breaking news
IPL 2027
-
జట్టు మారనున్న జైస్వాల్!.. స్పందించిన రాజస్తాన్ రాయల్స్
ఐపీఎల్-2027 వేలానికి ముందే పలువురు స్టార్ క్రికెటర్ల ట్రేడింగ్ జరుగనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈసారి జట్టు మారడం ఖాయమనే ఊహాగానాలు వస్తుండగా.. అలాంటిదేమీ లేదని యాజమాన్యం పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది.అయినప్పటికీ వదంతులు మాత్రం ఆగటం లేదు. హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్ లేదంటే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో చేరతాడనే ప్రచారం జరుగుతోంది. దీనితో పాటు రాజస్తాన్ రాయల్స్‌తో ముంబై చర్చలు జరుపుతోందని.. హార్దిక్‌ను ఇచ్చి అతడికి బదులు యశస్వి జైస్వాల్‌ను తీసుకోనుందనే రూమర్లు వినిపిస్తున్నాయి.రాయల్స్ తరఫున అరంగేట్రంకాగా 2020లో రాజస్తాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసిన జైస్వాల్.. తన అద్భుతమైన ఆట తీరుతో పోస్టర్ బాయ్‌గా మారిపోయాడు. ఈ క్రమంలోనే టీమిండియా తరఫున అరంగేట్రం చేసి టెస్టుల్లో ఓపెనర్‌గా పాతుకుపోయాడు. అయితే, వైభవ్ సూర్యవంశీ వచ్చిన తర్వాత జైస్వాల్ ఒత్తిడికి లోనవుతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.జైసూ ‘స్థానాన్ని’ ఆక్రమించేసిన వైభవ్?ముఖ్యంగా ఐపీఎల్-2026లో పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ ఏకంగా అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ గెలవడం జైసూను ఒత్తిడిలోకి నెట్టేసిందని పలువురు మాజీ క్రికెటర్లు పేర్కొన్నారు. ఓపెనర్లుగా జైస్వాల్ కాస్త ఆచితూచి ఆడగా.. వైభవ్ మాత్రం దూకుడుగా ఆడుతూ రోజురోజుకీ తన గ్రాఫ్ పెంచుకుంటూ పోతున్నాడు. రాయల్స్ జట్టుకు ప్రధాన గుర్తింపుగా పేరు తెచ్చుకుంటున్నాడు.అసంతృప్తి.. ఒత్తిడి?మరోవైపు.. 2026కు ముందు రాజస్తాన్ తమ కెప్టెన్ సంజూ శాంసన్‌ను చెన్నైకి ట్రేడ్ చేసింది. అతడి స్థానంలో జైస్వాల్కే పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. కానీ రియాన్ పరాగ్ వైపే మొగ్గుచూపిన యాజమాన్యం జైస్వాల్‌ను కెప్టెన్సీ రేసు నుంచి పక్కనపెట్టింది. ఓవైపు కెప్టెన్సీ విషయంలో అసంతృప్తిగా ఉన్న జైసూ.. మరోవైపు వైభవ్ విషయంలో ఒత్తిడికి లోనవుతున్న నేపథ్యంలో జట్టును వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.జైస్వాల్ మావాడుఈ విషయంపై రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ అధికారి ఒకరు తాజాగా స్పందించారు. తమకైతే జైస్వాల్‌ను వదులుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకైతే జట్టు మార్పు గురించి జైస్వాల్ మాతో ఏమీ చర్చించలేదు.వచ్చే సీజన్లో అతడిని దృష్టిలో పెట్టుకునే మేము ప్రణాళికలు రచించుకుంటున్నాము. అయితే, కొన్ని వదంతులు మా దాకా వచ్చాయి. మేము మాత్రం జైస్వాల్‌ను మా ప్లేయర్‌గానే భావిస్తున్నాము. అతడు మా ఆటగాడు’’ అని సదరు అధికారి పేర్కొన్నారు. మరి ఇంతకు జైస్వాల్ తనకు తొలి అవకాశం ఇచ్చిన రాయల్స్‌తో కొనసాగుతాడా?.. మీకో దండం అంటూ కొత్త దారి వెతుక్కుంటూ ఫ్రాంఛైజీ మారతాడా? అనేది త్వరలోనే తేలనుంది.చదవండి: శ్రీలంక ఆలౌట్.. ఫాలో ఆన్ ఆడిస్తున్న టీమిండియా!.. ఫాలో ఆన్ అంటే? -
ఆ నలుగురికే కాదు.. అందరికీ తెలియాల్సిందే: గావస్కర్
ఐపీఎల్ 2027 వేలానికి ఇంకా దాదాపు నాలుగు నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే ఆటగాళ్ల ట్రేడింగ్‌పై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టు మారబోతున్నాడే ప్రచారం జోరుగా సాగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తప్ప.. మిగిలిన ఫ్రాంఛైజీలన్నీ హార్దిక్ కోసం పోటీలో ఉన్నాయని ఆకాశ్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు అంటున్నారు.అయితే, ముంబై యాజమాన్యం మాత్రం ఇంతవరకు హార్దిక్ ట్రేడింగ్ విషయంలో ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ లేదంటే కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఈ ఆల్‌రౌండర్ చేరడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇలాంటి తరుణంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి కీలక విజ్ఞప్తి చేశాడు. ఐపీఎల్ ట్రేడింగ్ విషయంలో పారదర్శకత పాటించాలని సూచించాడు. ‘‘వేలానికి ముందు ఆటగాళ్లు ఒక ఫ్రాంఛైజీ నుంచి మరో ఫ్రాంఛైజీకి మారే అంశం గురించి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.అయితే, ఈ విండో పూర్తి కావడానికి ఇంకా సమయం ఉంది. సమయం వచ్చినపుడు ఏ ఆటగాడు ఏ జట్టు నుంచి మరే జట్టుకు మారుతున్నాడో ఫ్రాంఛైజీలు అధికారికంగా ప్రకటిస్తున్నాయి. కానీ ఎంతకు ట్రేడింగ్ (ధర) జరిగిందన్న విషయం మాత్రం బహిర్గతం కావడం లేదు.సదరు ఆటగాడు, బీసీసీఐ, రెండు ఫ్రాంఛైజీల వద్ద మాత్రమే ఆ సమాచారం ఉంటోంది. అలాంటపుడు ఫ్రాంఛైజీలు తమ సాలరీ క్యాప్‌నకు సంబంధించిన నిబంధనలు పాటిస్తున్నాయా? లేదంటే ఉల్లంఘిస్తున్నాయా? అన్న విషయం ఎలా తెలుస్తుంది. అందుకే ట్రేడింగ్ విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలి. ఆ నంబర్లను కూడా బహిరంగంగా ప్రకటించాలి.ఫ్రాంఛైజీలు జవాబుదారీతనం పాటించేలా చూడాలి. ప్రపంచంలోనే ఐపీఎల్ అత్యంత గొప్ప లీగ్‌గా కొనసాగుతోంది. ఇలాంటి టోర్నీలో పారదర్శకతకు పెద్దపీట వేయకపోతే.. విమర్శలు వచ్చే అవకాశం ఉంది’’ అని సునిల్ గావస్కర్ మిడ్-డేకు రాసిన కాలమ్‌లో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. -
కావ్య పాప మాస్టర్ ప్లాన్.. SRHలోకి హార్దిక్!
-
ఎస్ఆర్హెచ్ కీలక నిర్ణయం..!? ఆ ఐదుగురికి గుడ్‌బై?
ఐపీఎల్-2027 సీజన్ మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బాటలోనే ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ కూడా తమ ఆటగాళ్లకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్దమైనట్లు సమాచారం. ఆటగాళ్ల ఫిట్నెస్ స్ధాయిలను అంచనా వేసి వారిని జట్టులో కొనసాగించాలా? లేదా వేలంలోకి విడిచిపెట్టాలా? అని సన్‌రైజర్స్ నిర్ణయం తీసుకోనుంది. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ గత 12 ఏళ్లగా తమ రెండో టైటిల్ కోసం వేట కొనసాగిస్తోంది. 2016 సీజన్లో ఛాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా విజతేగా నిలవలేదు. ఆరెంజ్ ఆర్మీ 2018, 2024 సీజన్లలో ఫైనల్‌కు చేరినప్పటికి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఐపీఎల్-2026లో ప్లేఆఫ్స్‌లోనే తమ ప్రయాణాన్ని ముగించింది. దీంతో ఐపీఎల్-2027 కోసం బలమైన జట్టును సిద్దం చేయాలని ఆరెంజ్ ఆర్మీ యాజమాన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఫిట్నెస్, ఫామ్, ప్రెస్ అధారంగా ఐపీఎల్-2027 మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ విడిచిపెట్టేందుకు అస్కారమున్న ఐదుగురు ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.శివమ్ మావిఐపీఎల్-2026 వేలంలో శివమ్ మావిని సన్‌రైజర్స్ రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ అతడు తొడ కండరాల గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి ఫిట్‌నెస్‌పై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ వంటి యువ పేసర్లు రాణిస్తుండడంతో పదేపదే గాయపడే మావిని సన్‌రైజర్స్ జట్టు నుంచి రిలీజ్ చేసే అవకాశముంది.జాక్ ఎడ్వర్డ్స్బిగ్బాష్ లీగ్-2026లో అదరగొట్టిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్‌ను రూ.3 కోట్లకు సన్‌రైజర్స్ సొంతం చేసుకుంది. కానీ అతడు పాదం గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత పునరాగమనంలో దారుణంగా విఫలమయ్యాడు. మేజర్ లీగ్ క్రికెట్-2026లో ఎడ్వర్డ్స్ వాషింగ్టన్ ఫ్రీడమ్ తరఫున కేవలం 12 పరుగులు మాత్రమే చేసి, బౌలింగ్‌లో 10.12 ఎకానమీతో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతడిని ఎస్ఆర్హెచ్ జట్టులో కొనసాగించే అవకాశాలు తక్కువ.డేవిడ్ పేన్జాక్ ఎడ్వర్డ్స్ స్థానంలో ప్రత్యామ్నాయంగా వచ్చిన ఇంగ్లండ్ వెటరన్ పేసర్ డేవిడ్ పేన్(రూ.1.5 కోట్లు) కూడా రెండు మ్యాచ్‌లకే గాయం బారిన పడ్డాడు. కాలిమడమ గాయంతో అతడు సీజన్ మధ్యలోనే వైదొలిగాడు. ఈ క్రమంలో వయసు, ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా పేన్కు కూడా ఎస్ఆర్హెచ్ గుడ్‌బై చెప్పే అవకాశముంది. అతడి స్ధానంలో మరో యువ పేసర్‌ను వెతికే పనిలో సన్‌రైజర్స్ పడింది.హర్షల్ పటేల్ ఐపీఎల్లో రెండు సార్లు పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచిన భారత వెటరన్ పేసర్ హర్షల్ పటేల్.. గత రెండు సీజన్లగా మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు. ఐపీఎల్-2025 వేలంలో అతడిని రూ. 8 కోట్ల భారీ ధరకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. కానీ అతడు మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. అతడి కంటే యువ పేసర్లు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్‌లు అద్భుతంగా రాణించారు. దీంతో అతడిని వేలంలో విడిచిపెట్టి ఆ మొత్తాన్ని యువ ఆటగాళ్లపై ఖర్చు చేయాలని సన్‌రైజర్స్ ప్రణాళికలు రచిస్తోంది.లియామ్ లివింగ్స్టోన్ఐపీఎల్-2026 వేంలో ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌పై ఎస్ఆర్హెచ్ భారీ ధర వెచ్చింది. రూ.13 కోట్లకు అతడిని సొంతం చేసింది. కానీ అతడికి సీజన్ మొత్తంలో కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడే అవకాశం లభించింది. ఆ రెండు మ్యాచ్‌ల్లో కూడా లివింగ్‌స్టోన్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతడిని విడిచిపెట్టి వేలంలో ఇతర విదేశీ ఆల్రౌండర్లపై దృష్టి పెట్టే యోచనలో ఎస్ఆర్హెచ్ ఉంది. -
వైభవ్ కాదు!.. ఈ యువ ఆటగాడికి భారీ డిమాండ్!
ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఇప్పటికే 2027 సీజన్ కోసం కసరత్తు మొదలుపెట్టేశాయి. ముఖ్యంగా మినీ వేలం నేపథ్యంలో ట్రేడ్ విండో ఓపెన్ కావడంతో తమకు కావాల్సిన ఆటగాళ్లను చేర్చుకునే విధంగా చర్చలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా పేరు హైలైట్ అవుతోంది.హార్దిక్ కోసం దాదాపు ఎనిమిది ఫ్రాంఛైజీలు ముంబై ఇండియన్స్‌తో బేరానికి దిగినట్లు తెలుస్తోంది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఒకటి. అయితే, ఆటగాళ్ల మార్పిడిలో భాగంగా చెన్నై జట్టులోని ఓ యువ ఆటగాడి కోసం ముంబై పట్టుబడుతున్నట్లు సమాచారం.కెప్టెన్‌గా భారత్‌కు అండర్-19 ప్రపంచకప్ అందించిన ఆయుశ్ మాత్రేను దక్కించుకోవాలని ముంబై పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ముంబైతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీలు కూడా ఈ యువ ఓపెనర్ కోసం గాలం వేసినట్లు తెలుస్తోంది.గుజరాత్ టైటాన్స్.. ఆయుశ్ కోసం వాషింగ్టన్ సుందర్‌ను చెన్నైకి ఆఫర్ చేయగా.. లక్నో షాబాజ్ అహ్మద్‌ను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఢిల్లీ అశుతోశ్ శర్మ లేదంటే టి. నటరాజన్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. సన్‌రైజర్స్ ఆయుశ్ కోసం సలీల్ అరోరాను త్యాగం చేసేందుకు సిద్ధమైందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే.. చెన్నై హార్దిక్‌కు బదులుగా ముంబైకి శివం దూబే, డెవాల్డ్ బ్రెవిస్‌ను ఇస్తామని.. చెప్పగా ముంబై మాత్రం ఆయుశ్‌ను కూడా అడిగినట్లు తెలుస్తోంది. అయితే, చెన్నై జట్టు మాత్రం ఆయుశ్‌ను తమ దీర్ఘకాలిక ఆస్తిగా భావిస్తూ ముంబైతో పాటు.. ఇతర ఫ్రాంఛైజీల ఆఫర్లను తిరస్కరించినట్లు తమిళ మీడియా పేర్కొంది. ఇక హార్దిక్‌కు ఇచ్చినందుకు మూల్యంగా దూబే, బ్రెవిస్‌లతో పాటు అదనంగా రూ. 10 కోట్లు ఇచ్చేందుకు చెన్నై ఫ్రాంఛైజీ సుముఖంగా ఉన్నట్లు సమాచారం.ఆయుశ్‌కు అంత డిమాండ్ ఉందా?దేశీ క్రికెట్లో ముంబైకి ఆడుతున్న ఆయుశ్ మాత్రే 2025లో ఐపీఎల్లో చెన్నై తరఫున అరంగేట్రం చేశాడు. గతేడాది ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి 240 పరుగులు సాధించాడు. ఇక తాజా ఎడిషన్‌లోనూ ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి 201 పరుగులు చేశాడు.అయితే, దురదృష్టవశాత్తూ గాయపడి టోర్నీ మధ్యలోనే జట్టుకు దూరమయ్యాడు ఆయుశ్. ఇప్పటి వరకు చెన్నై తరఫున మొత్తంగా 13 మ్యాచ్‌లలో కలిపి 441 పరుగులు చేసిన 19 ఏళ్ల ఆయుశ్.. స్ట్రైక్‌రేటు 177కు పైగానే ఉంది. రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు, టీమిండియా నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ మాదిరి దూకుడుగా ఆడగల సత్తా ఆయుశ్‌కు ఉంది. -
IPL 2027: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తిలక్ వర్మ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన తొలి జట్టు ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ట్రోఫీని ముద్దాడింది.అయితే, అనూహ్య రీతిలో 2024 సీజన్‌కు ముందు రోహిత్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది యాజమాన్యం. హిట్‌మ్యాన్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న తమ మాజీ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. అయితే, రోహిత్‌పై వేటు వేసి.. పాండ్యాను కెప్టెన్ చేయడాన్ని సొంతజట్టు అభిమానులే జీర్ణించుకోలేకపోయారు.ఘోర పరాజయాలుహార్దిక్తో పాటు ముంబై యాజమాన్యాన్నీ భారీ ఎత్తున ట్రోల్ చేశారు. అందుకు తగ్గట్లుగానే 2024లో ముంబై ఘోర పరాజయాలు చవిచూసింది. పద్నాలుగింట కేవలం నాలుగు గెలిచి అట్టడుగున పదోస్థానంలో నిలిచింది. అయితే, గతేడాది మాత్రం ప్లే ఆఫ్స్ చేరి పరువు నిలబెట్టుకుంది.కానీ తాజా సీజన్లో మాత్రం మళ్లీ పాత కథే పునరావృతమైంది. ఐపీఎల్-2026లో ముంబై పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచి తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అతడిని తొలగించాలనే డిమాండ్లు పెరిగాయి.జట్టును వీడుతున్న హార్దిక్ఈ క్రమంలో హార్దిక్ సైతం ముంబై జట్టును వీడేందుకు సిద్ధమయ్యాడు. అతడిని ట్రేడ్ చేసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. చెన్నై జట్టుతో చేరేందుకు హార్దిక్ కూడా ఇంట్రస్ట్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ ఎవరా అన్న చర్చ మొదలైంది. ఈ విషయం గురించి వచ్చే వారానికల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా అందించిన కథనం ప్రకారం.. 2026లో జట్టు ప్రదర్శన గురించి హెడ్‌కోచ్ మహేళ జయవర్దనెతో వచ్చేవారం ముంబై యాజమాన్యం సమీక్ష నిర్వహించనుంది.కెప్టెన్‌గా తిలక్ వర్మ!హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ అంశంతో పాటు.. కొత్త కెప్టెన్‌గా ఎవరిని నియమించాలన్న విషయం గురించి కూడా మేనేజ్మెంట్ చర్చించనుంది. కెప్టెన్సీ రేసులో టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు.. టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.అనుభవం, ప్రతిభ పరంగా బుమ్రావైపే యాజమాన్యం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అయితే, ఈ పేస్‌బౌలర్ తరచూ గాయాల బారిన పడటం ఆందోళనకరంగా పరిణమించింది. ఇక యువ ఆటగాడికి పగ్గాలు అప్పగించాలనుకుంటే మాత్రం తిలక్ వర్మనే కెప్టెన్‌గా ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది.బుమ్రాను కాదని తిలక్‌కు ఇస్తారా?తిలక్ చుట్టూ కొత్త జట్టును నిర్మించాలని యాజమాన్యం యోచిస్తున్నట్లు సమాచారం. కాగా 2022లో ముంబై జట్టుతో చేరిన ఈ హైదరాబాదీ స్టార్.. ప్రతి సీజన్లోనూ ఇప్పటికి 300కు పైగా పరుగులు చేశాడు. అయితే, ఇటీవల.. ముఖ్యంగా టీమిండియా టీ20 వైస్ కెప్టెన్‌గా నియమితుడైన తర్వాత తిలక్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న అతడిని జట్టు నుంచే తొలగించాలంటూ క్రిష్ణమాచారి శ్రీకాంత్ వంటి మాజీ క్రికెటర్లు డిమాండ్ చేశారు. అయితే, ఇంగ్లండ్‌తో ఐదో టీ20 సందర్భంగా తిలక్ మెరుపు అర్ధ శతకం (25 బంతుల్లో 53)తో రాణించాడు. కానీ ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన టీమిండియా.. ఇంగ్లండ్ చేతిలో 4-0తో క్లీన్‌స్వీప్ అయింది.చదవండి: IND vs ENG: అతడిని ఆరో స్థానంలో ఆడిస్తారా? -
రహానేపై వేటు.. కేకేఆర్ కెప్టెన్‌గా విధ్వంసకర ప్లేయర్!
ఐపీఎల్-2027 సీజన్ ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ అజింక్య రహానేపై వేటు వేసేందుకు కేకేఆర్ సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి. రహానే సారథ్యంలోని కోలకతా జట్టు వరుసగా 2025, 2026 సీజన్లలో ప్లేఆఫ్స్ చేరడంలో ఆ జట్టు విఫలమైంది.ఐపీఎల్-2024లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టైటిల్ గెలిచినప్పటికీ.. ఆ మరుసటి ఏడాది అతడిని వదిలేసి కేకేఆర్ భారీ తప్పిదం చేసింది. అతడి స్ధానంలో జట్టు బాధ్యతలు చేపట్టిన రహానే ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. కేవలం కెప్టెన్సీ పరంగా మాత్రమే కాదు వ్యక్తిగత ప్రదర్శనల పరంగా కూడా విఫలమయ్యాడు. దీంతో వచ్చే సీజన్ మినీ వేలానికి ముందు రహానే విడిచిపెట్టాలని కేకేఆర్ యోచిస్తుందంట.హార్దిక్‌పై కన్ను?అతడి స్ధానంలో ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకోవాలని కేకేఆర్ యాజమాన్యం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముంబై ఇండియన్స్ నుంచి హార్దిక్‌ను భారీ ట్రేడ్ డీల్ ద్వారా సొంతం చేసుకుని.. ఆపై తమ జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని కేకేఆర్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2027 వేలానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ కోల్‌కతా మాత్రం ఇప్పటి నుంచి తమ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ నుంచి బయటకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు ఐపీఎల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జట్టులోని సీనియర్ ఆటగాళ్లతో పాటు యాజమాన్యంతో కూడా పాండ్యాకు విబేధాలు తలెత్తినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరగుతోంది. ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్‌ను అరంగేట్ర సీజన్లోనే ఛాంపియన్స్‌గా నిలిపిన హార్దిక్.. ఆ తర్వాత సీజన్లో రన్నరప్‌గా నిలిచాడు. కానీ ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు పాండ్యా ముంబై ఇండియన్స్‌కు ట్రేడ్ అయ్యాడు. అప్పటివరకు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మను తప్పించి తమ జట్టు పగ్గాలను పాండ్యా ముంబై మేనెజ్మెంట్ అప్పగించింది. అతడి సారథ్యంలోని ముంబై ఇండియన్స్ గత మూడు సీజన్లలో కేవలం ఒక్కసారి మాత్రమే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. మిగిలిన రెండు సీజన్లనూ పాయింట్ల పట్టికలో చివరి స్ధానాలకే పరిమితమైంది. ఈ క్రమంలో హార్దిక్‌పై ముంబై మేనెజ్మెంట్ తీవ్ర ఆసంతృప్తితో ఉందంట.చదవండి: ‘నిన్ను ఆడించడం కుదరదని అతడికి చెప్పేయండి’ -
ఆ రెండు జట్లకు మాత్రం అతడు అక్కర్లేదు!
ఐపీఎల్-2027 సీజన్ వేలం నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి చర్చలు కొనసాగుతున్నాయి. వేలానికి ముందే ముంబై ఇండియన్స్ అతడిని ట్రేడ్ చేసేందుకు సుముఖంగా ఉందని సమాచారం. ఈ క్రమంలో దాదాపుగా ఏడు జట్లు హార్దిక్ పాండ్యా కోసం ముంబై యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.ఆ రెండు జట్లకు అతడు అక్కర్లేదు!ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘హార్దిక్ పాండ్యాను సొంతం చేసుకునేందుకు దాదాపుగా అన్ని జట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, రెండు జట్లు మాత్రం అతడిని అస్సలు కోరుకోవడం లేదట. ఒకటి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. రెండు సన్‌రైజర్స్ హైదరాబాద్.ఈ రెండూ తప్ప అన్ని జట్లు.. ఆఖరికి గుజరాత్ టైటాన్స్ కూడా హార్దిక్ పట్ల ఆసక్తి చూపడం నిజంగా విశేషమే. నాకిది ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది కూడా!.. ఒకవేళ కోల్‌కతా నైట్ రైడర్స్ ముంబైతో సంప్రదింపులు జరిపినట్లయితే.. ముంబైకి ఓపెనర్ అవసరం లేదు.రింకూ సింగ్‌ను ఇవ్వాల్సి ఉంటుందివాళ్లకు హార్దిక్ మాదిరి లోయర్ ఆర్డర్లో రాణించగల ఆటగాడు కావాలంటే.. రింకూ సింగ్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, హార్దిక్ బదులు రింకూను డైరెక్ట్‌గా స్వాప్ చేయలేరు. రింకూతో పాటు హర్షిత్ రాణా లేదంటే వరుణ్ చక్రవర్తిని కోల్‌కతా ముంబైకి ఇవ్వాల్సి ఉంటుంది.అలా కాదంటే.. హర్షిత్ రాణా- అనుకుల్ రాయ్‌ను ఇచ్చేసి హార్దిక్‌ను అడగవచ్చు. ఇక మూడో ఆప్షన్.. రింకూ- అనుకుల్ రాయ్. ఒకవేళ లక్నో సూపర్ జెయింట్స్ కూడా రంగంలో ఉందంటే.. వాళ్లు నికోలస్ పూరన్ ఒక్కడిని ఇచ్చి హార్దిక్‌ను తీసుకోవచ్చు.అక్షర్‌ను అంత తేలికగా వదులుకోరుఇక ఢిల్లీ క్యాపిటల్స్ హార్దిక్‌ను కోరుకుంటే.. వాళ్లు అక్షర్ పటేల్‌తో పాటు అశుతోశ్ శర్మను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వాళ్లు అక్షర్‌ను అంత తేలికగా వదులుకోరు. పంజాబ్ కింగ్స్ విషయానికొస్తే.. హార్దిక్ కోసం వాళ్లు ఏకంగా అర్ష్‌దీప్ సింగ్నే త్యాగం చేయాల్సి రావొచ్చు.అయితే, అర్ష్‌కు బదులు నేహాల్ వధేరా- శశాంక్ సింగ్‌లను ఇస్తామని చెప్పవచ్చు. రాజస్తాన్ రాయల్స్ గనుక బరిలో ఉంటే.. యశస్వి జైస్వాల్ కోరుకుంటే అతడిని ముంబైకి ఇచ్చేయవచ్చు. కానీ అతడు ఓపెనర్ కాబట్టి ముంబై ఆసక్తి చూపకపోవచ్చు.చెన్నై విషయానికొస్తే..గుజరాత్ హార్దిక్‌ను కోరుకుంటే.. ముంబై అతడికి బదులు రషీద్ ఖాన్‌ను అడగవచ్చు. లేదంటే కగిసో రబడను కూడా కోరవచ్చు. కానీ గుజరాత్ అందుకు అంగీకరించడం కష్టమే. ఇక చెన్నై విషయానికొస్తే.. శివం దూబేతో పాటు ఖలీల్ అహ్మద్‌ను హార్దిక్ బదులుగా ఇచ్చేయాల్సి రావొచ్చు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా కెరీర్ ఆరంభం నుంచి చాలా ఏళ్ల పాటు ముంబైకి ఆడిన హార్దిక్ పాండ్యాను ఫ్రాంఛైజీ 2022లో వదిలేసింది. దీంతో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ పిలిచి మరీ హార్దిక్‌ను కెప్టెన్ చేయగా.. తొలి సీజన్లోనే టైటిల్ అందించాడు. మరుసటి ఏడాది ఫైనల్‌కు తీసుకువెళ్లాడు.అయితే, 2024 వేలానికి ముందే హార్దిక్ ముంబైకి ట్రేడ్ అయ్యాడు. ఇక్కడ మూడు సీజన్లలో సారథిగా ఒక్కసారి మాత్రమే ప్లే ఆఫ్స్ చేర్చగా.. రెండుసార్లు దారుణంగా విఫలమయ్యాడు. దీంతో ముంబై అతడిని వదిలించుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.చదవండి: చరిత్ర సృష్టించిన రొనాల్డో -
కేకేఆర్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా?
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వచ్చే ఏడాది ఐపీఎల్లో కేకేఆర్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్లో కెప్టెన్‌గా, ఆటగాడిగా దారుణ ప్రదర్శన కనబరిచిన పాండ్యాను ముంబై ఇండియన్స్ రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేకేఆర్ యాజమాన్యం ఇప్పటికే హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ విషయమై ముంబై యాజమాన్యంతో చాలాసార్లు చర్చించినట్లు తెలుస్తోంది. ఒకవేళ హార్దిక్ పాండ్యా నగదు ఒప్పందం లేదా ఆటగాళ్ల మార్పిడి ద్వారా కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు వెళ్తే, అతనికి ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ప్రస్తుతం కేకేఆర్ జట్టుకు రింకూ సింగ్ సరైన నాయకత్వ ప్రత్యామ్నాయంగా కనిపించడం లేదు. మరోవైపు పాండ్యాను సొంతం చేసుకునేందుకు రాజస్తాన్ రాయల్స్ కూడా ముంబై ఇండియన్స్‌కు ట్రేడింగ్ ప్రతిపాదన పంపినట్లు సమాచారం. అందులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, హార్దిక్ పాండ్యా మధ్య ఆటగాళ్ల మార్పిడి జరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చర్చలు ఎంతవరకు ముందుకు సాగాయనే దానిపై స్పష్టత లేదు. రాజస్థాన్ రాయల్స్ మాత్రం ప్రస్తుత కెప్టెన్ రియాన్ పరాగ్‌ను దీర్ఘకాలిక కెప్టెన్‌గా కొనసాగించాలని భావిస్తోంది. అందువల్ల రాజస్థాన్ రాయల్స్‌కు పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించడం కష్టమే. ఈ సమీకరణాల దృష్ట్యా హార్దిక్ పాండ్యాకు రాజస్థాన్ రాయల్స్ కంటే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులోకి వెళ్లడమే అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఆటగాడు నేరుగా వేరే జట్టుతో చర్చలు జరపకూడదు. కేవలం ఫ్రాంచైజీల మధ్య సంప్రదింపులు జరగాలి. అయితే ఆటగాడి అంగీకారం లేకుండా ట్రేడింగ్ సాధ్యం కాదు. ఒకవేళ ఆటగాడు నిరాకరిస్తే అతడిని వేలంలోకి వదలాల్సి ఉంటుంది. ఒకవేళ కేకేఆర్‌లోకి పాండ్యా వస్తే మాత్రం రహానే కెప్టెన్సీ వదులుకోవాల్సి ఉంటుంది. కేకేఆర్ కూడా రహానే తమ తాత్కాలిక కెప్టెన్ మాత్రమే అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఐపీఎల్ 2026 సీజన్ చివర్లో వెన్నునొప్పికి గురైన పాండ్యా అప్పటి నుంచి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శిబిరంలో చికిత్స పొందుతున్నాడు. మొదట గాయం నుంచి కోలుకుని ఫిట్నెస్ సాధించిన పాండ్యాను బీసీసీఐ తొలుత ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపిక చేసింది. అయితే తొడ కండరాల గాయం తిరగబెట్టడంతో పాండ్యా ఇంగ్లండ్ సిరీస్‌కు దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అతడి స్థానంలో నితీశ్‌కుమార్ రెడ్డిని ఎంపిక చేయగా, అతడు కూడా గాయపడడంతో లంకలో జరిగిన ట్రై సిరీస్‌లో ఇండియా-ఏ తరఫున అదరగొట్టిన సూర్యాన్ష్ హెగ్డెను ఎంపిక చేసింది. 🚨 हार्दिक पांड्या को लेकर बड़ी खबर! 🚨IPL 2027 सीज़न से पहले कोलकाता नाइट राइडर्स (KKR) ने हार्दिक पांड्या को अपनी टीम में शामिल करने के लिए मुंबई इंडियंस (MI) प्रबंधन से संपर्क किया है।बताया जा रहा है कि इस संबंध में दोनों फ्रेंचाइज़ियों के बीच कई दौर की बातचीत भी हो चुकी… pic.twitter.com/u7DgaeL41N— Rajat Yadav (@BebakRajat) June 24, 2026చదవండి: మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఇంట్లో విషాదం -
ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ డీల్.. రూ.12 కోట్లు వదులుకుని?
ఐపీఎల్-2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య భారీ ట్రేడ్ డీల్ జరిగింది. ఈ డీల్ ప్రకారం.. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ రెండేళ్ల తర్వాత మళ్లీ తన పాత ఫ్రాంచైజీకి ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగి రానుండగా, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో సూపర్ జాయింట్స్ జట్టులోకి వెళ్తున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ ఫ్రాంచైజీ అధికారికంగా ధ్రువీకరించింది.రూ. 12 కోట్లు కట్‌కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో పంత్‌ను రూ.27 కోట్ల రికార్డు ధరకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. లక్నో ఫ్రాంచైజీ అతడిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ అతడు మాత్రం లక్నో యాజమాన్యం అంచనాలను అందుకోలేకపోయాడు. వరుసగా 2025, 2026 సీజన్లలో లక్నో కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేక పట్టికలో ఆఖరి స్ధానాలకు పరిమితమైంది.రిషబ్ వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా తీవ్ర నిరాశపరిచాడు. ఈ క్రమంలో 2026 సీజన్ ముగియగానే పంత్ లక్నో కెప్టెన్సీ పదవి నుండి తప్పుకున్నాడు. అయితే పంత్ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగొచ్చేందుకు తన జీతాన్ని రూ.15 కోట్లకు తగ్గించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఇంత భారీ పేకట్తో ట్రేడ్ అయిన ప్లేయర్ మరొకరు లేరు.అంటే గత సీజన్‌తో పోలిస్తే పంత్ రూ. 12 కోట్లు నష్టపోనున్నాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తన ఐదేళ్ల బంధానికి కుల్దీప్ వీడ్కోలు పలకనున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కుల్దీప్ను రూ. 13.50 కోట్లకు రిటైన్ చేసుకుంది. అదే ధరతో అతడు లక్నో తరపున ఆడనున్నాడు. ఢిల్లీ తరపున కుల్దీప్ 65 మ్యాచ్‌లలో 72 వికెట్లు పడగొట్టాడు.చదవండి: Ravindra Jadeja: వన్డే జట్టులో ‘సర్’ స్థానానికి ఎసరు....? గంభీర్, అగార్కర్ కొత్త వ్యూహం! -
'అలాగైతే ఢిల్లీని వీడు.. వేలంలోకి వెళ్ళిపో'
ఐపీఎల్-2026 ముగిసి నెల రోజుల కూడా కాకముందే అప్పుడే వచ్చే ఏడాది సీజన్ గురుంచి ఊహాగానాలు మొదలయ్యాయి. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్‌ను వదిలి తిరిగి తన పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.అందుకు బదులుగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను లక్నోకు ఇచ్చేందుకు ఢిల్లీ సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి. పంత్‌ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో పంత్‌ను లక్నో రూ. 27 కోట్లకు రికార్డు ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజా డీల్ ప్రకారం పంత్ తన జీతాన్ని తగ్గించుకుని రూ.15 కోట్లకు ఢిల్లీకి వచ్చేందుకు అంగీకరించినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.అంతేకాకుండా అక్షర్ పటేల్ స్ధానంలో కేఎల్ రాహుల్‌ను ఢిల్లీ కెప్టెన్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ పేసర్ దొడ్డ గణేష్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ పంత్ గనుక ఢిల్లీ జట్టులోకి వస్తే, రాహుల్ ఢిల్లీ ఫ్రాంచైజీని వీడాలని అతడు సూచించాడు. ప్రస్తుతం అతడు చేసిన కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చానీయాంశమయ్యాయి.కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో రాహుల్‌ను రూ.14 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది. గతేడాది సీజన్లో 539 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన రాహుల్.. ఐపీఎల్-2026లో కూడా అదరగొట్టాడు. కేవలం 14 ఇన్నింగ్స్‌ల్లోనే 45.61 సగటుతో, 174.41 భారీ స్ట్రైక్ రేట్‌తో 593 పరుగులు చేశాడు.ఇందులో 5 అర్ధసెంచరీలు, ఒక అద్భుత శతకం ఉన్నాయి. మరోవైపు రిషబ్ పంత్ తన ఐపీఎల్ కెరీర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌తోనే ప్రారంభించాడు. ఇప్పుడు మళ్లీ తన సొంత గూటికి వచ్చేందుకు సిద్దమయ్యాడు.చదవండి: IND vs AFG: రోహిత్ శర్మ హ్యాట్రిక్.. వీడియో వైరల్ -
IPL 2027: బీసీసీఐ కీలక నిర్ణయం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2027 సీజన్‌కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక ప్రకటన చేసింది. క్యాష్ రిచ్ లీగ్ ఇరవయ్యవ ఎడిషన్.. గత సీజన్‌తో పోలిస్తే దాదాపు రెండు వారాల ముందే ఆరంభం అవుతుందని వెల్లడించింది.మరోసారి బెంగళూరుదే టైటిల్‌కాగా ఐపీఎల్-2026 మార్చి 28న మొదలై.. మై 31న ఫైనల్‌తో ముగిసిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన టైటిల్ పోరులో.. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. గుజరాత్‌ను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడింది.ముందుగానే ఐపీఎల్ఇక వచ్చే సీజన్ విండో గురించి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. PTIతో మాట్లాడుతూ.. మార్చి 10 నుంచి మే 15 మధ్య టోర్నీ నిర్వహణ కోసం ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపాడు. ‘‘ఈ ఏడాది ఐపీఎల్ 28 మార్చిలో మొదలై.. మే 31న ముగిసింది.కారణం ఇదేనిజానికి మే 15 తర్వాత చాలా చోట్ల వాతావరణం కారణంగా ఇబ్బందులు తలెత్తాయి. కొన్నిచోట్ల ముందుగానే రుతుపవనాల రాకతో వర్షం పడింది. అందుకే వచ్చే ఏడాది నుంచి షెడ్యూల్ మార్చాలని అనుకుంటున్నాం.ఇందుకు సంబంధించి మా జనరల్ మేనేజర్‌కు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాను. మార్చి 10- మే 15 మధ్య టోర్నీ జరిగేలా షెడ్యూల్ వీలు అవుతుందో చూడమన్నాను. ప్లే ఆఫ్స్, ఫైనల్‌కు వర్షం అడ్డంకిగా మారకుండా ముందుగానే చర్యలు తీసుకోవాల్సి ఉంది. వాతావరణ పరిస్థితుల వల్ల ఇబ్బందులు పడడం కంటే షెడ్యూల్లో మార్పు చేస్తే బాగుంటుందనే యోచనలో ఉన్నాము’’ అని దేవజిత్ సైకియా తెలిపాడు. చదవండి: ముంబై ఇండియన్స్‌కి సూర్య గుడ్‌బై! -
‘పంజాబ్ కింగ్స్ ఈ ఐదుగురిని వదిలేయాలి’
ఐపీఎల్-2026 ఆరంభంలో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయాలు సాధించింది. వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి టేబుల్ టాపర్‌గా కొనసాగింది. కానీ ఆ తర్వాత ఊహించనిరీతిలో వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడిపోయి ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ హనుమ విహారి పంజాబ్ కింగ్స్ యాజమాన్యానికి కీలక సూచనలు చేశాడు. వచ్చే సీజన్ ఆరంభానికి ముందు ఈ ఐదుగురు ఆటగాళ్లను తప్పక వదిలించుకోవాలన్నాడు. ఇందులో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్‌కు విహారి ప్రథమ స్థానం ఇచ్చాడు.రూ. 11 కోట్లు అందుకునే అర్హత లేదుతన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘నా అభిప్రాయం ప్రకారం.. పంజాబ్ మొట్టమొదటగా మార్కస్ స్టొయినిస్‌ను వదిలేయాలి. అతడిని ఏకంగా రూ. 11 కోట్లకు కొనుగోలు చేశారు. అదే ధరకు రిటైన్ చేసుకున్నారు.ఆరు లేదంటే ఏడో స్థానంలో ఆడతాడని ఇంత ధర పెట్టారు. కానీ అందుకు అతడు అర్హుడు కాడు. వచ్చే రెండు- మూడేళ్లలో అతడు రిటైర్మెంట్కు చేరువవుతాడు. బౌలింగ్‌లోనూ అతడు ప్రభావం చూపడం లేదు.వీళ్లను కూడా వదిలేయండిఅతడిని వేలంలోకి వదిలి.. కావాలంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. స్టొయినిస్‌తో పాటు నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మిచెల్ ఓవెన్లను కూడా వేలంలోకి వదిలేయండి. అసలు వాళ్లతో ఈ సీజన్లో ఏమాత్రం ప్రయోజనం చేకూరలేదు.లాకీ ఫెర్గూసన్ కూడా జట్టుకు అవసరం లేదు. వీళ్లందరినీ వదిలేస్తే పర్సులో కనీసం రూ. 25 కోట్లు మిగులుతాయి’’ అని హనుమ విహారి అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2026లో స్టొయినిస్ తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 216 పరుగులు చేశాడు. అదే విధంగా నాలుగు మ్యాచ్‌లలో బౌలింగ్ చేసి రెండే వికెట్లు తీశాడు.ఇక నేహాల్ వధేరా ఆరు ఇన్నింగ్స్ ఆడి 65 పరుగులకే పరిమితమయ్యాడు. మరోవైపు.. శశాంక్ సింగ్ సైతం తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 132 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఫెర్గూసన్ మూడు మ్యాచ్‌లు ఆడగా.. మిచెల్ ఓవెన్‌కు అసలు ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం రాలేదు.చదవండి: టీమిండియాలోకి కొత్త ప్లేయర్! -
కమిన్స్ సంచలన నిర్ణయం..! సన్‌రైజర్స్ కెప్టెన్‌గా విధ్వంసకర ప్లేయర్?
ఆస్ట్రేలియా స్టార్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వడం కోసం తాను ఐపీఎల్-2027కు అందుబాటులో ఉండకపోవచ్చని కమిన్స్ ఇప్పటికే సూచించాడు. తాజాగా ఓ కార్యక్రమంలో కమ్మిన్స్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. వచ్చే ఏడాది యాషెస్ సిరీస్‌తో పాటు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, వన్డే ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలు ఉన్నాయి. కాగా యాషెస్ 2025-26ను ఆస్ట్రేలియా సొంతం చేసుకున్నప్పటికి, కమ్మిన్స్ మాత్రం గాయం కారణంగా ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత కీలకమైన టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. ఈసారి మాత్రం కమిన్స్ పూర్తిగా ఫిట్‌గా అన్ని ప్రధాన టోర్నీల్లో పాల్గోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు."వచ్చే ఏడాది బిజీ షెడ్యూల్ కారణంగా ఏదో ఒకదానికి విరామం ఇవ్వక తప్పదు. అయితే అది ఖచ్చితంగా టెస్ట్ మ్యాచ్‌లు లేదా వన్డే ప్రపంచ కప్ మాత్రం కాదు. టెస్ట్ క్రికెట్, వన్డే వరల్డ్ కప్‌లకే నా మొదటి ప్రాధాన్యత ఉంటుంది. లీగ్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడటంపై తుది నిర్ణయాన్ని ఆయా ఫ్రాంచైజీలతో మాట్లాడి తీసుకుంటాను. గాయాల బారిన పడే అవకాశం ఉన్నందున ఇప్పుడే దేనికీ కమిట్ అవ్వకూడదు అనుకుంటున్నాను.బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వంటి సుదీర్ఘ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడితే.. ఆ తర్వాత జరగబోయే 'యాషెస్' సిరీస్ కంటే ముందు నాకు కచ్చితంగా విశ్రాంతి అవసరమని కమ్మిన్స్ ఓ కార్యక్రమంలో పేర్కొన్నాడు. ఒకవేళ కమిన్స్ అందుబాటులో లేకపోతే ఎస్ఆర్హెచ్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ వ్యవహరించనున్నాడు.ఐపీఎల్-2026 సీజన్ ఫస్ట్‌హాఫ్‌లో కూడా కమ్మిన్స్ గైర్హజరీలో కిషనే సన్‌రైజర్స్ జట్టును నడిపించాడు. అతడి సారథ్యంలో 8 మ్యాచ్‌లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ.. ఐదింట విజయం సాధించింది. ఈ జార్ఖండ్ ఆటగాడు బ్యాటర్‌గా కూడా రాణించాడు. కిషన్ 15 మ్యాచ్‌లలో 602 పరుగులు చేశాడు. కానీ ఎస్ఆర్హెచ్ ప్రయాణం ఎలిమినేటర్‌లోనే ముగిసిపోయింది.చదవండి: NZ vs ENG: ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. 'గే'కు ఛాన్స్ -
ఈ ఐదుగురు తమ చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడేశారు?!
ఐపీఎల్ పందొమ్మిదో సీజన్ ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టైటిల్ నిలబెట్టుకుంది. అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది.ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌తో కొంతమంది ఆటగాళ్లు ఐపీఎల్ కెరీర్ చరమాంకానికి చేరినట్లు తెలుస్తోంది. అంచనాలు అందుకోలేక చతికిలపడిన కొందరు ప్లేయర్లను వదిలించుకునేందుకు ఫ్రాంఛైజీలు సిద్ధమైనట్లు సమాచారం. ఈ జాబితాలో టాప్-5లో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు ఇవే!కరుణ్ నాయర్కరుణ్ నాయర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ గతేడాది రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. మిడిలార్డర్లో రాణిస్తాడనే ఉద్దేశంతో 34 ఏళ్ల ఈ వెటరన్ బ్యాటర్‌కు అవకాశం ఇచ్చింది. ఇక, ఐపీఎల్-2025లో కరుణ్ నాయర్ కాస్త ఫర్వాలేదనిపించాడు.ఎనిమిది ఇన్నింగ్స్‌లో కలిపి 198 పరుగులు చేయగలిగాడు. దీంతో ఈ ఏడాది కూడా ఫ్రాంఛైజీ అతడిని కొనసాగించింది. అయితే, ఐపీఎల్-2026లో రెండు ఇన్నింగ్స్ ఆడిన కరుణ్ కేవలం 18 పరుగులే చేశాడు. ఫీల్డింగ్‌లోనూ విఫలమయ్యాడు.వచ్చే సీజన్ నాటికి కరుణ్ 35వ వసంతంలోకి అడుగుపెడతాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టు పునర్నిర్మాణంలో భాగంగా యువ ఆటగాళ్లను ఎంచుకునే క్రమంలో కరుణ్ నాయర్‌కు స్వస్తి పలికే అవకాశం ఉంది. ఇక అతడికి కొత్త జట్టు దొరకడం కూడా కష్టమే!టి.నటరాజన్సన్రైజర్స్ హైదరాబాద్ నెట్ బౌలర్‌గా వచ్చి.. ఐపీఎల్లో ఇటీవలి కాలంలో ప్రభావం చూపిన లెఫ్టార్మ్ పేసర్లలో ఒకడిగా ఎదిగాడు టి.నటరాజన్. ఢిల్లీ క్యాపిటల్స్ గతేడాది అతడిని ఏకంగా రూ. 10.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.అందుకు తగ్గట్లుగానే ఆరంభంలో రాణించినప్పటికీ.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించకలేకపోయాడు ఈ తమిళనాడు బౌలర్. పది ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం ఐదు వికెట్లే తీశాడు. ఎకానమీ 11.18.వరుసగా ఆరు మ్యాచ్‌లలో నటరాజన్ ఒక్క వికెట్ కూడా తీయలేక చతికిలపడ్డాడు. కాబట్టి ఢిల్లీ అతడిని వదిలివేయడం ఖాయంగానే కనిపిస్తోంది.అన్రిచ్ నోర్జేసౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ అన్నిచ్ నోర్జేను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. పదునైన పేస్ ఆయుధంతో రాణించగల నోర్జే.. అదే స్థాయిలో గాయాల బారిన పడటం ప్రతికూలంగా మారింది.తాజా ఎడిషన్‌లో అతడు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడగలిగాడు. గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు. గతంలో కేకేఆర్ తరఫున కూడా కేవలం రెండు మ్యాచ్‌లే ఆడి వెళ్లిపోయాడు. దీంతో గాయాల బెడదతో బాధపడుతున్న నోర్జేకు ఫ్రాంఛైజీలు మళ్లీ అవకాశం ఇవ్వడం దాదాపుగా అసాధ్యమే అనిపిస్తోంది.ట్రెంట్ బౌల్ట్న్యూజిలాండ్ సీనియర్ పేసర్ ఫాస్ట్‌బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌కు ఐపీఎల్‌లోనూ ఘన చరిత్రే ఉంది. వివిధ ఫ్రాంఛైజీలకు ప్రాతినిథ్యం వహిస్తూ.. విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ కివీస్ బౌలర్.. ఇప్పటికి 124 మ్యాచ్‌లలో కలిపి 145 వికెట్లు పడగొట్టాడు.ఇక ఐపీఎల్-2026కు ముందు ముంబై ఇండియన్స్ రూ. 12.50 కోట్ల భారీ ధరకు బౌల్ట్‌ను కొనుగోలు చేసింది. అయితే, ఆశించిన రీతిలో అతడు రాణించలేకపోయాడు. ఐదు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండే వికెట్లు తీశాడు. దీంతో అతడికి బౌలింగ్ కోటా పూర్తి చేసే అవకాశం కూడా రాలేదు. కాబట్టి 36 ఏళ్ల బౌల్ట్‌ను ముంబై వదిలేస్తే.. అతడికి మరో ఫ్రాంఛైజీ నుంచి అవకాశం రావడం కష్టమే అనిపిస్తోంది.హర్షల్ పటేల్ఐపీఎల్-2026కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ హర్షల్ పటేల్‌ను రూ. 8 కోట్లకు రిటైన్ చేసుకుంది. గతేడాది 13 ఇన్నింగ్స్‌లో కలిపి అతడు 16 వికెట్లు తీశాడు అయితే, గతంలో మాదిరి ఈసారి హర్షల్ రాణించలేదు.ఐదు మ్యాచ్‌లు ఆడి 10కి పైగా ఎకానమీతో పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. వచ్చే సీజన్ నాటికి హర్షల్ 35వ వసంతంలోకి అడుగుపెడతాడు. ఈ పరిణామాల క్రమంలో సన్‌రైజర్స్ అతడిని వదిలివేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. హర్షల్ వేలంలోకి వచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఫ్రాంఛైజీ అతడి వైపు మొగ్గుచూపకపోవచ్చు.చదవండి: IPL 2026: వైభవ్ తగ్గేదేలే.. ఎవరికెంత ప్రైజ్‌మనీ? -
రోహిత్ శర్మ వద్దు.. ముంబై కెప్టెన్‌గా అతడే సరైనోడు
ఐపీఎల్-2026 సీజన్లో ఘోర ప్రదర్శన తర్వాత ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తీవ్రమైన మానసిక ఒత్తిడి, అంతర్గత విభేదాలు, శారీరక అలసటతో సతమతమవుతున్న ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ముంబై ఫ్రాంచైజీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ ఏడాది సీజన్ మధ్యలోనే పాండ్యా తన నిర్ణయాన్ని టీమ్ మేనెజ్మెంట్కు తెలియజేసినట్లు ఐపీఎల్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఐపీఎల్-2024 సీజన్లో ముంబై ఇండియన్స్ యాజమాన్యం రోహిత్ శర్మను తప్పించి మరి తమ జట్టు పగ్గాలను హార్దిక్‌కు అప్పగించింది.కానీ వారి నమ్మకాన్ని పాండ్యా నిలబెట్టుకోలేకపోయాడు. ఆ సీజన్లో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచింది. ఆ తర్వాత సీజన్లో క్వాలిఫయర్-2 వరకు ముంబైని పాండ్యా తీసుకొచ్చాడు. కానీ తాజా ఎడిషన్‌లో మాత్రం పాండ్యా కెప్టెన్‌గా, వ్యక్తిగత ప్రదర్శన పరంగా దారుణంగా విఫలమయ్యాడు. 14 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం నాలుగింట గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానానికి పరిమితమైంది. దీంతో ముంబై ఇండియన్స్ యాజమాన్యం కూడా హార్దిక్ కెప్టెన్సీపై అసంతృప్తిలోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.అయితే ఐపీఎల్-2027కు ముందు పాండ్యా నేరుగా మెగా వేలంలోకి వస్తాడా? లేదా ట్రేడింగ్ పద్ధతి ద్వారా మరేదైనా జట్టుతో ఒప్పందం కుదుర్చుకుంటాడా అనేది ఇంకా స్పష్టత లేదు. దీంతో వచ్చే ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఐదు టైటిల్స్‌ను అందించిన రోహిత్ శర్మ మరోసారి ముంబై జట్టు పగ్గాలను చేపట్టేందుకు సిద్దంగా లేడని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ముంబై తదుపరి కెప్టెన్ ఎవరన్న విషయంపై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు."ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ బెస్ట్ ఛాయిస్. మళ్లీ రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించడం అనేది వెనక్కి అడుగు వేయడమే అవుతుంది. ఎందుకంటే రోహిత్ వయస్సును కూడా పరిగణలోకి తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో సూర్యనే బెటర్" అని జాఫర్ తన యూట్యూబ్ ఛానల్లలో పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: రాజస్తాన్ సరికొత్త చరిత్ర.. సన్‌రైజర్స్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ -
‘ముంబై తప్పు తెలుసుకుంది.. కెప్టెన్‌గా అతడే!’
మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. ఐపీఎల్-2026లో గ్రూప్ దశలో పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ ముంబై.. కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచింది. ఫలితంగా ఎనిమిది పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది.ఐదుసార్లు చాంపియన్‌కాగా రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో ముంబై గతంలో ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ 2024లో అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది యాజమాన్యం. అతడి స్థానంలో... గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా (2022) నిలిపిన తమ మాజీ ఆటగాడు హార్దిక్ పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకుంది. అంతేకాదు కెప్టెన్‌గానూ బాధ్యతలు అప్పగించింది.ఘోర పరాభవంముంబై ఇండియన్స్ సారథిగా తొలి ప్రయత్నంలోనే హార్దిక్ ఘోర పరాభవం చవిచూశాడు. సొంత జట్టు అభిమానుల నుంచే తీవ్ర వివక్ష ఎదుర్కోవడంతో పాటు.. జట్టును మరీ దారుణంగా చిట్టచివరన పదో స్థానంలో నిలిపాడు. అయితే, ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించడంతో హార్దిక్‌పై నెగిటివిటీ కాస్త తగ్గింది.గతేడాది ప్లే ఆఫ్స్ చేరినా.. అదే జోరులో 2025లో ముంబైని ప్లే ఆఫ్స్ చేర్చాడు హార్దిక్ పాండ్యా. అయితే, తాజా ఎడిషన్‌లో మళ్లీ పాత కథే పునరావృతమైంది. ఈసారి కెప్టెన్‌గా.. ఆల్‌రౌండర్‌గా అతడు పూర్తిగా విఫలమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా నాలుగు మ్యాచ్‌లకు దూరమైన హార్దిక్.. 10 మ్యాచ్‌లు ఆడి 206 పరుగులు చేయడంతో పాటు.. కేవలం నాలుగు వికెట్లు తీశాడు.ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాపై అంబానీల సారథ్యంలోని యాజమాన్యం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య అభిప్రాయ భేదాలు తారస్థాయికి చేరుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ముంబై ఇండియన్స్ సన్నిహిత వర్గాలు ఎన్డీటీవీకి కీలక విషయాలు వెల్లడించాయి.ముంబై తప్పు తెలుసుకుంది‘‘ముంబై ఇండియన్స్ యాజమాన్యం తమ తప్పును తెలుసుకుంది. అయితే, రోహిత్ శర్మ తిరిగి పగ్గాలు చేపట్టేందుకు ఏమాత్రం సిద్ధంగా లేడు. కానీ.. అతడి ఆశీర్వాదం ఉన్న వ్యక్తే ముంబై ఇండియన్స్ తదుపరి కెప్టెన్ అవుతాడనడంలో సందేహం లేదు. రోహిత్ సూచించిన ఆటగాడికే కెప్టెన్సీ దక్కే అవకాశం ఉంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా సైతం ముంబైని వీడే ప్రయత్నాల్లో ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నాడు. ఇటీవల తన ఫోన్ స్క్రీన్‌పై ‘07:07’ టైమ్‌ను షేర్ చేయడంతో.. అతడు చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరబోతున్నాడని నెటిజన్లు భావించారు.మేనేజ్మెంట్తో సంబంధాలు దెబ్బతింటేఈ విషయం గురించి కూడా సదరు వర్గాలు స్పందించాయి. ‘‘హార్దిక్ కచ్చితంగా ట్రాన్స్ఫర్ కోరుకుంటాడు. కేవలం కెప్టెన్సీ విషయంలోనే కాదు.. వ్యక్తిగతంగానూ అతడు జట్టుకు దూరమవ్వాలని కోరుకుంటున్నాడు.ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నపుడు మేనేజ్మెంట్తో సంబంధాలు దెబ్బతింటే ఎవరైనా ఇలాగే చేస్తారు కదా!.. ఆటగాళ్లు కూడా ఇందుకు మినహాయింపు కాదు’’ అని ముంబై ఇండియన్స్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.చదవండి: GT vs RR: వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే? -
IPL 2027: సీఎస్కేలోకి ఊహించని ఆటగాడు!
ఐపీఎల్లో గత రెండేళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. ఈ మాజీ చాంపియన్ 2025లో అత్యంత దారుణ ప్రదర్శనతో కేవలం నాలుగు మ్యాచ్‌లు గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది.ఈ నేపథ్యంలో 2026 వేలానికి ముందు సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను రాజస్తాన్ రాయల్స్‌కు ట్రేడ్ చేసిన చెన్నై.. అతడికి బదులు రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను తీసుకుంది. టీ20 ప్రపంచకప్-2026 ట్రోఫీని భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ.. చెన్నై తరఫున ఆరంభంలో విఫలమయ్యాడు.సంజూ ధనాధన్అయితే, అనూహ్య రీతిలో పుంజుకుని రెండు శతకాల సాయంతో 14 మ్యాచ్‌లలో కలిపి 477 పరుగులు సాధించాడు సంజూ. తద్వారా సీఎస్కే తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ.. జట్టు మాత్రం పేలవ ప్రదర్శనతో పద్నాలుగింట ఆరు మాత్రమే గెలిచి ఎనిమిదో స్థానంతో ముగించింది.భారీ మార్పులకు ఆస్కారంఈ నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. ఆటగాడిగానూ అతడు విఫలం కావడంతో వేటు వేస్తారా అనే సందేహాలు నెలకొన్నాయి. అదే విధంగా జట్టులో భారీ మార్పులకు ఆస్కారం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇలాంటి తరుణంలో సీఎస్కే మాజీ ఆటగాడు, భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సీఎస్కేలోకి వస్తాడనే అర్థంలో పోస్టు పెట్టాడు.కాగా హార్దిక్ కెప్టెన్సీలో ముంబై ఈ ఏడాది చెత్త ప్రదర్శన కనబరిచింది. పద్నాలుగింట నాలుగే గెలిచి తొమ్మిదో స్థానంలో ముగించింది. ఇక నాలుగు మ్యాచ్‌లకు హార్దిక్ దూరం కాగా.. యాజమాన్యంతో విభేదాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాడనే వార్తలు వచ్చాయి.07:07 కథేంటి?ఈ నేపథ్యంలో ఇటీవల హార్దిక్ ఇన్‌స్టాలో ఓ స్టోరీ షేర్ చేశాడు. ఇందులో.. ‘07:07’ అని తన ఫోన్లో టైమ్ చూపిస్తున్న ఫొటో పంచుకున్నాడు. దీంతో చెన్నై లెజెండ్ ధోని (జెర్సీ నంబర్)ని ఉద్దేశించే ఈ పోస్టు పెట్టాడని నెట్టింట చర్చ జరిగింది.అశూ ఏమన్నాడు?ఈ క్రమంలో ఓ నెటిజన్.. వచ్చే సీజన్లో చెన్నై జట్టులో మార్పుల గురించి అశూని అడుగగా.. ‘‘పతిరణ, 07:07, స్టోక్స్, దూబే, 07:07 మిడిలార్డర్/ఫినిషింగ్, ఓవర్టన్, స్టోక్స్ బ్యాలెన్స్’’ అని సమాధానం ఇచ్చాడు. దీంతో హార్దిక్ గురించే అశూ చెప్పాడనే చర్చ నడుస్తోంది. కాగా పతిరణను గతేడాది సీఎస్కే రిలీజ్ చేయగా.. కోల్‌కతా కొనుక్కుంది. కానీ గాయం వల్ల అతడు ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. దీంతో కోల్‌కతా అతడిని రిలీజ్ చేయనుందనే వార్తలు రాగా.. పతిరణ తిరిగి మళ్లీ సీఎస్కేలోకే వస్తాడనే ప్రచారం ఊపందుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో చెరో ఐదుసార్లు ముంబై, చెన్నై చాంపియన్లుగా నిలిచాయి. ఈ రెండు జట్లను అభిమానులు చిరకాల ప్రత్యర్థులుగా పరిగణిస్తారు. అలాంటిది ఊహించని రీతిలో హార్దిక్ ముంబైని వీడి ఐపీఎల్-2027 సందర్భంగా చెన్నైలో చేరతాడనే ప్రచారం ఆసక్తికరంగా మారింది.Pathirana, 07:07 & Stokes !Opening✅Dube & 07:07 MiddleOrder/Finishing✅Overton & Stokes Balance✅ https://t.co/kSALlKQDCp— Ashwin 🇮🇳 (@ashwinravi99) May 26, 2026


