source: X
ఐపీఎల్ 2027కు సంబంధించి బిగ్ అప్‌డేట్స్ వచ్చాయి. మినీ వేలం, రిటెన్షన్ జాబితాల సమర్పణకు తేదీలు ఖరారయ్యాయి. వేలం డిసెంబర్ 16న గోవాలో జరుగనుండగా.. పది ఫ్రాంచైజీలు తమ రిటైన్, విడుదల చేసే ఆటగాళ్ల జాబితాలను నవంబర్ 15లోపు సమర్పించాలి.
మూడు వరుస సీజన్లుగా విదేశాల్లో నిర్వహించిన వేలం ఈసారి భారత్‌కు తిరిగి రానుంది. రిటెన్షన్ జాబితాల ప్రకటన తర్వాత ఆయా జట్ల వద్ద మిగిలే పర్స్, ఖాళీ స్థానాలపై స్పష్టత రానుంది.
ఇప్పటికే ట్రేడ్ విండోలో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. రిషభ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు చేరగా, కుల్దీప్ యాదవ్ లక్నోకు వెళ్లాడు. మరో ఒప్పందంలో టీ. నటరాజన్ ఢిల్లీ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మారగా, జీషన్ అన్సారీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు చేరాడు. ఐపీఎల్ 2027 సీజన్ ప్రారంభ తేదీలను ఇంకా ప్రకటించలేదు.
ఇదీ చదవండి: సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ..!


