క్షణికావేశానికి రెండు ప్రాణాలు బలి | Two dead in husband wife fight | Sakshi
Sakshi News home page

క్షణికావేశానికి రెండు ప్రాణాలు బలి

Sep 13 2026 1:44 AM | Updated on Sep 13 2026 1:44 AM

Two dead in husband wife fight

బేతమ్మ , ప్రవీణ్‌

ఉరేసుకొని తల్లి.. తట్టుకోలేక కొడుకు బలవన్మరణం

భార్యాభర్తల మధ్య గొడవే కారణం

పెద్ద శంకరంపేట(మెదక్‌): క్షణికావేశం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. తల్లి హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడగా, ఆమె మృతిని తట్టుకోలేక కుమారుడు పెద్దశంకరంపేటలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని మక్త లక్ష్మాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాగదార శివయ్య, బేతమ్మ(45) దంపతులు ఏడాది క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లి బౌరంపేటలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమా రుడు ఉన్నారు. స్వగ్రామంలోని వారి సమీప బంధువులకు చెందిన వ్యక్తికిచ్చి పెద్ద కుమార్తె శివలీల వివాహం చేశారు. 

మరో కుమార్తె స్వప్న ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చిటుకుల్‌లోని ప్రభుత్వ గురుకుల హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. కుమారుడు ప్రవీణ్‌(19) హైదరాబా ద్‌లో తల్లిదండ్రులతో కాకుండా కూకట్‌పల్లిలోని ఓ ప్రయివేటు హాస్ట ల్‌లో ఉంటూ ఎలక్రీ ్టషియన్‌గా పనిచే స్తున్నాడు. శివయ్య, బేతమ్మ దంపతులిద్దరూ బౌరంపేటలో వాచ్‌మెన్‌ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో శుక్ర వారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. క్షణికావేశంలో బేతమ్మ ఉరేసుకొని మృతి చెందింది. 

ఈ విషయాన్ని శివయ్య తన కుమారుడు ప్రవీణ్, చిన్నకుమార్తె స్వప్నకు ఫోన్‌ చేసి అమ్మకు బాగోలేదు, కిందపడితే దెబ్బలు తగిలాయని వారిద్దరినీ రావాలని చెప్పాడు. దీంతో ప్రవీణ్‌ వెంటనే వచ్చేశాడు. మృతి చెందిన తల్లిని చూసి భోరున విలపించాడు. ఆ సమయంలో తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన తల్లి మృతిని తట్టుకోలేని కుమారుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అదే రోజు అక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా పెద్దశంకరంపేట మండలానికి వచ్చాడు. సంగారెడ్డి–నాందేడ్‌ జాతీయ రహదారిలోని కోలాపల్లి వద్ద సా యంత్రం ఆరు గంటల సమయంలో దిగి సమీప వ్యవసాయ పొలాల్లోని ఓ చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. తండ్రి శివయ్య, బంధువులు ప్రవీణ్‌కు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ఎత్తలే దు. 

అతడిని చూసిన స్థానికులు ఈ సమాచారం చేరవేయడంతో పోలీసులు సెల్‌ఫోన్‌ ఆధారంగా అతడి కదలికలను గుర్తించారు..శుక్రవారం రాత్రి అతడు చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శనివారం మధ్యాహ్నం స్వగ్రామానికి బంధువులు ప్రవీణ్‌ మృతదేహాన్ని తీసుకువచ్చారు. కాగా, హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న బేతమ్మ మృతదేహాన్ని శుక్రవారం రాత్రి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా శనివారం మధ్యాహ్నం మక్తలక్ష్మాపూర్‌కు చేరుకుంది. దీంతో ఇరువురి అంత్యక్రియలు ఒకేసారి నిర్వహించారు. అటు భార్య, ఇటు కొడుకు చితిలకు శివయ్యే నిప్పంటించాడు.

కాలువలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి
ఈత రాకపోవడంతో ప్రమాదం
మునగాల: సూర్యాపేట జిల్లా ము నగాల మండలం ముకుందాపురం గ్రామ శివారులోని ముక్త్యాల బ్రాంచి కాలువలో శనివారం ఇద్దరు విద్యార్థులు మునిగి మృతి చెందారు. కోదాడ పట్టణానికి చెందిన ఎలమర్తి లేఖ స్వరూప్‌రెడ్డి (14), సారిక హరీశ్‌ (14) కోదాడ మండలం బాలాజీనగర్‌లోని ఎస్‌ఆర్‌ ఎం (సంకల్ప) పాఠశాలలో 9వ తరగతి చదువుతూ పాఠశాలకు చెందిన వసతి గృహంలో ఉంటున్నారు. వరుసగా మూడ్రోజులు సెలవులు రావడంతో పాఠశాల యాజమాన్యం విద్యార్థులను శుక్రవారం సాయంత్రం ఇంటికి పంపించింది. ఇదే పాఠశాలలో చదువుతున్న చరణ్‌ స్వగ్రామం ముకుందాపురం కాగా.. శనివారం చరణ్, స్వరూప్‌రెడ్డి, హరీశ్‌ కలిసి ముకుందాపురం శివారులో గల ముక్త్యాల బ్రాంచి కాలువ వద్దకు స్నానం చేసేందుకు వెళ్లా రు.

కాలువలో స్నానం చేస్తుండగా.. స్వరూప్‌రెడ్డి, హరీశ్‌కు ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు కాలువలో మునిగి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ఎస్సై మల్లు సంజీవరెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని ముక్త్యా ల బ్రాంచి కాలువకు నీటి సరఫరాను నిలిపివేసి స్థానికులు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలం నుంచి 2 కి.మీ. దూరంలో చిలుకూరు మండలం మాదగూడెం వద్ద స్వరూప్‌రెడ్డి మృతదేహం, అక్కడి నుంచి మరో కిలోమీటరు దూరంలో హరీశ్‌ మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై సంజీవరెడ్డి తెలిపారు.

వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్య?
పోక్సో కేసు విషయంలో ఓ నాయకుడు, బాలిక బాబాయ్‌ రూ.20 లక్షల డిమాండ్‌!
సూసైడ్‌ లెటర్‌లో వెల్లడి  
ముదిగొండ: పోక్సో కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చిన యువకుడిని ఓ నాయకుడు, బాలిక బంధువు నగదు కోసం వేధించినట్లు తెలుస్తుండగా, యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా ముదిగొండలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నా యి. ముదిగొండకు చెందిన మెట్టెల వినయ్‌కుమార్‌ (21) ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ కళా శాలలో ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అతనిపై మార్చి నెలలో పోక్సో కేసు నమోదు కాగా, రిమాండ్‌కు తరలించారు. రెండురోజుల క్రితం బెయిల్‌ రావడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. 

అయితే, కేసు విషయమై బాలిక బాబాయ్‌తో పాటు నాయకుడు నూకల నాగేశ్వరరావు రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని, లేకపోతే కుటుంబానికి హాని చేస్తామని బెదిరించినట్లు తెలిసింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలిసి ఉండటంతో శుక్రవారం రాత్రి డాబాపై ఉన్న రేకుల గదిలో వినయ్‌ ఇనుప కడ్డీకి వైర్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకు న్నాడు. ఈ విషయాన్ని కుటుంబీకులు శనివారం ఉదయం గుర్తించారు. కాగా, వినయ్‌ ఆత్మహత్యకు ముందు సూసైడ్‌ నోట్‌ రాశాడని, అందులో సైతం నాగేశ్వరరావు, బాలిక బాబాయి పేరు ఉందని తెలుస్తోంది. యువకుడి తండ్రి ఇచ్చిన ఫిర్యా దుతో ముదిగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement