టెహ్రాన్: ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో టెహ్రాన్ ఘాటుగా బదులిచ్చింది. తమ దేశ మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడి జరిగినా దానికి తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఇరాన్‌పై మండిపడ్డారు. "హర్ముజ్ జలసంధిలో పయనించే ఏ నౌకపైనా ఇరాన్ దాడులు చేయకూడదు. ఇరాన్ మిస్సైళ్లు, రాకెట్లు లేదా డ్రోన్లతో ఏ నౌకపైనైనా దాడి చేస్తే... దానికి ప్రతికారంగా ఇరాన్‌లోని ఒక వంతెనను లేదా విద్యుత్ ప్లాంట్‌ను అమెరికా దళాలు బాంబులతో పేల్చివేస్తాయి. అని హెచ్చరించారు.
దీనిపై స్పందించిన అరాఘ్చీ "మా రక్షణ విధానం చాలా స్పష్టం 'కంటికి కన్ను' ఇరాన్ మౌలిక సదుపాయాలపై జరిగే ఏ రకమైన దాడికైనా మా స్పందన అత్యంత శక్తివంతంగా, నిర్ణయాత్మకంగా ఉంటుంది" అని పేర్కొన్నారు.అనంతరం ఆ దేశ ఆర్మీ అధికారులు మాట్లాడుతూ అమెరికా చేస్తున్న ఈ బెదిరింపుల వల్ల యుద్ధం మరింతగా పెరగడం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.
కాగా అమెరికా - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు విఫలమవ్వడంతో దాడులు తీవ్రతరమవుతున్నాయి. దీంతో వరుస దాడులతో పశ్చిమాసియా ప్రాంతం ఉద్రిక్తంగా మారింది.


