Photo Credit: FIFA Twitter
ఫిఫా ప్రపంచకప్ 2026 విజేతగా స్పెయిన్ అవతరించింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయం సాధించి రెండోసారి ఫిఫా విశ్వవిజేతగా నిలిచింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఓటమి షాక్‌లో ఉన్న అర్జెంటీనా ఆటగాళ్లు సహనం కోల్పోయి స్పెయిన్ ఆటగాళ్లతో గొడవకు దిగారు.
చిలికి చిలికి గాలి వానలా మారిన గొడవ తన్నుకునేంత వరకు వెళ్లింది. దీంతో అప్పటివరకు రణరంగంలా కనిపించిన మైదానం యుద్ధభూమిని తలపించింది. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో అర్జెంటీనా హెడ్ కోచ్‌తో పాటు సపోర్ట్ స్టాఫ్ మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆటగాళ్లను విడదీసి పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ చాలాసేపు ఉద్రిక్తత కొనసాగింది.
ఈ ఘర్షణలో అర్జెంటీనా మిడ్ ఫీల్డర్ లియాండ్రో పరేడెస్.. స్పెయిన్ ఆటగాళ్లు గావీ, ఎరిక్ గార్సియాలతో వాగ్వాదానికి దిగినట్లు వీడియోలో కనిపించింది. ఆ సమయంలో పరేడెస్ ప్రత్యర్థి ఆటగాడిని తోసివేయడంతో పాటు చేయి చేసుకున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే ఈ గొడవను ఫిఫా తీవ్రంగా పరిగణించింది. ఘర్షణకు కారణమైన లియాండ్రో పరెడేస్‌పై రెడ్ కార్డు చూపించి క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. దీంతో ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్లో రెడ్ కార్డు అందుకున్న రెండో ఆటగాడిగా పరేడెస్ నిలిచాడు. అంతకుముందు మ్యాచ్ జరుగుతున్న సమయంలో అర్జెంటీనా స్టార్ మిడ్ఫీల్డర్ ఎంజో ఫెర్నాండెజ్ కూడా రెడ్ కార్డు అందుకున్నాడు. ఈసారి ఫిఫా ప్రపంచకప్‌లో ఆఖరి అంకం దాకా హీరోగా నిలిచిన అర్జెంటీనా ఈ ఒక్క ఘటనతో విలన్‌గా మారిపోయింది.
🚨🥊 Full scenes after final whistle.@MickyJnr__ 🎥 pic.twitter.com/ZXCvAFkHwy
— Fabrizio Romano (@FabrizioRomano) July 20, 2026
Read: అర్జెంటీనా గెలవదని 14 కోట్లు పందెం.. డ్రేక్ శాపం ఫలిస్తుందా?


