రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చరిత్రలోనే అతిపెద్ద క్రాష్ ప్రారంభమైందని పేర్కొన్నారు. ఇంతకీ కియోసాకి ఈ మాటలు ఎందుకు అన్నారు? నిజంగా.. అతిపెద్ద క్రాష్ వస్తుందా?, అనే విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.
తాను రాసిన 'రిచ్ డాడ్స్ ప్రొఫెసీ' అనే పుస్తకంలోనే భవిష్యత్తులో మార్కెట్ క్రాష్ రావచ్చని హెచ్చరించారు. ఆర్థిక సంక్షోభం ఇప్పటికే యూరప్, జపాన్‌లో ప్రారంభమై.. క్రమంగా ప్రపంచంలోని ఇతర దేశాలకు వ్యాపిస్తోందని కియోసాకి చెబుతున్నారు.
సంక్షోభానికి కారణాలు
కియోసాకి ప్రకారం.. ఆర్థిక సంక్షోభం రావడానికి అనేక ఆర్థిక, రాజకీయ సమస్యలు కారణమవుతున్నాయని సమాచారం. ఇందులో ఏఐపై అతిగా ఆధారపడటం, యుద్ధాలు.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా పెరిగిన అప్పులు, బేబీ బూమర్స్ పదవీ విరమణ ఉన్నాయి.
రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్నవారికి హెచ్చరిక
అమెరికాలో 401(k), ఐఆర్ఏ.. ఆస్ట్రేలియాలో సూపర్‌యాన్యుయేషన్, కెనడాలో ఆర్ఆర్ఎస్పీ వంటి రిటైర్మెంట్ ఖాతాల్లో చాలామంది తమ డబ్బును స్టాక్స్, బాండ్లలో పెట్టుబడి పెడతారు. ఒకవేళ స్టాక్, బాండ్ మార్కెట్లు రెండూ తీవ్ర నష్టాలను చవిచూస్తే.. రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్న వ్యక్తుల సంపదపై తీవ్ర ప్రభావం పడవచ్చని కియోసాకి హెచ్చరించారు.
ప్రత్యేకంగా 40 ఏళ్లు దాటిన వారికి ఆయన జాగ్రత్త చెబుతున్నారు. ఎందుకంటే మార్కెట్ భారీగా పడిపోయినప్పుడు యువకులకు తిరిగి కోలుకోవడానికి సమయం ఉంటుంది. కానీ రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్న వ్యక్తులకు సమయం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ వయసులో ఇబ్బదులు ఎదుర్కోకుండా ఉండాలని చెబుతున్నారు.
గతంలో 25 ఏళ్లు
ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం ఏర్పడిన తరువాత.. దాని ప్రభావము కొన్ని సంవత్సరాల అలాగే ఉంటుంది. గత ఆర్థిక మాంద్యం 1929 నుంచి 1954 వరకు 25 సంవత్సరాల పాటు కొనసాగిందని కియోసాకి చెప్పారు.
కియోసాకి సాధారణంగా తన సంపదను కేవలం నగదు, స్టాక్స్, బాండ్లలో ఉంచడం కంటే ఆదాయం వచ్చే ఆస్తులు కలిగి ఉండాలని చెబుతాడు. తాను వ్యక్తిగత వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, చమురు ఉత్పత్తి చేసే బావులు, బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి వాటిలో పెట్టుబడులు పెడతానికి వెల్లడించారు.
సురక్షితమైన ఆస్తులు ఇవే!
భవిష్యత్తులో ప్రభుత్వం, కేంద్ర బ్యాంకులు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి పెద్ద మొత్తంలో కొత్త డబ్బును సృష్టిస్తే, సాధారణ కరెన్సీ విలువ తగ్గవచ్చు. అలంటి సమయంలో బంగారం, వెండి, బిట్‌కాయిన్‌ను వంటివి సురక్షితమైన ఆస్తులుగా ఉంటాయని పేర్కొన్నారు.
పెట్టుబడుల విషయంలో జాగ్రత్త
ఇక్కడ పెట్టుబడిదారులు తప్పకుండా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. కియోసాకి చెప్పే ప్రతి విషయం ఖచ్చితంగా జరుగుతుందని భావించకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో క్రాష్ వస్తుందని చెప్పలేము. కాబట్టి ఆర్ధిక సంక్షోభం వస్తుందని భయపడి వెంటనే అన్ని పెట్టుబడులను అమ్మేయడం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితిని పరిశీలించుకోవాలి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి.
BIGGEST CRASH IN HISTORY has started.
In 2002 I released RICH DADS PROPHECY. This book was written to prepare people to profit and not be victims of the biggest stock and bond market crash in history…. a crash that was still coming.
In 2026, that crash started, in Europe…— Robert Kiyosaki (@theRealKiyosaki) September 15, 2026


