ఖమ్మంను చిత్తు చేసిన వరంగల్‌ | TG20 League 2026: Warangal Warriors Vs Khammam Aces Toss Updates Result | Sakshi
Sakshi News home page

ఖమ్మంను చిత్తు చేసిన వరంగల్‌

Jun 24 2026 2:15 PM | Updated on Jun 24 2026 6:04 PM

TG20 League 2026: Warangal Warriors Vs Khammam Aces Toss Updates Result

అమన్‌- మిలింద్‌ (PC: X)

తెలంగాణ టీ20 లీగ్‌- 2026 (టీజీ20)లో భాగంగా బుధవారం వరంగల్‌ వారియర్స్‌- ఖమ్మం ఏసెస్‌ తలపడుతున్నాయి. ఉప్పల్‌ స్టేడియంలో టాస్‌ గెలిచిన వరంగల్‌.. తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఫలితంగా ఖమ్మం బ్యాటింగ్‌కు దిగింది.

ఖమ్మం ఆలౌట్‌
ఓపెనర్లలో వాఫీ కచ్చీ (17) విఫలం కాగా.. మయాంక్‌ గుప్త అర్ధ శతకం (54)తో రాణించాడు. మిగిలిన వారిలో హిమతేజ (23), ప్రతీక్‌ రెడ్డి (20) ఫర్వాలేదనిపించగా.. మికిల్‌ జైస్వాల్‌ మెరుపు హాఫ్‌ సెంచరీ (22 బంతుల్లో 54)తో దుమ్ములేపాడు.

కెప్టెన్‌ సీవీ మిలింద్‌ 11 పరుగులకే వెనుదిరగగా.. వరంగల్‌ బౌలర్ల ధాటికి విశాల్‌ యాదవ్‌ (0), విద్యానంద రెడ్డి (6), సాయి వెంకట్‌ ధాత్రక్‌ (2), మహేశ్‌ విప్పర్ల (1) పెవిలియన్‌కు వరుసకట్టారు. వేద్‌ రెడ్డి అమిస్తాపురం 5 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

ఫలితంగా ఖమ్మం 19.2 ఓవర్లలో 202 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. వరంగల్‌ బౌలర్లలో మహ్మద్‌ అబ్దుల్‌ మాలిక్‌, అభిషేక్‌ మూడేసి వికెట్లు కూల్చగా.. క్రాంతి పల్లెపాటి రెండు, మదస్సర్‌ హుసేన్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

వరంగల్‌ ఘన విజయం
లక్ష్య ఛేదనకు దిగిన వరంగల్‌  ఏడు బంతులు మిగిలి ఉండగానే.. కేవలం ఐదు వికెట్లు కోల్పోయి (208-5) పని పూర్తి చేసింది. హర్షిత్‌ చౌదరి మెరుపు సెంచరీ (62 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు: 121 రన్స్‌) చేసి ఒంటిచేత్తో వరంగల్‌ను గెలిపించాడు. 

మిగిలిన వారిలో రిషికేత్‌ సిసోడియా 27 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఖమ్మం బౌలర్లో సాకేత్‌ ధాత్రక్‌ రెండు వికెట్లు తీయగా.. సీవీ మిలింద్‌, మహేశ్‌ విప్పర్ల, వేద్‌ రెడ్డి తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

తుదిజట్లు
ఖమ్మం 
వాఫీ కచ్చీ, మయాంక్‌ గుప్త, సీవీ మిలింద్‌ (కెప్టెన్‌), హిమతేజ, మికిల్‌ జైస్వాల్‌, ప్రతీక్‌ రెడ్డి, సాయి వెంకట్‌ ధాత్రక్‌, విశాల్‌ యాదవ్‌, మహేశ్‌ విప్రాలా, వేద్‌రెడ్డి అమిస్తాపురం, విద్యానంద రెడ్డి

వరంగల్‌
అమన్‌ రావు పేరాల (కెప్టెన్‌), భవేశ్‌ సేథ్‌ (వికెట్‌ కీపర్‌), రుషికేశ్‌ సిసోడియా, హర్షిత్‌ చౌదరి, అభిషేక్‌, మణి కిరణ్‌, షౌనక్‌ కులకర్ణి, హుసేన్‌, క్రాంతి పల్లెపాటి, శ్రీవాస్తవ టీపీ, అబ్దుల్‌ మాలిక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement