సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కేసులు నమోదు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయ కక్షతోనే తమ పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. లైంగిక వేధింపుల కేసులను సైతం చట్టాన్ని దుర్వినియోగం చేసేందుకు ఉపయోగిస్తున్నారని విమర్శించారు.
మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా.. ఎన్ని కేసులు పెట్టినా న్యాయస్థానంలో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం, పోలీసుల తీరు చట్టబద్ధ పాలనకు విరుద్ధంగా ఉందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేయడంలో పోలీసులు చూపుతున్న వేగం.. కాంగ్రెస్ నేతలపై వచ్చిన ఆరోపణల విషయంలో ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేస్తూ.. కాంగ్రెస్ నేతలపై వచ్చిన ఆరోపణలపై మాత్రం మౌనం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థను ఉపయోగించకూడదని సూచించారు.
The cheap minister of Telangana made his police file a sexual harassment case on BRS MLAs and MLCs in the context of the melee at assembly entry point !!! Shocking abuse of law
We of course will fight this rubbish cases in court of law
But let me ask @TelanganaDGP Garu… pic.twitter.com/dGxvJrSibA— KTR (@KTRBRS) September 12, 2026
ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీకి కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. మిస్ వరల్డ్ సందర్భంగా మిస్ ఇంగ్లాండ్ చేసిన ఆరోపణలపై విచారణ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పోలీసులు కాపాడుతున్నారా? అని నిలదీశారు.
ఇదీ చదవండి: తెలంగాణ భవన్‌లో మాక్ అసెంబ్లీ..


