ఫిఫా అధ్యక్షుడికి ఐరాస అత్యున్నత పదవి..? | Donald Trump Want FIFA President Gianni Infantino To Be UN Secretary General | Sakshi
Sakshi News home page

ఫిఫా అధ్యక్షుడికి ఐరాస అత్యున్నత పదవి..?

Jul 22 2026 11:29 AM | Updated on Jul 22 2026 11:38 AM

Donald Trump Want FIFA President Gianni Infantino To Be UN Secretary General

credit: Fox News

2026 ఫిఫా ప్రపంచకప్ విజయవంతంగా ముగిసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినోపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురాగల నాయకత్వ లక్షణాలు ఇన్ఫాంటినోకు ఉన్నాయని ప్రశంసిస్తూ, ఆయన ఐక్యరాజ్యసమితి (UN) తదుపరి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాలని ట్రంప్‌ కోరుకుంటున్నట్లు నివేదికలు వెల్లడించాయి.

అయితే, ట్రంప్ వ్యాఖ్యలు చేసినంత మాత్రాన ఇన్ఫాంటినో యూఎన్ ప్రధాన కార్యదర్శి కాలేరు. ఆ పదవికి ఎంపిక కావాలంటే ముందుగా 15 సభ్య దేశాలున్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UN Security Council) మద్దతు అవసరం. ఐదు శాశ్వత సభ్య దేశాల్లో (అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా) ఏ ఒక్క దేశం వీటో విధించినా అభ్యర్థిత్వం నిలిచిపోతుంది.

భద్రతా మండలి ఆమోదం లభించిన తర్వాతే అభ్యర్థి పేరును యూఎన్ సర్వసభ్య సమావేశం (General Assembly) తుది ఆమోదానికి పంపుతుంది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ పదవీకాలం ఈ ఏడాది డిసెంబరుతో ముగియనుండటంతో, కొత్త ప్రధాన కార్యదర్శి ఎంపిక ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.

ఇప్పటివరకు జియానీ ఇన్ఫాంటినో ఈ పదవికి పోటీ చేయాలనే ఆసక్తి వ్యక్తం చేసినట్లు లేదా ట్రంప్‌తో అధికారికంగా చర్చలు జరిపినట్లు ఎలాంటి నిర్ధారణ లేదు.

ఇక యూఎన్ ప్రధాన కార్యదర్శి రేసులో చిలీ మాజీ అధ్యక్షురాలు మిచెల్ బాచెలెట్, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోస్సీ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

కాగా, ప్రపంచకప్ విజయవంతంగా నిర్వహించిన తర్వాత భవిష్యత్తులో మరోసారి టోర్నీని అమెరికాలో నిర్వహించాలని ట్రంప్‌ ఫిఫాను కోరనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట ముగిసిన ఫైనల్లో అర్జెంటీనాపై గెలిచి స్పెయిన్‌ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. విజేతకు ట్రంప్‌ చేతుల మీదుగా ట్రోఫీని బహుకరించారు. ఈ టోర్నీని అమెరికా,కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా నిర్వహించాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement