breaking news
CV Milind
-
తిలక్ వర్మ జట్టును వీడాడు.. పరాజయాల పరంపరతో..
తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్ నుంచి మెదక్ ఫాల్కన్స్ నిష్క్రమించింది. ఖమ్మం ఏసెస్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో ఓడిపోయి.. పరాజయంతో టోర్నీని ముగించింది.కాగా సీజన్లో తమ ఆరంభ మ్యాచ్‌లో మెదక్ సంచలన విజయం సాధించింది. వరంగల్ వారియర్స్ విధించిన 258 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి.. జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ తిలక్ వర్మ మెదక్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడంతో పాటు.. సెంచరీ (56 బంతుల్లో 136 నాటౌట్) బాది జట్టును గెలిపించాడు.Goosebumps! 🥶Stuff of dreams, really. The whole of Medak Falcons feel it. The whole of Telangana feels it! 😍😍#WWvMF #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/cASKvz7vgs— tg20official (@tg20official) June 22, 2026తిలక్ వర్మ టీమిండియా విధుల్లోకి వెళ్లగా..ఆ తర్వాత తిలక్ వర్మ టీమిండియా విధుల్లోకి వెళ్లగా.. మెదక్ పరాజయాల పరంపర కొనసాగింది. గెలుపున్నదే లేక చతికిల పడిన మెదక్.. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలవాలని భావించింది. అయితే, సోమవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన మెదక్ తొలుత బౌలింగ్ చేసింది.ఆకాశమే హద్దుగాఆరంభంలోనే ఓపెనర్లలో జీఎస్కే రెడ్డిని డకౌట్ చేయడం సహా వాఫీ కచ్చి (14)ని కూడా త్వరగానే పెవిలియన్‌కు పంపి కెప్టెన్ రవితేజ శుభారంభం అందించాడు. మికిల్ జైస్వాల్ (15) అర్జున్ పెవిలియన్‌కు చేర్చగా ఖమ్మం ఇన్నింగ్స్ నెమ్మదించింది. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ కొడిమెల హిమతేజ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.కేవలం 57 బంతుల్లోనే 103 పరుగులతో హిమతేజ అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా ప్రతీక్ రెడ్డి (32) రాణించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఖమ్మం ఐదు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన మెదక్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 171 పరుగులకే పరిమితమైంది.శుభారంభం అందించినా..ఓపెనర్లు నమన్ అగర్వాల్ (19 బంతుల్లో 32), శృంజిత్ రెడ్డి (46 బంతుల్లో 60) శుభారంభం అందించినా.. మిగతా వాళ్లు దానిని కొనసాగించలేకపోయారు. కెప్టెన్ రవితేజ డకౌట్ కాగా.. విక్రమ్ నాయక్ (7), వరుణ్ యర్రం (0) తీవ్రంగా నిరాశపరిచారు.ఇక సూర్య తేజ (19 బంతుల్లో 26), ఇషాన్ శర్మ (15 బంతుల్లో 34 నాటౌట్) వేగంగా ఆడే ప్రయత్నం చేసినా అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. ఫలితంగా మెదక్ 19 పరుగుల తేడాతో ఓడిపోయి భారంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు.. ఖమ్మం ఈ విజయంతో ఐదో గెలుపు నమోదు చేసి పది పాయింట్లతో రెండో స్థానానికి దూసుకువెళ్లింది. ఇక మెదక్‌తో మ్యాచ్‌లో ఖమ్మం బౌలర్లు హర్షిత్ సాయి, విద్యానంద రెడ్డి, వాఫీ కచ్చీ తలా రెండు వికెట్లు తీయగా.. వేద్రెడ్డికి ఒక వికెట్ దక్కింది. -
ఇరుజట్లకు ఆఖరి మ్యాచ్.. తుదిజట్లు ఇవే
తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్‌లో భాగంగా సోమవారం మధ్యాహ్నం మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్- మెదక్ ఫాల్కన్స్ తలపడుతున్నాయి. ఉప్పల్‌లో టాస్ గెలిచిన ఖమ్మం ఏసెస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.కాగా ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఖమ్మం.. నాలుగింట గెలిచి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు.. మెదక్ మాత్రం పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఎనిమిదో స్థానంలో ఉంది. ఇప్పటికి ఆడిన ఆరు మ్యాచ్‌లలో మెదక్ కేవలం ఒక్కటి మాత్రమే గెలిచి రెండు పాయింట్లు సాధించింది. లీగ్ దశలో ఇరుజట్లకు ఇదే ఆఖరి మ్యాచ్ కావడం విశేషం.తుదిజట్లుఖమ్మంసీవీ మిలింద్ (కెప్టెన్), వాఫీ కచ్చి, జీఎస్కే రెడ్డి, హిమతేజ కొడిమెల, మికిల్ జైస్వాల్, సహేంద్ర మల్లు, హర్షిత్ సాయి, షేక్ అజర్, వేద్ రెడ్డి అమిస్తాపురం, విద్యానంద రెడ్డి ఎల్లాల.మెదక్రవితేజ (కెప్టెన్), నమన్ అగర్వాల్, శృంజిత్ రెడ్డి, ఇషాన్ శర్మ (వికెట్ కీపర్), విక్రమ్ నాయక్, సాయి వరుణ్ యెర్రం, అర్జున్ గొర్రపల్లి, ఎన్ సూర్యతేజ, కార్తికేయ కాక్, మధుకర్ మన్నె, శశాంత్ బూడిది. -
సీవీ మిలింద్ ఆల్‌రౌండ్ షో
సాక్షి, హైదరాబాద్: టిజి20 లీగ్‌లో సీవీ మిలింద్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగడంతో ఖమ్మం ఏసెస్ జట్టు మూడో విజయం నమోదు చేసుకుంది. శనివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఖమ్మం జట్టు 5 వికెట్ల తేడాతో రంగారెడ్డి రైజర్స్పై గెలుపొందింది. మొదట రంగారెడ్డి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.ఆదిత్య జవ్వాజి (37 బంతుల్లో 43; 1 ఫోర్, 3 సిక్స్‌లు), ప్రకాశ్ రెడ్డి (25 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఖమ్మం జట్టు సారథి మిలింద్ 34 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో 17.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులుచేసింది. హిమతేజ (28 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), మికిల్ జైస్వాల్ (22 బంతుల్లో 30; 3 ఫోర్లు), మిలింద్ (21 బంతుల్లో 29 నాటౌట్; 4 ఫోర్లు) సత్తాచాటడంతో ఖమ్మం సునాయాసంగా గెలుపొందింది. మరో మ్యాచ్‌లో హైదరాబాద్ ఈ చాంపియన్స్ జట్టు 7 వికెట్ల తేడాతో కరీంనగర్ డైమండ్స్‌పై గెలుపొందింది. -
RRR vs AKA: మికిల్ స్టన్నింగ్ క్యాచ్ చూశారా?
తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్-2026 టోర్నీలో భాగంగా శనివారం నాటి మధ్యాహ్నం మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్- ఖమ్మం ఏసెస్ తలపడుతున్నాయి. ఉప్పల్‌లో టాస్ గెలిచిన రంగారెడ్డి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు ఆరోన్ జార్జ్ (4), అరవెల్లి అవినాశ్ రావు (12) విఫలం కాగా.. జ్ఞానప్రకాశ్ రెడ్డి (36), ఆదిత్య జవ్వాజి (43) జట్టును ఆదుకున్నారు.మిగిలిన వారిలో రాఘవ (2) పూర్తిగా విఫలం కాగా.. కెప్టెన్ తనయ్ త్యాగరాజన్ (14), నితిన్ సాయి యాదవ్ (19)కూడా నిరాశపరిచారు. సచేత్ బింజ్రాజ్క (2), ఆర్యన్ కరియప్ప (2) ఇలా వచ్చి అలా వెళ్లారు. అరుణ్ కుమార్ 1, తనయ్ జడ్డు ఏడు పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో రంగారెడ్డి తొమ్మిది వికెట్ల నష్టానికి 147 పరుగులు సాధించింది. ఖమ్మం బౌలర్లలో కెప్టెన్ మిలింద్మూడు వికెట్లతో చెలరేగగా.. హర్షిత్ సాయి, వేద్ రెడ్డి చెరో రెండు వికెట్లు తీశారు. విద్యానంద రెడ్డి, షేక్ అజర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. మికిల్ జైస్వాల్ కళ్లు చెదిరే క్యాచ్ఇక ఈ మ్యాచ్‌లో ఖమ్మం స్టార్ మికిల్ జైస్వాల్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. హర్షిత్ సాయి బౌలింగ్‌లో నితిన్‌సాయి యాదవ్ ఇచ్చిన క్యాచ్ బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో అందుకున్న మికిల్.. బ్యాలెన్స్ కోల్పోకుండా పని పూర్తి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.YOU CANNOT DO THAT, MICKIL! 🤯🤯Mickil Jasiwal, you absolute beauty! 🔥There have been some top grabs this tournament, but none better than Mickil's one-handed STUNNER! 💥#AKAvRRR #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/b3daQhuKbv— tg20official (@tg20official) July 4, 2026తుదిజట్లుఖమ్మం ఏసెస్సీవీ మిలింద్ (కెప్టెన్), ప్రతీక్ రెడ్డి (వికెట్ కీపర్), హిమతేజ కొడిమెల, మికిల్ జైస్వాల్, హర్షిత్ సాయి, వాఫీ కచ్చి, జీఎస్కే రెడ్డి, సహేంద్ర మల్లు, షేక్ అజర్, వేద్ రెడ్డి అమిస్తాపురం, విద్యానంద రెడ్డి ఎల్లాల.రంగారెడ్డి రైజర్స్తనయ్ త్యాగరాజన్, ఆరోన్ జార్జ్ వర్గీస్, అరవెల్లి అవినాశ్ రావు (వికెట్ కీపర్), రాఘవ, జ్ఞానప్రకాశ్ రెడ్డి, ఆదిత్య జవ్వాజి, నితిన్ సాయి యాదవ్, సచేత్ బింజ్రాజ్క, అరుణ్ కుమార్, ఆర్యన్ కరియప్ప. -
హైదరాబాద్‌తో మ్యాచ్.. ఖమ్మం కెప్టెన్ సీవీ మిలింద్కు గాయం!
తెలంగాణ ప్రీమియర్ లీగ్‌లో మరో రసవత్తర పోరుకు తెరలేచింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా హైదరాబాద్ ఇ-ఛాంపియన్స్, అన్విత ఖమ్మం ఏసెస్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఖమ్మం ఏసెస్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌కు ఖమ్మం కెప్టెన్ సీవీ మిలింద్ గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో హిమతేజ ఖమ్మం జట్టును ముందుండినడిపిస్తున్నాడు. పాయింట్ల పట్టికలో హైదరాబాద్ జట్టు అగ్రస్ధానంలో ఉండగా.. ఖమ్మం నాలుగో స్ధానంలో ఉంది.జట్లు:హైదరాబాద్ ఈ ఛాంపియన్స్: అభిరత్ రెడ్డి(కెప్టెన్), సాయి వికాస్ రెడ్డి, ప్రణవ్ వర్మ, పి అరవింద్(వికెట్ కీపర్), అన్విత్ రెడ్డి, శ్రీనికేత్, షణ్ముఖ అశ్విన్, గడుగు గణేష్, అజయ్ దేవ్ గౌడ్, అఖిల్ రాథోడ్, వైష్ణవ్ రెడ్డి ఎ.అన్విత ఖమ్మం ఏసెస్ : కొడిమెల హిమతేజ(కెప్టెన్), మిక్కిల్ జైస్వాల్, సాకేత్ ధాత్రక్, ప్రతీక్ రెడ్డి(వికెట్ కీపర్), జీఎస్కే రెడ్డి, సహేంద్ర మల్లు, వాఫీ డైమండ్ కచ్చి, మయాంక్ గుప్తా, మహేష్ విప్పర్ల, వేద్ రెడ్డి, విద్యానంద రెడ్డి -
కరీంనగర్ డైమండ్స్‌పై ఖమ్మం ఏసెస్ విజయం
శుక్రవారం కరీంనగర్ డైమండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్వితా ఖమ్మం ఏసెస్ 8 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఆద్యంతం థ్రిల్లర్‌ను తలపించిన మ్యాచ్‌లో 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరీంనగర్ డైమండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ సాత్విక్ రెడ్డి (63) టాప్ స్కోరర్‌గా నిలవగా, చివర్లో శుభమ్ శర్మ (54 నాటౌట్) ఆఖరి వరకు నిలిచినప్పటికీ గెలిపించలేకపోయాడు. ఖమ్మం ఏసెస్ బౌలర్లలో కెప్టెన్ సీవీ మిలింద్ 4 వికెట్లతో చెలరేగగా, సాహేంద్ర మల్లు రెండు వికెట్లు తీయగా, వాఫీ కచ్చీ, వేద్ రెడ్డి చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అన్వితా ఖమ్మం ఏసెస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది.భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కరీంనగర్ డైమండ్స్ విజయం కోసం పోరాడుతోంది. 12 ఓవర్లు ముగిసేసరికి కరీంనగర్ డైమండ్స్ 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. కరీంనగర్ విజయానికి 48 బంతుల్లో 76 పరుగులు కావాలి.మూడో వికెట్ కోల్పోయిన కరీంనగర్214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరీంనగర్ డైమండ్స్ 7 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. ఓపెనర్ సాత్విక్ రెడ్డి (23 బంతుల్లో 60 నాటౌట్) ధాటిగా ఆడుతుండగా, హరీశ్ఠాకూర్ 8 పరుగులతో క్రీజులో ఉన్నాడు.టీజీ20 లీగ్‌లో భాగంగా శుక్రవారం ఉప్పల్ వేదికగా కరీంనగర్ డైమండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అన్వితా ఖమ్మం ఏసెస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ మికిల్ జైస్వాల్ (34 బంతుల్లో 64 నాటౌట్) అజేయ ఫిఫ్టీతో మెరిశాడు. అంతకముందు కొడిమెల హిమతేజ (56) అర్ధశతకంతో మెరవగా, జీఎస్కే రెడ్డి (43) రాణించాడు. 👉 17 ఓవర్లు ముగిసేసరికి ఖమ్మం ఏసెస్ 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సీవీ మిలింద్ (14), జైస్వాల్ (25) ఆడుతున్నారు.👉14 ఓవర్లు ముగిసేసరికి ఖమ్మం ఏసెస్ 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. మికిల్ జైస్వాల్ (20), ప్రతీక్‌రెడ్డి (11) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు కొడిదెల హిమతేజ (56) అర్ధసెంచరీ చేయగా, జీఎస్కే రెడ్డి (43) పరుగులతో రాణించాడు.👉 6 ఓవర్లు ముగిసేసరికి ఖమ్మం అన్వితా ఏసెస్ 2 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. హిమతేజ (42), జీఎస్కే రెడ్డి (19) పరుగులతో ఆడుతున్నారు.👉టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అన్వితా ఖమ్మం ఏసెస్ జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. నాలుగు పరుగులకే ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోయింది. వాఫి కాచీ దినేశ్ బౌలింగ్‌లో డకౌట్ కాగా, మరో ఓపెనర్ మయాంక్ గుప్తా 2 పరుగులు చేసి హరీష్ ఠాకూర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 2 ఓవర్లు ముగిసేసరికి ఖమ్మం ఏసెస్ 2 వికెట్లు కోల్పోయి 12 పరుగులు చేసింది.టీజీ20 లీగ్‌లో భాగంగా శుక్రవారం 11వ మ్యాచ్‌లో అన్వితా ఖమ్మం ఏసెస్, కరీంనగర్ డైమండ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కరీంనగర్ డైమండ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక లీగ్‌లో అన్వితా ఖమ్మం జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక విజయం, ఒక గెలుపు సాధించగా, కరీంనగర్ డైమండ్స్ ఆడిన ఒక్క మ్యాచ్‌లో పరాజయం చవిచూసింది.తుది జట్లుఖమ్మం ఏసెస్: కృష్ణ రెడ్డి, వాఫీ కచ్చీ, మిలింద్(కెప్టెన్), జైశ్వాల్, హిమతేజ, వెంకట్ ధాత్రక్, సిద్దు నాయక్,విశాల్ యాదవ్, వేద్ రెడ్డి అమిష్టాపురం, విద్యా నంద రెడ్డి, అనంత్ ప్రతీక్ రెడ్డికరీంనగర్ డైమండ్స్:తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), సాయి శరణ్ రావూరి, సాత్విక్ రెడ్డి, రాహుల్ రాదేశ్, చందన్ సహాని, నారాయణ తేజ టీవీఎస్, హరీశ్ ఠాకూర్, శుభమ్ శర్మ, సతీశ్ కుమార్, ఆశిష్ శ్రీవాస్తవ్, దినేశ్ రాథోడ్ -
ఖమ్మంను చిత్తు చేసిన వరంగల్
తెలంగాణ టీ20 లీగ్- 2026 (టీజీ20)లో భాగంగా బుధవారం వరంగల్ వారియర్స్- ఖమ్మం ఏసెస్ తలపడుతున్నాయి. ఉప్పల్ స్టేడియంలో టాస్ గెలిచిన వరంగల్.. తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫలితంగా ఖమ్మం బ్యాటింగ్‌కు దిగింది.ఖమ్మం ఆలౌట్ఓపెనర్లలో వాఫీ కచ్చీ (17) విఫలం కాగా.. మయాంక్ గుప్త అర్ధ శతకం (54)తో రాణించాడు. మిగిలిన వారిలో హిమతేజ (23), ప్రతీక్ రెడ్డి (20) ఫర్వాలేదనిపించగా.. మికిల్ జైస్వాల్ మెరుపు హాఫ్ సెంచరీ (22 బంతుల్లో 54)తో దుమ్ములేపాడు.కెప్టెన్ సీవీ మిలింద్ 11 పరుగులకే వెనుదిరగగా.. వరంగల్ బౌలర్ల ధాటికి విశాల్ యాదవ్ (0), విద్యానంద రెడ్డి (6), సాయి వెంకట్ ధాత్రక్ (2), మహేశ్ విప్పర్ల (1) పెవిలియన్‌కు వరుసకట్టారు. వేద్ రెడ్డి అమిస్తాపురం 5 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా ఖమ్మం 19.2 ఓవర్లలో 202 పరుగులు చేసి ఆలౌట్ అయింది. వరంగల్ బౌలర్లలో మహ్మద్ అబ్దుల్ మాలిక్, అభిషేక్ మూడేసి వికెట్లు కూల్చగా.. క్రాంతి పల్లెపాటి రెండు, మదస్సర్ హుసేన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.వరంగల్ ఘన విజయంలక్ష్య ఛేదనకు దిగిన వరంగల్ ఏడు బంతులు మిగిలి ఉండగానే.. కేవలం ఐదు వికెట్లు కోల్పోయి (208-5) పని పూర్తి చేసింది. హర్షిత్ చౌదరి మెరుపు సెంచరీ (62 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు: 121 రన్స్) చేసి ఒంటిచేత్తో వరంగల్‌ను గెలిపించాడు. మిగిలిన వారిలో రిషికేత్ సిసోడియా 27 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఖమ్మం బౌలర్లో సాకేత్ ధాత్రక్ రెండు వికెట్లు తీయగా.. సీవీ మిలింద్, మహేశ్ విప్పర్ల, వేద్ రెడ్డి తలా ఒక వికెట్ పడగొట్టారు.తుదిజట్లుఖమ్మం వాఫీ కచ్చీ, మయాంక్ గుప్త, సీవీ మిలింద్ (కెప్టెన్), హిమతేజ, మికిల్ జైస్వాల్, ప్రతీక్ రెడ్డి, సాయి వెంకట్ ధాత్రక్, విశాల్ యాదవ్, మహేశ్ విప్రాలా, వేద్‌రెడ్డి అమిస్తాపురం, విద్యానంద రెడ్డివరంగల్అమన్ రావు పేరాల (కెప్టెన్), భవేశ్ సేథ్ (వికెట్ కీపర్), రుషికేశ్ సిసోడియా, హర్షిత్ చౌదరి, అభిషేక్, మణి కిరణ్, షౌనక్ కులకర్ణి, హుసేన్, క్రాంతి పల్లెపాటి, శ్రీవాస్తవ టీపీ, అబ్దుల్ మాలిక్. -
‘చాలా బాధపడ్డాను.. సత్తా చాటేందుకు ఇదే మంచి సమయం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వర్ధమాన క్రికెటర్లు తమ ప్రతిభను ప్రదర్శించే అందరి దృష్టిలో పడేందుకు తెలంగాణ టి20 లీగ్ (టీజీ టీ20) తగిన అవకాశం కల్పిస్తోందని పేస్ బౌలర్ సీవీ మిలింద్ అన్నాడు. దేశవాళీ క్రికెట్ లో హైదరాబాద్ తరఫున కీలక ఆటగాడిగా ఉన్న మిలింద్... టీజీ టి20లో అన్విత ఖమ్మం ఏసెస్ టీమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టోర్నీ తొలి మ్యాచ్‌లో విజయంతో ఏసెస్ శుభారంభం చేసింది. 'టోర్నీ తొలి మ్యాచ్‌లోనే మా జట్టు మంచి ప్రదర్శన కనబర్చింది. తర్వాత మ్యాచ్‌ల్లోనూ మంచి ఫలితాలు సాధించి ఏసెస్‌కు టైటిల్ అందించాలని పట్టుదలగా ఉన్నా' అని మిలింద్ చెప్పాడు. ‘ఇతర రాష్ట్రాల టీ20 లీగ్‌లను చూసినప్పుడల్లా మన వద్ద ఇలాంటి టోర్నమెంట్ ఎప్పుడు జరుగుతుందా అని అనుకునేవాళ్లం. ఎట్టకేలకు ఇప్పుడు హెచ్‌సీఏ అధికారికంగా లీగ్ జరపడం సంతోషంగా ఉంది' అని మిలింద్ వ్యాఖ్యానించారు. ప్రతి ఏటా హెచ్‌సీఏ లీగ్స్‌లో పెద్ద సంఖ్యలో ఆటగాళ్లు పాల్గొంటారని... అయితే వారి ప్రదర్శనకు తగిన గుర్తింపు లభించదని మిలింద్ అభిప్రాయపడ్డాడు. అలాంటి క్రికెటర్లకు తమ సత్తా చాటి మున్ముందు కెరీర్లో ఎదిగేందుకు టీజీ టి20 లీగ్ సరైన వేదిక అని అతను చెప్పాడు. ఈ టోర్నీలో చెప్పుకోదగ్గ అంశం వేలం, వారికి దక్కిన మొత్తం గురించి కాదు. కుర్రాళ్ల ప్రతిభకు సరైన అవకాశం. ఆటగాళ్ల కోణంలో చూస్తే అన్ని విధాలా లీగ్ సరైన ప్రయత్నం' అని మిలింద్ విశ్లేషించాడు.వ్యక్తిగతంగా చూస్తే తమ ఖమ్మం ఏసెస్ యాజమాన్యం అన్ని విధాలా టీమ్‌కు అండగా నిలిచిందని మిలింద్ వెల్లడించాడు. 'అన్విత గ్రూప్ సరైన ప్రణాళికతో టీమ్ ను సిద్ధం చేసింది. మేమంతా నగర శివార్లలో పది రోజులకు పైగా జరిగిన ప్రత్యేక శిక్షణా శిబిరంలో పాల్గొన్నాం. మా టీమ్ యజమాని అనూప్ అక్కడే ఉండి టీమ్ బాండింగ్‌కు ఎంతో సహకరించాడు.. ఓవరాల్‌గా కూడా టోర్నీలో ఐపీఎల్ తరహా వాతావరణం కనిపించడం సానుకూలాంశం' అని మిలింద్ విశ్లేషించాడు.


