PC: TG20 X
తెలంగాణ టీ20 లీగ్‌లో భాగంగా వరంగల్ వారియర్స్‌తో మ్యాచ్‌లో మెదక్ ఫాల్కన్స్ కెప్టెన్, టీమిండియా సూపర్ స్టార్ తిలక్ వర్మ శతక్కొట్టాడు. 259 పరుగుల భారీ లక్ష్య చేధనలో తిలక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఉప్పల్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో తిలక్ 42 బంతుల్లో తొలి టీజీ 20 సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 52 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 136 (నాటౌట్) పరుగులు చేసి తన జట్టును తిలక్ విజయ తీరాలకు చేర్చాడు.


