మెస్సీ అలా.. లామినే ఇలా; చివ‌రికి! | Argentina-Spain Players Brawl-Yamal Prayers-Messi-Sitting Sad-Hug-Each-Other | Sakshi
Sakshi News home page

FIFA Final: మెస్సీ అలా.. లామినే ఇలా; చివ‌రికి!

Jul 20 2026 5:35 PM | Updated on Jul 20 2026 6:16 PM

Argentina-Spain Players Brawl-Yamal Prayers-Messi-Sitting Sad-Hug-Each-Other

Photo Credit: FIFA Twitter

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ ముగిసిన త‌ర్వాత ఇరుజట్ల  ఆట‌గాళ్ల మ‌ధ్య గొడవ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఓట‌మి బాధ‌ను త‌ట్టుకోలేక అర్జెంటీనా మిడ్‌ఫీల్డ‌ర్ లియాండ్రో ప‌రెడెస్ స్పెయిన్ ఆటగాళ్ల‌తో త‌గాదా పెట్టుకున్నాడు. చిలికి చిలికి గాలి వాన‌లా మారిన గొడ‌వ త‌న్నుకునేంత వ‌ర‌కు వెళ్లింది. 

అయితే ఇంత గొడ‌వ జ‌రుగుతున్న‌ప్ప‌టికీ ఒక‌వైపు మెస్సీ.. మ‌రోవైపు లామినె య‌మాల్ మాత్రం త‌మ‌కేం సంబంధం లేద‌న్న‌ట్లుగా ఉండిపోయారు. ఓట‌మి షాక్ నుంచి తేరుకోని మెస్సీ మైదానంలోనే నిరాశ‌తో కూర్చుండిపోయాడు. త‌న‌లో తాను కుమిలిపోతు క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యాడు. 


Photo Credit: FIFA Twitter

మ‌రోప‌క్క య‌మాల్ కూడా త‌న ప‌క్క‌నే అంత పెద్ద గొడ‌వ జ‌రుగుతున్న‌ప్ప‌టికీ త‌న దేశం గెలిచింద‌న్న సంతోషంతో అత‌ను  ప్రార్థ‌న‌ల్లో మునిగిపోయిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట చ‌క్కర్లు కొడుతుంది. చుట్టూ ఏం జ‌రుగుతుందో కూడా గ్ర‌హించ‌కుండా య‌మాల్ త‌న ప‌నిలో నిమ‌గ్న‌మై ఉండ‌డం చూస్తే అత‌డి ఆత్మ‌విశ్వాసం ఎలాంటిదో అర్థ‌మ‌వుతోంది. ఇంత గొడ‌వ‌లో కూడా మెస్సీ, య‌మాల్ మ‌ధ్య జ‌రిగిన ఒక భావోద్వేగ ఘ‌ట‌న ఆస‌క్తిగా మారింది.


Photo Credit: FIFA Twitter

ఒక‌రినొక‌రు ఆలింగ‌నం..
లామినే య‌మాల్ త‌న ప్రార్థ‌న పూర్తి చేసుకొని లేచిన త‌ర్వాత త‌న ఎదురుగా పెద్ద గొడ‌వ జ‌రుగుతున్న దృష్ట్యాల‌ను చూశాడు. కానీ దానిని ప‌ట్టించుకోకుండా య‌మాల్ నేరుగా మెస్సీ వ‌ద్ద‌కు వ‌చ్చాడు. అప్ప‌టికే నిరాశ‌లో కూరుకుపోయిన మెస్పీని ఓదార్చి పైకి లేపాడు. ఆ త‌ర్వాత ఒక‌రినొక‌రు ఆలింగ‌నం చేసుకోవ‌డం క‌నిపించింది. 

ఇది చూసిన అభిమానులు.. 'క్యా సీన్‌హై' అనకుండా ఉండ‌లేక‌పోయారు. వీరిద్ద‌రు ఆలింగ‌నం చేసుకున్న ఫొటోలు కూడా సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. 'నిజ‌మైన క్రీడా స్ఫూర్తికి మెస్సీ, య‌మాల్ అర్థం చెప్పారంటూ' కామెంట్లు చేశారు.

అస‌లేం జ‌రిగింది?
ఫైన‌ల్ మ్యాచ్ ముగిసిన త‌ర్వాత స్పెయిన్ ఆట‌గాళ్లు సంబ‌రాలు మొద‌లుపెట్టారు. ఇదే స‌మ‌యంలో ఓట‌మి బాధ‌లో ఉన్న అర్జెంటీనా ఆట‌గాళ్ల‌వైపు చూస్తూ స్పెయిన్ ఆట‌గాళ్లు సెల‌బ్రేట్ చేసుకోవ‌డం వారికి కంటికి ఇంపుగా అనిపించ‌లేదు. దీంతో అర్జెంటీనా మిడ్‌ఫీల్డ‌ర్ లియాండ్రో పరెడెస్ ఒక్క‌సారిగా స్పెయిన్ ఆట‌గాళ్ల‌వైపు దూసుకొచ్చాడు. 

ఈ ఘర్షణలో అర్జెంటీనా మిడ్ ఫీల్డ‌ర్‌ లియాండ్రో పరేడెస్.. స్పెయిన్ ఆటగాళ్లు గావీ, ఎరిక్ గార్సియాలతో వాగ్వాదానికి దిగినట్లు వీడియోలో కనిపించింది. ఆ సమయంలో పరేడెస్ ప్రత్యర్థి ఆటగాడిని తోసివేయడంతో పాటు చేయి చేసుకున్న‌ దృశ్యాలు కెమెరాల్లో రికార్డ‌య్యాయి.  పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో అర్జెంటీనా హెడ్ కోచ్‌తో పాటు సపోర్ట్ స్టాఫ్ మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆటగాళ్లను విడదీసి పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ చాలాసేపు ఉద్రిక్తత కొనసాగింది. 

Read: మ‌రో ఫిఫా ఆడ‌క‌పోవ‌చ్చు.. మెస్సీ శ‌కం ముగిసిన‌ట్లే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement