తిలక్ వర్మకు అంత సీన్ లేదు..! భారత మాజీ క్రికెటర్‌ సంచలన కామెంట్స్! | Kris Srikkanth speaks on Tilak Varma, amid Mumbai Indians' captaincy conundrum | Sakshi
Sakshi News home page

IPL 2027: తిలక్ వర్మకు అంత సీన్ లేదు..! భారత మాజీ క్రికెటర్‌ సంచలన కామెంట్స్!

Nov 2 2026 9:24 PM | Updated on Nov 2 2026 9:26 PM

Kris Srikkanth speaks on Tilak Varma, amid Mumbai Indians' captaincy conundrum

PC: BCCI/X

ఐపీఎల్‌-2027 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ జట్టు నాయకత్వ బాధ్యతలను హైదరాబాదీ తిలక్ వర్మకు అప్పగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై వేటు వేసేందుకు ఫ్రాంచైజీ సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుండగా, రోహిత్ శర్మ తిరిగి సారథ్య బాధ్యతలు చేపడతారని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత కొన్ని సీజన్లుగా తిలక్ వర్మ ముంబై జట్టు తరఫున నిలకడగా రాణించడం లేదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.

"ముంబై ఇండియన్స్‌కు తిలక్ వర్మ కెప్టెన్ కాకపోయినా వైస్ కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. అయితే అతడు జట్టు తరఫున అంత నిలకడగా రాణించలేకపోతున్నాడు. గతేడాది ఒక సెంచరీ మినహాయిస్తే సీజన్ మొత్తం విఫలమయ్యాడు. గత రెండు మూడేళ్లలో తిలక్ ప్రదర్శన అంత మెచ్చుకోదగ్గ స్థాయిలో లేదు. ఒక మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడి, ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విఫలం కావడమే అతడి ట్రెండ్‌గా మారింది" అని శ్రీకాంత్‌ పేర్కొన్నాడు.

అంతేకాకుండా టీ20 ప్రపంచకప్ అందించిన సూర్యకుమార్ యాదవ్ పేరు కెప్టెన్సీ చర్చల్లో లేకపోవడంపై శ్రీకాంత్ విస్మయం వ్యక్తం చేశాడు. "భారత్‌కు వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్ అయినప్పటికీ, సూర్యకుమార్ యాదవ్ పేరును ఎవరూ ప్రస్తావించకపోవడం బాధాకరం" అని అతడు వ్యాఖ్యానించాడు.
చదవండి: Asia Cup: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా తిలక్ వర్మ! వైభ‌వ్‌కు చోటు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement