కమిన్స్‌ సంచలన నిర్ణయం..! సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా విధ్వంసకర ప్లేయర్‌? | Ishan Kishan To Replace Pat Cummins As Permanent SRH Captain For IPL 2027 | Sakshi
Sakshi News home page

కమిన్స్‌ సంచలన నిర్ణయం..! సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా విధ్వంసకర ప్లేయర్‌?

Jun 3 2026 1:16 PM | Updated on Jun 3 2026 1:26 PM

Ishan Kishan To Replace Pat Cummins As Permanent SRH Captain For IPL 2027

ఆస్ట్రేలియా స్టార్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ పాట్ క‌మ్మిన్స్ వ‌చ్చే ఏడాది ఐపీఎల్ సీజ‌న్‌కు దూరం కానున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వడం కోసం తాను ఐపీఎల్‌-2027కు అందుబాటులో ఉండ‌క‌పోవ‌చ్చ‌ని క‌మిన్స్ ఇప్ప‌టికే సూచించాడు. తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో క‌మ్మిన్స్ చేసిన వ్యాఖ్య‌లు ఈ వార్త‌ల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తున్నాయి. 

వ‌చ్చే ఏడాది యాషెస్ సిరీస్‌తో పాటు వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌, వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ వంటి మెగా టోర్నీలు ఉన్నాయి. కాగా యాషెస్ 2025-26ను ఆస్ట్రేలియా సొంతం చేసుకున్న‌ప్ప‌టికి, క‌మ్మిన్స్ మాత్రం గాయం కార‌ణంగా ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. ఆ త‌ర్వాత కీల‌కమైన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు దూర‌మయ్యాడు. ఈసారి మాత్రం కమిన్స్ పూర్తిగా ఫిట్‌గా అన్ని ప్ర‌ధాన టోర్నీల్లో పాల్గోవాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు.

"వ‌చ్చే ఏడాది బిజీ షెడ్యూల్ కార‌ణంగా ఏదో ఒకదానికి విరామం ఇవ్వక తప్పదు. అయితే అది ఖచ్చితంగా టెస్ట్ మ్యాచ్‌లు లేదా వన్డే ప్రపంచ కప్ మాత్రం కాదు. టెస్ట్ క్రికెట్, వన్డే వరల్డ్ కప్‌లకే నా మొదటి ప్రాధాన్యత ఉంటుంది.  లీగ్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడ‌టంపై తుది నిర్ణయాన్ని ఆయా ఫ్రాంచైజీలతో మాట్లాడి తీసుకుంటాను. గాయాల బారిన పడే అవకాశం ఉన్నందున ఇప్పుడే దేనికీ కమిట్‌ అవ్వకూడదు అనుకుంటున్నాను.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వంటి సుదీర్ఘ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడితే.. ఆ తర్వాత జరగబోయే 'యాషెస్' సిరీస్‌ కంటే ముందు నాకు క‌చ్చితంగా విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని క‌మ్మిన్స్ ఓ కార్య‌క్ర‌మంలో పేర్కొన్నాడు. ఒక‌వేళ క‌మిన్స్ అందుబాటులో లేక‌పోతే ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

ఐపీఎల్‌-2026 సీజ‌న్ ఫ‌స్ట్‌హాఫ్‌లో కూడా క‌మ్మిన్స్ గైర్హ‌జ‌రీలో కిష‌నే స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టును న‌డిపించాడు. అత‌డి సార‌థ్యంలో 8 మ్యాచ్‌లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ.. ఐదింట విజ‌యం సాధించింది. ఈ జార్ఖండ్ ఆట‌గాడు బ్యాట‌ర్‌గా కూడా రాణించాడు. కిష‌న్‌ 15 మ్యాచ్‌ల‌లో 602 ప‌రుగులు చేశాడు. కానీ ఎస్ఆర్‌హెచ్ ప్ర‌యాణం ఎలిమినేటర్‌లోనే ముగిసిపోయింది.
చదవండి: NZ vs ENG: ఇంగ్లండ్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. 'గే'కు ఛాన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement