సాక్షి, న్యూఢిల్లీ: గురుగ్రామ్‌లో మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయిన ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌లోని దౌసా నుంచి డ్రైవర్ కల్యాణ్ బైన్‌స్లాను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన అనంతరం అతడిపై హత్యాయత్నం అభియోగాన్ని నమోదు చేసినట్లు సమాచారం.
హర్యానా గురుగ్రామ్‌కు చెందిన సియా.. స్పోర్ట్స్ బైక్ రైడర్. ఆమె ఏప్రిలియా ఆర్‌ఎస్ 457 బైక్‌పై వెళ్తుండగా ఆదివారం గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. మరోవైపు కల్యాణ్ ఆ సమయంలో తెల్లటి సెడాన్ కారును నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కసారిగా కుడివైపునకు మళ్లిన కారు.. హెల్మెట్ ధరించి బైక్‌పై వెళ్తున్న సియాను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమె రోడ్డుపై పడిపోగా.. బైక్ కొంతదూరం జారుకుంటూ వెళ్లింది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
సీసీటీవీ ఆధారంగా హత్యాయత్నం కేసు
ప్రమాదం జరిగిన తర్వాత కారు ఆపకుండా వెళ్లిపోయినట్లు ఫుటేజీల్లో కనిపించడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఆధారంగా నిందితుడిని గుర్తించి దౌసాలో అదుపులోకి తీసుకున్నారు. అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేరానికి గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
‘జాలిపడితే.. ఎందుకు ఆపలేదు?’
ప్రమాదం తర్వాత కల్యాణ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తనకు ఆ యువతి మహిళో, పురుషుడో తెలియదని, ఘటనలో ఒకవైపు కథనం మాత్రమే బయటకు వచ్చిందని చెప్పాడు. ఆమెపై తనకు చాలా బాధ కలిగిందని పేర్కొన్నాడు. అదే సమయంలో అతని లాయర్.. కేవలం వ్యూస్, ఫాలోవర్స్ కోసమే ఆ మహిళా బైకర్ ఇలా చేస్తోందని ఆరోపించాడు.
అయితే కల్యాణ్, అతని లాయర్ వ్యాఖ్యలపై సియా తీవ్రంగా స్పందించింది. “నాపై నిజంగా జాలిపడితే.. ప్రమాదం జరిగిన వెంటనే ఎందుకు ఆపలేదు? నేను గాయపడ్డానా లేదా అని చూడటం నీ బాధ్యత కాదా?” అని ప్రశ్నించింది. ప్రమాదం తర్వాత కారు ఆపకుండా వెళ్లిపోయిన తీరును సీసీటీవీ ఫుటేజీలు స్పష్టంగా చూపిస్తున్నాయని పేర్కొంది. అలాగే అతని లాయర్ పైనా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
I don’t think Gurgaon is safe for girls anymore. The guy hit her intentionally as you can see in this clip, he asked her to Stop but she didn’t for her safety. So he hit and run her so badly. https://t.co/eyWEwXt3bn pic.twitter.com/bNdtEw5aSl
— LUCK7773 (@Luck_7773) September 15, 2026
‘చనిపోయి ఉండొచ్చు’
ఈ ప్రమాదంలో తనకు మరింత తీవ్ర గాయాలు అయ్యే అవకాశం ఉందని సియా తెలిపింది. “నా ఎముకలు విరిగి ఉండొచ్చు. అక్కడికక్కడే చనిపోయి ఉండొచ్చు. అదృష్టవశాత్తూ అలా జరగలేదు” అని చెప్పింది. ప్రమాదం తర్వాత ఒక్క క్షణం కూడా ఆగకుండా వెళ్లిపోవడం తనను మరింత బాధించిందని పేర్కొంది. సియా తండ్రి రోషన్ చౌహాన్ కూడా నిందితుడికి శిక్ష పడే వరకు తమ కుటుంబం వెనక్కి తగ్గబోదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మళ్లీ బైక్ నడుపుతా..
గురుగ్రామ్ హిట్ అండ్ రన్ ఘటనలో గాయపడిన బైకర్ సియా మళ్లీ బైక్ నడుపుతానని, అయితే రోడ్లపైకి ఒంటరిగా వెళ్లాలంటే భయంగా ఉంటుందని తెలిపింది. ఆ కారు నడుపుతున్న వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని.. అంటే ఉద్దేశపూర్వకంగా కారు దగ్గరకు వెళ్‌లడం, కట్ కొట్టడం నేను చేయలేదు. రోడ్లపై నా భద్రత నేను చూసుకుంటా. ప్రమాదానికి ముందు కారు తనను పదేపదే వెంబడిస్తూ బైక్‌కు దగ్గరగా వచ్చిందని, దీంతో భయపడి కారు నుంచి దూరంగా వెళ్లేందుకు ప్రయత్నించానని చెప్పింది. అనవసరంగా సమస్యను ఎందుకు సృష్టించుకుంటాను? అని సియా అంటోంది. అయినా కారు వేగంగా వచ్చి తన బైక్‌ను ఢీకొట్టి వెళ్లిపోయిందని వివరించింది. ఈ ఘటన తనను తీవ్రంగా భయపెట్టిందని, ముఖ్యంగా మహిళా బైకర్లు రోడ్లపై ప్రయాణించాలంటే ఆందోళన కలిగించేలా ఉందని సియా పేర్కొంది.
VIDEO | Delhi: "I am not interested in 'pinching' a car driver; my own safety on the road is paramount, why would I try to cause unnecessary trouble?" says Siya, woman biker who was hit by a car in Gurugram.
(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) pic.twitter.com/rUpg6NAzVs— Press Trust of India (@PTI_News) September 15, 2026
ఇదీ చదవండి: జై హింద్ అనలేదని ట్రాన్స్‌ఫర్ చేశారా?


