ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ ఐఫోన్లకు క్రేజ్ అంతా ఇంతకాదు. ఎలాగైనా లేటెస్ట్ ఐఫోన్ దక్కించుకోవాలని ఉబలాట పడతారు ఐఫోన్ లవర్స్. భారతదేశంలో ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro) సేల్ ప్రారంభం కావడంతో నోయిడాలోని యాపిల్ స్టోర్ వద్ద భారీ క్యూ లైన్లే ఇందుకు నిదర్శనం. తాజా ఐఫోన్‌ను దక్కించుకోవడం కోసం కొనుగోలుదారులుగంటల తరబడి వేచి చూశారు. ఈ సందర్బంగా భార్యకు కొత్త ఐఫోన్ కొనిచ్చేందుకు ఏకంగా బంగారాన్ని అమ్మేసిన వైనం నెట్టింట విచిత్రంగా నిలుస్తోంది.
ఐఫోన్‌నుదక్కించుకునేందుకు ఒక్కొక్కరి కష్టాలు మామూలుగా లేవు. వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, మహిళలు స్టోర్ ఓపెన్ చేయకముందు షాప్ ముందు క్యూ కట్టారు. కొందరు ఐఫోన్ దక్కిచంచుకోవడం కోంసం సెలవు కూడా తీసుకున్నారు.ప్రస్తుతం ఇవి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
బంగారం అమ్మి మరీ...
ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి తన భార్య కోరిక మేరకు బర్గండీ రంగు ఐఫోన్ 18 ప్రో కొనుగోలు చేయడానికి బంగారం అమ్మినట్లు తెలిపారు. "ఆనాడు డబ్బులు లేవు, నేడు ఉన్నాయి, రేపు ఉంటాయో లేదో" అని చెబుతూ తన భార్య కోసం ఈ ఫోన్ కొన్నానని ఆయన వెల్లడించారు.తన భార్య 'బర్గుండి' (Burgundy) రంగులో ఉన్న iPhone 18 Proని తీసుకురమ్మని చెప్పిందని ఆయన తెలిపారు.

పెళ్లి కానుకగా ఐఫోన్
పంజాబ్‌కు చెందిన గుర్దితా సింగ్ అనే వ్యక్తి తన పెళ్లి కానుకగా కాబోయే భార్య కోసం ఐఫోన్ 18 ప్రో కొనుగోలు చేయడానికి ఉదయం 6 గంటల నుంచే క్యూలో నిలబడ్డారు. తనకోసం ఐఫోన్ 18 ప్రో మాక్స్‌తో కలిపి మొత్తం రెండు ఫోన్ల కోసం ఆయన రూ. 3.5 లక్షలకు పైగా వెచ్చించారు.
ధరల పెంపు లెక్కే కాదు
ఐఫోన్ ధరలు గత ఏడాదితో పోలిస్తే పెరిగినప్పటికీ, ఐఫోన్ ప్రేమికులు ఈ ధరను చెల్లించడానికి వెనుకాడబోరని కొనుగోలుదారులు అభిప్రాయపడ్డారు. హర్యానాకు చెందిన విశాల్ అనే వ్యక్తి మాట్లాడుతూ ధరలు పెరిగినా తాము సర్దుబాటు చేసుకుంటామని తెలిపారు.
ముందస్తు బుకింగ్స్
స్టోర్ వద్ద తీవ్ర రద్దీ నెలకొనగా, ముందుగా ప్రీ-ఆర్డర్ చేసుకున్నవారికే మాత్రమే స్టోర్‌లోకి ప్రవేశం కల్పించారు. ముందస్తు బుకింగ్ చేసుకోని కొందరు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.
తొలి ఫోన్ అందుకున్న ఆనందం
అంతేకాదు ఇండియాలో అందరికంటే ముందే తానే కొత్త ఐఫోన్‌నుసొంతం చేసుకోవాలనే ఆశతో ఏకంగా 10–12 గంటల పాటు క్యూలో నిలబడ్డావో వ్యక్తి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వద్ద రాత్రంతా వేచి చూసి, భారత్‌లో తొలి iPhone 18 ను సొంతం చేసుకుని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైన సంగతి సోషల్‌మీడియాలో సందడిగా మారింది.


