కరీంనగర్‌: నెలకు 8 లక్షల జీతం.. ఏరోస్పేస్‌ ఇంజనీర్‌ నిర్వాకం | Parents Emotional Video In Karimnagar | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌: నెలకు 8 లక్షల జీతం.. ఏరోస్పేస్‌ ఇంజనీర్‌ నిర్వాకం

Sep 14 2026 11:29 AM | Updated on Sep 14 2026 12:13 PM

 Parents Emotional Video In Karimnagar

కరీంనగర్‌: ‘కన్నకొడుకే మమ్మల్ని ఇంట్లోంచి వెళ్లిపొ మ్మంటున్నాడు.. ఇల్లు అమ్మేస్తానంటున్నాడు.. ఈ వయసులో మేమెక్కడికి వెళ్లాలి.. భార్య హార్ట్‌ పేషెంట్‌.. మాకు న్యాయం చేయండి’ అంటూ వృద్ధ దంపతులు దేవులపల్లి లక్ష్మణ్‌– జయలక్ష్మి శనివారం తమ ఇంటి ఎదుట బైఠాయించారు. ఈ ఘటన శనివారం కరీంనగర్‌ కోతిరాంపూర్‌లో చోటుచేసు కుంది. జమ్మికుంట మండలం వావిలాల గ్రామానికి చెందిన లక్ష్మణ్‌ 2010లో ఉద్యోగవిరమణ పొందాడు. 

ఆయనకు కుమారుడు రవికుమార్, ఓ కుమార్తె ఉన్నారు. రవికుమార్‌ హైదరాబాద్‌లో ఏరోస్పేస్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కోతిరాంపూర్‌లో 2002లో లక్ష్మణ్‌ నిర్మించుకున్న ఇంటిని రవికుమార్‌ తనపేరున గిఫ్ట్‌డీడ్‌ చేసుకున్నాడు. 2023 నుంచి ఇల్లు విక్రయిస్తానని, ఖాళీ చేయాలని కుమారుడు చెబుతు న్నాడని దంపతులు ఆరోపించారు. ఇంటి అద్దె ద్వారా వచ్చే ఆదాయం తప్ప తమకు మరో ఆధారం లేదని వారు వాపోయారు. తమకు ఆధారంగా ఉన్న ఇంటిపై చేసిన గిఫ్ట్‌ డీడ్‌ను రద్దు చేసి, న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. 

 
ఇంటి ఎదుట బైఠాయించిన వృద్ధదంపతులు  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement