ఇరుజట్లకు ఆఖరి మ్యాచ్‌.. తుదిజట్లు ఇవే | TG20 League 2026 Khammam Aces Vs Medak Falcons Toss Playing XIs | Sakshi
Sakshi News home page

మెదక్‌తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన ఖమ్మం

Jul 6 2026 2:05 PM | Updated on Jul 6 2026 2:56 PM

TG20 League 2026 Khammam Aces Vs Medak Falcons Toss Playing XIs

తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్‌లో భాగంగా సోమవారం మధ్యాహ్నం మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్‌- మెదక్‌ ఫాల్కన్స్‌ తలపడుతున్నాయి. ఉప్పల్‌లో టాస్‌ గెలిచిన ఖమ్మం ఏసెస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

కాగా ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఖమ్మం.. నాలుగింట గెలిచి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు.. మెదక్‌ మాత్రం పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఎనిమిదో స్థానంలో ఉంది. ఇప్పటికి ఆడిన ఆరు మ్యాచ్‌లలో మెదక్‌ కేవలం ఒక్కటి మాత్రమే గెలిచి రెండు పాయింట్లు సాధించింది. లీగ్‌ దశలో ఇరుజట్లకు ఇదే ఆఖరి మ్యాచ్‌ కావడం విశేషం.

తుదిజట్లు
ఖమ్మం
సీవీ మిలింద్‌ (కెప్టెన్‌), వాఫీ కచ్చి, జీఎస్‌కే రెడ్డి, హిమతేజ కొడిమెల, మికిల్‌ జైస్వాల్‌, సహేంద్ర మల్లు, హర్షిత్‌ సాయి, షేక్‌ అజర్‌, వేద్‌ రెడ్డి అమిస్తాపురం, విద్యానంద రెడ్డి ఎల్లాల.

మెదక్‌
రవితేజ (కెప్టెన్‌), నమన్‌ అగర్వాల్‌, శృంజిత్‌ రెడ్డి, ఇషాన్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), విక్రమ్‌ నాయక్‌, సాయి వరుణ్‌ యెర్రం, అర్జున్‌ గొర్రపల్లి, ఎన్‌ సూర్యతేజ, కార్తికేయ కాక్‌, మధుకర్‌ మన్నె, శశాంత్‌ బూడిది. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement