breaking news
warangal warriors
-
చిత్తుగా ఓడిన వరంగల్.. ప్లేఆఫ్స్‌కు రంగారెడ్డి రైజర్స్
టీజీ20 లీగ్‌లో రంగారెడ్డి రైజర్స్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ప్లేఆఫ్ లో చోటు దక్కించుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్.. వరంగల్ వారియర్స్‌పై 161 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 253 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వరంగల్ వారియర్స్ 91 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ అమన్‌రావు (31) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వరంగల్ బౌలర్లలో నితిన్ సాయి యాదవ్, హితేశ్ యాదవ్‌లు చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అంతకముందు టాస్ గెలిచిన రంగారెడ్డి రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 252 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఆరోన్ జార్జ్ (43 బంతుల్లో 91, 12 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా, ఆదిత్య జవ్వాజి (36 బంతుల్లో 77) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 71 బంతుల్లో 163 పరుగులు జోడించడం విశేషం. చివర్లో వెంకట్ కార్తిక్ (26 బంతుల్లో 51 నాటౌట్) సంచలన హాఫ్ సెంచరీతో మెరిశాడు. వరంగల్ వారియర్స్ బౌలర్లలో సల్మాన్ ఖాన్ 5 వికెట్లతో చెలరేగగా, ముద్దసర్ హుస్సెన్ ఒక వికెట్ తీశాడు. -
ఆరోన్ జార్జ్ విధ్వంసం.. రంగారెడ్డి భారీ స్కోరు
టీజీ20 లీగ్‌లో ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్ జూలు విదిల్చింది. టాస్ గెలిచిన రంగారెడ్డి రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 252 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఆరోజన్ జార్జ్ (43 బంతుల్లో 91, 12 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా, ఆదిత్య జవ్వాజి (36 బంతుల్లో 77) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 71 బంతుల్లో 163 పరుగులు జోడించడం విశేషం.చివర్లో వెంకట్ కార్తిక్ (26 బంతుల్లో 51 నాటౌట్) సంచలన హాఫ్ సెంచరీతో మెరిశాడు. వరంగల్ వారియర్స్ బౌలర్లలో సల్మాన్ ఖాన్ 5 వికెట్లతో చెలరేగగా, ముద్దసర్ హుస్సెన్ ఒక వికెట్ తీశాడు. Aaron George is not going to die wondering. 🫡The young opener is unfazed by wickets falling at the other end, going on an all-out brawl, hitting the bowlers around the park.#RRRvWW #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/wLJqSVQYzV— tg20official (@tg20official) July 7, 2026The Ranga Reddy Risers do themselves a massive favour by putting 2️⃣5️⃣2️⃣ on the board!In pursuit of qualification, the batters went on a gleeful boundary hitting spree, everyone chipping away towards a mammoth total!Will the Risers keep the Warriors to under 121 and qualify for… pic.twitter.com/YhY9g8T3tM— tg20official (@tg20official) July 7, 2026 -
వరంగల్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన రంగారెడ్డి రైజర్స్
టీజీ20 లీగ్‌లో భాగంగా మంగళవారం ఉప్పల్ వేదికగా రెండో మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్, వరంగల్ వారియర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రంగారెడ్డి రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయింది. 9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దశలో ఆరోన్ జార్జ్ (70), ఆదిత్య (54) ధాటిగా ఆడుతున్నారు. ఇక టోర్నీలో ఆరు మ్యాచ్‌లాడిన రంగారెడ్డి రైజర్స్ మూడు విజయాలు, మూడు ఓటములతో ఆరు పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మరోవైపు వరంగల్ వారియర్స్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. వరంగల్ వారియర్స్‌కు ప్లేఆఫ్ అవకాశాలు లేనప్పటికీ రంగారెడ్డి రైజర్స్‌కు మాత్రం కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో వరంగల్‌పై రంగారెడ్డి భారీ తేడాతో గెలిస్తే ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశముంటుంది. -
వర్షంతో వరంగల్, పాలమూరు మ్యాచ్ రద్దు
టీజీ20 లీగ్‌లో శుక్రవారం వరంగల్ వారియర్స్, పాలమూరు స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. టాస్ గెలిచిన పాలమూరు స్ట్రైకర్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన వరంగల్ వారియర్స్ 2.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. హర్షిత్ చౌదరీ (8), రిషికేత్ సిసోడియా (1) పరుగులతో ఆడుతున్నారు. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్ రద్దుకే అంపైర్లు మొగ్గు చూపారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ సిరీస్ లో ఇప్పటివరకు పాలమూరు స్ట్రైకర్స్, వరంగల్ వారియర్స్ ఆరు చొప్పున మ్యాచ్‌లు ఆడగా.. ఒక్కో మ్యాచ్‌లో విజయం సాధించాయి. -
పాలమూరు స్ట్రైకర్స్ వర్సెస్ వరంగల్ తుది జట్లు ఇవే
తెలంగాణ టీ20 లీగ్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా పాలమూరు స్ట్రైకర్స్, వరంగల్ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాలమూరు స్ట్రైకర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఇరు జట్లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. ఈ నామమాత్రపు మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని వరంగల్, పాలమూరు భావిస్తున్నాయి.తుది జట్లువరంగల్ వారియర్స్: అమన్ రావ్ పేరాల(కెప్టెన్), భవేష్ సేథ్(వికెట్ కీపర్), రిషికేత్ సిసోడియా, హర్షిత్ చౌదరి, మురుగన్ అభిషేక్, ఆది మణి కిరణ్, కర్రి సాయి ధనుష్, ముదస్సర్ హుస్సేన్, పల్లెపాటి క్రాంతి, సుంకరి ధీరజ్, సల్మాన్ ఖాన్పాలమూరువిగ్నేష్ రెడ్డి, ప్రజ్ఞయ్ రెడ్డి, రోహిత్ రాయుడు, మణికంతేశ్వర్ రెడ్డి, రిషబ్, మహ్మద్ అఫ్రిది, బుడిది తేజ, షదాబ్ అహ్మద్, నిపుణ్ రెడ్డి, అశ్వద్ రాజీవ్, నిశాంత్ రెడ్డి -
వరంగల్‌ను చిత్తు చేసిన హైదరాబాద్
తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్- 2026లో భాగంగా బుధవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్, హైదరాబాద్ ఇ- చాంపియన్స్ తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన వరంగల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వరంగల్ స్కోరెంతంటే?వరంగల్ ఓపెనర్లలో హర్షిత్ చౌదరి (22) త్వరగానే వెనుదిరగగా.. కెప్టెన్ అమన్ రావు (20 బంతుల్లో 45) రాణించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రిషికేత్ 38 పరుగులు చేయగా.. మిగిలిన వారిలో శౌనక్ (24) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.మురుగన్ అభిషేక్ (4) పూర్తిగా విఫలం కాగా.. ధీరజ్ 18, భవేశ్ 6, ఆది మణి కిరణ్ 5, ముదస్సర్ 3 పరుగులు చేసి నిష్క్రమించారు. క్రాంతి (2), సల్మాన్ అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో వరంగల్ తొమ్మిది వికెట్ల నష్టానికి 173 పరుగులు సాధించింది.హైదరాబాద్ బౌలర్లలో అజయ్ గౌడ్ మూడు వికెట్లతో చెలరేగగా.. దేవ్ మెహతా, అఖిల్ రాథోడ్, షణ్ముఖ అశ్విన్, ప్రణవ్ వర్మ, అభిరథ్ రెడ్డి తలా ఒక వికెట్ పడగొట్టారు.ఆరు వికెట్ల తేడాతో హైదరాబాద్ ఘన విజయంలక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ కేవలం 15.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. కెప్టెన్ అభిరథ్ రెడ్డి అజేయ శతకం (43 బంతుల్లో 101)తో అదరగొట్టగా.. గడుగు గణేశ్ అర్ధ శతకం (31 బంతుల్లో 50)తో అలరించాడు. వరంగల్ బౌలర్లలో సల్మాన్ ఖాన్, క్రాంతి, శౌనక్ తలా ఒక వికెట్ పడగొట్టారు.తుదిజట్లువరంగల్అమన్ రావు పేరాల (కెప్టెన్), భవేశ్ సేత్ (వికెట్ కీపర్), రిషికేత్ సిసోడియా, హర్షిత్ చౌదరి, మురుగన్ అభిషేక్, ఆది మణి కిరణ్, శౌనక్ కులకర్ణి, ముదస్సర్ హుసేన్, పల్లెపాటి క్రాంతి, సుంకరి ధీరజ్, సల్మాన్ ఖాన్.హైదరాబాద్అభిరథ్ రెడ్డి మందాడి (కెప్టెన్), సాయి వికాస్ రెడ్డి, గడుగు గణేశ్, వైష్ణవ్ రెడ్డి, ప్రణవ్ వర్మ, అరవింద్ (వికెట్ కీపర్), అజయ్ దేవ్ గౌడ్, దేవ్ మెహతా, అఖిల్ రాథోడ్, ఎంఏ షణ్ముఖ. -
నరాలు తెగే ఉత్కంఠ.. బోణీ కొట్టిన కరీంనగర్
తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20)- 2026లో కరీంనగర్ డైమండ్స్ ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. వరంగల్ వారియర్స్‌తో ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో.. రెండు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఉప్పల్ వేదికగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన వరంగల్ వారియర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా.. కరీంనగర్ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కరీంనగర్ డైమండ్స్ 209 పరుగులు స్కోరు చేసింది.తన్మయ్ అగర్వాల్ అద్భుత శతకంకరీంనగర్ బ్యాటర్లలో ఓపెనర్, కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ అద్భుత రీతిలో రాణించాడు. 52 బంతుల్లోనే వంద పరుగులు చేసుకున్న తన్మయ్.. మొత్తంగా 61 బంతులు ఎదుర్కొని పదిహేను ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 133 పరుగులు సాధించాడు. కిరణ్ బౌలింగ్‌లో LBW కావడంతో తన్మయ్ మెరుపు ఇన్నింగ్స్‌కు తెరపడింది. Simply outstanding! 🤩A ton to savour for Tanmay, standing up and leading the fight for his side! 💥What a time to do it for the Diamonds! ⚡️#WWvKD #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/b3Cc3pqvEr— tg20official (@tg20official) June 28, 2026మిగిలిన వారిలో వన్‌డౌన్ బ్యాటర్ హెచ్‌కే సింహ (24) ఫర్వాలేదనిపించాడు. వరంగల్ బౌలర్లలో ముదస్సర్ రెండు వికెట్లు తీయగా.. ఆది మణి కిరణ్, శౌనక్ కులకర్ణి, మురుగన్ అభిషేక్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వరంగల్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 207 పరుగులకు పరిమితమైంది.గెలుపు ఆశలపై నీళ్లుఓపెనర్లు హర్షిత్ చౌదరి (31), కెప్టెన్ అమన్ రావు (12) స్వల్ప స్కోర్లకే వెనుదిరగగా.. వన్‌డౌన్ బ్యాటర్ రిషికేత్ సిసోడియా అర్ధ శతకం (31 బంతుల్లో 65)తో రాణించాడు. మిగిలిన వారిలో భవేశ్ సేత్ కూడా హాఫ్ సెంచరీ (27 బంతుల్లో 53 నాటౌట్) బాదాడు. శౌనక్ (6 బంతుల్లో 14) దూకుడుగా ఆడగా.. ఆఖరి ఓవర్లలో మూడు సిక్సర్లు బాది భవేశ్ గెలుపు ఆశలు రేపాడు. కానీ విజయ లాంఛనం పూర్తి చేయలేకపోయాడు. దీంతో రెండు పరుగుల తేడాతో వరంగల్ ఓటమిపాలైంది.కరీంనగర్ బౌలర్లలో సతీశ్ కుమార్ రెండు... శుభం శర్మ, రత్లావత్ దినేశ్, హరీశ్ ఠాకూర్, ఆశిష్ శ్రీవాస్తవ తలా ఒక వికెట్ పడగొట్టారు. కాగా ఇప్పటికి కరీంనగర్ మూడు మ్యాచ్‌లు ఆడగా ఇదే తొలి గెలుపు.తుదిజట్లుకరీంనగర్ డైమండ్స్సాత్విక్ రెడ్డి , తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), హెచ్‌కే సింహా , రాహుల్ రాధేష్ (వికెట్ కీపర్), హరీష్ ఠాకూర్ , చందన్ సహాని , శుభం శర్మ , నారాయణ తేజ , ఆశిష్ శ్రీవాస్తవ్ , రత్లావత్ దినేష్ , పగడాల లోకేష్వరంగల్ వారియర్స్హర్షిత్ చౌదరి, అమన్ రావు పేరాల (కెప్టెన్), రిషికేత్ సిసోడియా, మురుగన్ అభిషేక్, భవేష్ సేథ్ (వికెట్‌కీపర్), ఆది మణి కిరణ్, ఎండీ ఆసిఫ్ మన్సూరి, శౌనక్ కులకర్ణి, ముదస్సర్ హుస్సేన్, అబ్దుల్ మాలిక్, పల్లెపాటి క్రాంతి. -
కెప్టెన్ సూపర్ సెంచరీ.. 200 దాటిన స్కోరు
తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20)- 2026లో కరీంనగర్ డైమండ్స్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ సెంచరీతో సత్తా చాటాడు. వరంగల్ వారియర్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో 52 బంతుల్లోనే శతక్కొట్టాడు. కాగా ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన వరంగల్ వారియర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కరీంనగర్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ముదస్సర్ బౌలింగ్‌లో ఓపెనర్ సాత్విక్ రెడ్డి సింగిల్ డిజిట్ స్కోరుకే (4) వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్, కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. 133 పరుగులుఈ క్రమంలో 52 బంతుల్లోనే వంద పరుగులు చేసుకున్న తన్మయ్.. మొత్తంగా 61 బంతులు ఎదుర్కొని పదిహేను ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 133 పరుగులు సాధించాడు.అయితే, కిరణ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోవడంతో తన్మయ్ మెరుపు ఇన్నింగ్స్‌కు తెరపడింది. వన్‌డౌన్ బ్యాటర్ హెచ్‌కే సింహ (24) ఫర్వాలేదనిపించగా.. మిగతా వాళ్లంతా పూర్తిగా నిరాశపరిచారు. వైస్ కెప్టెన్ చందన్ సహాని 16 పరుగులు చేయగా.. హరీశ్ ఠాకూర్ 1, శుభం శర్మ 2 (రిటైర్డ్ అవుట్) పరుగులకే నిష్క్రమించారు.రాహుల్ రాధేశ్ 15, నారాయణ తేజ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కరీంనగర్ డైమండ్స్ 209 పరుగులు స్కోరు చేసింది. కాగా కరీంనగర్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడి రెండూ ఓడిపోయింది. వరంగల్‌పై గెలిచి బోణీ కొట్టాలని పట్దుదలగా ఉంది.తుదిజట్లుకరీంనగర్ డైమండ్స్సాత్విక్ రెడ్డి , తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), హెచ్‌కే సింహా , రాహుల్ రాధేష్ (వికెట్ కీపర్), హరీష్ ఠాకూర్ , చందన్ సహాని , శుభం శర్మ , నారాయణ తేజ , ఆశిష్ శ్రీవాస్తవ్ , రత్లావత్ దినేష్ , పగడాల లోకేష్వరంగల్ వారియర్స్హర్షిత్ చౌదరి, అమన్ రావు పేరాల (కెప్టెన్), రిషికేత్ సిసోడియా, మురుగన్ అభిషేక్, భవేష్ సేథ్ (వికెట్‌కీపర్), ఆది మణి కిరణ్, ఎండీ ఆసిఫ్ మన్సూరి, శౌనక్ కులకర్ణి, ముదస్సర్ హుస్సేన్, అబ్దుల్ మాలిక్, పల్లెపాటి క్రాంతి.Simply outstanding! 🤩A ton to savour for Tanmay, standing up and leading the fight for his side! 💥What a time to do it for the Diamonds! ⚡️#WWvKD #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/b3Cc3pqvEr— tg20official (@tg20official) June 28, 2026 -
వరంగల్ వారియర్స్‌తో మ్యాచ్.. కరీంనగర్ బోణీ కొట్టేనా?
టీజీ20 లీగ్‌లో భాగంగా ఆదివారం ఉప్పల్ వేదికగా 14వ మ్యాచ్‌లో కరీంనగర్ డైమండ్స్, వరంగల్ వారియర్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన వరంగల్ వారియర్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక వరంగ్ వారియర్స్ ఆడిన మూడింటిలో ఒక మ్యాచ్‌లో గెలిచి పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు ఆడిన రెండింటిలోనూ ఓడిన కరీంనగర్ డైమండ్స్ ఆఖరి స్థానంలో ఉంది. ఇవాళ్టి మ్యాచ్‌లోనైనా గెలిచి కరీంనగర్ డైమండ్స్ టోర్నీలో బోణీ చేయాలని చూస్తుండగా, రెండో విజయంతో పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని వరంగల్ వారియర్స్ భావిస్తోంది.తుదిజట్లు:కరీంనగర్ డైమండ్స్: సాత్విక్ రెడ్డి , తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), హెచ్‌కే సింహా , రాహుల్ రాధేష్(వికెట్ కీపర్), హరీష్ ఠాకూర్ , చందన్ సహాని , శుభం శర్మ , నారాయణ తేజ , ఆశిష్ శ్రీవాస్తవ్ , రత్లావత్ దినేష్ , పగడాల లోకేష్వరంగల్ వారియర్స్: హర్షిత్ చౌదరి అమన్ రావు (కెప్టెన్), రిషికేత్ సిసోడియా, మురుగన్ అభిషేక్, భవేష్ సేథ్ (వికెట్‌కీపర్), ఆది మణి కిరణ్, ఎండీ ఆసిఫ్ మన్సూరి, శౌనక్ కులకర్ణి, ముదస్సర్ హుస్సేన్, అబ్దుల్ మాలిక్ప,ల్లెపాటి క్రాంతి -
నల్గొండ నైట్స్ ఘన విజయం
టీజీ20 లీగ్‌లో భాగంగా నల్గొండ నైట్స్ రెండో విజయాన్ని అందుకుంది. శుక్రవారం వరంగల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అనురాగ్ నల్గొండ నైట్స్ 91 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. 295 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వరంగల్ వారియర్స్ 14 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. వరంగల్ బ్యాటర్లలో కెప్టెన్ అమన్‌రావు (46) టాప్ స్కోరర్‌గా నిలవగా, మురుగన్ అభిషేక్ (44) పర్వాలేదనిపించాడు. నల్గొండ నైట్స్ బౌలర్లలో సరాను నిశాంత్, వరుణ్ గౌడ్ చెరో మూడు వికెట్లు తీయగా, అనికేత్‌రెడ్డి రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన నల్గొండ నైట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. గౌరవ్ రెడ్డి (80), నితీశ్‌రెడ్డి (81) విధ్వంసంతో నల్గొండ నైట్స్ భారీ స్కోరు చేసింది. SLAM DUNK, Nishanth! 🏀Nishanth Saranu gets things going for the Knights, striking twice in two balls to peg the Warriors back significantly! 🧨#ANKvWW #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/nHr08NkGSq— tg20official (@tg20official) June 26, 2026 -
గౌరవ్ రెడ్డి విధ్వంసం.. నితీశ్ రెడ్డి ధనాధన్.. నల్గొండ భారీ స్కోరు
తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20)- 2026లో భాగంగా నల్గొండ నైట్స్ భారీ స్కోరు సాధించింది. వరంగల్ వారియర్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 259 పరుగులు స్కోరు చేసింది.ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన వరంగల్ వారియర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన నల్గొండ ఆదిలోనే ఓపెనర్ ప్రణవ్ సూర్యదేవర (4) వికెట్ కోల్పోయింది. అయితే, ఆరంభంలోనే వికెట్ తీసిన ఆనందం వరంగల్‌కు ఎక్కువ సేపు నిలవలేదు.ఆకాశమే హద్దుగాఓపెనర్ గౌరవ్ రెడ్డితో పాటు వన్‌డౌన్ బ్యాటర్ నితీశ్ రెడ్డి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గౌరవ్ కేవలం 33 బంతుల్లోనే 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. Dead straight! 🥵The safest part of the field has been breached and Gaurav Reddy leaves no chance for the fielders to stop him! 💥#ANKvWW #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/EuxBENGCNT— tg20official (@tg20official) June 26, 2026మరోవైపు.. నితీశ్ రెడ్డి 41 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఐదు సిక్స్‌లు బాది 81 పరుగులు సాధించాడు. వీరిద్దరు కలిసి ఏకంగా 143 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.Naa tera, naa mera. 4️⃣ runs Anurag Nalgonda Knights ka 🫣#ANKvWW #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/jnKLqpu522— tg20official (@tg20official) June 26, 2026మెరుపులు మెరిపించారుఅయితే, గౌరవ్ రెడ్డిని ముదస్సర్ అవుట్ చేయగా.. నితీశ్ రెడ్డి రనౌట్ అయ్యాడు. మిగితా వారిలో కెప్టెన్ రాహుల్ బుద్ధి (18 బంతుల్లో 31), అర్ఫాజ్ అహ్మద్ (14 బంతుల్లో 33) మెరుపులు మెరిపించగా.. దివేశ్ సింగ్ (7 బంతుల్లో 18 నాటౌట్) రాణించాడు. ఫలితంగా నల్గొండ నైట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 259 పరుగులు సాధించింది.వరంగల్ బౌలర్ల ఆట తీరుపై విమర్శలుకాగా వరంగల్ వారియర్స్ తమ తొలి మ్యాచ్‌లో భాగంగా మెదక్ ఫాల్కన్స్‌పై 258 పరుగులు చేసింది. అయితే, ఈ టార్గెట్‌ను కాపాడుకోలేక ఓటమి పాలైంది. తాజాగా నల్గొండకు ఏకంగా 259 పరుగులు లీక్ చేసింది. దీంతో వరంగల్ బౌలర్ల ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇక నల్గొండతో మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ బౌలర్లలో అబ్దుల్ మాలిక్ రెండు వికెట్లు తీయగా.. ముదస్పర్, శౌనక్ తలా ఒక వికెట్ తీశారు. టీమిండియా స్టార్ మహ్మద్ సిరాజ్ వస్తేనే వరంగల్ బౌలింగ్ వైఫల్యాల నుంచి బయటపడగలదనిపిస్తోంది.చదవండి: కెప్టెన్ సెంచరీ.. భారత్ స్కోరెంతంటే? -
వరంగల్‌తో మ్యాచ్.. నల్గొండ బ్యాటింగ్
తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20)- 2026లో భాగంగా శుక్రవారం వరంగల్ వారియర్స్- నల్గొండ నైట్స్ తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో వేదికగా టాస్ గెలిచిన వరంగల్ వారియర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నల్గొండ నైట్స్ బ్యాటింగ్‌కు దిగింది.కాగా ఇప్పటికి రెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న వరంగల్.. ఒక విజయం.. ఒక పరాజయం నమోదు చేసింది. ఫలితంగా రెండు పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. నల్గొండ సైతం ఒకటి గెలిచి ఒకటి ఓడిపోయింది. అయితే, నెట్‌రన్‌రేటు పరంగా వెనుకబడి ఐదో స్థానంలో కొనసాగుతోంది.తుదిజట్లునల్గొండప్రణవ్ సూర్యదేవర, గౌరవ్ రెడ్డి, నితీశ్ రెడ్డి, రాహుల్ బుద్ధి (కెప్టెన్), దివేశ్ సింగ్, ఎండీ అర్ఫాజ్ అహ్మద్, టి.హర్షవర్దన్ సింగ్, అనికేత్ రెడ్డి, వరుణ్ గౌడ్, రక్షణ్ రెడ్డి, నిశాంత్ సరాను.వరంగల్అమన్ రావు (కెప్టెన్), హర్షిత్ చౌదరి, రిషికేత్ సిసోడియా, భవేశ్ సేత్, మురుగన్ అభిషేక్, ఆది మణి కిరణ్, ఆసిఫ్ మన్సూరి, క్రాంటి పల్లెపాటి, మహ్మద్ అబ్దుల్ మాలిక్, ముదస్పర్ హుసేన్, శౌనక్ కులకర్ణి. -
‘దూకుడే నా శైలి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టి20 లీగ్‌లో భాగంగా వరంగల్ వారియర్స్ ఆడిన తొలి మ్యాచ్‌లో కెప్టెన్ పేరాల అమన్ రావు మెరుపు శతకంతో చెలరేగిపోయాడు. మెదక్ ఫాల్కన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 32 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న అతను చివరకు 48 బంతుల్లో 142 పరుగులు సాధించాడు. రాష్ట్ర స్థాయి లీగ్ పోటీల్లో అమన్దే వేగవంతమైన శతకం. అయితే దీంతో తాను సంతృప్తి చెందలేదని, మరో మూడు బంతుల ముందే సాధించాల్సిందని అతను అన్నాడు. ‘శతకానికి చేరువవుతున్న సమయంలో మరింత వేగంగా ఆడాల్సింది. నేను అనుకున్నదాని ప్రకారం 29 బంతుల్లోనే సెంచరీ రావాలి. కానీ కాస్త ఆలస్యం కావడంతో నేను నిరుత్సాహ పడ్డాను. అయితే మున్ముందు మరో అవకాశం వస్తే వదిలి పెట్టను’ అని గురువారం ‘సాక్షి’తో అమన్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాటర్ తిలక్ వర్మ కూడా సెంచరీ చేయడంతో చివరకు వరంగల్ ఓటమి పాలైనా, అమన్ ఇన్నింగ్స్ ప్రత్యేకంగా నిలిచింది. దూకుడుగా బ్యాటింగ్ చేయడమే తన శైలి అని, తొలి బంతి నుంచి చెలరేగడం అలవాటుగా మార్చుకున్నానని అమన్ చెప్పాడు. ‘కెరీర్ ఆరంభం నుంచి నేను ఇదే తరహాలో ఆడతాను. హైదరాబాద్ తరఫున దేశవాళీ మ్యాచ్‌లలో కూడా వేగంగా పరుగులు సాధించాను. ఇప్పుడు తెలంగాణ టి20 లీగ్‌లో దీనిని కొనసాగిస్తున్నా. మేం మెదక్‌తో మ్యాచ్ ఓడినా ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేయడం చూశాను. వారికి కావాల్సింది అదే. పైగా ఈ మ్యాచ్‌తో లీగ్‌లో సరైన ఊపు లభించిందని భావిస్తున్నా’ అని అమన్ రావు చెప్పాడు. ఈ ఏడాది ఆరంభంలో హైదరాబాద్ తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడుతూ బెంగాల్‌పై అద్భుత డబుల్ సెంచరీ చేయడం అమన్‌కు గుర్తింపు తీసుకొచ్చింది. 186 వద్ద నుంచి ఇన్నింగ్స్‌లో మిగిలిన చివరి మూడు బంతుల్లో వరుసగా 6, 2, 6 బాది అతను ఈ మైలురాయిని చేరుకున్నాడు. ‘వన్డే డబుల్ సెంచరీ నాకు ఎంతో ప్రత్యేకం. కెరీర్ ఆరంభ దశలోనే ఇలాంటి ఇన్నింగ్స్ రావడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రాబోయే సీజన్లలో మరింత మంచి ప్రదర్శనలు ఇవ్వాలని పట్టుదలగా ఉన్నా’ అని అతను వెల్లడించాడు. 2026 ఐపీఎల్ సీజన్లో అమన్ రాజస్తాన్ రాయల్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే దురదృష్టవశాత్తూ మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. దీనిపై నిరాశ చెందలేదని, తనదైన చాన్స్ కోసం ఎదురు చూస్తున్నానని అతను వ్యాఖ్యానించాడు. ‘నా ప్రతిభను రాయల్స్ గుర్తించింది. అందుకే టీమ్‌లోకి తీసుకున్నామని హెడ్ కోచ్ సంగక్కర చెప్పారు. అయితే టీమ్ కాంబినేషన్ కారణంగా ఆడే చాన్స్ లభించలేదు. నిరాశపడవద్దని, మున్ముందు ఇదే జట్టుతో కొనసాగించి అవకాశాలు కల్పిస్తామని ఆయన నాకు ధైర్యం చెప్పారు. ఇది ఆరంభమే కదా. మున్ముందు ఐపీఎల్లో సత్తా చాటగలనని నమ్ముతున్నా’ అని అమన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ప్రతిభాన్వేషణ బృందాలను ఆకట్టుకునేందుకు టీజీ టి20 మంచి చాన్స్ అని, కొత్త ఆటగాళ్లు దీనిని అందిపుచ్చుకోవాలన్న అమన్... వారియర్స్ విజయంపై ధీమా వ్యక్తం చేశాడు. ‘ఐపీఎల్లో తరహాలోనే టీజీ లీగ్ సాగుతోంది. సరైన సమయంలో మన రాష్ట్ర ఆటగాళ్లకు ఈ వేదిక లభించడం శుభపరిణామం. మా జట్టు రెండో మ్యాచ్‌లో అలవోక విజయం సాధించింది. పలువురు ప్రతిభావంతులతో టీమ్ పటిష్టంగా ఉంది. టీమ్ యాజమాన్యం కూడా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ అండగా నిలిచింది. తొలి సీజన్లో వరంగల్ వారియర్స్‌ను విజేతగా నిలపాలన్నదే నా లక్ష్యం’ అని అమన్ రావు చెప్పాడు. -
శతక్కొట్టిన హర్షిత్ చౌదరి.. బోణీ కొట్టిన వరంగల్
తెలంగాణ టీ20 లీగ్-2026 (టీజీ20)లో మూడో శతకం నమోదైంది. వరంగల్ వారియర్స్ ఓపెనర్ హర్షిత్ చౌదరి శతక్కొట్టాడు. ఖమ్మం ఏసెస్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో 48 బంతుల్లో హర్షిత్ వంద పరుగుల మార్కు అందుకున్నాడు. అతడి శతక ఇన్నింగ్స్‌లో తొ మ్మిది ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి.వరంగల్‌కు తొలుత ఓటమికాగా జూన్ 21న టీజీ20 లీగ్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరంగల్ వారియర్స్ కెప్టెన్ అమన్ రావు లీగ్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఉప్పల్ వేదికగా సోమవారం మెదక్ ఫాల్కన్స్‌పై 32 బంతుల్లోనే శతక్కొట్టాడు.తద్వారా లీగ్‌లో మొట్టమొదటి సెంచరీని తన పేరిట లిఖించుకున్నాడు ఈ కరీంనగర్ అబ్బాయి. అయితే, ఆ వెంటనే మెదక్ సారథి తిలక్ వర్మ కూడా సెంచరీ చేసి.. లీగ్‌లో రెండో శతకం నమోదు చేయడంతో పాటు.. వరంగల్‌పై తన జట్టుకు విజయం అందించాడు.ఖమ్మం స్కోరు 202తాజాగా తమ రెండో మ్యాచ్‌లో భాగంగా ఖమ్మం ఏసెస్‌ను ఎదుర్కొన్న వరంగల్.. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఖమ్మం 19.2 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌట్ అయింది. ఖమ్మం బ్యాటర్లలో మయాంక్ గుప్త (54), మికిల్ జైస్వాల్ (54) అర్ధ శతకాలతో రాణించారు.చెలరేగిన హర్షిత్.. వరంగల్ బోణీవరంగల్ బౌలర్లలో మహ్మద్ అబ్దుల్ మాలిక్, అభిషేక్ చెరో మూడు వికెట్లు కూల్చగా.. క్రాంతి పల్లెపాటి రెండు, హుసేన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వరంగల్ ఆదిలోనే కెప్టెన్ అమన్‌రావు (7) వికెట్ కోల్పోగా.. మరో ఓపెనర్ హర్షిత్ చౌదరి శతకంతో చెలరేగాడు. మొత్తంగా 62 బంతులు ఎదుర్కొన్న హర్షిత్ పదకొండు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేశాడు. మిగిలిన వారిలో రిషికేత్ సిసోడియా (27) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఇక ఆఖరి వరకు అజేయంగా నిలిచి సిక్సర్‌తో వరంగల్‌ను విజయతీరాలకు చేర్చాడు హర్షిత్ చౌదరి. ఫలితంగా 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన వరంగల్.. ఖమ్మంపై ఐదు వికెట్ల తేడాతో (208-5) విజయం సాధించింది.ఇక సీజన్లో వరంగల్‌కు ఇదే తొలి గెలుపు. టీమిండియా స్టార్ మహ్మద్ సిరాజ్ వరంగల్ జట్టుతో పాటు స్టేడియానికి వచ్చినప్పటికీ.. అతడు విశ్రాంతి తీసుకున్నాడు. తదుపరి మ్యాచ్‌లో వరంగల్ తరఫున సిరాజ్ బరిలో దిగనున్నాడు.చదవండి: డ్రెసింగ్ రూమ్‌లోకి వైభవ్‌కి నో ఎంట్రీ!One of the finest knocks Uppal has seen! 🤩A hundred that raised the bar for batters all over!Harshit Choudhary deserves ALL the accolades, leading his side to a memorable first win. ⚡️#AKAvWW #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/fQrjo7xfgE— tg20official (@tg20official) June 24, 2026 -
ఖమ్మంను చిత్తు చేసిన వరంగల్
తెలంగాణ టీ20 లీగ్- 2026 (టీజీ20)లో భాగంగా బుధవారం వరంగల్ వారియర్స్- ఖమ్మం ఏసెస్ తలపడుతున్నాయి. ఉప్పల్ స్టేడియంలో టాస్ గెలిచిన వరంగల్.. తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫలితంగా ఖమ్మం బ్యాటింగ్‌కు దిగింది.ఖమ్మం ఆలౌట్ఓపెనర్లలో వాఫీ కచ్చీ (17) విఫలం కాగా.. మయాంక్ గుప్త అర్ధ శతకం (54)తో రాణించాడు. మిగిలిన వారిలో హిమతేజ (23), ప్రతీక్ రెడ్డి (20) ఫర్వాలేదనిపించగా.. మికిల్ జైస్వాల్ మెరుపు హాఫ్ సెంచరీ (22 బంతుల్లో 54)తో దుమ్ములేపాడు.కెప్టెన్ సీవీ మిలింద్ 11 పరుగులకే వెనుదిరగగా.. వరంగల్ బౌలర్ల ధాటికి విశాల్ యాదవ్ (0), విద్యానంద రెడ్డి (6), సాయి వెంకట్ ధాత్రక్ (2), మహేశ్ విప్పర్ల (1) పెవిలియన్‌కు వరుసకట్టారు. వేద్ రెడ్డి అమిస్తాపురం 5 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా ఖమ్మం 19.2 ఓవర్లలో 202 పరుగులు చేసి ఆలౌట్ అయింది. వరంగల్ బౌలర్లలో మహ్మద్ అబ్దుల్ మాలిక్, అభిషేక్ మూడేసి వికెట్లు కూల్చగా.. క్రాంతి పల్లెపాటి రెండు, మదస్సర్ హుసేన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.వరంగల్ ఘన విజయంలక్ష్య ఛేదనకు దిగిన వరంగల్ ఏడు బంతులు మిగిలి ఉండగానే.. కేవలం ఐదు వికెట్లు కోల్పోయి (208-5) పని పూర్తి చేసింది. హర్షిత్ చౌదరి మెరుపు సెంచరీ (62 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు: 121 రన్స్) చేసి ఒంటిచేత్తో వరంగల్‌ను గెలిపించాడు. మిగిలిన వారిలో రిషికేత్ సిసోడియా 27 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఖమ్మం బౌలర్లో సాకేత్ ధాత్రక్ రెండు వికెట్లు తీయగా.. సీవీ మిలింద్, మహేశ్ విప్పర్ల, వేద్ రెడ్డి తలా ఒక వికెట్ పడగొట్టారు.తుదిజట్లుఖమ్మం వాఫీ కచ్చీ, మయాంక్ గుప్త, సీవీ మిలింద్ (కెప్టెన్), హిమతేజ, మికిల్ జైస్వాల్, ప్రతీక్ రెడ్డి, సాయి వెంకట్ ధాత్రక్, విశాల్ యాదవ్, మహేశ్ విప్రాలా, వేద్‌రెడ్డి అమిస్తాపురం, విద్యానంద రెడ్డివరంగల్అమన్ రావు పేరాల (కెప్టెన్), భవేశ్ సేథ్ (వికెట్ కీపర్), రుషికేశ్ సిసోడియా, హర్షిత్ చౌదరి, అభిషేక్, మణి కిరణ్, షౌనక్ కులకర్ణి, హుసేన్, క్రాంతి పల్లెపాటి, శ్రీవాస్తవ టీపీ, అబ్దుల్ మాలిక్. -
‘భవిష్యత్తు బాగుంటుంది’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టి20 లీగ్ మున్ముందు పెద్ద స్థాయికి చేరే అవకాశం ఉందని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే తాము జత కట్టామని వరంగల్ వారియర్స్ సహ యజమాని వరుణ్ జూపల్లి అన్నారు. ఎంతో మంది ప్రతిభ గల యువ ఆటగాళ్లు సరైన అవకాశం ఎదురు చూస్తున్నారని, తొలి సీజన్లో ఇప్పటి వరకు లభిస్తున్న స్పందనను చూస్తే లీగ్ విజయవంతమైనట్లుగా చెప్పవచ్చని మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ‘మా సన్నిహితులు అమెరికాలోని మేజర్ క్రికెట్ లీగ్‌లోని ఒక జట్టులో సహ యజమానిగా ఉన్నారు. ఆ కారణంగా టీజీ టి20లో టీమ్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచన కలిగింది. క్రికెట్‌పై ఆసక్తితో పాటు మన వద్ద జరుగుతున్న టోర్నీలో భాగమైతే బాగుంటుందని ముందుకు వచ్చాం. ఇందులో లాభాల గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు. రాబోయే సీజన్లలో లీగ్ మరింత పెద్ద స్థాయికి చేరుతుంది’ అని వరుణ్ వ్యాఖ్యానించారు. టోర్నీలో తమ తొలి మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడినా... వరంగల్ టీమ్ అన్ని విధాలా పటిష్టంగా ఉందని వరుణ్ చెప్పారు. ముఖ్యంగా పేరాల అమన్ రావు అద్భుత ప్రదర్శనపై ఆయన ప్రశంసలు కురిపించారు. ‘అమన్ సూపర్ షాట్స్ ఆడాడు. సాధికారికంగా అతను బ్యాటింగ్ చేసిన తీరును చూస్తే ఐపీఎల్‌లోకి ఎందుకు ఎంపికయ్యాడో తెలుస్తుంది. అమన్ మాత్రమే కాకుండా ఇతర కుర్రాళ్లపై కూడా మాకు నమ్మకం ఉంది. లీగ్‌లో వారియర్స్ మంచి ఫలితాలు సాధించడం ఖాయం’ అని వరుణ్ వెల్లడించారు. బీసీసీఐ అనుమతించిన నిబంధనల ప్రకారం భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ ప్రస్తుతం విశ్రాంతిలో ఉండటంతో తొలి మ్యాచ్ ఆడలేదని... తర్వాతి మ్యాచ్‌లలో అతను బరిలోకి దిగుతాడని వరుణ్ స్పష్టం చేశారు. -
TG20 League 2026: తిలక్ వర్మ సూపర్ సెంచరీ
తెలంగాణ టీ20 లీగ్‌లో భాగంగా వరంగల్ వారియర్స్‌తో మ్యాచ్‌లో మెదక్ ఫాల్కన్స్ కెప్టెన్, టీమిండియా సూపర్ స్టార్ తిలక్ వర్మ శతక్కొట్టాడు. 259 పరుగుల భారీ లక్ష్య చేధనలో తిలక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఉప్పల్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో తిలక్ 42 బంతుల్లో తొలి టీజీ 20 సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 52 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 136 (నాటౌట్) పరుగులు చేసి తన జట్టును తిలక్ విజయ తీరాలకు చేర్చాడు. -
TG20 League: వైభవ్ టీమ్మేట్ విధ్వంసం.. 32 బంతుల్లోనే సెంచరీ
తెలంగాణ టీ20 లీగ్‌లో తొలి సెంచరీ నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ కెప్టెన్ అమన్‌రావు పేరాల విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి బౌలర్లను అమన్ ఉతికారేశాడు. మెదక్ కెప్టెన్ తిలక్ వర్మను కూడా అతడు విడిచిపెట్టలేదు. 7 ఓవర్ వేసిన తిలక్ బౌలింగ్‌లో అతడు 15 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో అమన్ రావు కేవలం 32 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా అమన్ 48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్‌లతో 142 పరుగులు చేసి ఔటయ్యాడు.కాగా అమన్‌రావ్ ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ క్యాంప్‌లో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. అమన్ రాజస్తాన్ తరపున అరంగేట్రం చేయనప్పటికి జోఫ్రా ఆర్చర్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్‌ను నెట్స్‌లో ఎదుర్కొన్న అనుభవం అతడికి బాగా కలిసొచ్చింది. వైభవ్ సూర్యవంశీ వంటి యువ సంచలనంతో కూడా డ్రెస్సింగ్ రూమ్‌ను అమన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు వైభవ్ తరహాలోనే టీజీ 20 లీగ్‌లో అమన్ దుమ్ములేపుతున్నాడు. -
TG20 League 2026: శతక్కొట్టిన తిలక్ వర్మ.. మెదక్ ఘన విజయం
తెలంగాణ టీ20 లీగ్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్, వరంగల్ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి.మెదక్ ఫాల్కన్స్ ఘన విజయంఉప్పల్ వేదికగా వరంగల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో మెదక్ ఫాల్కన్స్ ఘన విజయం సాధించింది. వరంగల్ నిర్ధేశించిన 259 పరుగుల భారీ లక్ష్యాన్ని మెదక్.. 7 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ తిలక్ వర్మ(55 బంతుల్లో 14 ఫోర్లు, 8 సిక్స్‌లతో 136) అజేయ సెంచరీతో తన జట్టును గెలిపించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన వరంగల్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. వరంగల్ బ్యాటర్లలో అమన్‌రావ్(48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్‌లతో 142) భారీ సెంచరీతో మెరిశాడు.విజయం దిశగా మెదక్మెదక్ విజయానికి 12 బంతుల్లో 20 పరుగులు కావాలి. 18 ఓవర్లకు స్కోర్: 239/6తిలక్ వర్మ సెంచరీమెదక్ కెప్టెన్ తిలక్ వర్మ 42 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 104 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. మొదక్ విజయానికి ఇంకా 24 బంతుల్లో 52 పరుగులు కావాలి.ఒకే ఓవర్లో రెండు వికెట్లు15 ఓవర్ వేసిన అసిఫ్ బౌలింగ్‌లో మెదక్ రెండు వికెట్లు కోల్పోయింది. అనిష్ రెడ్డి(2), సూర్యతేజ(0) వరుసగా ఔటయ్యారు. తిలక్ 99 పరుగులతో ఉన్నాడు.నాలుగో వికెట్ డౌన్19 పరుగులు చేసిన వరుణ్.. మురుగన్ అభిషేక్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మొదక్ మూడో వికెట్ డౌన్మెదక్ మూడో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన తెలుకుపల్లి తేజ.. కులకర్ణి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు మెదక్ స్కోర్: 159/4తిలక్ హాఫ్ సెంచరీమెదక్ కెప్టెన్ తిలక్ వర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. 23 బంతుల్లోనే మొదటి టీజీ20 ఆర్ధ శతకాన్ని నమోదు చేశాడు. 8 ఓవర్లకు మెదక్ స్కోర్: 104/2దూకుడుగా ఆడుతున్న తిలక్ వర్మ259 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మెదక్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి మెదక్ వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ(24), శృంజిత్(16) ఉన్నారు.వరంగల్ భారీ స్కోర్ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వరంగల్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. వరంగల్ బ్యాటర్లలో అమన్‌రావ్(48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్‌లతో 142) భారీ సెంచరీతో చెలరేగాడు. మెదక్ బౌలర్లలో తిలక్ వర్మ 2, మధుకర్ 2, సూర్యతేజ, రవి తేజ, రాహుల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.మూడో వికెట్ డౌన్వరంగల్ మూడో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన సిసోడియా తిలక్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.వరంగల్ రెండో వికెట్ డౌన్వరంగల్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 48 బంతుల్లో 142 పరుగులు చేసిన అమన్‌రావు పేరాల.. రాహుల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.లీగ్ తొలి సెంచరీఅమన్రావు 32 బంతుల్లో శతక్కొట్టాడు.వరంగల్ తొలి వికెట్ డౌన్వరంగల్ తొలి వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన హర్షిత్ చౌదరి.. సూర్యతేజ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8.2 ఓవర్లలో వరంగల్ స్కోర్: 134-1అమన్ ఫిప్టీవరంగల్ కెప్టెన్ అమన్ రావు పేరాల కేవలం 17 బంతుల్లోనే 6 ఫోర్లు, మూడు సిక్స్‌లతో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. దీంతో వరంగల్ స్కోర్ పవర్‌ప్లేలోనే వంద పరుగులు దాటింది.దంచికొడుతున్న వరంగల్ ఓపెనర్లువరంగల్ ఓపెనర్లు అమన్ రావు(22), హర్షిత్(21) దూకుడు ఆడుతున్నారు. 4 ఓవర్లు ముగిసే సరికి వరంగల్ వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది.తెలంగాణ టీ20 లీగ్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్, వరంగల్ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వరంగల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మెదక్ ఫాల్కన్స్ కెప్టెన్‌గా టీమిండియా సూపర్ స్టార్ తిలక్ వర్మ వ్యవహరిస్తున్నాడు.మరో భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్(వరంగల్) మాత్రం ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. టీజీ20 లీగ్ తొలి సీజన్ వేలంలో తిలక్‌ను రూ.33 లక్షల రికార్డు ధరకు మెదక్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తుదిజట్లు వరంగల్ వారియర్స్ అమన్‌రావు పేరాల (కెప్టెన్), హర్షిత్ చౌదరి, భావేశ్ సేథ్, రుషికేశ్ సిసోడియా, మురుగన్ అభిషేక్, ఆది మణికిరణ్, అనిరుధ్ శ్రీవాస్తవ టీపీ, మహ్మద్ ఆసిఫ్ మన్సూరి, షౌనక్ కులకర్ణి, మహ్మద్ ముదస్సర్ హుస్సేన్, క్రాంతి పల్లెపాటి.మెదక్ ఫాల్కన్స్ తిలక్ వర్మ (కెప్టెన్), రవితేజ టి, నమన్ అగర్వాల్, శృజిత్ రెడ్డి, విక్రం నాయక్ గగులోత్, నిమ్మగడ్డ సూర్యతేజ, సాయి వరుణ్ యెర్రమ్, నయని అనీశ్ రెడ్డి, కుంటా రాహుల్, ఘాజి అబ్బాస్ అబేది, మధుకర్ మన్నె.


