ఆ షేర్ల ట్రేడింగ్‌లో జాగ్రత్త: సెబీ హెచ్చరిక | SEBI Warning to Investors: Avoid Trading Unlisted Shares on Unauthorized Platforms | Sakshi
Sakshi News home page

ఆ షేర్ల ట్రేడింగ్‌లో జాగ్రత్త: సెబీ హెచ్చరిక

Jun 19 2026 12:52 PM | Updated on Jun 19 2026 12:58 PM

SEBI Warning to Investors: Avoid Trading Unlisted Shares on Unauthorized Platforms

న్యూఢిల్లీ: అనధికారిక ఎల్రక్టానిక్‌ ప్లాట్‌ఫాంలు, వెబ్‌సైట్ల ద్వారా అన్‌లిస్టెడ్‌ పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీల షేర్ల కొనుగోళ్లు, విక్రయ లావాదేవీలు జరపరాదని ఇన్వెస్టర్లను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హెచ్చరించింది. అటువంటి ప్లాట్‌ఫాంలకు గుర్తింపు ఉండదని, వాటిపై నియంత్రణ సంస్థ పర్యవేక్షణ ఉండదని పేర్కొంది.

కొన్ని ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలు అన్‌లిస్టెడ్‌ కంపెనీల్లో లావాదేవీలకు వీలు కల్పిస్తున్నాయని సెబీ దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో 2016 ఆగస్టు, 2024 డిసెంబర్‌లో కూడా ఇటువంటి అడ్వైజరీలను జారీ చేసినట్లు సెబీ పేర్కొంది. గుర్తింపు పొందిన స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు మాత్రమే సెక్యూరిటీల ట్రేడింగ్, నిధుల సమీకరణకు వేదికలుగా వ్యవహరించేందుకు అనుమతి ఉంటుందని తెలిపింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement