Photo Credit: FIFA Twitter
మెస్సీ ఒక ఉత్పాతం, మౌన ముని. ఎన్ని అడ్డంకులు, వివాదాలు ఎదురైనా తన ఆటతోనే సమాధానం చెప్పాడు తప్ప హద్దులు మీరిన సందర్భాలు చాలా తక్కువ. నిజానికి మెస్సీకి కోపం కూడా ఎక్కువే. కానీ దాని అవసరం ఎంతమేర ఉంటుందో అంతే చూపిస్తుంటాడు. కాబట్టే ఇవాళ ప్రపంచంలో ప్రతీ మూలన అభిమానులను సంపాదించుకున్నాడు. గతంలో ఫుట్‌బాల్ పీలే, మారడోనా సహా ఎందరో దిగ్గజ ఆటగాళ్లను అందించినప్పటికీ ఈ తరంలో మాత్రం మెస్సీనే దిగ్గజ ఆటగాడు. ఇంకా చెప్పాలంటే అతడో ఆరాధ్య దైవం.
అలాంటి ఈ తరంలో ఫుట్‌బాల్ తెలిసినోడిని నిద్రలో నుంచి లేపి ఒక ఆటగాడి పేరు చెప్పమంటే మొదట వినిపించే పేరు లియోనల్ మెస్సీ. రెండు దశాబ్దాలుగా తన ఆటతో ఫుట్‌బాల్ అభిమానుల గుండెల్లో గుడి కట్టేసుకున్న మెస్సీ చూడాల్సినవన్నీ చూశాడు. ఎనిమిది సార్లు బాలన్ డీ ఓర్ అవార్డు, ఆరుసార్లు యూరోపియన్ గోల్డెన్ షేస్, ఎనిమిది సార్లు ఫిఫా బెస్ట్ ప్లేయర్, అలాగే 2025లో ఆల్‌టైమ్ బెస్ట్ ప్లేయర్‌గాను నిలిచాడు. తన కెరీర్‌లో లోటుగా ఉన్న ఫిఫా ప్రపంచకప్‌ను కూడా నాలుగేళ్ల కిందట ఖతార్‌లోనే అందుకున్నాడు. మరి ఇన్ని చూసినా ఈసారి ఫిఫాలో కూడా మెస్సీ నామజపమే ఎందుకు నడిచిందనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఉండదు. అదంతా మెస్సీ మాయ.

Photo Credit: FIFA Twitter
మెస్సీ బరిలో ఉన్నాడంటే చాలు అభిమానులకు ఎక్కడలేని జోష్ వస్తుంది. 2026 ఫిఫా ప్రపంచకప్‌లోనూ అదే రిపీట్ అయింది. ఈసారి ఫిఫాలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనాను మెస్సీనే మరోసారి అన్నీ తానై నడిపించాడు. ఆడిన ప్రతీ మ్యాచ్‌లో (ప్రి-క్వార్టర్ ఫైనల్ వరకు) కనీసం ఒక్క గోల్ అయినా కొట్టిన మెస్సీ గోల్డెన్ బూట్ రేసులోను దూసుకెళ్లాడు.
అయితే అతడి స్పీడుకు ఈసారి ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె (10 గోల్స్, 4 అసిస్ట్‌లు) బ్రేకులు వేశాడు. అయితే క్వార్టర్స్, సెమీస్‌లో గోల్ చేయనప్పటికీ కీలక అసిస్ట్‌లు అందించి జట్టు వెన్నంటే ఉన్నాడు. కానీ కీలకమైన ఫైనల్లో మెస్సీ ఏం చేయలేకపోయాడు. దుర్బేద్యమైన స్పెయిన్ ఫార్వార్డ్ ప్లేయర్లను అడ్డుకోవడంతోనే మెస్సీకి సరిపోయింది.
మ్యాచ్‌లో మెస్సీ రెండు క్రాస్‌లతో పాటు ఒక్కసారి మాత్రమే గోల్‌పోస్ట్ వైపు షాట్ ఆడినప్పటికీ స్పెయిన్ గోల్ కీపర్ ఉనైయి సిమోన్ దానిని కూడా సమర్థంగా అడ్డుకున్నాడు. మ్యాచ్‌లో స్పెయిన్ 20 సార్లు తమ ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడులు చేస్తే.. అర్జెంటీనా మాత్రం రెండుసార్లు మాత్రమే ప్రయత్నం చేయడం గమనార్హం.

Photo Credit: FIFA Twitter
ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత మెస్సీ కన్నీటిపర్యంతమవడం వెనుక ఒక కారణముంది. ఈసారి ఫిఫా ఆరంభం నుంచి అర్జెంటీనా ఆటపై వివాదాలు నెలకొన్నప్పటికీ మెస్సీ మాత్రం తన ఆటను చాలా సందర్భాల్లో నిజాయితీగానే ఆడాడు. ఫైనల్లో కూడా తను చేయాల్సిందంతా చేశాడు. కానీ పక్కా ప్రణాళికతో బరిలోకి దిగిన స్పెయిన్ ముందు అర్జెంటీనా పూర్తిగా తేలిపోవడంతో మెస్సీ కూడా చేష్టలుడిగి ఉండిపోయాడు.
ఇక 1962 తర్వాత వరుసగా రెండు ఫిఫా ప్రపంచకప్‌లు గెలవాలన్న కల కూడా చెదరడం మెస్సీ కన్నీటికి మరో కారణం. 39 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో పోటీ పడుతూ ఆటను కొనసాగించిన మెస్సీ మరో ఫిఫా ప్రపంచకప్ ఆడడం అనుమానమే. మంచి ఫామ్‌లో ఉన్నందున ఈసారి ఎలాగైనా అర్జెంటీనాకు రెండోసారి ఫిఫా టైటిల్‌ను అందించాలని మెస్సీ కలగన్నాడు. బరిలోకి దిగిందే తడవుగా ప్రత్యర్థులతో పోరాట సింహంలా తలపడ్డాడు. 8 గోల్స్‌తో పాటు 4 అసిస్ట్‌లు చేసిన మెస్సీ సిల్వర్ బూట్‌ను కూడా గెలుచుకున్నాడు.

Photo Credit: FIFA Twitter
అవార్డులు కొత్త కానప్పటికీ ఈసారి మెస్సీ ఫిఫా టైటిల్‌ను గెలిచిన మరుక్షణమే ఆటకు వీడ్కోలు పలికేవాడేమో. ప్రస్తుతం తన రిటైర్మెంట్‌పై మౌనమే వహించినప్పటికీ 2030 ఫిఫాలో మెస్సీ ఆడడం డౌటే. కాబట్టి ఫుట్‌బాల్‌లో ఒక శకం దాదాపు ముగిసినట్లే.
Lionel Messi, Arjantin taraftarlarının tezahüratıyla duygulanıyor. pic.twitter.com/FkN2VjlUSm
— Messi Anıları (@messianilari) July 19, 2026
Lionel Messi gets emotional as Argentina fans shower him with love and support 🥹 pic.twitter.com/kff4YYJBwu
— Instablog9ja (@instablog9ja) July 20, 2026
ESTE ULTÚIMO TANGO
Una de las cosas más hermosas del fútbol es tener a Lionel Andrés Messi y su participación en todos los Mundiales. Gracias por todo lo que has logrado con la selección: récords, logros y campeonatos Gracias por cada momento de alegría que compartimos con la… pic.twitter.com/6GYfKBKpnz— AR (@ionlylei) July 20, 2026


