ఖైరతాబాద్‌లో శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతి ఆగమన కార్యక్రమం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
విద్యుత్ కాంతుల వెలుగులు..డప్పు వాయిద్యాల మోతలు, యువత నృత్యాలు, కోలాటాల మధ్య మహాగణపతికి స్వాగత కార్యక్రమం నిర్వహించారు.
జై గణేష్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో మహిళలు, యువకులు సంప్రదాయ దుస్తులతో తలపాగా ధరించి డప్పులు వాయిస్తూ జోష్ నింపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వందలాది మంది యువతీ యువకులు, స్థానికులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసింది.
ఇక ఈ ఏడాది 69 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో శ్రీ పంచముఖ సంకటహర గణపతి, కుడివైపు సోమనాథ్ జ్యోతిర్లింగం, ఎడమవైపు కాళికామాత అమ్మవార్ల విగ్రహాలు ఏర్పాటు చేశారు.


