20 ఫార్మాట్లోనే తొలి బ్యాటర్‌గా.. వరల్డ్ రికార్డు!
టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో వరుసగా మూడు శతకాలు బాదిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు. కాగా అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ తరఫున వెలుగులోకి వచ్చిన ఈ హైదరాబాదీ.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నాడు.ముంబై తరఫున అరంగేట్రంలోనే అదరగొట్టిన తిలక్ వర్మ.. టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలోనే గతేడాది భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 20 టీ20లు, 4 వన్డేలు ఆడిన తిలక్ వర్మ ఆయా ఫార్మాట్లలో 68, 616 పరుగులు చేశాడు.సౌతాఫ్రికా గడ్డపై వరుసగా రెండు శతకాలుఇక అంతర్జాతీయ టీ20లలో తిలక్ వర్మకు ఇటీవలే రెండు సెంచరీలు బాదడం విశేషం. ఇటీవల సౌతాఫ్రికా గడ్డపై ఈ ఘనత సాధించాడు. తాజాగా అతడు దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ తరఫున బరిలోకి దిగాడు.ఫోర్లు, సిక్సర్ల వర్షం ఇక్కడా.. తిలక్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ కేవలం 51 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. మేఘాలయతో మ్యాచ్‌లో ఫోర్లు(14), సిక్సర్ల(10) వర్షం కురిపిస్తూ పరుగుల విధ్వంసం సృష్టించాడు. కేవలం 67 బంతుల్లోనే 151 పరుగులతో దుమ్ములేపి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి హైదరాబాద్‌కు 248 పరుగులు భారీ స్కోరు అందించాడు.సహచర బ్యాటర్ తన్మయ్ అగర్వాల్(55)తో కలిసి 122 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో పాటు.. రాహుల్ బుద్ధి(30)తో కలిపి 84 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. రాజ్‌కోట్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మేఘాలయ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఆదిలోనే షాక్ తగిలింది.సుడిగాలి ఇన్నింగ్స్‌లో ఆఖరి వరకు అజేయంగాఓపెనర్ రాహుల్ సింగ్ డకౌట్ అయ్యాడు. అయితే, మరో ఓపెనర్ తన్మయ్ సహకారం అందించగా కెప్టెన్ తిలక్ వర్మ ఈ మేర సుడిగాలి ఇన్నింగ్స్‌లో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో హైదరాబాద్ కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 248 రన్స్ చేసింది.హైదరాబాద్ భారీ విజయంఇక కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన మేఘాలయ హైదరాబాద్ బౌలర్ల ధాటికి 69 పరుగులకే కుప్పకూలింది. 15.1 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. దీంతో హైదరాబాద్ ఏకంగా 179 పరుగులతో భారీ విజయం సాధించింది. ఇక హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి నాలుగు, తనయ్ త్యాగరాజన్ మూడు, మికిల్ జైస్వాల్, సరణు నిషాంత్, తెలకపల్లి రవితేజ ఒక్కో వికెట్ పడగొట్టారు.చదవండి: Ind vs Aus 1st Test: ఎవరు అవుట్?.. రాహుల్ ద్రవిడ్ మనసంతా ఇక్కడే..!Tilak Varma becomes the FIRST ever player to score 3 back-to-back T20 centuries.2 for India vs South AfricaToday in SMAT pic.twitter.com/ctVqGgm1wd— Kausthub Gudipati (@kaustats) November 23, 2024 -
తన్మయ్ అజేయ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (240 బంతుల్లో 124 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా ఉప్పల్ స్టేడియంలో ఆంధ్ర జట్టుతో మొదలైన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. హైదరాబాద్ మాజీ కెపె్టన్ తన్మయ్ రోజంతా బ్యాటింగ్ చేసి అజేయ శతకంతో అలరించాడు. అభిరత్ రెడ్డి (114 బంతుల్లో 35; 3 ఫోర్లు, ఒక సిక్సర్), హిమతేజ (36; 7 ఫోర్లు) మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. కెప్టెన్ రాహుల్ సింగ్ (1)తో పాటు రోహిత్ రాయుడు (0) విఫలం కాగా.. నితీశ్ రెడ్డి (22), వికెట్ కీపర్ రాహుల్ రాదేశ్ (22 బ్యాటింగ్) ఫర్వాలేదనిపించారు. ఆంధ్ర బౌలర్లలో త్రిపురాణ విజయ్ 3 వికెట్లు పడగొట్టగా... లలిత్ మోహన్, యరా సందీప్ చెరో వికెట్ తీశారు. తాజా సీజన్లో హైదరాబాద్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడింది. ఒక మ్యాచ్‌లో గెలిచింది. మరో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. మొత్తం 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. మరోవైపు ఆంధ్ర జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట ఓడి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. స్కోరు వివరాలు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (బ్యాటింగ్) 124; అభిరత్ రెడ్డి (సి) మోహన్ (బి) విజయ్ 35; రోహిత్ రాయుడు (సి) (సబ్) జ్ఞానేశ్వర్ (బి) విజయ్ 0; హిమతేజ (సి) భరత్ (బి) సందీప్ 36; రాహుల్ సింగ్ (సి అండ్ బి) విజయ్ 1; నితీశ్ రెడ్డి (స్టంప్డ్) భరత్ (బి) మోహన్ 22; రాహుల్ రాదేశ్ (బ్యాటింగ్) 22; ఎక్స్‌ట్రాలు 4, మొత్తం (90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 244. వికెట్ల పతనం: 1–91, 2–95, 3–151, 4–152, 5–200, బౌలింగ్: శశికాంత్ 15–3–32–0; రఫీ 17–3–41–0; విజయ్ 27–4–85–3; లలిత్ మోహన్ 23–4–64–1; సందీప్ 8–0–18–1. -
ఆంధ్రతో రంజీ మ్యాచ్.. శతక్కొట్టిన హైదరాబాద్ ప్లేయర్
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ మధ్య రంజీ ట్రోఫీ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ అజేయ సెంచరీతో (124) చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు 5 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్‌తో పాటు రాహుల్ రాధేశ్ (22) క్రీజ్‌లో ఉన్నారు. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో అభిరథ్ రెడ్డి 35, రోహిత్ రాయుడు 0, కొడిమెల హిమతేజ 26, రాహుల్ సింగ్ 1, కే నితేశ్ రెడ్డి 22 పరుగులు చేసి ఔటయ్యారు. ఆంధ్ర బౌలర్లలో త్రిపురణ విజయ్ మూడు వికెట్లు పడగొట్టగా.. లలిత్ మోహన్, యారా సందీప్ తలో వికెట్ దక్కించుకున్నారు.కాగా, ప్రస్తుత రంజీ సీజన్లో ఆంధ్ర, హైదరాబాద్ జట్లు ఎలైట్ గ్రూప్-బిలో ఉన్నాయి. ఈ గ్రూప్‌లో హైదరాబాద్ ఆరో స్థానంలో ఉండగా.. ఆంధ్ర జట్టు ఆఖరిదైన ఎనిమిదో స్థానంలో నిలిచింది. హైదరాబాద్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఓ మ్యాచ్‌లో గెలిచి, 2 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకోగా.. ఆంధ్ర ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడు పరాజయాలు ఎదుర్కొని, ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. -
Ranji Trophy 2024-25: హైదరాబాద్ విజయం
రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో హిమాచల్ ఇన్నింగ్స్ 38 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర.. తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులకు ఆలౌటైంది. షేక్ రషీద్ (69), హనుమ విహారి (66), శ్రీకర్ భరత్ (65) అర్ద సెంచరీలతో రాణించారు. హిమాచల్ బౌలర్లలో దినేశ్ శర్మ ఐదు వికెట్లు పడగొట్టాడు.అనంతరం బరిలోకి దిగిన హిమాచల్ తొలి ఇన్నింగ్స్‌లో 500 పరుగులకు ఆలౌటైంది. రిషి ధవన్ (195) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆకాశ్ వశిస్ట్ (85), అంకిత్ కల్సి (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్ ఐదు వికెట్లు సత్తా చాటాడు.156 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర.. వినయ్ గలేటియా (5/49), మయాంక్ డాగర్ (4/23) ధాటికి 118 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఇన్నింగ్స్ 38 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆంధ్ర ఇన్నింగ్స్‌లో షేక్ రషీద్ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.హైదరాబాద్ విజయంపుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఇన్నింగ్స్ 50 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. తన్మయ్ అగర్వాల్ (173) సూపర్ సెంచరీతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 536 పరుగులు చేసింది. అభిరత్ రెడ్డి (68), రోహిత్ రాయుడు (84), హిమతేజ (60), త్యాగరాజన్ (53 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు.అనంతరం బరిలోకి దిగిన పుదుచ్చేరి.. అనికేత్ రెడ్డి (6/56) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు తరఫున అజయ్ రొహెరా (27) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 383 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పుదుచ్చేరి.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఓ మోస్తరుగా ప్రతిఘటించినప్పటికీ (333 ఆలౌట్) ఉపయోగం లేకుండా పోయింది. త్యాగరాజన్ (7/106) పుదుచ్చేరిని దెబ్బకొట్టాడు. పుదుచ్చేరి సెకెండ్ ఇన్నింగ్స్‌లో గంగ శ్రీధర్ రాజు (106) సెంచరీతో రాణించాడు. -
Plate 1st Semi Final: తిలక్ వర్మ మెరుపు సెంచరీ
Ranji Trophy 2023-24- Hyderabad vs Nagaland, Plate 1st Semi Final: టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ రంజీ ట్రోఫీ-2024లో జోరు కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే రెండు శతకాలు బాదిన అతడు.. తాజాగా మరో సెంచరీ చేశాడు. ప్లేట్ గ్రూపు తొలి సెమీ ఫైనల్లో భాగంగా నాగాలాండ్‌తో మ్యాచ్‌లో.. హైదరాబాద్ కెప్టెన్ తిలక్ 101 పరుగులతో సత్తా చాటాడు. శతక్కొట్టిన తన్మయ్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ అద్భుత శతకం(164) బాదగా.. మరో ఓపెనర్ గహ్లోత్ రాహుల్ సింగ్(5) విఫలమయ్యాడు. తిలక్ వర్మ మెరుపు సెంచరీ వన్‌డౌన్ బ్యాటర్ రోహిత్ రాయుడు 59 పరుగులతో రాణించగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 135 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 101 రన్స్ చేశాడు. మిగతావాళ్లలో తెలుకపల్లి రవితేజ 15 పరుగులకే పెవిలియన్ చేరగా.. కె.నితీశ్ రెడ్డి, వికెట్ కీపర్ ప్రజ్ఞయ్ రెడ్డి క్రీజులో ఉన్నారు. తొలిరోజు ఆట ముగిసే సరికి 90 ఓవర్లలో హైదరాబాద్ 5 వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసింది. శుక్రవారం నాటి ఆట పూర్తయ్యే సరికి నితీశ్ రెడ్డి 21, ప్రజ్ఞయ్ రెడ్డి 12 పరుగులతో ఆడుతున్నారు. ఇక నాగాలాండ్ బౌలర్లలో కెప్టెన్ రాంగ్సెన్ జొనాథన్ రెండు, తహ్మీద్ రహ్మాన్, ఖ్రివిస్టో కెన్స్, ఇమ్లీవతి లెమ్య్టూర్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో గెలిచి ఎలైట్ గ్రూపులో అడుగుపెట్టాలని హైదరాబాద్ పట్టుదలగా ఉంది. చదవండి: Ranji Trophy: రీ ఎంట్రీలో టీమిండియా ఓపెనర్ ధనాధన్ శతకం.. ఫోర్ల వర్షం -
ఇషాన్ కిషన్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్.. 442 రన్స్ ఆధిక్యం
సాక్షి, హైదరాబాద్- Ranji Trophy 2023-24- Hyderabad vs Arunachal Pradesh: దేశవాళీ క్రికెట్లో అనామక అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లపై హైదరాబాద్ ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (160 బంతుల్లో 323 బ్యాటింగ్, 33 ఫోర్లు, 21 సిక్స్‌లు), కెప్టెన్ రాహుల్ సింగ్ గహ్లోత్ (105 బంతుల్లో 185; 26 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్లో భాగంగా సొంతగడ్డపై జరుతున్న నాలుగు రోజుల లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలిరోజు ‘సూపర్‌ఫాస్ట్’ ప్రదర్శన కనబరిచింది. ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 48 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 529 పరుగులు సాధించింది. ప్రస్తుతం హైదరాబాద్ 357 పరుగుల ఆధిక్యంలో ఉంది. ముందుగా అరుణాచల్ ఇన్నింగ్స్‌ను కూల్చడం మొదలు, హైదరాబాద్ బ్యాటింగ్ అంతా మెరుపు వేగంతో సాగిపోయింది. హైదరాబాద్ బౌలర్ల విజృంభణతో తూంకుంటలోని నెక్స్‌జెన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అరుణాచల్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 39.4 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ తెచీ డోరియా (127 బంతుల్లో 97 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. హైదరాబాద్ బౌలర్లు సీవీ మిలింద్ (3/36), కార్తికేయ (3/28), తనయ్ త్యాగరాజన్ (2/53) అరుణాచల్ జట్టును కట్టడి చేశారు. తొలి వికెట్‌కు 449 పరుగుల భాగస్వామ్యం అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన హైదరాబాద్ ఓపెనర్లు తన్మయ్, రాహుల్ అరుణాచల్ బౌలర్లపై విధ్వంసరచన చేశారు. ఇద్దరూ చెలరేగిన తీరుతో ప్రతీ ఓవర్ హైలైట్స్‌ను తలపించింది. తొలుత ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ తన్మయ్‌తో రాహుల్ తొలి వికెట్‌కు 40.2 ఓవర్లలో 449 పరుగుల భాగస్వామ్యం జోడించాక అవుటయ్యాడు. రాహుల్ అవుటయ్యాక కూడా తన్మయ్ తన జోరు కొనసాగించాడు. ఈ క్రమంలో రంజీ ట్రోఫీలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా తన్మయ్ నిలిచాడు. తన్మయ్ 119 బంతుల్లో డబుల్ సెంచరీ చేయగా... 1985లో బరోడా జట్టుపై రవిశాస్త్రి (ముంబై) 123 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. డబుల్ సెంచరీ పూర్తయ్యాక కూడా తన్మయ్ విధ్వంసం కొనసాగింది. ఫాస్టెస్ట్ ‘ట్రిపుల్ .. ఇషాన్ సిక్సర్ల రికార్డు బద్దలు ఈ క్రమంలో తన్మయ్ ఫస్ట్‌క్లాస్ ఫాస్టెస్ట్ ట్రిపుసెంచరీ’ సాధించిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. తన్మయ్ 147 బంతుల్లో ‘ట్రిపుల్ సెంచరీ’ సాధించి ... 2017లో దక్షిణాఫ్రికా దేశవాళీ క్రికెట్లో 191 బంతుల్లో ‘ట్రిపుల్ సెంచరీ’ చేసిన మార్కో మరైస్ రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాకుండా రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా నిలిచాడు. శుక్రవారం నాటి మొదటిరోజు ఆట ముగిసేసరికి తన్మయ్ 21 సిక్స్‌లు కొట్టగా... జార్ఖండ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ (2016లో ఢిల్లీపై 14 సిక్స్‌లు), హిమాచల్‌ప్రదేశ్ ఆటగాడు శక్తి సింగ్ (1990లో హరియాణాపై 14 సిక్స్‌లు) పేరిట ఉన్న రికార్డు తెరమరుగైంది. Day 2- 366 పరుగులు చేసి అవుట్ తన్మయ్ అగర్వాల్ వీరవిహారానికి అరుణాచల్ ప్రదేశ్ బౌలర్ నబం టెంపోల్ బ్రేక్ వేశాడు. శనివారం నాటి రెండో రోజు ఆటలో 366 పరుగుల వ్యక్తిగత స్కోరు(34 ఫోర్లు, 26 సిక్సర్లు) వద్ద తన్మయ్ క్యాచ్ అవుట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో రెండో వికెట్ కోల్పోయిన హైదరాబాద్.. అభిరథ్ రెడ్డి(37), నితేశ్ రెడ్డి(12) రూపంలో మరో రెండు వికెట్లు కోల్పోయింది. మొత్తంగా 59 ఓవర్లు ముగిసే సరికి 614-4 స్కోరు చేసిన హైదరాబాద్ ప్రస్తుతం 442 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: Ranji Trophy: హనుమ విహారి, రికీ భుయ్ సెంచరీలు -
మనోళ్లు దంచికొట్టారు.. ఒక్కడే 323 నాటౌట్! 357 రన్స్ ఆధిక్యం
Hyderabad vs Arunachal Pradesh- Hyderabad lead by 357 runs: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో హైదరాబాద్ అద్భుత ప్రదర్శన సాగుతోంది. ఇప్పటికే ఆరంభ మ్యాచ్‌లో తిలక్ వర్మ కెప్టెన్సీలో నాగాలాండ్‌పై 194 పరుగుల తేడాతో గెలుపొందిన హైదరాబాద్.. రెండో మ్యాచ్‌లో రాహుల్ సింగ్ గహ్లోత్ సారథ్యంలో మేఘాలయను 81 రన్స్‌తో చిత్తు చేసింది. 172 పరుగులకే ఆలౌట్ ముచ్చటగా మూడో మ్యాచ్‌లోనూ అద్భుత ఆట తీరుతో సిక్కింపై 198 పరుగుల తేడాతో గెలుపొందింది. హ్యాట్రిక్ విజయాల తర్వాత ఇప్పుడు మరో భారీ గెలుపుపై కన్నేసింది. ప్లేట్ గ్రూపులో ఉన్న హైదరాబాద్- అరుణాచల్ ప్రదేశ్ మధ్య శుక్రవారం రంజీ మ్యాచ్ మొదలైంది.సొంతగడ్డపై నెక్స్‌జెన్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బౌలింగ్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌ను 172 పరుగులకే కట్టడి చేసింది. సంచలన ఆరంభం.. హైదరాబాద్ బౌలర్లలో సీవీ మిలింద్, కార్తికేయ మూడేసి వికెట్లు తీయగా.. టి.త్యాగరాజన్ రెండు, సాకేత్, ఇల్లిగరం సంకేత్ తలా ఓ వికెట్ తీశారు. ఈ క్రమంలో తొలి రోజే బ్యాటింగ్ ఆరంభించిన హైదరాబాద్‌కు ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్, గహ్లోత్ రాహుల్ సింగ్ సంచలన ఆరంభం అందించారు. 33 ఫోర్లు, 21 సిక్సర్లు తన్మయ్ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ నమోదు చేయగా.. గహ్లోత్ 105 బంతుల్లో 185 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. తన్మయ్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొదటి రోజు ఆట ముగిసే సరికి 160 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 323 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 33 ఫోర్లు, 21 సిక్సర్లు ఉన్నాయి. రంజీ మ్యాచ్‌లో తన్మయ్ టీ20 తరహా ఇన్నింగ్స్ కారణంగా హైదరాబాద్ మొదటి రోజు వికెట్ నష్టానికి 48 ఓవర్లలోనే 529 పరుగులు చేసింది. తద్వారా అరుణాచల్ ప్రదేశ్‌పై 357 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తన్మయ్‌కు తోడుగా అభిరథ్ రెడ్డి 19 రన్స్‌తో క్రీజులో ఉన్నాడు. చదవండి: చూసుకోవాలి కదా... జడ్డూ సైగ.. కోపంగా వెళ్లిన అశ్విన్! రనౌట్ వల్ల.. -
హైదరాబాద్ బ్యాటర్ విధ్వంసకర ఇన్నింగ్స్.. ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ 2023- 24 సీజన్లో హైదరాబాద్ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ సంచలనం సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యంత వేగంగా త్రిశతకం బాదిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. టీ20 మ్యాచ్ తరహాలో దంచికొడుతూ 147 బంతుల్లోనే 300 పరుగుల మార్కు అందుకుని ఈ మేరకు అరుదైన ఘనత సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 20 సిక్సర్లు ఉండటం విశేషం. ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ అరుణాచల్ ప్రదేశ్‌తో అద్భుత ఇన్నింగ్స్ మెరిసిన తన్మయ్ అగర్వాల్ సౌతాఫ్రికా క్రికెటర్ మార్కో మరేస్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. కాగా సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్లో బోర్డర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మార్కో.. ఈస్టర్న్ ప్రావిన్స్ మీద 191 బంతుల్లో 300 రన్స్ సాధించాడు. తన్మయ్ 147 బాల్స్‌లోనే ఈ మార్కును అందుకోవడం విశేషం. రవిశాస్త్రి పేరును చెరిపేసి.. ఇక అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లోనే అంతకుముందు తన్మయ్ అగర్వాల్ మరో రికార్డును కూడా సాధించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ బాదిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. తద్వారా 39 ఏళ్లుగా టీమిండియా మాజీ బ్యాటర్ రవిశాస్త్రి పేరిట చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. 119 బంతుల్లోనే 200 పరుగుల మార్కును అందుకుని తన్మయ్ ఈ ఘనత సాధించాడు. కాగా ప్లేట్ గ్రూపులో ఉన్న హైదరాబాద్- అరుణాచల్ ప్రదేశ్ జట్ల మధ్య శుక్రవారం రంజీ మ్యాచ్ ఆరంభమైంది. చదవండి: చూసుకోవాలి కదా... జడ్డూ సైగ.. కోపంగా వెళ్లిన అశ్విన్! రనౌట్ వల్ల.. -
Hyd: రెండ్రోజుల్లోనే టెస్టు ఖతం.. వరుసగా రెండో విజయం
రంజీ ట్రోఫీ-2024లో హైదరాబాద్ క్రికెట్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మేఘాలయను ఏకంగా ఇన్నింగ్స్ 81 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రెండురోజుల్లోనే మ్యాచ్ ముగించి సత్తా చాటింది. రంజీ ట్రోఫీ ‘ప్లేట్’ గ్రూప్‌లో భాగంగా మేఘాలయాతో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బౌలింగ్ చేసింది. మేఘాలయను తొలి ఇన్నింగ్స్‌లో 33.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ చేసింది. మేఘాలయ బ్యాటర్లలో కెప్టెన్ కిషన్ లింగ్డో (51) మినహా అంతా విఫలమయ్యారు. ఇక హైదరాబాద్ బౌలర్లలో పాలకోడేటి సాకేత్ సాయిరామ్ (4/33) నాలుగు వికెట్లు పడగొట్టగా... సీవీ మిలింద్, తనయ్ త్యాగరాజన్, రవితేజ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 47 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు సాధించింది. ఫలితంగా 71 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో 182/4 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన హైదరాబాద్ ఏడు వికెట్ల నష్టానికి 346 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రోహిత్ రాయుడు 124 పరుగులతో అజేయంగా నిలవగా.. చందన్ సహానీ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. సీవీ మిలింద్ 38 బంతుల్లోనే 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో మళ్లీ బ్యాటింగ్‌కు దిగిన మేఘాలయను 154 పరుగులకు కట్టడి చేసిన హైదరాబాద్ జయభేరి మోగించింది. కాగా ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో హైదరాబాద్ నాగాలాండ్‌ను ఇన్నింగ్స్ 194 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో అతడు జట్టును వీడగా.. రాహుల్‌సింగ్ గహ్లోత్ సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. -
హైదరాబాద్ ఓటమి.. కేదార్ జాదవ్ కెప్టెన్సీలో మహారాష్ట్ర గెలుపు
జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌హజారే ట్రోఫీలో హైదరాబాద్‌కు ‘హ్యాట్రిక్’ పరాజయం ఎదురైంది. గ్రూప్ ‘బి’లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర 3 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. ఈ వన్డే టోర్నీలో తొలి 2 మ్యాచ్‌లు నెగ్గిన హైదరాబాద్ ఆపై వరుసగా మూడు మ్యాచ్‌లలో పరాజయంపాలైంది. మహారాష్ట్రతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (117 బంతుల్లో 103; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించగా... కెప్టెన్ రాహుల్ సింగ్ (69), రాహుల్ బుద్ధి (58 నాటౌట్), రవితేజ (51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో అండగా నిలిచారు. అనంతరం మహారాష్ట్ర 49.4 ఓవర్లలో 7 వికెట్లకు 316 పరుగులు సాధించింది. అంకిత్ బావ్నే (108 బంతుల్లో 113; 12 ఫోర్లు, 1 సిక్స్) శతకానికి తోడు అజీమ్ కాజీ (80), కౌశల్ తాంబే (38), కెప్టెన్ కేదార్ జాదవ్ (32 నాటౌట్) రాణించి జట్టును గెలిపించారు. మరోవైపు చండీగఢ్‌లో ఆంధ్ర, గుజరాత్ జట్ల మధ్య జరగాల్సిన గ్రూప్ ‘డి’ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. చదవండి: టీమిండియా హెడ్‌కోచ్ అయితేనేం! కుమారుల కోసం అలా.. -
తిలక్ వర్మ కెప్టెన్సీ అదుర్స్.. ముంబైకి ఊహించని షాక్
Syed Mushtaq Ali Trophy 2023- Hyderabad won by 23 runs: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు సంచలనం సృష్టించింది. రహానే సారథ్యంలోని డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టును తిలక్ వర్మ కెప్టెన్సీలోని హైదరాబాద్ జట్టు 23 పరుగుల తేడాతో ఓడించింది. ఈ టోర్నీలో హైదరాబాద్‌కిది ఐదో విజయం. జైపూర్‌లో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (46 బంతుల్లో 59; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), రాహుల్ సింగ్ (26 బంతుల్లో 37; 4 ఫోర్లు), చందన్ సహని (23 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. కెప్టెన్ తిలక్ వర్మ (6), రోహిత్ రాయుడు (8) తక్కువ స్కోరుకే అవుటయ్యారు. అనంతరం 156 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు చేసి ఓడిపోయింది. మీడియం పేసర్ రవితేజ 32 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా... తిలక్ వర్మ 2 వికెట్లు తీసి ముంబై జట్టును దెబ్బ కొట్టారు. ప్రస్తుతం ముంబై, హైదరాబాద్, బరోడా జట్లు 20 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. చదవండి: BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా రాజస్తాన్ రాయల్స్ మాజీ కోచ్ -
శతక్కొట్టిన రికీ భుయ్, కరణ్ షిండే.. విజయంపై ఆంధ్ర గురి
సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు కీలక విజయంపై గురి పెట్టింది. చిరకాల ప్రత్యర్థి హైదరాబాద్‌తో జరుగుతున్న గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఆ జట్టు మూడో రోజు గెలుపు అవకాశాలు మెరుగుపర్చుకుంది. 401 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ గురువారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (21), ప్రజ్ఞయ్ రెడ్డి (0) అవుట్ కాగా...రోహిత్ రాయుడు (46 నాటౌట్), అలంకృత్ అగర్వాల్ (7 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. చివరి రోజు హైదరాబాద్ మరో 326 పరుగులు చేయాల్సి ఉంది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 230/3తో ఆట కొనసాగించిన ఆంధ్ర తమ రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌట్ అయింది. రికీ భుయ్ (150 బంతుల్లో 116; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ పూర్తి చేసుకోగా, కేఎస్ భరత్ (70 బంతుల్లో 89; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆ అవకాశం చేజార్చుకున్నాడు. ఆపై కరణ్ షిండే (180 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) కూడా శతకం బాదాడు. హైదరాబాద్ బౌలర్లలో రక్షణ్ రెడ్డి 3 వికెట్లు పడగొట్టాడు. -
Ranji Trophy: 28 బంతుల్లోనే 78 పరుగులు సహా.. 8 వికెట్లు కూల్చి
Ranji Trophy 2022-23 - Hyderabad vs Assam: రంజీ ట్రోఫీ టోర్నీ 2022-23లో తొలి విజయం సాధించాలన్న హైదరాబాద్ ఆశలపై అస్సాం నీళ్లు చల్లింది. శుక్రవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 18 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో గెలుపుపై గంపెడాశలు పెట్టుకున్న హైదరాబాద్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ అజేయ సెంచరీ వృథాగా పోయింది. రాణించిన బౌలర్లు! కాగా ఎలైట్ బీ గ్రూపులో ఉన్న హైదరాబాద్- అస్సాం జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో మంగళవారం టెస్టు మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రవితేజ(4/53), కార్తికేయ(3/43)కు తోడుగా అజయ్ దేవ్ గౌడ్, త్యాగరాజన్, భగత్ వర్మ ఒక్కో వికెట్‌తో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో అస్సాంను 205 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఓపెనర్ రోహిత్ రాయుడు 60, తొమ్మిదో స్థానంలో వచ్చిన భగత్ వర్మ 46 పరుగులతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌ను 208 పరుగుల వద్ద ముగించగలిగింది. తన్మయ్ ఒంటరి పోరాటం వృథా ఇక రెండో ఇన్నింగ్స్‌లో అస్సాం 252 పరుగులకు ఆలౌట్ కాగా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 61 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 228 పరుగులు సాధించింది. ఈ క్రమంలో విజయానికి 22 పరుగుల దూరంలో నిలిచిన హైదరాబాద్.. శుక్రవారం కార్తికేయ అవుట్ కావడంతో ఓటమిని మూటగట్టుకుంది. దీంతో జట్టును గెలిపించాలని తాపత్రయపడ్డ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (158 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 126 పరుగులు- నాటౌట్) ఒంటరి పోరాటం వృథాగా పోయింది. అదరగొట్టిన రియాన్ పరాగ్ ఆల్‌రౌండ్ ప్రతిభతో రాణించిన అస్సాం ఆటగాడు రియాన్ పరాగ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మొత్తంగా 88 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 28 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేయడం విశేషం. అంతేకాదు రియాన్.. ఏకంగా 8 వికెట్లు కూల్చడం గమనార్హం. కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్న ఈ లెగ్ బ్రేక్ స్పిన్నర్ అస్సాం గెలుపొందడంలో తన వంతు సాయం చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక రియాన్ ఐపీఎల్ జట్టు రాజస్తాన్ రాయల్స్‌లో సభ్యుడన్న సంగతి తెలిసిందే. చదవండి: Rishabh Pant Health: ప్లాస్టిక్ సర్జరీ?! పంత్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఏమన్నారంటే.. Rishabh Pant: ఉదయమే పంత్ గురించి ఆలోచించా.. ఇంతలో ఇలా Rest in Power- ‘King’ Pele: అల్విదా కింగ్.. పీలే రాకముందు అసలు ఫుట్‌బాల్ అంటే కేవలం.. -
Ranji Trophy: రహానే సేన చేతిలో హైదరాబాద్ పరాజయం
ముంబై: తమిళనాడుతో తొలి మ్యాచ్‌లో వెలుతురులేమితో ఓటమిని తప్పించుకున్న హైదరాబాద్ జట్టు రెండో మ్యాచ్‌లో మాత్రం దారుణ పరాజయాన్ని చవిచూసింది. రంజీ ట్రోఫీ టైటిల్‌ను 41 సార్లు సాధించిన ముంబై జట్టుతో జరిగిన గ్రూప్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్‌లో తన్మయ్ అగర్వాల్ సారథ్యంలోని హైదరాబాద్ ఇన్నింగ్స్ 217 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 173/6తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ మరో 41 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయి 214 పరుగుల వద్ద ఆలౌటైంది. ముంబై ఎడంచేతి వాటం స్పిన్నర్ షమ్స్ ములానీ (7/94) హైదరాబాద్‌ను దెబ్బ తీశాడు. 437 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన ముంబై... హైదరాబాద్‌కు ఫాలోఆన్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ హైదరాబాద్ విఫలమై 67.2 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది. తన్మయ్ (39; 5 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ బుద్ధి (65; 10 ఫోర్లు, 1 సిక్స్), తనయ్ త్యాగరాజన్ (39 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. షమ్స్ ములానీ (4/82), తనుష్ కొటియాన్ (5/82) ముంబై విజయంలో కీలకపాత్ర పోషించారు. -
తెలుగు ఆటగాళ్ల సెంచరీల మోత.. ఒకే రోజు ముగ్గురు శతక్కొట్టుడు
బెంగళూరు: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర తొలి విజయం నమోదు చేసింది. గ్రూప్ ‘సి’లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 261 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. అభిషేక్ రెడ్డి (133 బంతుల్లో 136; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు), కోన శ్రీకర్ భరత్ (84 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగారు. అనంతరం అరుణాచల్ ప్రదేశ్ 38 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. కమ్ష(18)దే అత్యధిక స్కోరు. అయ్యప్ప 3 వికెట్లు పడగొట్టగా... షోయబ్, హరిశంకర్, ఆశిష్ తలా 2 వికెట్లు తీశారు. పరుగుల పరంగా ఈ టోర్నీ చరిత్రలో ఆంధ్రకిదే పెద్ద విజయం. తన్మయ్ అగర్వాల్ శతకం... న్యూఢిల్లీ: సౌరాష్ట్రతో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా సౌరాష్ట్ర 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. హార్విక్ దేశాయ్ (120 బంతుల్లో 102; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకం సాధించాడు. సంకేత్ 4 వికెట్లు పడగొట్టగా, అనికేత్ రెడ్డికి 3 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత హైదరాబాద్ 48.5 ఓవర్లలో 5 వికెట్లకు 314 పరుగులు చేసింది. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (119 బంతుల్లో 124; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోహిత్ రాయుడు (97 బంతుల్లో 83; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 214 పరుగులు జోడించి హైదరాబాద్ విజయాన్ని సులువుగా మార్చగా, తిలక్ వర్మ (45; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించాడు. -
Ranji Trophy 2022: హైదరాబాద్ 347 ఆలౌట్
Ranji Trophy 2022 Hyd Vs Chgrh: - భువనేశ్వర్: చండీగఢ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 108.4 ఓవర్లలో 347 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 270/7తో ఆట కొనసాగించిన హైదరాబాద్ మరో 77 పరుగులు జోడిం చి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. తనయ్ త్యాగరాజన్ (38; 6 ఫోర్లు), సీవీ మిలింద్ (28; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఇక మొదటి రోజు భారత క్రికెటర్ హనుమ విహారి (59; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చండీగఢ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు సాధించింది. మనన్ వొహ్రా (110; 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో రక్షణ్ రెడ్డి 4 వికెట్లు పడగొట్టాడు. చదవండి: తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా! -
Ranji Trophy 2022: హనుమ విహారి అర్ధ శతకం.. హైదరాబాద్ 270/7
Ranji Trophy 2022- Hyderabad Vs Chandigarh:- భువనేశ్వర్: చండీగఢ్‌తో గురువారం మొదలైన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో 7 వికెట్లకు 270 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ సారథ్యంలో ఆడుతున్న భారత క్రికెటర్ హనుమ విహారి (59; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. తిలక్ వర్మ (32; 5 ఫోర్లు), ప్రతీక్ రెడ్డి (36; 5 ఫోర్లు), రవితేజ (32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. విహారి మూడో వికెట్‌కు తిలక్‌తో 51 పరుగులు... నాలుగో వికెట్‌కు హిమాలయ్ అగర్వాల్‌తో 51 పరుగులు జత చేశాడు. చండీగఢ్ బౌలర్లలో జగ్జీత్ (3/50), రాజ్ అంగద్ బావా (2/43), గౌరవ్ గంభీర్ (2/66) రాణించారు. చదవండి: Ranji Trophy- Yash Dhull: అరంగేట్రంలోనే అద్భుత సెంచరీ.. మరో కోహ్లివి.. మరీ 50 లక్షలు తక్కువే కదా! Ranji Trophy 2022: మనీశ్ పాండే విధ్వంసం.. బౌండరీలు, సిక్సర్లతో వీరవిహారం Ranji Trophy 2022: సూపర్ సెంచరీతో ఫాంలోకి వచ్చిన రహానే -
IPLAuction: వేలంలో మనవాళ్లు 23 మంది.. అంబటి, హనుమ విహారి, తన్మయ్.. ఇంకా..
IPL 2022 Mega Auction: ఐపీఎల్ వేలం-2022 తుది జాబితా ఖరారైంది. 217 స్థానాలకు 590 మంది క్రికెటర్లు పోటీ పడుతున్నారు. రూ. 2 కోట్ల కనీస విలువతో 48 మంది క్రికెటర్లు తమ పేరు నమోదు చేసుకున్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరులో మెగా వేలం జరుగనున్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్ వేలంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నుంచి 8 మంది (అంబటి రాయుడు, అశ్విన్ హెబర్, రికీ భుయ్, హరిశంకర్ రెడ్డి, పృథ్వీ రాజ్, స్టీఫెన్, బండారు అయ్యప్ప, గిరినాథ్ రెడ్డి) పాల్గొనబోతున్నారు. అదే విధంగా... హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నుంచి 15 మంది (హనుమ విహారి, తిలక్ వర్మ, బి.సందీప్, తన్మయ్ అగర్వాల్, తనయ్ త్యాగరాజన్, సీవీ మిలింద్, రాహుల్ బుద్ధి, యుధ్వీర్, కార్తికేయ, భగత్ వర్మ, రక్షణ్ రెడ్డి, మనీశ్ రెడ్డి, అజయ్ దేవ్ గౌడ్, మికిల్ జైస్వాల్, మొహమ్మద్ అఫ్రిది) ఈ మెగా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. చదవండి: ICC U 19 World Cup 2022: మరో ఫైనల్ వేటలో.. అండర్-19 టీమిండియా 🚨 NEWS 🚨: IPL 2022 Player Auction list announced The Player Auction list is out with a total of 590 cricketers set to go under the hammer during the two-day mega auction which will take place in Bengaluru on February 12 and 13, 2022. More Details 🔽https://t.co/z09GQJoJhW pic.twitter.com/02Miv7fdDJ — IndianPremierLeague (@IPL) February 1, 2022 -
హైదరాబాద్ రంజీ జట్టు వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో జరిగే రంజీ ట్రోఫీ దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే హైదరాబాద్ జట్టును ప్రకటించారు. 25 మందితో కూడిన హైదరాబాద్ జట్టుకు తన్మయ్ అగర్వాల్ కెప్టెన్‌గా కొనసాగుతుండగా... యువ భారత్ జట్టు సభ్యుడు, 19 ఏళ్ల ఠాకూర్ తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఇటీవల ముగిసిన విజయ్ హజారే వన్డే ట్రోఫీలో తిలక్ వర్మ 180 పరుగులు, ముస్తాక్ అలీ ట్రోఫీలో 215 పరుగులు సాధించాడు. జనవరి 13 నుంచి జరిగే రంజీ ట్రోఫీ తొలి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీతో హైదరాబాద్ తలపడుతుంది. హైదరాబాద్ రంజీ జట్టు: తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), ఠాకూర్ తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), పీఎస్ చైతన్య రెడ్డి, బుద్ధి రాహుల్, జావేద్ అలీ, ప్రతీక్ రెడ్డి (వికెట్ కీపర్), సీవీ మిలింద్, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు, మికిల్ జైస్వాల్, కార్తికేయ కక్, చందన్ సహని, హిమాలయ్ అగర్వాల్, మెహదీ హసన్, అలంకృత్ అగర్వాల్, ధీరజ్ గౌడ్ (వికెట్ కీపర్), టి.రవితేజ, అబ్రార్ మొహియుద్దీన్, రక్షణ్ రెడ్డి, అబ్దుల్ ఇలా ఖురేషి, అఫ్రిది, ఎన్.సూర్య తేజ, అలిగ వినయ్, మొహమ్మద్ సక్లాయిన్, సూర్యప్రసాద్. చదవండి: Ashes 2021: 68 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్.. యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియాదే.. -
Vijay Hazare Trophy: తన్మయ్ అగర్వాల్ మెరుపులు. హైదరాబాద్ శుభారంభం
మొహాలీ: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. హరియాణాతో బుధవారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తిలక్ వర్మ (4/23), రవితేజ (3/23) ధాటికి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హరియాణా 39.2 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. అనంతరం హైదరాబాద్ 41 ఓవర్లలో ఐదు వికెట్లకు 167 పరుగులు చేసి విజయం సాధించింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (77 నాటౌట్; 5 ఫోర్లు), కొల్లా సుమంత్ (20), తనయ్ (18 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. నేడు జరిగే రెండో మ్యాచ్‌లో ఢిల్లీతో హైదరాబాద్ ఆడుతుంది. -
ఎదురులేని హైదరాబాద్... వారెవ్వా మిలింద్.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో..
Syed Mushtaq Ali Trophy: Hyderabad Beat Delhi By 3 Wickets- సుల్తాన్పూర్ (గురుగ్రామ్): సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ ఖాతాలో నాలుగో విజయం చేరింది. ఢిల్లీ జట్టుతో సోమవారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఈ’ మ్యాచ్‌లో హైదరాబాద్ మూడు వికెట్లతో నెగ్గింది. సీవీ మిలింద్ (2/49; 8 బంతుల్లో 14 నాటౌట్; ఫోర్, సిక్స్) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో హైదరాబాద్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 170 పరుగులు చేసింది. 171 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ సరిగ్గా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కప్టెన్ తన్మయ్ అగర్వాల్ (34 బంతుల్లో 54; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్ వర్మ (32 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. చివర్లో హైదరాబాద్ విజయానికి 17 బంతుల్లో 33 పరుగులు చేయాల్సిన స్థితిలో తనయ్ త్యాగరాజన్ (10 బంతుల్లో 17 నాటౌట్; 2 సిక్స్‌లు), మిలింద్ 8వ వికెట్‌కు 33 పరుగులు జోడించి గెలిపించారు. చదవండి: Akshay Karnewar: 4–4–0–2.. అక్షయ్ కర్నేవార్ అరుదైన రికార్డు -
Syed Mushtaq Ali Trophy: కెప్టెన్ సెంచరీ మిస్.. అయితేనేం భారీ విజయం
Hyderabad Beat Uttarakhand Tanmay And Milind Well Played - సుల్తాన్పూర్ (గురుగ్రామ్): సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఉత్తరాఖండ్ జట్టుతో శుక్రవారం జరిగిన ఎలైట్గ్రూప్ ‘ఈ’ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 61 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (59 బంతుల్లో 97 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచాడు. చివర్లో బుద్ధి రాహుల్ (13 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) కూడా దూకుడుగా ఆడాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు స్కోరు చేసింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఉత్తరాఖండ్ జట్టును హైదరాబాద్ జట్టు ఎడంచేతి వాటం పేస్ బౌలర్ సీవీ మిలింద్ (5/16) బెంబేలెత్తించాడు. దాంతో ఉత్తరాఖండ్ జట్టు 18.3 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. హైదరాబాద్ బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్, రక్షణ్, తనయ్ త్యాగరాజన్, హనుమ విహారి, రోహిత్ రాయుడు ఒక్కో వికెట్ తీశారు. సౌరాష్ట్ర జట్టుతో గురువారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ రెండు వికెట్ల తేడాతో గెలిచింది. ప్రస్తుతం హైదరాబాద్ ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. చదవండి: Ravindra Jadeja: ఇంకేం చేస్తాం.. బ్యాగులు సర్దేసి ఇంటికి వెళ్తాం.. ఇచ్చిపడేశావ్ కదా భయ్యా! -
హైదరాబాద్ గెలుపు
సూరత్: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. చత్తీస్‌గఢ్‌తో సోమవారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. చత్తీస్‌గఢ్ నిర్దేశించిన 243 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 40.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (116 బంతుల్లో 122; 15 ఫోర్లు, సిక్స్) సెంచరీ చేయగా... తిలక్ వర్మ (78 బంతుల్లో 60; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. తొలి వికెట్‌కు వీరిద్దరు 131 పరుగులు జోడించారు. హిమాలయ్ అగర్వాల్ (36 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగు తేడాతో అర్ధ సెంచరీని కోల్పోయాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన చత్తీస్‌గఢ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 242 పరుగులు చేసింది. హర్‌ప్రీత్ సింగ్ భాటియా (63; 6 ఫోర్లు), అశుతోష్ సింగ్ (51; 3 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో మెహదీ హసన్ (3/32), రవితేజ (2/60) రాణించారు. -
మూడు రోజుల్లోనే... హైదరాబాద్ ఖేల్ ఖతం
సాక్షి, హైదరాబాద్: బౌలర్లు రాణించినా... బ్యాట్స్‌మెన్ అదే నిర్లక్ష్య ధోరణి కనబరచడంతో రంజీ ట్రోఫీలో హైదరాబాద్ మరో ఘోర పరాజయాన్ని చవిచూసింది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య బ్యాట్స్‌మెన్ పేలవ ప్రదర్శనతో మూడు రోజుల్లోనే రాజస్తాన్ విజయాన్ని కైవసం చేసుకుంది. ఏకంగా 9 వికెట్లతో హైదరాబాద్‌ను ఓడించి 18 జట్లున్న ఎలైట్ గ్రూప్ ‘ఎ అండ్ బి’లో రాజస్తాన్ 15వ స్థానం నుంచి పదో స్థానానికి ఎగబాకింది. హైదరాబాద్ మాత్రం అట్టడుగు స్థానానికే పరిమితమైంది. ఓవర్‌నైట్ స్కోరు 101/6తో ఆట మూడోరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 53.4 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 36 పరుగులు కలుపుకొని ప్రత్యరి్థకి 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అక్షత్ రెడ్డి (162 బంతుల్లో 71; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించాడు. ప్రత్యర్థి బౌలర్లలో అనికేత్ చౌదరి 4, తన్వీర్ ఉల్ హఖ్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌లో మణీందర్ సింగ్ (147 బంతుల్లో 107 నాటౌట్; 14 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగడంతో రాజస్తాన్ 48.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 195 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. మహిపాల్ లామ్రోర్ (114 బంతుల్లో 71; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. 55 పరుగులు 4 వికెట్లు మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్నప్పటికీ జరగాల్సిన నష్టమంతా మంగళవారమే జరిగిపోయింది. 101 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన హైదరాబాద్‌ను బుధవారం ఆటలో ఓపెనర్ అక్షత్ రెడ్డి ఆదుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ విఫలమైన అతను టెయిలెండర్లతో కలిసి పోరాడాడు. కానీ ఆట ప్రారంభంలోనే మిలింద్ (2), మెహదీహసన్ (7) వెనుదిరిగినా... సాకేత్ (25 బంతుల్లో 10; 1 ఫోర్) సహాయంతో అక్షత్ పరుగులు జోడించాడు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 34 పరుగుల్ని జోడించారు. తర్వాత 10 పరుగుల వ్యవధిలో వీరిద్దరూ పెవిలియన్ చేరడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ 156 పరుగుల వద్ద ముగిసింది. దీంతో ప్రత్యర్థి ఎదుట సాధారణ లక్ష్యం నిలిచింది. చెలరేగిన మణీందర్, మహిపాల్ 193 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌లో రాణించిన హైదరాబాద్ బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో చేతులెత్తేశారు. 48.5 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం యశ్ కొఠారి (6) వికెట్ మాత్రమే తీయగలిగారు. మణీందర్ సింగ్, మహిపాల్ జోడీ అలవోకగా పరుగులు సాధిస్తూ హైదరాబాద్ బౌలర్ల సహనాన్ని పరీక్షించింది. ముందుగా మణీందర్ 84 బంతుల్లో... మహిపాల్ 91 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తిచేసుకున్నారు. తర్వాత వేగంగా ఆడిన మణీందర్ మరో 60 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ జోడీ రెండో వికెట్‌కు అభేద్యంగా 176 పరుగులు జోడించి తమ జట్టును గెలిపించింది. స్కోరు వివరాలు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 171 రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్: 135 హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: తన్మయ్ (సి) రితురాజ్ సింగ్ (బి) తన్వీర్ 16; అక్షత్ రెడ్డి (బి) మహిపాల్ 71; సందీప్ (బి) తన్వీర్ ఉల్ హఖ్ 9; హిమాలయ్ (సి) రితురాజ్ సింగ్ (బి) అనికేత్ చౌదరీ 2; జావీద్ అలీ (సి) మణీందర్ సింగ్ (బి) అనికేత్ 0; సుమంత్ కొల్లా (సి) ఆదిత్య (బి) శుభమ్ శర్మ 3; రవితేజ (సి) యశ్ (బి) అనికేత్ 20; మిలింద్ (సి) యశ్ (బి) అనికేత్ 2; మెహదీ హసన్ (సి) మణీందర్ సింగ్ (బి) తన్వీర్ 7; సాకేత్ (స్టంప్డ్) మణీందర్ సింగ్ (బి) శుభమ్ శర్మ 10; రవికిరణ్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (53.4 ఓవర్లలో ఆలౌట్) 156. వికెట్ల పతనం: 1–28, 2–46, 3–53, 4–53, 5–68, 6–101, 7–103, 8–112, 9–146, 10–156. బౌలింగ్: అనికేత్ చౌదరి 20–6–48–4, తన్వీర్ ఉల్ హఖ్ 14–2–44–3, రితురాజ్ సింగ్ 12–3–30–0, శుభమ్ శర్మ 6–1–22–2, మహిపాల్ 1.4–0–8–1. రాజస్తాన్ రెండో ఇన్నింగ్స్: యశ్ కొఠారి (ఎల్బీడబ్ల్యూ) (బి) రవితేజ 6; మణీందర్ సింగ్ (నాటౌట్) 107; మహిపాల్ (నాటౌట్) 71; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (48.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 195. వికెట్ల పతనం: 1–19. బౌలింగ్: రవికిరణ్ 11–3–44–0, మిలింద్ 10–1–22–0, రవితేజ 9–0–45–1, మెహదీ హసన్ 9.5–0–38–0, సాకేత్ 7–0–35–0, సందీప్ 2–1–5–0. -
తన్మయ్ అగర్వాల్ కెప్టెన్ ఇన్నింగ్స్
సాక్షి, హైదరాబాద్: తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచిన హైదరాబాద్ టాపార్డర్ రెండో ఇన్నింగ్స్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. దీంతో ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో గుజరాత్‌తో జరుగుతోన్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ కోలుకుంది. బుధవారం ఆట ముగిసే సమయానికి 83 ఓవర్లలో 6 వికెట్లకు 239 పరుగులు చేసింది. కెప్టెన్, ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (170 బంతుల్లో 96; 13 ఫోర్లు) కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ అక్షత్ రెడ్డి (92 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్), బావనక సందీప్ (74 బంతుల్లో 41; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో రూశ్ కలారియా, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు 295/9తో బుధవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన గుజరాత్ జట్టు 88 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. దీంతో గుజరాత్‌కు 80 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. నేడు ఆటకు చివరి రోజు కాగా హైదరాబాద్ ప్రస్తుతం 159 పరుగుల ముందంజలో ఉంది. చేతిలో ఇంకా 4 వికెట్లు ఉన్నాయి. మిలింద్ ఖాతాలో చివరి వికెట్... మూడో రోజు ఆట ప్రారంభంలోనే గుజరాత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మిలింద్ బౌలింగ్‌లో మెహదీహసన్‌కు క్యాచ్ ఇచ్చి ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ రూశ్ (37; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పెవిలియన్ చేరాడు. దీంతో 4.2 ఓవర్లలో గుజరాత్ ఆట ముగిసింది. రాణించిన టాపార్డర్... రెండో ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ ఆత్మవిశ్వాసంతో ఆడింది. తన్మయ్ వికెట్‌కు ప్రాధాన్యమివ్వగా, అక్షత్ కాస్త దూకుడు ప్రదర్శించాడు. దీంతో హైదరాబాద్ 76/0తో లంచ్ విరామానికెళ్లింది. భోజన విరామానంతరం తొలి ఓవర్లోనే అక్షర్ బౌలింగ్‌లో అక్షత్ పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన శశిధర్ రెడ్డి (9) రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆకట్టుకోలేకపోయాడు. సందీప్ అండతో తన్మయ్ రాణించడంతో టీ విరామానికి హైదరాబాద్ 178/2తో నిలిచింది. అయితే మూడో సెషన్లో తడబడిన హైదరాబాద్ 38 పరుగుల వ్యవధిలోనే 4 వికెట్లను కోల్పోయి 216/6తో నిలిచింది. టీ విరామానంతరం సందీప్ క్లీన్‌బౌల్డ్ కాగా... హిమాలయ్ అగర్వాల్ (9) పేలవ షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. సెంచరీకి సమీపిస్తోన్న తన్మయ్‌ని స్పిన్నర్ అక్షర్ ఎల్బీగా అవుట్ చేశాడు. రూశ్ బౌలింగ్‌లో ధ్రువ్‌కు క్యాచ్ ఇచ్చి సీవీ మిలింద్ (10) అవుటయ్యాడు. ప్రస్తుతం తనయ్ త్యాగరాజన్ (10 బ్యాటింగ్), కొల్లా సమంత్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. స్కోరు వివరాలు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 233; గుజరాత్ తొలి ఇన్నింగ్స్: 313; హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ ఎల్బీడబ్ల్యూ (బి) అక్షర్ పటేల్ 96; అక్షత్ రెడ్డి (బి) అక్షర్ పటేల్ 45; శశిధర్ రెడ్డి (సి) మన్‌ప్రీత్ జునేజా (బి) రూశ్ కలారియా 41; హిమాలయ్ అగర్వాల్ (సి) ప్రియాంక్ పాంచల్ (బి) చింతన్ గాజా 9; కొల్లా సుమంత్ (బ్యాటింగ్) 13; సీవీ మిలింద్ (సి) ధ్రువ్ రవళ్ (బి) రూశ్ కలారియా 10; తనయ్ త్యాగరాజన్ (బ్యాటింగ్) 10; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (83 ఓవర్లలో 6 వికెట్లకు) 239. వికెట్ల పతనం: 1–80, 2–123, 3–182, 4–204, 5–204, 6–216. బౌలింగ్: రూశ్ కలారియా 13–2–38–2, చింతన్ గాజా 12–2–26–1, అర్జాన్ నగ్వాస్వాలా 13–3–35–1, అక్షర్ పటేల్ 23–3–44–2, రుజుల్ భట్ 9–1–34–0, పీయూశ్ చావ్లా 13–1–61–0. -
హైదరాబాద్ కెప్టెన్ గా తన్మయ్ అగర్వాల్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక అఖిల భారత రంజీ ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ జట్టును బుధవారం ప్రకటించారు. అంబటి రాయుడు ఈ సీజన్ రంజీ ట్రోఫీ నుంచి తప్పుకున్న నేపథ్యంలో జట్టు సారథ్యాన్ని తన్మయ్ అగర్వాల్‌కు అప్పగించారు. బావనక సందీప్ వైస్ కెప్టెన్ గా ఎంపికవగా, ఎన్. అర్జున్ యాదవ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. రంజీ ట్రోఫీలో భాగంగా ఈ నెల 9 నుంచి 12 వరకు సొంతగడ్డపై జరిగే తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌తో హైదరాబాద్ జట్టు ఆడుతుంది. జట్టు వివరాలు తన్మయ్ అగర్వాల్, పి. అక్షత్ రెడ్డి, కె. రోహిత్ రాయుడు, బి. సందీప్, హిమాలయ్ అగర్వాల్, కొల్లా సుమంత్, మెహదీహసన్, సాకేత్ సాయిరామ్, ఎం. రవికిరణ్, మొహమ్మద్ సిరాజ్, సీవీ మిలింద్, తనయ్ త్యాగరాజన్, జీఏ శశిధర్ రెడ్డి, యుద్వీర్ సింగ్, జె. మల్లికార్జున్. -
హైదరాబాద్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
బెంగళూరు: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బౌలింగ్‌లో మొహమ్మద్ సిరాజ్, సందీప్ అదరగొట్టగా... అనంతరం బ్యాటింగ్‌లో తన్మయ్ అగర్వాల్ అర్ధ శతకంతో కదం తొక్కడంతో హైదరాబాద్ రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. బెంగళూరు వేదికగా గోవాతో సోమవారం జరిగిన ఎలైట్ గ్రూప్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గోవాను సిరాజ్ (4/20), బావనక సందీప్ (4/13) బెంబేలెత్తించారు. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ తొలి రెండు బంతుల్లో సగుణ్ కామత్ (0), స్నేహల్ (0)లను ఔట్ చేసి ప్రత్యర్థి పతనానికి బాటలు వేశాడు. కాసేపటి తర్వాత హైదరాబాద్ బౌలర్లు మరో రెండు వికెట్లు తీయడంతో గోవా 42 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఓపెనర్ సునీల్ దేశాయ్ (87 బంతుల్లో 55; 4 ఫోర్లు, సిక్స్) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అతను అమిత్ వర్మ (46 బంతుల్లో 29; 2 ఫోర్లు, సిక్స్)తో కలిసి ఐదో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. దీంతో గోవా 100 పరుగుల మార్కును దాటింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను రోహిత్ రాయుడు విడదీశాడు. రోహిత్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన అమిత్ వర్మ మిలింద్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక ఇక్కడి నుంచి సందీప్ మాయాజాలం ప్రారంభమైంది. అర్ధ శతకంతో కుదురుకున్న సునీల్ దేశాయ్‌తో పాటు మరో ముగ్గురిని ఔట్ చేయడంతో... గోవా 37.4 ఓవర్లలో 122 పరుగులకు ఆలౌటైంది. స్వల్ప విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన హైదరాబాద్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలినా... ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (71 బంతుల్లో 66 నాటౌట్; 11 ఫోర్లు, సిక్స్) అండతో హైదరాబాద్ 22.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. రెండో ఓవర్ మూడో బంతికి పరుగు కోసం ప్రయత్నించిన ఓపెనర్ అక్షత్ రెడ్డి (0) రనౌట్ కాగా... రోహిత్ రాయుడు (1) కాసేపటికే పెవిలియన్ చేరడంతో 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో తన్మయ్ అగర్వాల్ , సారథి అంబటి రాయుడు (20 బంతుల్లో 21; 2 ఫోర్లు, సిక్స్) జట్టును ఆదుకున్నారు. వీరు వికెట్ల పతనాన్ని అడ్డుకోవడంతో పాటు మూడో వికెట్‌కు 44 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జోడించారు. రాయుడు ఔటైనా... మరో ఎండ్‌లో నిలకడగా ఆడుతున్న తన్మయ్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అతను మల్లికార్జున్ (28 బంతుల్లో 30; 4 పోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 55 పరుగులు జోడించాడు. అయితే చివర్లో గోవా బౌలర్లు వెంట వెంటనే రెండు వికెట్లు తీసినా... తన్మయ్ లాంఛనం పూర్తి చేశాడు. స్కోర్ వివరాలు గోవా ఇన్నింగ్స్: సగున్ కామత్ (సి) తన్మయ్ (బి) సిరాజ్ 0; సునీల్ దేశాయ్ (సి) మల్లికార్జున్ (బి) సందీప్ 55; స్నేహల్ (సి) మల్లికార్జున్ (బి) సిరాజ్ 0; కౌశిక్ (సి) తన్మయ్ (బి) సిరాజ్ 11; ప్రభు దేశాయ్ (సి) మల్లికార్జున్ (బి) మిలింద్ 8; అమిత్ వర్మ (సి) మిలింద్ (బి) రోహిత్ రాయుడు 29; గౌతం (ఎల్బీ) (బి) సందీప్ 0; మిసాల్ (సి) మల్లికార్జున్ (బి) సిరాజ్ 8; గార్గ్ (బి) సందీప్ 0; శుభం దేశాయ్ (నాటౌట్) 4; పరబ్ (సి) హిమాలయ్ అగర్వాల్ (బి) సందీప్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (37.4 ఓవర్లలో ఆలౌట్) 122. వికెట్ల పతనం: 1–0, 2–0, 3–17, 4–42, 5–110, 6–110, 7–117, 8–117, 9–121, 10–122. బౌలింగ్: సిరాజ్ 9–2–20–4, మిలింద్ 6–1–18–1, మెహదీ హసన్ 5–0–14–0, సాకేత్ సాయిరామ్ 5–0–33–0, సందీప్ 7.4–2–13–4, రోహిత్ రాయుడు 5–0–23–1. హైదరాబాద్ ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (నాటౌట్) 66; అక్షత్ (రనౌట్) 0; రోహిత్ రాయుడు (సి) మిసాల్ (బి) పరబ్ 1; అంబటి రాయుడు (సి) అమిత్ వర్మ (బి) మిసాల్ 21; మల్లికార్జున్ (సి) గౌతం (బి) గార్గ్ 30; సందీప్ (బి) శుభం దేశాయ్ 2; హిమాలయ్ అగర్వాల్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (22.2 ఓవర్లలో 5 వికెట్లకు) 126. వికెట్ల పతనం: 1–4, 2–15, 3–59, 4–114, 5–117. బౌలింగ్: గార్గ్ 6–0–38–1, పరబ్ 6–1–21–1, మిసాల్ 6–0–36–1, శుభం దేశాయ్ 3.2–0–25–1, అమిత్ వర్మ 1–0–5–0. -
రవితేజ అజేయ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీలో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ జోరు కొనసాగుతోంది. తొలిరోజు ఆటలో తన్మయ్ అగర్వాల్ సెంచరీతో చెలరేగగా... బుధవారం టి. రవితేజ (206 బంతుల్లో 115; 9 ఫోర్లు, సిక్స్) అజేయ శతకంతో ఆకట్టుకున్నాడు. దీంతో ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఢిల్లీతో జరుగుతోన్న మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో భారీస్కోరు సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 232/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 170.3 ఓవర్లలో 460 పరుగులకు ఆలౌటైంది. రవితేజతో పాటు సీవీ మిలింద్ (58; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్వంత్ ఖెజ్రోలియా, గౌరవ్ కుమార్ చెరో 3 వికెట్లు దక్కించుకోగా, వికాస్ మిశ్రా 2 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ ఆటముగిసే సమయానికి 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఢిల్లీ ఇంకా 439 పరుగులు వెనుకబడి ఉంది. ఆకట్టుకున్న రవితేజ, మిలింద్ ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ తన్మయ్ అగర్వాల్ (120; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రితం రోజు స్కోరుకు మరో 8 పరుగులే జోడించి కుల్వంత్ బౌలింగ్‌లో నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో కుల్వంత్ చెలరేగడంతో మరో ఐదు పరుగుల వ్యవధిలో వికెట్ కీపర్ సుమంత్ కొల్లా (2), సందీప్ (41; 5 ఫోర్లు) వికెట్లను హైదరాబాద్ కోల్పోయింది. వెంటనే తనయ్ త్యాగరాజన్ (1) సిమర్జీత్సింగ్కు దొరికాడు. అప్పటికి జట్టు స్కోరు 265/7. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సీవీ మిలింద్‌తో కలిసి రవితేజ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే బాధ్యతను తీసుకున్నాడు. వీరిద్దరూ నెమ్మదిగా ఆడుతూ అడపాదడపా బౌండరీలు బాదుతూ స్ట్రయిక్‌ను రొటేట్ చేశారు. ఈ క్రమంలో రవితేజ 125 బంతుల్లో , మిలింద్ 113 బంతుల్లో తమ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 133 పరుగులు జోడించిన తర్వాత సీవీ మిలింద్ రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం మెహదీ హసన్ (51 బంతుల్లో 14; 3 ఫోర్లు) సహకారంతో రవితేజ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అర్ధసెంచరీ తర్వాత దూకుడు పెంచిన రవితేజ కేవలం 57 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. తొమ్మిదో వికెట్‌కు 46 పరుగులు జోడించాక హిమ్మత్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి మెహదీ హసన్ ఔటయ్యాడు. రవితేజ ధాటిగా ఆడుతున్నప్పటికీ రవికిరణ్ (0) ఔట్ కావడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ 460 పరుగులకు ముగిసింది. స్కోరు వివరాలు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (బి) కుల్వంత్ 120; అక్షత్ రెడ్డి (సి) గౌరవ్ (బి) వికాస్ 15; రోహిత్ రాయుడు (సి) ధ్రువ్ (బి) వికాస్ 10; హిమాలయ్ అగర్వాల్ (సి) సార్థక్ (బి) గౌరవ్ 66; సందీప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్వంత్ 41; సుమంత్ (సి) ధ్రువ్ (బి) కుల్వంత్ 2; రవితేజ (నాటౌట్) 115; తనయ్ (సి) గౌరవ్ (బి) సిమర్జీత్ 1; మిలింద్ (రనౌట్) 58; మెహదీ హసన్ (సి) హిమ్మత్ సింగ్ (బి) గౌరవ్ 14; రవికిరణ్ (బి) గౌరవ్ 0; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (170.3 ఓవర్లలో ఆలౌట్) 460. వికెట్ల పతనం: 1–30, 2–52, 3–188, 4–255, 5–259, 6–260, 7–265, 8–398, 9–444, 10–460. బౌలింగ్: కుల్వంత్ 27–7–64–3, గౌరవ్ 22.3–7–50–3, సిమర్జీత్ 29–6–94–1, వికాస్ 49–6–107–2, లలిత్ 26–2–72–0, నితీశ్ రాణా 11–1–34–0, హితేన్ 1–0–9–0, ధ్రువ్ షోరే 5–0–18–0. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్: సార్థక్ (బ్యాటింగ్) 6; హితేన్ (బ్యాటింగ్) 14; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 21. బౌలింగ్: రవికిరణ్ 3–0–12–0, సీవీ మిలింద్ 3–0–9–0, తనయ్ 1–1–0–0. -
తన్మయ్ అగర్వాల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో హెచ్‌సీఏ ఎలెవన్ బ్యాట్స్‌మన్ తన్మయ్ అగర్వాల్ (127 బంతుల్లో 131; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. తన్మయ్‌తో పాటు బౌలర్లు కూడా రాణించడంతో ‘కాగ్’ జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్‌లో హెచ్‌సీఏ 163 పరుగులతో ఘనవిజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హెచ్‌సీఏ ఎలెవన్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 354 పరుగులు సాధించింది. అక్షత్ రెడ్డి (80), కె. సుమంత్ (73), ఆశిష్ రెడ్డి (58) అర్ధసెంచరీలతో రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో ఇంతియాజ్ అహ్మద్, అక్షయ్, పునీత్ యాదవ్ తలో వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో ‘కాగ్’ జట్టు తడబడింది. హెచ్‌సీఏ బౌలర్లు సీవీ మిలింద్ (2/37), మెహదీ హసన్ (3/26), ముదస్సిర్ హుస్సేన్ (2/32) ధాటికి 40.4 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. పునీత్ యాదవ్ (40), బిపుల్ శర్మ (33) పోరాడారు. ఆకాశ్ భండారీకి ఒక వికెట్ దక్కింది. ఇతర మ్యాచ్‌లలో ఆంధ్ర 82 పరుగులతో విదర్భపై, ఎయిరిండియా 17 పరుగులతో హెచ్‌సీఏ ప్రెసిడెంట్స్ ఎలెవన్‌పై, కేరళ 181 పరుగులతో కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్‌పై విజయం సాధించాయి. -
క్రికెటర్‌కు గాయం.. ఆసుపత్రికి తరలింపు
అహ్మదాబాద్: రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాడు తన్మయ్ అగర్వాల్ గాయపడ్డాడు. బుధవారం మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న తన్మయ్ అగర్వాల్ తలకు బంతి బలంగా తగిలింది. దీంతో అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇక్కడి సర్థార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో చత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తన్మయ్ అగర్వాల్ షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చత్తీస్‌గఢ్ బ్యాట్స్‌మెన్ మనోజ్ సింగ్ కొట్టిన బంతి నేరుగా తన్మయ్ అగర్వాల్ తలకు తగలడంతో అతడు మైదానంలో పడిపోయాడు. ఫీల్డ్ అంపైర్లు వెంటనే మెడికల్ సిబ్బందిని పిలవగా.. వారు అతడిని ముందు జాగ్రత్తగా ఆసుపత్రికి తరలించారు. -
అండర్-19 ప్రాబబుల్స్‌లో తన్మయ్
సాక్షి, హైదరాబాద్: ఈ సీజన్లో బరిలోకి దిగనున్న హైదరాబాద్ అండర్-19 ప్రాబబుల్స్ జాబితాను హెచ్‌సీఏ ప్రకటించింది. తన్మయ్ అగర్వాల్, అనిరుధ్, అరుణ్ దేవా సహా ఈ ప్రాబబుల్స్‌లో మొత్తం 48 మంది ఆటగాళ్లకు చోటు కల్పించారు. ఎంపికైన ఆటగాళ్లంతా ఈ నెల 19న ప్రాక్టీసు కోసం కోచ్‌ను సంప్రదించాలి.ప్రాబబుల్స్ జాబితా: తన్మయ్ అగర్వాల్, అనిరుధ్, అరుణ్ దేవా, సీవీ మిలింద్, రోషన్ రఘురామ్, సాయిచరణ్ తేజ, శ్రవణ్, జయసూర్య, తరుణ్ యాదవ్, యశ్వంత్ రెడ్డి, నితీశ్ రెడ్డి, ప్రణీత్, లోహిత్, సయ్యద్ మాజుద్దీన్, చంద్రశేఖర్, షాదాబ్ తుంబి, శశాంక్, కృష్ణారెడ్డి, రాహుల్, యుధీశ్, అఫ్జల్ బియబాని, శ్రీధరహాస్ రెడ్డి, అరవింద్, ఫర్హాన్, చైతన్య రెడ్డి, రాహుల్ సింగ్, చైతన్య, మనీశ్, ప్రత్యూష్ రెడ్డి, తనయ్ త్యాగరాజన్, ఆకాశ్ కులకర్ణి, కృష్ణ చైతన్య, విదరత్, నిఖిల్‌దీప్, రాకేశ్, రవితేజ, శశిధర్ రెడ్డి, యశ్‌పురి, క్రిస్టీ విక్టర్, రోహిత్ రెడ్డి, చాంద్ పాషా, వాజిద్, సందీప్ గౌడ్, హైదర్ అలీ, అక్షయ్, చైతన్య, శ్రీచరణ్, సుజయ్.


