వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై రెచ్చిపోయారు. ఈ వారాంతంలో ఇరాన్‌పై కనీవినీ ఎరుగని రీతిలో దాడులు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో టెహ్రాన్‌ని లొంగిపోయేలా చేసేలా అత్యంత కఠినమైన దాడులు చేయాలని సైన్యాన్ని హెచ్చరించినట్లు సమాచారం.
పశ్చిమాసియా యుద్ధంలో ట్విస్టుల మీద ట్విస్టులు నడుస్తున్నాయి. యుద్ధం ముగుస్తుందనుకునేలోపే మళ్లీ తీవ్రస్థాయికి చేరింది.ఇది చాలదన్నట్లు ఇటీవలే అమెరికాకు మద్ధతుగా సౌదీ అరేబియా సైతం రంగప్రవేశం చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఇరాన్‌కు ఝలకిచ్చారు.
వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.." టెహ్రాన్‌ను లొంగిపోయేలా ఇరాన్‌పై కఠినమైన దాడులు చేయండి. వారు అబద్ధాలు చెబుతారు. తప్పుగా అన్వయిస్తారు. ఇరాన్‌పై విశ్వాసం కోల్పోతున్నాము మనము వారిని చాలా తీవ్రంగా దెబ్బతీద్దాం. దీంతో ఏదో ఒక సమయంలో, ఇకపై దీనిని భరించలేమని వారు చెబుతారు," అని ట్రంప్ అన్నట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ యుద్ధంలో అమెరికా ఎట్టిపరిస్థితుల్లో గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపాయి.
అత్యంత కఠినమైన బాంబు దాడిగా?
కాగా అక్కడి కథనాల ప్రకారం, ఇరాన్ యొక్క ఇంధన మౌలిక సదుపాయాల లక్ష్యాలు, రిఫైనరీలే టార్గెట్‌గా ఈ దాడులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన బాంబుదాడులలో అత్యంత తీవ్రమైనదిగా నిలిచేలా ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. ఈ భారీ దాడులను అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపేలా ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం.


