బోబా టీని ఆస్వాదించే గణేశుడు..! | Thai Creator Shows What Devotees Offer Lord Ganesha In Bangkok Goes Viral | Sakshi
Sakshi News home page

బ్యాంకాక్‌లో గణేశుడికి నైవేద్యంగా ఏమి సమర్పిస్తారో తెలుసా..!

Sep 15 2026 2:19 PM | Updated on Sep 15 2026 2:44 PM

Thai Creator Shows What Devotees Offer Lord Ganesha In Bangkok Goes Viral

గణేశుడు కేవలం భారత్‌లోనే కాదు విదేశాల్లో సైతం వివిధ రూపాల్లో పూజలందుకుంటాడు. ఆయనకు ఎల్లలు లేవు..సర్వత్రా ఆయనే పలు రకాల పేర్లతో పిలిపించుకుంటూ పూజలందుకునే మహాగణపతి. అలాంటి లంబోదరుడుని బ్యాంకాక్‌లో భక్తులు  ఎలా ఆరాధిస్తారో వింటే విస్తుపోతారు. మనమంతా వినాయకుడికి మోదకాలు, లడ్డూలు సమర్పిస్తే బ్యాంకాక్‌ వాసులు మాత్రం బొజ్జ గణపయ్యకు ఏం సమర్పిస్తారో తెలిస్తే షాకవ్వుతారు. 

థాయ్‌ కంటెంట్‌ క్రియేటర్‌ ప్రియా పింగ్‌ దీని గురించి షేర్‌ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. బ్యాంకాక్‌లోని యూనియన్‌ మాల్‌ వెలుపల ఉన్న గణేశ్‌ ఆలయంకి సంబంధించిన వీడియోని పంచుకున్నారు. అక్కడ భక్తులు వినాయకుడికి బోబాటీని సమర్పిస్తుండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వినాయకుని ఆలయం వద్ద ఉంచిన అనేక బబుల్‌ మిల్క్‌ టీ కప్పులను చూడొచ్చు. 

ఆ ఆలయం వద్ద సమర్పించాలనుకుంటున్న బబుల్‌ టీ బ్రాండ్‌ల మెనూ కూడా ఉంటుంది. భక్తులు తమకు నచ్చినది ఎంచుకుని గణనాథుడికి సమర్పిస్తే చాలు. కొందరు ఒకేసారి పదికిపైగా బోబా కప్పులను సమర్పిస్తుండటం కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. కోరిక నెరవేరితే ఎక్కువ కప్పుల బోబా టీని సమర్పిస్తుంటారట. అది ఒక్కోసారి 200 పై చిలుకు బోబా టీలు కూడా కావొచ్చట. ప్రజలు తాము ఆస్వాదించే దాన్నే దేవుడికి సమర్పించడం అనేది థాయి​ సంప్రదాయానికి సంబంధించిన ఒక నమ్మకమని చెబుతోంది కంటెంట్‌ క్రియేటర్‌ ప్రియ.

(చదవండి: శ్రీ గణేశాయ ధీమహి’ పాటకు రాధికా మర్చంట్‌ నృత్యం..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement