Photo Credit: FIFA Twitter
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత స్పెయిన్ విజయంతో అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ మైదానంలో నిరాశతో కూర్చుండిపోయాడు. వరుసగా రెండోసారి అర్జెంటీనాకు ఫిఫా ప్రపంచకప్ అందించాలన్న కల చెదరడంతో ఏం చేయలేక కన్నీటిపర్యంతమయ్యాడు.
ఈసారి ఫిఫా టోర్నీ ఆరంభం నుంచి ఫుల్‌జోష్‌లో కనిపించిన అర్జెంటీనా.. ఫైనల్ వరకు హీరోగానే నిలిచినప్పటికీ, మ్యాచ్ ముగిసిన తర్వాత అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పరెడెస్ ఓటమి బాధను తట్టుకోలేక స్పెయిన్ ఆటగాళ్లతో గొడవకు దిగడం ఆ జట్టును విలన్‌గా మార్చేసింది. ఫిఫా ఆరంభం నుంచి ఎన్ని వివాదాలు జరిగినా ప్రపంచమంతా అర్జెంటీనా గెలవాలని బలంగా కోరుకుంది. కానీ ఫైనల్ మ్యాచ్ తర్వాత జరిగిన గొడవ అర్జెంటీనాను హీరో నుంచి జీరోకు పడిపోయేలా చేయడమే గాక, టోర్నీ విలన్‌గా మారిపోయింది.

Photo Credit: FIFA Twitter
2022 ఖతార్ ప్రపంచకప్‌లో తమ ఆటతీరుతో అందరి మన్ననలు పొందిన అర్జెంటీనా నాలుగేళ్ల తర్వాత జరిగిన ఫిఫా 2026లో మాత్రం వారి ప్రయాణం మొత్తం వివాదాలతోనే నడిచింది. ఈజిప్ట్‌పై చివరి నిమిషంలో 3-2 తేడాతో విజయం సాధించినప్పటికీ, ఈ మ్యాచ్ విజయం అర్జెంటీనాను మరింత వివాదంలోకి నెట్టేసింది.
అర్జెంటీనా గెలవడానికే ఫిఫా నిర్వహిస్తున్నారని, రిఫరీ ఎవరైనా అర్జెంటీనాకు అనుకూలంగా నిర్ణయాలు ఉంటున్నాయని, అంతమాత్రాన ఫిఫా ప్రపంచకప్ నిర్వహించడం ఎందుకని, టైటిల్‌ను అర్జెంటీనాకు ఇచ్చేయాలనే విమర్శలు వచ్చాయి. ఇలా టోర్నీలో అర్జెంటీనా సాధించిన ప్రతీ విజయం వెనుక ఒక మెలిక ఉండడం పరిపాటిగా మారిపోయింది.

Photo Credit: FIFA Twitter
ఈసారి టోర్నీ అంతటా వివాదాలు, సోషల్ మీడియాలో చర్చలు ఉన్నప్పటికీ, మెస్సీ మాత్రం తన ఆదర్శప్రాయమైన ప్రవర్తనతో జట్టును నడిపించాడు. అంతా చేజారిపోయినట్లు అనిపించిన మ్యాచ్‌ల్లో కూడా తన మ్యాజిక్‌తో అర్జెంటీనావైపు మొగ్గేలా చేశాడు. మెస్సీ మరో ఫిఫా ప్రపంచకప్ ఆడడం అనుమానమే. కాబట్టి తర్వాతి ఫిఫాకు ఈ దిగ్గజం లేకుండానే అర్జెంటీనా ముందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. మెస్సీకి ఒక పరిపూర్ణమైన ముగింపు కల్పించే అవకాశం అర్జెంటీనాకు లభించినప్పటికీ ఫైనల్ తర్వాత జరిగిన ఒక్క గొడవ ఆ జట్టు ఆటగాళ్లను విలన్లుగా మార్చేసింది.
Read: కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. ఏం జరిగింది?


