Photo Credit: Twitter
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ యాజమాన్యం జట్టు మేనేజ్‌మెంట్ విషయంలో కీలక మార్పులు చేస్తూ వస్తోంది. ఇప్పటికే హెడ్‌కోచ్‌గా కీరన్ పొలార్డ్‌ను ఎంచుకున్న ముంబై బౌలింగ్ కోచ్ మలింగతో పాటు మిగిలిన బృందంతోనూ తెగదెంపులు చేసుకుంది. తాజాగా పొలార్డ్ సారథ్యంలోని కొత్త కోచింగ్ బృందం వివరాలను ప్రకటించింది.
ఈ నేపథ్యంలో జట్టు బ్యాటింగ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పను నియమించింది. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్‌లో రాబిన్ ఊతప్ప ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. ఇప్పుడు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కోచ్‌గా మళ్లీ అదే జట్టుతో కలిసి పనిచేయనున్నాడు.
ఇంతకు ముందు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న కీరన్ పొలార్డ్‌ను ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా పదోన్నతి కల్పించిన సంగతి తెలిసిందే. ఇక బౌలింగ్ కోచ్‌గా మలింగ స్థానంలో మాజీ ఆటగాడు మిచెల్ మెక్‌క్లీగన్‌ను నియమించింది. ఫీల్డింగ్ కోచ్‌గా దిలీప్, డెవలప్‌మెంట్ బౌలింగ్ కోచ్‌గా ధవళ్ కులకర్ణిలను ఎంపిక చేసింది.
ఇక 2007లో టీ20 ప్రపచంకప్ గెలిచిన టీమిండియాలో సభ్యుడిగా ఉన్న రాబిన్ ఊతప్ప.. ఐపీఎల్‌లోనూ రెండుసార్లు టైటిల్ గెలిచిన జట్లలో సభ్యుడిగా ఉన్నాడు. 2008లో ముంబై ఇండియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన రాబిన్ ఊతప్ప ఆ తర్వాత పలు జట్లకు ఆడాడు. 2014 ఐపీఎల్ విజేతగా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలవడంలో రాబిన్ ఊతప్ప కీలకపాత్ర పోషించాడు.
ఆ సీజన్‌లో 660 పరుగులు చేసిన ఊతప్ప ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. 2022లో సీఎస్‌కే ఐపీఎల్ టైటిల్ నెగ్గగా.. ఆ జట్టులోనూ ఊతప్ప సభ్యుడిగా ఉండడం విశేషం. 2022లో ఊతప్ప ఐపీఎల్‌కు క్రికెటర్‌గా రిటైర్మెంట్ ప్రకటించాడు.
బౌలింగ్ కోచ్‌గా మెక్‌క్లీగన్..
ఇక బౌలింగ్ కోచ్‌గా ఎంపికైన మిచెల్ మెక్‌క్లీగన్ 2015 నుంచి 2020 మధ్య ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్‌యం వహించాడు. నాలుగు ఐపీఎల్ టెటిల్స్ నెగ్గిన ముంబై జట్టులో ఆటగాడిగా ఉన్నాడు. టీమిండియాకు విజయవంతమైన ఫీల్డింగ్ కోచ్‌గా పేరున్న టి.దిలీప్ 2024, 2026 టీ20 ప్రపంచకప్‌లను భారత్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక 2013, 2020లో ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టులో ధవళ్ కులకర్ణి సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే.
ముంబై కొత్త కోచింగ్ టీమ్ వివరాలు..
హెడ్ కోచ్: కీరన్ పొలార్డ్
బ్యాటింగ్ కోచ్: రాబిన్ ఊతప్ప
బౌలింగ్ కోచ్: మిచెల్ మెక్‌క్లీగన్
ఫీల్డింగ్ కోచ్: టి. దిలీప్
డెవలప్‌మెంట్ బౌలింగ్ కోచ్: ధవళ్ కులకర్ణి
Mumbai Indians today announced the appointment of Robin Uthappa as Batting Coach, Mitchell McClenaghan as Bowling Coach, T. Dilip as Fielding Coach and Dhawal Kulkarni as Development Bowling Coach for the upcoming IPL 2027 season. They will join Head Coach Kieron Pollard as part of a new-look coaching group that brings together a strong understanding of the Mumbai Indians culture, extensive international experience and a shared commitment to developing talent and delivering success. https://t.co/cA7yI5Khpk
— Mumbai Indians (@mipaltan) October 30, 2026
ఇదీ చదవండి: 20వేల కోట్లు.. ముంబై ఇండియన్స్ సరికొత్త రికార్డు


