Photo Credit: FIFA Twitter
ఫిఫా ప్రపంచకప్ 2026లో రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనాకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. భారత కాలమాన ప్రకారం మంగళవారం తెల్లవారుజామున మెస్సీ సేన అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టింది. ముందుగా బ్యూనస్ ఎయిర్స్‌లోని ఐజా అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆటగాళ్లు, కోచ్, సహాయక సిబ్బందికి మూడు ప్రత్యేక ఓపెన్‌టాప్ బస్సులను ఏర్పాటు చేశారు.

Phot Credit: FIFA Twitter
ఈ క్రమంలో ఎయిర్‌పోర్టు నుంచి సెంట్రల్ బ్యూనస్ ఎయిర్స్‌కు చేరుకునే దారిలో అభిమానులు పోటెత్తారు. ఇసుకేస్తే రాలనంతగా జనంతో రాజధాని వీధులు నిండిపోయాయి. మ్యూజిక్ చాంటింగ్స్, ర్యాప్ సాంగ్స్‌తో వీధులన్నీ హోరెత్తిపోయాయి. భారీగా తరలివచ్చిన అభిమానులను చూసిన అర్జెంటీనా ఆటగాళ్లు బస్ క్యాబిన్ డోర్లను ఓపెన్ చేసి బయటకు వచ్చి అభివాదం చేశారు.
చేతిలో ఫిఫా ట్రోఫీలకు బదులు వాళ్లు సాధించిన సిల్వర్ మెడల్స్, సిల్వర్ ట్రోఫీలను చూసే అభిమానులు మురిసిపోయారు. ట్రోపీలు ఎవడికి కావాలి.. మీ ఆటతో మనసులు గెలిచారు అని అభిమానులు తమ సందేశాలు వినిపించారు.'కమాన్ అర్జెంటీనా' అని నినాదాలతో హోరెత్తించారు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది.

Phot Credit: FIFA Twitter
అర్జెంటీనా సారథి లియోనల్ మెస్సీ జట్టుతో ప్రయాణం చేయలేదు. తన కుటుంబం కూడా తనతోనే ఉండడంతో మెస్సీ అమెరికాలోనే ఉండిపోయాడు. ఇంటర్ మియామి క్లబ్ తరఫున ఆడుతున్న మెస్సీ కొంత బ్రేక్ తర్వాత మళ్లీ ఆ క్లబ్‌తో జాయిన్ అవ్వనున్నాడు. దీంతో ఫిఫా ప్రపంచకప్ తర్వాత మెస్సీ స్వదేశానికి వస్తాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. తమ ఆరాధ్య దైవాన్ని లైవ్‌లో చూడాలని ఆశించిన అభిమానులకు భంగపాటు ఎదురైంది.

Phot Credit: FIFA Twitter
అయితే తాను రాకున్నా తాను సాధించిన సిల్వర్ బూట్‌ను మాత్రం అభిమానులకు కానుకగా జట్టుతో పాటే పంపించాడు. గోల్‌కీపర్ ఎమిలియో మార్టినేజ్ సహా నికోలస్ ఒటమెండి, మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పరెడెస్, అలెక్సిక్‌మాక్ అలిస్టర్, నికోలస్ గొంజలెజ్, సహా అర్జెంటీనా ఆటగాళ్లు తమను చూసేందుకు వచ్చిన అభిమానులను ఉద్దేశించి అభివాదం చేస్తూ కృతజ్ఞతలు చెప్పడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Phot Credit: FIFA Twitter
ఇక ఫిఫా ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన అర్జెంటీనా ఫైనల్లో స్పెయిన్ చేతిలో 1-0తో పరాజయం చవిచూసింది. ఫెర్నాండేజ్ రెడ్‌కార్డుకు గురవ్వడంతో పది మందితోనే ఆడిన అర్జెంటీనా మ్యాచ్‌ను లాక్కొచ్చింది. ఫిఫా టోర్నీ అంతటా అర్జెంటీనా జట్టును తన భుజస్కందాలపై మోసిన మెస్సీ ఫైనల్ మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోయాడు.
అయితే టోర్నీ ఆసాంతం అసాధారణ ఆటను కనబరిచిన మెస్సీ 8 గోల్స్‌తో సిల్వర్ బూట్‌ను సొంతం చేసుకున్నాడు. వచ్చే ఫిఫా ప్రపంచకప్ (2030)లో మెస్సీ ఆడడం అనుమానమే కాబట్టి తమ ఆరాధ్య ఆటగాడిని చివరిసారి అర్జెంటీనా జాతీయ జెర్సీలో చూడాలని ఆశించిన అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది.
🇦🇷💙 ¡GRACIAS POR TODO, SELECCIÓN!
📹 @Argentina pic.twitter.com/fzzLE6k1Be— TyC Sports (@TyCSports) July 21, 2026
Despite the World Cup final loss, thousands of Argentine fans were there to welcome their heroes home. Respect. 🫡 🇦🇷🩵 pic.twitter.com/Bo9UfU60nL
— MC (@CrewsMat10) July 20, 2026
Argentina 🩵 pic.twitter.com/gn9ZhMuDP3
— Selección Argentina in English (@AFASeleccionEN) July 20, 2026


