శుక్రవారం కరీంనగర్ డైమండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్వితా ఖమ్మం ఏసెస్ 8 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఆద్యంతం థ్రిల్లర్‌ను తలపించిన మ్యాచ్‌లో 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరీంనగర్ డైమండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ సాత్విక్ రెడ్డి (63) టాప్ స్కోరర్‌గా నిలవగా, చివర్లో శుభమ్ శర్మ (54 నాటౌట్) ఆఖరి వరకు నిలిచినప్పటికీ గెలిపించలేకపోయాడు. ఖమ్మం ఏసెస్ బౌలర్లలో కెప్టెన్ సీవీ మిలింద్ 4 వికెట్లతో చెలరేగగా, సాహేంద్ర మల్లు రెండు వికెట్లు తీయగా, వాఫీ కచ్చీ, వేద్ రెడ్డి చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అన్వితా ఖమ్మం ఏసెస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కరీంనగర్ డైమండ్స్ విజయం కోసం పోరాడుతోంది. 12 ఓవర్లు ముగిసేసరికి కరీంనగర్ డైమండ్స్ 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. కరీంనగర్ విజయానికి 48 బంతుల్లో 76 పరుగులు కావాలి.
మూడో వికెట్ కోల్పోయిన కరీంనగర్
214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరీంనగర్ డైమండ్స్ 7 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. ఓపెనర్ సాత్విక్ రెడ్డి (23 బంతుల్లో 60 నాటౌట్) ధాటిగా ఆడుతుండగా, హరీశ్‌ఠాకూర్ 8 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
టీజీ20 లీగ్‌లో భాగంగా శుక్రవారం ఉప్పల్ వేదికగా కరీంనగర్ డైమండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అన్వితా ఖమ్మం ఏసెస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ మికిల్ జైస్వాల్ (34 బంతుల్లో 64 నాటౌట్) అజేయ ఫిఫ్టీతో మెరిశాడు. అంతకముందు కొడిమెల హిమతేజ (56) అర్ధశతకంతో మెరవగా, జీఎస్‌కే రెడ్డి (43) రాణించాడు.
👉 17 ఓవర్లు ముగిసేసరికి ఖమ్మం ఏసెస్ 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సీవీ మిలింద్ (14), జైస్వాల్ (25) ఆడుతున్నారు.
👉14 ఓవర్లు ముగిసేసరికి ఖమ్మం ఏసెస్ 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. మికిల్ జైస్వాల్ (20), ప్రతీక్‌రెడ్డి (11) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు కొడిదెల హిమతేజ (56) అర్ధసెంచరీ చేయగా, జీఎస్‌కే రెడ్డి (43) పరుగులతో రాణించాడు.
👉 6 ఓవర్లు ముగిసేసరికి ఖమ్మం అన్వితా ఏసెస్ 2 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. హిమతేజ (42), జీఎస్‌కే రెడ్డి (19) పరుగులతో ఆడుతున్నారు.
👉టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అన్వితా ఖమ్మం ఏసెస్ జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. నాలుగు పరుగులకే ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోయింది. వాఫి కాచీ దినేశ్ బౌలింగ్‌లో డకౌట్ కాగా, మరో ఓపెనర్ మయాంక్ గుప్తా 2 పరుగులు చేసి హరీష్ ఠాకూర్ బౌలింగ్లో వెనుదిరిగాడు. 2 ఓవర్లు ముగిసేసరికి ఖమ్మం ఏసెస్ 2 వికెట్లు కోల్పోయి 12 పరుగులు చేసింది.
టీజీ20 లీగ్‌లో భాగంగా శుక్రవారం 11వ మ్యాచ్‌లో అన్వితా ఖమ్మం ఏసెస్, కరీంనగర్ డైమండ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కరీంనగర్ డైమండ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక లీగ్‌లో అన్వితా ఖమ్మం జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక విజయం, ఒక గెలుపు సాధించగా, కరీంనగర్ డైమండ్స్ ఆడిన ఒక్క మ్యాచ్‌లో పరాజయం చవిచూసింది.
తుది జట్లు
ఖమ్మం ఏసెస్: కృష్ణ రెడ్డి, వాఫీ కచ్చీ, మిలింద్(కెప్టెన్), జైశ్వాల్, హిమతేజ, వెంకట్ ధాత్రక్, సిద్దు నాయక్,విశాల్ యాదవ్, వేద్ రెడ్డి అమిష్టాపురం, విద్యా నంద రెడ్డి, అనంత్ ప్రతీక్ రెడ్డి
కరీంనగర్ డైమండ్స్:తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), సాయి శరణ్ రావూరి, సాత్విక్ రెడ్డి, రాహుల్ రాదేశ్, చందన్ సహాని, నారాయణ తేజ టీవీఎస్, హరీశ్ ఠాకూర్, శుభమ్ శర్మ, సతీశ్ కుమార్, ఆశిష్ శ్రీవాస్తవ్, దినేశ్ రాథోడ్


