breaking news
warning
-
‘నన్ను నగ్నంగా మార్చకండి!’
నేను మీ పాదాల కింద ఉన్న భూమిని. యుగాలుగా మిమ్మల్ని మోస్తున్న ఓర్పును. పేగు బంధంతో మీ పొట్ట నింపుతున్న తల్లిని. కానీ ఈరోజు మీ పురోగతి నా పాలిట శాపమైంది. మానవ మనుగడకు కావలసిన వనరులన్నీ నా గుండె లోతుల్లోంచి తీసి ఇచ్చినందుకు నాకిదేనా బహుమానం? ఒకవేళ నాకు గొంతు వస్తే.. నా వేదనను మీకు ఇలా విన్నవించుకునేదాన్ని!శాస్త్ర సాంకేతిక రంగాల మహత్తర ప్రగతి అని మీరు మురిసిపోతుంటే ఆ వెనుక కుమిలిపోతున్నది నేనే. రోజూ పారిశ్రామిక రంగాలు వెదజల్లే నల్లని దట్టమైన పొగలు, విషవాయువులతో నా శ్వాస ఆగిపోతోంది.మీ ఆసుపత్రులు, వైద్య రంగం ఇచ్చే చికిత్సలతో మనుషులు కోలుకుంటున్నారు గానీ, అక్కడి నుంచి వెలువడే బయో మెడికల్ వ్యర్థాలు, హానికర ప్లాస్టిక్ నన్ను రోగగ్రస్తురాలిగా మారుస్తున్నాయి.పారిశుధ్య లోపం వల్ల ఉత్పత్తయ్యే కుళ్లిన వ్యర్థాలు, పారిశ్రామిక రసాయనాలు నా సిరల్లోకి విషాన్ని నింపుతున్నాయి.ఎలక్ట్రానిక్స్, 5జీ యుగం తెచ్చిన మొబైల్ రేడియేషన్ నా వాతావరణాన్ని, జీవవైవిధ్యాన్ని అతలాకుతలం చేస్తోంది. మానవ తప్పిదాల వల్ల నా నేల తల్లి నల్లబడిపోతోంది.పండిస్తున్న పంటల పేరుతో వ్యవసాయంలో విచ్చలవిడిగా వాడే క్రిమిసంహారక మందులు, రసాయన ఎరువులు నా జీవసారాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి.పచ్చని చెట్లను నరికివేసి నన్ను నగ్నంగా మార్చడం వల్ల వర్షపు నీటికి నా పైపొరలు కొట్టుకుపోయి నేల తీవ్ర క్రమక్షయానికి గురవుతోంది.మీ నాగరికత సాధించిన ప్రగతికి నేను సంతోషిస్తున్నాను.. కానీ విషపు వలయాలతో నా గుండెలపై నిర్మించే ఏ సామ్రాజ్యమూ శాశ్వతం కాదని గ్రహించండి!దయచేసి మానవాళికి నా విజ్ఞప్తి..క్రిమిసంహారకాలు, కృత్రిమ ఎరువులతో నేలను విషపూరితం చేయకండి; ప్రకృతి వ్యవసాయాన్ని ఆదరించండి.పచ్చదనాన్ని నాశనం చేసి నేల క్రమక్షయానికి కారణం కాకండి.ప్లాస్టిక్, ఇ-వేస్ట్, వైద్య వ్యర్థాలను నిర్లక్ష్యంగా నేలపై పడేసి నన్ను కలుషితం చేయకండి.పరిమితి లేని వాహన వినియోగం, పారిశ్రామిక వ్యర్థాలతో నా వాతావరణానికి, ఆయువుకు గొడ్డలిపెట్టు కాకండి.ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా పసిడి ధరలు.. ఒక్కరోజే ఇంతలా.. -
‘అతడి జోలికి వెళ్లొద్దు’.. ఫిఫాకు ట్రంప్ వార్నింగ్!
ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో పదవి నుంచి తప్పించాలని ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనకు మద్దతుగా నిలవడం ఆసక్తి కలిగిస్తోంది. ఇన్ఫాంటియానోను పదవి నుంచి తప్పించాలని ప్రపంచ ఫుట్‌బాల్ నియంత్రణ సంస్థ నిర్ణయం తీసుకుంటే అంతకంటే పెద్ద పొరపాటు ఇంకేమి ఉండదని తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో ఘాటుగా వ్యాఖ్యానించారు.ఫిఫా వరల్డ్ కప్ వంటి ప్రపంచ స్థాయి టోర్నమెంట్ల వాణిజ్య హక్కులను నిర్వహించేందుకు 20 బిలియన్ డాలర్ల విలువైన ఒక కొత్త అనుబంధ సంస్థను ఏర్పాటు చేయాలని ఫిఫా యోచిస్తోంది. ఇందులో 20 శాతం వాటాను ప్రైవేట్ పెట్టుబడిదారులకు విక్రయించాలని ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రణాళికను విరమించుకునేంత వరకు ‘ఫిఫా’ అన్నీ టోర్నమెంట్లను బహిష్కరించనున్నట్లు యూరోపియన్ సాకర్ సంస్థ హెచ్చరించింది. ఫిఫా అధ్యక్ష పదవి నుంచి కూడా ఇన్ఫాంటినో తప్పుకోవాలనే డిమాండ్లు కూడా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ అతడికి మద్దతు పలకడం గమనార్హం.ఇక ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో ఇలా రాసుకొచ్చారు. "ఏ కారణం చేతనైనా, అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినోను తొలగించాలని ఫీఫా కనీసం ఆలోచించినా అది ఒక ఘోరమైన పొరపాటే అవుతుంది. ఆయన అద్భుతమైన వ్యక్తి. ఇప్పటివరకు నిర్వహించిన ప్రపంచ కప్లలోకెల్లా అత్యంత విజయవంతమైన దానిని నాలుగుసార్లు నిర్వహించారు. ఆయన లేకపోయుంటే ఇంత లాభదాయకంగా ఉండేది కాదేమో! ఈ విషయంపై శ్రద్ధ వహించినందుకు ధన్యవాదాలు’’ అని ట్రంప్ పేర్కొన్నారు.2016 నుంచి గియాని ఇన్ఫాంటినో ఫిఫా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. 2019, 2023 ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన... వచ్చే ఏడాది మార్చిలో మొరాకో వేదికగా జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో చివరిసారి పోటీ చేయనున్నారు. ‘ఫిఫా’లో మొత్తం 211 సభ్య దేశాలు ఉండగా... యూరప్, దక్షిణామెరికాలోని 90 దేశాలతో పాటు ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్యలోని 46 దేశాలు కూడా ఇన్ఫాంటినో ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఎన్నికలపై దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది.Read: ఆ ముగ్గురి నుంచి ఫోన్‌కాల్.. అందరికీ ఒకటే సమాధానం! -
తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు.. సీవీ ఆనంద్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిపార్ట్మెంట్లో నలుగురు అధికారుల తీరు సరిగ్గా లేదన్నారు. ఇదివరకే చాలాసార్లు చెప్పి చూశామన్నారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీజీపీ వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రకంపనలు మెుదలయ్యాయి. సీవీ ఆనంద్ ఏ అధికారులను ఉద్దేశించి ఈ బహిరంగ హెచ్చరికలు చేశారా అని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. -
పరిపాలనలో పూర్తిగా ఫెయిల్.. మేము వచ్చాక ఒక్కొక్కడికి..
-
అడ్డుకున్న పోలీసులు.. ఇచ్చిపడేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి
-
ఖబర్దార్ బోండా ఉమా.. ఒళ్లు దగ్గర పెట్టుకో! మీ ఇంటిని ముట్టడించడం ఖాయం!
-
నా ఇంట్లో మీ పెత్తనం ఏంటి?.. అభిజిత్ దీప్కే ఫైర్!
భద్రత కోసం వచ్చిన పోలీసు అధికారి తనపై ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అబిజీత్ దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కలిసేందుకు వచ్చే వారిని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ.. తన నివాసం వద్ద భద్రతా విధుల్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఛత్రపతి శంభాజీనగర్‌లోని వాలుజ్ ఎంఐడీసీ ప్రాంతంలోని దీప్కే నివాసం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల బెదిరింపుల నేపథ్యంలో, అలాగే ఆయనను కలిసేందుకు భారీగా ప్రజలు వస్తుండటంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఓ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ను అక్కడ నియమించారు. అయితే ఆ అధికారి తన ఇంటికి వచ్చే వారిని నియంత్రిస్తున్నారని దీప్కే ఆరోపించారు.‘ఎవరిని కలవాలో మీరు నిర్ణయిస్తారా?’వైరల్‌గా మారిన ఓ వీడియోలో.. సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసు అధికారితో దీప్కే వాగ్వాదం చేస్తూ కనిపించారు. తన ఇంటికి ఎవరు రావాలి.. ఎవరిని కలవాలి అనే విషయాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. “నా ఇంట్లో మీ పెత్తన ఏంటి?. నేను ఎవరినైనా ఇంట్లోకి రావాలని చెబుతున్నప్పుడు.. వారిని ఎందుకు ఆపుతున్నారు? ఢిల్లీ పోలీసుల్లా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఇప్పటివరకు ఎలాంటి సమస్య జరగలేదు. ఎవరిని కలవాలి.. ఎవరిని కలవకూడదో పోలీసులు నాకు చెప్పలేరు” అంటూ దీప్కే ప్రశ్నించారు.అంతేకాకుండా.. “మీరు బయటకు వెళ్లండి. నాకు మీ అవసరం లేదు” అంటూ ఆ పోలీసు అధికారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు.Chhatrapati Sambhajinagar - Abhijit Dipke has made strong allegations against CID officers, accusing them of arrogant and rude behaviour towards people who come to meet him.Dipke, who flared up against the police officers, claimed that visitors arriving for meetings with him are… pic.twitter.com/5hCF6s7p8Y— NextMinute News (@nextminutenews7) August 7, 2026ఉన్నతాధికారికి ఫోన్లో ఫిర్యాదుమరో వీడియోలో దీప్కే ఓ పోలీసు ఉన్నతాధికారితో ఫోన్లో మాట్లాడారు. సురేశ్ అనే పీఎస్ఐ తనను కలిసేందుకు వచ్చే వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. వారిని ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నారని, అలాంటి అధికారి తనకు వద్దని పేర్కొన్నారు. వెంటనే అతడిని అక్కడి నుంచి తొలగించాలని కోరారు. “నా ఇంటికి వచ్చే వారిని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది కావాలనే చేస్తున్నారా?” అంటూ ఆయన ప్రశ్నించినట్లు వీడియోలో వినిపిస్తోంది.నిఘా ఆరోపణలుతన నివాసం సమీపంలో సీఐడీ సిబ్బంది సాధారణ దుస్తుల్లో నిఘా పెట్టారని కూడా దీప్కే ఆరోపించారు. ఓ రిపోర్టర్ తనకు ఈ విషయం తెలిపారని చెప్పారు. ఓ సీఐడీ సిబ్బంది ఫోన్లో ‘హిట్ స్ప్రే’ పేరుతో వాట్సాప్ గ్రూప్ కనిపించిందని, అక్కడి నుంచి నివేదికలు పంపిస్తున్నారని ఆరోపించారు. అయితే దీప్కే చేసిన ఆరోపణలపై పోలీసుల నుంచి అధికారిక స్పందన వెంటనే రాలేదు. వాలుజ్ ఎంఐడీసీ పరిధి డీసీపీ పంకజ్ అతుల్కర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన లభించలేదు. మరోవైపు.. అభిజిత్ యాటిట్యూడ్పైనా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇటీవల నిరసనలు, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన అబిజీత్ దీప్కే.. తాజాగా తన ఇంటి వద్ద భద్రతా సిబ్బందితో జరిగిన ఈ వివాదంతో మరోసారి చర్చనీయాంశంగా మారారు. భద్రత పేరుతో వ్యక్తిగత స్వేచ్ఛను నియంత్రించకూడదన్నది దీప్కే వాదన కాగా.. భద్రతా ఏర్పాట్లలో భాగంగానే పోలీసులు వ్యవహరించారని అధికారులు భావిస్తున్నారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. -
ఇరాన్‌పై ట్రంప్ ‘టూ ఆప్షన్స్’ బాంబ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చర్చల విషయంలో ఇరాన్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరాన్ ముందు ఇప్పుడు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయని.. వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవడం తప్ప మరో మార్గం లేదని అల్టిమేటం జారీ చేశారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ బహిరంగంగా అమెరికాతో చర్చలు జరగడం లేదని చెబుతున్నప్పటికీ, సమస్య పరిష్కారం కోసం చర్చలకు ప్రయత్నించిందని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఇరాన్ సృష్టించిన సమస్యకు పరిష్కారం కోసం తాము చర్చలు జరుపుతున్నామని అన్నారు.“ఒకటి ఒప్పందం చేసుకోవడం.. లేదంటే పూర్తిగా లొంగిపోవడం” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.హర్ముజ్ జలసంధిపై ట్రంప్ హెచ్చరికప్రపంచంలోని అత్యంత కీలకమైన వాణిజ్య మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధి అంశంపైనా ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతంపై అమెరికా నౌకాదళానికి పూర్తి నియంత్రణ ఉందని, తమ అనుమతి లేకుండా ఇరాన్‌కు ఎలాంటి రాకపోకలు జరగవని స్పష్టం చేశారు. “ఒప్పందం కుదిరే వరకు లేదా పూర్తిగా లొంగిపోయే వరకు ఎలాంటి మార్పు ఉండదు” అనే రీతిలో ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి.దాడి నుంచి చర్చల వైపు ట్రంప్ అడుగుఇరాన్పై రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద దాడి చేస్తామని మొన్న హెచ్చరించిన ట్రంప్.. నిన్న ఆ సైనిక చర్యను తాత్కాలికంగా నిలిపివేశారు. గల్ఫ్ దేశాలు ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ నేతల సూచనలతో పాటు దౌత్య మార్గాలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు సోమవారం ప్రారంభమవుతాయని ట్రంప్ చెప్పినప్పటికీ.. వాటి వివరాలను వెల్లడించలేదు.ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ రియాక్షన్ ఇదేఅంతకు ముందు అమెరికా వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. ప్రస్తుతం వాషింగ్టన్‌తో ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ.. అమెరికాతో చర్చలు జరుగుతున్నాయన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ప్రస్తుతం తాము ఒమన్‌తో మాత్రమే సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. హర్ముజ్ జలసంధిలో తాత్కాలిక సురక్షిత రాకపోకల ఏర్పాటుకు సంబంధించిన చర్చలు మాత్రమే జరుగుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇరాన్‌కు డీల్ లేదంటే పూర్తిగా లొంగిపోవడం అనే ఆప్షన్లు ఉంచారు. అయితే ట్రంప్ ఫ్రెష్వార్నింగ్పై ఇరాన్ స్పందన రావాల్సి ఉంది. మరోవైపు.. ఇరాన్ తన సార్వభౌమత్వంపై రాజీపడబోదనే సంకేతాలు ఇస్తోంది. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని చెబుతూనే, ఉద్రిక్తతలు మరింత పెరగకుండా దౌత్య మార్గాలను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే క్షిపణి బెదిరింపులు, సైనిక కదలికలతో వేడెక్కిన పరిస్థితుల్లో.. ట్రంప్ తాజా అల్టిమేటం, ఇరాన్ తిరస్కరణతో తదుపరి పరిణామాలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. -
చంద్రబాబు ప్రభుత్వంపై ఏపీ ఉద్యోగులు తిరుగుబాటు
-
ఎగిరెగిరి పడకు.. జేసీ అస్మిత్ రెడ్డికి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్
-
ఇంట్లోకి దూరి కొట్టారు.. చంపేస్తారా..? వైకుంఠ జ్యోతిపై విరూపాక్షి ఫైర్
-
ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్.. ఈ సారి దాడి ఎప్పుడు చూడనిది
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై రెచ్చిపోయారు. ఈ వారాంతంలో ఇరాన్‌పై కనీవినీ ఎరుగని రీతిలో దాడులు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో టెహ్రాన్‌ని లొంగిపోయేలా చేసేలా అత్యంత కఠినమైన దాడులు చేయాలని సైన్యాన్ని హెచ్చరించినట్లు సమాచారం.పశ్చిమాసియా యుద్ధంలో ట్విస్టుల మీద ట్విస్టులు నడుస్తున్నాయి. యుద్ధం ముగుస్తుందనుకునేలోపే మళ్లీ తీవ్రస్థాయికి చేరింది.ఇది చాలదన్నట్లు ఇటీవలే అమెరికాకు మద్ధతుగా సౌదీ అరేబియా సైతం రంగప్రవేశం చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఇరాన్‌కు ఝలకిచ్చారు.వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.." టెహ్రాన్‌ను లొంగిపోయేలా ఇరాన్‌పై కఠినమైన దాడులు చేయండి. వారు అబద్ధాలు చెబుతారు. తప్పుగా అన్వయిస్తారు. ఇరాన్‌పై విశ్వాసం కోల్పోతున్నాము మనము వారిని చాలా తీవ్రంగా దెబ్బతీద్దాం. దీంతో ఏదో ఒక సమయంలో, ఇకపై దీనిని భరించలేమని వారు చెబుతారు," అని ట్రంప్ అన్నట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ యుద్ధంలో అమెరికా ఎట్టిపరిస్థితుల్లో గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపాయి.అత్యంత కఠినమైన బాంబు దాడిగా?కాగా అక్కడి కథనాల ప్రకారం, ఇరాన్ యొక్క ఇంధన మౌలిక సదుపాయాల లక్ష్యాలు, రిఫైనరీలే టార్గెట్‌గా ఈ దాడులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన బాంబుదాడులలో అత్యంత తీవ్రమైనదిగా నిలిచేలా ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. ఈ భారీ దాడులను అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపేలా ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం. -
భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాచలంటౌన్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో 29 అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం శుక్రవారం ఉదయానికి ఒక్కసారిగా పెరిగిపోయింది. రాత్రి 55 అడుగులు దాటి ప్రవహించింది. ఎగువన ఉన్న సమ్మక్క బ్యారేజీ నుంచి సుమారు 15 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో భద్రాచలం వద్ద ఉధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాజెక్టులన్నీ నిండిపోయి ఉండటంతో వరద మరింత పెరుగుతోంది. రాత్రి 12 గంటలకు అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద పరిస్థితిని రాష్ట్ర మంత్రులు నిరంతరం సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.స్తంభించిన రాకపోకలుగోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఏజెన్సీలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి లక్ష్మీనగరం వెళ్లే దారిలో తూరుబాక వద్ద, భద్రాచలం నుంచి చర్ల వెళ్లే రోడ్డులో కుదునూరు వద్ద ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరింది. చర్ల నుంచి వెంకటాపురం వెళ్లే రోడ్డులో ఆలుబాక వద్ద సైతం వరద నీరు రోడ్డుపైకి చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి కూనవరం వెళ్లే రోడ్డులో మురుమూరు, పోలిపాక గ్రామాల వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రాచలం దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల గ్రామాలకు కపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పరీవాహక ప్రాంత ప్రజలు నది వైపు వెళ్లవద్దని, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలుఅధికారులు యుద్ధప్రాతిపదికన వరద సహాయక చర్యలు చేపట్టారు. కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. భద్రాచలం కరకట్టతో పాటు స్లూయిస్ల వద్ద నీటి లీకేజీలు లేకుండా చేపట్టిన ముందస్తు చర్యలను పరిశీలించారు. అత్యవసర సమాచారం కోసం భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. సమాచారం, సహాయం కోసం 79952 68352 నంబర్లో సంప్రదించాలని ఐటీడీఏ పీఓ రాహుల్ సూచించారు.గంటల వ్యవధిలోనే మూడో ప్రమాద హెచ్చరికగోదావరి నీటిమట్టం శుక్రవారం ఉదయం నుంచి గంటగంటకూ పెరిగింది. ఉదయం 9 గంటలకు 41.70 అడుగులుగా ఉన్న నీటిమట్టం, 10 గంటలకు 42.80 అడుగులకు చేరింది. ఉదయం 10.14 గంటలకు 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత ఐదు గంటల వ్యవధిలోనే వరద నీరు 48 అడుగులకు చేరింది. దీంతో మధ్యాహ్నం 3.48 గంటలకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 12 గంటలకు వరద 55 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. -
సంతాప సభలకూ రాజకీయ రంగు.. చంద్రబాబు వైఖరిపై ప్రశ్నలు!
రాష్ట్ర రాజకీయాలలోనే కాదు.. దేశ రాజకీయాలలో కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీనియర్‌గా ఉన్నారు. ఆ విషయం ఆయన కూడా పలుమార్లు చెప్పుకుంటారు. ఆ సీనియారిటీని ఆయన సమాజ హితవు కోసం, వివిధ వర్గాల ఐక్యత కోసం ఉపయోగించాలని ఎవరైనా కోరుకుంటారు. దురదృష్టవశాత్తు ఈ వయసులో కూడా ఆయన రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు.కొద్ది రోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్యే, కాపు వర్గ నేత బోండా ఉమామహేశ్వరరావును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాని, వైఎస్సార్సీపీని పదేపదే అనుచిత భాషతో ప్రస్తావించడం కాని, సామాజిక కార్యక్రమాలలో సైతం ఆయా పార్టీలవారు శత్రువుల మాదిరిగా చూసుకోవాలన్నట్లుగా చేస్తున్న సూచనలు కాని ఏ మాత్రం సమంజసమైనవని అనిపించవు. బోండా ఉమా పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరిస్తుంటే పిలిచి మాట్లాడవచ్చు. అలాకాకుండా పార్టీలోని ఇతర నేతలకు కూడా ఒక సంకేతం వెళ్లేలా చంద్రబాబు ఇచ్చిన డైరెక్షన్ టీడీపీలోనే చర్చనీయాంశం అయింది.మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణించిన తర్వాత వివిధ పార్టీలకు చెందినవారు ఆయన స్వస్థలం కిర్లంపూడి వెళ్లి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముద్రగడకు కాపు సామాజికవర్గంలో ఉన్న గుర్తింపు రీత్యా వివిధ ప్రాంతాలలో సంతాప సభలు జరిగాయి. ఇవి పార్టీలకు అతీతంగా జరగడం గమనించదగ్గ అంశం. ఆ సభలు పెద్దగా రాజకీయ ప్రస్తావన లేకుండానే సాగాయి. ఒక సంతాప సభలో బోండా ఉమా, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు పక్కపక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. ఈ ఘట్టాన్ని వైఎస్సార్సీపీ నాయకత్వం సీరియస్‌గా తీసుకోలేదు. అంబటిని కాని మరెవ్వరిని కాని తప్పు పట్టలేదు. కాని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం బోండా ఉమాపై సీరియస్ అయినట్లు తెలుగుదేశం పత్రికలలో ప్రముఖంగా వార్తా కథనాలు వచ్చాయి.ఈ సందర్భంగా గొడ్డలి పార్టీ నేతలతో వేదికలు పంచుకోవద్దని చంద్రబాబు చెప్పారని ఎల్లో మీడియాలో ఒకటైన ఈనాడు పత్రిక మొదటి పేజీలో ప్రచురించింది. చంద్రబాబు ఎప్పుడైనా విమర్శల కోసం ఒకసారి అలాంటి వ్యాఖ్యలు చేస్తే అదో తరహా. కాని నిత్యం గొడ్డలి అని అభ్యంతరకర పదం వాడుతున్నారంటే ఏమని అనుకోవాలి? గొడ్డలితో హత్య చేసింది ఎవరు? అతను ఎల్లో మీడియాలో కూర్చుని డిబేట్లలో ఎలా పాల్గొన్నారు. ఆయనకు లాయర్‌ను పెట్టిందెవరు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నప్పటికీ, చంద్రబాబు మాత్రం గొడ్డలి పదాన్ని వాడడం మానడం లేదు. ఆ కేసులో జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని సీబీఐ చెప్పినా అదే దుష్ప్రచారం చేయడం కూడా సీనియర్ రాజకీయ నేతకు తగిన విషయమేనా? ఇదిలా ఉంటే ఇప్పుడు ఏకంగా వైఎస్సార్సీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దని చెప్పడం అంటే మరీ అతిగా లేదా?పెళ్ళిళ్లు, పబ్బాలు, చావులు, సంతాప సభలలో వివిధ రాజకీయ పక్షాలవారు కలవకుండా ఉంటారా? వారు మాట్లాడుకోకుండా ఉంటారా? అది కూడా తప్పే అవుతుందా? ముద్రగడ చనిపోయే సమయానికి వైఎస్సార్సీపీలో ఉన్నా, ఆయన కాపు ఉద్యమ నేతగానే జనంలో నిలిచారు. ఆయన ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు వద్దని అంతిమ లేఖలో చెప్పి ఉండవచ్చు. అందువల్లే ఆయన సంతాప సభలలో పాల్గొన్న టీడీపీ నేతలను తప్పుపట్టవచ్చా? కాపులంతా ఒక చోట సమావేశం అవుతుంటే, అలాంటి వేదికలను ఆ వర్గానికి చెందిన ఆయా పార్టీ నేతలు ఎలా పంచుకోకుండా ఉంటారు. అలా చేస్తే కులానికి దూరం అవుతామోమో అన్న భయం వారిలో ఉండవచ్చు.ఇంకో విషయం చెపాలి. ఈ మధ్య ఒక సదస్సులో అంబటి రాంబాబు, టీడీపీకి గతంలో పెద్ద మద్దతుదారు అన్న పేరున్న మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అంత మాత్రాన వారిద్దరూ ఒకటైపోయినట్లవుతుందా? కొద్ది సంవత్సరాల క్రితం ఒక సందర్భంలో అప్పటి వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి, చంద్రబాబు పక్కపక్కన కూర్చుని మాట్లాడుకున్నారే! ఒకప్పుడు చంద్రబాబు ఏమని ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. మిగిలిన సమయం అంతా అభివృద్ది, పాలనపైనే దృష్టి పెట్టాలని అనేవారు. అలా చేసినా, చేయకపోయినా కనీసం మాటవరసకైనా ప్రసంగించేవారు. కాని ఇప్పుడేమో వైఎస్సార్సీపీవారికి ఏమి చేయవద్దు.. వైఎస్సార్‌సీపీవారితో కలవవద్దు, వేదికలు పంచుకోవద్దని అంటున్నారు. తద్వారా చంద్రబాబు సీనియారిటీకే అప్రతిష్ట అవుతుంది తప్ప మరొకటి కాదు.రాజకీయాల కోసం బంధుత్వాలు, స్పేహాలు కూడా వదలుకోవాలా! అన్నప్రశ్న రాదా? సంతాప సభలో ఉమా ప్రసంగిస్తూ కాపులలో అలజడి ఆరంభమైందని వ్యాఖ్యానించారు. కాపులను పట్టించుకోవాలని, వారి డిమాండ్లను అధిష్టానం దృష్టికి తీసుకువెళతానని ఆయన పేర్కొన్నారు. కాపు ఉద్యమం చేస్తున్న తరుణంలో ముద్రగడను నిర్లక్ష్యం చేయడం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. బహుశా మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితో బోండా ఉమా ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చన్న సందేహం చంద్రబాబుకు కలిగి ఉండవచ్చు. అయినా ఇంత ఓపెన్‌గా టెలికాన్ఫరెన్స్‌లో వైఎస్సార్సీపీ నేతలతో వేదిక పంచుకోవద్దని అనడం ద్వారా చంద్రబాబు వ్యక్తిత్వానికే నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో ఏర్పడింది. దీనికి ప్రతిగా బోండా ఉమా మరో వాదన తెరపైకి తీసుకువచ్చారు.వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఏర్పాటు చేసిన సంతాప సభకు టీడీపీ నేతలు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా వంటివారు వెళ్లినప్పుడు లేని అభ్యంతరం తను వెళితేనే వచ్చిందా అన్నది ఆయన ప్రశ్నగా ఉంది. బొత్స, తోట త్రిమూర్తులు వంటి వైఎస్సార్సీపీ నేతలతో కూడా టీడీపీ నేతలు ఆ కార్యక్రమాలలో సన్నిహితంగా మెలిగారు కదా అని ఉమా ఎత్తిచూపారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్, బీజేపీ నేత సోము వీర్రాజు వంటివారు కూడా ఆ సభలో పాల్గొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారట. తాను వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెళ్లలేదని, కాపు నేత దాసరి రాము నిర్వహించిన సభకు వెళ్లానని, అక్కడ అంబటి రాంబాబు కలిసి పలకరిస్తే, సంస్కారంగా తాను కూడా మాట్లాడానని, తానేమీ పార్టీని ఇబ్బంది పెట్టలేదన్నది ఆయన అభిప్రాయంగా ఉంది.ఈ నేపథ్యంలో బోండా ఉమాను పిలవడానికి ఒక కమిటీనే చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఆ కమిటీ వద్దకు వెళ్లిన బోండా ఆ తర్వాత కాస్త తగ్గి మాట్లాడినట్లు అనిపిస్తుంది. ఇకపై వైఎస్సార్‌సీపీవారితో వేదిక పంచుకోనని ఆయన అన్నారని వార్తలు వచ్చాయి. అంటే ఇది ఉమా తన వ్యక్తిత్వాన్ని తానే కించపరచుకోవడమే అవ్వదా! మొత్తం మీద ఏదో రకంగా ఉమాను భయపెట్టి ఉండాలి. జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధాల జోలికి పార్టీ అధిష్టానం ఎందుకు వెళ్లలేదో తెలియదు.ఈ మధ్యకాలంలో కాపులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విశ్వాసం సడలుతోంది. ఆ వర్గంలో కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడుతోందన్న ప్రచారం జరుగుతుండడానికి తోడు ఇలాంటి వివాదాల వల్ల తెలుగుదేశం పార్టీ మరింత ఇరుకున పడే అవకాశం ఉంటుంది. అది ఎలా ఉన్నా సామాజిక కార్యక్రమాలలో టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు కలిసినంతమాత్రాన ఏదో జరిగిపోతుందని భయపడి వాటిపై ఆంక్షలు పెట్టడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మరీ సంకుచిత స్థాయికి చంద్రబాబు తీసుకువెళ్లినట్లు అవుతుందని చెప్పాలి. గతంలో ఇలాంటి వాతావరణం ఎన్నడూ లేదు. ఇది అత్యంత దురదృష్టకరం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
AIకి చంపే అధికారం..! ప్రపంచానికి ముప్పు..!
-
జెలెన్స్కీకి ఇరాన్ వార్నింగ్.. మూల్యం చెల్లించుకుంటావ్
ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి వార్నింగ్ ఇచ్చారు. కాస్పియన్ సముద్రంలో ఇరాన్‌కు చెందిన వాణిజ్య నౌకపై జరిగిన దాడికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీయే వ్యక్తిగతంగా కారణమని తీవ్రంగా ఆరోపించారు. ఈ ఘటనకు జెలెన్స్కీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు.ఇటీవల కాస్పియన్ సముద్రంలో వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ఒక నావికుడు మరణించగా, మరోకరు గాయపడ్డారు. ఇరాన్ తాజాగా దీనిని జెలెన్స్కీ స్వయంగా ధృవీకరించారు. ఉక్రెయిన్ బలగాలు (ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ / సెక్యూరిటీ సర్వీసెస్) ఈ దాడులకు పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటనపై అబ్బాస్ అరాఘ్చీ ఎక్స్ వేదికగా స్పందించారు. " జెలెన్ స్కీ ఒక ఇరాన్ వాణిజ్య నౌకపై దాడి చేసి, ఒక నావికుడిని చంపారు. ఐరోపాను తమ యుద్ధంలోకి లాగడానికి ఇజ్రాయెల్ ఆదేశాల మేరకు చేసిన ఈ చర్య, ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను బహిరంగంగా ఉల్లంఘించడమే. ఈయూ ఉన్నత ప్రతినిధి కల్లాస్, విదేశాంగ మంత్రి లావ్రోవ్లతో జరిపిన సంభాషణలలో, కీవ్‌లోని ఆ ఉచిత భోజనప్రియుడు చేసిన దానికి జవాబు చెప్పకుండా ఉండలేమని స్పష్టం చేశారు".కాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సౌదీ అరేబియాతో వ్యూహాత్మక, దౌత్యపరమైన సంబంధాలను బలోపేతం చేస్తున్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ, డ్రోన్ రక్షణ వ్యవస్థలు, సాంకేతికత బదిలీ, ఆహార భద్రత, ఇంధన రంగాల్లో కీలక ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ తన యుద్ధ అనుభవాన్ని, ముఖ్యంగా డ్రోన్లను తిప్పికొట్టే సాంకేతికతను సౌదీ అరేబియాతో పంచుకోవడం పట్ల ఇరాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్యం చేస్తోంది. -
ప్రభుత్వం మీ సొంత జాగీరు కాదు
న్యూఢిల్లీ: ప్రభుత్వాన్ని సొంత జాగీరులా నడపొద్దని బీజేపీ–ఆర్ఎస్ఎస్లకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన బీజేపీ–ఆర్ఎస్ఎస్ పాలకవర్గానికి ఒక హెచ్చరిక అని స్పష్టంచేశారు. ప్రభుత్వాన్ని సొంత జాగీరుగా భావిస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తే ఇప్పుడు జరిగిన దానికంటే పది రెట్లు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అవినీతికి మారుపేరైన ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవి నుంచి తప్పుకోవడం మంచి పరిణామం అని స్పష్టంచేశారు. విద్యార్థుల నిరసనను ప్రధాని మోదీ. ఆర్ఎస్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న ‘గతానికి’, భారతదేశ భవిష్యత్తుకు మధ్య జరుగుతున్న పోరాటంగా అభివరి్ణంచారు. దేశ భవిష్యత్తు గతాన్ని ఓడిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. శనివారం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. న్యాయం కోసం ఆందోళన చేసిన విద్యార్థులను క్రూరంగా హింసించారని, వారికి ప్రధాని మోదీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై జరిగిన హింసకు, వారిపై పెల్లెట్ గన్స్ ప్రయోగించడానికి అనుమతించినందుకు హోంశాఖ మంత్రి అమిత్ షానే ప్రత్యక్ష బాధ్యులు అని పేర్కొన్నారు. విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరపడాన్ని కాంగ్రెస్ అంగీకరించదని, ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని ప్రకటించారు. అధికార శక్తులకు ఎదురొడ్డి నిలిచారు భారతదేశ విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ తన గుప్పిట్లోకి తీసుకుని, చెదపురుగుల మాదిరిగా దానిని లోపలి నుంచే డొల్లగా చేస్తోందని రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆ చెదపురుగును తొలగించాలని తేల్చిచెప్పారు. ప్రశ్నపత్రాల లీకేజీలకు కఠిన శిక్షలు విధించేలా పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బిల్లుకు మద్దతు ఇచ్చే విషయంలో ప్రతిపక్షాలు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. విద్యార్థులను, దేశ భవిష్యత్తును కాపాడడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం దేశ భవిష్యత్తు అయిన మన విద్యార్థుల విజయమని అన్నారు. అధికార శక్తులకు ఎదురొడ్డి నిలిచారంటూ విద్యార్థులను ప్రశంసించారు. విద్యా విధానాన్ని మార్చేందుకు ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. భారత విద్యా వ్యవస్థపై ఆర్ఎస్ఎస్ పట్టు తొలగాలని చెప్పారు. విద్యా వ్యవస్థను సంస్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది గానీ ప్రభుత్వం ఆ పని చేస్తుందన్న నమ్మకం లేదన్నారు. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతదేశ విద్యా వ్యవస్థపై నేడు దాడులు జరుగుతున్నాయని, కొందరు కబ్జా చేస్తున్నారని, ప్రైవేటీకరిస్తున్నారని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. నేటి యువత ఉద్యమం విద్యా వ్యవస్థలో అక్రమాలకు, నిరుద్యోగానికి, దేశంలోని ప్రస్తుత పరిస్థితులకు వ్యతిరేకంగా వచ్చిన స్పందన అని వ్యాఖ్యానించారు. దేశంలో ఉద్యోగ కల్పన వ్యవస్థ, విద్యా వ్యవస్థ, సంస్థాగత వ్యవస్థలు కనుమరుగైపోయాయని, అందుకే యువత రోడ్డెక్కుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వం ఎవరికీ వ్యక్తిగత జాగీరు కాదని, ఇది ముమ్మాటికీ ప్రజలకు చెందినదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని మార్చాల్సిన సమయం వచ్చింది నీట్ పేపర్ లీక్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పోరాటం ముగిసిపోలేదని రాహుల్ అన్నారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, పరీక్షల భద్రత, సంస్కరణల కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైతులు, కార్మికులు, పేదలు, ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయిన ప్రతి వర్గం కూడా తమ గౌరవం కోసం రాజ్యాంగబద్ధమైన మార్గంలో ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వాన్ని మార్చాల్సిన సమయం వచ్చిందని తేల్చిచెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ముందు జంతర్‌మంతర్ వద్ద నిరసనలో పాల్గొన్న వారిని రాహుల్ కలిశారు. విద్యార్థులపై జరిగిన దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. -
అలా చేస్తే మీ పని అంతే.. చైనా,రష్యాలకు ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ రష్యా,చైనాలపై ఫైరయ్యారు. ఈ రెండు దేశాలు ఇరాన్‌కు ఎట్టిపరిస్తితుల్లో ఆయుధాలు విక్రయించవద్దని తీవ్రంగా హెచ్చరించారు. ఒకవేళ ఆ పని చేస్తే అది ఆ దేశాలకే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని అది వారి దేశ ప్రయోజనాలకు ఏమాత్రం మంచిది కాదని స్పష్టం చేశారు.ట్రంప్ తన అధికారిక ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేస్తూ "చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ ఏడాది మే నెలలో బీజింగ్‌లో జరిగిన సమావేశంలో తమ దేశం నుంచి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇరాన్‌కు ఆయుధాలు విక్రయించబోమని హామీ ఇచ్చారు. మా మధ్య ఉన్న సంబంధాల దృష్ట్యా ఆయన మాటను నమ్ముతున్నాను" అని అన్నారు.అదే విధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్నప్పటికీ, ఇరాన్‌కు ఆయుధాలు అమ్మబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా తనకు హామీ ఇచ్చారని ట్రంప్ చెప్పారు.అదే సమయంలో ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధాలు అమ్మడంపై మాట్లాడుతూ "నేను ఉక్రెయిన్‌కు నేరుగా ఆయుధాలు అమ్మడం లేదని, కేవలం నాటో (NATO) దేశాలకే విక్రయిస్తున్నానని పుతిన్‌కు తెలుసు. నాటో దేశాలు పూర్తి ధర చెల్లించి కొనుగోలు చేస్తాయి, ఆ తర్వాత ఆ ఆయుధాలు ఎలా పంపిణీ అవుతాయో నాకు తెలియదు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఇటీవలి కాలంలో అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన వరుస దాడులకు సంబంధించి, ఇరాన్‌కు రష్యా మరియు చైనాలు లక్ష్యాల సమాచారాన్ని అందిస్తున్నాయా లేదా అనే అంశంపై వాషింగ్టన్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో దర్యాప్తు జరుపుతోంది. ఇంతలోనే ట్రంప్ ఇరుదేశాలకు వార్నింగ్ ఇచ్చారు. -
మీరు పోలీసుల లేక రౌడీలా.. శాంతి భద్రతలు కాపాడే బాధ్యత మీకు లేదా?
-
మళ్లీ వస్తే డ్రగ్స్ కేసు పెడ్తా.. CJP లీడర్స్ కు పోలీస్ వార్నింగ్
-
ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్.. ఇకపై హర్మూజ్ లో ఒక్క నౌకపై దాడి చేసినా
-
ఏఐతో భారీ సంక్షోభం: జర్నలిస్ట్ రాబర్ట్ పెస్టన్ భవిష్యవాణి!
లండన్: కోవిడ్-19 మహమ్మారి, 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందే అంచనా వేసి, హెచ్చరించిన ప్రముఖ బ్రిటిష్ జర్నలిస్ట్ రాబర్ట్ పెస్టన్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ వల్ల మానవాళికి పెను ముప్పు పొంచి ఉందంటూ మరో హెచ్చరిక చేశారు. గతంలో ఆయన చేసిన హెచ్చరికలను కొందరు ‘భయపెట్టే ధోరణి’గా కొట్టిపారేసినప్పటికీ, అవి నిజమయ్యాయి. అయితే ఇప్పుడు రాబర్ట్ పెస్టన్ చెప్పిన ఏఐ ముప్పుపై ప్రపంచమంతా ఆలోచిస్తోంది.పెస్టన్ తన కొత్త పుస్తకం ‘ది కిల్ స్విచ్’లో ఏఐ వల్ల భవిష్యత్తులో భారీ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ఒకటి రెండు సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని, ఏఐ కోసం డేటా సెంటర్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణాల కోసం అపారమైన పెట్టుబడులు తరలివెళ్తుండటమే దీనికి కారణమని ఆయన విశ్లేషించారు. ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి ఉపాధి లేకుండా పోతే, ప్రభుత్వాలు ఆదాయపు పన్ను లేకుండానే ప్రజా సేవలను నిర్వహించే మార్గాలపై ఆలోచించాలని ఆయన సూచించారు.గతంలో బ్యాంకింగ్ రంగం తీరు వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని 2007లోనే హెచ్చరించినప్పుడు తనపై కొందరు వ్యతిరేకత వ్యక్తం చేశారని ఆయన గుర్తుచేశారు. అలాగే, 2009-2010 సమయంలో చైనాలో పర్యటించిన అనుభవంతో, 2019 చివరిలో ఊహించని కొత్త వైరస్ (కోవిడ్-19) వెలుగుచూసినప్పుడు ప్రభుత్వ వర్గాలను అప్రమత్తం చేశానని ఆయన తెలిపారు.ఇది కూడా చదవండి: నటుడు ప్రకాష్ రాజ్‌కు భూ ఆక్రమణల నోటీసు -
ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్
రహదారి భద్రతను పటిష్టం చేయడం, నిబంధనలను తరచూ ఉల్లంఘించే వాహనదారులకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ప్రతిపాదనను సిద్ధం చేసింది. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే వారికి తక్షణ డిజిటల్ హెచ్చరికలు పంపడంతో పాటు పదేపదే చేసే ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్తగా డిజిటల్ వార్నింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది.సాంకేతికతతో రియల్-టైమ్ పర్యవేక్షణప్రస్తుతం అమలులో ఉన్న ఈ-చలాన్ వ్యవస్థను మరింత ఆధునీకరిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్పీఆర్) కెమెరాలను ప్రతిపాదిత వ్యవస్థకు అనుసంధానించనున్నారు. వాహనదారులు సిగ్నల్ జంపింగ్, అతివేగం, హెల్మెట్/సీటు బెల్ట్ ధరించకపోవడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ లేదా డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడటం వంటి చర్యలకు పాల్పడితే.. డిజిటల్ నెట్వర్క్ ద్వారా వెంటనే సదరు వాహనదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈ-మెయిల్‌కు అలర్ట్/వార్నింగ్ మెసేజ్ వెళ్తుంది.డీమెరిట్ పాయింట్ల విధానం.. లైసెన్స్ రద్దుఈ ప్రతిపాదనలో అత్యంత కీలకమైన అంశం పాయింట్ల ఆధారిత శిక్షా విధానం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ విధానంలో.. ప్రతి ట్రాఫిక్ ఉల్లంఘనకు ఒక ప్రత్యేక డిజిటల్ రికార్డు ఉంటుంది. ఒకే క్యాలెండర్ సంవత్సరంలో నిర్దేశిత పరిమితికి మించి (ఉదాహరణకు 5 లేదా అంతకంటే ఎక్కువసార్లు) ఉల్లంఘనలు నమోదవ్వడం లేదా డీమెరిట్ పాయింట్లు పరిమితి దాటితే ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ) నేరుగా జోక్యం చేసుకుంటుంది. పదేపదే నిబంధనలు ఉల్లంఘించే వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేయడం లేదా శాశ్వతంగా రద్దు చేసే అధికారం రవాణా శాఖకు ఉంటుంది. అంతేకాకుండా లైసెన్స్ పునరుద్ధరణకు ముందు వాహనదారులు విధిగా డ్రైవింగ్ రీ-టెస్ట్, భద్రతా శిక్షణ పూర్తి చేయాల్సి రావచ్చు.మారనున్న వాహనదారుల ప్రవర్తనసాధారణంగా జరిమానా చెల్లించి మళ్లీ పాత తప్పులే చేసే ధోరణి చాలామందిలో కనిపిస్తుంటుంది. అయితే, కొత్త డిజిటల్ హెచ్చరిక వ్యవస్థ ద్వారా కేవలం జరిమానా మాత్రమే గాక లైసెన్స్ కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఇది వాహనదారుల్లో క్రమశిక్షణను, జవాబుదారీతనాన్ని పెంచుతుంది. అలాగే, మనుషుల ప్రమేయం తక్కువగా ఉండి సాంకేతికత ఆధారంగా నిర్ణయాలు జరగడం వల్ల అవినీతికి తావులేకుండా పారదర్శకత పెరుగుతుందని కొందరు భావిస్తున్నారు.ఇదీ చదవండి: పండగలు షురూ.. వంటనూనెల దిగుమతుల జోరు -
"కన్నుకు.. కన్ను".. అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్
టెహ్రాన్: ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో టెహ్రాన్ ఘాటుగా బదులిచ్చింది. తమ దేశ మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడి జరిగినా దానికి తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఇరాన్‌పై మండిపడ్డారు. "హర్ముజ్ జలసంధిలో పయనించే ఏ నౌకపైనా ఇరాన్ దాడులు చేయకూడదు. ఇరాన్ మిస్సైళ్లు, రాకెట్లు లేదా డ్రోన్లతో ఏ నౌకపైనైనా దాడి చేస్తే... దానికి ప్రతికారంగా ఇరాన్‌లోని ఒక వంతెనను లేదా విద్యుత్ ప్లాంట్‌ను అమెరికా దళాలు బాంబులతో పేల్చివేస్తాయి. అని హెచ్చరించారు.దీనిపై స్పందించిన అరాఘ్చీ "మా రక్షణ విధానం చాలా స్పష్టం 'కంటికి కన్ను' ఇరాన్ మౌలిక సదుపాయాలపై జరిగే ఏ రకమైన దాడికైనా మా స్పందన అత్యంత శక్తివంతంగా, నిర్ణయాత్మకంగా ఉంటుంది" అని పేర్కొన్నారు.అనంతరం ఆ దేశ ఆర్మీ అధికారులు మాట్లాడుతూ అమెరికా చేస్తున్న ఈ బెదిరింపుల వల్ల యుద్ధం మరింతగా పెరగడం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. కాగా అమెరికా - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు విఫలమవ్వడంతో దాడులు తీవ్రతరమవుతున్నాయి. దీంతో వరుస దాడులతో పశ్చిమాసియా ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. -
ఇరాన్ కు ట్రంప్ స్టాంగ్ వార్నింగ్
-
ఖర్గ్ ద్వీపం కోసం ఆలోచిస్తే.. ఇరాన్ భారీ వార్నింగ్
టెహ్రాన్: అమెరికాకు ఇరాన్ మరోసారి భారీ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ ఖర్గ్ ద్వీపం ఆక్రమించడానికి వాషింగ్టన్ యత్నిస్తే అక్కడికి వచ్చిన సైనికులు ప్రాణాలతో తిరిగి వెళ్లలేరని వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల ట్రంప్ ఖర్గ్ ద్వీపంపై వ్యాఖ్యల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.పర్షియన్ గల్ఫ్‌లోని, బుషెహర్ ప్రావిన్స్ తీరానికి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్గ్ ద్వీపం, ఇరాన్ యొక్క అతిపెద్ద చమురు ఎగుమతి కేంద్రం ఆ దేశంలోని అత్యంత వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఇంధన ఆస్తులలో ఇది ప్రధానమైనది. ఇరాన్ నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే మొత్తం ముడి చమురులో దాదాపు 90 శాతం ఈ ఒక్క ద్వీపం నుంచే సరఫరా అవుతుంది.దీంతో దీనిని ఎలాగైనా ఆక్రమించాలని ట్రంప్ తొలినుంచి యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అవసరమైతే ఖర్గ్ ద్వీపాన్ని తమ నియంత్రణలోకి తీసుకునేలా పరిమిత భూతల దాడి చేసే ఆలోచన ఉందని మాట్లాడారు. తాజాగా ఆ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటరిచ్చింది.విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి మాట్లాడుతూ "ఖర్గ్ ద్వీపంపై భూతల దాడి చేయడానికి అమెరికా సైనికులు వస్తే... వారిని 'స్వాగతించడానికి' మా సైన్యం, మా ప్రజలు నిమిషాలు లెక్కిస్తూ, సిద్ధంగా ఎదురుచూస్తున్నారు." అని అన్నారు.మళ్లీ ఉద్రిక్తతప్రస్తుతం పశ్చిమాసియా పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా, యుద్ధ వాతావరణంతో అట్టుడుకుతున్నాయి. గత నెలలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా విఫలమై, మళ్లీ భారీ ఎత్తున దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయి. -
జగన్ ధైర్యం ఏమిటో మీ బాబుని అడుగు.. పట్టాభికి లెఫ్ట్ అండ్ రైట్ వాయించిన రాచమల్లు
-
జగన్ సూపర్ యాప్.. ఇప్పుడు టచ్ చేసి చూడు
-
సెకండ్ చాన్స్ ఉండదు.. మంత్రులకూ విజయ్ వార్నింగ్
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ అవినీతిపై తన మంత్రులకు, ప్రభుత్వ యంత్రాంగానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. తన ప్రభుత్వంలో అవినీతి, లంచాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారికి ఎలాంటి రెండో అవకాశం (Second Chance) ఉండదని గురువారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రజలకు పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ.. అవినీతిపై జీరో టాలరెన్స్ విధానాన్ని మరోసారి ప్రకటించారు.ఇటీవల అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న తన పార్టీ చెంగల్పట్టు ఈస్ట్ జిల్లా సంయుక్త కార్యదర్శి వీరసామిని విజయ్ పార్టీ నుంచి బహిష్కరించడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో లంచం తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చిన వీడియో వైరల్ కావడంతో.. రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవుల నుంచి ఆయనను తొలగించారు. అనంతరం పోలీసులు కూడా ఆయనను అరెస్ట్ చేశారు. అయితే వీరసామి మాత్రం ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని ఆరోపిస్తున్నాడు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం పోలీస్ విచారణ జరుగుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే పారదర్శక పాలనకు ప్రాధాన్యం ఇస్తున్న విజయ్.. అవినీతిపై రాజీపడబోమనే సంకేతాన్ని వరుస చర్యల ద్వారా ఇస్తున్నారు. ప్రజల సహకారంతోనే అవినీతిని పూర్తిగా నిర్మూలించగలమని ఆయన పదేపదే చెబుతున్నారు. ఈ క్రమంలో.. మొన్న కరూర్‌లో ఇటీవల నిర్వహించిన ప్రజాసభలో మాట్లాడుతూ.. తన ప్రభుత్వంలో అవినీతి, లంచాలు, అధికార దుర్వినియోగానికి ఏమాత్రం తావుండబోదని తేల్చిచెప్పారు."ఎవరైనా లంచం అడిగితే నేరుగా 'ఇవ్వను' అని చెప్పండి. మీ వెంటే నేను ఉంటాను. అయినా ఒత్తిడి చేస్తే.. ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న విజయ్ మా వెన్నంటి ఉన్నారని ధైర్యంగా చెప్పండి" అంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు. అవినీతి, లంచాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆ సందర్భంలో స్పష్టం చేశారాయన.ఇక అవినీతి నిర్మూలన కోసం విజయ్ ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేసేందుకు 94981 80936 నంబర్‌తో ప్రత్యేక వాట్సాప్ హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనితో పాటు డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (DVAC) ఫిర్యాదు వ్యవస్థను మరింత బలోపేతం చేసింది.అంతేకాదు.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బోర్డులు, కార్పొరేషన్లలో "లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరాలే" అనే హెచ్చరిక బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అదే సందేశాన్ని అన్ని ప్రభుత్వ వెబ్సైట్లలోనూ ప్రదర్శించాలని, నేరుగా DVAC ఫిర్యాదు లింక్‌ను అందుబాటులో ఉంచాలని సూచించింది. ఈ చర్యల అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక మానిటరింగ్ బృందాలను కూడా ఏర్పాటు చేసింది. తమిళనాడులో విజయ్ సర్కార్ చేపడుతున్న అవినీతి వ్యతిరేక చర్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. -
వెళ్తూ వెళ్తూ చంద్రబాబుకు జగన్ మాస్ వార్నింగ్
-
ఖమేనీ మృతికి ప్రతీకారం తప్పదు.. ఇరాన్ మాస్ వార్నింగ్
-
హెలీకాప్టర్ ని ఆపితే భీమవరానికి జగన్ రైలెక్కి వెళ్తాడు.. పేర్ని నాని మాస్ వార్నింగ్
-
ఇరాన్‌పైకి వెయ్యి క్షిపణులు.. నాన్‌స్టాప్‌గా ఏడాదిపాటు దాడులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత ఎగసిపడేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస ప్రకటనలు చేస్తున్నారు. శాంతి చర్చలకు ఇరాన్ ఇప్పుడు దిగి వచ్చినా ప్రయోజనం ఉండకపోవచ్చన్న ఆయన.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తే.. అమెరికా నుంచి వెయ్యి క్షిపణులు వెంటనే ఆ దేశంపై విరుచుకుపడతాయని హెచ్చరించారు. తొలి దాడితో ఆగకుండా.. అవసరమైతే ఏడాది పాటు ఇరాన్‌లోని కీలక ప్రాంతాలను పూర్తిగా ధ్వంసం చేసేలా అమెరికా సైన్యానికి ముందుగానే ఆదేశాలు జారీ చేశానని వెల్లడించారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. "అమెరికా అధ్యక్షుడిని, ముఖ్యంగా నన్ను హత్య చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తే.. వెయ్యి క్షిపణులు ఇప్పటికే లక్ష్యంగా సిద్ధంగా ఉన్నాయి. తొలి దాడి తర్వాత వేలాది క్షిపణులు వెంటనే ప్రయోగిస్తాం. అమెరికా సైన్యానికి అవసరమైన అన్ని ఆదేశాలు ఇప్పటికే ఇచ్చాం. ఒక సంవత్సరం పాటు అవసరమైతే ఇరాన్‌లోని ప్రతి కీలక ప్రాంతాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి సైన్యం సిద్ధంగా ఉంది. అవసరమైతే ఈ గడువును పొడిగించే అవకాశం కూడా ఉంది" అని పేర్కొన్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి.బ్యాక్ టు బ్యాక్ వార్నింగులుట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల అమెరికా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా.. తనకు ఏదైనా జరిగితే ఇరాన్‌పై ప్రపంచం ఎన్నడూ చూడని స్థాయిలో బాంబుల వర్షం కురిపించాలని ముందుగానే అధికారులకు ఆదేశాలు ఇచ్చానని చెప్పారు. తనపై కొత్త హత్య కుట్రకు సంబంధించి ఇజ్రాయెల్ వద్ద ఎలాంటి తాజా సమాచారం లేదని, అయితే చాలా ఏళ్లుగా తానే ఇరాన్ 'కిల్ లిస్ట్'లో మొదటి లక్ష్యంగా ఉన్నానని మరోసారి పునరుద్ఘాటించారు.సోలేమానీ హత్యతో మొదలైన వైరం2020లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్‌కు చెందిన అగ్ర సైనికాధికారి ఖాసెం సోలేమానీ మరణించారు. అప్పటి నుంచి ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌కు చెందిన పలువురు నేతలు హెచ్చరిస్తూ వస్తున్నారు. అమెరికా దర్యాప్తు సంస్థలు కూడా గతంలో ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌కు అనుబంధంగా ఉన్న వ్యక్తులు కుట్రలు పన్నినట్లు వెల్లడించాయి. అయితే ఇరాన్ ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తోంది. అయితే అయతొల్లా ఖమేనీ మరణంతో మళ్లీ ట్రంప్‌ను టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.శాంతి చర్చలపైనా కఠిన వైఖరిఇదిలా ఉండగా.. అమెరికాతో మళ్లీ చర్చలు కొనసాగించాలని ఇరాన్ కోరినట్లు ట్రంప్ తెలిపారు. అయితే అమెరికా ఇప్పటికే ఇరాన్‌కు కాల్పుల విరమణ ముగిసిందని స్పష్టం చేసిందన్నారు. చర్చలకు అంగీకరించినా.. ఇరాన్‌పై తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని సంకేతాలు ఇచ్చారు.పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు?అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్న సమయంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు మరోసారి ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఒకవైపు మధ్యవర్తి దేశాలు శాంతి చర్చలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు "వెయ్యి క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి.. ఏడాది పాటు దాడులు కొనసాగుతాయి" అంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మళ్లీ పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఇండిగోకు డీజీసీఏ హెచ్చరిక
దేశీయ విమానయాన రంగంలో అగ్రగామిగా ఉన్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు గగనతల నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) హెచ్చరిక జారీ చేసింది. విమానాల్లో కార్గో నిర్వహణ, ప్రమాదకర వస్తువుల రవాణాకు సంబంధించిన ప్రామాణిక కార్యాచరణ విధానాల (ఎస్ఓపీ) ఉల్లంఘనలపై ఈ హెచ్చరిక లేఖ పంపింది. ‘ఎయిర్‌క్రాఫ్ట్ (క్యారేజ్ ఆఫ్ డేంజరస్ గూడ్స్) రూల్స్, 2026’ నిబంధనలను విస్మరించడంపై డీజీసీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది.ఆడిట్లో బయటపడిన లోపాలుఈ ఏడాది జనవరిలో ఇండిగోకు చెందిన ఒక విమానం ల్యాండ్ అయిన తర్వాత గ్రౌండ్‌పై కార్గో (సరుకులు) కింద చిందినట్లు (స్పిల్లేజ్) అధికారులు గుర్తించారు. ఈ ఉదంతంపై డీజీసీఏ నిశితంగా పరిశీలించి ఇండిగో కార్గో విభాగంలో ప్రత్యేక ఆడిట్ నిర్వహించింది. ఈ తనిఖీల్లో విమానయాన భద్రతా నిబంధనలు, ప్రమాదకర వస్తువుల హ్యాండ్లింగ్ ప్రొసీజర్లలో తీవ్ర లోపాలు ఉన్నట్లు తేలింది. దీనిపై పూర్తి వివరణ ఇస్తూ భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తీసుకున్న చర్యలపై ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’ (ఏటీఆర్) సమర్పించాలని డీజీసీఏ ఆదేశించింది. ఈ హెచ్చరిక లేఖను ఎయిర్‌లైన్స్ జులై 8న అందుకుంది.స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఆలస్యంగా సమాచారంఈ భద్రతాపరమైన పరిణామానికి సంబంధించి సెబీ ఎల్ఓడీఆర్ రెగ్యులేషన్ 30 ప్రకారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఆలస్యంగా సమాచారం ఇచ్చింది. ఈ జాప్యం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని కేవలం సంస్థలోని అంతర్గత కమ్యూనికేషన్ లోపం వల్లే నియంత్రణ సంస్థల లేఖ వివరాలను స్టాక్ మార్కెట్లకు సకాలంలో వెల్లడించలేకపోయామని కంపెనీ సెక్రటరీ, చీఫ్ కాంప్లయన్స్ ఆఫీసర్ నీరజా శర్మ స్పష్టం చేశారు.కార్యకలాపాల పరంగా ఎలాంటి ప్రభావం లేదుఈ హెచ్చరిక లేఖ వల్ల ఇండిగో విమాన సర్వీసులపై గానీ, సంస్థ ఆర్థిక పరిస్థితిపై గానీ ఎలాంటి ప్రతికూల ప్రభావం పడబోదని యాజమాన్యం వెల్లడించింది. డీజీసీఏ కేవలం హెచ్చరిక లేఖ మాత్రమే ఇచ్చిందని, ప్రస్తుతానికి ఎలాంటి జరిమానా , సర్వీసులపై ఆంక్షలు విధించలేదని పేర్కొంది. నిబంధనల ప్రకారం భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేస్తామని ప్రకటించింది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్! -
గాజులు తొడుక్కున్నాం అనుకున్నావా... చీరేస్తాం..!
-
నా కొడకా... బాబు తమ్ముడు అని మాట్లాడితే.. సవాలు విసురుతావా..
-
ఎవడొస్తాడో రండి చూసుకుందాం.. తోపుదుర్తి మాస్ వార్నింగ్
-
"ఖర్గ్ ద్వీపం స్వాధీనం చేసుకుంటాం"
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు డేంజర్ వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామన్నారు. ఖర్గ్ దీపాన్ని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. అయితే ఇదివరకే ఇకపై ఇరాన్‌తో చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరాన్ తప్పులు చేస్తూనే ఉందని చర్చల పేరుతో ఇరాన్ తమ సమయాన్ని వృథా చేస్తోందని ఆ దేశంతో సీజ్ఫైర్ ముగిసిందని చెప్పారు. కాగా తాజాగా మరోసారి ట్రంప్ వార్నింగ్ ఇవ్వడంతో ఏ జరగనుందా అనే ఆందోళన టెన్షన్ సర్వత్వా నెలకొంది. కాగా ఈ రోజు బుధవారం అంకారాలో జరిగిన నాటో సదస్సులో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ " ఇరానీయులు అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసగాళ్లు, చెడ్డ మనస్తత్వం ఉన్నవాళ్లు" అంటూ ట్రంప్ విమర్శించారు. గత రాత్రి ఇరాన్‌కు చెందిన చాలా ప్రమాదకరమైన వ్యక్తులపై అమెరికా దాడులు జరిపిందని చెప్పారు. హార్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న మూడు నౌకలపై దాడి జరిగిన తర్వాత ఈ దాడులు జరిగాయి. ఆ దాడిని ఇరాన్ సైన్యమే జరిపిందని అమెరికా ఆరోపించింది.కాగా ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. రేపు గురువారం ఆయన స్వస్థలం మషాద్ నగరంలో జరుగుతాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ దాడి చేస్తామని ప్రకటించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాగా ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఇరానీయన్లు అమెరికాపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. అమెరికాకు మరణం, ఇరాన్‌కు మరణం అనే నినాదాలతో హోరెత్తించారు. -
మీ వీడియోలు బయట పెట్టమంటారా.. పవన్ కు మాస్ వార్నింగ్..
-
నీళ్లు ఇవ్వకపోతే..యుద్ధమే : రంకెలేస్తున్న పాకిస్థాన్
సింధూ నదీ జలాల ఒప్పందాన్ని (IWT) పక్కనబెట్టాలన్న భారతదేశం నిర్ణయం పాకిస్తాన్‌ను ఒక రేంజ్లో వణికిస్తోంది. ఈ నేపథ్యంలోనే సింధూ జలాలను ఆపితే యుద్ధమే అంటూ పాక్ కొత్త హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్ పౌర ప్రభుత్వంతో పాటు అక్కడి సైన్యం కూడా తమ దేశానికి దక్కాల్సిన నీటి వాటా కోసం అవసరమైన అన్ని తీసుకుంటామని ప్రకటించడం కలకలం రేపింది.పాక్ సైనిక దళాల అధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ అధ్యక్షతన 276వ కోర్ కమాండర్ల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో సింధూ జలాల వివాదంపై పాక్ సైన్యం కీలక నిర్ణయాలు ప్రకటించింది. సైనిక కమాండర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు ప్రకటించింది. 2025 ఏప్రిల్ 24 నాటి నేషనల్ సెక్యూరిటీ కమిటీ (NSC) ఆదేశాల ప్రకారం తాము నడుచుకుంటామని పునరుద్ఘాటించింది .అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం తమ దేశానికి రావాల్సిన సింధూ నదీ జలాల వాటాను దక్కించు కునేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆర్మీ స్పష్టం చేసింది. తమ ప్రభుత్వ ఆదేశాలు, దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సింధూ జలాల హక్కుల కోసం పోరాడుతామని సైన్యం వెల్లడించింది. గతేడాది 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతి చర్యగా 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని (Indus Water Treaty) భారతదేశం నిలిపివేసింది (Abeyance లో పెట్టింది). దీంతో పాకిస్తాన్ తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఈ నేపథ్యంలోనే పాక్ సైన్యం, మంత్రులు భారత్‌పై అక్కసు వెళ్లగక్కడంతోపాటు, వార్ వార్నింగ్‌లివ్వడం శోచనీయం.పాకిస్తాన్ NSC మార్గదర్శకాలు ఏమిటి?నీటిని ఆపడం లేదా మళ్లించడం వంటి ఏ చర్యకైనా పాల్పడితే దానిని "యుద్ధ చర్య" (Act of War)గా పరిగణించాలని పాకిస్తాన్ NSC గతంలోనే నిర్ణయించింది. ఆఫ్ఘన్ తాలిబాన్ పాలనలో ఉన్న భూభాగాన్ని ఉపయోగించుకుని పాకిస్తాన్‌పై దాడులు చేస్తున్న ఉగ్రవాద సంస్థలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, వారిపై 'ఆపరేషన్ గజబ్-లిల్-హక్' కింద పోరాడుతామని తెలిపింది. అలాగే కాశ్మీరీలకు తమ దౌత్య, రాజకీయ, నైతిక మద్దతు ఎప్పటికీ ఉంటుందని పేర్కొంది.బిలావల్ భుట్టో జర్దారీ హెచ్చరిక వైరల్పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ చేసిన సంచలన వ్యాఖ్యలపై ఒక వీడియో వైరల్ అవుతోంది. సింధు నదీ జలాల ఒప్పందంపై రాజీ పడే ప్రసక్తి లేదు. భారత్ ఈ జలాలను ఒక ఆయుధంగా వాడుకోవాలని చూస్తోంది. ఒకవేళ ఇందుకోసం భారతదేశంతో యుద్ధం చేయాల్సి వస్తే, అన్ని రంగాలలో పోరాడటానికి సిద్ధంగా ఉన్నాము."పాకిస్తాన్ శాశ్వతంగా సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపేంతవరకు ఈ సింధు జలాల ఒప్పందం నిలిపివేతలోనే ఉంటుందని భారతదేశ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.సరిహద్దుల్లో శత్రుత్వం కొనసాగుతు న్నప్పుడు ద్వైపాక్షిక ఒప్పందాలు మామూలుగా సాగవని, భూమిపై ఉన్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే ఒప్పందాలు నడుస్తాయని భారత్ స్పష్టం చేసింది.సింధు జలాలు- పాకిస్తాన్ 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రావి, సట్లెజ్, బియాస్ జలాలు భారత్‌కు.. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ జలాలు పాకిస్తాన్‌కు దక్కాలి. అయితే సాధారణంగా వర్షాకాలంలో వరద హెచ్చరికల సమాచారాన్ని భారత్ పాకిస్తాన్‌తో పంచుకునేది. కానీ ఒప్పందం నిలిపివేయడంతో భారత్ ఆ సమాచారాన్ని పంచు కోవాల్సిన అవసరం ఉండదు.భారత్ ప్రాజెక్టులు: సింధు బేసిన్లో సావల్‌కోట్, రట్లే, బుర్సార్, పకాల్ దుల్, క్వార్, కిరు, కీర్తాయ్ వంటి పలు జలవిద్యుత్ ప్రాజెక్టులను భారత్ వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. పాక్ వ్యవసాయం అతలాకుతలం: పాకిస్తాన్ వ్యవసాయ రంగంలో దాదాపు 80-90 శాతం ఈ సింధు నదీ వ్యవస్థపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్‌లోని ప్రధాన జలాశయాలైన తర్బెలా, మంగ్లా డ్యామ్‌లలో నీటి నిల్వలు దాదాపు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి.దీంతో తమ అత్యంత బలహీనమైన పాయింట్‌ను భారత్ టార్గెట్ చేయడంతో పాకిస్తాన్ తీవ్ర భయాందోళనకు గురవుతోంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లడానికి పాక్ రాయబారులను పంపడం, ఐక్యరాజ్యసమితికి లేఖలు రాయడం, చట్టపరమైన చర్యలకు దిగడం వంటి ప్రయత్నాలు చేస్తోంది.ఇదీ చదవండి: కేతన్ హత్యకు నాలుగు నెలలముందే.. సీక్రెట్ మ్యారేజ్ -
జగన్ అధికారంలోకి వచ్చాక.. వణికిపోతున్న TDP, జనసేన నేతలు
-
ట్రంప్ వార్నింగ్.. ఒకే చోట ఇరాన్ అగ్రనేతలు.. ఒక్క దెబ్బతో అంతం చేయగలం
-
అమరావతిని ఇక ఆపేయండి..! మీ మంచికే చెప్తున్నా... పేర్ని నాని హెచ్చరిక!
-
‘డబ్బా ట్రేడింగ్’పై వార్నింగ్.. పోలీసులకు ఫిర్యాదు
దేశీయ స్టాక్ మార్కెట్లో అక్రమ ట్రేడింగ్ కార్యకలాపాలపై ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తూ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) కీలక హెచ్చరిక జారీ చేసింది. లెజెండ్రీ ట్రేడర్స్ (Legendry Traders), లెట్స్ ట్రేడ్ ఇండియా (Let's Trade India) పేర్లతో వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్న రెండు సంస్థలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించింది. ఈ వ్యవహారంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు ఎన్ఎస్ఈ తెలిపింది.ఎన్ఎస్ఈ వివరాల ప్రకారం, లెజెండ్రీ ట్రేడర్స్ టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా స్టాక్ మార్కెట్ చిట్కాలు అందించడంతో పాటు, ఇన్వెస్టర్ల ట్రేడింగ్ ఖాతాలను నిర్వహించే సేవలను కూడా అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు లెట్స్ ట్రేడ్ ఇండియా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానెళ్లు, అనుబంధ వెబ్సైట్లు, 9773687281 మొబైల్ నంబర్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించింది.గ్యారెంటీ లాభాలంటే నమ్మొద్దుస్టాక్ మార్కెట్లో హామీ లేదా నిర్ధారిత రాబడులు ఇస్తామని ప్రచారం చేసే ఏ వ్యక్తి లేదా సంస్థను నమ్మవద్దని ఎన్ఎస్ఈ స్పష్టం చేసింది. ఇటువంటి పథకాలు చట్టవిరుద్ధమని, వాటిలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. అలాగే యూజర్ ఐడీ, పాస్వర్డ్ వంటి ట్రేడింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించింది.రిజిస్టర్డ్ బ్రోకర్లేనా? ముందుగా చెక్ చేసుకోండిఈ రెండు సంస్థలు ఎన్ఎస్ఈలో నమోదైన స్టాక్ బ్రోకర్లు గానీ, అధీకృత ప్రతినిధులు గానీ కాదని ఎక్స్ఛేంజ్ స్పష్టం చేసింది. కాబట్టి ఏ బ్రోకర్ లేదా సంస్థతోనైనా లావాదేవీలు చేపట్టే ముందు ఎన్ఎస్ఈ వెబ్‌సైట్‌లోని "Know/Locate Your Stock Broker" సదుపాయం ద్వారా వారి నమోదు వివరాలను తప్పనిసరిగా ధ్రువీకరించేకోవాలని ఇన్వెస్టర్లకు సూచించింది.ఏమిటీ 'డబ్బా ట్రేడింగ్'?'డబ్బా ట్రేడింగ్' అనేది సెబీ గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెలుపల జరిగే చట్టవిరుద్ధ, అనియంత్రిత ట్రేడింగ్ విధానం. ఇందులో కొనుగోలు, అమ్మకాల ఒప్పందాలు అధికారిక ఎక్స్ఛేంజీలపై అమలు కాకుండా, డబ్బా ఆపరేటర్లు తమ అంతర్గత వ్యవస్థల్లోనే సెటిల్ చేస్తారు. దీంతో ఈ ట్రేడ్లు సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీల పర్యవేక్షణకు దూరంగా ఉంటాయి.ఇలాంటి ట్రేడింగ్‌లో పెట్టుబడిదారులకు ఎలాంటి చట్టపరమైన రక్షణ ఉండదు. అధికారిక ఎక్స్ఛేంజీల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను కూడా వినియోగించుకోలేరు. అందువల్ల డబ్బా ట్రేడింగ్‌కు దూరంగా ఉండాలని ఎన్ఎస్ఈ మరోసారి స్పష్టం చేసింది. -
ప్రశ్న రావణ్ కు ఏమైనా జరిగితే... గుర్తుపెట్టుకోండి రేపు జరిగేది ఇదే
-
ఆఫ్ట్రాల్ ఎమ్మెల్యే గాడివి... నువ్వు మాకు సినిమా చూపిస్తావా..?
-
రెచ్చగొట్టద్దు.. బాబు పవన్ కు మాస్ వార్నింగ్
-
ఇరాన్ కు నరకం చూపిస్తాం
-
రేయ్ JC... నా జోలికి రాకు! ఈసారి మాటలతో చెప్పను...
-
మాట వినకపోతే లేపేస్తా..! ఇరాన్ కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక
-
నాకు చెప్పడానికి నువ్వెవడివి.. చంద్రగిరి నీ జాగీరా...
-
నిజంగానే ఏదోకరోజు నీ బట్టలూడదీస్తారు? జేసీకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్
-
గుర్తుపెట్టుకో బోడె... నా పైనే దాడి చేయించావ్.. దేవభక్తుని చక్రవర్తి స్ట్రాంగ్ వార్నింగ్
-
కోయడం మొదలెడితే నీ కన్నా ఎక్కువ కోయగలం.. పంతం నానాజీకి జక్కంపూడి రాజా వార్నింగ్
-
నిజంగానే ఏదోకరోజు నీ బట్టలూడదీస్తారు? జేసీకి పెద్దారెడ్డి వార్నింగ్
-
తాట తీస్తా.. నా కొడకా.. పవన్, పంతం నానాజీ వ్యాఖ్యలు.. అంబటి మాస్ వార్నింగ్
-
విద్యార్థుల భద్రతపై దృష్టి సారించాలి: సీపీ సజ్జనార్ (ఫొటోలు)
-
ఆ షేర్ల ట్రేడింగ్‌లో జాగ్రత్త: సెబీ హెచ్చరిక
న్యూఢిల్లీ: అనధికారిక ఎల్రక్టానిక్ ప్లాట్‌ఫాంలు, వెబ్సైట్ల ద్వారా అన్‌లిస్టెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల షేర్ల కొనుగోళ్లు, విక్రయ లావాదేవీలు జరపరాదని ఇన్వెస్టర్లను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హెచ్చరించింది. అటువంటి ప్లాట్‌ఫాంలకు గుర్తింపు ఉండదని, వాటిపై నియంత్రణ సంస్థ పర్యవేక్షణ ఉండదని పేర్కొంది.కొన్ని ఆన్లైన్ ప్లాట్‌ఫాంలు అన్‌లిస్టెడ్ కంపెనీల్లో లావాదేవీలకు వీలు కల్పిస్తున్నాయని సెబీ దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో 2016 ఆగస్టు, 2024 డిసెంబర్లో కూడా ఇటువంటి అడ్వైజరీలను జారీ చేసినట్లు సెబీ పేర్కొంది. గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలకు మాత్రమే సెక్యూరిటీల ట్రేడింగ్, నిధుల సమీకరణకు వేదికలుగా వ్యవహరించేందుకు అనుమతి ఉంటుందని తెలిపింది. -
శాంతి ఒప్పందం వెనుక ట్రంప్ మాస్టర్ ప్లాన్
-
అవును వాడు రౌడీ నే.. 22 కేసులున్నాయి.. కానీ వాడిని చంపడానికి నువ్వు ఎవడ్రా..
-
తలెగరేస్తే మళ్లీ బాంబులేస్తాం... ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
-
తలెగరేస్తే మళ్లీ బాంబులేస్తాం
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని, ఇక యుద్ధం ఆగిపోతుందని, చమురు, గ్యాస్ ధరలు దిగొస్తాయని ఆశపడిన ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద షాక్ ఇచ్చారు. ఇరాన్‌తో కేవలం అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) మాత్రమే కుదిరిందని, అది తుది ఒప్పందం కాదని తేలి్చచెప్పారు. ఇరాన్ ఇకనుంచి సరిగ్గా ప్రవర్తించకపోతే మళ్లీ బాంబు దాడులు చేస్తామని హెచ్చరించారు. తద్వారా ఇరాన్ తమ దారికి రాకపోతే యుద్ధం ఎప్పుడైనా ప్రారంభం కావొచ్చని సంకేతాలిచ్చారు. ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ మాట్లాడారు.ఒప్పందంపై అమెరికా, ఇరాన్‌లు శుక్రవారమే సంతకాలు చేయబోతున్నారు. స్విట్జర్లాండ్‌లో ఈ కార్యక్రమం జరుగనుంది. ఇంతలోనే ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం చూస్తే ఆ ఒప్పందం అనుకున్నంత దృఢంగా లేదని స్పష్టమవుతోంది. ‘‘ఇరాన్‌తో కుదుర్చుకున్నది తుది ఒప్పందం కాదు. కేవలం ఒక అవగాహన ఒప్పందం మాత్రమే.ఒకవేళ ఇది నాకు నచ్చకపోయినా లేదా ఇరాన్ సరిగ్గా ప్రవర్తించకపోయినా, మేము వెంటనే వారి తలలపైనే బాంబులు కురిపిస్తాం. మళ్లీ కాల్పులు ప్రారంభిస్తాం. ఎందుకంటే గత 47 ఏళ్లుగా వారు(ఇరాన్) దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు’’ అని ట్రంప్ ఆక్షేపించారు. అవగాహనా ఒప్పందంలో ఏవైనా మార్పులు చేసినా లేదా దానిని పాటించడంలో విఫలమైనా తక్షణమే సైనిక చర్యను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్‌ను హెచ్చరించారు. ఇదీ ఒప్పందం ముసాయిదావాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం తాలూకు ముసాయిదా పత్రంలోని 14 అంశాలను అమెరికా ఉన్నతాధికారులు బుధవారం బహిర్గతంచేశారు. ఆ అధికారులు చెప్పిన ఆ అంశాలు.. 1. లెబనాన్, ఇరాన్, హార్మూజ్ జలసంధి సముద్రజలాలు సహా పశి్చమాసియాలో అన్ని చోట్ల అమెరికా తన సైనిక, వైమానిక దాడులను తక్షణం నిలిపేస్తుంది 2. అమెరికా, ఇరాన్‌ను పరస్పరం ఆయా దేశాల సార్వ¿ౌమత్వాలను గౌరవించుకుంటాయి 3. ఉమ్మడి ఏకాభిప్రాయంతో 60 రోజుల్లోపు చర్చలను ఫలవంతంగా ముగిస్తాయి 4. అవగాహన ఒప్పందంపై సంతకాలుచేశాక 30 రోజుల్లోపు హార్మూజ్ దిగ్బంధనాన్నిఅమెరికా పూర్తిగా ఎత్తేస్తుంది 5. సంతకాలు పూర్తయ్యాక 60 రోజులపాటు సుంకాల్లేకుండా హార్మూజ్ గుండా నౌకల రాకపో కలకు ఇరాన్ సంపూర్ణ సహాయసహకారాలు అందిస్తుంది 6. ఇరాన్ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధికి మిత్రదేశాలతో కలిసి అమెరికా 300 బిలియన్ డాలర్ల నిధులు సమకూరుస్తుంది 7. ఇరాన్‌పై ఐరాస భద్రతా మండలి, అంతర్జాతీయ అణుఇంధన సంస్థ సహా అంతర్జాతీయంగా అమల్లో ఉన్న అన్నిరకాల ఆంక్షలను ఎత్తేసేందుకు అమెరికా కృషిచేస్తుంది 8. అణ్వ్రస్తాలను ఇరాన్ తయారుచేయకూడదు, కొనుగోలుచేయకూడదు. ఇప్పటికే అత్యంత శుద్ధిచేసిన యురేనియం నిరీ్వర్యంపై ఇరాన్, అమెరికా ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటాయి 9. అణుకార్యక్రమం ఇప్పుడు ఏ దశలోఉందో అదే యథాతథస్థితి కొనసాగించేందుకు ఇరాన్‌కు హక్కు ఉంటుంది. ఇరాన్‌పై అమెరికా కొత్తగా ఆంక్షలు విధించబోదు, బలగాలను దింపబోదు 10. ఇరాన్ ముడి చమురు, పెట్రోలియం వస్తూత్పత్తుల ఎగుమతులకు ఊతమిచ్చేలా అమెరికా ఆర్థిక శాఖ సబ్సిడీలు, రాయితీల రూపంలో సాయపడుతుంది. బ్యాంకింగ్, బీమా, రవాణా పరంగానూ సాయపడనుంది 11. విదేశీ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాక్‌కు చెందిన ఖాతాల నుంచి పెద్దమొత్తంలో నగదు ఉపసంహరణకు అవకాశం 12. అవగాహన ఒప్పందం సవ్యంగా, సమర్థవంతంగా అమలయ్యేలా ఒక ప్రత్యేక కార్యనిర్వాహణ వ్యవస్థను కొలువుతీర్చి దానిని పర్యవేక్షించడం 13. సంతకాలు చేయగానే 1, 4, 5, 10, 11 పేరాల్లోని అంశాలు తక్షణం అమల్లోకి వస్తాయి. అందుకే మిగతా పేరాల్లోని అంశాల మీదనే చర్చలు జరుగుతాయి. 14. ఐరాస భద్రతా మండలి నిబంధనలకు లోబడి తుది ఒప్పందం కుదుర్చుకోవాలి -
రూ. 14 వేల నుంచి రూ. 10 లక్షల స్కాం : ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వార్నింగ్
నీట్ యూజీ (NEET UG-2026 రీ-ఎగ్జామ్‌కు సమయం సమీపిస్తున్న వేళ, పేపర్ల లీక్‌పై పలు వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం టెలిగ్రామ్‌పై తాత్కాలికంగా నిషేధం విధించినంత మాత్రాన సరిపోతుందా? మిగిలిన యాప్‌లను ఎలా నియంత్రిస్తారు? అంటూ పరీక్ష వ్యవస్థపై, భద్రతపై అనేక సందేహాలు, విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పరీక్షకు ముందే క్వశ్చన్ పేపర్లు ఇస్తామంటూ ఆన్లైన్లో జరుగుతున్న మోసాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి హెచ్చరించారు. నీట్ రీ-ఎగ్జామ్‌కు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని, ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని ఆయన స్పష్టం చేశారు.సోషల్ మీడియాలో పంచుకున్నఒక వీడియో సందేశంలో, జూన్ 21న జరగబోయే రీ-ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయంటూ టెలిగ్రామ్ (Telegram) ఛానెళ్లలో వస్తున్న ప్రకటనలను నమ్మవద్దని ఆయన కోరారు. పరీక్ష ఒత్తిడిలో ఉన్న విద్యార్థులే టార్గెట్‌గా, అబద్ధపు వాగ్దానాలతో ఈ కేటుగాళ్లు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.రూ. 14 వేల నుండి రూ. 10 లక్షల దాకాకొన్ని టెలిగ్రామ్ ఛానెళ్లు లీకైన పేపర్లు ఇస్తామంటూ విద్యార్థుల నుండి రూ. 14వేల రూ. 25వేలవరకు డిమాండ్ చేస్తున్నాయని కామకోటి తెలిపారు. మరికొన్ని కేసుల్లో ఏకంగా రూ. 10 లక్షల వరకు కూడా డిమాండ్ చేసినట్లు రిపోర్టులు వచ్చాయన్నారు.టెలిగ్రామ్ ఛానెళ్లలో పేపర్ లీక్ అయినట్లు చూపే స్క్రీన్షాట్లు, వీడియోలు ఎలా సృష్టిస్తారో ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వివరించారు. ఛానెల్ అడ్మిన్లు పాత మెసేజ్‌లను ఎడిట్ చేసి, ఒరిజినల్ డేట్ (పాత తేదీ) మారకుండానే అందులో కొత్త కంటెంట్‌ను పెట్టగలరు.దీనివల్ల పరీక్షకు ముందే పేపర్ షేర్ చేసినట్లు తప్పుగా కనిపిస్తుంది.జూన్ 21న పరీక్ష ముగిసిన తర్వాత కూడా ఇలాంటి ఎడిట్ చేసిన స్క్రీన్షాట్లు, తప్పుడు పోస్టులు మళ్లీ వచ్చే అవకాశం ఉందని, కాబట్టి వాటిని ఫార్వార్డ్ చేయవద్దని, ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ఆయన హెచ్చరించారు. ఒక్కసారి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే, వాటిని తిరిగి రాబట్టడం అసాధ్యమని కామకోటి చెప్పారు. అలాగే అపరిచిత వ్యక్తులతో అడ్మిట్ కార్డ్‌లు (Admit Cards), ఫోన్ నంబర్లు లాంటి వ్యక్తిగత వివరాలను షేర్ చేయొద్దని స్కామర్లు దీన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇదీ చదవండి: ఒక్క రీల్‌కు రూ. 76 లక్షలు, లంచ్‌కి 20 లక్షలు : ఎలా?విద్యార్థులు కేవలం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక వెబ్సైట్ , ఛానెళ్ల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలి. ఫేక్ మెసేజ్‌లు, ఫార్వార్డ్ మెసేజ్‌ల పట్ల అప్రతమత్తంగా ఉండాలన్నారు. ఒకవేళ ఇలాంటి సైబర్ మోసాలు లేదా అనుమానాస్పద మెసేజ్‌లు కనిపిస్తే, వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.ఇదీ చదవండి: అఫ్గాన్‌లో సోలో ట్రిప్, భారతీయ మహిళ భావోద్వేగం, దురంధర్ నటుడు కూడా!To every NEET candidate and parent - please watch this. A few minutes that could save you serious money and stress this week.Scammers on Telegram were running two rackets targeting you:1️⃣ Channels demanding ₹14,000 to ₹25,000 - some even ₹10 lakh - claiming they'll send you… pic.twitter.com/aqpickJLAv— National Testing Agency (@NTA_Exams) June 16, 2026 -
నీకు జూలై 1 వరకే టైం.. తర్వాత అసలైన సినిమా చూస్తావ్ బాబుకు జగన్ వార్నింగ్
-
నా ట్రాక్టర్లనే ఆపుతారా.. కాంగ్రెస్ నాయకుడి హల్చల్
సాక్షి, యాదాద్రి భువనగిరి: ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ నాయకుడు వీరంగం సృష్టించడం స్థానికంగా కలకలం రేపింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన ఆలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంధమల్ల అశోక్ పోలీసు స్టేషన్ లోనే రక్షక భటులకు వార్నింగ్ ఇచ్చారు. నా ఇసుక ట్రాక్టర్లు ఎలా ఆపుతారా అని పోలీసులను బెదిరించారు. ఒళ్లు పగులుతుంది నీ సంగతేంటో చూస్తానని పోలీస్ స్టేషన్లో నానా హంగామా సృష్టించాడు. కాగా గత కొంతకాలంగా ఆలేరు, బిక్కేరు వాగు, రాజపేట, మోటకొండూరు ప్రాంతల నుంచి ఇసుక మట్టి అక్రమ రవాణా జరుగుతుంది. మోటకొండూరు మండలం వర్టూరు చెరువు నుంచి కూడా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇసుక రవాణాను అడ్డుకున్న వారిని సైతం కొంతమంది నేతలు ఇలానే బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆలేరు కాంగ్రెస్ నాయకుడే ఇసుక అక్రమ రవాణాకు అండదండలు అందించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ప్రస్తుతం ఈ బెదిరింపుల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
భారీగా క్రెడిట్ కార్డు అప్పులు.. కియోసాకి అలర్ట్
ప్రపంచ ప్రసిద్ధ పర్సనల్ పైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) అమెరికన్ల పెరుగుతున్న క్రెడిట్ కార్డు అప్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన ఫేస్బుక్ ఖాతాలో చేసిన పోస్టులో వినియోగపు అలవాట్లు ఎలా ఆర్థిక భారంగా మారుతున్నాయో వివరించారు.ప్రస్తుతం అమెరికన్లు క్రెడిట్ కార్డులపై 1.28 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.120 లక్షల కోట్లు) అప్పుల్లో ఉన్నారన్న కియోసాకి, ఈ భారీ అప్పులకు అనవసర ఖర్చులే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు.అమెరికన్లు చేసిన ఖర్చుల జాబితాను ప్రస్తావిస్తూ ఆయన కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. ఖరీదైన రెస్టారెంట్లలో విందులు, వాడకపోయినా స్ట్రీమింగ్ సర్వీసుల సబ్స్క్రిప్షన్లను కొనసాగించడం, అనవసరంగా దుస్తులు కొనుగోలు చేయడం, విహారయాత్రల కోసం అప్పులు చేయడం, గుర్తింపులేని ఆన్లైన్ షాపింగ్ ఆర్డర్లు, ఉపయోగించని జిమ్ సభ్యత్వాలు వంటి ఖర్చులు ప్రజలను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.అలాగే కొత్త గ్యాడ్జెట్లు, అప్గ్రేడ్లు, వివిధ సబ్స్క్రిప్షన్లు, సౌకర్యాల కోసం చెల్లించే అదనపు రుసుములు కొనుగోలు సమయంలో అవసరమైనవిగా అనిపించినప్పటికీ, తర్వాత అవే ఆర్థిక భారంగా మారుతాయని కియోసాకి హెచ్చరించారు.తన ప్రసిద్ధ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’లో ఉపయోగించిన “డూడాడ్స్ (Doodads)” అనే పదాన్ని గుర్తుచేస్తూ, అవసరం లేని వస్తువులు మనల్ని ధనవంతుల్లా భావింపజేసినా, వాస్తవానికి పేదరికం వైపు నెడతాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సగటు అమెరికన్ వ్యక్తి సుమారు 7,900 డాలర్లు (దాదాపు రూ.6.8 లక్షలు) క్రెడిట్ కార్డు అప్పుతో ఉన్నారని, దానిపై 24 శాతం వడ్డీ చెల్లిస్తూ మినిమమ్ డ్యూలతో నెట్టుకొస్తున్నారని కియోసాకి తెలిపారు. ఇలాంటి అప్పులపై వడ్డీ చక్రవడ్డీలా పెరుగుతూ ఆర్థిక స్వేచ్ఛను దూరం చేస్తుందని ఆయన హెచ్చరించారు.అందరూ తమ ఖర్చుల అలవాట్లను పరిశీలించుకోవాలని, అవసరం లేని వ్యయాలను తగ్గించి నిజమైన సంపద సృష్టి వైపు అడుగులు వేయాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో ఖర్చులను నియంత్రించి ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు తాను ఒక ఉచిత మార్గదర్శకాన్ని సిద్ధం చేశానని తన పోస్టులో పేర్కొన్నారు. -
యుద్ధం ముగించలేదు.. ట్రంప్ కు ఇరాన్ హెచ్చరిక
-
రేయ్ జేసీ...? నువ్వు నన్ను ఆపగలనని అనుకుంటున్నావా..?!
-
ఫస్ట్ పక్కకు జరుగు.. అంబటి VS పోలీస్
-
గొడ్డలి పార్టీనా.. తెగనరికి భూమిలో పాతకపోతే.. కొడాలి నాని మాస్ వార్నింగ్
-
యుద్ధంపై ట్రంప్ యూటర్న్.. చర్చలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్!
-
ఆ భయం నాకూ ఉంది: AIపై ఆంథ్రోపిక్ సీఈఓ ఆందోళన
కృత్రిమ మేధస్సు (AI) అభివృద్ధి మానవ సమాజానికి అపార అవకాశాలు తెస్తున్నప్పటికీ, అదే సమయంలో తీవ్రమైన ప్రమాదాలకు కూడా దారితీయవచ్చని ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ (Anthropic) సహ వ్యవస్థాపకుడు, సీఈఓ డారియో అమోడేయి (Dario Amodei) హెచ్చరించారు. “ఏదో ఒక సమయంలో ఏదైనా తప్పు జరిగే అవకాశం ఉందనే ఆందోళన నాకూ ఉంది” అంటూ ఆయన తాజా బ్లూమ్‌బర్గ్ డాక్యుమెంటరీలో వ్యాఖ్యానించారు.ఏఐ భద్రత అంశంపై చాలా కాలంగా గళం విప్పుతున్న అమోడేయి, ప్రపంచవ్యాప్తంగా ఏఐ సామర్థ్యాలు ప్రభుత్వాల నియంత్రణ సామర్థ్యాన్ని మించిపోయే వేగంతో అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. అమెరికాలో నిర్వహించిన సర్వేల ప్రకారం, సగానికి పైగా ప్రజలు ఏఐ కారణంగా ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని భావిస్తున్నారు.“స్వచ్ఛంద నియంత్రణ సరిపోదు”ఏఐ కంపెనీలు స్వయంగా భద్రతా ప్రమాణాలు పాటిస్తామని చెప్పడం మాత్రమే ఇక సరిపోదని అమోడేయి అభిప్రాయపడ్డారు. తాజాగా విడుదల చేసిన తన విధాన వ్యాసంలో, అత్యాధునిక “ఫ్రంటియర్ ఏఐ” మోడళ్లను విడుదల చేసే ముందు తప్పనిసరిగా స్వతంత్ర థర్డ్ పార్టీ సంస్థల ద్వారా పరీక్షించాలని సూచించారు. ముఖ్యంగా సైబర్ దాడులు, జీవాయుధాల అభివృద్ధి, మానవ నియంత్రణను దాటిపోయే స్వయంప్రతిపత్తి వంటి ప్రమాదాలను అంచనా వేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో మోడళ్లు విఫలమైతే, వాటి విడుదలను నిలిపివేసే లేదా పూర్తిగా నిరోధించే అధికారం ప్రభుత్వాలకు ఉండాలని ఆయన వాదించారు.ఓపెన్ఏఐతో విభేదాలూ ఇందుకే..ఒకప్పుడు ఓపెన్ఏఐ (OpenAI)లో కీలక పరిశోధకుడిగా పనిచేసిన అమోడేయి, ఏఐ భద్రత అంశాలపై విభేదాల కారణంగా సంస్థను విడిచి ఆంథ్రోపిక్‌ను స్థాపించారు. వాణిజ్య ప్రయోజనాలు, వేగవంతమైన ఉత్పత్తి విడుదల కంటే భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది ఆయన వైఖరి. ఇదే సమయంలో ఓపెన్ఏఐ కూడా ఏఐ రిస్క్‌లపై తామూ స్పష్టమైన అవగాహనతో ఉన్నామని, “ప్రతిదీ పూర్తిగా ఆటోమేట్ కావడం మాకు కావలసిన భవిష్యత్తు కాదు” అని ఇటీవల వెల్లడించింది. ఏఐ వల్ల భారీ ఉత్పాదకత పెరుగుదల సాధ్యమైనప్పటికీ, ఉద్యోగాలపై దాని ప్రభావం, సామాజిక పరిణామాలను నిర్లక్ష్యం చేయరాదని పరిశ్రమ నాయకులు అంగీకరిస్తున్నారు.భారత్‌లోనూ నియంత్రణ ఆలోచనఏఐ నియంత్రణపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు వేగంగా జరుగుతున్న వేళ, భారత్ కూడా ప్రత్యేక చట్టపరమైన వ్యవస్థ అవసరాన్ని గుర్తిస్తోంది. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఇటీవల మాట్లాడుతూ, 2000 నాటి ఐటీ చట్టం ఆధునిక ఏఐ యుగానికి సరిపోదని, ఆవిష్కరణకు ప్రోత్సాహం ఇస్తూనే పౌరుల భద్రతను కాపాడే కొత్త విధానాలు అవసరమని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘ఆ బంగారం, వెండి.. నకిలీ ఆస్తులు’ -
మూల్యం చెల్లించుకోవాల్సిందే : ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఇరాన్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమతో ఒప్పందానికి రాకుండా, గ్రేట్ డీల్‌ను మిస్ చేసుకుంది అంటూ ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందంటూ హెచ్చరించారు. ఇరాన్‌తో చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని పదే పదే ప్రకటించే ట్రంప్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సైన్యం పూర్తిగా ఓడిపోయింది, అన్నీ ఉత్తమాటలే, చేతలేమీ లేవు అంటూ తన ‘ట్రూత్ సోషల్’ (Truth Social) ప్లాట్ఫామ్లో ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ సైనిక సామర్థ్యం దారుణంగా క్షీణించిందని, మంచి ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశాన్ని ఇరాన్ నాయకత్వం చేజేతులా వృధా చేసుకుందన్నారు. ఇరాన్ సైన్యం పూర్తిగా అతలాకుతలమైంది. అసలు నౌకాదళం, వాయుసేన వంటి చాలా విభాగాలు ఉనికిలోనే లేవు, పూర్తి ఓటమి పాలయ్యారంటూ అని ట్రంప్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. అంతేకాదు అంతా మాటలే.. చేతల్లో ఏమీ లేదు. మిడిల్ ఈస్ట్ పెత్తందారు కథ ముగిసింది!!! అంటూ ఇరాన్‌పై ధ్వజమెత్తారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన గడువును ప్రస్తావిస్తూ చర్చలను తెగనీయకుండా సాగదీశారని ఇరాన్ నేతలను విమర్శించారు. ఎంతో మేలు చేకూర్చే ఒప్పందంపై చర్చలకు చాలా సమయం తీసుకున్నారు,ఇప్పుడు దానికి వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!!!" అని ఆయన హెచ్చరించారు. > ఇదీ చదవండి: భర్తను అలా చూసి కారు బోనెట్‌పైకి భార్య చివరికి.. వైరల్ వీడియోఇరాన్ లక్ష్యాలపై అమెరికా ఇటీవల జరిపిన దాడుల నేపథ్యంలో వాషింగ్టన్‌తో చర్చల భవిష్యత్తుపై తాము పునఃసమీక్షిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయ్ స్పందిస్తూ.. అమెరికా పరస్పర విరుద్ధమైన వైఖరిని అవలంబిస్తూ, కాల్పుల విరమణ అవగాహనలను పదేపదే ఉల్లంఘిస్తూ దౌత్య ప్రక్రియను దెబ్బతీస్తోందని ఆరోపించారు.అయితే మధ్యప్రాచ్యంలో పలు చోట్ల ఘర్షణలు జరుగుతున్నప్పటికీ, గత కొన్ని వారాలుగా చర్చలు ఒక కొలిక్కి వస్తున్నాయని ఆయన పలుమార్లు పేర్కొన్నారు. ఇరాన్‌తో గ్రీట్ డీల్‌కి చాలా దగ్గరగా ఉన్నామని ట్రంప్ పదేపదే చెబుతూ వస్తున్నప్పటికీ, దీన్ని ఇరాన్ ఖండిస్తూ వస్తోంది. సైనిక దాడులు కొనసాగుతున్నంత కాలం దౌత్యం విజయవంతం కాలేదని స్పష్టం చేస్తూ మొదటినుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్తకాగా హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) సమీపంలో అమెరికాకు చెందిన 'అపాచీ' దాడి హెలికాప్టర్‌ను ఇరాన్ కూల్చివేసిందన్న ఆరోపణల నేపథ్యంలో.. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్, నిఘా కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులు చేసింది. ఈ తాజా ఘర్షణల తర్వాతే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్.. జోర్డాన్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేసింది. ఇది మధ్యప్రాచ్యంలో మరింత పెద్ద ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందేమోనన్న ఆందోళనలను పెంచింది.ఇదీ చదవండి: భారత మామిడి దిగుమతులను నిషేధించిన నేపాల్ -
ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
ఇలా అయితే ఏటీఎం సేవలు నిలిచిపోతాయ్..
దేశవ్యాప్తంగా ఏటీఎం సేవలు నగదు కొరత సమస్యను ఎదుర్కొనే ప్రమాదం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (CATMi) ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA)ను హెచ్చరించింది. ఏటీఎంలలో నింపాల్సిన నగదు అందుబాటులో లేకపోవడం వల్ల సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా ప్రత్యక్ష నగదు బదిలీ (DBT) లబ్ధిదారులు, గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో నగదుపై ఆధారపడే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.అవసరానికి తగ్గ నగదు అందడం లేదుసీఏటీఎంఐ ఐబీఏకు రాసిన లేఖ ప్రకారం, అనేక రాష్ట్రాల్లో బ్యాంకు శాఖలు, కరెన్సీ చెస్టుల నుంచి ఏటీఎంలలో లోడ్ చేయడానికి అవసరమైన నగదును పొందడంలో సభ్య సంస్థలు నిరంతరం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏటీఎంలకు రూ.94,000 కోట్ల నగదు అవసరమవగా, మార్చిలో కేవలం రూ.61,000 కోట్లు, ఏప్రిల్‌లో రూ.54,000 కోట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. దీంతో అవసరమైన నగదులో వరుసగా 64 శాతం, 57 శాతం మాత్రమే నెరవేరిందని తెలిపింది. ఈ అంశాన్ని రిజర్వ్ బ్యాంక్ కరెన్సీ మేనేజ్మెంట్ విభాగం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ‘బిజినెస్ స్టాండర్డ్’ కథనం పేర్కొంది.నగదు ఉంది.. కానీ ఏటీఎంలకు చేరడం లేదుఆసక్తికరమైన విషయం ఏమిటంటే దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ (Currency in Circulation) రికార్డు స్థాయిలో ఉంది. మే 22 నాటికి చలామణిలో ఉన్న నగదు రూ.42.54 లక్షల కోట్లకు చేరింది. అయినప్పటికీ ఏటీఎంలకు అవసరమైన నగదు సరఫరాలో లోటు కనిపిస్తోంది. దీంతో సమస్య నగదు కొరత కంటే పంపిణీ, లాజిస్టిక్స్, నగదు నిర్వహణ వ్యవస్థల్లోనే ఎక్కువగా ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.పెరుగుతున్న ఖర్చులు.. ఆపరేటర్ల ఆందోళనఏటీఎం పరిశ్రమ ప్రస్తుతం మరో సవాలును కూడా ఎదుర్కొంటోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో ఇంధన ధరలు పెరగడం, పలు రాష్ట్రాల్లో కనీస వేతనాల పెంపు కారణంగా నగదు రవాణా, భద్రత, నిర్వహణ వ్యయాలు గణనీయంగా పెరిగాయి. నగదు రవాణా సంస్థలు, ఏటీఎం రీప్లెనిష్మెంట్ కంపెనీలు బ్యాంకుల నుంచి అధిక ఛార్జీలను కోరుతున్నాయి. ఖర్చులు 15-20 శాతం వరకు పెరిగినట్లు పరిశ్రమ అంచనా వేస్తోంది.తగ్గుతున్న ఏటీఎం లావాదేవీలుడిజిటల్ చెల్లింపుల విస్తరణతో ఏటీఎంల వినియోగం క్రమంగా తగ్గుతోంది. ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం, 2025లో ఇదే కాలంలో 498.37 మిలియన్లుగా ఉన్న ఏటీఎం లావాదేవీలు 2026 మే నాటికి 446.50 మిలియన్లలకు పడిపోయాయి. ఏడాదిలో సుమారు 10.4 శాతం తగ్గుదల నమోదైంది. అయితే నగదు చలామణి మాత్రం పెరుగుతూనే ఉండటం విశేషం. ఇది ప్రజలు అత్యవసర అవసరాల కోసం నగదును నిల్వ ఉంచుతున్నారనే సంకేతంగా ఎస్బీఐ పరిశోధన నివేదిక పేర్కొంది.ఫీజుల పెంపు ప్రభావంగత ఏడాది నుంచి ఉచిత పరిమితిని దాటిన ఏటీఎం లావాదేవీలపై వసూలు చేసే ఛార్జీని రూ.21 నుంచి రూ.23కు పెంచారు. అలాగే ఇంటర్చేంజ్ ఫీజును రూ.17 నుంచి రూ.19కు పెంచినా, పెరిగిన నిర్వహణ ఖర్చులను అది భర్తీ చేయలేకపోతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఏటీఎం ఆపరేటర్ల లాభదాయకతపై ఒత్తిడి పెరుగుతోంది.ప్రజలపై ప్రభావం ఎంత?ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడే పరిస్థితి లేదని బ్యాంకింగ్ వర్గాలు స్పష్టం చేస్తున్నప్పటికీ, నగదు సరఫరా సమస్య కొనసాగితే కొన్ని ప్రాంతాల్లో తరచూ "క్యాష్ అవుట్" పరిస్థితులు కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డీబీటీ లబ్ధిదారులు, రోజువారీ నగదు లావాదేవీలపై ఆధారపడే వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. అందువల్ల నగదు పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం, ఏటీఎం రీప్లెనిష్మెంట్ ప్రక్రియను మరింత సమర్థవంతంగా మార్చడం అత్యవసరంగా మారింది. -
ఐసీఐసీఐ బ్యాంకుకు సెబీ హెచ్చరిక
దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ షాక్ ఇచ్చింది. వాలంటరీ రిటెన్షన్ రూట్(వీఆర్ఆర్) కింద స్థానిక రుణ సెక్యూరిటీల్లో విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు సెబీ హెచ్చరిక లేఖ జారీ చేసింది. ఈ మేరకు ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు దాఖలు చేసిన ఒక ఫైలింగ్‌లో అధికారికంగా వెల్లడించింది.అసలేం జరిగింది?సెక్యూరిటీ కస్టోడియన్ (Securities Custodian)గా వ్యవహరిస్తున్న ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ (ఎఫ్‌పీఐ)కు నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి చేకూర్చినట్లు సెబీ గుర్తించింది. వీఆర్ఆర్ ప్రోగ్రామ్ కింద దేశీయ బాండ్లలో పెట్టుబడి పెట్టిన సదరు విదేశీ ఇన్వెస్టర్, లాక్-ఇన్ పీరియడ్ పూర్తి కాకముందే తన నిధులను స్వదేశానికి తిరిగి తీసుకెళ్లేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ అనుమతించింది.సెబీ అభ్యంతరంనిబంధనల ప్రకారం గడువు ముగియకుండా నిధులను వెనక్కి పంపడం ఆర్బీఐ, సెబీ మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేస్తూ సెబీ జూన్ 1న బ్యాంకుకు హెచ్చరిక లేఖ పంపింది. ఈ ఉల్లంఘనకు సంబంధించిన వివరాలను నిర్ణీత కాలపరిమితిలోగా ఎక్స్ఛేంజీలకు వెల్లడించడంలోనూ బ్యాంక్ విఫలమైంది. అనుకోకుండా జరిగిన ఆలస్యం వల్లే ఈ సమాచారాన్ని సకాలంలో సమర్పించలేకపోయామని బ్యాంక్ అంగీకరించింది.వీఆర్ఆర్ అంటే ఏమిటి? దాని ప్రాధాన్యత ఏంటి?భారతీయ ప్రభుత్వ, కార్పొరేట్ బాండ్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులను దీర్ఘకాలం పాటు నిలిపి ఉంచేలా ప్రోత్సహించడానికి ఆర్బీఐ 2019లో ఈ స్వచ్ఛంద నిలుపుదల మార్గాన్ని (వీఆర్ఆర్) ప్రవేశపెట్టింది. సాధారణ ఎఫ్‌పీఐ పెట్టుబడులపై ఉండే కఠినమైన నియంత్రణ అవసరాల నుంచి విదేశీ ఇన్వెస్టర్లకు ఈ మార్గం ద్వారా కొన్ని మినహాయింపులు లభిస్తాయి. అయితే, ఇందుకు ప్రతిగా సదరు విదేశీ ఇన్వెస్టర్ తమ పెట్టుబడుల్లో ఒక కనీస శాతాన్ని నిర్ణీత కాలం పాటు దేశంలోనే ఉంచేందుకు స్వచ్ఛందంగా కట్టుబడి ఉండాలి. కాగా, ఇటీవలే (ఫిబ్రవరిలో) కేంద్ర బ్యాంక్ ఈ ఎఫ్‌పీఐ పెట్టుబడుల కోసం వీఆర్ఆర్ను జనరల్ రూట్లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది.ఐసీఐసీఐ బ్యాంక్ వివరణసెబీ తీసుకున్న ఈ నియంత్రణ చర్యపై ఐసీఐసీఐ బ్యాంక్ స్పందించింది. ఈ హెచ్చరిక లేఖ కేవలం ఒక నిర్దిష్ట సమ్మతి లోపానికి సంబంధించినది మాత్రమేనని తెలిపింది. ‘ఈ చర్య వల్ల బ్యాంకు ఆర్థిక స్థితిగతులపై ఎలాంటి ప్రభావం ఉండదు. బ్యాంకు దైనందిన కార్యకలాపాలు లేదా వ్యాపార నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగదు. భవిష్యత్తులో ఇలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా అంతర్గత నియంత్రణలను మరింత బలోపేతం చేస్తాం’ అని చెప్పింది. బ్యాంకు మొత్తం పనితీరుపై గానీ, భద్రతపై గానీ దీని ప్రభావం ఏమాత్రం ఉండబోదని మేనేజ్మెంట్ ఇన్వెస్టర్లకు, ఖాతాదారులకు భరోసా ఇచ్చింది.ఇదీ చదవండి: మూల పడిన బంగారం.. దేశ ఆర్థికానికి మూలాధారం! -
రోడ్డు మీదకు వచ్చా... ఏం పీక్కుంటావో పీక్కో...!
-
దమ్ముంటే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టు..!
-
బూతులు తిట్టే 420 గాళ్లతో బాబు హగ్గులు.. పేర్ని నాని మాస్ ర్యాగింగ్
-
జగన్ దెబ్బకు 5ఏళ్ళు తెలంగాణలో దాక్కున్నావ్.. నువ్వా రాజకీయాలకోసం మాట్లాడేది
-
సుగాలి ప్రీతి తల్లిపై హైపర్ ఆది వ్యాఖ్యలు.. పోతిన మహేష్ వార్నింగ్
-
9 నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి.. ఏయూలో దళితులపై వివక్ష
-
ఏపీకి బిగ్ అలర్ట్.. ఆ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
సాక్షి, అమరావతి: రాయలసీమ జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది. రాగల మూడు గంటల్లో నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. 50-60కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని.. చెట్లు, పోల్స్, హోర్డింగ్స్ కింద నిలబడరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో జూన్‌లోనూ వడగాడ్పుల రోజులు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఇరు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని అంచనా వేసింది. ఏపీతోపాటు యూపీ, హరియాణా, పంజాబ్, బిహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్‌లలో సాధారణం కంటే ఎక్కువ వడగాడ్పుల రోజులు నమోదవుతాయని.. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోనూ వడగాడ్పుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.దేశవ్యాప్తంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణంకన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా రుతుపవనాల వర్షపాత దీర్ఘకాల సగటు (ఎల్పీఏ)లో 90 శాతంగా ఉండే అవకాశం ఉందని.. ఇది ఏప్రిల్‌లో అంచనా వేసిన 92 శాతం కంటే కూడా తక్కువని తాజా అంచనాలో పేర్కొంది. ఎల్‌నినో ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడటంతో మధ్యభారత్ సహా దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాలు, దేశ వాయవ్య ప్రాంతంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. -
కూటమిలో చీలికలు.. ఎమ్మెల్యే నానికి చెప్పు చూపించిన జనసేన నేత
-
నువ్వెంత.. నీ బతుకెంత.. బీటెక్ రవికి అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
-
మీ రౌడీయిజానికి నేను బ్రేక్ వేస్తా..! ఒక్కొక్కడి అంతు చూస్తా..!
-
నువ్వు ఎవడురా కూలగొట్టడానికి.. నీ అబ్బ జాగీరా.. తోపుదుర్తి మాస్ వార్నింగ్!
-
గుర్తుపెట్టుకో చంద్రబాబు.. ఇవే నీకు చివరి ఎన్నికలు..
-
మా నాన్నని అసెంబ్లీలో అన్న మాటలు మర్చిపోలేదు.. రెండు రోజులకే ఆక్సిడెంట్!
-
పంటల దిగుబడులపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం : ఐసీఏఆర్ వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశంలో సూపర్ ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని, దీని కారణంగా పంటల దిగుబడులు గణనీయంగా తగ్గే ప్రమాదముందని భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) వెల్లడించింది. గతంలో ఇదేమాదిరి ఎల్‌నినో పరిస్థితులు తలెత్తినప్పుడు వరి సహా మొక్కజొన్న, సజ్జ వంటి వర్షాధార పంటల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపింది. ఈసారి పంటల దిగుబడులు కనీసం 10 శాతం మేర తగ్గుతాయని అంచనా వేసింది. నైరుతి రుతు పవనాలతో సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే అంచనా వేసింది. జూన్– సెప్టెంబర్ మధ్య కాలంలో తక్కువ వర్షాల కారణంగా నీటి కొరత తలెత్తే ప్రమాదం ఉందని ఐసీఏఆర్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో 2002, 2004, 2009 సీజన్లలో ఎల్‌నినో ఏర్పడినప్పుడు 77 జిల్లాల్లో వరి దిగుబడి 10 శాతానికి పైగా పడిపోగా, మొక్కజొన్న ఉత్పత్తి 65 జిల్లాల్లో ఇదే స్థాయిలో తగ్గినట్లు గుర్తించింది. ఇదీ చదవండి: 120 ఏళ్ల తర్వాత చిగురించిన ఆశముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో వరిపై ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా కనిపించి నట్లు తెలిపింది. ఇదే సమయంలో జొన్న, సజ్జ దిగుబడులు కూడా 36 జిల్లాల్లో 10 శాతానికి పైగా తగ్గినట్లు గుర్తించామంది. వర్షాధార ప్రాంతాలే ఎల్‌నినో ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నాయని వివరించింది. ఈ ఏడాది సైతం ఎల్‌నినో పరిస్థితులు కొనసాగనున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని ఐసీఏఆర్ సూచించింది. కరువును తట్టుకునే విత్తనాల ప్రోత్సాహం, వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు, సమర్థవంతమైన నీటి నిర్వహణ, ప్రాంతాల వారీగా ప్రత్యేక వ్యూహాల అమలు ద్వారా రైతుల నష్టాలను తగ్గించాలని రాష్ట్రాలకు సూచించింది. ఇదీ చదవండి: మేయర్ పీఠంపై ఇండియన్ ఎవరీ తుషార్ కుమార్? -
నాకంటే చెడ్డవాడు ఎవరూ లేరు
కోల్‌కతా : బెంగాల్ సీఎం సువేందు అధికారి అల్లరిమూకలపై రెచ్చిపోయారు.ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, పోలీసు సిబ్బందిపై దాడుల పట్ల జీరో టాలరెన్స్ ప్రకటించారు. ఒకవేళ ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతమైతే "నాకంటే చెడ్డవాడు ఎవడూ ఉండరు" అంటూ అల్లరిమూకలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం కోల్‌కతాలోని పార్క్ సర్కస్-తిల్జాలా ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలపై జరిగిన బుల్డోజర్ డ్రైవ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలను ధ్వంసం చేశారు. ఈ హింసాకాండలో ఆరుగురు పోలీసు సిబ్బంది, ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. ఇప్పటివరకు 40 మందిని అరెస్టు చేశామని విచారణ సాగుతుందని పోలీసులు తెలిపారు.కాగా ఈ ఘటనపై సీఎం సువేందు అధికారి స్పందించారు. "ఇలాంటి అ శాంతి, గూండాయిజం, దేశ వ్యతిరేక మరియు సామాజిక వ్యతిరేక కార్యకలాపాల పట్ల జీరో టాలరెన్స్ ఉంటుందని నేను స్పష్టమైన సందేశం ఇస్తున్నాను. ఇలాంటి వాటిని మేము కొనసాగనివ్వం. నేను గాయపడిన పోలీసు సిబ్బందిని, సీఆర్పీఎఫ్ జవాన్లను చూడటానికి, వారి గాయాల తీవ్రతను అర్థం చేసుకోవడానికి వచ్చాను. నిన్న మన దళం మొత్తం శాంతిభద్రతలను కాపాడింది, పెద్ద ప్రమాదాన్ని నివారించి ప్రజలను రక్షించింది. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను." అని అన్నారు.సువేందు మాస్ వార్నింగ్మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని రౌడీయిజం చేస్తే అస్సలు సహించేది లేదని తనకంటే చెడ్డవారు ఎవరూ లేరని హెచ్చరించారు. గతంలో మాదిరిగా పోలీసుల కాళ్లు, చేతులు కట్టవేసి పని చేయించే రోజులు లేవన్నారు. గతంలో పోలీసు బలగాలు పరిమితుల మధ్య పనిచేశాయని పాత నిబంధనలే ఇంకా కొనసాగుతాయని అనుకోవద్దు. " అని అన్నారు.కశ్మీర్‌తో పోలికబెంగాల్ హింసపూర్వక ఘటనలను సువేందు కశ్మీర్ నిరసనలతో పోల్చారు. శ్రీనగర్, కాశ్మీర్లో పోలీసులపై రాళ్లు రువ్వడం ఆగిపోయింది. పశ్చిమ బెంగాల్, కోల్‌కతాలో కూడా ఇది ఆగుతుందని నేను నమ్ముతున్నాను. అని సువేందు స్పష్టం చేశారు. -
లాఠీలు.. తూటాలకు భయపడం.. శవంతో జక్కంపూడి వార్నింగ్
-
ఈ టైమ్ తుపాన్ ముందు ఉన్న ప్రశాంతత.. ఇక విధ్వంసమే..?
వాషింగ్టన్ డీసీ: ఇరాన్- అమెరికా మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ ఈ సారి శాంతి ఒప్పందంపై సంతకం చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇప్పుడు నడుస్తున్న కాలం తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతతగా పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్రూత్ ఖాతాలో ఒక ఏఐ జనరేటెడ్ పిక్‌తో వార్నింగ్ ఇచ్చారు.ఇటీవలే చైనా పర్యటన ముగించుకొని వచ్చారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ చాలా బాగుందని ఆయన చాలా గొప్ప మనిషని కొనియాడారు. తైవాన్ విషయంలోనే అమెరికా మద్దతు ఉండదని చెప్పకనే చెప్పారు. అయితే గత కొద్దిరోజులుగా అమెరికా-ఇరాన్ మధ్య సీజ్ఫైర్ నడుస్తోన్న నేపథ్యంలో మరోసారి ఇరాన్‌పై విరుచుకుపడుతూ మాట్లాడారు.ట్రంప్ మాట్లాడుతూ "ఒకవేళ ఇరాన్ శాంతి ఒప్పందానికి అంగీకరించకుండా, హర్ముజ్ జలసంధి విషయంలో తన దూకుడు వైఖరిని కొనసాగిస్తే, చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు నడుస్తున్న శాంతికాలం తుపానుకు ముందు ప్రశాంతతగా గుర్తుంచుకోవాలి" అని అన్నారు. అయితే ఇరాన్‌పై తిరిగి వైమానిక దాడులను ప్రారంభించడానికి పెంటగాన్ పలు సైనిక ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసిందని ట్రంప్ నిర్ణయం కోసమే వేచి చూస్తున్నారని పలు నివేదికలు పేర్కొన్నాయి.మరోవైపు ఇరాన్ సైతం వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. అమెరికా దాడులు చేస్తే ఎదుర్కోవడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని ఏ దాడికైనా గట్టిగా ప్రతిస్పందిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఇదివరకే తేల్చిచెప్పారు. మధ్యప్రాచ్య సంఘర్షణ ప్రపంచ క్రమాన్ని పునర్నిర్మిస్తోందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ కూడా పేర్కొన్నారు.కాగా హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలకు "టోల్ టాక్స్" స్థానంలో "సర్వీస్ ఛార్జ్"ను ప్రవేశపెట్టి, అక్కడ ఒక కొత్త నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఇరాన్ ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం. -
ఫోన్ పక్కకి పెడతారా.. లేక గన్ తీయమంటారా
ఢిల్లీ: భారత్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ శాఖ మంత్రుల సదస్సు ముగిసింది. అయితే ఇందులో పాల్గొనడానికి వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్కు ఊహించని ఘటన ఎదురైంది. సదస్సులో పాల్గొన్న అనంతరం సెర్గీ లావ్రోవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతుండగా ఓ జర్నలిస్టు ఫోన్లో మాట్లాడుతూ తరచుగా అంతరాయం కలిగించారు. దీంతో ఆగ్రహం చెందిన సెర్గీ లావ్రోవ్ మీరు బయిటకి వెళతారా లేక గన్ తీయమంటారా అని హెచ్చరించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం నిన్న (మే 15) ముగిసింది. పశ్చిమాసియా లో నెలకొన్న సంక్షోభం, ఇరాన్ వివాదం వంటి అంశాలపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఉమ్మడి ప్రకటన లేకుండానే సదస్సు ముగిసింది. ఈ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ని ఒక జర్నలిస్టు ఇబ్బందులకు గురిచేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.బ్రిక్స్ సదస్సు అనంతరం సెర్గీ లావ్రోవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానాలిస్తున్నారు. అయితే ఇంతలోనే ఓ జర్నలిస్టు ఫోన్లో మాట్లాడడంతో లావ్రోవ్ మాటలకు అంతరాయం కలిగింది. దీంతో ఆయన "మీరు మమ్మల్ని ఒంటిరిగా వదిలేయండి. లేదా ఫోన్‌ని వదిలేయండి" అని ఆయనతో అన్నారు. దీని తర్వాత సైతం అతని తీరు మారక మరోసారి ఫోన్లో మాట్లాడుతూ ఆయనను ఇబ్బందులకు గురిచేశారు. దీంతో ఆగ్రహం చెందిన లావ్రోవ్ "మీరు మమ్మల్ని వదిలేస్తారా.. నేను జోక్ చేయడం లేదు. మీరు ఫోన్ వదిలేయకపోతే సెక్యూరిటీ సిబ్బంది తుపాకీ తీయాల్సి వస్తుంది" అని తీవ్రంగా హెచ్చరించారు.దీంతో మీడియా సమావేశంలో పరిస్థితులు గంభీరంగా మారాయి. కాగా బ్రిక్స్ సమావేశం కోసం వచ్చిన లావ్రోవ్ కేంద్రమంత్రులతో పలు కీలక సమావేశాలు జరిపారు. మోదీ యూఏఈ పర్యటనకు ముందు గురువారం ఆయనతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు, ఉక్రెయిన్, పశ్చిమ ఆసియాలోని పరిస్థితులతో సహా కొనసాగుతున్న అంతర్జాతీయ సంఘర్షణల గురించి చర్చించారు.#Watch | "If you don't surrender your phone, they will pull out a gun": Russian Foreign Minister Sergey Lavrov loses cool at a journalist during the BRICS Foreign Ministers Summits in New Delhi pic.twitter.com/Tpdk5uNzTX— NDTV WORLD (@NDTVWORLD) May 16, 2026 -
ఏమిరా.. నన్ను అరెస్ట్ చేస్తారా..! సిద్ధార్థ్ రెడ్డి మాస్ వార్నింగ్..
-
అదే జరిగితే చైనా-అమెరికా మధ్య యుద్ధం
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ మధ్య వాడీవేడి చర్చ జరిగింది. తైవాన్ విషయంలో గనుక అమెరికా తలదూర్చితే రెండు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయని జన్‌పింగ్ ట్రంప్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు బీజింగ్ మీడియా కథనాలు పేర్కొన్నాయిప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా పర్యటనలో ఉన్నారు. రెండురోజుల పర్యటన నిమిత్తం ఆయన చైనా బయిలుదేరారు. ఈ రోజు ఇరువురు అగ్రనేతల మధ్య భేటీ జరిగింది. అయితే తైవాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి జిన్‌పింగ్ నేరుగా కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది.జిన్‌పింగ్, ట్రంప్‌తో మాట్లాడుతూ.. స్వయంప్రతిపత్తి కలిగిన తైవాన్ అంశాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే, ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య "ఘర్షణ" తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించినట్లు ఆ దేశ మీడియా కథనాలు వెల్లడించాయి. చైనా-అమెరికా సంబంధాల కంటే తైవాన్ అంశం చైనాకు అత్యంత కీలకమైనదని జిన్‌పింగ్ ట్రంప్‌తో పేర్కొన్నట్లు తెలుస్తోంది. చైనా,అమెరికా పోటీదారులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని పరస్పర సహకారం రెండు దేశాలకు ఎంతో లాభదాయకమని ఆయన పేర్కొన్నారని ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి.కాగా తైవాన్ విషయంలో అమెరికా వ్యూహాత్మకంగా స్పందిస్తోంది. తైవాన్ తనను తాను రక్షించుకోవడానికి అవసరమైన రక్షణ ఆయుధాలను అమెరికా సరఫరా చేస్తుంది. కాగా దీనిని చైనా తొలి నుంచి వ్యతిరేకిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌తో తొలిరోజు భేటీలోనే జిన్‌పింగ్ చైనా విధానాన్ని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ట్రంప్ చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. -
ఇప్పుడు రండి రా.. ఒక్క అంగుళం భూమి కదిపినా నేను రాజకీయాలు మానేస్తా..
-
ఇక మూడింది మిడిల్ మేనేజర్లకే.. సీఈఓ వార్నింగ్
కృత్రిమ మేధస్సు (AI) విప్లవం కార్పొరేట్ ప్రపంచంలో పెను మార్పులకు నాంది పలుకుతోంది. ముఖ్యంగా కేవలం పర్యవేక్షణకే పరిమితమయ్యే "ప్యూర్ పీపుల్ మేనేజర్ల" మనుగడ ఇకపై కష్టమేనని ఎయిర్బీఎన్బీబి (Airbnb) సీఈఓ బ్రియాన్ చెస్కీ హెచ్చరించారు. పనిలో ప్రత్యక్షంగా భాగస్వాములు కాకుండా, కేవలం సిబ్బందిని మేనేజ్ చేసే పాత పద్ధతులకు కాలం చెల్లిందని ఆయన అభిప్రాయపడ్డారు.పని చేయని వారికి చోటు లేదు!ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన చెస్కీ, ఏఐ యుగంలో నెట్టుకురావాలంటే మేనేజర్లు తమ పనితీరును మార్చుకోవాలని సూచించారు. ఇకపై మేనేజర్లు కేవలం మీటింగ్‌లు, పర్ఫార్మెన్స్ రివ్యూలకే పరిమితం కాకూడదు. ప్రాజెక్టుల లోతుపాతులను అర్థం చేసుకుంటూ టీమ్‌తో కలిసి పని చేయాలి. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా అప్డేట్ అవ్వని వారు, ఏఐ వినియోగాన్ని వ్యతిరేకించే వారు కెరీర్ రేసులో వెనుకబడిపోతారని ఆయన స్పష్టం చేశారు.ఎయిర్‌బీఎన్‌బీలో 60% కోడింగ్ ‘ఏఐ’తోనే..ఎయిర్‌బీఎన్‌బీ ఇప్పటికే ఏఐ వినియోగంలో ముందుంది. కంపెనీలో దాదాపు 60% కోడింగ్ ఇప్పుడు ఏఐ ద్వారానే జరుగుతోందని, దీనివల్ల ఉత్పత్తులను వేగంగా మార్కెట్లోకి తీసుకురావడమే కాకుండా, తక్కువ మందితో సమర్థవంతంగా పనిచేయడం సాధ్యమవుతోందని కంపెనీ వెల్లడించింది.తగ్గుతున్న ‘మేనేజ్మెంట్’ పొరలుఒక్క ఎయిర్‌బీఎన్‌బీ మాత్రమే కాదు, అనేక దిగ్గజ టెక్ సంస్థలు ఇప్పుడు "ఫ్లాటర్ స్ట్రక్చర్" (తక్కువ మేనేజ్మెంట్ స్థాయిలు) వైపు మొగ్గు చూపుతున్నాయి.మెటా ఇప్పటికే మేనేజ్మెంట్ పొరలను తొలగించి నిర్ణయ ప్రక్రియను వేగవంతం చేసింది. బ్లాక్ సీఈఓ జాక్ డోర్సే కూడా శాశ్వత మిడిల్ మేనేజ్మెంట్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాయిన్‌బేస్ సీఈఓ బ్రియాన్ ఆర్మ్‌స్ట్రాంగ్ సైతం "ప్యూర్ మేనేజర్" పాత్రలను తొలగిస్తున్నట్లు ప్రకటించారు.వస్తున్నది ‘ప్లేయర్-కోచ్’ల కాలంనివేదికలు, షెడ్యూలింగ్, పనితీరును ట్రాక్ చేయడం వంటి పనులను ఏఐ సులభంగా చేసేస్తోంది. కాబట్టి, కేవలం ఆర్డర్లు వేసే మేనేజర్ల కంటే, సాంకేతిక పరిజ్ఞానం ఉండి ప్రాజెక్టులో నేరుగా పాల్గొనే "ప్లేయర్-కోచ్" తరహా నాయకులకే భవిష్యత్తులో డిమాండ్ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.జూనియర్ల విషయంలో జాగ్రత్త!అయితే, ఏఐ మోజులో పడి కొత్త గ్రాడ్యుయేట్లు, ఇంటర్న్‌ల నియామకాలను ఆపవద్దని చెస్కీ హెచ్చరించారు. ఎంట్రీ లెవల్ ఉద్యోగాలను పూర్తిగా తొలగిస్తే, భవిష్యత్తులో కంపెనీలను నడిపించే నాయకులు తయారుకారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని ఉత్పాదకత పెంచుకోవడానికి వాడుకోవాలి తప్ప, నైపుణ్యం కలిగిన మానవ వనరుల పైప్‌లైన్‌ను దెబ్బతీసేలా ఉండకూడదని ఆయన సూచించారు. -
రెండు సీట్ల కోసం ఇంతకు తెగిస్తావా.. విజయ్ కు నేనున్నా
-
ఆ అబద్ధమే ఇంకా చెబుతున్నారు.. కియోసాకి ఆందోళన
ఇన్వెస్టర్ గురూ, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా చేసిన ఫేస్బుక్ పోస్టులో ఉద్యోగ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “స్కూల్‌కి వెళ్లి, ఉద్యోగం సంపాదిస్తే భద్రత ఉంటుంది” అనే అత్యంత ఖరీదైన అబద్ధాన్ని ఇప్పటికీ 2026లోనూ తల్లిదండ్రులు తమ పిల్లలకు చెబుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.కియోసాకి పేర్కొన్న వివరాల ప్రకారం, 2025 సంవత్సరం ఉద్యోగుల పాలిట అత్యంత కఠినమైన కాలంగా మారింది. ఆ ఒక్క సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 12 లక్షల ఉద్యోగాల కోతలు నమోదయ్యాయని, ఇది 2020 తర్వాత అత్యధికమని ఆయన తెలిపారు. అలాగే 2026 జనవరిలోనే 1,08,435 ఉద్యోగాలు ఊడిపోయాయనిఇ చెప్పారు.టెక్నాలజీ రంగంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని కియోసాకి పేర్కొన్నారు. 2026లో ప్రతిరోజూ సగటున 1,003 మంది టెక్ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోతున్నారన్నారు. అమెజాన్ జనవరిలో 16 వేల ఉద్యోగాలను తొలగించగా, మెటా మే నెలలో మరో 8 వేల ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోందని చెప్పారు. చెవ్రాన్ 8 వేల మందిని, డెల్ 11 వేల మందిని, సిటీగ్రూప్ 20 వేల మందిని తొలగించిందని, స్పిరిట్ ఎయిర్‌లైన్స్ మూతపడటంతో 17 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆయన వివరించారు.ఈ పరిస్థితులకు కృత్రిమ మేధస్సు (AI) ప్రధాన కారణంగా మారుతోందని కియోసాకి అభిప్రాయపడ్డారు. ఒక్క 2025లోనే ఏఐ కారణంగా అమెరికాలో 55 వేల ఉద్యోగాలు పోయాయని, 2026 ఏప్రిల్‌లో జరిగిన ఉద్యోగ కోతల్లో 26 శాతం ఏఐ కారణంగానే జరిగాయని ఆయన పేర్కొన్నారు.“ఇవేవీ విఫలమైన కంపెనీలు కావు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సంస్థలు. అయినా అత్యంత చదువుకున్న, నైపుణ్యం కలిగిన ఉద్యోగులే తొలగింపులకు గురవుతున్నారు” అని కియోసాకి వ్యాఖ్యానించారు. ఉద్యోగ భద్రత అనేది అసలు ఎప్పుడూ నిజం కాదని, ఉద్యోగంపై మాత్రమే ఆధారపడటం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.తన తండ్రి ఉదాహరణను ప్రస్తావిస్తూ, “నా తండ్రి పీహెచ్డీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగి. ఒక్కరోజు కూడా పని మానలేదు. అయినా చివరికి అప్పులతోనే మరణించారు” అని ఆయన అన్నారు. విద్యాసంస్థలు మంచి ఉద్యోగులుగా తయారు చేస్తాయని, కానీ డబ్బు ఎలా పనిచేస్తుందో మాత్రం నేర్పవని విమర్శించారు. డబ్బు వ్యవస్థపై మాట్లాడుతూ, “సేవింగ్స్‌లో డబ్బు ఉంచడం వల్ల ద్రవ్యోల్బణం నెమ్మదిగా దాన్ని తినేస్తుంది. ఉద్యోగుల ఆదాయం ఆగిపోయినప్పుడు వారికి ఆదాయం ఇచ్చే ఆస్తులు లేకపోవడమే అసలు సమస్య” అని ఆయన తెలిపారు.తన చిన్నప్పుడే “రేపు ఉద్యోగం పోతే నీ ఆస్తుల ద్వారా ఎంతకాలం జీవించగలవు?” అని తన ‘రిచ్ డ్యాడ్’ అడిగిన ప్రశ్నను గుర్తుచేసుకున్న కియోసాకి, ఉద్యోగ భద్రత గురించి ఆలోచించే వారికంటే, “నేను ఏ ఆస్తిని నిర్మిస్తున్నాను?” అని ఆలోచించే వారే భవిష్యత్తులో నిలబడతారని పేర్కొన్నారు.“ప్రపంచం మారిపోయింది. కానీ పాత సలహాలు మాత్రం మారలేదు. ఏఐ విప్లవం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది” అని కియోసాకి తన పోస్టులో హెచ్చరించారు. -
నా అక్రమాలు కూడా నువ్వే చేస్తే నేను దేనికి.. బుద్ధాపై సుజనా సీరియస్
-
చేతులు మారుతున్న ‘ప్రపంచ ఆర్థిక శక్తి’.. కియోసాకి వైరల్ పోస్ట్
ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad ) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ప్రపంచ ఇన్వెస్టర్లను మరోసారి హెచ్చరించారు. సరిగ్గా 12 రోజుల్లో, అంటే మే 15న, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక పీఠం (అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్) చేతులు మారబోతోంది. అయితే మెజారిటీ ప్రజలకు దీని పర్యవసానాలు ఏంటో తెలియడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ చేశారు.వార్ష్ చేతుల్లోకి పగ్గాలు..గత ఎనిమిదేళ్లుగా ఫెడ్ చైర్మన్‌గా ఉన్న జెరోమ్ పావెల్ మే 15న పదవి నుంచి తప్పుకుంటున్నారు. ఆయన స్థానంలో డొనాల్డ్ ట్రంప్ నమ్మకస్తుడు కెవిన్ వార్ష్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. గత 50 ఏళ్లలో ఏ ఫెడ్ చైర్మన్ ఎదుర్కోనంతటి భయంకరమైన ఆర్థిక పరిస్థితుల మధ్య వార్ష్ పదవిలోకి వస్తున్నారని కియోసాకి విశ్లేషించారు.వార్ష్ ముందున్న సవాళ్లు ఇవే..చమురు మంట: బ్యారెల్ ఆయిల్ ధర 120 డాలర్ల వద్ద ఉంది.ద్రవ్యోల్బణ సెగ: 3.3 శాతంతో ద్రవ్యోల్బణం గత రెండేళ్ల గరిష్టానికి చేరింది.వడ్డీ రేట్ల సందిగ్ధత: ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరగడంతో, ఫెడ్ వడ్డీ రేట్లను 3.5% - 3.75% వద్దే కొనసాగించాల్సి వస్తోంది.కియోసాకి మాటల్లో 'వార్ష్ ట్రాప్'కెవిన్ వార్ష్ ఒక ప్రమాదకరమైన ఉచ్చులో చిక్కుకున్నారని కియోసాకి అభివర్ణించారు. ఆయన ముందున్నవి కేవలం మూడు మార్గాలు, ఆ మూడూ నష్టదాయకమే. రేట్లు తగ్గించడం: రేట్లు తగ్గిస్తే, అప్పటికే మండుతున్న ద్రవ్యోల్బణంపై పెట్రోల్ పోసినట్లవుతుంది.రేట్లు మార్చకపోవడం: ఇది అధ్యక్షుడు ట్రంప్‌ను నిరాశపరచడమే కాకుండా, యుద్ధం వల్ల కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీస్తుంది.రేట్లు పెంచడం: ఇది దేశాన్ని నేరుగా ఆర్థిక మాంద్యం (Recession)లోకి నెట్టివేస్తుంది. తొలగని పావెల్ నీడ!ఈ కథనంలో మరో ఆసక్తికరమైన మలుపు ఏంటంటే.. చైర్మన్ పదవి నుంచి దిగిపోయినా, జెరోమ్ పావెల్ ఫెడ్ బోర్డు నుంచి వెళ్లడం లేదు. 2028 వరకు ఆయన బోర్డు మెంబర్‌గా కొనసాగుతారు. 1951 తర్వాత ఒక మాజీ చైర్మన్ ఇలా బోర్డులో ఉండిపోవడం ఇదే తొలిసారి. అంటే, ట్రంప్ తనకిష్టమైన వారిని ఆ సీటులో కూర్చోబెట్టి వడ్డీ రేట్లు తగ్గించేలా చక్రం తిప్పాలని చూసినా, పావెల్ అక్కడ ‘వాచ్ డాగ్’లా అడ్డుపడే అవకాశం ఉంది.అసలు బాస్ ఎవరు?కియోసాకి విశ్లేషణ ప్రకారం.. ఇప్పుడు ఫెడ్ చైర్మన్ ఎవరన్నది ముఖ్యం కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తోంది వార్ష్ కాదు, ట్రంప్ అంతకన్నా కాదు. కేవలం 21 మైళ్ల వెడల్పు ఉన్న 'హార్ముజ్ జల సంధి' (Strait of Hormuz)."ఆ జలసంధి గుండా చమురు ట్యాంకర్ల ప్రయాణం సాధారణ స్థితికి వచ్చే వరకు.. ద్రవ్యోల్బణం 2%కి తగ్గే వరకు.. ఫెడ్ రేట్లు తగ్గించే సాహసం చేయలేదు. ఎవరు చైర్మన్ సీటులో కూర్చున్నా సరే.. ప్రస్తుతానికి 'హార్ముజ్ జలసంధి' మాత్రమే ప్రపంచ ఆర్థిక గమనాన్ని నిర్ణయిస్తోంది." అని కియోసాకి తేల్చి చెప్పారు.ఇన్వెస్టర్లు కేవలం వ్యక్తుల మార్పును మాత్రమే కాకుండా, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలను గమనించాలని కియోసాకి సూచించారు. వార్ష్ రాకతో అద్భుతాలు జరుగుతాయని ఆశించడం కంటే, క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవడం మేలని ఆయన పోస్ట్ సారాంశం. -
దశరథరామిరెడ్డిపై దాడి.. మిథున్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్!
-
నరుకుతా బిడ్డా.. నువ్వు మంత్రివైతే నాకేంటి.. ఎవడిని వదిలిపెట్టను..!
-
మొబైల్ ఫోన్లలో ఎమర్జెన్సీ అలారం మోత
కొన్ని నిమిషాల కిందట దేశవ్యాప్తంగా లక్షలాది మంది మొబైల్ ఫోన్లు ఒక్కసారిగా మోగాయి. ఫోన్లలో వింత శబ్దంతో కూడిన అలారం రావడంతో పౌరులు మొదట ఆందోళనకు గురయ్యారు. అయితే, ఇది ఎటువంటి ప్రమాద సంకేతం కాదని, ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘సెల్ బ్రాడ్కాస్ట్’ వ్యవస్థలో భాగంగా నిర్వహించిన పరీక్ష అని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.ఈరోజు ఉదయం 11:46 గంటలకు ఈ టెస్ట్ మెసేజ్ పౌరుల మొబైల్ ఫోన్లకు చేరుకుంది. ‘ఇది భారత ప్రభుత్వ విపత్తు నిర్వహణ సంస్థ పంపిన నమూనా పరీక్షా సందేశం’ అని అందులో స్పష్టంగా పేర్కొన్నారు.అసలేం జరుగుతోంది?నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీడాట్)తో కలిసి దేశవ్యాప్తంగా అత్యాధునిక విపత్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దీన్ని ‘సాచెట్’ అని పిలుస్తారు. ఈ వ్యవస్థ పనితీరును, దేశంలోని మొబైల్ నెట్‌వర్క్‌ల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ప్రభుత్వం ప్రస్తుతం దశలవారీగా పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నేడు ఆ ఫ్లాష్ ఎస్ఎంఎస్ పంపించారు. ఇది కేవలం ఒక డ్రిల్ మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ వ్యవస్థ ప్రత్యేకతలేంటి?సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థ పూర్తిగా సీ-డాట్ అభివృద్ధి చేసిన స్వదేశీ సాంకేతికత. ఇది ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ సిఫార్సు చేసిన కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్ ఆధారంగా పనిచేస్తుంది. దీని ప్రధాన లక్షణాలు..భూకంపాలు, సునామీలు, వరదలు, పిడుగులు వంటి ప్రకృతి వైపరీత్యాలతోపాటు గ్యాస్ లీకేజీలు లేదా రసాయన ప్రమాదాల వంటి అత్యవసర పరిస్థితుల్లోనూ ఇది పనిచేస్తుంది.విపత్తు సంభవించే అవకాశం ఉన్న నిర్దిష్ట ప్రాంతంలోని వినియోగదారులకు మాత్రమే ఈ సందేశాలు పంపిస్తారు. తద్వారా అనవసర గందరగోళం తగ్గుతుంది.మొబైల్ డేటా లేకపోయినా, నెట్వర్క్ ఉన్నంత వరకు అత్యవసర సందేశం క్షణాల్లో ఫోన్‌ను చేరుతుంది.అందరి రక్షణే లక్ష్యంగా..ప్రస్తుతం జరుగుతున్నవి ప్రాథమిక పరీక్షలు మాత్రమే. ఈ పరీక్షల తర్వాత, భవిష్యత్తులో ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. అప్పుడు ఇది టెస్ట్ ఛానెల్ సెట్టింగులతో సంబంధం లేకుండా అన్ని రకాల మొబైల్ ఫోన్లలోనూ, అన్ని భారతీయ భాషల్లోనూ హెచ్చరికలను పంపగలదు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు దేశంలోని ప్రతి పౌరుడికి ముందస్తు సమాచారం చేరవేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.ఇదీ చదవండి: మా కోసం పూజలు చేయండి!.. నటి ఆవేదన -
ఓరి బుడ్డోడా... టీచర్‌కే వార్నింగా?
-
శత్రువు గుండె పగిలే కొత్త ఆయుధం : ఇరాన్ సంచలన హెచ్చరిక
ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయెల్ ప్రకటించిన యుద్ధం మరింత భీకర రూపం దాల్చనుందా? అంటే ఇరాన్ తాజా హెచ్చరికలు అవుననే సంకేతాలు అందిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దళాలపై కొత్త ఆయుధాన్ని ఉపయోగించబోతున్నామంటూ సంచలన ప్రకటన చేసింది. ఈ ఆయుధం శత్రువులకు "గుండెపోటు" తెప్పించేంత భయంకరమైనదని ఇరాన్ నావికాదళ కమాండర్ రియర్ అడ్మిరల్ షహరామ్ ఇరానీ పేర్కొన్నారు.ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రెస్ టీవీ ప్రకారం, ఇరాన్ నావికాదళ కమాండర్ రియర్ అడ్మిరల్ షహ్రామ్ ఇరానీ మాట్లాడుతూ, శత్రు దళాలు దేనికైతే "తీవ్రంగా భయపడుతున్నాయో", అటువంటి ఆయుధంతో త్వరలోనే వారిని ఎదుర్కోబోతున్నామని ఇరానీ తెలిపారు. ఆ ఆయుధం వారి పక్కనే ఉందని, అది చూసి వారికి గుండెపోటు రావచ్చు అని ఆయన ఎద్దేవా చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ చాలా త్వరలోనే భయంకర ఆయుధంతో ఎదుర్కొంటుందన్న హెచ్చరికలు భయాందోళనలు రేపాయి.అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడానికి బదులుగా హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలన్న ఇరాన్ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించిన తర్వాత ఈ హెచ్చరిక వెలువడింది. ఈ ప్రతిపాదన టెహ్రాన్ అణు కార్యక్రమంపై చర్చలను కూడా వాయిదా వేసేది. అయినప్పటికీ, హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా నావికా దిగ్బంధనాన్ని కొనసాగించాలని ట్రంప్ నిర్ణయించారు.ఇరాన్ చమురు వ్యాపారాన్ని అడ్డుకోవడం ద్వారా చర్చలకు తీసుకురావచ్చనే ట్రంప్ వ్యూహం సైనిక అకాడమీల్లో ఒక "జోక్" గా మారిందంటూ ధ్వజమెత్తారు. అమెరికా విమాన వాహక నౌక అబ్రహం లింకన్ పై ఇరాన్ కనీసం ఏడుసార్లు క్షిపణి దాడులు చేసిందని, దీనివల్ల అమెరికా కొంతకాలం పాటు విమాన కార్యకలాపాలను నిర్వహించలేకపోయిందని ఆయన వెల్లడించారు.కాగా ఫిబ్రవరి 28న ఇరాన్ అణుకార్యక్రమంపై విభేదాల కారణంగా ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించాయి. అప్పటి నుండి ఇరాన్ అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై సుమారు 100 సార్లు ప్రతీకార దాడులు చేసినట్లు పేర్కొంది. తమ పౌరుల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొంది.హోర్ముజ్ జలసంధి దిగ్బంధనంప్రపంచ ముడి చమురు రవాణాలో 20% వాటా కలిగిన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది శత్రు దేశాల నౌకలు ఇరాన్ అనుమతితోనే ప్రయాణించాలని నిబంధన విధించింది. అరేబియా సముద్రం నుండి కూడా ఈ మార్గాన్ని ఇరాన్ అదుపులోకి తీసుకుంది. అమెరికా దళాలు తమ నౌకలను అక్రమంగా పట్టుకోవడం "పైరసీ" కంటే ఘోరమని ఇరానీ మండిపడ్డారు.హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తామని, దానికి బదులుగా అమెరికా విధిస్తున్న ఆర్థిక దిగ్బంధనాన్ని (blockade) తొలగించాలని, అలాగే అణు కార్యక్రమ చర్చలను వాయిదా వేయాలని ఇరాన్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన ట్రంప్ బాంబు దాడుల కంటే దిగ్బంధనం చాలా ప్రభావం చూపిస్తోందని, ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాన్ని కలిగి ఉండకూడదని స్పష్టం చేశారు. -
జూలకంటికి పిన్నెల్లి మాస్ వార్నింగ్
-
మీకు గొడవలే కావాలనుకుంటే నేను రెడీ.. జక్కంపూడి మాస్ వార్నింగ్
-
నీ గుండెల్లో దమ్ముంటే ఎదురుగా రా.. చూసుకుందాం...
-
జనసేన జోలికి వస్తే.. ఖబర్దార్.. TDPకి జనసేన ఎమ్మెల్యే మాస్ వార్నింగ్
-
కియోసాకి కొత్త వార్నింగ్.. ఈవీలపై కీలక కామెంట్స్
ప్రసిద్ధ 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత, ఆర్థిక విషయాలపై ఎప్పటికప్పుడు వ్యాఖ్యానించే రాబర్ట్ కియోసాకి.. మరోసారి ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుత ప్రపంచ గందరగోళ పరిస్థితులపై ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.ప్రపంచం పిచ్చెక్కిపోతోంది!ప్రస్తుత గ్లోబల్ మార్కెట్, ఆర్థిక అనిశ్చితిని ఉద్దేశిస్తూ... "ఈ ప్రపంచం పిచ్చెక్కిపోతోంది" (The World is Nuts) అంటూ కియోసాకి వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులు, ద్రవ్యోల్బణం లేదా పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.ఈవీపై ఆసక్తికర వ్యాఖ్యఇదే క్రమంలో తన వద్ద ఉన్న వాహనాల గురించి ప్రస్తావిస్తూ.. "నా దగ్గర ఉన్న కార్లలో ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్ (EV) అయినందుకు సంతోషంగా ఉంది" అని పేర్కొన్నారు. సాంప్రదాయ ఇంధన ధరల పెరుగుదల లేదా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఆయన పరోక్షంగా వెల్లడించారు.రాబర్ట్ కియోసాకి వద్ద ఫెరారీ, రోల్స్-రాయిస్ వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి. అయితే ఈ కార్ల కోసం వ్యక్తిగత ఆదాయాన్ని ఉపయోగించకూడదని, ఆస్తుల నుండి వచ్చే ఆదాయంలో ఖర్చులన్నీ పోయాక మాత్రమే విలాసవంతమైన కార్లను కొనాలని ఆయన సూచిస్తారు.ఎప్పుడూ బంగారం, వెండి, బిట్కాయిన్లలో పెట్టుబడులు పెట్టాలని సూచించే కియోసాకి, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై పాజిటివ్‌గా స్పందించడం విశేషం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉందని గత కొంతకాలంగా ఆయన హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.THE WORLD IS NUTS: Glad one of my cars is an EV.— Robert Kiyosaki (@theRealKiyosaki) April 22, 2026 -
మేం ఏంటో చూపిస్తాం.. గిల్లుతే గిల్లించుకునే రకం కాదు.. జనసేనకు టీడీపీ వర్మ వార్నింగ్
-
గల్ఫ్ దేశాలకు ఇరాన్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఇరాన్‌తో శాంతి చర్చలు కోసం తపిస్తున్నారు. యుద్ధాన్ని ప్రారంభించిన ట్రంప్ ఎలాగైనా దానిని ముగించే దిశగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సీజ్ఫైర్ని మరోసారి పొడిగిస్తూ ప్రకటన చేశారు. ఇరాన్‌తో ఏకీకృత ఒప్పందం వచ్చే వరకూ కాల్పుల విరమణ కొనసాగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరాన్ రివెల్యూషనరీ గార్డ్స్ మరోసారి గల్ఫ్ దేశాలకు వార్నింగ్ ఇచ్చింది. తమ దేశంపై దాడి చేయడానికి అమెరికాకు సహకరిస్తే చమురు ఉత్పత్తి లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.ఇరాన్- అమెరికా యుద్ధం ప్రారంభమై దాదాపు 50 రోజులు గడుస్తోంది. ప్రస్తుతం ఇరు దేశాలు సీజ్ఫైర్ ఒప్పందాన్ని పాటిస్తున్నాయి. అయితే ఈ యుద్ధం గల్ఫ్ దేశాల పాలిట శాపంగా మారింది. అమెరికా ఎయిర్‌బేస్‌లకు సహకరిస్తున్నారని నెపంతో ఇరాన్ గల్ఫ్ దేశాల టార్గెట్‌గా దాడులు జరిపింది. అయితే ప్రస్తుతం సీజ్ఫైర్ నడుస్తున్న నేపథ్యంలో అమెరికా గల్ఫ్ దేశాల్లోని తన స్థావరాలను మరింత బలోపేతం చేస్తుందేమోనని ఇరాన్ అనుమానిస్తోంది. దీంతో ఆ దేశాలకు నేరుగా వార్నింగ్ ఇచ్చింది.ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ ఓ ప్రకటనలో "ఇరాన్ దేశంపై దాడి చేయడానికి శత్రువుల పక్కన చేరి దేశ భూభాగాన్ని, సౌకర్యాలని వారు ఉపయోగించుకునేలా సహకరిస్తే దక్షిణ పొరుగు దేశాలు చమురు ఉత్పత్తికి వీడ్కోలు చెప్పాల్సి ఉంటుందని తెలుసుకోవాలి " అని గార్డ్స్ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ మజీద్ మౌసావి పేర్కొన్నట్లు ఇరాన్ మీడియా కథనాలు ప్రచురితమయ్యాయి.అయితే ఇది వరకూ యుద్ధంలో ఇరాన్ ప్రధానంగా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ స్థావరాలే లక్షంగా దాడి చేసింది. సౌదీ అరేబియా, యూఏఈ (UAE), కువైట్, బహ్రెయిన్, ఖతార్‌లలోని చమురు నిల్వ ఉంచిన డిపోలు, రిఫైనరీలు, మరియు గ్యాస్ ఫెసిలిటీలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకపడింది. ఈ నేపథ్యంలో మరోసారి వార్నింగ్ ఇచ్చింది. -
హర్ముజ్ వద్ద అమెరికా బలగాల వార్నింగ్
ప్రస్తుతం హర్ముజ్ జలసంధిని అమెరికా బ్లాకేడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని దాటడానికి ప్రయత్నిస్తున్న ఓ నౌకకు యుఎస్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది హెచ్చరించారు. ఇది అమెరికా దిగ్భందనమని వెనక్కి వెళ్లకపోతే తీవ్రపరిణామాలుంటాయన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్- అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఓవైపేమో అమెరికా హర్ముజ్‌ను బ్లాకేడ్ చేయగా మరోవైపు ఇరాన్ సైతం జలసంధిని మరోసారి మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జలసంధి గుండా వెళ్లే నౌకలను అడ్డుకుంటుంది. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియోని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా షేర్ చేసింది.యూఎస్ గస్తీ హెలికాప్టర్‌లోని సిబ్బంది ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. " ఇది యునైటెడ్ స్టేట్స్ వార్‌షిప్ 115. మీరు యుఎస్ బ్లాకేడ్ చేసిన ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ బ్లాకేడ్ ఇరాన్ పోర్టులకు అన్నిటికీ వర్తిస్తుంది. ఇది షిప్పైన ఉన్న అన్ని జెండాలకు వర్తిస్తుంది. అని హెచ్చరించారు.. ఈ దిగ్బంధనం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు సుమారు 27 నౌకలను అమెరికా దళాలు వెనక్కి పంపించాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ప్రతి నౌకను తనిఖీ చేసే అధికారం తమకు ఉందని, నిబంధనలు ఉల్లంఘిస్తే బలప్రయోగం చేస్తామని అమెరికా హెచ్చరించింది.అయితే ఇటీవల అమెరికా 'టౌస్కా' అనే ఇరాన్ కంటైనర్ నౌకను స్వాధీనం చేసుకుంది. దీనిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇది సముద్రపు దొంగతనమని అమెరికా దళాలు అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించాయని ఆరోపించింది. తమ వాణిజ్య నౌకపై జరిగిన ఈ దాడికి త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సైన్యం హెచ్చరించింది.కాగా ఇరు దేశాల మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా మరో దఫా శాంతిచర్చలకు రావాలని పట్టుబట్టడం ఇరాన్ దానిని తిరస్కరించడంతో మరోసారి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.Since the commencement of the blockade against ships entering or exiting Iranian ports and coastal areas, U.S. forces have directed 27 vessels to turn around or return to an Iranian port. pic.twitter.com/G8dl96wN4H— U.S. Central Command (@CENTCOM) April 20, 2026 -
టీఎంసీ గుండాలు పది రోజుల్లో లొంగిపోవాలి.. లేదా: మోదీ వార్నింగ్
కోల్‌కతా: బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ప్రధాని మోదీ విరుచుకపడ్డారు. బెంగాల్లో అశాంతి సృష్టిస్తున్న టీఎంసీ గుండాలను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం బెంగాల్‌లోని బిష్ణుపూర్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మే నాలుగు తర్వాత అవినీతిపరులు, గుండాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. కనుక టీఎంసీ గుండాలు పదిరోజుల్లోపు తమంతట తామే పోలీసుల ఎదుట లొంగిపోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. బిష్ణుపూర్ మాఫియా, టీఎంసీ సిండికేట్ ఆటలు ఇకసాగవన్నారు. గత 15 ఏళ్లుగా పశ్చిమబెంగాల్లో టీఎంసీ ఏవిధమైన అభివృద్ధి చేసిందో ప్రజలకు తెలియజేయాలన్నారు. టీఎంసీ విధానాలతో బెంగాల్ గుర్తింపు ప్రమాదకరంగా మారిందన్నారు. బెంగాల్ బ్రాండ్‌ను బీజేపీ కాపాడుతుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.అయితే అంతకుముందు లోక్‌సభలో లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడంపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు చాలా పెద్ద తప్పు చేశాయని పేర్కొన్నారు. దీనికి తగిన పర్యవసానాలను విపక్షాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని దేశ మహిళలకు ప్రతిపక్షాలు సమాధానం చెప్పుకోవాలన్నారు. ప్రతిపక్ష పార్టీలు దేశ మహిళలను మోసం చేశాయని ఈ సందేశాన్ని దేశంలోని ప్రతి ఒక్కరికీ, ప్రతి గ్రామానికి చేరవేయాలని బీజేపీ కార్యకర్తలకు ప్రధాని మోదీ సూచించినట్లు తెలుస్తోంది -
తెలంగాణలో రెడ్ బుక్ అంటే తాట తీస్తాం.. అబ్బా కొడుకులకు జర్నలిస్టులు వార్నింగ్
-
అమెరికాకు.. మోజ్తాబా వార్నింగ్
హర్ముజ్ జలసంధి విషయంలో అమెరికా- ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. శత్రువులను ఓడించడానికి తమ దేశ నౌకలు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు.ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్రంప్ వ్యాఖ్యలతో ఆగ్రహించిన ఇరాన్ హర్ముజ్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సుప్రీం లీడర్ మెజ్తాబా ఖమేనీ పేరిట ఈ రోజు (శనివారం) ఒక ప్రకటన విడుదలైంది.మోజ్తాబా ఖమేనీ ప్రకటనలో " అమెరికా దళాలను ఓడించేందుకు ఇరాన్ నౌకాదళం సిద్ధంగా ఉంది. శత్రువులకు కొత్త రకమైన ఓటమిని రుచి చూపిస్తాం". అని హెచ్చరించారు. కాగా యుద్దం ప్రారంభమైన నాటి నుంచి మోజ్తాబా బహిరంగంగా కనిపించలేదు. కేవలం ఆయన పేరు మీద ప్రకటనలు మాత్రమే విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన తీవ్ర స్థాయిలో గాయపడ్డారని, ఆయన ముఖం వికారంగా మారిందని ప్రచారం జరిగింది.ఇరాన్- అమెరికా మధ్య సయోధ్య కుదురుతుందనే నేపథ్యంలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. హర్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్.. ఒక రోజు గడవకముందే దానిని మూసివేసింది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో సోమవారం జరగనున్న చర్చలలో ఏం జరగనుందా అనే టెన్షన్ నెలకొంది. -
నా ప్రాణం పోయినా ఏ ఒక్కడిని వదలను.. అంబటి రాంబాబు ఉగ్రరూపం
-
తేల్చుకుందాం.. ఆ నొప్పి ఎలా ఉంటదో చూపిస్తాం.. చెవిరెడ్డి మాస్ వార్నింగ్
-
2029లో వచ్చేది నేనే.. నీ తాత కూడా ఆపలేడు..
-
వైఎస్ జగన్, మత్స్యకారుడు బాబును ఓ రేంజ్ లో ఏకిపారేశారు
-
యూఏఈ సంచలన కామెంట్స్
యూఏఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. హర్ముజ్ జలసంధి మీద అధికారం కేవలం ఒక్క ఇరాన్‌కే లేదని తెలిపింది. అది ఏమి టెహ్రాన్ ఆస్తి కాదని తెలిపింది. హర్ముజ్ జలసంధిని విముక్తి చేయడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు యుఏఈ మద్దతిస్తుందని ప్రకటించింది.ప్రస్తుతం పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా హర్మూజ్‌ను బ్లాకేడ్ చేయడంతో చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. దీంతో గల్ఫ్ దేశాలు అమెరికాను రిక్వెస్ట్ చేస్తున్నాయి. హర్ముజ్ దిగ్భందనం తొలగించాలని సౌదీఅరేబియా అమెరికాను కోరింది.ఈ నేపథ్యంలో యూఏఈ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. హర్ముజ్ జలసంధి కేవలం ఇరాన్ సొత్తు కాదని తెలిపింది. హర్మూజ్‌ను విముక్తి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలకు గల్ఫ్ దేశాలు అండగా నిలుస్తాయని పేర్కొంది. ఈ అంశమై బహ్రెయిన్ రాజుతో యూఏఈ అధ్యక్షుడు సమావేశమైనట్లు తెలుస్తోంది.దేశ సమస్యలను చర్చలతో పరిష్కరించుకోవాలి గానీ ఇటువంటి దిగ్భందనాలు చేయడటం మంచిది కాదని యూఏఈ పేర్కొంది. ఈ విషయమై ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో యూఏఈ సంప్రదింపులు జరిపినట్లు పేర్కొంది. అయితే అమెరికా విపరీత డిమాండ్ల వల్లనే చర్చలు విఫలమయ్యాయని ఆయన యూఏఈతో తెలిపినట్లు సమాచారం.ప్రస్తుతం అమెరికా సైతం హర్ముజ్‌ను బ్లాకేడ్ చేయడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. ఇరాన్ పోర్టుల నుండి నౌకలు ఎటు కదలడం లేదు. దీంతో రోజుకు సరాసరిన రూ. 4 వేల కోట్ల రుపాయల నష్టం జరుగుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
సముద్ర దిగ్భందనం.. అమెరికా ఏడ్చే రోజు దగ్గరలోనే.. ఇరాన్ వార్నింగ్
-
చర్చలకు పిలిచి బెదిరింపులు.. హర్మూజ్ తెరవకపోతే ఇరాన్ బూడిదే..
-
నీ ఇంటికొచ్చి మరీ కొడతా.. టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడికి టీడీపీ నేత వార్నింగ్
-
ఇరాన్ యుద్ధం: ‘ఐఎంఎఫ్’ తీవ్ర హెచ్చరిక
వాషింగ్టన్: ప్రపంచాన్ని ప్రస్తుతం భారీ ఆర్థిక భూకంపం కుదిపేస్తోంది. ఇరాన్లో జరుగుతున్న యుద్ధం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాలేదు.. దాని సెగ ఇప్పుడు సామాన్యుని జేబుకు కూడా గట్టిగానే తగులుతోంది. ముడి చమురు, సహజ వాయువు సరఫరా నిలిచిపోతున్న నేపధ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని, ప్రతి వస్తువుపై ధరల మంట తప్పదని స్పష్టం చేసింది.ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా ‘సీబీఎస్ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబోయే పరిస్థితుల తీవ్రతను తెలియజేశారు. గత ఐదు వారాలుగా ప్రపంచవ్యాప్తంగా సరఫరా కావాల్సిన 13 శాతం చమురు, 20 శాతం గ్యాస్ ఎక్కడికక్కడే నిలిచిపోయాయని ఆమె తెలిపారు. ఇది ఒక చిన్న కుదుపు కాదని, ఒక పెద్ద షాక్ అని ఆమె అభివర్ణించారు. దీని ప్రభావం వల్ల ఇంధన దిగుమతులపై ఆధారపడిన దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు అత్యంత దారుణంగా నష్టపోతున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ ధరల పెరుగుదల భారాన్ని తమ ఆదాయంపై పడుతున్న అదనపు పన్నులా మోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సంక్షోభం కేవలం ఇంధనానికే పరిమితం కాలేదు. రవాణా, ఎరువుల సరఫరా, వ్యవసాయ రంగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎరువుల ధరలు పెరగడం వల్ల భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్థాల ధరలు కూడా భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ఆసియాలోని అనేక దేశాలు ఇప్పటికే ఇంధన కొరతతో సతమతమవుతున్నాయి. ఒకవేళ ఇరాన్లో వెంటనే కాల్పుల విరమణ జరిగినా, తక్షణ ఉపశమనం మాత్రం ఉండదని ఐఎంఎఫ్ తేల్చిచెప్పింది. ధ్వంసమైన గ్యాస్, ఇంధన మౌలిక సదుపాయాలు పూర్తిగా కోలుకునేందుకు మరో మూడు నుంచి ఐదు సంవత్సరాల సమయం పడుతుందని అంచనా వేసింది. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు కూడా పడిపోయే అవకాశం ఉందని, ఈ కష్టకాలంలో ప్రభుత్వాలు పేదలకు అండగా నిలవాలని ఐఎంఎఫ్ సూచించింది.ఇది కూడా చదవండి: ‘లక్ష్మీ’ వర్సెస్ ‘దుర్గ’: ఎవరిది అసలైన స్కెచ్? -
హర్ముజ్‌లో అడుగుపెడితే అంతే.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
హర్ముజ్ జలసంధిని దిగ్భందించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలపై తాజాగా ఇరాన్ స్పందించినట్లు తెలుస్తోంది. వాషింగ్టన్కు చెందిన ఏ నౌకలైనా హర్ముజ్‌లోకి వస్తే అది సీజ్ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లేనని టెహ్రాన్ పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి.ఇస్లామాబాద్‌లో అమెరికా- ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. చర్చలు విఫలంతో చిర్రెత్తిపోయిన ట్రంప్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ మేరకు తక్షణమే హర్మూజ్‌ను దిగ్భందించాలని ఆ దేశ నావికాదళానికి ఆదేశాలిచ్చారు. ఇరాన్ అమర్చిన సముద్ర మందు పాతరలను ధ్వంసం చేస్తామన్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ స్పందించినట్లు తెలుస్తోంది. అమెరికాకు సంబంధించిన ఏ మిలిటరీ నౌకలైనా హర్మూజ్ జలసంధి గుండా వెళ్తే అది కాల్పులు విరమణ ఒప్పందాల్ని ఉల్లంఘించినట్లే ఒకవేళ అలా జరిగితే ఇరాన్ కఠిన చర్యలు తీసుకుంటుంది అని పేర్కొంది. మరోవైపు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సైతం దీనిపై స్పందించారు. హర్మూజ్ దిగ్భందనంతో అమెరికా గ్యాసోలిన్ ధరలు పెరుగుతాయని ఆందోళన చెందుతుంది అని అన్నారు. "అమెరికా ప్రస్తుతం ఉన్న $4-$5 గ్యాసోలిన్ ధరలను అస్వాధించండి. మీరు త్వరలోనే ఈ ధరను కోల్పోతారు". అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు గత 47 ఏళ్ల చరిత్రలో అత్యంత ప్రాధాన్యత కలిగినవన్నారు. ఈ చర్చలకు ఇరాన్ మంచి దృక్పథంతో పాల్గొందని ఫలితాలు దాదాపు తుదిదశకు చేరుకునే నేపథ్యంలో ట్రంప్ హెచ్చరికలు విచారకరమన్నారు. మంచి ఎప్పుడు మంచినే కలిగిస్తుందని అదే శత్రుత్వం ఎప్పుడూ శత్రుత్వాన్ని రగిలిస్తోందని అరాగ్చీ అన్నారు.కాగా ఇటీవల ఇస్లామాబాద్‌లో ఇరాన్- అమెరికా మధ్య జరిగిన చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకూడదని అమెరికా కండీషన్లకు ఇరాన్ ఒప్పుకోలేదు. దీంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. -
నీ నాలుక కోసి కారం పెడతాం.. ABN రాధాకృష్ణ పై బిజేంద్ర రెడ్డి ఫైర్
-
కాల్పుల విరమణ.. కండిషన్స్ అప్లై! ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
-
నిన్ను తిప్పిన స్టేషన్ కు తిప్పకుండా.. జగన్ మాస్ వార్నింగ్
-
మాకు టైం వస్తది.. అప్పుడు నీ నాశనమే ABN రాధాకృష్ణకు రాచమల్లు భార్య స్ట్రాంగ్ వార్నింగ్
-
ఇక్కడితో అయిపోయిందిలే అనుకుంటున్నావేమో.. ABN రాధాకృష్ణకు స్ట్రాంగ్ వార్నింగ్
-
వావి వరుస లేని ఒక కుక్క రాథాకృష్ణ.. నాగార్జున యాదవ్ సంచలన వార్నింగ్
-
ABN రాధాకృష్ణ రాతలపై YS జగన్ ఆగ్రహం
-
నీతిలేని కుక్క.. ఇంకోసారి అలాంటి రాతలు రాస్తే చెప్పుతో కొడతాం..
-
ఇరాన్‌ను తుడిచిపెట్టేస్తాం, వారి నాగరికతను నాశనం చేస్తాం. తీవ్రంగా హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్
-
‘యుద్ధం కొత్త దశలోకి .. రెండింతలు దాడులు’
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధం హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేత తరువాత మరింత ఉద్రిక్తంగా మారింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత ముదురుతున్నాయి. ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను రెట్టింపు చేస్తూ 'కొత్త దశ యుద్ధం' ప్రారంభమైందని ప్రకటించడం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది.'రెట్టింపు దాడులు' - ఇరాన్ హెచ్చరికమరోవైపు ఇప్పటికే ద్వంద్వ ప్రయోగ క్షిపణి (Dual-launch) వ్యూహాన్ని ఇరాన్ వివరించింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఏరోస్పేస్ దళాల కమాండర్ బ్రిగేడియర్ జనరల్ సయ్యద్ మజీద్ మౌసావి ఒక వీడియోను పోస్ట్ చేశారు. ‘యుద్ధం కొత్త దశ ప్రారంభమైంది’ అని పేర్కొన్నారు. ఇరాన్, ఖైబర్ షెకాన్ మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణితో పాటు ఫతా( (Fattah)-110, ఫతే-313 ,ఫతా వంటి కొత్త హైపర్సోనిక్ వేరియంట్లతో సహా ఫతా శ్రేణికి చెందిన వ్యవస్థలను ఉపయోగించి, గత దాడులన్నీ రెండింతలు ఎక్కువవుతాయని హెచ్చరించారు. ఖార్గ్ ద్వీపంపై జరిగిన దాడుల నేపథ్యంలో చమురు, గ్యాస్ సరఫరాలకు దీర్ఘకాలిక అంతరాయం కలుగుతుందని గల్ఫ్ దేశాలను ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో, ద్వంద్వ ప్రయోగ క్షిపణి వ్యూహాన్ని ఐఆర్జీసీ కమాండర్ వివరించారు. ఇరాన్ మౌలిక సదుపాయాలపై జరిగిన దాడుల నేపథ్యంలో ఇరాన్ తన క్షిపణి కార్యకలాపాలను పెంచుతోంది అంటూ ఒక ఐఆర్జీసీ కమాండర్ నుండి వచ్చిన మొదటి అధికారిక ప్రకటన ఇది కావడం గమనార్హం. 🇮🇷 Commander of Iran’s IRGC Aerospace Force, Brig. Gen. Seyed Majid Mousavi, posted a video stating:“New phase of the war begins. With newly deployed dual-launch Fateh and Kheibar Shekan missile systems, all previous strikes are multiplied by two.” pic.twitter.com/RpTTkDZqd4— Malcolm X (@malcolmx653459) April 7, 2026దీంతో పాటు, మంచి పొరుగు సంబంధాలు, ఆత్మసంయమనం ముగిశాయి అంటూ పర్షియన్ గల్ఫ్‌లోని దేశాలకు ఐఆర్జిసి మరో హెచ్చరిక జారీ చేసింది. ఫతే శ్రేణిలో సాధారణంగా 200 కిలోమీటర్ల నుండి 500 కిలోమీటర్లకు పైగా పరిధి గల స్వల్ప నుండి మధ్యశ్రేణి క్షిపణులు ఉంటాయి. ఫతా వంటి హైపర్సోనిక్ రకాలు మాక్ 15 వరకు వేగాన్ని అందుకోగలవని ఇరాన్ పేర్కొంది.హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని, లేకపోతే వంతెనలు, ఇంధన కేంద్రాలతో సహా మౌలిక సదుపాయాలపై దాడులు ఎదుర్కోవలసి వస్తుందంటూ డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువుకు కొన్ని గంటల ముందు ఈ దాడులకు ప్లాన్ జరిగినట్లు సమాచారం. ఇటీవలి రోజుల్లో, అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని, జలసంధిని తిరిగి తెరవడానికి అవసరమైన షరతులు ఇంకా పరిష్కారం కాలేదని ఇరాన్ అధికారులు, ప్రభుత్వ మీడియా పేర్కొన్నాయి. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా విధించిన గడువు (మంగళవారం రాత్రి 8 గంటలే) ముగియకముందే సంచలన హెచ్చరికలు చేశారు. ఇరాన్లో ఇప్పుడు పాలన మారి అద్భుతం జరుతుందని అనుకుంటున్నా. ఈ రాత్రి చరిత్రలో అత్యంత కీలకం. 47 ఏళ్ల దోపిడీ, అవినీతి అంతమవుతుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు (హోర్ముజ్ జలసంధిని తెరవాలని) ముగియడానికి కొన్ని గంటల ముందే ఈ దాడులు జరగడం గమనార్హం. ప్రస్తుతం అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలు, ఇరాన్ వద్ద ఉన్న ఫతా వంటి హైపర్ సోనిక్ క్షిపణులు మ్యాక్ 15 (Mach 15) వేగంతో ప్రయాణించగలవని, వీటిని అడ్డుకోవడం ప్రస్తుత రక్షణ వ్యవస్థలకు సవాలుగా మారుతుందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పరిస్థితి మరింత విషమించేలా కనిపిస్తోంది. మొత్తానికి, ట్రంప్ వ్యూహం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడమా లేక సైనిక చర్యకు పునాది వేయడమా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మంగళవారం రాత్రి 8 గంటల గడువు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.ఇదీ చదవండి: దుబాయ్‌లో ఖరీదైన బంగ్లాలు, కార్లు : షాకింగ్ బిలియనీర్ స్టోరీ -
ఇరాన్ కు ఇదే చివరి రోజు..! హర్మూజ్ ను తెరవకపోతే.. తగలబెట్టేస్తా
-
జాగ్రత్త సుధీర్ రెడ్డి.. శ్రీకాళహస్తి టిడీపీ ఎమ్మెల్యేకు జనసేన వినుత కోట వార్నింగ్
-
డెడ్ లైన్.. ఇరాన్ నామరూపాలు లేకుండా చేస్తాం..
-
ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు
-
టెహ్రాన్‌పై అణుదాడి ప్లాన్? UNO మాజీ అధికారి సంచలన ఆరోపణ
ఐక్యరాజ్యసమితికి చెందిన సీనియర్ దౌత్యవేత్త, మొహమ్మద్ సఫా తన పదవికి రాజీనామా చేస్తూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇరాన్‌పై అణు ఆయుధాలను ప్రయోగించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. హర్మూజ్ జలసంధి తెరవకుంటే దాడులు తీవ్రతరం చేస్తామని ట్రంప్ హెచ్చరించడం ఇరాన్ సైతం దానికి ధీటుగా ప్రతిస్పందించడంతో పరిస్థితులు చేజారిపోయాలే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యుఎన్‌కు చెందిన సీనియర్ దౌత్యవేత్త మహమ్మద్ సఫా సంచలన వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్‌పై అణుదాడి చేసే ప్రయత్నాలు అంతర్జాతీయ సమాజం చేస్తోందన్నారు.ఈ మేరకు మహమ్మద్ సఫా తన రాజీనామా లేఖను X (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు."ఇక్కడ మీరు చూస్తున్నది టెహ్రాన్ నగర చిత్రం. యుద్ధం కావాలని కోరుకునే వారు, ఎప్పుడూ యుద్ధ భూమిని చూడని వారు దీనిని ఏదో జనాభా లేని ఎడారి అని అనుకుంటున్నారు. కానీ, ఇది దాదాపు ఒక కోటి జనాభా కలిగిన నగరం. ఇలాంటి నగరంపై బాంబులు వేయాలని అనుకోవడం వికృతమైన ఆలోచన. వాషింగ్టన్ లేదా లండన్ వంటి నగరాలపై అణు దాడి జరిగితే ఎంతటి వినాశనం ఉంటుందో, ఇక్కడ కూడా అదే జరుగుతుంది" అని హెచ్చరించారు.మానవత్వానికి వ్యతిరేకంగా జరగబోయే ఈ "నేరానికి" సాక్షిగా ఉండలేక, తన దౌత్య జీవితాన్ని త్యాగం చేసి ఈ విషయాన్ని బయటపెడుతున్నట్లు సఫా పేర్కొన్నారు. టెహ్రాన్ కేవలం ఎడారి కాదని, అక్కడ కోటి మందికి పైగా సామాన్య ప్రజలు, పిల్లలు నివసిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితిలోని కొందరు ఉన్నతాధికారులు ఒక శక్తివంతమైన లాబీకి తొత్తులుగా మారారని సఫా ఆరోపించారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నా, UN అధికారులు వారిని ప్రశ్నించడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అణు యుద్ధ ముప్పు పొంచి ఉందని, ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలపడం ద్వారా మాత్రమే ఈ వినాశనాన్ని ఆపగలరని ఆయన పిలుపునిచ్చారు.I don't think people understand the gravity of the situation as the UN is preparing for possible nuclear weapon use in Iran.This is a picture of Tehran. For you uneducated, untraveled, never-served, warhawks licking your chops at the thought of bombing it. It's not some low… pic.twitter.com/BnzB4F3001— Mohamad Safa (@mhdksafa) March 29, 2026 -
నీ వికృత చేష్టలన్ని బద్దలైపోద్ది.. నాకు ఎల్లో మీడియా ఉందని రెచ్చిపోతే..
-
నోరు అదుపులో పెట్టుకో.. నువ్వు ఒక నీచ నికృష్టుడివి
-
నా చావుకు పవన్ కల్యాణే బాద్యులు..!? అరవ శ్రీధర్ బాధితురాలు సంచలన వీడియో రిలీజ్..
-
హోర్మూజ్ తరువాత : ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతిదాడుల మధ్య పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో, ఇరాన్ తాజాగా మరో సంచలన హెచ్చరిక జారీ చేసింది. తన ద్వీపాలపై దాడులు జరిగిగే మరో జలసంధిని కూడా తన ఆధీనంలోకి తీసుకుంటామని తాజాగా ప్రకటించింది. ఇరాన్ గనుక కాల్పుల విరమణ షరతులకు అంగీకరించకపోతే, సైనిక చర్యను మరింత తీవ్రం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ తాజా హెచ్చరిక జారీ చేసింది. శత్రువు పీచమణచాలంటే.. బాబ్ అల్-మందబ్ జలసంధిపై పట్టుఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల కారణంగా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణల నేపథ్యంలో, ఇరాన్ దక్షిణ ద్వీపాలపై భూతల దాడులు జరిగితే, యెమెన్‌కు చెందిన సాయుధ రాజకీయ, మత సమూహమైన అన్సరుల్లా (హౌతీలు) బాబ్ అల్-మండబ్ (Bab al-Mandab)జలసంధిని తమ నియంత్రణలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని టెహ్రాన్ హెచ్చరించింది.దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ మాట్లాడుతూ.. అమెరికా-ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా తమ ప్రతిఘటనా (Resistance) విధానం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నమ్మకమైన హామీలు లేకుండా చర్చలకు లేదా కాల్పుల విరమణకు తావులేదని ఆయన తేల్చి చెప్పారు. అలాగే ఇరాన్ భూభాగంలోకి చొరబడి దాడులు చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ (IRGC) హెచ్చరించింది. ఫిబ్రవరి 28న జరిగిన ఇరాన్‌పై దాడితో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అన్సరుల్లా బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయని, శత్రువును దారికి తీసుకురావడానికి ఈ కీలక సముద్ర మార్గాన్ని మూసివేయడానికి వారు సిద్ధంగా ఉన్నారని ఇరాన్ మీడియా సంస్థ 'తస్నిమ్' పేర్కొంది.శత్రువుకు మరింత గుణపాఠం నేర్పడానికి ఈ జలసంధిని నియంత్రించడం అవసరమని భావిస్తోంది. ఈ జలమార్గంలో "విశ్వసనీయమైన ముప్పు"ను సృష్టించే సామర్థ్యం ఇరాన్‌కు ఉండటమే కాకుండా, అన్సరుల్లా "వీరోచిత శక్తులు" కూడా "నైపుణ్యంతో కూడిన పాత్ర పోషించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి" అని తస్నిమ్ తెలిపింది.ఇదీ చదవండి: కోట్లాది మందికి గుడ్ న్యూస్ : భారీగా చమురు కొనుగోలుకాగా ఇప్పటికే ఇజ్రాయెల్‌కు వెళ్లే లేదా అక్కడి నుండి వచ్చే నౌకలపై హుతీలు దాడులు చేస్తూ ఆర్థికంగా ఇజ్రాయెల్‌ను దెబ్బతీస్తున్నారు. దీనివల్ల నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది. నౌకలపైనే కాకుండా, అమెరికా యుద్ధ నౌకల పైన మరియు ఇజ్రాయెల్‌లోని కొన్ని ప్రాంతాల పైన హుతీలు వైమానిక దాడులు చేస్తున్నారు.రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ మధ్య ఉన్న బాబ్ అల్-మండబ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన మార్గం.ఇదీ చదవండి: రూ. 5 కోట్ల దోపిడీ : దొంగబాబా 21 ఫారిన్ ట్రిప్స్, బెంజ్‌కారు! -
గ్యాస్ చార్జీలు వసూలు చేస్తే.. ప్రభుత్వం వార్నింగ్
న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారులపై ఎల్పీజీ ఛార్జీలు, గ్యాస్ సర్‌చార్జ్, ఫ్యూయల్ కాస్ట్ రికవరీ పేరుతో ఎలాంటి అదనపు చార్జీలు విధించవద్దని కేంద్ర వినియోగదారుల పరిరక్షణ విభాగం (సీసీపీఏ) ఆదేశించింది. ఈ తరహా అనుచిత వాణిజ్య విధానాలను అనుసరిస్తే వినియోగదారుల పరిరక్షణ చట్టం, 2019 కింద కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. హోటళ్లు, రెస్టారెంట్ల మెనూల్లో పేర్కొన్న చార్జీలకు అదనంగా పన్నుల వరకే విధించగలరని స్పష్టం చేసింది.అన్ని రకాల తయారీ వ్యయాలు (ముడి సరుకులు, ఎల్పీజీ, విద్యుత్ సహా) మెనూ చార్జీల్లో భాగంగానే ఉండాలని, విడిగా ఎలాంటి చార్జీలు వసూలు చేయరాదని పేర్కొంది. తాము ఈ పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఉల్లంఘనలను గుర్తిస్తే వినియోగారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. దేవవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ పేరుతో అదనపు చార్జీలు తీసుకుంటున్నట్టు తన దృష్టికి రావడంతో సీసీపీఏ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ తరహా చార్జీలు చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. చార్జీల బాదుడుపై ఫిర్యాదు అదనపు చార్జీలు వసూలుపై వినియోగదారులు ముందుగా హోటల్‌ను సంప్రదించి వాటిని తొలగించాలని కోరొచ్చని సీసీపీఏ సూచించింది. ఫలితం లేకపోతే 1915కు కాల్ చేసి లేదా ఎన్సీహెచ్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది. అలాగే ఈ–జాగృతి పోర్టల్ ద్వారా వినియోగదారుల కమిషన్ ముందు ఫిర్యాదు దాఖలు చేయొచ్చని లేదా జిల్లా కలెక్టర్, సీసీపీఏకి నేరుగా ఫిర్యాదు చేయవచ్చని సూచించింది. -
కంటికి తల తీస్తాం.. ట్రంప్‌నకు ఇరాన్ వార్నింగ్
పశ్చిమాసియా యుద్ధంలో చర్చల అంశం నడుస్తున్న వేళ ఇరాన్ ట్రంప్‌నకు భారీ వార్నింగ్ ఇచ్చింది. అమెరికాను రక్షించుకోవడానికి ఉన్న చివరి గడువు ముగిసిపోతుందని నూతన సైనిక సలహాదారు మెుహ్సెన్ రెజాయీ అన్నారు. కంటికి బదులు తల తీసుకోవాల్సి వస్తుందని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య చర్చలు జరగనున్నాయని దానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సైనిక సలహాదారు మెుహ్సెన్ రెజాయి మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. గడువు సమీపిస్తోంది: అమెరికాను రక్షించుకోవడానికి ఉన్న చివరి గడువు ముగిసిపోతోందని, ఈ ఊబి నుండి బయటపడటానికి ట్రంప్‌కు ఎక్కువ సమయం లేదని రెజాయీ పేర్కొన్నారు.అక్కడి ప్రభుత్వ ఏజెన్సీకి చెందిన సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ "మీరు మా దేశ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే, మా స్పందన 'కంటికి కన్ను' అన్నట్టుగా ఉండదు. కంటికి తలతీసే విధంగా ఉంటుంది అమెరికా యుద్ధనౌకలను అరేబియా గల్ఫ్‌లో ముంచివేస్తాం, అమెరికా మెుత్తాన్ని స్తంభింపజేస్తాం " అని హెచ్చరించారు.అమెరికాని ఇజ్రాయెల్ కుట్రపన్ని పావులా వాడుకుందని 'గ్రేటర్ ఇజ్రాయెల్' కల కోసం ట్రంప్‌ను ఈ అక్రమ యుద్ధంలోకి నెట్టిందన్నారు, ప్రస్తుతం ట్రంప్ తన సైనిక కమాండర్లు మరియు ఇజ్రాయెల్ మధ్య అయోమయంలో ఉన్నారని విమర్శించారు. అదేవిధంగా ఇప్పుడున్న యుద్ధం ముగియాలంటే ఇరాన్‌పై ఉన్న అన్ని ఆంక్షలను ఎత్తివేయాలని, యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని, భవిష్యత్తులో ఇరాన్‌పై ఇలాంటి దాడులు జరగవని అంతర్జాతీయ చట్టపరమైన గ్యారెంటీ ఇవ్వాలని ఆయన తేల్చిచెప్పారు. -
ట్రంప్ చర్చల బూటకం అందుకే? ఇరాన్ స్పీకర్ సంచలన ప్రకటన
ఇరాన్‌పై దాడులకు ట్రంప్ తాత్కాలిక బ్రేక్ ప్రకటనపై ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలు పచ్చి బూటకమన్నారు. చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అమెరికా అధ్యక్షుడు ఇలాంటి నకిలీ వార్తలు సృష్టిస్తున్నారన్నారు.నిన్న( సోమవారం) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ ప్రకటించారు. తన ట్రూత్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ‘ఈ విషయాన్ని హ్యాపీగా తెలియజేస్తున్నాను. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇరాన్ గత 2 రోజులుగా పశ్చిమాసియాలో ఘర్షణలకు పూర్తి పరిష్కారం దిశగా ఫలప్రదమైన చర్చలు జరిపాయి. ఈ నిర్మాణాత్మక చర్చల ఆధారంగా. నేను మా యుద్ధ సైనికులను ఓ విషయం చెప్పాను. ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఎనర్జీ మౌలిక సదుపాయాలపై జరిగే అన్ని సైనిక దాడులను 5 రోజులపాటు వాయిదా వేయాలని ఆదేశించాను’ అని అన్నారు.అయితే ఈ వ్యాఖ్యలను ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ తీవ్రంగా ఖండించారు. ఆయన అధికారిక ఎక్స్‌ఖాతాలో పోస్ట్ చేస్తూ " అమెరికా అధ్యక్షుడు ఇరాన్‌తో చర్చలు జరిపాడనేది పూర్తిగా అవాస్తవం దీని వెనుక రెండు కారణాలున్నాయి. ప్రస్తుతం చమురు సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ధరలు తగ్గించడం. యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న పరిస్థితులనుంచి ప్రజల దృష్టి మళ్లించడం"అని తెలిపారు.తమ దేశంపై జరిగిన దాడులకు పాల్పడిన వారికి కఠినమైన శిక్ష పడాలని ఇరాన్ ప్రజలు కోరుకుంటున్నారని గాలిబాఫ్ తెలిపారు. ఇరాన్ అంతా ఏకంగా ఉందని తామనుకున్న లక్ష్యం నెరవేరే వరకూ ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేశారు.


