ఐఫోన్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున లేటెస్ట్ ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro) సేల్ ఇండియాలో మొదలైంది. అయితే భారీ డిమాండ్ , భారీ క్యూలైన్ కారణంగా చాలామందికి నిరాశ తప్పలేదు. మరోవైపు భారతదేశంలో పన్నుల భారం కారణంగా ఐఫోన్ ధరలు ఎక్కువగా ఉండటంతో, కొందరు భారతీయులు విమాన ప్రయాణ ఖర్చులు పోను దుబాయ్‌లో కొనుగోలు చేయడమే లాభదాయకమని భావిస్తున్నారట. ఇంతకీ దుబాయ్ దీన ధర ఎంత? తెలుసుకుందాం పదండి మరి!
భారత్‌లో ఐఫోన్ ధరలు, దుబాయ్‌లో విమాన టికెట్ మరియు వీసా ఖర్చులు పోను వచ్చే ధరలను బేరీజు వేసుకుని కొందరు కొనుగోలుదారులు దుబాయ్ మాల్‌లోని ఆపిల్ స్టోర్‌కు వచ్చి ఐఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా చీప్‌గా ఐఫోన్ దక్కించుకోవడంతోపాటు, దుబాయ్‌ని సందర్శించిన సంబరం కూడా.

ఎంత ఆదా?
కేరళకు చెందిన మహ్మద్ సయీద్ అనే కొనుగోలుదారు దుబాయ్‌లో కొనుగోలు చేయడం ద్వారా తనకు దాదాపు రూ. 20వేల నుంచి రూ. 38వేల వరకు ఆదా అవుతున్నట్లు తెలిపారు. ముంబైకి చెందిన అమన్ సోలంకి అనే మరో వ్యక్తి తన కుటుంబం కోసం మూడు ప్రో మాక్స్ ఫోన్‌లను కొనుగోలు చేయడం ద్వారా భారీగా ఆదా అవుతోందని చెప్పారు. ఒకటి కంటే ఎక్కువ ఐఫోన్లు కొనుగోలు చేసేవారికి, ముఖ్యంగా కుటుంబ సభ్యుల కోసం ఒకేసారి ఫోన్లు కొనేవారికి దుబాయ్‌లో షాపింగ్ చేయడం ఆర్థికంగా లాభదాయకం అంటున్నాయి మార్కెట్ వర్గాలు.
ఇదీ చదవండి: నిఠారి కేసు నిర్దోషి సురీందర్ కోలి ఆకస్మిక మరణం సంచలనం
దుబాయ్‌లో: ఐఫోన్ 18 ప్రో ధర దాదాపు 5,099 దిర్హామ్‌ల (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 1,32,000) నుంచి, ప్రో మాక్స్ ధర 5,499 దిర్హామ్‌ల (సుమారు రూ. 1,42,000) నుంచి ప్రారంభమవుతోంది.
భారత్‌లో: ఐఫోన్ 18 ప్రో ప్రారంభ ధర రూ. 1,64,900గా ఉండగా, ప్రో మాక్స్ ధర రూ. 1,79,900గా ఉంది.
కొత్త ఫీచర్లు: ఐఫోన్ 18 ప్రో సిరీస్ కొత్త A20 ప్రో చిప్, వేరియబుల్ అపర్చర్‌తో కూడిన 48MP ఫ్యూజన్ మెయిన్ కెమెరా, బర్గండ్‌తో సహా గ్లేసియర్, సిల్వర్ , బ్లాక్ రంగులలో రంగుల్లో అందుబాటులోకి వచ్చింది.
ఇదీ చదవండి: ఐఫోన్ క్రేజ్ : భార్యామణి కోసం ఏకంగా గోల్డ్ అమ్మి మరీ!


