శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి మిశ్రమ ఫలితాలను చవిచూశాయి. సెన్సెక్స్ 19.63 పాయింట్లు లేదా 0.026 శాతం నష్టంతో 74,294.96 వద్ద, నిఫ్టీ 75.80 పాయింట్లు లేదా 0.33 శాతం లాభంతో 23,346.40 వద్ద నిలిచాయి.
అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్, పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్, వెల్స్‌పన్ కార్ప్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్, కేపీఐటీ టెక్నాలజీస్ లిమిటెడ్, టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


