గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 373.76 పాయింట్లు లేదా 0.48 శాతం లాభంతో 78,954.76 వద్ద, నిఫ్టీ 11.35 పాయింట్లు లేదా 0.046 శాతం లాభంతో 24,636.00 వద్ద నిలిచాయి.
నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, టాటా టెక్నాలజీస్ లిమిటెడ్, మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. బ్లూ స్టార్ లిమిటెడ్, సరిగమ ఇండియా లిమిటెడ్, హెచ్‌ఎఫ్‌సిఎల్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


