తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల వేళ ప్రతిపక్షంపై పోలీసులు దౌర్జన్యకాండకు దిగారు. సోమవారం(సెప్టెంబర్ 7వ తేదీ) ఉదయం నల్ల టీషర్లుతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు వద్దే అడ్డుకున్నారు. ఆ దుస్తులతో అనుమతించబోమని చెప్పారు. అయితే తమను లోపలికి అనుమతించాలని బీఆర్‌ఎస్ నేతలు పట్టుబట్టడంతో మెయిన్‌గేట్ వద్ద హైడ్రామా నడిచింది.


