అణు కేంద్రంపై బాంబులేస్తాం  | Iran Denies Secret Nuclear Site At Pickaxe Mountain Amid US Strike Threat | Sakshi
Sakshi News home page

అణు కేంద్రంపై బాంబులేస్తాం 

Jul 23 2026 4:41 AM | Updated on Jul 23 2026 6:26 AM

Iran Denies Secret Nuclear Site At Pickaxe Mountain Amid US Strike Threat

ఇరాన్‌కు ట్రంప్‌ హెచ్చరిక 

వాషింగ్టన్‌/దుబాయ్‌: ఇరాన్‌ అణ్వాయుధ ఆశను శాశ్వతంగా చెదరగొట్టేందుకు ఎంతకైనా తెగిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. దక్షిణ ఇరాన్‌లోని నటాంజ్‌ అణు శుద్ధి కర్మాగారం సమీపంలో పర్వతం అడుగున నిర్మాణ దశలో ఉన్న ‘పిక్‌యాక్స్‌ మౌంటేన్‌’అణుకేంద్రంపై దాడులు చేయాలని భావిస్తున్నట్లు ట్రంప్‌ తెలిపారు. మంగళవారం శ్వేతసౌధంలో మీడియాతో ట్రంప్‌ మాట్లాడారు. 

2025లో 12 రోజులపాటు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బాంబులేశాయి. కానీ పిక్‌యాక్స్‌ పర్వత ప్రాంతం జోలికి పోలేదు. ఇప్పుడు ఆ ప్రాంతం పని పడతామని ట్రంప్‌ వెల్లడించారు. హార్మూజ్‌లో స్వేచ్ఛాయానం చేసే నౌకలపై ఇరాన్‌ దాడి చేసినప్పుడల్లా ఆ దేశంలోని ఒక విద్యుత్‌ఉత్పత్తి కేంద్రం లేదా ఒక వంతెనను నేలమట్టంచేస్తానని ట్రంప్‌ హెచ్చరించారు. ‘‘ఇరాన్‌ క్షిపణి, రాకెట్, డ్రోన్‌ మరేదైనా ఆయుధ వ్యవస్థను ప్రయోగిస్తే ఒక్కో దాడికి అమెరికా బదులుతీర్చుకుంటుంది. 

ఇరాన్‌ దాడిచేస్తే ప్రతిసారీ ఒక పవర్‌ ప్లాంట్‌ లేదా బ్రిడ్జిని బద్దలుకొడతాం’’అని ట్రంప్‌ ‘ట్రూత్‌సోషల్‌’లో ఒక పోస్ట్‌పెట్టారు. హెచ్చరికలతోడు అమెరికా వైమానిక దళా లు మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉద యం దాకా ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై దాడు లు చేశాయి. ఈ దాడులను ఇరాన్‌ ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌(ఐఆర్‌జీసీ)లోని గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకునే ప్రయత్నంచేశాయి. దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌లోని ఏలాట్‌ నగర శివారు ప్రాంతం అఖాబాపై దాడులు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement