అదే జరిగితే చైనా-అమెరికా మధ్య యుద్ధం | US-China could come into conflict, Jinping warning to Trump | Sakshi
Sakshi News home page

అదే జరిగితే చైనా-అమెరికా మధ్య యుద్ధం

May 14 2026 1:39 PM | Updated on Jun 18 2026 1:16 PM

US-China could come into conflict, Jinping warning to Trump

బీజింగ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, చైనా ప్రెసిడెంట్‌ జిన్‌పింగ్‌ మధ్య వాడీవేడి చర్చ జరిగింది. తైవాన్‌ విషయంలో గనుక అమెరికా తలదూర్చితే రెండు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయని జన్‌పింగ్ ట్రంప్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు బీజింగ్ మీడియా కథనాలు పేర్కొన్నాయి

ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చైనా పర్యటనలో ఉన్నారు. రెండురోజుల పర్యటన నిమిత్తం ఆయన చైనా బయిలుదేరారు. ఈ రోజు ఇరువురు అగ్రనేతల మధ్య భేటీ జరిగింది. అయితే తైవాన్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి జిన్‌పింగ్ నేరుగా కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

జిన్‌పింగ్, ట్రంప్‌తో మాట్లాడుతూ.. స్వయంప్రతిపత్తి కలిగిన తైవాన్ అంశాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే, ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య "ఘర్షణ" తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించినట్లు ఆ దేశ మీడియా కథనాలు వెల్లడించాయి.  చైనా-అమెరికా సంబంధాల కంటే తైవాన్ అంశం  చైనాకు అత్యంత కీలకమైనదని జిన్‌పింగ్‌ ట్రంప్‌తో పేర్కొన్నట్లు తెలుస్తోంది. చైనా,అమెరికా పోటీదారులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని పరస్పర సహకారం రెండు దేశాలకు ఎంతో లాభదాయకమని ఆయన పేర్కొన్నారని ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

కాగా తైవాన్‌ విషయంలో అమెరికా వ్యూహాత్మకంగా స్పందిస్తోంది. తైవాన్ తనను తాను రక్షించుకోవడానికి అవసరమైన రక్షణ ఆయుధాలను అమెరికా సరఫరా చేస్తుంది. కాగా దీనిని చైనా తొలి నుంచి వ్యతిరేకిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌తో తొలిరోజు భేటీలోనే జిన్‌పింగ్ చైనా విధానాన్ని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ట్రంప్‌ చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement