breaking news
Telangana Assembly Monsoon Session
-
అసెంబ్లీకి అనూహ్య ఎక్స్టెన్షన్.. మరో రెండు రోజులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగుస్తాయనుకుంటే.. అనూహ్యంగా పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారంతోనే సమావేశాలు ముగుస్తాయని ఇప్పటివరకు భావించినప్పటికీ.. ఇవాళ కాకుండా మరో రెండు రోజుల పాటు సభను నిర్వహించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీంతో అసెంబ్లీ సమావేశాల వ్యవధిపై ఆసక్తి నెలకొంది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన నేపథ్యంలో.. ఈ అంశంపై అసెంబ్లీలో విస్తృతంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ఎన్నికల హామీల అమలు, ఇప్పటివరకు సాధించిన పురోగతిపై సభలో వివరించే అవకాశం ఉంది. మరోవైపు వెయ్యి రోజుల పాలనపై ‘మోసం’ పేరిట బీఆర్ఎస్ ఇప్పటికే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తోంది.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో.. సభా వేదికగా వాటికి సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగాల భర్తీ, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను ప్రభుత్వం ప్రస్తావించే అవకాశం ఉంది. ఇవాళ్టి సమావేశాల బ్రేకులో మంత్రులతో భేటీ అయిన సీఎం రేవంత్ ఈ అంశాన్ని ప్రస్తావించారని సమాచారం. అయితే సాయంత్రంకల్లా దీనిపై ఓ స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.22ఏపై నేడు చర్చమరోవైపు ఎల్ నినోతో పాటు 22ఏ నిషేధిత భూముల అంశంపై కూడా గురువారం మధ్యాహ్నం తర్వాత సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై మాట్లాడనున్నారు. ఇప్పటికే ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 22ఏ జాబితాలో ప్రైవేటు భూములు చేరడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం తన వైఖరిని సభలో స్పష్టం చేయనుంది.రెండు రోజులు ఎందుకు?అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగుస్తాయని అంతా భావించిన వేళ.. మరో రెండు రోజులు పొడిగించే ఆలోచన తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. వెయ్యి రోజుల పాలనపై చర్చతోపాటు ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం సమగ్రంగా వివరించే అవకాశం ఉంది. తద్వారా బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న విమర్శలకు సభా వేదికగానే సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సమావేశాల పొడిగింపుపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగుతాయన్నది స్పష్టత రానుంది. -
కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్‌కు సైఫాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 10 గంటలకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.ఈ నెల 7న అసెంబ్లీ గేట్ నంబర్ 3 వద్ద చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి మహేందర్ రెడ్డి, మహేష్‌పై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తమపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని కోరుతూ వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు.వారి పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఇద్దరికీ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అలాగే, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో పోలీసుల విచారణకు సహకరించాలని సూచించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మహేందర్ రెడ్డి, మహేష్ రేపు ఉదయం 10 గంటలకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఇదీ చదవండి : కొండా సురేఖ బర్తరఫ్‌పై కేటీఆర్ రియాక్షన్ ఇదే -
అసెంబ్లీ గంట మోగితే.. రూ. కోట్లలోనే ఖర్చు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లో స్పీకర్ గంట మోగించగానే చర్చ మొదలవుతోంది. కానీ ఆ గంట మోగడం వెనుక ప్రతి గంటకు రూ. 15 నుంచి 20 లక్షల వరకు ఖర్చవుతుందని ఢిల్లీకి చెందిన స్వతంత్ర ఎన్జీవో సంస్థ పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సేకరించిన గణాంకాలు చెబుతున్నాయి. ఎందుకంటే శాసనసభ నడవాలంటే తెరవెనుక పెద్ద సైన్యమే పనిచేస్తుంది. 250 మంది అసెంబ్లీ సచివాలయ సిబ్బంది, మార్షల్స్, 300 మంది పోలీసులు, శాసనసభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేయడానికి వివిధ శాఖలకు చెందిన సుమారు 400 మంది సెక్షన్ ఆఫీసర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అసెంబ్లీకి వస్తారు. వారందరికీ ఓవర్ టైం అలవెన్స్, భోజనం, రవాణా ఖర్చు ప్రభుత్వానిదే. దీనికితోడు అసెంబ్లీ హాల్లో ఏసీలు, లైటింగ్, లైవ్ టెలికాస్ట్, వాటి నిర్వహణ సిబ్బంది, క్యాంటీన్, కాగితాల ముద్రణ ఖర్చులు అదనం. ఇవి కాకుండా సభ జరిగే రోజున ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి రోజువారీ భత్యం రూ. 2,000, ప్రయాణ భత్యం, హైదరాబాద్‌లో ఉచిత బంగ్లా, కారు, ఇద్దరు పీఏల జీతాలను ప్రభుత్వమే భరిస్తుంది. సభకు హాజరు కాకపోయినా జీతం వస్తుంది కానీ డైలీ అలవెన్స్ మాత్రం సభకు వస్తేనే లభిస్తుంది. ఇలా అన్నీ కలిపితే కేవలం ఒక రోజుపాటు (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా లెక్కన) రాష్ట్ర శాసనసభ నిర్వహణకు దాదాపు రూ. కోటి నుంచి రూ.కోటిన్నర దాకా ఖర్చవుతుంది. గతంలో ఒక బ్రీఫింగ్ మీటింగ్‌కే రూ. 13.59 లక్షలు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గతేడాది రాష్ట్ర అసెంబ్లీ 149 గంటలపాటు జరిగిందని పీఆర్ఎస్ నివేదిక చెబుతోంది. ఇదీ చదవండి :కొండా సురేఖకు ‘పెద్ద బాధ్యత’ ఏంటది? -
‘‘ప్రతి అర కి.మీ.కి వ్యర్థాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి’’
హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణకు పటిష్ఠ వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు ప్రతి అర కిలోమీటరుకు వ్యర్థాల సేకరణ కేంద్రాలు నెలకొల్పాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సూచించారు. కొత్తగా నిర్మించే షాపింగ్ కాంప్లెక్సులు, వాణిజ్య భవనాల్లో మహిళల కోసం ప్రత్యేక మరుగుదొడ్లను తప్పనిసరి చేయాలని కోరారు.శనివారం రాష్ట్ర శాసనసభలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు-2026’పై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. పర్యావరణ సుస్థిరత, వాతావరణ మార్పులపై కార్యాచరణ, లింగ సమానత్వం, సార్వత్రిక ప్రాప్యత, సమ్మిళిత పట్టణ రూపకల్పన, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలతో సమగ్ర కార్యాచరణ వ్యవస్థను ప్రతిపాదించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. వీటితోపాటు ఘన వ్యర్థాల సేకరణ, తరలింపు, నిర్మూలనకు స్పష్టమైన ప్రణాళికను రూపొందించాలని సూచించారు. ఒక నగరంలోకి ప్రవేశించే వారికి మొదట కనిపించే పరిసరాలే ఆ నగరంపై తొలి అభిప్రాయాన్ని కలిగిస్తాయని పద్మావతి రెడ్డి అన్నారు.పరిశుభ్రమైన రహదారులు, క్రమబద్ధమైన వ్యర్థాల నిర్వహణ, ప్రజలకు అందుబాటులో ఉండే పౌర సదుపాయాలు నగర అభివృద్ధికి ప్రధాన సూచికలని పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుంచి ఘన, జీవ వ్యర్థాలు వెలువడుతున్నాయని, నిర్మాణ పనుల ద్వారా శిథిల వ్యర్థాలు, ఆసుపత్రుల నుంచి జీవవైద్య వ్యర్థాలు, హోటళ్లు, వీధి ఆహార కేంద్రాల నుంచి ఆహార వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని వివరించారు. వాటి స్వభావానికి అనుగుణంగా సేకరించి, శాస్త్రీయ పద్ధతిలో తరలించి, సురక్షితంగా నిర్మూలించే వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.“మనిషి ఉన్న ప్రతి చోటా ప్రతిరోజూ వ్యర్థం ఉత్పత్తి అవుతుంది. అందువల్ల వ్యర్థాల నిర్వహణ అప్పుడప్పుడు చేపట్టే కార్యక్రమంగా కాకుండా ప్రతిరోజూ నిరంతరాయంగా కొనసాగే వ్యవస్థగా ఉండాలి” అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో రహదారుల పక్కన, పాదచారి మార్గాల మూలల్లో, ఖాళీ స్థలాల్లో చెత్తను పారవేస్తున్నారని చెప్పారు. కొద్దిరోజుల్లోనే అది భారీ చెత్త కుప్పగా మారి దుర్వాసన వెదజల్లడంతోపాటు వీధి కుక్కలు చేరడానికి కారణమవుతోందన్నారు. దీనివల్ల ప్రజారోగ్యంతోపాటు నగర పర్యావరణం, సౌందర్యం దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు నగర రూపకర్తలు, ఆర్కిటెక్టుల సహకారంతో ప్రతి అరకిలోమీటరుకు ఒక వ్యర్థాల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కేంద్రాలు సాధారణ చెత్త కుండీల మాదిరిగా కాకుండా నగర సౌందర్యంలో భాగంగా కనిపించేలా ఆకర్షణీయంగా, శాస్త్రీయంగా రూపకల్పన చేయాలన్నారు.ప్రజలు నడిచి వెళ్లగలిగే దూరంలో వ్యర్థాల సేకరణ కేంద్రాలు ఉంటే ఎక్కడపడితే అక్కడ చెత్త పారవేసే పరిస్థితి తగ్గుతుందని చెప్పారు. పురపాలక సంస్థలకు వ్యర్థాల సేకరణ, తరలింపు, నిర్వహణ కూడా సులభతరం అవుతుందన్నారు. నగరం నివసించడానికి ఆరోగ్యకరంగా, చూడటానికి ఆహ్లాదకరంగా ఉండాలంటే పరిశుభ్రత విషయంలో ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమలు చేయాలని కోరారు. -
TG: ‘గత ప్రభుత్వం తప్పిదాల వల్లే ఇబ్బందులు’
హైదరాబాద్ : తాము తెలంగాణ ప్రజల ఆస్తుల హక్కుల రక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడితే, తాము వాటిని సరి చేసి ప్రజా ఆస్తుల హక్కుల పరిరక్షిస్తున్నామన్నారు. ఈరోజు(శనివారం, సెప్టెంబర్ 12వ తేదీ) తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. కేసీఆర్ తన స్వప్రయోజనాలకే పనిచేశారని విమర్శించారు. ‘గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ లేకుండా గత ప్రభుత్వం చేసింది. ధరణి పేరుతో వారు ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారు. పదేళ్లు అధికారంలో ఉండి 22-A పేరుతో పేదల కడుపు కొట్టారు. ధరణి పోర్టల్ వల్ల బీఆర్ఎస్ నేతలకే లాభం చేకూరింది. ధరణి వల్ల ప్రతి జిల్లాలోనూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మా ప్రభుత్వం వచ్చే నాటికి ధరణిలో 2.4 లక్షల సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. ధరణిలో ఉన్న సమస్యలను చెప్పినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ధరణి వచ్చిన తర్వాత మూడు నెలలు రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ధరణి కాంట్రాక్ట్‌లను వారి తొత్తులకే కట్టబెట్టారు. అనేక మంది రైతులు ధరణి వల్ల నష్టపోయారు’ అని ఆరోపించారు.ఇక తమ ప్రభుత్వం వచ్చాక తెచ్చిన భూభారతి పోర్టల్ గురించి అనేక మందితో చర్చించిన తర్వాతే ముందుకెళ్లామన్నారు. మూడు నెలల్లోనే భూభారతి చట్టానికి విధివిధినాలను రూపొందించామన్నారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టంతోనే భూభారత చట్టం పనిచేస్తుందన్నారు.ఇదీ చదవండి: సీఎంగా తలసాని.. ఉత్తమ్‌గా పల్లా.. మాక్ అసెంబ్లీలో నవ్వులే నవ్వులు! -
బీఆర్ఎస్ సభ్యుల్ని సస్పెండ్ చేసిన స్పీకర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసన సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల్ని సస్పెండ్ చేశారు. ఈ సెషన్ మొత్తానికి ఈ సస్పెన్షన్ వర్తిస్తుందని ప్రకటించారు. సభా కార్యకలాపాలకు అడ్డుపడడమే ఇందుకు కారణంగా ఆయన తెలిపారు.బుధవారం మూడో రోజు సమావేశాలు ప్రారంభం కాగానే.. సభా కార్యకలాపాలకు బీఆర్ఎస్ సభ్యులు అడ్డుపడ్డారు. మంత్రులు మాట్లాడుతున్న టైంలో.. స్పీకర్ పోడియంను చుట్టు ముట్టి నినాదాలు చేశారు. నిన్న కేసీఆర్ ఫామ్‌హౌజ్ ముట్టడికి కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రయత్నించిన క్రమంలో.. తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలంటూ (We Want Justice) నినాదాలు చేశారు.ఆ సమయంలో అభ్యంతరం వ్యక్తం చేసిన స్పీకర్.. వెళ్లి సీట్లలో కూర్చోవాలని బీఆర్ఎస్ సభ్యుల్ని కోరారు. అయితే వాళ్లు ఆ మాట వినలేదు. దీంతో వాళ్లను సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పీకర్‌ను కోరారు. ఆ వెంటనే వాళ్లను సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. సస్పెండ్ అయిన వాళ్లలో.. కేటీఆర్, హరీష్‌రావు, కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, సబితా ఇంద్రారెడ్డి, అనిల్ జాదవ్, కోవాలక్ష్మీ మాణిక్‌రావు, గంగుల కమలాకర్, సంజయ్ కుమార్, సునీతా లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని, చింత ప్రభాకర్, ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు 22 మంది ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ తర్వాత సభ కాసేపు వాయిదా పడింది. ఆ సమయంలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే స్పీకర్ ఛాంబర్ వద్ద మార్షల్స్ కేటీఆర్, హరీశ్‌రావును అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.మండలి నుంచి వాకౌట్ఇటు శాసనమండలిలో తమ ఇద్దరు సభ్యుల సస్పెన్షన్‌పై ఓటింగ్ నిర్వహించాలని చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కోరింది. అందుకు ఆయన అనుమతించలేదు. తమను మాట్లాడేందుకు అనుమతించకపోవడం దారుణమంటూ మండలి విపక్ష నేత మధుసూధనాచారి నిరసన వ్యక్తం చేశారు. ‘‘ప్రభుత్వం తన తప్పును అర్థం చేసుకొని యావత్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. సభ ఉన్నత విలువలు పాటించాలి. మా అధినేత కేసీఆర్ ఇంటి ముందు చావు డప్పు కోడతారట. ఎక్కడైనా ఇలా ఉంటుందా?. తెలంగాణకు అనేక సేవలు అందించిన మహానుభావుని చావు కోరుతారా?. దీని వెనుక ప్రభుత్వ కుట్ర ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి...మా సభ్యులను సభ నుండి సస్పెండ్ చేశారు. నిన్న సభలోకి వస్తె వారికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేయాలి. మా సభ్యులు సభలోకి వచ్చేవరకు మా నిరసన కొనసాగుతుంది. మా సభ్యుల అభిప్రాయాలు తీసుకోవాలి. మమల్ని ఎత్తివేస్తారా?. ఇది ప్రీ ప్లాన్డ్ కుట్ర. నిన్న పెట్టిన తీర్మానం పై చర్చ జరగాలి అని డిమాండ్ చేశారు. అయినా చైర్మన్ అంగీకరించకపోవడంతో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.ఇదీ చదవండి: ఇది ఫామ్‌హౌజ్‌లో జరిగిన కుట్రే! -
‘ఫాంహౌస్‌లో కుట్ర చేసి సభను అడ్డుకున్నారు’.. అసెంబ్లీలో సీఎం రేవంత్
మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్..అణిచివేతకు,దోపిడీకి,పరాయిపాలను కాంగ్రెస్ పుట్టింది సీఎం రేవంత్ అణిచివేతకు,వివక్షతకు గురైన జాతులకు రిజర్వేషన్లు ఇవ్వాలని సంకల్పించిందిఅంబేద్కర్ రచిచించిన రాజ్యంగా మనదేశం బలంగా నిలబడగలిగేలా చేసిందిపాకిస్థాన్,బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి ఖర్గే తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారుఖర్గే చిన్న తనంలో రజాకార్ల దాడిలో తల్లిని కోల్పోయారుఆర్ఎస్ఎస్ శుద్దీకరణ కార్యక్రమాన్ని సభ ఖండిస్తోందిశుద్ధీకరణ కార్యక్రమంలో పాల్గన్న వారిపై చర్యలు తీసుకోవాలిఫాంహౌస్లో కుట్ర చేసి సభను అడ్డుకున్నారుధరణలో లోపాలు,22ఏపై రాద్ధాంతాలు సభలో చర్చించాలని అనుకున్నాంఅప్పులు,తప్పులు మీద చర్చ జరిగితే సమాధి అవుతారని కేసీఆర్ భయపడ్డారు భావోద్వేగానికి ఉసిగొల్పి దాడులు చేయించారుమీపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారికి ఉగ్రవాదులకు పెద్దతేడా ఏంలేదుస్పీకర్ కుర్చీని అవమానించేలా మాట్లాడారుఅనాదిగా ఈ సమాజం మహిళలను పూజిస్తోంది. అలాంటి తెలంగాణ నేల మీద తల్లిని అవమానించేలా మాట్లాడారుమా సభ్యులు,నేతలు ఉన్మాదంగా ఫాంహౌస్ దగ్గరకు వెళ్లలేదుమాదిగ బిడ్డలకు డప్పు జీవితంలో భాగంకేసీఆర్ ఫాంహౌస్ దగ్గర డప్పు కొట్టడం నిరసనలో ఓ భాగంకేసీఆర్ను అసభ్య పద జాలంతో దూషించాలనే ఆలోచన మాకు లేదుమనసులోని భావనను డప్పుతో చెప్పాలని అనుకున్నాందొరా.. నీ దొర అహంకారంతో మమ్మల్ని అవమానించకుచెప్పులు కుట్టిన చేతులు డప్పు కొట్టడమే కాదు రాష్ట్రాన్ని పాలిస్తాయిడప్పు కొట్టి నిరసన చేపట్టడం నేరమా?కేసీఆర్‌కు బాధ్యత ఉందని ప్రజలను అర్ధం చేసుకోవాలిమధ్యయుగాల్లో చక్రవర్తులు కూడా ఇంత నీచంగా వ్యవహరించలేదుప్రజా సమస్యలపై కాంగ్రెస్ సస్పెన్షన్ ఇది: హరీష్మాజీ మంత్రి హరీష్ రావు రియాక్షన్..ఇది బీఆర్ఎస్ సస్పెన్షన్ కాదు.. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ సస్పెన్షన్ప్రజలు “మా సమస్య గురించి మాట్లాడండి” అంటుంటే..రేవంత్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ని బయటకు పంపండి అంటున్నాడు.నియంతృత్వం ఎంత పెరిగితే.. ప్రజా తిరుగుబాటు అంత బలపడుతుంది అన్న విషయం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి.మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్..కాంగ్రెస్ పార్టీలో భట్టి ముఖ్యమంత్రి అయితే మొదట సంతోష పడేది బీఆర్ఎస్.చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీకి లేదుమల్లారెడ్డి తిరుమలలో ఉంటే ఎలా సస్పెండ్ చేస్తారు?.స్పీకర్ ఒక పేరు.. అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి ఒక పేరు చదివారు.చావు డప్పు కొట్టడానికి దళితులు వెళ్తే నర్సారెడ్డి ఎవరు?యాదాద్రిలో అందరి ముందే భట్టి విక్రమార్కను కింద కుర్చోబెట్టారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కుల అహంకారం ఉంది..తెలంగాణలో శాంతిభద్రతలు సీఎం పరిధిలోకి రావా?లా అండ్ ఆర్డర్ సరిచేయాల్సిన బాధ్యత సీఎంపై లేదా?సభలో మాట్లాడే అవకాశం మాకు ఇవ్వలేదు: బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు.సభ బయట కూడా మాట్లాడే స్వేచ్ఛ లేదా?స్పీకర్‌ను కలుస్తాం.. అంటే టైం ఇవ్వడం లేదు.బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫ్లకార్డులు తెస్తే ఎందుకు ఆపడం లేదు..బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాత్రం కనీసం అసెంబ్లీలో నిలుచోనివ్వడం లేదు.అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి సునీతా లక్ష్మారెడ్డి , ఎమ్మెల్యే కోవా లక్ష్మీ చిట్ చాట్మహిళలపై దాడి జరిగితే కనీసం పట్టింపు లేదుస్పీకర్ బాధపడ్డారు అని తెలుసుకొని కేసీఆర్ విచారం వ్యక్తం చేయాలని మాకు చెప్పారు.మంత్రులు అమ్మ గురించి మాట్లాడుతున్నారు.. మరి మేము కూడా మహిళలమే కదా!మాపై దాడి జరిగితే దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సానుభూతి వస్తుంది.. ఫోన్ చేసి చెప్తున్నారు.సభ జరిగినప్పుడు బయట ఏదైనా ఘటన జరిగితే అసెంబ్లీలో ప్రకటన చేస్తారు.కానీ ఇక్కడ అసెంబ్లీ ఆవరణలో జరిగితే కనీసం ప్రకటన లేదు.దెబ్బ తగిలింది మాకు.. మా గురించి మాట్లాడడం లేదు.వాళ్ళు ఏమో అమ్మ గురించి.. వాళ్ళ అక్కల గురించి ఆలోచించారుసభలో మాట్లాడేందుకు మాకు అవకాశం ఇవ్వకుండా నాటకాలు అంటున్నారు.మాకు జరిగిన అవమానంపై అధికార మహిళా సభ్యులు మా వైపు చూడలేదు.మాపై ఇష్టం వచ్చినట్లు మగ పోలీసులు ప్రవర్తించారుసుధీర్ రెడ్డి, నవీన్ రెడ్డి లేకుంటే మేము కింద పడిపోయే వాళ్ళంహరీష్ రావు, కేటీఆర్ చుట్టూ ఆడ పోలీసులను పెట్టారు.మహిళ శాసన సభ్యుల చుట్టూ మగ పోలీసులను పెట్టి రాజకీయం చేశారు.మేము మహిళలమే కదా.. మాకు జరిగిన అవమానంపై సభలో ఎందుకు చర్చ పెట్టరు?దళితుల ఆత్మ గౌరవం తెలంగాణ ఆత్మగౌరవమని భట్టి విక్రమార్క అంటున్నారుమహిళల ఆత్మ గౌరవం తెలంగాణ ఆత్మ గౌరవం కాదా!మాకు జరిగిన అవమానంపై సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలి.ఎక్కడ ఏం జరిగిన వెంటనే ప్రభుత్వానికి సమాచారం వస్తుంది.మాపై జరిగిన దాడి గురించి ప్రభుత్వానికి ఎందుకు సమాచారం రాలేదు.సీఎంకు మహిళల గురించి పట్టింపు లేదు .శాంతి భద్రతలు కాపాడాల్సిన సీఎం మా మనోభావాలు దెబ్బతినేలా వ్యవహారిస్తున్నారు కాసేపట్లో లోక్‌భవన్‌కు బీఆర్ఎస్ నేతలు..ఎల్పీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీభవిష్యత్తు కార్యాచరణపై చర్చకాసేపట్లో లోక్‌భవన్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగవర్నర్ను కలవనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుఅసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్తత.బీఆర్ఎస్ల్వీలోకి వెళ్లేందుకు ఎమ్మెల్యేల ప్రయత్నం.కేటీఆర్, హరీష్‌రావును అడ్డుకున్న మార్షల్స్.స్పీకర్‌ను కలిసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రయత్నం.అడ్డుకున్న మార్షల్స్‌పై ఎమ్మెల్యేల ఆగ్రహం. స్పీకర్‌ను కలిసేందుకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.స్పీకర్ చాంబర్ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆపేసిన మార్షల్స్సస్పెండ్ అయ్యారు కాబట్టి ఎల్పీ కార్యాలయంలోకి వెళ్లొద్దన్న చీఫ్ మార్షల్ కరుణాకర్.స్పీకర్‌ను కలవనీయకపోవడంతో మరికాసేపట్లో మీడియా పాయింట్ వద్ద మాట్లాడనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ చిట్ చాట్.బీఆర్ఎస్ రెండు అంశాలపై సభలో ఆందోళన చేసింది.మహిళలపై దాడి చేస్తే నిరసన చేయవద్దా?మాజీ సీఎం, తెలంగాణ సాధించిన నేత చావు కోరుకుంటే ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోరా?సెషన్ మొత్తం ఎలా సస్పెండ్ చేస్తారు?దళితుల పట్ల ప్రేమ ఉన్నట్లు కాంగ్రెస్ ప్రవర్తిస్తుంది.దళితుల పట్ల ప్రేమ ఉంటే భట్టి విక్రమార్కను సీఎం చేయాలి. తెలంగాణ అసెంబ్లీ కాసేపు వాయిదా.. మండలి నుంచి బీఆర్ఎస్ వాకౌట్శాసనమండలి నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుసభలో మాట్లాడటానికి మాకు అవకాశం ఇవ్వడం లేదు..అందుకే మేము వాకౌట్ చేస్తున్నాం: మండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి.ప్రభుత్వం తన తప్పును అర్థం చేసుకొని యావత్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి..సభ ఉన్నత విలువలు పాటించాలి..మా అధినేత కేసీఆర్ ఇంటి ముందు చావు డప్పు కొడతారట.ఎక్కడైనా ఇలా ఉంటుందా?.దీని వెనుక ప్రభుత్వ కుట్ర ఉంది..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.మా సభ్యులను సభ నుండి సస్పెండ్ చేశారునిన్న సభలోకి వస్తే వారికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదుసభ్యుల సస్పెన్షన్ ఎత్తివేయాలిమా సభ్యులు సభలోకి వచ్చేవరకూ మా నిరసన కొనసాగుతుంది..మా సభ్యుల అభిప్రాయాలు తీసుకోవాలినిన్న పెట్టిన తీర్మానం పై చర్చ జరగాలి.. వీరిపై సస్పెన్షన్..కేటీఆర్, హరీష్‌రావు, కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, సబితా ఇంద్రారెడ్డిఅనీల్ జాదవ్, కోవాలక్ష్మీ మాణిక్‌రావు, గంగుల కమలాకర్, సంజయ్ కుమార్, సునీతా లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డిమల్లారెడ్డి, తలసాని, చింత ప్రభాకర్, ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సస్పెండ్..శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయాలి: శ్రీధర్బాబుఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేసిన స్పీకర్కేటీఆర్, హరీష్‌రావు, కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, మాధవరం కృష్ణారావు సస్పెండ్మొత్తం 22 మంది సభ్యులపై సస్పెన్షన్. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనకేసీఆర్ నివాసంపై దాడికి యత్నించారని ఆందోళన జస్టిస్ కావాలంటూ డిమాండ్. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..రాహుల్ గాంధీపైన విమర్శలు చేస్తే నేను ఒప్పుకోము.ఎవరి చావును కాంగ్రెస్ పార్టీ కోరుకోదు.కేసీఆర్ ఆరోగ్యంగా వందేళ్ళు బతకాలని కోరుకుంటాం.ప్రజలకు కేసీఆర్ సేవ చేయాలని కోరుకుంటాం.కరీంనగర్లో కేటీఆర్.. రాహుల్ గాంధీ ఎక్కడ చచ్చావు అని అన్నారుదళితులు నడిచిన చోట శుద్ధి చేశారు.. ఏ కాలంలో ఉన్నామో తెలియడం లేదు.సభ సజావుగా నడిచేలా ప్రతిపక్షం సహకరించాలిబీఆర్ఎస్ ఆందోళన విరమించాలి.లేదంటే సభ నడపడానికి మేము కార్యాచరణ తీసుకుంటాంశాసనసభలో కొనసాగుతున్న బీఆర్ఎస్ ఆందోళనపోడియం వద్దకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలువీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలుడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్..అసెంబ్లీలో సభాపతితో వాగ్వాదం చేయడం కరెక్ట్ కాదు.సభ్యసమాజం ఆశ్చర్యపోయే విధంగా బీఆర్ఎస్ నాయకుల తీరు ఉంది.బీఆర్ఎస్ చేసిన అవమానాలను భరించడానికి ఇక ఓపిక లేదు.ఇంకా ఎంతకాలం దళితులను అవమానిస్తారు?బీఆర్ఎస్ సవాల్‌కు భయపడే వాళ్ళు ఎవరూ లేరు.మీ బెదిరింపులకు ఉడత ఊపులకు ఎవ్వరూ భయపడే వాళ్ళు లేరు!ఇలా దాడులు చేసి బతుకుదాం అనుకుంటున్నారు కేటీఆర్ కామెంట్స్..మాపై కేసులు పెట్టడం సహజమేమా ఫొటోలను ఏఐ ఉపయోగించి మార్ఫింగ్ చేసి వాడుతున్నారుసైబర్ క్రైమ్‌లో మేము కూడా ఫిర్యాదు చేస్తాం.శాసన మండలి..మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి కామెంట్స్..మా సభ్యులపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలిసభ్యుల వాదనలను వినిపించేలా అవకాశం ఇవ్వాలికుట్రలో భాగంగానే పోలీసులతో ఆ విధంగా వ్యవహరించేలా చేశారుభట్టి విక్రమార్క కామెంట్స్..బీఆర్ఎస్ దుర్మార్గాలను రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు.బీఆర్ఎస్ నేతలు స్పీకర్ తల్లిని దూషించారు.ఎర్రవల్లిలో బీఆర్ఎస్ చేపట్టిన శుద్ధి ఘటనపై సభలో చర్చ జరగాలి.రోడ్డుపై దళితులు నడిచారని పసుపు నీళ్లతో శుద్ధి చేసిన దుర్మార్గపు పార్టీ బీఆర్ఎస్.బీఆర్ఎస్ సభ్యుల ప్రవర్తన మంచిది కాదు.అంతా చేసి సభకు వచ్చి న్యాయం కావాలంటారా? ఆత్మ గౌరవంతో తెలంగాణ ఏర్పడింది.తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారు?గత పదేళ్లలో ప్రతిపక్షాలు పొడియంలోకి వచ్చి ఆందోళన చేయలేదు.బీఆర్ఎస్ చేసిన శుద్ధి కార్యక్రమంపై సభలో చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్పై కాంగ్రెస్ నేతల ఆగ్రహంసభలో బీఆర్ఎస్ ఆందోళనపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్శుద్ధి పేరిట బీఆర్ఎస్ చేసిన కార్యక్రమంపై చర్చ జరపాలని మంత్రి డిమాండ్దళితులు ఆందోళన చేస్తే శుద్ధి కార్యక్రమం చేస్తారా?దళితులను ప్రతిక్షణం అవమానిస్తున్నారుబీఆర్ఎస్ ఆందోళనపై స్పీకర్ అసంతృప్తిసీనియర్ ఎమ్మెల్యేగా ఉండి పొడియం ముందు ఆందోళన ఎలా చేస్తారు?ఏ అంశం అయినా రాత పూర్వకుండా ఇస్తే పరిశీలన చేస్తా: స్పీకర్. అసెంబ్లీలో గందరగోళం.. అసెంబ్లీ మీడియా పాయింట్..ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ కామెంట్స్.దళితులను అవమానించినందుకు ముందు శాసనసభలో క్షమాపణ చెప్పి సభలోకి అడుగు పెట్టాలిలేదంటే వాళ్ళను సభలోకి అడుగుపెట్టనీయంకేసీఆర్కు సంబంధం లేదంటే నాకు సంబంధం లేదని చెప్పాలిబీఆర్ఎస్ అనేది అంటరాని పార్టీబీఆర్ఎస్ను తరిమి కొట్టడమే మా లక్ష్యంబీఆర్ఎస్లో ముగ్గురో లేక కోటి మంది కోసం పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీనో తేల్చుకుందాంకొట్లాడాలి కానీ బట్టలు విప్పుకుని తిరగాలా?అసెంబ్లీ జరుగుతున్న సందర్భంగా ఉనికి కోసం అలజడులు సృష్టిస్తున్నారుదళితులతో పెట్టుకున్న ఏ పార్టీ కి మనుగడ లేదుప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ కామెంట్స్దళితులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం దారుణంబీఆర్ఎస్ పార్టీ దళితులపై చిన్న చూపు చూస్తుందిదళిత స్పీకర్‌ను అవమానించారుఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి క్షమాపణ చెప్పాలిలెందటే బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీగా చూడాల్సి వస్తుంది. మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో రగడ..అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనమంత్రి అడ్లూరి లక్ష్మణ్ కామెంట్స్..దళితులకు బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలికేసీఆర్ సభకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.కాసేపట్లో మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.ప్రశ్నోత్తరాలతో సభ మొదలుకానుంది.నేడు పంచాయతీరాజ్ సవరణ చట్టానికి సంబంధించిన కీలక బిల్లును మంత్రి సీతక్క సభలో ప్రవేశపెట్టనున్నారు.తెలంగాణ పంచాయతీరాజ్ నాలుగో సవరణ బిల్లు-2026పై సభలో చర్చ జరగనుంది.గ్రామీణపాలన, పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన అంశాల నేపథ్యంలో ఈ బిల్లుపై అధికార, విపక్షాల మధ్య చర్చ కొనసాగనుంది. బీఆర్ఎస్ వాయిదా తీర్మానం..మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాష్టీకం,కేసీఆర్ నివాసం వద్ద పోలీసుల సమక్షంలో ర్యాలీ,కేసీఆర్ చనిపోవాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల బెదిరింపులు,రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చిన బీఆర్ఎస్బీజేపీ వాయిదా తీర్మానం..అసెంబ్లీలో రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్,ఉద్యోగుల పెండింగ్ డీఏల చెల్లింపులపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చిన బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి -
లోక్‌భవన్‌కు బీఆర్ఎస్.. కాంగ్రెస్ కౌంటర్ యాక్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో అసెంబ్లీ సమావేశాల వేడి కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ.. బీఆర్ఎస్ నేతలు నేడు గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలవాలని నిర్ణయించింది. గత రెండు రోజులుగా కొనసాగిన పరిణామాలపై ఆయనకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటు అధికార కాంగ్రెస్ కౌంటర్ యాక్షన్‌కు సిద్దమైంది. ఇవాళ మధ్యాహ్నం 1.45 గంటలకు లోక్‌భవన్‌కు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం వెళ్లాల్సి ఉంది. అయితే అనుకున్న టైం కంటే అరగంట ముందుగానే గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. పది మంది ఎమ్మెల్యేల బృందం ఆయన్ని కలవనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా పోలీసుల జులుం.. మహిళా ఎమ్మెల్యేలతో ప్రవర్తించిన తీరు, ఎమ్మెల్సీల అరెస్టులు.. నిన్న ఎర్రవల్లికి వెళ్తుండగా అడ్డగింతలు.. ఇలా ఇటీవల చోటుచేసుకున్న దాడుల ఘటనలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే బీఆర్ఎస్ నేతల ఫిర్యాదులపై కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్‌కు సిద్ధమవుతోంది. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యవహారాన్ని రేవంత్ ప్రభుత్వం తీవ్రంగా భావిస్తోంది. మధుతో పాటు నవీన్‌కుమార్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయించే దిశగా.. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఇటు ఈ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభకు హాజరై క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అవసరమైతే.. అప్పటిదాకా బీఆర్ఎస్ నేతలకు మైక్ ఇవ్వకూడదని స్పీకర్‌ను కోరాలని చూస్తోంది. నేడు మండలిలో కీలక చర్చమరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు మూడో రోజుకు చేరుకోనున్నాయి. శాసనమండలిలో తాతామధు వ్యవహారంపై చర్చ జరగనుంది. ఈ చర్చలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా పాల్గొననున్నారు. ఇప్పటికే ఆయన శాసనసభలో ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఉద్దేశించి.. తాతా మధు, నవీన్‌కుమార్ రెడ్డిలు అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇందుకుగానూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆ ఇద్దరూ అరెస్ట్ అయ్యారు. ఒకవైపు బీఆర్ఎస్ నేతలు గవర్నర్‌ను కలిసి దాడుల ఘటనలపై ఫిర్యాదు చేయనుండగా.. మరోవైపు అసెంబ్లీ, మండలి సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదానికి అవకాశం ఉండటంతో తెలంగాణ రాజకీయాల్లో నేడు కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఏం తమాషా చేస్తున్నారా? లోపలేస్తా.. -
అసలు హరీశ్‌రావుకు మైక్ ఇవ్వొద్దు.. కానీ ఇచ్చా
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మొదటిసారి మీడియా ముందుకొచ్చారు. రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం తన చాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి మంగళవారం సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్కు చెందిన హరీశ్‌రావుకు మైక్ ఇవ్వకూడదని, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా అధికార బాధ్యతలు నిర్వర్తిస్తుంది కాబట్టి మైక్ ఇచ్చానని చెప్పారు. అయితే, సోమవారం అసెంబ్లీ గేటు బయట జరిగింది అనుకోకుండా అయితే, హరీశ్‌రావు సభలో మాట్లాడింది మాత్రం తనను మనస్తాపానికి గురిచేసిందన్నారు. జరిగిన దానికి ప్రజాస్వామ్య పద్ధతిలో క్షమాపణలు చెబుతారేమో అనుకున్నానని, కానీ హరీశ్‌రావు అందుకు విరుద్ధంగా పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. అందుకే మొదటిసారి కోపానికి వచ్చానని, మనస్తాపం చెందానని, సభలో కూర్చోవాలని అనిపించలేదని, మంగళవారం ఒక్కరోజు ప్యానెల్ స్పీకర్‌తో సభను నడిపించాలని నిర్ణయించినట్టు చెప్పారు. పదేళ్లు మంత్రిగా హరీశ్‌రావు ఉన్నాడని, ఆయన కూడా ఇలా మాట్లాడడం బాధ కలిగించిందన్నారు. 1987 నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఇలాంటి ఘటనను ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. తననుద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడిన మాటలకు రాష్ట్రమంతా ఊగిపోతోందని, దళిత సంఘాలు కోపంగా ఉన్నాయని చెప్పారు. తాతా మధు మాట్లాడిన ప్రదేశం అసెంబ్లీ పరిధిలోనే ఉంటుందని, ఆ విషయం బీఆర్ఎస్ వారికి తెలియదనుకుంటా అని వ్యాఖ్యానించారు. తాము కేసీఆర్‌లాగా చేయాలనుకుంటే అప్పట్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లను చేసినట్టు తాతా మధు, కౌశిక్‌రెడ్డిలను కూడా సభ నుంచి బయటకు పంపించేవారమన్నారు. అక్కడ కనపడుతోంది అసెంబ్లీ గేటు బయట బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తనకు సంబంధించి విచారణకు ఆదేశించామని, నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పీకర్ ప్రసాద్‌కుమార్ స్పష్టం చేశారు. అయితే, అసెంబ్లీ గేటు బయట కేటీఆర్, హరీశ్‌రావు, నవీన్‌రెడ్డిలు పోలీసులు కొట్లాడింది, తాతా మధు మాట్లాడింది ప్రత్యక్షంగా కనపడుతోందని చెప్పారు. కానీ, మహిళా ఎమ్మెల్యేల విషయంలో ఎప్పుడు ఏం జరిగిందో అర్థం కావడం లేదని, అందుకే విచారణ చేయమని చెప్పానన్నారు. బీఆర్ఎస్ సభ్యులు పైనుంచి కింది వరకు నల్ల దుస్తులు వేసుకొని వచ్చినా అభ్యంతరం లేదని, కానీ ఆ దుస్తులపై ఉన్న రాతలు అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధమన్నారు. అయితే, 2014కు ముందు కాంగ్రెస్ హయాంలో ఉన్న నిబంధనలను తొలగించి తెలంగాణ ఏర్పాటయ్యాక కేసీఆర్ కొత్తగా అసెంబ్లీ రూల్స్ తెచ్చాడని, ఆ నిబంధనలనే తాము అమలు చేస్తున్నామని, ఆ నిబంధనల ప్రకారమే చెబుతున్నామన్నారు. రాహుల్‌గాంధీ నల్లటీషర్టుపై ఆదానీ అని రాసుకొని వెళ్లలేదని, కేవలం నల్ల టీషర్టు వేసుకొని మాత్రమే పార్లమెంటులోకి వెళ్లారని చెప్పారు. ప్రభుత్వమే అడిగింది తాజా పరిణామాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని సభలో ప్రభుత్వమే డిమాండ్ చేసిందని స్పీకర్ చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో తనకు కేసీఆర్ ఫోన్ చేయలేదన్నారు. సభ ప్రారంభానికి ముందు తానే కేసీఆర్‌కు ఫోన్ చేశానని, సభకు రావాలని అడిగానని చెప్పారు. ఆరోగ్యం సహకరిస్తే వస్తానని కేసీఆర్ తనతో చెప్పారన్నారు. తాను ప్రతిసారి అసెంబ్లీ సమావేశాలకు ముందు ప్రతిపక్ష నేతలకు ఫోన్ చేసి సభకు రావాలని కోరుతానని వెల్లడించారు. తాతా మధు, నవీన్‌రెడ్డిలు అసెంబ్లీలో సభ్యులు కానప్పటికీ చర్యలు తీసుకునే అధికారం తనకు ఉందని, కానీ అలా చేయడం లేదని, చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో తీర్మానం చేసి మండలి చైర్మన్‌కు పంపుతామని స్పీకర్ ప్రసాద్‌కుమార్ చెప్పారు. -
అసెంబ్లీలో స్పీకర్-హరీశ్‌రావు-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల రెండో రోజు.. నిన్నటి పరిణామాల నేపథ్యంగా హాట్ హాట్‌గా మొదలైంది. నల్ల బ్యాడ్జీలతో సెషన్‌కు హాజరైన బీఆర్ఎస్ సభ్యులు.. నిరసనకు దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మధ్య మాటల యుద్ధం నడిచింది. మహిళా ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడం దారుణం. నిన్న మా పట్ల పోలీసులు దురుసుగా పవ్రర్తించారు. సబితా ఇంద్రారెడ్డి గొంతు పిసికారు. సునీతా లక్ష్మారెడ్డి చీరలాగి అవమానించారు. కలియుగ దుశ్శాసనుడిలా రేవంత్ వ్యవహరించారు. అసెంబ్లీ కౌరవసభగా మారింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంతో.. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. నా తల్లిదండ్రులను అవమానకరంగా మాట్లాడారు. బీఆర్ఎస్ సభ్యులు నా తల్లిని అసభ్యంగా దూషించారు. సునీత, సబితా, కోవా లక్ష్మి అంటే నాకు గౌరవం. వాళ్లు నాకు తోబుట్టువులతో సమానం. సబితమ్మకు జరిగిన దానిపై నేనే విచారణ చేయమని చెప్పా. మీ తల్లిని అనలేదు హరీశ్.. నా సంగతి ఏంటి?. ముందు నన్ను అవమానించిన అంశంపై మాట్లాడూ.. అంటూ స్పీకర్ మాట్లాడారు. ఆ సమయంలో.. చర్చ జరగకుండా డ్రామాలు చేస్తున్నారని కాంగ్రెస్ సభ్యులు ఒక్కొక్కరిగా బీఆర్ఎస్పై మండిపడ్డారు. దళిత స్పీకర్ పట్ల అమానుషంగా వ్యవహరించారని.. జరిగిన దానిపై క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారని చూడకుండా.. చొక్కాలు విప్పి ముందుకు రావడం ఏంటని? సీతక్క మండిపడ్డారు. నిన్నటి పరిణామాలపై సమగ్ర విచారణ జరపాలని స్పీకర్‌ను కోరారామె. ఆ సమయంలో హరీశ్ రావు మరోసారి జోక్యం చేసుకుని.. స్పీకర్‌గా మీపై మాకు గౌరవం ఉంది. మీ పట్ల వ్యాఖ్యలపై మా ఎమ్మెల్సీ నిన్ననే విచారం వ్యక్తం చేశారు. మేం కూడా విచారం వ్యక్తం చేస్తున్నాం. విచారం వ్యక్తం చేశాక.. దీనిపై రాద్ధాంతం అవసరమే లేదు. కాంగ్రెస్‌కు నిజంగా గిరిజనుల మీద ప్రేమ ఉంటే..ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ ఎందుకు చేయలేదు?.. అని హరీశ్ రావు అన్నారు. అయితే హరీశ్‌రావు వైఖరి స్పీకర్నే బెదిరించినట్లు ఉందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌పై జరిగిన దానిని పక్కన పెట్టాలట. స్పీకర్‌ను డిక్టేట్ చేయడం ఏంటి?. స్పీకర్ ఇలా చేయొద్దు.. అలా చేయొద్దు అని చెప్పడానికి వాళ్లెవరూ? అంటూ బీఆర్ఎస్ సభ్యులపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి పరిణామాలపై దర్యాప్తు జరుగుతోందని.. మహిళా ఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించిన అధికారులపై కచ్చితంగా చర్యలు ఉంటాయని అన్నారాయన. -
రణరంగం.. తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డు కోవడం తోపులాటకు దారితీసింది. నేతలు కింద పడిపోవడం, అస్వస్థతకు గురికావడం, నిరసనలు, నినాదాలు, అదుపులోకి తీసుకోవడం వంటి ఘటనలకు దారి తీసింది. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ మండిపడింది. సభలో అడుగు పెట్టక ముందే తమను అడ్డుకుని, తమ పార్టీ సభ్యులపై పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడిందని ఆరోపించింది. పోలీసులు తమపై అనుచితంగా ప్రవర్తించారని, మహిళా ఎమ్మెల్యేల గొంతు పిసికారని, చీరలు లాగారనే ఆరోపణలతో వివాదం మరింత ముదిరింది. ఇది శాసనసభా? కౌరవసభా? అని బీఆర్ఎస్ నిలదీసింది. మరోవైపు పోలీసులతో జరిగిన వాగ్వాదం సందర్భంగా శాసనసభ స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అధికార పక్షం మండిపడింది. సీఎం రేవంత్‌రెడ్డి శాసనసభలో ఈ మేరకు ప్రకటన చేశారు. సదరు సభ్యుడితో రాజీనామా చేయించి, ప్రతిపక్ష నేత బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ సభ్యులు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే తమపై జరిగిన దాడికి సీఎం రేవంత్‌రెడ్డే బాధ్యత వహించాలని, హోంమంత్రిగానూ వ్యవహరిస్తున్న ఆయనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశాన్ని ఆ పార్టీ బహిష్కరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి వెళ్తున్న క్రమంలో చోటుచేసుకున్న ఘటనలు అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నడుమ సభ లోపలా, బయటా ఆరోపణలు, విమర్శలు, పరస్పర సవాళ్లకు తెరతీశాయి. విలపిస్తున్న సునీతారెడ్డిని ఓదారుస్తున్న సబితారెడ్డి టీషర్టు విప్పి లోనికి అనుమతించాలన్న హరీశ్‌రావు సోమవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ఎదురుగా గన్‌పార్కు వద్ద ఉన్న అమరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు నేతృత్వంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాలకు హాజరయ్యేందుకు నల్లని టీషర్టులు ధరించి, నినాదాలు చేస్తూ అసెంబ్లీ మెయిన్ గేటు వద్దకు చేరుకున్నారు. ‘హామీల అమల్లో కాంగ్రెస్ వైఫల్యం.. వెయ్యి రోజుల పాలన నిష్ఫలం’ అంటూ టీషర్టులపై నినాదాలు ఉండటంతో పోలీసులు అభ్యంతరం తెలిపారు. బీఆర్ఎస్ సభ్యులు లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో మెయిన్ గేటు వద్ద బైఠాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అసెంబ్లీలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో హరీశ్‌రావు వాగ్వివాదానికి దిగారు. ఆ సమయంలో జరిగిన తోపులాటలో హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి కిందపడిపోయారు. దీంతో ఆగ్రహించిన హరీశ్‌రావు తాను ధరించిన నల్ల టీ షర్టును విప్పి విసిరేశారు. ఎలాంటి నినాదాలు లేనందున తనను అసెంబ్లీలోకి వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి కూడా టీషర్టులు విప్పి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును పోలీసు వాహనంలో తెలంగాణ భవన్‌కు తరలించారు. మహిళా నేతల ఆవేదన అసెంబ్లీ వద్ద పోలీసుల తోపులాటలో హరీశ్‌రావుతో పాటు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కిందపడిపోయారు. జగదీశ్‌రెడ్డి అస్వస్థతకు గురికాగా.. ఎమ్మెల్యేలు సుదీర్‌రెడ్డి, గంగుల కమలాకర్ తదితరులు సపర్యలు చేశారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. కేటీఆర్‌ను పోలీసులు బలవంతంగా వాహనంలోకి ఎక్కించడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి పోలీసుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు జుట్టు పట్టుకుని, గొంతు నొక్కారని సబిత ఆరోపించగా, తన చీర లాగారంటూ సునీత కన్నీటి పర్యంతమయ్యారు. సబిత, సునీత, కోవా లక్ష్మితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మాధవరం కృష్ణారావు తదితరులు అసెంబ్లీ గేటు వద్ద బైఠాయించగా వారినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. -
‘ఇది తెలంగాణ మహిళా లోకానికి జరిగిన అవమానం’
హైదరాబాద్: తాము నిరసన తెలిపే క్రమంలో పోలీసుల బలగం అత్యంత దుర్మార్గంగా వ్యహరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో ప్రజలంతా చూశారని మండిపడ్డారు. ప్రధానంగా సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల పోలీసులు అత్యంత అమానుషంగా వ్యవహరించారన్నారు. పోలీసు చర్యలతో సబితా ఇంద్రారెడ్డి కన్నీరు పెట్టుకున్నారన్నారు.ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 7వ తేదీ) తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘ ఇది శాసన సభ కాదు.. దుశ్శాసన సభ. లోక్‌సభకు రాహుల్ గాంధీ టీషర్ట్ వేసుకుని వెళ్తున్నారు. మేం టీ షర్ట్లు వేసుకుంటే తప్పేంటి.. ఏ రూల్ ప్రకారం అడ్డుకుంటున్నారు. పార్లమెంటరీ, అన్ పార్లమెంటరీ డిసైడ్ చేయడానికి డీసీపీ ఎవరు?, మహిళా నేతలపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ప్రజల తరఫున గొంతు వినిపించడం మా హక్కు. స్పీకర్ వివక్ష చూపడం తగదు. సీఎంను విమర్శిస్తే మైక్ ఇవ్వను అని స్పీకర్ అనడం ఏంటి?, ప్రజలపై చేసే దౌర్జన్యాలు, దోపిడీ, అరాచకాలపై సభలో నిలదీస్తాం. ఈ రోజు జరిగిన ఘటనకు బాధ్యుడు సీఎం రేవంత్. సీఎం రేవంత్ బాధ్యత తీసుకుని క్షమాపణ చెప్పాలి. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలకు సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలి. తెలంగాణ మహిళా లోకానికి ఇవాళ అవమానం జరిగింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ఈ రోజు జరిగిన ఘటనపై హైకోర్టుకు వెళ్లాం. ఎన్హెచ్ఆర్సీ, మహిళా కమిషన్‌కు కూడా వెళ్తాం. బీజేపీ-కాంగ్రెస్ జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుపుతున్నాయి. బీజేపీ-కాంగ్రెస్ కుమ్మక్కై మమ్మల్ని అడ్డుకుంటున్నారు’ అని విమర్శించారు.ఇదీ చదవండి:నల్లదుస్తులతో వస్తే తప్పేంటి?: సబిత ఫైర్ -
తెలంగాణ అసెంబ్లీ : బీఆర్ఎస్ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)
-
పోలీసుల దౌర్జన్యకాండ.. కేటీఆర్ సహా పలువురికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల వేళ ప్రతిపక్షంపై పోలీసులు దౌర్జన్యకాండకు దిగారు. సోమవారం ఉదయం నల్ల టీషర్లుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు వద్దే అడ్డుకున్నారు. ఆ దుస్తులతో అనుమతించబోమని చెప్పారు. అయితే తమను లోపలికి అనుమతించాలని బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టడంతో మెయిన్‌గేట్ వద్ద హైడ్రామా నడిచింది. తెలంగాణ అసెంబ్లీ బయట బీఆర్ఎస్ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో నేల మీద పడుకుని పలువురు నేతలు నిరసన తెలిపారు. తన టీ షర్ట్ తీసేసి.. ఇప్పుడైనా అనుమతించాలని హరీశ్‌రావు కోరారు. అయినా పోలీసులు అనుమతించలేదు. ఈ క్రమంలో వాగ్వాదం కాస్త.. తోపులాటగా మారింది. పోలీసులు నెట్టేయడంతో పలువురు బీఆర్ఎస్ నేతలు కిందపడిపోయారు. కేటీఆర్, హరీష్ రావులను అసెంబ్లీ వద్ద అరెస్ట్ చేసి తెలంగాణ భవన్‌కు తరలించిన పోలీసులు https://t.co/zHd2zxHm06 pic.twitter.com/kCuJ4jsztK— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026ఈ క్రమంలో సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు మెడ బట్టి నెట్టేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి గాయాలయ్యాయి. కేటీఆర్ ముఖం, చేతులకు దెబ్బలు తగిలాయి. తన చీర లాగారంటూ సునీతా లక్ష్మారెడ్డి కంటతడి పెట్టగా.. సబిత ఓదార్చారు. ఆపై హరీష్‌రావు, కేటీఆర్ సహా పలువురు నేతల్ని బలవంతంగా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ పరిణామాలతో అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.అసెంబ్లీ ముందు కంటతడి పెట్టుకున్న మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డినలుపు రంగు చీర ధరించి అసెంబ్లీకి వెళ్తున్న సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించిన పోలీసులుకౌరవ సభలా మారిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు https://t.co/0Nua3mziEr pic.twitter.com/Ada7X5MXwj— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026అసెంబ్లీ వద్ద తమకు అవమానం జరిగిందని.. పోలీసులు తమతో ప్రవర్తించిన తీరుకు పోలీసులు క్షమాపణలు చెప్పాల్సిందేనని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.స్పీకర్ చెబితేనే: డీసీపీ శిల్పవల్లిఅసెంబ్లీ గేటు వద్ద పరిణామాలపై స్థానిక డీసీపీ శిల్పవల్లి స్పందించారు. నల్ల దుస్తులతో లోపలికి అనుమతించొద్దని స్పీకర్ ఆదేశించారని.. అందుకే అడ్డుకున్నామని చెప్పారు. బీఆర్ఎస్ నేతల ఆరోపణల్లో నిజం లేదని.. తామేం అమర్యాదగా నడుచుకోలేదన్నారు. అలాగే.. వద్దని చెబుతున్నా బలవంతంగా నిరసనలకు దిగడంతోనే అదుపులోకి తీసుకున్నామని వివరించారు.ఇదీ చదవండి: ఆఖరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన రేవంత్‌రెడ్డి -
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా
Telangana Assembly Updates..తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదారేపు ఉదయం వాయిదా వేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్రేపు శాసన సభలో స్పీకర్‌పై తాత మధుపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని శ్రీధర్ బాబు డిమాండ్రేపు సభలో తాత మధు వ్యాఖ్యలపై సభ్యుల స్పీచ్ ఉంటుంది రేపు మధ్యాహ్నం తర్వాత బీఏసీ మీటింగ్ అసెంబ్లీ ఘటనపై హైకోర్టు సీరియస్ ఘటనపై నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశం అసెంబ్లీకి వెళ్తున్నవారిని ఎలా అడ్డుకుంటారని ప్రశ్నఅసెంబ్లీ అనేది స్పీకర్ పరిధి నిబంధనలు ఉల్లంఘిస్తే స్పీకర్ చర్యలు తీసుకోవాలిమహిళా ఎమ్మెల్యేపై దాడి చేసిన వారిని గుర్తించాలి2 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశం ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి కామెంట్స్దళిత బిడ్డను స్పీకర్‌గా కాంగ్రెస్ తీసుకవచ్చిందిస్పీకర్ మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికే ఈ వ్యాఖ్యలుఅధికారానికి శాశ్వతంగా దూరం అవుతామని బీఆర్ఎస్లో భయం ఈ ఘటన ఆది కాదు అంతం కాదు నికృష్టమైన పదజాలం వాడిన వారిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలిచర్యల తీసుకోవడానికి స్పీకర్‌కు రాజ్యాంగపరమైన అధికారాలు ఉన్నాయిస్పీకర్ రూల్‌బుక్ ఫాలో అయ్యి కఠిన చర్యలు తీసుకోవాలి వాకౌట్ చేసిన బీజేపీ అసెంబ్లీ సమావేశాల నుంచి బీజేపీ వాకౌట్ 22ఏపై చర్చించడం లేదని బీజేపీ వాకౌట్ హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా అడ్డుకున్నారని పిటిషన్ హైకోర్టులో పిటిషన్ వేసిన బీఆర్ఎస్్ ఎమ్మెల్సీపై చర్యలకు ప్రతిపాదనతాతా మధుపై చర్యలకు అసెంబ్లీలో ప్రతిపాదన సభలో ప్రతిపాదన చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రతిపాదనను బలపర్చిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి శాసనసభలో కన్నీరు పెట్టుకున్న స్పీకర్స్పీకర్ వ్యాఖ్యల పట్ల మంత్రి సీతక్క తీవ్ర భావోద్వేగంసీతక్క కంటతడి పెట్టుకోవడంతో భావోద్వేగానికి గురైన స్పీకర్తీవ్ర భావోద్వేగంతో కంటతడిపెట్టిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ఎమ్మెల్సిలు తాత మధు, నవీన్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి: మంత్రి సీతక్కవారిపై ఎస్సి ఎస్టీ కేసులు పెట్టాలి సభకు రాకుండా చైర్‌ను కేసీఆర్ అవమానిస్తున్నారుస్పీకర్కు కేసీఆర్ సభకు వచ్చి క్షమాపణ చెప్పాలిబీఆర్ఎస్ పార్టీ అంటే దుహంకారం కలిగిన పార్టీ స్పీకర్‌ను కించపరిచే కుసంస్కారం నాకు లేదు: తాతా మధుమమ్మల్ని పోలీసులు బూటు కాళ్లతో తొక్కారునన్ను రక్షించుకోవడం కోసమే అలా మాట్లాడాకాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందిబీఆర్ఎస్పై దాడిని కప్పిపుచ్చుకునేందుకే నాటకాలాడుతున్నారు తాతా మధును బహిష్కరించండి: బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డితాతా మధు వ్యాఖ్యలకు బాధ్యత వహించి కేసీఆర్ క్షమాపణ చెప్పాలిస్పీకర్ విషయంలో ఇలాంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నాంఎమ్మెల్సీ తాతా మధును చట్ట సభ నుంచి బహిష్కరించాలిఅసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డిచెప్పలేని భాషతో స్పీకర్‌ను దూషించారు చట్ట సభ నుంచి తాతా మధును డిస్మిస్ చేయాలితాత మధు చేసిన వ్యాఖ్యలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ క్షమాపణలు చెప్పాలిఇది సభకు జరిగిన అవమానంస్పీకర్కు జరిగిన అవమానంపై చర్చలో బీజేపీ సభ్యులు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాబీజేపీ లేవనెత్తిన అంశాలపై బీఏసీలొ చర్చించి నిర్ణయం తీసుకుంటాంకేసీఆర్ ఫాంహౌస్‌లో కుట్రకు ప్లాన్ వేశారుఈరోజు అసెంబ్లీ ముందు ప్లాన్ అమలు చేశారుసభాపతినే కాదు,సభాపతి కుటుంబ సభ్యులను అవమానించారు మహిళలను అవమానపరచడమే ఇందిరమ్మ రాజ్యమా?: సునీతసునీతా లక్ష్మారెడ్డి కామెంట్స్..ప్రజాస్వామ్యంలో ఇవ్వాళ్ల చీకటి రోజు.రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన ఘటన ఇది.ప్రజల పక్షాన పోరాడటమే మేం చేసిన పాపమా?.కోవ లక్ష్మి పట్టుకోకుంటే గ్రిల్స్పైన పడిపోయేదాన్ని.మహిళలను అవమానపరచడమే ఇందిరమ్మ రాజ్యమా?.కేటీఆర్, హరీష్ రావు లేకుంటే ఇవాళ మమ్మల్ని కిందపడేసి తొక్కేసేవాళ్లు.ఎవరి మెప్పు కోసం పోలీసులు ఇలా ప్రవర్తించారు?. రాష్ట్రంలో దుస్యాసన పర్వం కొనసాగుతుంది.మేము ఏం పాపం చేశాం.రాష్ట్ర మహిళలందరూ దాడి జరిగినట్లుగా ఈ ఘటనను భావిస్తున్నాము.అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి..మహిళా సభ్యులతో ఇలాగేనా ప్రవర్తించేది?: సబిత సీరియస్బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత కామెంట్స్..మా పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు.మేము అసెంబ్లీకి నల్లబట్టలతో వెళ్తే తప్పేంటి?.అసెంబ్లీకి వస్తుంటే అడ్డుకున్నారు.రాహుల్ గాంధీ పార్లమెంట్‌కు బ్లాక్ డ్రెస్‌లో వెళ్లి కేంద్రాన్ని నిలదీస్తే తప్పులేదా?.ముఖ్యమంత్రి ఆదేశాలతోనే పోలీసులు ఇలా చేశారా?పోలీసులను అడ్డుపెట్టుకుని దుర్మార్గంగా వ్యవహరించారు.మహిళా సభ్యులని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తించారు.సునీతా లక్ష్మారెడ్డి చీర లాగేసి కిందపడేసే ప్రయత్నం చేశారు.ఇంత దుర్మార్గంగా వ్యవహరించాల్సిన అవసరం ఏం వచ్చింది? ఎందుకు వచ్చింది?.ఇది మాకు జరిగిన అవమానం కాదు.. మహిళా సమాజానికి జరిగిన అవమానం.అసెంబ్లీ ముందు జరిగిన ఘటన హేయమైనది.అసెంబ్లీకి వస్తుంటే అడ్డుకున్నారు. రేవంత్ సర్కార్, పోలీసులపై హరీష్ రావు సీరియస్తెలంగాణభవన్ వద్ద మరోసారి ఉద్రికత్త.మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్..బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేశారు.కేటీఆర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.రాహుల్ గాంధీ టీషర్ట్ వేసుకుని పార్లమెంట్‌కు వెళ్తే తప్పులేదా?మేము టీ షర్టులు వేసుకుని అసెంబ్లీకి వెళ్తే తప్పా?.బీఆర్ఎస్ను బయటకు పంపించి 22ఏపై చర్చించాలనుకుంటున్నారు.ఎన్నికల హామీలు అమలు చేయలేదని ప్రశ్నిస్తే తప్పా?రక్తాలు కారేలా మా ఎమ్మెల్యేలను కొట్టి సభకు రాకుండా అడ్డుకున్నారు.బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా ప్రవర్తించారు.ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు.మా ఆడ బిడ్డల చీరలు లాగుతుంటే మేం చూస్తూ ఊరుకోవాలా?.మా ఆడబిడ్డల గొంతుపట్టి లాగుతుంటే మేం చూస్తూ కూర్చోవాలా?.మీకు నిజాయితీ ఉంటే 22ఏను అజెండాలో పెట్టి చర్చించండి.పోలీసుల తీరు దుర్మార్గంగా ఉంది.జగదీష్ రెడ్డికి హైబీపీ ఉందని చెప్పినా అడ్డుకున్నారు.రేవంత్ ఆదేశాలతోనే పోలీసులు రెచ్చిపోయారు.భవిష్యత్‌లో పోలీసులు మూల్యం చెల్లించక తప్పదు.మా టీషర్టులపై అభ్యంతరకర పదాలు ఎక్కడున్నాయి??సభకు రాకుండా కావాలనే మమ్మల్ని అడ్డుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్ చాట్..బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే నో డౌట్..తాతా మధుపై చర్యలు తీసుకోవాల్సిందే..దలిత స్పీకర్‌పై ఇంత దారుణంగా మాట్లాడుతారా?మేము స్పీకర్‌ను ఏమనకున్నా నన్ను, సంపత్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వంలో సస్పెండ్ చేశారు.తాతా మధు లాంటి వారిని ఉపేక్షిస్తే స్పీకర్ పదవిని అగౌరపరిచినట్టే అవుతుంది.తాతా మధు వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించాలి.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై స్పీకర్ ఆగ్రహం..తాతా మధు వ్యవహారంపై స్పీకర్ ఆగ్రహం.స్పీకర్‌పై తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియోను రిలీజ్ చేసిన సీఎంవో..తాతా మధుపై చర్యలకు సిద్ధం అవుతున్న స్పీకర్మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలని కాంగ్రెస్ నేతల డిమాండ్. ఆసుపత్రికి బీఆర్ఎస్ నేతలు.. అడ్డుకున్న పోలీసులు.. గాయాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్తామన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్జగదీష్ రెడ్డి, సంజయ్, యాదవరెడ్డిని ఆసుపత్రికి తరలిస్తుండగా అడ్డుకున్న పోలీసులు.తెలంగాణ భవన్ మెయిన్ గేట్ వద్ద అడ్డుకున్న పోలీసులు..జగదీష్ రెడ్డి పల్స్ రేటు పడిపోతుందంటూ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆగ్రహంశ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పిన సంజయ్.మాట్లాడలేకపోతున్నా జగదీష్ రెడ్డి.జగదీశ్ రెడ్డికి హైబీపీ.. ఆరోగ్య పరిస్థితి విషమం.స్పృహ తప్పే ప్రమాదం ఉందంటున్న డాక్టర్ సంజయ్పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు శాసనసభలో మీడియాపై ఆంక్షలుతెలంగాణ శాసనసభలో మీడియాపై ఆంక్షలుఅసెంబ్లీ లాబీలోకి మీడియాకు నిషేధంమీడియాకు LOP సైడ్ లాంజ్ ఏర్పాటు చేసిన అధికారులుమంత్రుల ఛాంబర్ల వరకు మీడియా అనుమతి నిషేధం విధించిన ప్రభుత్వంఅసెంబ్లీలో మీడియాకు కనీసం టాయిలెట్స్, మంచి నీళ్లు లేని వైనంఅసెంబ్లీ బయట మీడియా కమిటీ కోసం ప్రత్యేకంగా రూమ్ ఏర్పాటు చెసినట్లు తెలిపిన అధికారులుఅసెంబ్లీ లాబీలోకి మీడియా అనుమతి నిషేధించాలని మంత్రులు ఏకగ్రీవంగా స్పీకర్‌కు తెలిపినట్లు చెప్పిన అధికారులుసీఎం రేవంత్ అత్యవసర సమావేశం..అసెంబ్లీ ఛాంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం.మంత్రులు, పలువురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం.బీఆర్ఎస్ ఆందోళన సందర్భంగా ఎమ్మెల్సీ తాత మధు వ్యవహరించిన తీరుపై సీఎం ఆరా.పోలీసులు, స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యల వీడియోలను పరిశీలిస్తున్న రేవంత్ రెడ్డి పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం..అసెంబ్లీ వద్ద పోలీసుల తీరుపై కేటీఆర్ ఫైర్డ్యూటీ చేయండి, అతి చేయకండిరెండేళ్లలో మా ప్రభుత్వం వస్తుంది గుర్తు పెట్టుకోండిమేము నల్ల దుస్తులతో అసెంబ్లీలోకి రావొద్దని స్పీకర్ రాతపూర్వకంగా చెప్తే, ఏదైనా రూల్ ఉంటే చూపించండితెలంగాణభవన్ చేరుకున్న కేటీఆర్, హరీష్పోలీసుల కారణంగా గాయాలు కావడంతో కేటీఆర్‌కు ప్రాథమిక చికిత్స అసెంబ్లీ వద్ద పోలీసుల తీరుపై కేటీఆర్ ఫైర్డ్యూటీ చేయండి, అతి చేయకండిరెండేళ్లలో మా ప్రభుత్వం వస్తుంది గుర్తు పెట్టుకోండిమేము నల్ల దుస్తులతో అసెంబ్లీలోకి రావొద్దని స్పీకర్ రాతపూర్వకంగా చెప్తే, ఏదైనా రూల్ ఉంటే చూపించండి- కేటీఆర్Video credits - TV9 https://t.co/LplrkQneJE pic.twitter.com/h28vJuMJ8A— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026Video credits.. TV9 And Telugu Scribeకేటీఆర్, హరీష్ రావులను అసెంబ్లీ వద్ద అరెస్ట్ చేసి తెలంగాణ భవన్‌కు తరలించిన పోలీసులు https://t.co/zHd2zxHm06 pic.twitter.com/kCuJ4jsztK— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026స్పీకర్ ఆదేశాలతోనే బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నాం: డీసీపీడీసీపీ శిల్పవల్లి కామెంట్స్..స్పీకర్ ఆదేశాలతోనే బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నాంషర్ట్లు లేకుండా అసెంబ్లీకి ఎలా వెళ్తారు?మహిళా నేతల చీరలు లాగామనడం అవాస్తవం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్‌చాట్..కేసీఆర్ కాళేశ్వరం విషయంలో ఇంకా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు.కేసీఆర్ నేనే ఇంజనీర్‌ను అని కాళేశ్వరం కట్టి కూల్చారు.కేసీఆర్ బీజేపీకి సరేండర్ అయ్యారు.కేసీఆర్ పాదయాత్ర చేస్తా అంటే ప్రజలు నవ్వుతున్నారు.పెండింగ్ ప్రాజెక్టలను పూర్తి చేయొద్దు అని ఎవరు అడ్డుకున్నారు?నీళ్లు లేకపోవడానికి ఒకటి ఎల్‌నినో.. మరొకటి కేసీఆరే కారణం!!నీళ్ల పంపకాల విషయంలో కేసీఆర్ అన్యాయం చేశారు.కేసీఆర్ మాటలు అన్ని తెలిసినట్లే ఉంటాయి.కేసీఆర్ వాడిన భాష తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ వాడలేదు.తెలంగాణ భాష ఇలా అవ్వడానికి కేసీఆరే కారణం.కేసీఆర్ నిర్ణయం వల్లే ఇవ్వాళ్ళ నీళ్లు లేవు.ఎండాకాలం తాగునీరు అవసరాల దృష్ట్యా నీరును చాలా పొదుపుగా వాడుతున్నాం..ఇరిగేషన్ విషయం కేసీఆర్ ఫాం హౌస్‌లో ఉంటేనే బెటర్.నీళ్లు ఉండి మేము ఇవ్వడం లేదా?.అసెంబ్లీ మీడియా పాయింట్పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ కామెంట్స్..దిక్కుతోచని పరిస్థితుల్లో బీఆర్ఎస్, బీజేపీ ఆందోళన చేస్తున్నాయి22ఏ భూముల మీద బీఏసీలో చర్చిద్దామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారుసభకు రాకుండా బీఆర్ఎస్, సభకు వచ్చి బీజేపీ నిరసన తెలుపుతున్నాయి10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయని పనులను కాంగ్రెస్ చేసిందిబీఆర్ఎస్, బీజేపీ తీరును ప్రజలు గమనిస్తున్నారుకాళేశ్వరం మీద సీబీఐ విచారణ వేయాలని బీజేపీ నాయకులు కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదు?బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని మరోసారి రుజువైంది.ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య కామెంట్స్..బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసుల మీదే దాడులు చేస్తున్నారు.బీఆర్ఎస్, బీజేపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారుసభలో అన్నింటిపై చర్చకు సీఎం సిద్ధంగా ఉన్నారు22ఏపై చర్చకు ప్రభుత్వం సిద్ధమైందిమీ బట్టలు ప్రజలు ఎప్పుడో విప్పారుప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కామెంట్స్..అసెంబ్లీ లోపలికి కాదు.. ఫార్మ్ హౌస్‌లో నల్ల చొక్కాలతో నిరసన తెలపాలిసభ సమయం వృథా చేయకండిసభలో బీజేపీ డ్రామా చేస్తోంది.కేటీఆర్ బృందం పోలీసులపై దాడి చేశారుపోలీసుల ఛాతీపై చేతులు వేసి దురుసుగా ప్రవర్తించారుహరీష్ నల్ల చొక్కాతో వద్దు అంటే.. చొక్కా విప్పి రావడం సంప్రదాయమా? రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు..బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను అసెంబ్లీ రాకుండా వ్యవహరించిన పోలీసులు, ప్రభుత్వంప్రభుత్వం తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపు.పార్టీ నాయకులు ఎక్కడిక్కడ నిరసన వ్యక్తం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపుమరోవైపు.. కేటీఆర్, హరీష్ సహా బీఆర్ఎస్ నేతలు తెలంగాణభవన్‌కు చేరుకున్నారు. అసెంబ్లీకి ముట్టడికి బీజేవైఎం ప్రయత్నం.. అసెంబ్లీకి ముట్టడికి వచ్చిన బీజేవైఎం నేతలు..వారిని అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు.ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్. కాసేపు అసెంబ్లీ వాయిదా..కూనంనేని కామెంట్స్..సభకు బీజేపీ సభ్యులు సహకరించాలి..22Aపై చర్చకు సిద్ధం అని ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి బీజేపీ సభ్యులు ఓపికతో ఉండాలి.బీజేపీ సభ్యుల ఆందోళన మధ్య శాసనసభకు విరామంకాసేపు అసెంబ్లీ వాయిదా.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్బీఆర్ఎస్తో బీజేపీ కుమ్మక్కు అయింది.సభను ఉద్దేశ్యపూర్వకంగా బీజేపీ సభ్యులు అడ్డుకుంటున్నారు..చర్చకు సిద్ధం అన్నాక కూడా ఈ రాద్ధాంతం ఎందుకు?. కొండా సురేఖ దూరం..అసెంబ్లీ సమావేశాలకు కొండా సురేఖ దూరం.కాంగ్రెస్‌లోనే ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సురేఖ.సెషన్ మొత్తానికి దూరంగా ఉండాలని సురేఖ నిర్ణయం?పోలీసులు, ప్రభుత్వంపై సబిత, సునీత ఆగ్రహం.. అసెంబ్లీ వద్ద మాకు అవమానం జరిగింది.మా పట్ల జరిగిన తీరుకు పోలీసులు క్షమాపణలు చెప్పాలి: బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు.లేదంటే స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. తన మెడ పట్టుకుని తోసేయడంపై సబిత ఆగ్రహంతన చీరను లాగారని కన్నీరు పెట్టుకున్న సునీతఅసెంబ్లీ ముందు ధర్నా చేస్తున్న మహిళా ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన పోలీసులు.నిరసన చేయడం ఎమ్మెల్యేల హక్కు: సబితా ఇంద్రా రెడ్డి.టీ షర్ట్స్ పై స్లోగన్స్ రాయొద్దు అని ఎక్కడైనా అసెంబ్లీలో చట్టం ఉందా?మహిళా ఎమ్మెల్యేల మీద దాడి ప్రభుత్వం దుశ్చర్య: సునీత లక్ష్మారెడ్డి నాపై జరిగిన దాడికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సిందే.నాపై దాడితోపాటు ఎమ్మెల్యేలపై దాడి చేసినందుకు స్పీకర్‌కి ఫిర్యాదు చేస్తాం.తప్పు చేసిన అధికారులపై స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందే.ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. మరోవైపు.. తెలంగాణభవన్ చేరుకున్న కేటీఆర్, హరీష్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.సభలో బీజేపీ సభ్యుల నిరసన..22-ఏపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని డిమాండ్..మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..సభ సజావుగా జరిగేలా బీజేపీ సభ్యులు చూడాలి.ఈ సెషన్లో 22A పై షార్ట్ డిస్కషన్ చేస్తాం.వాయిదా తీర్మానంపై ప్రొసీజర్ ప్రకారమే ఉంటుంది.ఏ నుంచి జెడ్ వరకు చర్చకు సిద్ధంగా ఉన్నాం.ఏ అంశమైనా ప్రభుత్వానికి అభ్యంతరం లేదు.సామాన్య ప్రజానీకానికి ఏ మాత్రం ఇబ్బంది లేని సలహాలేవి ఇచ్చినా తీసుకుంటాం. కేటీఆర్‌కు గాయాలు.. కన్నీటి పెట్టిన సునీత.. పోలీసులకు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు మధ్య తోపులాట. ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అడ్డుకుంటున్న పోలీసులురోడ్డుపైనే బైఠాయించి పోలీసుల తీరుకు, ప్రభుత్వం తీరుకు నిరసన వ్యక్తం చేస్తున్న కేటీఆర్, హరీష్ రావు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లుకేటీఆర్, హారీష్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు.శాసనసభ ముందు కన్నీరు పెట్టుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి..తనపై పోలీసులు దాడి చేశారని, నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యేమరోవైపు సబిత, సునీతను పోలీసులు అరెస్ట్ చేశారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించిన పోలీసులుఅసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దౌర్జన్యం1000 రోజుల కాంగ్రెస్ విఫల పాలనకు వ్యతిరేకంగా గన్‌పార్క్ నుంచి అసెంబ్లీకి నిరసనగా వెళ్తున్న ఎమ్మెల్యేల పట్ల పోలీసుల… pic.twitter.com/lVlnjG8VEM— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..అసెంబ్లీలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి “దుద్దిళ్ల శ్రీపాదరావు సెంట్రల్ హాల్” ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్‌ను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు.పోలీసులు నెట్టేశారని సునీత లక్ష్మారెడ్డి కంటతడిఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నెట్టేసిన పోలీసులుతోపులాటలో కేటీఆర్ చేతికి గాయంమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్లకార్డులతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలునల్ల టీషర్ట్స్‌తో లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదన్న పోలీసులు. బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకున్న పోలీసులు. పోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదంతోపులాటలో కిందపడిపోయిన హరీష్ రావు, జగదీష్‌రెడ్డి. పోలీసులతో తోపులాటలో కిందపడ్డ హరీష్ రావుహరీష్ రావు చేతిని తొక్కి అమానుషంగా ప్రవర్తించిన పోలీసులునలుపు రంగు దుస్తులతో అసెంబ్లీకి, శాసన మండలికి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు https://t.co/mCFRw3CbdE pic.twitter.com/JRoujq550Q— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026గన్‌పార్క్ వద్ద కేటీఆర్ కామెంట్స్..కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది.కాంగ్రెస్ మోసాలను అసెంబ్లీలో నిలదీస్తాం.హామీల అమలుపై పోరాటం చేయాలని మా నాయకుడు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.100 రోజుల్లోనే ఇస్తామన్న రూ.15000 రైతు భరోసా ఏమైంది?.నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం రూ.82000 బాకీ పడింది.జాబ్ క్యాలెండర్ ఏమైంది?.రియల్ ఎస్టేట్ కోసం తెచ్చిన జీవో 97ను రద్దు చేయాలి.కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు రూ.1200 కోట్లు బకాయి పెట్టింది.సింగరేణిలో దోపిడీపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తాం.నెలరోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలి. బీఆర్ఎస్, బీజేపీకి కౌంటర్.. చర్చకు సిద్ధమైన ప్రభుత్వం22-ఏ, ఫీరియింబర్స్మెంట్పై చర్చకు సిద్ధమైన ప్రభుత్వం.బీఏసీలో రెండు అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం.బీఏసీలో ప్రభుత్వం తరఫున ప్రతిపాదన పెట్టనున్న మంత్రి శ్రీధర్ బాబు.కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. గన్ పార్క్..అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి నిరసనకు దిగిన బీజేపీ ఎమ్మెల్యేలుభూ భారతిలో జరిగిన అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలంటూ నినాదాలు..22ఏ భూ దందాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చేయాలని డిమాండ్..అసెంబ్లీ గేట్ వద్ద తోపులాటప్లకార్డులతో అసెంబ్లీ లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించిన బీజేపీ ఎమ్మెల్యేలుఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట..సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు..ఎమ్మెల్యేల చేతుల్లో ఉన్న ప్లకార్డులను లాగేసుకున్న పోలీసులుగన్పార్క్ వద్ద ఉద్రిక్తత..గన్‌పార్క్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేల నిరసన.గన్‌పార్క్ వద్దకు ఎమ్మెల్యేలు వస్తుంటే అడ్డుకున్నారని పోలీసులతో బీజేపీ ఎమ్మెల్యేలు వాగ్వాదం.అసెంబ్లీ బయట ప్లకార్డులను అడ్డుకోవడానికి పోలీసులు ఎవరంటూ ప్రశ్నించిన ఎమ్మెల్యేలు22A సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేపట్టాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్అసెంబ్లీ మీడియా పాయింట్బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కామెంట్స్.. అధికార పక్షంతో సహా మాకు సమాన హక్కులు ఉండాలి.అసెంబ్లీలో ఇంతమంది మార్షల్స్ ఎందుకు?.మమ్మల్ని ప్రశ్నించకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.సీఎంకు రూల్స్ తెలియవు.. కానీ శ్రీధర్ బాబుకు అన్నీ తెలుసు.రాష్ట్రంలో క్రైం రేటు పెరిగింది.శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి..ముఖ్యమంత్రి గుండ్లు పీకుతా,పేగులు మెడలో వేసుకుంటా అనడం వల్లే క్రైం రేటు పెరుగుతుంది.కనీసం నెల రోజులు సభ జరపాలి.నల్ల చొక్కాలతో బీఆర్ఎస్ నేతలు..నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ నేతలు.హామీల అమలులో కాంగ్రెస్ విఫమైందని నిరసనలుకాంగ్రెస్వి 420 హామీలంటూ ఆగ్రహం అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపుఅసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన బీజేపీఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై ఇందిరాపార్క్ ధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణమరోవైపు గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించి అసెంబ్లీకి రానున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు22A పై సభలో చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చిన బీజేపీకనీసం 15 రోజులు సభను నడిపించాలని డిమాండ్ చేస్తున్న బీజేపీకాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంఅసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది.ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ మండలి సమావేశాలు వాడీవేడిగాసాగే అవకాశం ఉంది.ప్రశ్నోత్తరాల తర్వాత మూడు ప్రధాన అంశాలకు సంబంధించిన నివేదికలు సీఎం టేబుల్ చేయనున్నారు.తెలంగాణ సమగ్రశిక్ష 2024–25 ఆడిట్ నివేదిక, పీఎం శ్రీ తెలంగాణ 2024–25 ఆడిట్ నివేదిక ప్రవేశపెట్టనున్నారు.మెట్రోకు సంబంధించి ఐదు వార్షిక నివేదికలు సభ ముందుకు రానున్నాయి.22ఏ భూముల వ్యవహారంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.22ఏపై అన్నివిధాలుగా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధమైంది.రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై సభలో చర్చ జరిగే అవకాశం ఉంది.సర్పంచ్ల కోసం బిల్లు..ఈ నెల 11 వరకే శాసనసభ నిర్వహించాలనే ఆలోచనతో ప్రభుత్వం?ఎన్ని రోజులు నిర్వహించాలనే నిర్ణయంపై బీఏసీలో క్లారిటీ.తెలంగాణ శాసన సభలో కీలక బిల్లు.నిధులు నేరుగా సర్పంచులకే అందేలా అసెంబ్లీలో బిల్లు పెట్టనున్న ప్రభుత్వంబీఆర్ఎస్ వ్యూహం..ఉదయం 9 గంటలకు గన్ పార్ట్ దగ్గర అమరులకు బీఆర్ఎస్ నేతల నివాళులు. అనంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుఅసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా బీఆర్ఎస్ వ్యూహంఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో దిశానిర్ధేశం చేసిన కేసీఆర్ప్రజా సమస్యలపై చర్చకు నెలరోజుల సభకు బీఆర్ఎస్ డిమాండ్ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీఆర్ఎస్ ఫోకస్విద్యార్థుల సమస్యలపై సభలో గళమెత్తనున్న గులాబీ పార్టీకాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులపై ప్రభుత్వాన్ని నిలదీసే ప్లాన్22A భూముల అంశాన్ని సభలో లేవనెత్తనున్న బీఆర్ఎస్కరెంట్ కోతలు, రుణమాఫీపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్న బీఆర్ఎస్ఉద్యోగుల పీఆర్సీ, డీఏలపై ప్రభుత్వంపై ఒత్తిడిఈహెచ్ఎస్, పాలిటెక్నిక్ జీవో 97పైనా ప్రశ్నలుసింగరేణి అంశాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేయనున్న గులాబీ పార్టీరైతులు, విద్యార్థులు, ఉద్యోగులే బీఆర్ఎస్ ప్రధాన అజెండాసభకు తప్పకుండా హాజరు కావాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆదేశించిన కేసీఆర్అసెంబ్లీ సమావేశాలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచేలా బీఆర్ఎస్ ప్లాన్ -
ఎర్రవల్లిలో కీలక భేటీ.. గులాబీ దళానికి కేసీఆర్ దిశానిర్దేశం!
సాక్షి, గజ్వేల్: అసెంబ్లీ సమరం మొదలుకాక ముందే బీఆర్ఎస్ బరిలోకి దిగింది.. కాంగ్రెస్ సర్కార్‌ను టార్గెట్ చేసేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వేదికగా బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. గులాబీ నేత కేసీఆర్ అధ్యక్షతన జరిగే శాసనసభా పక్ష భేటీలో.. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా ఇరుకున పెట్టేందుకు ‘అస్త్రాలు’ సిద్ధం చేసుకుంటున్న బీఆర్ఎస్.. రైతులు, యువత, విద్యార్థులు, మహిళల సమస్యలతో పాటు 22-ఏ భూములు, ప్రభుత్వ హామీలు, పెండింగ్ పథకాలను ప్రధాన అజెండాగా మార్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం 1 గంటకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ భోజనం చేయనున్నారు. అనంతరం.. మధ్యాహ్నం 2 గంటలకు శాసనసభా పక్ష సమావేశం ప్రారంభం కానుంది.కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై చర్చించడంతో పాటు, బీఆర్ఎస్ ఇప్పటికే విడుదల చేసిన ఛార్జ్‌షీట్‌పై సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. కేసీఆర్ స్వయంగా అసెంబ్లీకి హాజరుకాకపోయినా.. ఫామ్‌హౌస్ నుంచే పార్టీ ఎమ్మెల్యేలకు వ్యూహాన్ని తెలపనున్నారు. సభలో కాంగ్రెస్‌ను నిలదీయాల్సిన అంశాలు.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహాలపై కేసీఆర్ కీలక సూచనలు చేయనున్న నేపథ్యంలో.. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ దూకుడు ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: అసెంబ్లీలో ‘వెయ్యి రోజుల’ సమరం -
బీఆర్ఎస్ బాయ్‌కాట్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్ ఏకపక్ష వైఖరి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అప్రజాస్వామిక ప్రవర్తనకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలు బహిష్కరిస్తున్నట్టు బీఆర్ఎస్ ప్రకటించింది. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా మూసీ పునరుజ్జీవంపై జరిగిన చర్చలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. అనంతరం శాసనసభ లాబీలోని ప్రతిపక్ష నేత కేసీఆర్ చాంబర్లో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. పార్టీ శాసనసభా పక్షం డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు ప్రభుత్వ వైఖరిపై అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.సభలో జరిగిన పరిణామాలను ప్రతిపక్ష నాయకుడు, పార్టీ అధినేత కేసీఆర్‌కు వివరించారు. ప్రభుత్వ తీరును ఎండగట్టేలా ప్రస్తుత సమావేశాలు ముగిసేంత వరకు అసెంబ్లీని బహిష్కరించడమే సరైనదనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైంది. పార్టీలకతీతంగా సభ్యుల హక్కులను రక్షించాల్సిన స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖండించారు. స్పీకర్ వైఖరితోపాటు ప్రభుత్వ తీరుపై నిరసన తెలపాలని నిర్ణయించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని అమరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. సుమారు గంట పాటు నిరసన తెలిపారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరిస్తున్నట్లు పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ప్రకటించారు. అసలేం జరిగింది.. ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసీ నది పునరుజ్జీవంపై చర్చ సందర్బంగా అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నడుమ మాటల యుద్ధం నడిచింది. మూసీ సుందరీకరణ కోసం చేసే ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఇళ్ల కూలి్చవేతలు, నిర్వాసితులకు పరిహారం, ప్రాజెక్టు అంచనాలు, మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాల తరలింపు అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గంటకు పైగా మాట్లాడారు. అయితే సీఎం ప్రసంగంపై వివరణ కోరేందుకు తాము అడిగినా ఎంఐఎంకు స్పీకర్ అవకాశం ఇవ్వడాన్ని బీఆర్ఎస్ తప్పు పట్టింది.హరీశ్‌రావు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతూ స్పీకర్ సభకు కస్టోడియన్‌గా తమ హక్కులు కాపాడాలని కోరారు. తమ గొంతు నొక్కుతూ హక్కులకు భంగం కలుగుతున్నపుడు స్పీకర్‌కు తమకు రక్షణగా నిలవాలన్నారు. ఈ దశలో హరీశ్‌రావు మైక్‌ను కట్ చేసిన స్పీకర్.. మంత్రి శ్రీధర్‌బాబుకు అవకాశం ఇచ్చారు. శ్రీధర్‌బాబు వివరణతో సంతృప్తి చెందని బీఆర్ఎస్ సభ్యులు తమకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టడంతో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అవకాశం ఇచ్చారు. సభా సాంప్రదాయాలు కాపాడుతూ హరీశ్‌రావుకు మైక్ ఇవ్వాలని ఆయన కోరారు.హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘మేము అడిగిన ఏ ఒక్క పాయింట్‌కు కూడా సీఎం దగ్గర క్లారిఫికేషన్ లేదు. పైగా మాకు మైక్ ఇవ్వకుండా, మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. నిరసన తెలపడం సభ్యుడి హక్కు. మాకు మైక్ ఇవ్వకపోవడం ముమ్మాటికీ సరికాదు. మూసీ నది కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువగా ఉంది. సభా నాయకుడి హోదాలో ఉండి ఆయన మాట్లాడుతున్న భాష వినడానికే చాలా కష్టంగా, అసహ్యంగా ఉంది..’ అనడంతో స్పీకర్ మరోమారు మైక్ కట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఏడు సమావేశాల్లో ఇదే తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2023 డిసెంబర్లో కొలువుదీరిన మూడో శాసనసభ ఇప్పటివరకు ఏడు మార్లు సమావేశమైంది. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ బీఆర్ఎస్ పలుమార్లు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసినా..మొత్తం సమావేశాలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం మాత్రం ఇదే తొలిసారి. కాగా శనివారం ఉదయం పది గంటలకు తెలంగాణ భవన్లో జరిగే భేటీలో బీఆర్ఎస్ శాసనసభా పక్షం తదుపరి కార్యాచరణ ప్రకటించనుంది. నదీజలాల్లో తెలంగాణ వాటా, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశమున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. రేవంత్ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారు: హరీశ్‌రావు గన్‌పార్కు వద్ద మాట్లాడిన హరీశ్‌రావు.. మూసీ ప్రక్షాళనకు ముందు సీఎం నోరు ప్రక్షాళన చేయాలని వ్యాఖ్యానించారు. మూసీ కాలుష్యం కంటే సీఎం మాటల కంపు ఎక్కువైందన్నారు. ‘రాహుల్‌గాంధీ దేశమంతా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతుంటే ఇక్కడ రేవంత్ మాత్రం అసెంబ్లీ సాక్షిగా రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారు. శాసనసభ నడుస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలకు పూర్తి విరుద్ధంగా ఉంది. బీఏసీ సమావేశంలో మమ్మల్ని గంటన్నర సేపు వెయిట్ చేయించి అవమానించారు. సభను 7 రోజుల పాటు నడపాలని, ఆ తర్వాత మళ్లీ సమావేశమై తదుపరి షెడ్యూల్ నిర్ణయిద్దామని స్పష్టంగా అనుకున్నాం. కానీ సభలో ప్రవేశపెట్టిన మినట్స్‌లో మాత్రం సభ ఎన్ని రోజులు నడపాలనేది స్పీకర్ నిర్ణయానికే వదిలేస్తున్నాం అని తప్పుడు సమాచారం పొందుపరిచారు.స్పీకర్ సభను కస్టోడియన్‌లా కాకుండా ఏకపక్షంగా నడుపుతున్నారు. సీఎంను విమర్శించొద్దంటూ స్పీకర్ మాకు రూల్స్ చెప్పడం ఎక్కడి పద్ధతి? ప్రతిపక్షం మాట్లాడకూడదంటే అసలు సభ ఎందుకు? సభలో సీఎం బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఒక సీఎంలా కాకుండా వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారు. కేసీఆర్‌పై సీఎం వాడిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నాం. అవినీతికి అధికారికంగా రేట్లు నిర్ణయించి వసూలు చేస్తున్న రేవంత్‌కు మా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు..’ అని హరీశ్‌రావు మండిపడ్డారు. అసెంబ్లీని గాం«దీభవన్లా నడిపిస్తున్నారని తలసాని ధ్వజమెత్తారు. మూసీపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షం గొంతు నొక్కుతూ అధికార పార్టీ దాడి చేస్తోందని, స్పీకర్ మౌనంగా ఉంటూ సభ నడిపించే విధానాన్ని మర్చిపోయారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. -
అసెంబ్లీకి కేసీఆర్?.. మాస్టర్ ప్లాన్ ఇదేనా!
సాక్షి,హైదరాబాద్: వచ్చే వారంలో ప్రారంభమయ్యే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ యాక్టివ్ అయిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఈ అంశంపై బీఆర్ఎస్ అధికారిక ప్రకటన వెలువడనుంది.శుక్రవారం పార్టీ నేతలతో కేసీఆర్ నిర్వహించిన కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై చర్చ జరిగింది. సమావేశంలో నేతలతో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రజల్లోకి వెళ్లి బహిరంగ సభలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని, అసెంబ్లీ వేదికగా నీటి విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించుకునే బాధ్యత బీఆర్ఎస్పైనే ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీ వేదికలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో ఈ రెండు ప్రభుత్వాల వైఖరి కారణంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గతంలోనూ తెలంగాణకు ద్రోహం చేసిందని ఆరోపించారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్ తప్ప మరే ఇతర పార్టీకి పట్టింపు లేదని స్పష్టం చేశారు. -
27 లేదా 28 నుంచి అసెంబ్లీ సమావేశాలు?
సాక్షి, హైదరాబాద్: ఈనెల 27 లేదా 28వ తేదీన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమావేశాలను మూడు రోజులపాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలి సింది. ఇందుకోసం సీఎం అధ్యక్షతన ఈనెల 22న అనధికారిక మంత్రివర్గ సమావేశం జరగనున్నట్లు తెలిసింది. సచివాలయంలో మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేదీలను ప్రకటించడంతోపాటు ఎన్ని రోజులు నిర్వహించాలన్న అంశంపై కూడా స్పష్టతనివ్వను న్నట్లు సమాచారం.అలాగే జిల్లా పరిషత్ ఎన్నికలకు ఎప్పుడు వెళ్లాలన్న అంశంతోపాటు, బీసీ రిజర్వేషన్ల అంశంపై మరోసారి చర్చించనున్నట్లు అధికారవర్గాల సమాచారం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలన్న దానిపై మరోసారి అసెంబ్లీలో చర్చించి.. అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. 42 శాతం రిజర్వేషన్ల అంశం ఇప్పటికే న్యాయస్థానం పరిధిలో ఉన్నందున, తీర్పు వచ్చేవరకు వేచి ఉండటమా..? లేక రాజకీయ పార్టీల నిర్ణయం తీసుకుని జెడ్పీ ఎన్నికల్లో ముందుకు వెళ్లడమా అనే దానిపై చర్చించనున్నారు.కాగా, గత అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత తెచ్చిన మొత్తం ఏడు ఆర్డినెన్స్‌ల స్థానంలో అసెంబ్లీలో ఆయా బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. అందులో రెండు జీహెచ్ఎంసీ చట్ట సవరణలు, అలాగే మున్సిపాలిటీల చట్ట సవరణ, ప్రభుత్వ ఉద్యోగుల నియామకం.. వేతనాల చట్ట సవరణ, కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన సవరణ బిల్లు, తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిల్లు, ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లులను అసెంబ్లీలో చర్చించి ఆమోదించనున్నారు. ప్రభుత్వం తాజాగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పాలక మండళ్లను రద్దు చేసిన నేపథ్యంలో సోమవారం జరిగే అనధికార మంత్రివర్గ సమావేశంలో వీటికి ఎన్నికల నిర్వహణపై కూడా చర్చించనున్నట్లు తెలిసింది. -
ప్రభుత్వాలకు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎటిఎంలు: అక్బరుద్దీన్ ఓవైసీ
హైదరాబాద్: ప్రభుత్వాలకు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎటిఎంలుగా మారాయని అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. ప్రాజెక్టులు మారవు కేవలం పాస్ వర్డ్లు మారుతాయి. వైఎస్సార్ మరణం తో జలయజ్ఞం నిర్వీర్యం అయింది. చాలా ప్రాజెక్టులు పెడింగ్‌లో పడ్డాయి.ఉమ్మడి శాసనసభలో ఇరిగేషన్ పై ఆనాడు గంటల పాటు డిబేట్ జరిగేవి. కాళేశ్వరం నుండి చుక్క నీరు తీసుకోలేదు అని మంత్రి ఉత్తమ్ అన్నారు. మెడిగడ్డ అక్కడ కట్టారు... ఇక్కడ నుండి మార్చారు అని సుదీర్ఘంగా చర్చ జరిగింది.కాళేశ్వరం మరమ్మతులు చేస్తారా ఆపేస్తారా క్లారిటీ ఇవ్వండి. వాళ్ళు ఇంత తిన్నారు అంత తిన్నారు నేను వాటి జోలికి పోను. కాలేశ్వరంలోని నీటిని ఏం చేయాలనుకుంటున్నారు. క్యాబినెట్ అప్రూవల్ తోనే సభలో కమిషన్ రిపోర్ట్ టేబుల్ చేశామని ప్రభుత్వం చెప్తుంది..మరి అంతకంటే ముందే కమిషన్ రిపోర్ట్ వివరాలు మీడియాలో ఎలా బహిర్గతం అయ్యాయి. సభలోని సభ్యుల ముందుకు రాకుండానే మీడియాలో రిపోర్టు రావడం సభ సభ్యులను అగౌరపరచడమే. దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు కాంట్రాక్టు కంపెనీలు ఎలెక్షన్ బాండ్స్ ఇచ్చాయి..Mim పార్టీ , cpi కి మాత్రమే ఇవ్వలేదు. కాంట్రాక్టర్లు పార్టీకి ఫండింగ్ ఇచ్చే సాంస్కృతి మంచిది కాదు. ఏ పార్టీ అధికారంలో ఉన్న ఆ కాంట్రాక్టు కంపనీ అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది. మొత్తం ఘోష్ కమిటీ రిపోర్టు లో కాంట్రాక్టు కంపనీ పేర్లు ఎందుకు పేర్కొనలేదు. అన్ని రిపోర్టులు ఉన్నాయి అంటున్నారు మరి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు.అవినీతి పరులను ఎదో చేసేస్తారు అంటూ ప్రజలు అనుకున్నారు కానీ చేసింది ఏమి లేదు. అవినీతి కాంట్రాక్టు చిన్న పెద్ద అని చూడకుండా ప్రతి ఒక్కరిని శిక్షించండి. పెద్ద కాంట్రాక్టు సంస్థలను ఎందుకు కాపాడుతున్నారు. పెద్ద కాంట్రాక్టు కంపనీలు కాంగ్రెస్ పార్టీకి ఎలెక్షన్ బాండ్స్ ఇచ్చాయి. -
పొన్నం ప్రభాకర్ పుష్కరాల మంత్రి
సాక్షి,హైదరాబాద్: పొన్నం ప్రభాకర్‌పై మాజీ మంత్రి గంగుల కమలాకర్ సెటైర్లు వేశారు. పొన్నం ప్రభాకర్ పుష్కరాల మంత్రి అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై గంగుల చిట్ చాట్ చేశారు.సభలో ఉత్తం, శ్రీధర్ బాబు, సీతక్క బిల్లులను ప్రవేశపెట్టారు.పొన్నం ప్రభాకర్ సభలో ఉండి బిల్లుల పై మాట్లాడం లేదు. పొన్నంతో సంబంధం ఉన్న బిల్లుల గురించి తప్ప..మిగతా విషయాలు మాట్లాడుతున్నారు. పొన్నం ప్రభాకర్ పుష్కరాల మంత్రి. మళ్ళీ 12ఏండ్ల తర్వాతే పొన్నం గెలిస్తే ..గెలుస్తారు.కరీంనగర్లో నేతలతో పొన్నంకు సఖ్యత ఉండదని ఎద్దేవా చేశారు. -
తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్.. గన్‌పార్క్ వద్ద ఆందోళన
తెలంగాణలో కాళేశ్వరం కమిషన్‌పై రిపోర్టు నేపథ్యంలో సభలో వాడీవేడి చర్చ జరిగే..... -
అసెంబ్లీ నేడు ఒక్కరోజే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు రెండోరోజు ఆదివారంతోనే ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. పలు జిల్లాల్లో వర్ష బీభత్సం, గణేశ్ నిమజ్జనం తదితరాల నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అవసరమైతే కొద్ది విరామం తర్వాత మళ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు శనివారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) భేటీలో ప్రభుత్వం ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తో పాటు బీజేపీ, ఎంఐఎం పార్టీలు కూడా కనీసం 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని కోరినట్లు తెలిసింది. ఆ ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించక పోవడంతో భేటీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. కాళేశ్వరం నివేదిక సమర్పించనున్న సీఎం ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ పూర్తి నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభకు సమర్పిస్తారు. దీనిపై చర్చ అనంతరం పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులపై కూడా సభలో చర్చిస్తారు. స్థానిక సంస్థలతో పాటు మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఉన్న గరిష్ట పరిమితిని ఎత్తివేస్తూ సవరణలు ప్రతిపాదిస్తారు. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285 (ఎ)కు సవరణల ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు మార్గం సుగమం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీపీటీకి బీఆర్ఎస్ పట్టు పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు తమకు అవకాశం ఇవ్వాలని బీఏసీ భేటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. ఈ విజ్ఞాపనను పరిశీలిస్తానని స్పీకర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇక కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో జరిగే చర్చలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్ పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. అయితే సభలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ఇప్పటికే దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. యూరియా కొరత, వరద బీభత్సం, విష జ్వరాలు, గురుకులాల్లో విద్యార్థుల మరణాలు తదితర ప్రజా సమస్యలపై చర్చించాలని బీఏసీ సమావేశంలో బీఆర్ఎస్ ప్రతిపాదించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, హరీశ్‌రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ శాసనసభా పక్షం నాయకుడు ఎ.మహేశ్వర్‌రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. ఇక శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మండలి బీఏసీ సమావేశంలో భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబుతో పాటు డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మహేశ్‌కుమార్ గౌడ్, నెల్లికంటి సత్యం, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు పాల్గొన్నారు. -
అసెంబ్లీకి కేసీఆర్ రాకపోతే తప్పు ఒప్పుకున్నట్టే: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రేపటి(ఆదివారం) నుంచి కాళేశ్వరంపై చర్చ జరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీకి కేసీఆర్ రాకపోతే తప్పు ఒప్పుకున్నట్టేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అన్నీతానేనని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్.. అసెంబ్లీకి వచ్చి వివరణ ఇవ్వాలన్నారు. భయపడే కేసీఆర్ మళ్లీ కోర్టుకు వెళ్లారని కోమటిరెడ్డి అన్నారు.కాళేశ్వరం కేసీఆర్ హయాంలోనే రికార్డు స్థాయిలో కట్టారు.. ఆయన హయాంలోనే కూలింది. కాళేశ్వరంపై వేసిన కమిషన్ జడ్జి.. సుప్రీంకోర్టు జడ్జిగా పని చేశారు. మంచి పేరున్న న్యాయమూర్తి ఆయన. సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దానికి భయపడే కేసీఆర్, హరీష్‌రావు కోర్టుకెళ్లారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక తప్పు అని భావిస్తే.. కేసీఆర్ అసెంబ్లీ వచ్చి చెప్పాలి. ప్రతిపక్ష నేతగా జీత భత్యాలు తీసుకుంటున్నాడు.. బాధ్యత ఆయనపై ఉంటది. కాళేశ్వరంపై చర్చ పెడితే అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేయకుండా మా మీద పూలు చల్లుతారా.? తప్పించుకుని పారిపోతారు.కాళేశ్వరం పూర్తి నివేదిక.. కంప్లీట్‌గా చర్చ ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అన్నీ తానే అని చెప్పుకున్న కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుతున్నా.. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లే.. కాళేశ్వరం విషయంలో తప్పైతే తప్పని బాధ్యతగా ఒప్పుకోవాలి. కేసీఆర్ అసెంబ్లీకి.. వస్తాడని అనుకుంటున్నాం. కాళేశ్వరంపై లక్ష కోట్లు తిన్న వాళ్లను వదిలేస్తామా.?. ప్రజల ముందు దోషులుగా నిలబెడతాం. వాళ్లను ఏం చేయాలో ప్రజలు నిర్ణయిస్తారు. కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ 10 ఏళ్లు డిండి, పాలమూరు లాంటి ప్రాజెక్టుల మీద ఎందుకు పెట్టలేదు?’’ అంటూ కోమటిరెడ్డి ప్రశ్నించారు. -
బీఆర్ఎస్ వాకౌట్.. ముగిసిన బీఏసీ సమావేశం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు అప్డేట్స్.. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై చర్చకు కాంగ్రెస్ వ్యూహం.. కమిషన్ విచారణపై పీపీటీకి చాన్స్ ఇవ్వాలంటున్న బీఆర్ఎస్.. -
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఉభయ సభల సమావేశాలు సజావుగా జరిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకరించాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించారు. సభ్యులు అడిగే సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందజేయాలన్నారు. శనివారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభల నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో శుక్రవారం స్పీకర్ తన చాంబర్లో సమీక్ష నిర్వహించారు.శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన చర్చలు జరిగే సమయంలో సంబంధిత అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులు, సభ్యులకు తగిన సమాచారం అందజేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆదేశించారు.భారీ వర్షాలతో కొన్ని మార్గాల్లో రోడ్లు దెబ్బతిన్న నేపథ్యంలో సభ్యులు నిర్ణీత సమయానికి సభకు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సభ జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తు సమాచారం సేకరించి అడ్డుకోవడం ద్వారా సమావేశాలు సజావుగా జరిగేలా చూడాలని స్పీకర్ సూచించారు. కాగా, శాసనమండలి సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన నోడల్, లైజనింగ్ ఆఫీసర్లను నియమించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. -
కాళేశ్వరమే ‘ఎజెండా’!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. సభలో వ్యవహరించాల్సిన తీరుపై అధికార కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ వ్యూహ, ప్రతివ్యూహాలతో సిద్ధమయ్యాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచి్చన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడికి అధికార పార్టీ సిద్ధమవుతోంది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార పక్షం నుంచి ఎదురయ్యే విమర్శల దాడిని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది.పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ద్వారా ప్రాజెక్టు గురించి పూర్తిగా వివరించేందుకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టనుందని తెలిసింది. ఇంకోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణను సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేసే అవకాశముంది. నాలుగు రోజులపాటు సమావేశాలు? శనివారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ ఉభయ సభల సమావేశాలు నాలుగు రోజులపాటు కొనసాగే అవకాశమున్నట్లు సమాచారం. తొలిరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు సంతాపం తెలిపిన అనంతరం అసెంబ్లీ వాయిదా పడనుంది. అనంతరం శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన వేర్వేరుగా బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశాలు జరుగుతాయి. స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీ భేటీలో అసెంబ్లీ సమావేశాలు జరిగే తేదీలు, రోజువారీ ఎజెండాను ఖరారు చేయనున్నారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ, బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, యూరియా కొరత, వరద నష్టం, ప్రభుత్వ పరంగా పునరావాసం, సహాయక చర్యలు, గురుకుల విద్యా సంస్థల్లో సమస్యలు వంటి అంశాలను ఎజెండాలో చేర్చాలని అధికార, విపక్షాలు పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయి. వినాయక నిమజ్జనం నేపథ్యంలో సమావేశాలను వీలైనంత త్వరగా ముగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత సమావేశాల్లోనే శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసే అవకాశముంది. ఈ మేరకు శనివారం స్పీకర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. కాళేశ్వరం అవినీతిపై ప్రజల్లోకి.. అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికను బహిర్గతం చేసే విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలు, కోర్టు కేసులు.. ఇలా అన్నింటికి ఈ సమావేశాల్లోనే జవాబు చెప్పేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బలంగా వాదిస్తూ అసెంబ్లీ రికార్డుల్లోకి ఎక్కించాలనేది అధికార పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇలా నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని భావిస్తోంది.ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళిక, నాణ్యత, నిర్వహణ విషయాల్లో నిర్లక్ష్యం కారణంగానే మేడిగడ్డ బరాజ్ కుంగిపోయిందని, ఈ ప్రాజెక్టు పరిధిలో నీటిని నిల్వచేయొద్దని ఎన్డీఎస్ఏ సూచించినందున ఈ ప్రాజెక్టును ఎలా వినియోగించుకోవాలనే అంశంపై అన్ని పార్టీల అభిప్రాయాలను ప్రభుత్వం కోరనుంది.ఘోష్ నివేదికపై చర్యల కంటే దానిపై చర్చ జరగడమే ప్రధానమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కమిషన్ నివేదిక ఆధారంగా దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేయడ మాత్రమే తమ ఉద్దేశం కాదని, అవసరమైతే బీజేపీ కోరుతున్నట్టు సీబీఐ విచారణకు కూడా వెనుకాడేది లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలోనే ఎండగట్టే వ్యూహంతో బీఆర్ఎస్ పీసీ ఘోష్ కమిషన్‌పై చర్చ, సిట్ ఏర్పాటు పేరిట ఇరకాటంలోకి నెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలను అసెంబ్లీ వేదికగానే తిప్పికొట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, సీనియర్ నేతలు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.రాష్ట్రంలో వరదల మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించటాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతోంది. ఘోష్ కమిషన్ నివేదికపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్.. సోమవారం మరోసారి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. న్యాయస్థానంలో విచారణ జరగమునుపే అసెంబ్లీలో నివేదికను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం తమపై బురద చల్లే ప్రయత్నంలో ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.అసెంబ్లీ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టుపై పీపీటీ ఇచ్చేందుకు అవకాశమివ్వాలని పట్టుబడుతోంది. ప్రభుత్వంలో అవినీతి, గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టు, నీటిపారుదల ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగింత వంటి అంశాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని భావిస్తోంది. ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో జరిగే చర్చలో ప్రతిపక్ష నేత కేసీఆర్ పాల్గొంటారా లేదా అనే అంశంపై బీఆర్ఎస్ గోప్యత పాటిస్తోంది. ఎరువుల కొరత, వరద నష్టంపై ప్రభుత్వం స్పందన వంటి అంశాలపై చర్చ కోసం పట్టుబట్టే వ్యూహంపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. సీబీఐ విచారణకు బీజేపీ పట్టు కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు కోసం పట్టుబట్టాలని బీజేపీ శాసనసభా పక్షం నిర్ణయించింది. సీబీఐ విచారణ ద్వారానే నిజాలు నిగ్గు తేలుతాయని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సన్నద్ధమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ విచారణ కోసం మొదటి నుంచీ డిమాండ్ చేస్తున్న బీజేపీ.. అసెంబ్లీలోనూ అదే వైఖరిని కొనసాగించాలని నిర్ణయించింది. ఎన్డీఎస్ఏ నివేదికపై కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను కూడా తిప్పికొట్టాలని భావిస్తోంది. సిట్ ఏర్పాటులో ప్రభుత్వం చేస్తున్న తాత్సారాన్ని కూడా నిలదీయాలని బీజేపీ నిర్ణయించింది. కాగా ఎంఐఎం, సీపీఐ పార్టీలు అధికారపక్షానికి మద్దతుగా నిలవనున్నట్లు సమాచారం. -
పది పద్దులు... రెండు బిల్లులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ఎనిమిదోరోజు సోమవారం 2025–26 వార్షిక బడ్జెట్ పద్దులపై చర్చ కొనసాగనుంది. పురపాలక, సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమం, పరిశ్రమలు, ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా,శిశు సంక్షేమం, వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖల కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పద్దులపై సభ్యులు చర్చించనున్నారు. ఈ పద్దులపై చర్చతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది.మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన రెండు బిల్లుల్లో సవరణలను ప్రతిపాదించనుంది. దీంతో పాటు లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంలో కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్టు తెలుస్తోంది. మరో 25 ఏళ్ల వరకు పాత పద్ధతినే కొనసాగించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెడతారని, దీనిపై చర్చ అనంతరం ఆమోదించి కేంద్రానికి పంపుతామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
‘బీసీ’ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం...
-
బీఆర్ఎస్ నాయకుల స్టేచర్ గుండుసున్నా.. కేసీఆర్ వందేళ్లు ఆరోగ్యంగా, ప్రతిపక్ష నేతగా ఉండాలి, నేను సీఎంగా ఉండాలి ..రేవంత్‌రెడ్డి
-
కులగణన, ఎస్సీల వర్గీకరణపై నివేదికలను ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ
-
మీరు కోరినట్లు చేస్తే మేం ప్రతిపక్షంలో ఉంటాం: సీఎం రేవంత్
హైదరాబాద్, సాక్షి: ప్రతిపక్ష నేత కేసీఆర్ వచ్చి రైతు భరోసా మీద సలహాలు ఇస్తారని అనుకున్నానని, సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే రావట్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో భూభారతి, రైతు భరోసాలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.బీఆర్ఎస్ హయాంలో క్రషర్ యూనిట్లకు, మైనింగ్ భూములకు రైతు బంధు ఇచ్చారు. లేఅవుట్లు వేసి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వాళ్లకు కూడా రైతు బంధు ఇచ్చారు. రోడ్డు విస్తరణలో పోయిన భూమికి కూడా రైతు బంధు ఇచ్చారు.మేము ఇచ్చినట్లు గానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని కేటీఆర్ అంటున్నారు. మీరు ఇచ్చినట్లు ఇస్తే..మేము ప్రతిపక్షం లో ఉంటాం. ఆ తర్వాత బయటకు వెల్లాల్సి వస్తుంది. కేసీఆర్ చేసిన ఘనకార్యానికి ఇప్పుడు ఆయన సభకు రాలేకపోతున్నారు..గుట్టలు, రోడ్డు, రియలెస్టేట్ వెంచర్లకు రైతు భరోసా ఇవ్వాలా? వద్దా? బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి. మా ప్రభుత్వం సూచనలను తీసుకోవడానికి సిద్ధం గా ఉంది. బీఆర్ఎస్ సభలో ఎంత చిల్లరగా వ్యవహరించినా ఓపికతో ఉన్నాం’ అని రేవంత్ అన్నారు.అబద్ధాల సంఘానికి అధ్యక్షుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రవర్తన, చిత్ర విచిత్ర వేషాలు ప్రజలు గమనిస్తున్నారు. అబద్ధాల సంఘానికి అధ్యక్షుడు సభకు రాలేదు. ఉపాధ్యక్షుడు వచ్చారు.మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి రైతుభరోసాపై సలహాలు ఇస్తారనుకున్నాం. కానీ అలా జరగడం లేదు.గత పదేళ్ల పాలనపై సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే సభకు రావడం లేదేమోఒకసారి అధికారం.. మరోసారి డిపాజిట్లు కోల్పోయిన బీఆర్ఎస్ నేతల తీరు మారడం లేదు. మీరు లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి ఆపసోపాలు పడ్డారు. కానీ మేం మీలా కాదు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రుణమాఫీ చేశామని అన్నారు. -
అదే నిరూపిస్తే.. స్పీకర్ ఫార్మట్‌లో రాజీనామా చేస్తా: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో పాటు అధికార పార్టీ నేతలకు మాజీ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఏ గ్రామంలోనైనా రుణమాఫీ పూర్తయినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసాపై శనివారం చర్చ కొనసాగుతుంది. చర్చలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా ఇవ్వలేదు.రెండు పంటలది రైతు భరోసా ఇవ్వలేదు.ఏడాది కాంగ్రెస్ పాలనలో రూ.17వేల బాకి పడ్డారు.రూ.26వేల కోట్లు రైతులకు బాకీ పడ్డారు.రైతులకు ఉన్న బకాయిలను క్లియర్ చేసి...కొత్త రైతు భరోసా రైతులకు ఇవ్వాలి.రుణమాఫీ రూ.40 వేల కోట్లు సిఎం రేవంత్ రెడ్డి అన్నారు...కేబినెట్లో రూ.31వేలు అయ్యింది. బడ్జెట్ కి వచ్చే సరికి రూ.26 వేల కోట్లయ్యింది.రుణమాఫీ కాలేదు...కొండారెడ్డి, సిరిసిల్ల పోదామా? ఏ ఊరిలో అయినా రుణమాఫీ పూర్తి అయినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఎన్నికల హామీలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి’అని కేటీఆర్ సూచించారు. -
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య.. -
ఫార్ములా ఈ రేస్ కేసుపై అసెంబ్లీలో కేటీఆర్ సవాల్
అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి.. సభలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. -
అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నేడు ఆర్వోఆర్ బిల్లును.. -
భట్టిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
సాక్షి, హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్లో రాష్ట్ర అప్పులపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి, గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. సోమవారం ఈ అంశంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆయన చాంబర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అప్పులపై శాసనసభ, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు ‘2023 డిసెంబర్ 20న అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేసిన శ్వేతపత్రంలో తెలంగాణ అప్పులను రూ.6.71 లక్షల కోట్లుగా చూపించారు. ఈ ఏడాది జూలై 25 నాటి బడ్జెట్ ప్రసంగంలోనూ ఇవే అంకెలను వల్లె వేశారు. కానీ ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్’నివేదికలో 2014–15లో తెలంగాణ మొత్తం రుణాలు రూ.72, 658 కోట్లు కాగా 2024 మార్చి నాటికి రూ.3.89 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడించింది.కానీ ఆర్థిక మంత్రి అప్పులపై ఉద్దేశ పూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారు. ఈ నేప థ్యంలో ఆర్థిక మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నాం’అని బీఆర్ఎస్ ప్రకటించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులకు భంగం: కేటీఆర్ ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అప్పులపై తప్పుదోవ పట్టిస్తున్నందునే సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చాం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ లాబీలో తనను కలసిన మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యానించారు. ‘గతంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఇచ్చిన హక్కుల ఉల్లంఘన నోటీసును నాటి స్పీకర్ మనోహర్ అంగీకరించి సభలో చర్చకు వీలు కల్పించారు.ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు అప్పులపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉండగా కేవలం టూరిజంపైన రాష్ట్ర ప్రభుత్వం చర్చ పెట్టడం బాధాకరం. రాష్ట్రంలో ఢిల్లీ టూరిజం, జైలు టూరిజం బాగా నడుస్తున్నాయి. శాసనసభలో లగచర్ల అంశానికి సంబంధించిన అంశాన్ని చర్చకు తీసుకురావాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశాం’అని కేటీఆర్ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యేలను కూడా అడ్డుకుంటున్నారు ‘గతంలో ఎన్నడూ లేని రీతిలో మాజీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వైపు రాకుండా అడ్డుకుంటున్నారు. గతంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సీఎంను కలిసే అవకాశం ఉండేది. ప్రస్తుతం కనీసం ప్లకార్డులను కూడా తీసుకురాకుండా అడ్డు కుంటున్నారు. మమ్మల్ని కట్టడి చేసి, ప్రభుత్వం తన వైఫల్యాలను దాచుకోవాలని అనుకుంటున్నది. రైతు కూలీలకు రూ.12 వేల అర్థిక సహాయం చేస్తామని ఆర్థిక మంత్రి భట్టి చేసిన ప్రకటన అసెంబ్లీ వ్యవహారాలకు విరుద్ధం. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నప్పుడు విధానపరమైన నిర్ణయాలను సభలోనే ప్రకటించాలన్న అంశాన్ని భట్టి విక్రమార్క విస్మరించారు’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. -
వాకౌట్.. వాయిదాలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల రెండో రోజు సోమవారం బీఆర్ఎస్ నిరసన లు, వాకౌట్, అధికారపక్ష సభ్యుల విమర్శల మధ్య శాసనసభ అర్ధంతరంగా ముగిసింది. ఈ నెల 9న అసెంబ్లీ సమావేశాలు లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ ఒక్క రోజే భేటీ నిర్వహించి, 16వ తేదీకి (సోమవారానికి) వాయిదావేశారు. ఈమేరకు సోమవారం ఉదయం 10 గంటలకు శాసనసభ సమావేశం ప్రారంభమైనా.. ప్రశ్నోత్తరా లు, సంతాప తీర్మానాలు, ప్రభుత్వ బిల్లుల ప్రతిపాదనకే పరిమితమైంది.మాజీ సర్పంచ్‌లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం నిర్దిష్ట హామీ ఇవ్వలేదని నిరసన తెలుపుతూ బీఆర్ఎస్ ప్రశ్నోత్తరాల సమయంలో సభ నుంచి వాకౌట్ చేసింది. ప్రశ్నోత్తరాలు, టీ విరామం తర్వాత సభ తిరిగి సమావేశంకాగానే.. ‘లగచర్ల’అంశంపై చర్చకోసం బీఆర్ఎస్ పట్టుబట్టింది. ఈ గందరగోళంతో స్పీకర్ సభ ను మంగళవారం ఉదయానికి వాయిదా వేశారు. నిర్దేశిత సమయంలోనే ప్రశ్నోత్తరాలు సోమవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలకు సంబంధించి స్పీకర్ ప్రకటన చేశారు. రోజూ గంటపాటు జరిగే ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో.. పది ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఆరు నిమిషాల సమయం లభిస్తోందని తెలిపారు. కానీ నిర్దేశిత సమయంలో పూర్తి చేయకపోవడం, కొన్ని ప్రశ్నలు మిగిలిపోవడంతో సభ్యులు అసంతృప్తి చెందుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో సభ్యులు, మంత్రులు ప్రశ్నలు, సమాధానాలు సూటిగా, క్లుప్తంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. సంతాప తీర్మానాలు.. బిల్లులు.. ⇒ ఉమ్మడి ఏపీ శాసనసభలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించిన ముగ్గురు దివంగత సభ్యులకు శాసనసభ రెండు నిమిషాల పాటు సంతాపం ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి జ్యోతిదేవి (మెట్పల్లి), ఊకె అబ్బయ్య (బూర్గంపాడు, ఇల్లందు), డి.రామచంద్రారెడ్డి (దొమ్మాట) మరణం పట్ల స్పీకర్ ప్రసాద్‌కుమార్ సంతాప తీర్మానం ప్రతిపాదించారు. ⇒ ‘యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ బిల్లు 2024’ను సీఎం రేవంత్ పక్షాన మంత్రి శ్రీధర్‌బాబు సభకు సమరి్పంచారు. ‘తెలంగాణ యూనివర్సిటీస్ (సవరణ) బిల్లు–2024’ను సీఎం తరఫున మంత్రి దామోదర రాజనర్సింహ సభలో ప్రవేశపెట్టారు. వాయిదా తీర్మానాలన్నీ తిరస్కరించిన స్పీకర్ ⇒అసెంబ్లీ సమావేశాల రెండో రోజున బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ సభ్యులు ఇచి్చన పలు వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. ⇒ ‘లగచర్ల’అంశంపై చర్చించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, విజయుడు, మర్రి రాజశేఖర్‌రెడ్డి వాయిదా తీర్మానం ప్రతిపాదించారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి దాడులను అరికట్టడం, బాధితులకు పరిహారం అందించే అంశంపై బీజేపీ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్, పాయల్ శంకర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. ⇒ మూసీ ప్రక్షాళన, హైడ్రాపై చర్చించాలంటూ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. -
కేటీఆర్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. ‘నేను స్పీకర్‌ని. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. బీఆర్ఎస్ ఓడిపోయినా ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారు. నేను స్పీకర్ కావడానికి బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చింది. సీనియర్ సభ్యుడిగా ఉన్న కేటీఆర్ స్పీకర్‌పై ఈ రకమైన వాఖ్యలు చేయడం సరైంది కాదు. బీఆర్ఎస్ ప్రజల్లో విశ్వాసం కోల్పోతోంది. శాసన సభలో ప్రతిపక్షానికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోవడం లేదు’అని వ్యాఖ్యానించారు. అంతకుముందు అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ తీరుపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘శాసనసభ ప్రారంభానికి ముందే మా హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారు. మొదటి రోజే మమ్మల్ని లోపలికి రాకుండా పోలీసులతో అరెస్టు చేయించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా సమస్యలను ఎత్తిచూపేందుకు నిరసన తెలిపితే అరెస్టు చేశారు. మా పార్టీ శాసనసభ్యుల అక్రమ పార్టీ ఫిరాయింపుల పైన నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారు. గత శాసనసభ సమావేశాల్లోనూ మా పార్టీ సభ్యుల గొంతు నోక్కేల వ్యవహరించారు. మాకు అవకాశం ఇవ్వకుండా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారు. మా శాసన సభ్యుల్లో అతి తక్కువ మంది మాత్రమే కొత్త శాసనసభ్యులు ఉన్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న స్పీకర్ వ్యవహార శైలికి నిరసనగా రేపటి నుంచి జరగనున్న ఓరియంటేషన్ సెషన్‌ను బహిష్కరిస్తున్నాము. ఇప్పటికైనా స్పీకర్ పార్టీలకు అతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము’’ అని ట్వీట్లో పేర్కొన్నారు. తాజాగా, కేటీఆర్ వ్యాఖ్యలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ పై విధంగా వ్యాఖ్యానించారు. -
బీఆర్ఎస్ నేతల టీ షర్ట్స్పై రేవంత్ ఫొటో.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ నేతలు.. అదానీ-రేవంత్ ఉన్న ఫొటోతో టీ షర్టులు వేసుకుని వచ్చారు. దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చారు. ఈ క్రమంలో వారంతా రేవంత్, అదానీలు కలిసి ఉన్న ఫొటోలతో టీ షర్టీలు ధరించి అసెంబ్లీ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు నెంబర్-2 వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. టీ షర్టులు ధరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వదం జరిగింది. అనంతరం, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రజా సమస్యలను లేవనెత్తుతాం. రేవంత్-అదానీ ఒక్కటై తెలంగాణ ప్రజలతో ఆడుకుంటున్నారు. ప్రతీ సమస్యపై అసెంబ్లీలో మాట్లాడుతాం. కాంగ్రెస్ ద్వంద్వ విధానాలను ఎండగడతాం.అనంతరం, హరీష్ రావు మాట్లాడుతూ.. రేవంత్-అదానీ టీషర్టు వేసుకుని సభలోకి వస్తే ఇబ్బందేంటి?. ప్రజా ప్రతినిధులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యం అవుతుందా?. అదానీ, రేవంత్ రెడ్డి భాయ్, భాయ్. అరెస్ట్ చేసి, గొంతు నొక్కి మమ్మల్ని ఆపలేరు. -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీజేపీ ఎమ్మెల్యే Vs మంత్రులు
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా కొనసాగే అవకాశం ఉంది.. -
ఎస్వోటీ, గ్రేహండ్స్ తరహాలో హైడ్రా: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: నగరాభివృద్ధికి హైడ్రాను సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఔటర్ లోపల ఉన్న నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్ రోడ్లపై నీరు ఆగకుండా ఉండేందుకు వాటర్ హార్వెస్టింగ్‌లను ఏర్పాటు చేస్తామని రేవంత్ తెలిపారు. మూసీని సబర్మతి, లండన్ థీమ్స్ తరహాలో డెవలప్ చేస్తాం. త్వరలోనే మూసీ ప్రక్షాళనకు కన్సల్టెంట్లను నియమిస్తామని సీఎం పేర్కొన్నారు.ఎస్వోటీ, గ్రేహండ్స్ తరహాలోనే హైడ్రా తెస్తున్నాం. దీని పరిధి 2వేల కిలోమీటర్లకు విస్తరించాం. ప్రపంచంతో పోటీ పడేలా చేసేందుకే సంస్కరణలు తెస్తాం. నగరంలో సరస్సులు అదృశ్యమవుతున్నాయని.. నాలాల కబ్జాలతో హైదరాబాద్ అతలాకుతలమవుతోందని రేవంత్ అన్నారు.మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్‌సాగర్‌కు జలాల తరలింపునకు ప్రణాళిక సిద్ధం చేశామన్న సీఎం.. రూ.6 వేల కోట్ల ప్రతిపాదనలు కేంద్రానికి ఇచ్చామని రేవంత్ చెప్పారు. -
తెలంగాణలో జాబ్ క్యాలెండర్, స్కిల్ వర్సిటీ: మంత్రి శ్రీధర్ బాబు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వేదికగా తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. అతి త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. రాబోయే రోజుల్లో దీని ద్వారా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పుకొచ్చారు. అలాగే, ముచ్చర్లలో స్కిల్ వర్సిటీ కోసం శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు.కాగా, తెలంగాణ అసెంబ్లీలో నేడు ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం చేస్తాం. రెండు లక్షల ఉద్యోగాలు కల్పించినా.. ఇంకా లక్షలాది మంది ఉపాధి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ప్రభుత్వ పరంగా అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదు. గ్రాడ్యుయేట్లలో పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు కొరవడ్డాయి. వారిలో స్కిల్స్ పెంపుపై పారిశ్రామిక వేత్తలు, వీసీలు, విద్యార్థులతో చర్చించాం.ఇందులో భాగంగానే ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ స్థాపనకు ప్రతిపాదిస్తున్నాం. అన్ని కోర్సులు 50 శాతం ప్రాక్టికల్ కాంపోనెంట్ కలిగి ఉంటాయి. నైపుణ్యాలు, ఉపాధి అంతరాల పరిష్కారం కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నాం. స్కిల్ యూనివర్సిటీ ఉపాధి కల్పిస్తుంది.. రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంచుతుంది. రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమల స్థాపనకు ఊతమిస్తుంది. 2024-25 సంవత్సరంలో 2వేల మంది విద్యార్థులకు.. వచ్చే ఏడాది 10వేల మందికి శిక్షణ ఇస్తాం. ముచ్చర్లలో స్కిల్ వర్సిటీ కోసం శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పుకొచ్చారు.ఇక, మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగం సందర్భంగా బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీధర్ బాబు ప్రసంగం ఆపాలని కామెంట్స్ చేశారు. దీంతో, బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీరియస్ అయ్యారు. సభలో గందరగోళం చేస్తున్న బీఆర్ఎస్ సభ్యుల తీరు సరికాదు. పదేళ్ళు పాలించిన బీఆర్ఎస్ సభ్యులకు సభ రూల్స్ తెలియవా?. నిరుద్యోగ యువత కోసం బిల్లు తెస్తే అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీలు సిద్దాంత పరంగా వేరు అయినా బిల్లుకు మద్దతు ఇచ్చారు. స్లోగన్స్ ఇవ్వడానికి అసెంబ్లీ ఫ్లాట్ ఫాం కాదు. యువతకు సంబంధించిన స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై చర్చ జరుగుతుంటే సహకరించాలి కదా? అని ప్రశ్నించారు. మరోవైపు.. బీఆర్ఎస్ సభ్యులపై స్పీకర్ కూడా మండిపడ్డారు. -
సబితపై రేవంత్ వ్యాఖ్యలు.. కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మహిళలను సీఎం రేవంత్ అవమానించారని.. వారంటే సీఎంకు గౌరవం లేదని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలు బాధాకారం.. ‘అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని అంటారా?’ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ, తమ మహిళా శాసనసభ్యులపైన అకారణంగా సీఎం నోరు పారేసుకున్నారన్నారు.ఈ అవమానం కేవలం సబితక్క, సున్నితక్కకు జరిగింది కాదు.. తెలంగాణ ఆడబిడ్డలు అందరి పట్ల జరిగిన అవమానం. నోరు జారితే ఎవరైనా వెనక్కి తీసుకుంటారు కానీ కండకావరంతో సీఎం ఆడబిడ్డలను అవమానించారు. తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తగుల్తది. మా ఇద్దరూ మహిళా నేతలు కష్టపడి ప్రజల మధ్యలో తిరిగి నేతలైన గొప్ప ఆడబిడ్డలు. ప్రజల దీవెనలు కార్యకర్తల ఆశీర్వాదంతో గెలిచి వచ్చినవాళ్లు. నీ లెక్క పార్టీలు మారి పదవులు తెచ్చుకున్న వాళ్లు కారు.. సీఎం గుర్తుంచుకోవాలి’’ అని కేటీఆర్ హితవు పలికారు.‘‘ఇప్పటికైనా ముఖ్యమంత్రి సిగ్గు తెచ్చుకొని... బుద్ధి తెచ్చుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఏ మొహం పెట్టుకుని వచ్చినవని ఉప ముఖ్యమంత్రి అనడం అన్యాయం. ఆడబిడ్డల గురించి అంత దారుణంగా మాట్లాడే అధికారం నీకు ఎవరు ఇచ్చారు భట్టి. పదేళ్లు అధికారంలో ఉన్న ఏరోజైనా ఒక్కరోజైనా ఆడబిడ్డలను అవమానించామా. సీఎంను ఏకవచనంతో మాట్లాడానని అని అభ్యంతరం చెప్తే వెంటనే మార్చుకున్నాం.. అది మాకు కేసీఆర్ నేర్పించిన సంస్కారం’’ అని కేటీఆర్ చెప్పారు. -
పద్దులపై చర్చ.. సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి: స్పీకర్ గడ్డం ప్రసాద్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల అప్డేట్స్గత ప్రభుత్వం రైతులను మోసం చేసింది: కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం గత ప్రభుత్వం రైతుల ఆదాయం డబుల్ చేస్తానని చెప్పిందిరైతులను రారాజు చేస్తామని చెప్పి మోసం చేసింది.వడ్లు వేయాలని చెప్పి.. కొనుగోళ్లు మాత్రమే చెయ్యలేదు.పత్తి వేయొద్దని.. గత ప్రభుత్వం చెప్పింది..అదే ఏడాది పత్తి రేట్లు భారీగా పెరిగింది నిన్న 18 గంటలు...19 పద్దుల పై చర్చ జరిగింది: స్పీకర్ గడ్డం ప్రసాద్పద్దుల పై వరుసగా ఒకేసారి సభ్యులు మాట్లాడాలిసమయాన్ని దృష్టిలో పెట్టుకొని వరుసగా అన్ని పద్దుల పై మాట్లాడాలిసభ సజావుగా జరిగేందుకు నిన్న అందరూ సహకరించారు.ఇవాళ సైతం 19 పద్దుల పై చర్చ జరగాలి.. సభ్యులు సహకరించాలిప్రారంభమైన తెలంగాణ శాసన సభఆరో రోజు శాసన సభ సమావేశాలుప్రశ్నోత్తరాల సమయం రద్దు చేసిన సభస్కిల్ యూనివర్సిటీ పై మొదలైన చర్చస్కిల్ యూనివర్సిటీ బిల్లును సభలో ప్రవేశపెట్టిన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుఅసెంబ్లీ ఆవరణలో రైతు రుణమాఫీ రెండో విడత కార్యక్రమం..వ్యవసాయ ఉత్పత్తులతో వేధికను అలంకరించిన వ్యవసాయ శాఖలక్ష నుంచి లక్షన్నర వరకు రుణమాఫీ కోసం 6 వేల 191 కోట్ల నిధులు కేటాయింపురెండో విడుత నిధులు విడుదల చేయనున సీఎం రేవంత్ రెడ్డి ,డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క17 మంది రైతులకు రుణమాఫీ చెక్కు లను అందజేయనున్న సీఎంసాక్షి, హైదరాబాద్: కాసేపట్లో ఆరో రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఐదో రోజు(సోమవారం) 17 గంటలకు పైగా జరిగిన శాసనసభ.. వేకువ జామున 3 గంటలల వరకు కొనసాగింది. 19 పద్దులకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇవాళ సభ ముందుకు స్కిల్ యూనివర్శిటీ బిల్లు రానుంది. మంత్రి శ్రీధర్‌బాబు సభలో ప్రవేశపెట్టనున్నారు. నేడు అసెంబ్లీ వేదికగా రూ.లక్షన్నర రుణాల వరకు మాఫీ ప్రకటన చేయనున్నారు.తెలంగాణ శాసనసభ మూడో విడత సమావేశాల్లో ఐదోరోజు 2024–25 వార్షిక బడ్జెట్ పద్దులపై సోమ వారం సుదీర్ఘ చర్చ జరిగింది. సమయపాలన పాటించి డిమాండ్లకు పరిమితమై మాట్లాడాల్సిందిగా స్పీకర్ సభ ప్రారంభమైన వెంటనే కోరారు. డిమాండ్లపై చర్చకు సంబంధించి ఒక్కో సభ్యుడికి 15 నిమిషాలపాటు సమయం కేటాయిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.మధ్యాహ్నం మూడు గంటల వరకు చర్చ కొనసాగుతుందని ప్రకటించారు. ప్రశ్నోత్తరాలు లేకుండానే సోమవారం ఉదయం 19 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే నేరుగా పద్దులపై చర్చ ప్రారంభమైంది. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి 19 పద్దులను సంబంధిత శాఖల మంత్రులు ప్రతిపాదించారు.అయితే సభ్యులు తమకు కేటాయించిన సమయం కంటే ఎక్కువ సేపు ప్రసంగించడం, ఒకేరోజు 19 పద్దులను చర్చించి ఆమోదించాల్సి ఉండటంతో సోమవారం అర్ధరాత్రి దాటినా చర్చ కొనసాగింది. -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. పవర్‌పై వాడీవేడి చర్చ
Updates.. సీఎం రేవంత్ కామెంట్స్..కోర్టు ఇచ్చిన తీర్పును కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు.ఇలా మాట్లాడితే ప్రాసిక్యూలేషన్ చేయాల్సి వస్తుంది.కమిషన్ ఛైర్మన్‌ను మార్చాలని మాత్రమే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.విచారణ ఆపాలని కోర్టు చెప్పలేదు. 2021లో పూర్తి చేస్తామని బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసుకున్నారు.ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు.రూ.81వేల కోట్లు అప్పులకు కారణమయ్యారు.నల్లగొండ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు.పార్లమెంట్ ఎన్నికల్లోనే మీ సంగతి తేలిపోయింది.పవర్ ప్లాంట్ పేరుతో దోచుకున్నారు. 👉మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్..మీరు ఫ్లోరోసిన్‌ను మాకు బహుమతిగా ఇచ్చారు.బీహెచ్ఈఎల్కు కాంట్రాక్ట్ ఇస్తే తప్పేంటి?.పవర్ ప్లాంట్ నల్లగొండలో కడితే తప్పు.. వేరే చోట కడితే తప్పా?.సూపర్ క్రిటికల్‌లో అయితే నాలుగేళ్లలో భద్రాద్రి పవర్ ప్లాంట్ పూర్తి చేస్తామని బీహెచ్ఈఎల్ చెప్పింది.బీహెచ్ఈఎల్ సబ్ కాంట్రాక్ట్‌ల్లో మా బంధువు ఒక్కరు కూడా లేరు.మీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా కరెంట్ పోయిందని అధికారులకు ఫోన్ చేశారు.నల్లగొండ తెలంగాణలో లేదా?.కరెంట్ లేదని హెల్ఫ్‌లైన్‌కు ఫోన్ చేస్తే కేసులు పెడుతున్నారు.దానిపై ఎందుకు మాట్లాడటం లేదు?.జీవన్ రెడ్డిపై కూడా కేసు పెడతారా?. 👉గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాపై మూడు మర్డర్ కేసులు పెట్టారు - జగదీష్ రెడ్డి👉మూడు మర్డర్ కేసుల్లో కోర్టు నిర్దోషిగా తీర్చి కేసులను కొట్టివేసింది - జగదీష్ రెడ్డి.👉మంత్రి కోమటిరెడ్డి నాపై రెండు మర్డర్ కేసుల ఆరోపణలు చేశారు - జగదీష్ రెడ్డి.👉ఆ మర్డర్ కేసులో అంశంపై హౌస్ కమిటీ వేయాలని కోరుతున్నా - జగదీష్ రెడ్డి.👉హౌస్ కమిటీ వేసి నిజా నిజాలు తేల్చాలి - జగదీష్ రెడ్డి.👉హౌస్ కమిటీ ద్వారా నిజాలు తేలుతాయి అప్పుడు రాజీనామా వాళ్లు చేస్తారా నేను చేస్తానా అనేది తెలుస్తుంది.👉నేను ఉద్యమంలో పనిచేశాను ఆ కేసులు ఉన్నాయి.. వాళ్ల లాగా సంచులు మోసిన జీవితం నాది కాదు. - జగదీష్ రెడ్డి👉సంచులు మోసి జైలుకుపోయిన జీవితం నాది కాదు. జగదీష్ రెడ్డి👉రికార్డుల నుంచి తొలగించాలి అంటే ముఖ్యమంత్రి మాట్లాడిన వ్యాఖ్యలను సైతం తొలగించాలి. - జగదీష్ రెడ్డి. 👉ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి పై వ్యాఖ్యల మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్👉మర్డర్ కేసులో జైశ్వర్ రెడ్డి ఉన్నారు - కోమటి రెడ్డి👉ఏడాది పాటు జగదీష్ రెడ్డిని జిల్లా బహిష్కరించింది - మంత్రి.👉కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదు - జగదీష్ రెడ్డి.👉కోమటిరెడ్డి చెప్పినట్లుగా నా పై కేసులు ఉన్నట్లు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. - జగదీష్ రెడ్డి👉నిరూపించకపోతే ముఖ్యమంత్రి కోమటిరెడ్డి ఇద్దరు రాజీనామా చేసి ముక్కు నేలకు రాయాలి. - జగదీష్ రెడ్డి👉జగదీష్ రెడ్డి సవాలను స్వీకరిస్తున్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.👉కేసులో రికార్డులు బయటపెడతా... లేకపోతే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా - కోమటి రెడ్డి వెంకట్ రెడ్ 👉సీఎం రేవంత్‌కు జగదీష్ రెడ్డి కౌంటర్..👉చర్లపల్లి జైలుకు వెళ్లిన విషయాలను రేవంత్ గుర్తు చేసుకుంటున్నారు.👉మేము తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లాను.👉జగదీష్ రెడ్డి సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేసింది మర్చిపోయాడు.👉మర్డర్ కేసులో జగదీష్ రెడ్డి ఏ-2: మంత్రి కోమటిరెడ్డి👉మా జిల్లా నుంచి ఏడాది బహిష్కరించారు.👉రాంరెడ్డి హత్య కేసులో ఏ-6👉లక్షా 80వేల దొంగతనం కేసులో ముద్దాయి జగదీష్ రెడ్డి.👉నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే, రాజకీయాల నుంచి తప్పుకుంటాను. సభలో ముక్కు నేలకు రాసి వెళ్లిపోతాను.👉జగదీష్ రెడ్డి ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నాను.👉నేను చెప్పిన కేసులో జగదీష్ రెడ్డి 16 ఏళ్లు కోర్టుల చుట్టూ తిరిగాడు.👉కోమటిరెడ్డి మాటలను రికార్డు నుంచి తొలగించాలి. సీఎం రేవంత్ సీరియస్ కామెంట్స్.. సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..కరెంట్ కొనుగోళ్లపై ఎంక్వైరీ చేయమని అడిగింది మీరే.సత్యహరిశ్చంద్రుడు మా నాయకుడి రూపంలో పుట్టారన్నట్టు మాట్లాడారు.జ్యుడీషియల్ కమిషన్ ముందుకెళ్లి మీ వాదన వినిపించి ఉంటే మీ నిజాయితీ తెలిసేది.కానీ, మీరు కమిషన్ విచారణే వద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లారు.కోర్టు దాన్ని కొట్టేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు.విచారణ కొనసాగించాల్సిదేనని సుప్రీంకోర్టు కూడా చెప్పింది.కమిషన్ ఛైర్మన్‌ను మాత్రమే మార్చాలని సుప్రీంకోర్టు చెప్పింది.సాయంత్రంలోగా విద్యుత్ కమిషన్‌కు కొత్త ఛైర్మన్ పేరును ప్రకటిస్తాం.తెలంగాణను సంక్షోభం నుంచి కాపాడింది సోనియా గాంధీ, జైపాల్ రెడ్డి మాత్రమే.సోనియా గాంధీ దయ వల్ల రాష్ట్రం కరెంట్ సమస్య నుంచి గట్టెక్కింది.లేనిపక్షంలో తెలంగాణ చీకటిమయమయ్యేది.నాడు నేను టీడీపీలో ఉన్నా అసెంబ్లీలో వాస్తవాలు చెప్పాను. దీంతో, నన్నుమార్షల్స్ను పెట్టి బయటకు ఇడ్చుకెళ్లారు. సోలార్ పవర్లో ప్రైవేటు పెట్టుబడులు వచ్చాయి. దీంతో, కరెంట్ ఉత్పత్తి పెరిగింది. సిగ్గులేకుండా ఇంకా మేము విద్యుత్ ఉత్పత్తి చేశామని చెప్పుకుంటున్నారు.బీహెచ్ఈఎల్ నుంచి సివిల్ వర్క్‌లు వాళ్లకు కావాల్సిన వాళ్లకు ఇచ్చారు.ఆఖరికి అటెండర్ పోస్టులు కూడా వాళ్ల బినామీలకే ఇచ్చారు.ఈ సందర్భంగా వాళ్లకు కావాల్సిన వాళ్లకు అనుమతులు ఇచ్చారు. ఇక్కడేవిచారణ అంటే భయపడి కోర్టుకు వెళ్లారు.టెండర్ ఇచ్చి తొమ్మిదేళ్లు అయినా ఇంకా విద్యుత్ ఉత్పత్తి కాలేదు.ఇండియా బుల్స్ నుంచి రూ.1000 కోట్లు దండుకున్నారు.భద్రాద్రి పవర్ ప్లాంట్ ఇప్పటికీ నీళ్లలో మునిగిపోతోంది. 👉అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. 👉ఇప్పటి వరకు డిమాండ్ బుక్స్ ఇవ్వలేదన్న జగదీష్ రెడ్డి.👉రాత్రే పంపించామన్న స్పీకర్👉దేనిపై మాట్లాడాలో అర్థం కావడం లేదు: జగదీష్ రెడ్డి.👉పదేళ్లలో రేపు రాత్రి 10 గంటలకు వచ్చి మాట్లాడే వాళ్లు: శ్రీధర్ బాబు👉హరీష్ రావు బుల్డోడ్ చేసేపని పెట్టుకున్నారు. ఇది మానుకోవాలి: శ్రీధర్ బాబు👉మీరు త్వరగా ఇంటికి వెళ్తే మేమేం చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు. 👉పది రోజుల ముందే సభ పెడితే ఏమయ్యేది: జగదీష్ రెడ్డి.👉ఒకేరోజు 19 పద్దులపై చర్చ పెట్టడం సమంజసమేనా?.👉మీటర్ల విషయంలో సీఎం రేవంత్ సభను తప్పుదోవ పట్టించారు.👉కరెంట్ తలసరి వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.👉ఉదయ్ స్కీమ్‌లో 27 రాష్ట్రాలు చేరాయి.👉ఒప్పందంలో వాళ్లకు అనుకూలమైన అంశాలను మాత్రమే చెప్పారు.👉స్మార్ట్ మీటర్లతో డిస్కంలు చేరాయి. మీటర్ల విషయంలో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. 👉అసెంబ్లీలో విద్యుత్‌పై చర్చ.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్గత ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. అందుకే పవర్ సెక్టార్ గందరగోళంగా మారింది. రైతులకు ఉచిత కరెంట్ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. విద్యుత్ రంగం అస్తవ్యస్తమైంది. యూపీఏ ప్రభుత్వం నిర్ణయం వల్ల 1800 మెగావాట్ల అదనపు కరెంట్ రాష్ట్రానికి వచ్చింది. కేసీఆర్ ఎందుకు రాలేదంటే, మీ స్థాయికి మేము చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇంత పెద్ద విషయంపై చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ సభకు రాలేదు. మీ స్థాయి ఏంటో ప్రజలు మీకు చెప్పారు.కనీసం అధికారులు కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు. చేసిన తప్పులు చాలవని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సభకు రాని వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఎందుకు?.విద్యుత్ సంస్థలు ఎందుకు నష్టాల్లోకి వెళ్లాయి?.ఉచిత కరెంట్ ఇచ్చామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటోంది.ప్రతిపక్షంలో ఉండి ఇప్పటికైనా ప్రభుత్వానికి సహకరించాలి.విద్యుత్ సంస్థలు ఎందుకు నష్టాల్లోకి వెళ్లాయి?.ఉచిత కరెంట్ ఇచ్చామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటోంది.ప్రతిపక్షంలో ఉండి ఇప్పటికైనా ప్రభుత్వానికి సహకరించాలి.గనులకు 250 కి.మీలకు దూరం ఉన్న దామెరచెర్ల దగ్గర పవర్ ప్లాంట్ ఎందుకు పెట్టారు?.యాదాద్రి పవర్ ప్లాంట్ ఇప్పటికీ వినియోగంలోకి రాలేదు.పవర్ ప్లాంట్‌లో టెండర్ వ్యవస్థ లేదు. పారదర్శకత లేదు. 👉విద్యుత్ మీటర్ల అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చిన బీఆర్ఎస్.సీఎం రేవంత్ రెడ్డి మాపై బురద జల్లే ప్రయత్నం చేశారని దీనిపై చర్చకు సిద్దమంటున్న బీఆర్ఎస్.హోం శాఖ, మెడికల్ అండ్ హెల్త్‌పై మాట్లాడనున్న - మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.ఎడ్యుకేషన్ పై చర్చపై మాట్లాడనున్న- ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.ఎక్సైజ్ , ట్రాన్స్ పోర్ట్ చర్చపై మాట్లాడనున్న - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.విద్యుత్ చర్చ పై మాట్లాడనున్న - మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిఎం అండ్యూడీ, ఐటీ మున్సిపల్ చర్చపై మాట్లాడనున్న - ఎమ్మేల్యే వివేకా నంద గౌడ్. 👉తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు ఐదో రోజు కొనసాగనున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక, నేడు ప్రశ్నోత్తరాలు లేకపోవడంతో ఓటింగ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌పైనే చర్చించనున్నారు.👉మరోవైపు.. నేడు సభలో 19 పద్దులపై శాసనసభలో చర్చ ఉండనుంది. ఆర్థిక నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ డిమాండ్లపై, మున్సిపాల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఎంఏయూడీలపై చర్చ జరుగుతుంది.పరిశ్రమల శాఖ పద్దులపై చర్చ..👉ఐటీ, ఎక్సైజ్, హోం, కార్మిక, ఉపాధి, రవాణా, బీసీ సంక్షేమం, పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, మెడికల్ అండ్ హెల్త్‌పై కూడా చర్చించనున్నారు. 19 పద్దులపై చర్చించిన తర్వాత వాటికి శాసనసభ ఆమోదం తెలుపనుంది. ఇక, ముఖ్యమంత్రి వద్దనే మున్సిపల్, విద్యాశాఖ, హోం శాఖ ఉన్న విషయం తెలిసిందే.👉మోటర్లకు మీటర్లు పెట్టేందుకు 2017లోనే ఉదయ్ స్కీంలో గత ప్రభుత్వం సంతకం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఉదయ్ స్కీంపై సంతకం చేయ్యలేదని, మీటర్లు పెట్టలేదు బీఆర్ఎస్ చెబుతోంది. దీనిపై కూడా సభలో చర్చ జరుగనుంది. ఇదిలాఉండగా.. అసెంబ్లీలో పోడు భూముల సమస్యలపై వాయిదా తీర్మానం ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు -
సభలో మా గొంతు నొక్కుతున్నారు.. హరీష్‌రావు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మా గొంతు నొక్కుతున్నారని.. ఏ పార్టీకి ఎంత సమయం ఇచ్చారో లెక్కలు చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం సభను తప్పుదోవ పట్టించే విధంగా ప్రసంగం చేశారని.. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు చేసే ప్రకటనలు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని హితవు పలికారు.‘‘ఉదయ్ స్కీం వల్ల కేంద్ర ప్రభుత్వం 30 వేల కోట్ల రూపాయలు గతంలో మాకు ఇస్తామన్న మేము ఒప్పుకోలేదు. వ్యవసాయ బోర్డు దగ్గర మీటర్లు పెట్టకూడదని 30 వేల కోట్ల రూపాయలను వదులుకున్నాం. వ్యవసాయ బావుల దగ్గర మీటర్లు కాకుండా.. పాత మీటర్ల చోట కొత్త మీటర్ల అంశం అందులో ఉంది. వ్యవసాయ భూములు మీటర్లు ప్రైవేటుపరం చేయకూడదని మేము కేంద్రం పెట్టిన నిబంధనలకు ఒప్పుకోలేదు. కేంద్రం పెట్టిన నిబంధనలకు మేము ఒప్పుకుంటే ప్రతి ఏడాది 5000 కోట్లు మొత్తం ఐదేళ్లు 30 వేల కోట్లు వచ్చేవి’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు.హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందించిన డిప్యూటీ సీఎంహరీష్ రావు వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ మోటార్ల దగ్గర మీటర్లు పెట్టదు. తలకిందులుగా తపస్సు చేసిన రైతులకు అన్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేయదన్నారు. -
‘మా గ్యారెంటీల సంగతి సరే.. పదేళ్లు బీఆర్ఎస్ ఏం చేసింది?’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏ తప్పు చేసిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. అసెంబ్లీలో బడ్జెట్ చర్చలో ఆయన మాట్లాడుతూ, వ్యవసాయానికి 72 వేల కోట్లు ఇవ్వడం తప్పా?. మహిళలను ఆదుకోవడం తప్పా?. గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దడం తప్పా?. మా గ్యారెంటీల సంగతి సరే.. పదేళ్లు బీఆర్ఎస్ ఏం చేసింది’’ అంటూ ప్రశ్నించారు.రైతు భరోసాపై అఖిల పక్షం పెట్టబోతున్నాం. వందకు వంద శాతం రైతు భరోసా అమలు చేస్తాం. గతంలో బడ్జెట్‌పై నేను మాట్లాడితే అవహేళన చేశారు. వాస్తవానికి దూరంగా గత బడ్జెట్‌ను పెట్టారు. గత ప్రభుత్వం లాగా మేము బడ్జెట్ పెట్టాలనుకుంటే మూడున్నర లక్షల కోట్లు పెట్టేవాళ్లం. గత ప్రభుత్వం చివరి బడ్జెట్ రెండు లక్షల 90 వేలు పెట్టింది. వాస్తవానికి దగ్గరగా ఉండాలని మేము ఒక వెయ్యి మాత్రమే పెంచాము. గత ప్రభుత్వం లాగా మేము గాలి బడ్జెట్ పెట్టలేదు.’’ అని భట్టి విక్రమార్క చెప్పారు.‘‘ప్రతి నియోజకవర్గంలో స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాం. స్పష్టమైన విద్యుత్ పాలసీ తీసుకురాబోతున్నాం. వరుస సమీక్షలతో పాలన పరుగులు పెడుతోంది. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రణాళికలు వేస్తున్నాం. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో స్కిల్ యూనివర్శిటీ పెట్టబోతున్నాం. 2035 వరకు విద్యుత్ ప్రణాళికను సిద్ధం చేశాం. రాబోయే 20 ఏళ్లు మేమే అధికారంలో ఉంటాం.’’ అని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.‘‘రుణమాఫీపై మమ్మల్ని రైతులు నమ్మారు. బడ్జెట్‌పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఇచ్చిన మాటను మేం నిలబెట్టుకుంటాం. పదేళ్లలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పట్టించారు. రైతు రుణ మాఫీ చేస్తామంటే అభినందించడం పోయి విమర్శిస్తున్నారు. రైతు రుణమాఫీకి కట్టుబడి ఉన్నాం. ఇరిగేషన్‌పై కూడా ఆరోపణలు చేస్తున్నారు’’ అంటూ భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. -
డిప్యూటీ సీఎం చేస్తా..! అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: ఓల్డ్ సిటీ అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. అభివృద్ధి చేయకపోను ఓల్డ్ సిటీ వాసులను దొంగలుగా చిత్రీకరిస్తున్నారంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో పాతబస్తీకి మెట్రో విషయంలో ఇరువురి మధ్య మాటల యుద్ధ జరిగింది. పాతబస్తీలో కరెంటు బిల్లుల వసూళ్ల కోసం ఆదాని సంస్థకు అప్పగించారు. కేవలం పాతబస్తీని ఎందుకు సెలెక్ట్ చేశారు?. సీఎం నియోజకవర్గం కొడంగల్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గం, శ్రీధర్ బాబు నియోజకవర్గం ఎందుకు పైలెట్ ప్రాజెక్టుగా పరిగణలోకి తీసుకోలేదంటూ అక్బరుద్దీన్ ప్రశ్నించారు.అక్భరుద్దీన్ ప్రశ్నకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానమిస్తూ.. మెట్రో విషయంలో పాతబస్తీని గత ప్రభుత్వం మోసం చేసిందని.. ఎట్టి పరిస్థితుల్లో పాతబస్తీలో మెట్రో నిర్మిస్తామని రేవంత్ అన్నారు. అది ఓల్డ్‌సీటీ కాదు.. ఒరిజినల్ సిటీ. రెండో విడత మెట్రో విస్తరణపై బీఆర్ఎస్ కాకి లెక్కలు చెప్పింది. పాతబస్తీలో మెట్రో నిర్మాణం చేపట్టాలని ఎల్అండ్ టీకి చెప్పాం. లేదంటే చర్లపల్లి, చంచల్‌గూడ జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పానని రేవంత్ అన్నారు.‘‘కాంగ్రెస్ బీ ఫామ్‌పై అక్బరుద్దీన్ పోటీ చేస్తే కొడంగల్‌లో గెలిపించే బాధ్యత నాది.. డిప్యూటీ సీఎంను చేసి పక్కనే కూర్చోబెట్టుకుంటా’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్‌గా.. మజ్లిస్ పార్టీలో తాను సంతోషంగానే ఉన్నానని.. పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. చివరి శ్వాస వరకు ఎంఐఎం పార్టీలోనే కొనసాగుతానంటూ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. -
ఎవరి పాలనలో పవర్ కట్ ఎక్కువ ?
-
బీఆర్ఎస్ Vs కాంగ్రెస్ పాలన.. విమర్శలతో అట్టుడికిన అసెంబ్లీ
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు శనివారం వాడీవేడీగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై.. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఒకరినొకరు విమర్శలతో సభను అట్టుడికించారు.ఈ మేరకు అసెంబ్లీలో శనివారం హరీష్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో బెల్ట్ షాపులు ఎత్తేస్తామని అని అన్నారు.. ఏమైందని ప్రశ్నించారు. బీర్ల ధరలు పెంచి, ప్రజలపై భారం వేస్తారా అని ప్రశ్నించారు. బెల్ట్ షాపులు ఎత్తేస్తే రూ. 42 వేల కోట్లు ఆదాయం ఎలా వచ్చిందని నిలదీశారు. రూ. 7 వేల కోట్ల ఆదాయం ఎలా వస్తుందో చెప్పాలని, ఎక్సైజ్‌పై ఆదాయం పెంచి ప్రజలపై భారం వేయొద్దని అన్నారు.రుణమాఫీ విషయంలో చాలా కోతలు పెట్టారని అన్నారు హరీష్ రావు. రూ. 31 వేల కోట్ల రుణమాఫీని ఒకేసారి చేస్తామని చెప్పారని కానీ.. కోతలతో రూ. 31 వేల కోట్ల నుంచి రూ. 25 వేల కోట్లుకు తగ్గిస్తారా? అని ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీ రూ. 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం సంతోషమే కానీ వైద్యశాఖకు బడ్జెట్ తగ్గిస్తే ఇది ఎలా సాధ్యమవుతుందని విమర్శించారు. గత ప్రభుత్వ పథకాలను మేం అధికారంలోకి వచ్చాక కొనసాగించామని గుర్తు చేశారు.కేసీఆర్ పేరు నచ్చకపోతే మార్చుకోండి.. కానీ కిట్లను అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయాల కోసం పేదల కడుపు కొట్టకండని తెలిపారు. అప్పుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ 6 లక్షల 71 వేల 757 కోట్లు అప్పు చేసిందని పదే పదే ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం ఏర్పడేనాటికి ఉన్న అప్పులు 72 వేల కోట్లు అని.. 72 వేల 658 కోట్ల అప్పులు వారసత్వంగా వచ్చినట్లు తెలిపారు. అయితే 7 లక్షల కోట్లు అప్పు చేశామని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.‘బీసీలకు రూ. 9 వేల కోట్ల బడ్జెట్ మాత్రమే పెట్టారు. మైనార్టీలకు మంత్రివర్గంలో చోటులేదు. ఈ ప్రభుత్వంలో మైనార్టీలకు న్యాయం జరగలేదు. ఉద్యోగులకు కొత్త పీఆర్సీకి అనుగుణంగా కేటాయింపులు లేవు. అభయ హస్తం శూన్య హస్తంలా మారింది. పాలమూరు వెనుకబాటుకు కాంగ్రెస్సే కారణం. మహబూబ్‌నగర్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాం. వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. సోనియా గాంధీతో అబద్దాలు చెప్పారు. మహాలక్ష్మి పథకాన్ని వెంటనే అమలు చేయాలి. బస్సులు సరిపోక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు లేని 15 వందల గ్రామాలకు బస్సులు నడపాలి. రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి’ అని అన్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. తమ బడ్జెట్ చూసి హరీష్ రావుకు కంటగింపుగా ఉందని విమర్శించారు. మంత్రి జూపల్లి గల్లి గల్లీకి బెల్ట్ షాపు పెడతా అని అన్నారా? అని ప్రశించారు. ప్రతిపక్ష నేత బడ్జెట్ పెట్టే సమయంలో సభకు వచ్చారని.. మళ్లీ నేడు సభకు రాలేదని తెలిపారు. హరీష్‌రావు ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.పదేళ్లు రాష్ట్రాన్ని ఆర్థికంగా ధ్వంసం చేశారని అన్నారు భట్టి. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిక తీసుకొచ్చారని దుయ్యబట్టారు. తాము నెల నెల ఉద్యోగులకు జీతాలు ఇచ్చేపని మొదలు పెట్టినట్లు తెలిపారు. హారీష్ రావు ఎందుకు సభను తప్పుదోవ పట్టిస్తారని ప్రశ్నించారు. పూర్తి సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వైన్ షాపు టెండర్లు ముందే ఎందుకు పెట్టారని.. టానిక్ లాంటి దుకాణాలు పెట్టి సర్కార్‌కు డబ్బులు రాకుండా , కొన్ని కుటుంబాలకు వెళ్లేలా చేశారని మండిపడ్డారు. తాము అలా చేయమని.. సర్కార్ సొమ్ము ప్రజలకే చేరేలా చేస్తామని చెప్పారు.2017లో ఆనాటి సీఎం మీటర్లు బిగిస్తామని మోదీతో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సభను తప్పుదోవ పట్టించినప్పుడు సరిద్దాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నామని, విపక్షాలు సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని చెప్పారు.‘బీఆర్ఎస్ తీరు వల్లే కేంద్ర బడ్జెట్లో నిధులు రాలేదు. గతంలో బతుకమ్మ చీరలు ఇస్తే మహిళలు తగలబెట్టిన పరిస్థితి ఉండేది. తెలంగాణ ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతుకుతారు. బతుకమ్మ చీరల విషయంలో అవినీతి జరిగింది. గొర్రెల పథకంలో రూ. 77 కోట్లు స్వాహా చేశారు.. బీఆర్ఎస్ నేతలు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్ల మీద విచారణకు సిద్ధమా?పాలమూరు జిల్లా కేసీఆర్‌కు ఏం అన్యాయం చేసింది. పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి బీఆర్ఎస్ దుర్మార్గం కారణం కాదా?రంగారెడ్డి జిల్లాకు, కొడంగల్‌కు గోదావరి జలాలు ఇవ్వొద్దని కుట్ర చేశారు రంగారెడ్డి జిల్లాకు, కొడంగల్‌కు గోదావరి జలాలు ఇవ్వొద్దని కుట్ర చేశారు. బీఆర్ఎస్ ఆలోచన మారలేదు.. విధానం మారలేదు. అబద్దాలు రికార్డుల్లో ఉంటే కొత్తగా వచ్చే ఎమ్మెల్యేలు నిజమనుకునే ప్రమాదం ఉంది. పూర్తిగా సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారు’ అని రేవంత్ పేర్కొన్నారు.గతంలో హరీస్ రావు ఓ డమ్మీ మంత్రి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిఅబద్దాలు, గారడీలు అంటే బీఆర్ఎస్సేఅధికారంలోకి వస్తే దళితుడిని సీఎంనుచేస్తా అని కేసీఆర్ అన్నారు.హరీష్ రావు దగ్గర సబ్జెక్ట్ లేదు.ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతా అన్న కేసీఆర్.. ఇవాళ సభకు రాలేదు.చీల్చి చెండాడుతా అన్న కేసీఆర్ బడజెట్పై స్పందించలేదు.మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని నెరవేరుస్తున్నాం: మంత్రి శ్రీధర్ బాబుబీఆర్ఎస్ నాశనం చేసిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం -
బడ్జెట్‌పై కేసీఆర్ వ్యాఖ్యలు తగదు.. జగ్గారెడ్డి
ప్రతిపక్షనేత కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై ఆయన స్పందించారు.కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్.. రాష్ట్ర ప్రజలకు దగ్గరగా ఉండే బడ్జెట్. గత పదేళ్ల కాలంలో హైప్ బడ్జెట్..కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రాక్టీకల్ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పదేళ్ల బడ్జెట్ ఊహల్లో విహరించిన బడ్జెట్ అన్న ఆయన.. కాంగ్రెస్ నాయకత్వం వాస్తవానికి ఎప్పుడూ దగ్గరగా ఉంటుందని తెలిపారు. ప్రజా సంక్షేమం కోరి ప్రవేశ పెట్టిన బడ్జెట్ వ్యవసాయానికి పెద్ద పీట వేయడంతో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తే.. గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వం అప్పులకే ప్రాధాన్యత ఇచ్చిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. -
రేవంత్ Vs కేటీఆర్.. మాటల దాడితో హీటెక్కిన సభ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యద్ధం నడిచింది. మేనేమెంట్ కోటా మంత్రి అంటూ కేటీఆర్ కామెంట్స్ చేయగా.. తండ్రి పేరుతో తాను రాజకీయ పదవులు పొందలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్.కాగా, సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. బడ్జెట్లో భాగంగా కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడంపై ప్రభుత్వం తీర్మానం అంటుంది కానీ, మాకు తీర్మాన కాపీ రాలేదు. బహుశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడంపై మాట్లాడం ఇష్టం లేదనుకుంటాను అంటూ వ్యాఖ్యలు చేశారు.కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందిస్తూ.. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే సభకు ప్రతిపక్ష నాయకుడు రాలేదు. సభకి వచ్చేందుకు మాజీ సీఎం కేసీఆర్‌కు భయమేస్తోంది. సభ నుంచి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎంత హడావిడి చేసినా సభ నుంచి బయటకు పంపొద్దు. ఢిల్లీలో చీకటి ఒప్పందాలు బయటపడతాయిన బీఆర్ఎస్ భయపడుతోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో తండ్రి పేరుతో తాను రాజకీయం చేయడం లేదంటూ కౌంటరిచ్చారు. నేనేమీ మేనేజ్మెంట్ కోటాలో మంత్రి, ముఖ్యమంత్రి కాలేదని కామెంట్స్ చేశారు.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ విమర్శలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. తానేమీ పేమెంట్ కోటాలో పదవులు పొందలేదన్నారు. తండ్రి పేరు అంటే రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీని ముఖ్యమంత్రి అంటున్నారా? అని ప్రశ్నించారు. దీంతో, వీరి మధ్య మాటల యుద్ధం నడిచింది. సభలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. -
హరీష్ Vs సీఎం, మంత్రులు.. సభలో వాడీవేడీ చర్చ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాడీవేడి చర్చ నడుస్తోంది. ఆర్టీసీ అంశంపై హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కౌంటరిచ్చారు. దీంతో, మూడు సభ్యులు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.హరీష్‌రావు కామెంట్స్..ప్రభుత్వం భాధ్యతారహితంగా సమాధానం చెబుతోంది.ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు గడుస్తుంది.ఆర్టీసీ పీఆర్సీని ప్రభుత్వం రాగానే ఇస్తాం అన్నారు.ఆర్టీసీ ఉధ్యోగులను ఎప్పటిలోగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారో చెప్పాలి.300 కోట్లు పీఆర్సీ బకాయి చెక్కులు ఫిబ్రవరిలో ఇచ్చారు.ఇంతవరకు అది బస్‌భవన్‌కు చేరలేదు.ఆర్టీసి ప్రభుత్వంలో విలీనంపై ఎందుకు జాప్యం జరుగుతుంది..మంత్రి పొన్నం ప్రభాకర్ జాప్యం జరగటం లేదని బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చారు.కొత్త యూనియన్లు ఎప్పటిలోగా పునరుద్దరిస్తారు.ఆర్టీసీలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వటం లేదుగతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చాము.కొత్త బస్సుల ప్రారంభం నాడు 300కోట్లు చెక్ చూపించారుమహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ఇచ్చింది ఎంత?సీసీఎస్ డబ్బులు మళ్ళించి కార్మికులకు జీతాలు ఇచ్చారా లేదా?హరీష్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..హరీష్ రావుకు క్వశ్చన్ అవర్‌లో క్వశ్చన్ అడిగాలని తెలియదా?ఈ ఉపన్యాసం ఏంటి?.కాంగ్రెస్ మేనిఫెస్టోను హరీష్ రావు బట్టి పట్టారు.. చాలా సంతోషం.సభ్యులు ప్రశ్నలు మాత్రమే అడగండి.. ఉపన్యాసాలు వద్దు.ప్రశ్నోత్తరాల సమయంలో నిరసన చేసే హక్కు సభ్యులకు సభలో లేదు.బీఆర్ఎస్ నాయకులు సభ రూల్స్ తెలుసుకోవాలి.హరీష్ రావు రూల్స్ గురించి మాట్లాడుతున్నారు అందుకే చెప్తున్నా.బీఆర్ఎస్కు ఏదైనా అభ్యంతరం ఉంటే వేరే ఫార్మాట్ ద్వారా రావాలి శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై స్పందించిన హరీష్..శ్రీధర్ బాబు వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి.ప్రశ్నోత్తరాల సమయంలో సరైన సమాధానాలు రాక గతంలో కాంగ్రెస్ చాలాసార్లు వాకౌట్ చేసింది.ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్..ఆర్టీసీ కార్మికుల గురించి హరీష్ రావు మాటలు హస్యాస్పదం.కార్మిక సంఘాలను రద్దు చేసి ఆర్టీసీని చంపేశారు.ఆర్టీసీ కార్మికులు చనిపోతే పట్టించుకోలేదు.2013 నుంచి ఆర్టీసీకి బకాయిలు ఉన్నాయి.కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాటిని విడుదల చేసాము.ఆర్టీసీ ఏడువేల కోట్ల అప్పులతో బీఆర్ఎస్ మాకు అప్పగించింది.మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ నెల రెండు వందల కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం ఇస్తుంది.మూడు వేల ఉద్యోగాలు నియామకం చేశాము.ఓవర్ లోడ్ అవుతుంది.కానీ కార్మికులకు డబుల్ పేమెంట్ జరుగుతుంది.గత మూడు నెలల నుంచి ఆర్టీసీ లాభాల్లో నడుస్తోంది.ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ను ఎండీగా పెట్టీ ఆర్టీసీని బీఆర్ఎస్ నడిపించింది.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆర్టీసీ ఆస్తులను అప్పనంగా అప్పగించారుఆర్టీసీకి అన్యాయం జరగకుండా భవిషత్లో అన్ని చర్యలు తీసుకుంటాంబీఆర్ఎస్ పార్టీకి ఆర్టీసీ గురించి మాట్లాడే అర్హత లేదురిటైర్డ్ ఈడీనీ ఆర్టీసీకి ఎందుకు ఎండీగా పెట్టిందో చెప్పాలి? హరీష్‌కు సీఎం రేవంత్ కౌంటర్హరీష్ రావు సీనియర్ శాసనసభ్యులు, సీనియర్ మంత్రి.హరీష్ రావుకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉంది.స్పీకర్ కుర్చీపై ఆరోపణలు చేయడం ఏ మంత్రికి తగదు.ఆర్టీసీ అంశం ప్రాధాన్యతతో కూడుకున్న సమస్య.ఆర్టీసీ కార్మికుల దీక్షలు చేసి 50 మంది చనిపోయినప్పుడు.. ఆనాడు ప్రభుత్వం వివక్ష చూపింది.సీపీఐ కార్మికుల కోసం కొట్లాడింది వాళ్ల కోసం మాట్లాడడానికి సీపీఐకి అవకాశం ఇచ్చారు.హరీష్ రావు మాట్లాడుతుంది చట్టాలకు విరుద్ధం.ఎవరు ప్రశ్న అడిగితే వాళ్లకే అవకాశం ఇవ్వాలి అన్నది రూల్‌లో లేదుప్రశ్నోత్తరాలు సభకు వస్తే అది సభ సొంతమవుతుంది.సభ సభ్యులందరి ఆస్తి.ఎవరికి అవకాశం ఇవ్వాలి అన్నది చైర్ విచక్షణ మీద ఉంటుంది.రూల్ బుక్కు గురించి బీఆర్ఎస్ అసలు విషయం తెలుసుకోవాలి.గతంలో ఎమ్మెల్యే తన సీటును వదిలి పక్కకు వస్తే సభ నుంచి సస్పెండ్ చేశారు.గతంలో బీఆర్ఎస్ ఆనవాయితీలను ఇప్పుడు కూడా కొనసాగించాలని వాళ్లు కోరుకుంటున్నారు.కుటుంబం వల్ల కార్మిక సంఘాలను గత ప్రభుత్వం రద్దు చేశారు.కార్మికులను కార్మిక సంఘాలను రద్దుచేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై కొత్తగా బీఆర్ఎస్ బురద చల్లుతుంది.హరీష్ రావు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దు.సభలో కొత్త సభ్యులు ఉన్నారు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. -
TS Assembly: కేసీఆర్‌ను ఢిల్లీకి రమ్మనండి, కలిసి దీక్ష చేస్తాం: సీఎం రేవంత్
Updates..👉తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా పడింది. గురువారం మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.👉 ‘కేంద్ర బడ్జెట్’పై తీర్మానానికి బుధవారం తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ‘కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం’ అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ముందు పెట్టారు. కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో తీర్మానంకేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.అసెంబ్లీలోని సభ్యులకు తీర్మానం పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి జరగాలని ఏపీ విభజన చట్టంలో పొందుపర్చారు.తెలంగాణకు అన్యాయం జరగకుండా చట్టం చేశారు. గడిచిన పదేళ్లు ఆ చట్టాలను అమలు చేయలేదు.గత ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయలేదు.కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది వాస్తవం: హరీష్ రావుమీరు అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తామంటే రావడానికి మేము సిద్ధంఢిల్లీలో దీక్ష చేద్దాం రమ్మంటే సిద్ధం.నిరుద్యోగుల గురించి కేటీఆర్ దీక్ష చేయాలని సీఎం అన్నారురుణమాఫీ గురించి నన్ను దీక్ష చేయాలని సీఎం అన్నారుఅన్ని మేమే చేస్తే.. మీరేం చేస్తారు?ఉద్యమ సమయంలో రాజీనామా చేకుండా పారిపోయింది మీరు.పదవులు గడ్డిపోసలెక్క విసిరేసింది మేముఢిల్లీలో మంత్రులు ఆమరణ దీక్ష చేయాలన్ని కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్కేసీఆర్ను ఢిల్లీకి రమ్మని చెప్పండి.నేను కూడా దీక్షలో కూర్చుంటా.ఇద్దరం సచ్చుడో, నిధులు తెచ్చుడో చుద్దాం.చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చామని మేము చెప్పలేదు.మేము ఎవరి శవాలపై రాజకీయాలు చేయలేదుకేటీఆర్ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్సీఎం కూడా సీనియర్ సభ్యులుఆయనకు సభా వ్యవహారాలు తెలుసుసభా నాయకుడికి అనుభవం లేదని కేటీఆర్ మాట్లాడటం సరికాదుబీజేపీకి కోపం వస్తుందని కేటీఆర్ విషయాన్ని వదిలేసి అన్నీ మాట్లాడారు.రాష్ట్ర ప్రయోజనాల కంటే బీఆర్ఎస్కు రాజకీయ ప్రమోజనాలు ముఖ్యంఅమృత్ నిధుల అంశంపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.అమృత స్కీం కింద వచ్చిన నిధుల గురించి మాట్లాడి అసలు విషయం డైవర్ట్ చేస్తున్నారు.రాజకీయ విషయాలు కాకుండా రాష్ట్రానికి పనికొచ్చే విషయాలు మాట్లాడాలిఅమృత్ స్కీం కింద వచ్చిన నిధులకు టెండర్ల ప్రక్రియ సాగుతోంది - విప్ ఆది శ్రీనివాస్సగం తప్పుదారి పట్టించేలాగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి.బీజేపీ ప్రభుత్వం అయోధ్యలో ఓడిపోయింది. ఆదిశ్రీనివాస్ విప్ఓటమి గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదు - ఏలేటి మహేశ్వర్ రెడ్డితెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అక్కడ బిజెపి గెలిచింది .బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్స్కేంద్రం అమృత్ పథకం కింద 3500 కోట్లు ఇచ్చింది.ఆ 3,500 కోట్లను ఎవరికి తెలియకుండా కాంగ్రెస్ మంత్రులు పంచుకున్నారు.మా నియోజకవర్గానికి మూడు కోట్లు అడిగితే మంత్రులు ఇవ్వడం లేదు.మంత్రుల వాళ్ల నియోజకవర్గాలు అభివృద్ధి జరిగితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరిగినట్లు కాదు.అమృత్ నిధులు టెండర్లు లేకుండా మంత్రులు లెక్కలేసుకొని పంచుకున్నారుభట్టి విక్రమార్క కామెంట్స్..కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే మంచిది.బీజేపీని అంటే బీఆర్ఎస్ ఎందుకు బయపడుతోంది. కేటీఆర్ కామెంట్స్..మేము ఎవరితోనూ చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం లేదు.ఆరు గ్యారెంటీల అమలుపై ప్రశ్నిస్తూనే ఉంటాం.కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకున్నా గత పదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం. మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..విభజన చట్టాన్ని కేంద్రం అమలు చేయాలి.ఇప్పటికైనా సమయం మించిపోలేదు.బడ్జెట్ ఆమోదం పొందడానికి ముందే సవరణలు చేయాలని కోరుతున్నాంవిభజన హామీల అంశాల్లో ఒక్కటి లేదు.కేంద్రంపై అందరం కలిసి ఫైట్ చేద్దాం.బీజేపీ తెలంగాణ ప్రజలపై వివక్ష చూపిందివిభజన చట్టం ప్రకారం తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులు ఇవ్వాలితెలంగాణకు ఎనిమిది మంది ఎంపీలు ఇచ్చారు.నిధులు రాబట్టడంలో బీజేపీ తెలంగాణ ఎంపీలు విఫలం అయ్యారు.దేశంలో తెలంగాణ భాగం కాదా?కేంద్రం తెలంగాణను ఎందుకు మర్చిపోయింది?కేంద్రం, బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యద్ధంకేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడంపై ప్రభుత్వం తీర్మానం అంటుంది.కానీ, మాకు తీర్మాన కాపీ రాలేదు. రేవంత్ రెడ్డికి తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడంపై మాట్లాడం ఇష్టం లేదనుకుంటానురేవంత్ కామెంట్స్..కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్.రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే సభకు ప్రతిపక్ష నాయకుడు రాలేదు.సభకి వచ్చేందుకు మాజీ సీఎం కేసీఆర్‌కు భయమేస్తోంది.సభ నుంచి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారు.బీఆర్ఎస్ ఎంత హడావిడి చేసినా సభ నుంచి బయటకు పంపొద్దు.ఢిల్లీలో చీకటి ఒప్పందాలు బయటపడతాయిన బీఆర్ఎస్ భయపడుతోందితండ్రి పేరుతో తాను రాజకీయం చేయడం లేదు.నేనేమీ మేనేజ్మెంట్ కోటాలో మంత్రి, ముఖ్యమంత్రి కాలేదు.కేటీఆర్ కౌంటర్..పేమెంట్ కోటాలో పదవులు పొందలేదు.తండ్రి పేరు అంటే రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీని ముఖ్యమంత్రి అంటున్నారా? అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..నిధుల కేటాయింపులో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందిటూరిజం డెవలప్మెంట్ అంశంలో తెలంగాణకు నిధులు నిల్.నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని ప్రత్యేకంగా కోరాం కేంద్ర బడ్జెట్‌పై మంత్రి సీతక్క ట్వీట్ఇది ఎన్డీఏ బడ్జెట్, ఇండియా బడ్జెట్ కాదుతనను భయపెట్టే బాబు, నితీష్ మీద మోదీ ప్రేమ కురిపించారుఏపీకి 15వేల కోట్లు, బీహార్‌కు 26 వేల కోట్లుఇది యూనియన్ బడ్జెట్ కాదు, కుర్చీ కాపాడుకునే బడ్జెట్ It’s NDA Budget, not INDIA Budget.AP Budget 15,000 cr Bihar Budget 26,000 cr Modi ji showed love on those who he fears ( Babu & Nithish )It’s not union Budget it’s Kursi Bachao Budget @RahulGandhi @revanth_anumula @kharge #KursiBachaoBudget #Budget2024— Danasari Seethakka (@seethakkaMLA) July 24, 2024 👉రేవంత్ తీర్మానం.. తెలంగాణకు అన్యాయం జరిగింది అని సభలో చర్చ జరపాలని తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డిఅసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కామెంట్స్..సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ముందుకు పోతుందిరుణమాఫీ చేయడంతో రైతుల కుటుంబాలు పండుగ చేసుకుంటున్నారురాహుల్ గాంధీ వరంగల్‌లో ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశారుత్యాగాల కుటుంబం గాంధీ కుటుంబంరుణమాఫీ చేసినందుకు తెలంగాణ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారురుణమాఫీ చేసినందుకు యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ప్రసాదం లడ్డులు అసెంబ్లీలో పంపిణీ చేసాం. అసెంబ్లీ లాబీలో హరీష్‌రావు చిట్‌చాట్..కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత లేదు.వీహెచ్ వంటీ సీనియర్ నేతకు ఏ పదవి దక్కలేదు.నిన్న గాక మొన్న పార్టీలోకి వచ్చిన కేశవరావుకు మాత్రం పదవి ఇచ్చారు.మరో సీనియర్ నేత కోదండరెడ్డిని కూడా పక్కకు పెట్టారు.అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది అసెంబ్లీ లాబీలో మంత్రి కోమటిరెడ్డి చిట్‌చాట్..బీఆర్ఎస్కు సభలో మాట్లాడేందుకు వాయిస్ లేదువాయిస్ లేదు కాబట్టే ఆర్టీసీ అంశాన్ని మాట్లాడింది.బీఆర్ఎస్కు అసెంబ్లీలో హరీష్ రావు తప్ప వేరే లీడర్లు లేరు.బీఆర్ఎస్ పార్టీ పోయి తీహార్ జైల్లో పడింది.ఇక, వాళ్ల పార్టీలో ఎవ్వరూ ఉండరు.కేంద్రం తెలంగాణకు మొండి చెయ్యి చూపించింది.తెలంగాణ పేరు ఎత్తకుండా సెంట్రల్ బడ్జెట్ పెట్టడం వివక్షే.తెలంగాణలో బీజేపీకి మంచి గుణపాఠం చెప్తం.సెంట్రల్ బడ్జెట్‌పై రాష్ట్ర బీజేపీ నాయకులు మాట్లాడలేక వాయిస్ పోయింది. అసెంబ్లీ లాబీలో మంత్రి సీతక్క చిట్‌చాట్..10 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో ప్రజా స్వామ్యం కనిపిస్తోంది.బీఆర్ఎస్ హయంలో అసెంబ్లీలో ప్రొటెస్ట్ చేస్తే సస్పెండ్ చేసే వారుతెలంగాణ ఏర్పడిందే నియామకాల కోసం అలాంటి నియామకాలు మీద అధికారంలో ఉన్నపుడు బీఆర్ఎస్ స్పందించలేదు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 30 వేల ఉద్యోగాలతో పాటు, జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చాంఅధికారం పోయాక బీఆర్ఎస్కు నిరుద్యోగులు గుర్తుకు వచ్చి ప్రొటెస్ట్ చేయటం హాస్యాస్పదంగా ఉంది.పదేళ్లుగా ఉద్యోగాల భర్తీని పట్టించుకోని బీఆర్ఎస్, జాబ్ క్యాలెండర్ కోసం డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందిఅసెంబ్లీ పోడియంలోకి వెల్లినా, ప్లకార్డులు ప్రదర్శించినా గత ప్రభుత్వం సస్పెండ్ చేసేదికానీ మా ప్రభుత్వం అలా చేయడంలేదుగతంలో నిరసనలను అణగదొక్కిన బీఆర్ఎస్, ఇప్పుడు నిరసనకు దిగడం ఆశ్చర్యంబీఆర్ఎస్ నిరసనలతో రాష్ట్రంలో ఎంత ప్రజాస్వామ్యం ఉందో అర్థం అవుతుందిఉద్యోగాల భర్తీలో ఉన్న చిక్కు ముడులను విప్పి నియామకాలు చేపట్టాముత్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం గ్రూప్ పరీక్షలపై సభలో హరీష్ రావు కామెంట్స్..జీవో-55 ప్రకారం 1:50 క్యాన్సిల్ చేసిందికాస్ట్ వారీగా మేము 1:50 మేము తీసుకున్నాం.కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ దాన్ని తొలగించి జీవో-29 తెచ్చింది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తున్నారుసీఎం రేవంత్ 1:100 సాధ్యం కాదు అంటున్నారు.కానీ 2006లో వైఎస్సార్ ఈ రేషియో ప్రకారం గ్రూప్-1 చేశారు.వైఎస్ జగన్ గ్రూప్-2 కూడా చేశారువాళ్లకు లేని ఇబ్బంది. మీకు ఎందుకు వస్తుందిగ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల సంఖ్య పెంచండి అంటున్నాముఇబ్బంది వస్తుంది అని సీఎం రేవంత్ అంటున్నారు.కానీ మేము యాడ్ చేశాం.. మాకు రాని లీగల్ సమస్య మీకు ఎందుకు వస్తుంది2008-09లో కాంగ్రెస్ సర్కార్ పోస్టుల సంఖ్య పెంచిందికానీ రేవంత్ సర్కార్ మాత్రం పోస్టుల సంఖ్యను పెంచడం లేదుపలు సమస్యలపై హరీష్ కామెంట్స్..ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పారిపోయిందిరాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని గమనిస్తున్నారుఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంఆర్టీసీ యూనియన్ ను పునరుద్ధరణ చేయడంఇలాంటి సమస్యలపై ప్రభుత్వం ఇప్పటి వరకు కార్యాచరణ చేపట్టలేదునేను రాష్ట్ర మంత్రి అయిన తర్వాత ఆర్టీసీ యూనియన్ గౌరవ అధ్యక్షుడుగా రాజీనామా చేశానుమేము ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానం లేక వాయిదా వేసి పారిపోయిందిమేము అసెంబ్లీలో నిరుద్యోగులపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారుఊసరవెల్లి సైతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి భయపడుతుందికాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయిందిఅధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందిగ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారురాష్ట్రంలో నిరుద్యోగులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారునిరుద్యోగులపై అసెంబ్లీలో మాట్లాడే అవకాశం మాకు ఇవ్వడం లేదురాష్ట్రంలో 21 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయికాంగ్రెస్ వస్తే 25వేల పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు 👉 బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కామెంట్స్..మా నియోజకవర్గాలకు చెందిన ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మాట్లాడాలంటే స్పీకర్ అవకాశం ఇవ్వలేదుబీఆర్ఎస్ పార్టీ అడిగిన ప్రశ్నకు సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావుకు స్పీకర్ మాట్లాడే అవకాశం ఇచ్చారుసభలో సభ్యులందరికీ మాట్లాడే అవకాశం కల్పించాలిప్రశ్న అందరి ప్రాపర్టీ అని సీఎం అంటున్నారు కాబట్టి అందరికీ అవకాశం కల్పించాలని కోరుతున్నాం 👉అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభ్యులకు టీ బ్రేక్..బీఆర్ఎస్, బీజేపీ వాయిదా తీర్మానం తిరస్కరణ..తెలంగాణ రాష్ట్రంలో పంటల నష్టం గురించి బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్.నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇతర న్యాయపరమైన డిమాండ్లపై బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు ఇతర న్యాయమైన డిమాండ్లు చర్చించాలని కోరుతూ కేటీఆర్ వేసిన ప్రతిపాదనను తిరస్కరించిన స్పీకర్ pic.twitter.com/ViedsXuvAB— Telugu Scribe (@TeluguScribe) July 24, 2024వీడియో క్రెడిట్.. Telugu Scribe సీఎం రేవంత్ కామెంట్స్.. హరీష్ రావు సీనియర్ శాసనసభ్యులు, సీనియర్ మంత్రి.హరీష్ రావుకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉంది.స్పీకర్ కుర్చీపై ఆరోపణలు చేయడం ఏ మంత్రికి తగదు.ఆర్టీసీ అంశం ప్రాధాన్యతతో కూడుకున్న సమస్య.ఆర్టీసీ కార్మికుల దీక్షలు చేసి 50 మంది చనిపోయినప్పుడు.. ఆనాడు ప్రభుత్వం వివక్ష చూపింది.సీపీఐ కార్మికుల కోసం కొట్లాడింది వాళ్ల కోసం మాట్లాడడానికి సీపీఐకి అవకాశం ఇచ్చారు.హరీష్ రావు మాట్లాడుతుంది చట్టాలకు విరుద్ధం.ఎవరు ప్రశ్న అడిగితే వాళ్లకే అవకాశం ఇవ్వాలి అన్నది రూల్‌లో లేదుప్రశ్నోత్తరాలు సభకు వస్తే అది సభ సొంతమవుతుంది.సభ సభ్యులందరి ఆస్తి.ఎవరికి అవకాశం ఇవ్వాలి అన్నది చైర్ విచక్షణ మీద ఉంటుంది.రూల్ బుక్కు గురించి బీఆర్ఎస్ అసలు విషయం తెలుసుకోవాలి.గతంలో ఎమ్మెల్యే తన సీటును వదిలి పక్కకు వస్తే సభ నుంచి సస్పెండ్ చేశారు.గతంలో బీఆర్ఎస్ ఆనవాయితీలను ఇప్పుడు కూడా కొనసాగించాలని వాళ్లు కోరుకుంటున్నారు.కుటుంబం వల్ల కార్మిక సంఘాలను గత ప్రభుత్వం రద్దు చేశారు.కార్మికులను కార్మిక సంఘాలను రద్దుచేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై కొత్తగా బీఆర్ఎస్ బురద చల్లుతుంది.హరీష్ రావు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దు.సభలో కొత్త సభ్యులు ఉన్నారు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. 👉రేపు కేబినెట్ భేటీ..రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం.రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేబినెట్.మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మంత్రి శ్రీధర్ బాబు. 👉మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్..ఆర్టీసీ కార్మికుల గురించి హరీష్ రావు దయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నారు.కార్మిక సంఘాలను రద్దు చేసి ఆర్టీసీని చంపేశారు.ఆర్టీసీ కార్మికులు చనిపోతే పట్టించుకోలేదు.2013 నుంచి ఆర్టీసీకి బకాయిలు ఉన్నాయి.కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాటిని విడుదల చేసాము.ఆర్టీసీ ఏడువేల కోట్ల అప్పులతో బీఆర్ఎస్ మాకు అప్పగించింది.మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ నెల రెండు వందల కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం ఇస్తుంది.మూడు వేల ఉద్యోగాలు నియామకం చేశాము. ఆర్టీసీకి ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద రెండు వేల కోట్లు చెల్లించాం - మంత్రి పొన్నం ప్రభాకర్ pic.twitter.com/3do5ayZUDF— Telugu Scribe (@TeluguScribe) July 24, 2024వీడియో క్రెడిట్: Telugu Scribeఓవర్ లోడ్ అవుతుంది.కానీ కార్మికులకు డబుల్ పేమెంట్ జరుగుతుంది.గత మూడు నెలల నుంచి ఆర్టీసీ లాభాల్లో నడుస్తోంది.ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ను ఎండీగా పెట్టీ ఆర్టీసీని బీఆర్ఎస్ నడిపించింది.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆర్టీసీ ఆస్తులను అప్పనంగా అప్పగించారుఆర్టీసీకి అన్యాయం జరగకుండా భవిషత్లో అన్ని చర్యలు తీసుకుంటాంబీఆర్ఎస్ పార్టీకి ఆర్టీసీ గురించి మాట్లాడే అర్హత లేదురిటైర్డ్ ఈడీనీ ఆర్టీసీకి ఎందుకు ఎండీగా పెట్టిందో చెప్పాలి? 👉హరీష్‌రావు Vs మంత్రి శ్రీధర్ బాబు.. హరీష్‌రావు కామెంట్స్..ప్రభుత్వం భాధ్యతారహితంగా సమాధానం చెబుతోంది.ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు గడుస్తుంది.ఆర్టీసీ పీఆర్సీని ప్రభుత్వం రాగానే ఇస్తాం అన్నారు.ఆర్టీసీ ఉధ్యోగులను ఎప్పటిలోగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారో చెప్పాలి.300 కోట్లు పీఆర్సీ బకాయి చెక్కులు ఫిబ్రవరిలో ఇచ్చారు.ఇంతవరకు అది బస్‌భవన్‌కు చేరలేదు.ఆర్టీసి ప్రభుత్వంలో విలీనంపై ఎందుకు జాప్యం జరుగుతుంది..మంత్రి పొన్నం ప్రభాకర్ జాప్యం జరగటం లేదని బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చారు.కొత్త యూనియన్లు ఎప్పటిలోగా పునరుద్దరిస్తారు.ఆర్టీసీలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వటం లేదుగతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చాము.కొత్త బస్సుల ప్రారంభం నాడు 300కోట్లు చెక్ చూపించారుమహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ఇచ్చింది ఎంత?సీసీఎస్ డబ్బులు మళ్ళించి కార్మికులకు జీతాలు ఇచ్చారా లేదా? 👉హరీష్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..హరీష్ రావుకు క్వశ్చన్ అవర్‌లో క్వశ్చన్ అడిగాలని తెలియదా?ఈ ఉపన్యాసం ఏంటి?.కాంగ్రెస్ మేనిఫెస్టోను హరీష్ రావు బట్టి పట్టారు.. చాలా సంతోషం.సభ్యులు ప్రశ్నలు మాత్రమే అడగండి.. ఉపన్యాసాలు వద్దు. 👉సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్..రోడ్డు, కరెంటు లేకుండా తండాను గ్రామ పంచాయతీలు చేశారు.ప్రతీ తండా నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు వేస్తాం.ప్రతీ తండాకు తాగు నీటితో పాటు కరెంటు, రోడ్డు వేస్తాం.ఏడు లక్షల ఇళ్ళకు గత ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదు.బీఆర్ఎస్ నేతలు ఎక్కడికి వెళ్తారో చెప్పండి తీసుకెళ్తాం.ప్రజలు శిక్షించినా బీఆర్ఎస్ నేతలు మారడం లేదు.తండాల అభివృద్ధి జరిగినప్పుడే సంపూర్ణ అభివృద్ధి జరుగుతుంది.సరైన రోడ్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. 👉ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య..తండా గ్రామపంచాయతీలు చెట్ల కింద ఉండి పాలన సాగుతుంది.సర్పంచ్ల నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళించింది.సర్పంచ్ల ఆత్మహత్యకు బీఆర్ఎస్ ప్రభుత్వం కారణం.ఎమ్మెల్యే వంశీకృష్ణ కామెంట్స్..నెంబర్ కోసమే అన్ని తండాలను గ్రామపంచాయతీలు చేశారు.ఒకే తండాను రెండుగా విడగొట్టి, రెండు గ్రామపంచాయతీలు చేశారు.తండా గ్రామపంచాయతీల అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించింది.ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కామెంట్స్..62 కోట్ల మంది మహిళలు ఫ్రీ ఆర్టీసీ బస్సును ఉపయోగించుకున్నారు..ఫ్రీ బస్సు వల్ల దేవాలయాల వద్ద రద్దీ పెరిగింది.కొత్త బస్సులు కొనుగోలు చేసి.. ఆర్టీసీ సర్వీసులు పెంచాలి.రోడ్డు భధ్రత వారోత్సవాలపై మరింత అవగాహన పెంచాలి .మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్..పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా బస్సు టైమింగ్స్ సెట్ చేస్తున్నాం.ఆర్టీసీ ప్రయాణం భధ్రత విషయంలో రాజీపడం.ఆర్టీవోలు కఠినంగా వ్యవహరించాలి.ప్రభుత్వ విప్ రాంచంద్ర నాయక్గత ప్రభుత్వం ఓట్ల కోసం నామమాత్రంగా తండాలను గ్రామపంచాయతీలను చేసింది.తండా గ్రామపంచాయతీలకు ఎటువంటి ఫండ్స్ లేవు.ప్రస్తుతం ప్రభుత్వం ప్రతీ తండా గ్రామపంచాయతీలకు ఆఫీస్‌తో పాటు ప్రత్యేక నిధులు ఇవ్వాలి. మీడియా పాయింట్.. ఎమ్మెల్యే దానం నాగేందర్ కామెంట్స్..బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది.విభజన తరువాత 2 రాష్ట్రాలు చాలా నష్ట పోయాయి..నిర్మల సీతారామన్ తెలంగాణలో పర్యటన సమయంలో..రేషన్ షాప్‌ల దగ్గర ప్రధాని మోదీ ఫోటో ఎందుకు పెట్టలేదు అని డీలర్‌ను, కలెక్టర్‌ను ప్రశ్నించారు.తెలంగాణకు ఏ ముఖం పెట్టుకొని నిర్మల సీతారామన్, కిషన్ రెడ్డి, సంజయ్ వస్తారుమూసీకి ఇతర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని సీఎం ఎన్నో సార్లు అడిగారుతెలంగాణ ప్రజలకు బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు క్షమాపణ చెప్పాలిహైదరాబాద్లో వారిని తిరగనివ్వం.ఇలాంటి ఆర్థిక మంత్రి దేశానికి ఉండటం అరిష్టంవిభజన చట్టంలో ఉన్న అంశాలు పరిష్కారం చేయకపోవడం బాధాకరంఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోకోవాలినిన్న బడ్జెట్లో తెలంగాణ పేరు తీయకపోవడం విచారకరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేపీ వివేకానంద కామెంట్స్..కేంద్ర బడ్జెట్లో రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తీరని అన్యాయం చేసిందిబీఆర్ఎస్ హయాంలో కేంద్రం ఎన్నో ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ముందుకు వెళ్ళిందిదేశానికి ఆదాయం అందించే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి మూడు, నాలుగు స్థానాల్లో ఉందితెలంగాణలో కేసీఆర్ నాయకత్వం ఉండకూడదని కుట్ర చేశారుకేంద్ర బడ్జెట్‌పై సీఎం రేవంత్ రెడ్డి కొత్త నాటకాలకు తెరదీశారుమోదీని బడే భాయ్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారుఅసెంబ్లీలో చర్చ పెట్టి హామీలను నెరవేర్చకుండా కేంద్రంపై నెపంవేసే ప్రయత్నం సీఎం చేస్తున్నారుతెలంగాణకు ఎలాంటి ఐఐఎం ఇవ్వడం లేదని కేంద్ర మంత్రి సీఎంకు లేఖ రాశారుతన కేసుల కోసం కేంద్ర ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి రాజీపడ్డారుబీజేపీతో కుమ్మక్కు అయ్యి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలనుకుంటున్నారు. 👉బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొట్టి రూపాయి కూడా తీసుకురాలేదుతెలంగాణలో బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి చెరో ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ఇచ్చారుతెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి 16 ఎంపీ సీట్లు ఇస్తే ఎన్ని వేల కోట్లు వచ్చే అవకాశం ఉండేదో ఆలోచించండిఏపీకి 15 వేల కోట్లు ఇచ్చారుతెలంగాణపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు డ్రామాలు బంద్ చేయాలితెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తామురెండు లక్షల రూపాయల రుణమాఫీ ఎక్కడ చేశారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి 👉నేడు రెండో రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగనున్నాయి. బుధవారం ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మొదట సభ్యులు అడిగిన ప్రశ్నలకు సదరు మంత్రులు సమాధానం చెబుతారు.👉షార్ట్ డిస్కషన్ కింద కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై చర్చ చేపట్టాలని స్పీకర్‌ను ప్రభుత్వం కోరనుంది. ఈ క్రమంలో స్పీకర్ అనుమతి ఇస్తే కేంద్ర బడ్జెట్‌పై సభలో చర్చ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం.. సభలో తీర్మానం చేయనుంది.👉మరోవైపు.. గోదావరి పరివాహక ప్రాంతంలో పంట నష్టంపై బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం ఇచ్చారు.నేడు అసెంబ్లీలో ఇలా..1) ప్రశ్నోత్తరాలు .2) ప్రభుత్వ రిజల్యూషన్3) నిన్న బీఏసీలో తీసుకున్న నిర్ణయాలు ఉభయసభల్లో టేబుల్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి.4) వివిధ శాఖల్లో యాన్యువల్ రిపోర్టులను ఉభయ సభల్లో టేబుల్ చేస్తారు.ఇదిలా ఉండగా..1. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ 23వ వార్షిక రిపోర్టును సభలో ప్రవేశపెడతారు.2. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ యాన్యువల్ రిపోర్టును విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టనున్నారు.3. తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వార్షిక నివేదికను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెడతారు.4. ఇటీవల దివంగతులైన మాజీ శాసనసభ్యులు డాక్టర్ నెమురు గొమ్ముల సుధాకర్ రావు, మహమ్మద్ విరాసత్ రసూల్ ఖాన్, ధర్మపురి శ్రీనివాస్, రమేష్ రాథోడ్‌లకు సభలో సంతాపం వ్యక్తం చేయనున్నారు.5. శాసనసభలో స్వల్పకాలిక చర్చ(యాక్టివిటీస్ సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ ఇన్ హైదరాబాద్ మెట్రో సిటీ).శాసనసభలో చర్చకు వచ్చే ప్రశ్నోత్తరాలు..1.పాఠశాలలు, కళాశాలల బస్సుల ఫిట్నెస్ తనిఖీలు.2.తండాలు గ్రామపంచాయతీలుగా ఉన్నతీకరణ3.ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు.4.వాణిజ్య పనుల శాఖలో అవకతవకలు.5.నిజామాబాద్ పట్టణ శాసనసభ నియోజకవర్గంలో క్రీడా సముదాయం.6.తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఐటీ ఏర్పాటు.7.ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు చెల్లింపు.8.రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు.9.జాతీయ రహదారి విస్తరణ పనులు.10.మూసీ నదికి ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ చెరువుల అనుసంధానం. -
TS: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Updates... పోచారం శ్రీనివాస్ రెడ్డి నేను - సీఎం రేవంత్ రెడ్డి టీడీపీలో కలిసి కష్టపడి పనిచేశాము నేను బీఆర్ఎస్లో అప్పుడే చేరిన. 2011లో రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఎమ్మెల్సీ రేసులో కిరణ్ కుమార్ రెడ్డి లేరు మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ , మహమూద్ అలీ బీఆర్ఎస్ నుంచి రేసులో ఉన్నారు రేవంత్ చెప్పిన ముగ్గురు ఎమ్మెల్యేలు లాలూచీ పడి కాంగ్రెస్‌కు ఆనాడు ఓటు వేశారు ఆనాడు బీజేపీ లేదు.. మాకు బీజేపీకి ఎలాంటి సంబంధాలు లేవు సీఎం కుర్చీ మార్చాలంటే మేమే వంద మందికి పైగా ఉన్నాము మోడీతో మాకు చర్చలు అవసరం లేదు నిజాలు మాట్లాడితే బాగుంటుంది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రం తెచ్చిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది 2014-24 వరకు పార్లమెంట్లో ఎవరి పక్షాన నిలిచారు? బీజేపీ, బీఆర్ఎస్ ఒకే ఆలోచనతో నడుస్తున్నాయి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రజా పాలన అంటారు అసెంబ్లీ చుట్టూ ఇనుప కంచెలు వేశారు. ప్రజా ప్రభుత్వంలో దిగ్బంధం ఎందుకు చేస్తున్నారు. పోలీసుల సంఖ్య ఎందుకు పెంచారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే మాజీ స్పీకర్ సభ ఆర్డర్ లో ఉండటం లేదు. ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. చిన్న వయసులో రేవంత్ సిఎం అయ్యారు. ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను. చిల్లర మల్లర రాజకీయాలు, కామెంట్స్ వద్దు. ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి. ► సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే ఈ రాత్రికి శాసన మండలిలోనే ఉండే ఆలోచన లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ► కచ్చితంగా శాసన మండలి కి రావాలి, క్షమాపణ చెప్పాలి ఐటి అంశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ మంత్రి శ్రీధర్ బాబు గతంలో దావోస్ వెళ్తే విమర్శలు చేసింది కాంగ్రెస్ - పల్లా ఇప్పుడు సిఎం దావోస్ పర్యటనలో అదానీ గ్రూప్ తో ఒప్పందం చేసుకున్నారు అధానిపై ఆరోపణలు చేస్తూనే ...మరోవైపు ఒప్పందాలు చేసుకుంటుంది కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని వెళ్తాము. నిబంధనల ప్రకారమే పరిశ్రమల ఒప్పందాలు జరిగాయి. ఐటి అభివృద్ధి పై సలహాలు సూచనలు తీసుకుంటాము. ► తెలంగాణ శాసమండలికి భోజన విరామం శాసన మండలిలో గందరగోళం బీఆర్ఎస్ నేతల చిట్టా మా దగ్గర ఉంది: జూపల్లి కృష్ణా రావు ఎవరెవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో మాకు తెలుసు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలపకుండ అడ్డుకోవడం మంచిది కాదు: మంత్రి తుమ్మల సభ గౌరవం పాటించక పోవడం సబబు కాదు అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ మంత్రులు మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్క ఆర్టీసి కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో ఆర్టీసి బస్సులను పెంచాలి. ఆర్టీసి అంశంపై మాట్లాడుతుండగా అడ్డుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసి, ఆటోలను పట్టించుకోలేదు. ఆటో, ఆర్టీసి కార్మికులు 60 రోజులు సమ్మె చేస్తే పట్టించుకోలేదు. ఆటో కార్మికులకు కనీసం 1000 రూపాయలు ఇవ్వని వాళ్ళు బీఆర్ఎస్ ఫ్యూడల్స్ ఆటోలలో వస్తున్నారు మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం కావాలా వద్దా? బీఆర్ఎస్ స్పష్టం చేయాలి. ఆర్టీసి, ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే బీఆర్ఎస్ పట్టించుకోలేదు. ఆర్టీసి అభివృద్ధి పై ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి సీతక్క మహిళలు ఉచిత ప్రయాణం చేస్తే BRS ఓర్వలేక పోతున్నారు. ఆర్టీసి ఉచిత ప్రయాణం కావాలా వద్దా అనేది సూటిగా చెప్పాలి. BRS మళ్ళీ సెంటిమెంట్ రాజకీయాలు మొదలు పెట్టింది. గతంలో అగ్గిపెట్టె దొరక్క యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్టీసి ఆస్తులను అమ్ముకున్నది BRS ప్రభుత్వం ముగిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సమావేశం సమావేశం వివరాలను మంత్రులకు చైర్మన్‌కు వివరిస్తున్న ఎమ్మెల్సీ భాను ప్రసాద్ సీఎం మండలికి వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే అంటున్న ఎమ్మెల్సీలు సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే కౌన్సిల్ సభ్యులకు క్షమాపణలు చెప్పే వరకు మండలి నిర్వహించొద్దు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నినాదాలు సీఎం డౌన్.. డౌన్.. అంటూ నినాదాలు చేసిన ఎమ్మెల్సీలు మరోసారి 10 నిమిషాలు మండలిని వాయిదా వేసిన కౌన్సిల్ చైర్మన్ జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ కౌన్సిల్ ను బీఆర్ఎస్ సభ్యులు అగౌరపరుస్తున్నారు భారాస ఎమ్మెల్సీలు చేసిన ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి పంపారు పెద్దల సభలో ఓపిక ఉండాలి జూపల్లి కృష్ణారావు మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు ఈ విషయంలో ప్రొటెక్ట్ చేసే హక్కులేదు అనవసరంగా సభను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తప్పు దోవ పట్టిస్తున్నారు ► కౌన్సిల్ హాల్ ముందు నల్ల కండువాలతో బైటాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ► తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఆందోళన ► బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనలతో సభ వాయిదా పడింది ► సీఎం రేవంత్‌రెడ్డి మండలి సభ్యులను అవమానించారని.. మండలి సభ్యులకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ► బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నిరసన తెలిపే హక్కు లేదు: మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాన్నాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రవేశపెట్టారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాన్నాన్ని యన్నెం శ్రీనివాస్‌రెడ్డి బలపరిచారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఎసీ అజెండాను టేబుల్ చేయనున్నారు. -
కేటీఆర్ విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కేటీఆర్ విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ వేశారు. కొంతమంది NRIలకు ప్రజాస్వామ్యం విలువ తెల్వదని అన్నారు. కేటీఆర్ చెప్పే పాపాల్లో ఆయన చుట్టూ కూర్చున్న వాళ్ళదే పాత్ర ఉందని మండిపడ్డారు. ఐదేళ్లు సమయం ఉంది.. జరిగిన విధ్వంసం ఏంటో అన్ని బయటపడతాయని అన్నారు. కేటీఆర్ మేనేజ్ మెంట్ కోటాలో రాజకీయాల్లోకి వచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు రాజకీయ జీవితం ప్రసాదించింది కాంగ్రెస్సేనని మర్చిపోవద్దని రేవంత్ రెడ్డి అన్నారు. గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, సింగిల్ విండో చైర్మెన్ గా ఓడినా కేసీఆర్ ను మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీనేనని గుర్తు చేశారు. వైఎస్ఆర్ పాలనలో కేసీఆర్ కుటుంబం నుంచి ఎమ్మెల్యే గా లేకుండా మంత్రిగా చేశారని తెలిపారు. ప్రతిపక్షాలకు 2014కు ముందు అభివృద్ధిపై చర్చ కావాలంటే ఒక రోజు అంతా చర్చించుకుందామని అన్నారు. ప్రజాస్వామ్యంలో 49 శాతానికి 51 శాతానికి చాలా తేడా ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. 51 శాతం నెంబర్ ఉన్నవారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజాస్వామ్యంలో 49 శాతానికి సున్నా వాల్యూ అని తెలిపారు. నా రిప్లే గురించి బీఆర్ఎస్ తహతహలాడుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. అచ్చోసిన ఆంబోతులం .. పోడియంకి వస్తాం అనే అహం పనికిరాదని దుయ్యబట్టారు. ఐదేళ్ల సమయం ఉంది ఏమి జరిగిందో అన్ని తెలుసుకుందాం అని సీఎం రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనపై ఎక్స్‌రై తీస్తానని చెప్పారు. గతం గురించి చర్చ చేద్దాం అంటే.. ఒక్క రోజు సమయం ఇవ్వండి అన్నీ లెక్కలు తీద్దామని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై తమ నాయకులే కొట్లాడారు అని రేవంత్ రెడ్డి అన్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దారుణమైన ప్రసంగం విన్నాక రాష్ట్రం ఎలా ఉండబోతుందో అర్థం అవుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. నాలుగోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదని, ఢిల్లీ నామినేట్ చేసీ ముఖ్యమంత్రి అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో త్రాగు, సాగు, కరెంట్ దిక్కు లేదని అన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ తప్ప ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో 50 ఎకరాల రైతు అయినా సరే గుంపు మేస్త్రి లాగా ఉండేవారని విమర్శించారు. -
సీతక్కకు ప్రచారం ఎక్కువ..పని తక్కువ: హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్ : ములుగు ఎమ్మెల్యే సీతక్క సోషల్ మీడియాలో మాత్రమే ఉంటారని, ఆమెకు పని తక్కువ ప్రచారం ఎక్కువ అని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణభవన్‌లో ములుగుకు చెందిన బీజేపీ నేత రాములు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు హరీశ్‌రావు కండువా కప్పి ఆహ్వానించారు. చేరికల సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ‘ నిరుపేద అమ్మాయి నాగజ్యోతి. ములుగులో ఈసారి ఆమెను గెలిపించాలని కోరుతున్న. ఓడిపోతున్నానని తెలిసి కోపంతో సీతక్క ఇష్టం వచ్చినట్లు నోరు జారుతోంది. ఆమె ఓటమి ఖాయం. 5 గంటల కరెంట్ ప్రచారంతో అబాసుపాలైంది. ఉచిత కరెంట్‌ను ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? వ్యవసాయానికి ఎంత హెచ్‌పీ మోటార్ వాడుతారో కూడా తెలియని అజ్ఞాని రేవంత్ రెడ్డి. కర్ణాటక లో రెండు గంటల కరెంట్ కూడా రావటం లేదని అక్కడి మాజీ సీఎం కుమార స్వామి చెప్తున్నాడు. వంద అబద్ధాలు ఆడైనా సీఎం కుర్చీ దక్కించుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. 11సార్లు అవకాశం ఇచ్చినా కనీసం బిందె నీళ్ళు ఇవ్వడం కాంగ్రెస్‌కు చేతకాలేదు. బీఆర్ఎస్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం పక్కా. కేసీఆర్‌ను కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. మేం తిట్టలేమా’ అని హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. ఇదీ చదవండి.. నా భర్తపై దాడిని ఖండిస్తున్నా: ఎమ్మెల్యే గువ్వల భార్య -
ఆశలకు గండి.. టికెట్ రాకపోవడంతో రమేష్ రెడ్డి ఫ్యామిలీ కన్నీరు..
సాక్షి, సూర్యాపేట: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఎంతో మంది నేతలు సిద్ధమయ్యారు. గత ఐదేళ్లుగా పార్టీనే నమ్ముకుని.. ప్రజలతో మమేకమై ఉన్నారు. ఈ క్రమంలో కొందరు నేతలు టికెట్ ఆశించి భంగపడ్డారు. టికెట్ కేటాయింపు ఎంతో ఆశగా ఉన్న క్రమంలో చివరి సమయంలో టికెట్ దక్కకపోవడంతో కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇక, తాజాగా సూర్యాపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన పటేల్ రమేశ్‌రెడ్డికి సైతం నిరాశ ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రమేశ్ రెడ్డికి టికెట్ నిరాకరించింది. అక్కడ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం టికెట్ ఖరారు చేసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ సన్నిహితుడైనప్పటికీ పటేల్ రమేశ్ రెడ్డికి టికెట్ దక్కలేదు. దీంతో, రమేశ్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీని నమ్ముకుంటే అన్యాయం చేశారని బోరున విలపించారు. మరోవైపు పటేల్ రమేశ్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నేడు సూర్యాపేటలోని ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించనున్నట్టు తెలుస్తోంది. -
ఎర్రబెల్లికి ఎన్నారై ట్రబుల్ !
సాక్షి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకరరావు ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన్ను ఓడించే లక్ష్యంతో హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఓ ఎన్ఆర్ఐ మహిళను రంగంలోకి దించింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఆమెకు పౌరసత్వ సమస్య అడ్డంకిగా మారింది. దీంతో ఆమె కోడలికి పాలకుర్తి టిక్కెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నాకు పౌరసత్వం సమస్యను సృష్టిస్తే..వారసత్వంతో కొడతా అంటోంది ఆ ఎన్ఆర్ఐ. ఎర్రబెల్లిని ఓడిస్తా అంటున్న ఆ ఎన్ఆర్ఐ ఎవరు? ఏమా కథ? ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో పాలిటిక్స్ రక్తికట్టిస్తున్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కంచుకోటగా ఉన్న పాలకుర్తిలో తాజా రాజకీయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఓటమి ఎరుగని నేతగా పేరున్న ఎర్రబెల్లిని ఎదుర్కునేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా సరికొత్త అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దింపింది. ఎన్ఆర్ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి కోడలు యశస్విని రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించి ప్రచారం ముమ్మరం చేశారు. ఎర్రబెల్లికి ఉన్న రాజకీయ అనుభవంలో సగం వయస్సుకూడా లేని యువతి రాజకీయ అరంగేట్రం చేసి..ఎన్నికల బరిలో దిగడం ఇప్పుడు పాలకుర్తి రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రత్యర్థులిద్దరూ ఎత్తుకు పై ఎత్తులతో ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించారు. ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఇప్పటి వరకు ఓ సారి ఎంపీగా, ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉంది. తనపై పోటీ చేసి ఓటమి పాలైన రాజకీయ ప్రత్యర్ధులు మళ్ళీ పోటీకి ఆసక్తి చూపలేని పరిస్థితి తీసుకొచ్చి పాలకుర్తి నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ప్రస్తుతం రాష్ట్రమంత్రిగా కొనసాగుతూ ఏడో సారి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు పాలకుర్తి నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. రాజకీయంగా ఘనమైన చరిత్ర ఉన్న ఎర్రబెల్లిని ఎదుర్కునేందుకు పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పోటీకి సిద్ధమై మూడు మాసాల క్రితం అమెరికా నుంచి ఇండియాకు వచ్చేశారు. సొంతూరు పాలకుర్తికి రాగానే కాంగ్రెస్ లో చేరి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు జవసత్వాలు నింపారు. ఆమె రాకతో రాజకీయంగా కాస్త ఇబ్బంది పడ్డారు ఎర్రబెల్లి. సరైన అభ్యర్థి దొరికారని కాంగ్రెస్ సంబరపడుతుండగా ఝాన్సీరెడ్డి పౌరసత్వ సమస్య పోటీకి అడ్డంకిగా మారింది. అమెరికా పౌరసత్వం ఉన్న ఝాన్సీరెడ్డి ఇండియా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ సకాలంలో ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కోల్పోయారు. ఇక ఎర్రబెల్లి పై పోటీకి సరైన అభ్యర్థి లేరని అందరూ అనుకుంటుండగా...రాజకీయ అనుభవం లేకున్నా.. ఎర్రబెల్లిని ఎదుర్కోవడమే కర్తవ్యంగా భావిస్తూ ఝాన్సీరెడ్డి తన కోడలు యశస్వినిరెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దింపారు. కాంగ్రెస్ అభ్యర్థి కోడలు యశశ్వనిరెడ్డితో కలిసి అత్త నియోజకవర్గంలో ఎంట్రీతోనే సత్తా చాటారు. భారీ ర్యాలీతో గులాబీ గూటిలో గుబులు పుట్టించారు. రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకునే దశలో ఉన్న ఝాన్సీరెడ్డి పౌరసత్వం రాకుండా అడ్డుకుంటే వారసత్వంతో ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. ప్రజాసేవ చేసేందుకు అమెరికాను వదిలి పురిటిగడ్డకు వచ్చిన బిడ్డలాంటి కోడలును ఆశీర్వదిస్తే సమ్మక్క సారక్క మాదిరిగా సేవలందిస్తామని పాలకుర్తి ప్రజల్లో జోష్ నింపారు. మంత్రి ఎర్రబెల్లికి చుక్కలు చూపేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఎర్రబెల్లి మాత్రం ప్రత్యర్థులు ఎవరైనా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పారాచ్యూట్ నేతలకు పాలకుర్తిలో స్థానం లేదంటున్నారు. రాజకీయంగా ఝాన్సీరెడ్డి దూకుడు పెంచడంతో మంత్రి ఎర్రబెల్లి నియోజకవర్గం అంతా కాలుకు బలపం కట్టుకుని తిరుగుతున్నారు. పాలకుర్తిలో సర్వే రిపోర్ట్ లు సైతం ఆందోళన కలిగిస్తుండడంతో ఎర్రబెల్లి వినూత్న పద్ధతిలో ప్రచారం సాగిస్తూ ప్రజల మనిషిగా రికార్డు సృష్టించే పనిలో నిమగ్నమయ్యారు. రాజకీయ పరిణామాలు రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతుండడంతో ఎర్రబెల్లి తోపాటు ఆయన సతీమణి ఉషా దయాకర్ రావు సైతం రంగంలోకి దిగి సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలతో మమేకమై ప్రచారం సాగిస్తున్నారు. అటు కాంగ్రెస్ కేడర్‌తో ఝాన్సీరెడ్డి ఆమె కోడలు యశశ్వనిరెడ్డి.. ఇటు ఎర్రబెల్లి కుటుంబసభ్యులు, గులాబీ పార్టీ శ్రేణులు ఎత్తుకు పై ఎత్తులతో ప్రచారాన్ని హోరెత్తించి ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎర్రబెల్లికి ఎదురు లేదనుకున్న పాలకుర్తిలోఎన్ఆర్ఐ ఝాన్సీరెడ్డి రాకతో రాజకీయం అలజడి మొదలైంది. పోటాపోటీ ప్రచారాలతోపాటు ఇరుపక్షాలవారు వలస రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. నేతల మధ్య మాటల యుద్దం కొనసాగితే అనుచరులు మాత్రం వాట్సాప్ వేదికగా వార్ సాగిస్తున్నారు. సోషల్ మీడియాలో విమర్శలు శృతిమించి కేసుల వరకు వెళ్ళాయి. రాజకీయ వైరం రోజురోజుకు ముదురుతోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎర్రబెల్లి కి వణుకు పుట్టించే పరిస్థితి ఈసారి ఎన్నికల్లో వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో ఇలాంటివి సహజమేనని ఇలాంటి నాయకులను ఎంతో మందిని చూసిన ఎర్రబెల్లికి ఈ ఎన్నిక ఓ లెక్క కాదనే వాదనా వినిపిస్తోంది. మరి ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. -
తాత కేసీఆర్ స్పీచ్‌ను దగ్గరనుంచి చూసిన హిమాన్షు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సందర్శకుల గ్యాలరీలో మంత్రి కె.తారకరామారావు కుమారుడు హిమాన్షు ఆదివారం తన స్నేహితులతో కలిసి వచ్చి సభా వ్యవహారాలను ప్రత్యక్షంగా వీక్షించారు. తెలంగాణ ప్రగతిపై లఘు చర్చ సందర్భంగా కాంగ్రెస్ పక్షనేత భట్టి విక్రమార్క ప్రసంగం, అనంతరం తన తాత, సీఎం కేసీఆర్ ఇచ్చిన సమాధానాన్ని హిమాన్షు విన్నారు. కాగా, నాలుగు రోజులపాటు కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. తెలంగాణ రెండో శాసనసభ (2018–23)కు ఇవే చివరి విడత సమావేశాలు కావడంతో సభ్యులు భారంగా వీడ్కోలు పలికారు. చివరి రోజు సమావేశంలో ‘ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల సేవల విలీనం’బిల్లు తీవ్ర ఉత్కంఠ నడుమ సభ ముందుకు వచ్చి ఆమోదం పొందింది. -
మా అమ్ములపొదిలో ఎన్నో అస్త్రాలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తమ విజయం ఖాయమని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తమ అమ్ముల పొదిలో ఉన్న అ్రస్తాలు తీస్తే విపక్షాలు గాలికి కొట్టుకుపోవాల్సిందేనని అన్నారు. ఈసారి ఎన్నికల్లో గతంలో కంటే 7–8 సీట్లు ఎక్కువ వస్తాయని చెప్పారు. అసెంబ్లీలో ఆదివారం ‘రాష్ట్ర ఆవిర్భావం–సాధించిన ప్రగతి’పై జరిగిన చర్చకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై ఆయన మండిపడ్డారు. తనకు పిండం పెడ్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారని, ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పిండం పెడ్తారో చూద్దాం అంటూ సవాల్ విసిరారు. ‘రాహుల్ ఎన్నికల సభలో మోదీపై చేసిన వ్యాఖ్యకు జైలు శిక్ష వేశారు. మరి మీరు ఇక్కడ పిండం పెడ్తామంటూ పిచ్చికూతలు కూస్తున్నారు. మనసుకు బాధేసినా పోలీసులను ఉసిగొల్పకుండా సంయమనం పాటిస్తున్నాం’అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ అంటే ప్రధాని మోదీకి ఎందుకు వ్యతిరేకమో తెలియదని, తల్లిని చంపి పిల్లను బతికించారంటూ వ్యాఖ్యానాలు చేశారని గుర్తుచేశారు. దేశం ప్రగతి పథంలోకి వెళ్లకుండా అడ్డుపడుతున్నారని సీఎం విమర్శించారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. రైతుబంధు మరింత పెంపు.. ‘కర్ణాటకలో కాంగ్రెస్ అలవికాని హామీలు ఇచ్చింది. వాటిని అమలు చేయలేక అక్కడి సీఎం ఎస్సీ, ఎస్టీ ఫండ్స్ మళ్లిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో ఇచ్చే పెన్షన్ ఎంత?.. తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.4 వేలు పెన్షన్ ఇస్తారా? మేం అలవికాని హామీలివ్వం. గత ఎన్నికల్లో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెబితే.. మేము రూ.లక్ష వరకు చేస్తామని చెప్పాం. మేం 80 సీట్లు గెలిస్తే వాళ్లు 19 సీట్లు గెలిచారు. రెండేళ్ల నుంచి పెన్షన్ రూ.2 వేలు ఇస్తున్నాం. మొదట వెయ్యి ఆ తర్వాత రూ.2 వేలు ఇచ్చాం. కల్యాణలక్ష్మిలో మొదట రూ.50 వేలు.. ఆ తర్వాత రూ.లక్ష ఇచ్చాం. గొర్ల యూనిట్లకు సైతం రూ.1.75 లక్షలకు పెంచాం. రైతుబంధు ఎకరాకు రూ.4 వేలతో మొదలు పెట్టి రూ.5 వేలకు పెంచాం. దీనిని మరింత పెంచుతాం. రుణమాఫీ అమలుతో కాంగ్రెస్ దిగాలు పడింది. నెల రోజుల్లో రుణమాఫీ సొమ్ము మొత్తం రైతుల ఖాతాల్లో జమ చేస్తాం..’అని కేసీఆర్ చెప్పారు. కరెంటు గోల్మాల్ చేస్తారు..రైతుబంధు రాదు ‘ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ముంచింది కాంగ్రెస్ పార్టీయే. ఇదే కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూయే. చివరకు 1969 ఉద్యమంపై కర్కశంగా వ్యవహరించింది కూడా కాంగ్రెస్సే. 1969లో చెన్నారెడ్డి, విద్యార్థులు, ఉద్యోగుల నాయకత్వంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడితే... చివరకు తెలంగాణ డెమొక్రటిక్‌గా 14 ఎంపీ స్థానాల్లో 11 మంది గెలిచారు. యావత్ తెలంగాణ మా తెలంగాణ మాకు కావాలి అంటే ఆనాడు ఇందిరాగాంధీ నో తెలంగాణ అంటూ నిరాకరించారు. అలాగే కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వను అని సభలో చెప్పారు. అయినా ఒక్క తెలంగాణ మంత్రి కూడా వ్యతిరేకించలేదు. త్వరలో దామరచర్లలో 4 వేల మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్‌ను రూ.30 వేల కోట్లతో అందుబాటులోకి తీసుకొస్తున్నాం. దీన్ని కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. వాళ్లు కరెంటు కూడా గోల్మాల్ చేస్తారు. రైతుబంధు రాదు..’అని సీఎం పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో రైతులపై కాల్పులు ‘చంద్రబాబు పాలన సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ మౌన ప్రేక్షక పాత్ర వహించింది. తెలుగుదేశం హయాంలో తెలంగాణలో పరిస్థితులు మరింత దిగజారాయి. ఆనాడు స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి.. ప్రణయ్ భాస్కర్ అనే ఎమ్మెల్యే ‘తెలంగాణ’అంటే.. నో నో తెలంగాణ అనే పదం వాడకూడదని రూలింగ్ ఇచ్చిన స్థాయికి దిగజారింది. ఆ రోజు కూడా కాంగ్రెస్ మౌన ప్రేక్షక పాత్ర పోషించింది. చంద్రబాబు నాయుడు విద్యుత్ సంస్కరణల ముసుగులో విద్యుత్ చార్జీలను పెంచారు. ఒక సంవత్సరం కాదు.. మూడు సంవత్సరాలు 15 శాతం పెరుగుతుందని చెబితే ఆ సమయంలో నేను డిప్యూటీ స్పీకర్‌గా ఉండి లేఖ రాశా. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ప్రజలు, రైతులు బషీర్‌బాగ్‌లో నిరసన తెలిపేందుకు వస్తే కాల్పులు జరిపారు. పట్టపగలు జరిగిన ఆ కాల్పుల్లో కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు చనిపోయారు..’అని కేసీఆర్ గుర్తు చేశారు. కేంద్రం తప్పనిసరిగా అవార్డులు ఇవ్వాల్సి వస్తోంది ‘కేంద్రంలో మమ్మల్ని రాసి రంపాన పెట్టే పార్టీ ప్రభుత్వమే ఉంది. అయినా తప్పనిసరిగా మూడు నెలలకోసారి అవార్డులు ప్రకటించాల్సి వస్తోంది. బండి పోతే బండి, గుండు పోతే గుండు ఇస్తా అన్నోడు పత్తా లేకుండా పోయిండు. రైతులు పండించిన పంట మొత్తం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ధరణి రద్దు చేసి ఏం చేస్తారో కాంగ్రెస్ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ బీఆర్ఎస్ను బీజేపీకి బీ టీమ్ అన్నాడు. సీన్ కట్ చేస్తే ఆయనే వెళ్లి బీజేపీలో జొర్రిండు. మా పార్టీ ఎప్పుడూ లౌకికవాద పార్టీయే. మజ్లిస్– బీఆర్ఎస్ భవిష్యత్‌లో కూడా ఫ్రెండ్లీ పార్టీలుగానే ఉంటాయి..’అని కేసీఆర్ స్పష్టం చేశారు. వీధి నల్లాలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ ‘ప్రపంచమంతా ప్రభావం చూపే హైదరాబాద్ స్థిరాస్తి రంగం పెరుగుతోంది. హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి స్థిరాస్తి కంపెనీలు వస్తున్నాయి. సింగరేణి కార్మికులకు వచ్చే దసరా, దీపావళి సందర్భంగా రూ.వెయ్యి కోట్లు బోనస్ ఇవ్వబోతున్నాం. అప్పుల్లో తెలంగాణ 23వ స్థానంలో ఉంది. పరిమితికి లోబడే అప్పులు చేశాం. నియామక పరీక్షలు దశల వారీగా నిర్వహిస్తున్నాం. గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వాటిని మార్చేందుకు వీలుకాదు. పల్లెలు, పట్టణాల్లో రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తున్నాం. వీధి నల్లాలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. మిషన్ కాకతీయ పుణ్యమే 30 లక్షల బోర్లు నీళ్లు పోస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కాళేశ్వరం నుంచే తుంగతుర్తి, కోదాడ, డోర్నకల్‌కు నీళ్లు వెళ్తున్నాయి. దేశంలోనే అత్యుత్తమ పునరావాసాలు నిర్మించింది తెలంగాణ. కరోనా, నోట్ల రద్దు వంటివి రాకపోయి ఉంటే తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించేది..’అని కేసీఆర్ పేర్కొన్నారు. 7 వేల దరఖాస్తులు పెండింగ్‌లో.. సీఎం సమాధానం తర్వాత ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్నకు కేసీఆర్ వివరణ ఇచ్చారు. ‘మౌజంలు, ఇమాంలకు ఇప్పటికే నెలకు రూ.10 వేలు ఇస్తున్నాం. అయితే ఇంకా 7 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అందరికీ సోమవారం సాయంత్రంలోగా ఉత్తర్వులు ఇచ్చేస్తాం. ఖబరస్తాన్ కోసం మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో 150 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 112 ఎకరాల భూమికి సంబంధించి రేపటిలోగా ఉత్తర్వులు ఇస్తాం..’అని ముఖ్యమంత్రి తెలిపారు. జగన్‌ను అనేక రకాలుగా వేధించారు.. ‘రాజశేఖర్‌రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్రెడ్డిని రాంగ్ హ్యాండిల్ చేసింది. ఆయన్ని అనేక రకాలుగా వేధించి, చివరకు జైల్లో కూడా పెట్టారు. ఆయన సొంత పార్టీ స్థాపించుకున్నారు. ఆ తర్వాత కడప ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక వస్తే ఆయన నాలుగైదు లక్షల బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు. అనంతరం వచ్చిన ఒకటి రెండు ఎన్నికలను కూడా ఆయన స్వీప్ చేయడంతో ఇక ఆంధ్రాలో మన పని అయిపోయిందనే ఆలోచనకు వచ్చారు. 2014 ఎన్నికల సందర్భంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఎదురుగాలి వచ్చింది. ఫలితాలు కూడా అదే విధంగా వచ్చాయి. ఆంధ్రాలో పోయింది. తెలంగాణలోనన్న కనీసం పది సీట్లన్నా రాకపోతాయా అనే ఒత్తిడిలో తెలంగాణ ఇచ్చారే కానీ ప్రేమతో ఇవ్వలేదు..’ అని కేసీఆర్ అన్నారు. దేశమే ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు పేస్కేల్ ‘దేశమే ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు పేస్కేల్ ఇస్తాం. మాకు మానవీయ దృక్పథం ఉంది. ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడాం. త్వరలోనే మధ్యంతర భృతి ఇచ్చి పీఆర్సీని నియమిస్తాం. బ్రహ్మాండంగా జీతాలు పెంచుకుంటాం. రాష్ట్రం ధనికమైతే.. వాళ్లు ధనికులు కావాలి. వారికి నాలుగు రూపాయలు కావాలి. భారత్‌లో అధికంగా వేతనాలు పొందేది తెలంగాణ ఉద్యోగులే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే వీరికి ఎక్కువ జీతాలు ఇస్తున్నాం..’అని సీఎం చెప్పారు. -
తెలంగాణను ముంచిందే కాంగ్రెస్ పార్టీ: కేసీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఆదివారం అసెంబ్లీకి హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీల నేతలకు పొలిటికల్ కౌంటరిచ్చారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కౌంటరిచ్చారు. భట్టి తన పాదయాత్రను రమ్యంగా వర్ణించారని అన్నారు. భట్టి మరోసారి పాదయాత్ర చేయాలని కోరుకుంటున్నా అంటూ కామెంట్స్ చేశారు. పాదయాత్రలో ప్రజలు సమస్యలు చెప్పుకుంటారు. అది సహజమైన పరిణామం అని అన్నారు. ఈ సందర్బంగా సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘చనిపోయేంతవరకు జయశంకర్ తెలంగాణపై రాజీపడలేదు. తెలంగాణను ముంచిందే కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్క లీడర్తోనే తెలంగాణ రాలేదు. తెలంగాణ రాష్ట్రం 50 ఏళ్ల సుదీర్ఘ పోరాటం. తలసారి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ఉన్న తెలంగాణను తుడిచేసింది కాంగ్రెస్, జవహర్‌లాల్‌నెహ్రు అని అన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ కర్కశంగా వ్యవహరించింది. 1969లో ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడితే ఆనాడు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ వ్యతిరేకించారు. టీడీపీ హయాంలో తెలంగాణలో పరిస్థితులు మరింత దిగజారాయి. చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచారు. తాగునీటి కోసం 2.5 లక్షల కిమీల పైప్‌లైన్ వేశాం. కాంగ్రెస్ హయాంలో 35వేల చెరువులు మాయమైపోయాయి. తెలంగాణ ఏర్పడక ముందే మిషన్ కాకతీయ పేరు పెట్టాం. కాళేశ్వరమే లేకపోతే తుంగతుర్తి, డోర్నకల్, కోదాడకు నీల్లు వచ్చేవా?. ఒకప్పుడు ఎండిపోయిన గోదావని నేడు సముద్రాన్ని తలపిస్తోంది. దక్షిణ తెలంగాణకు రేపటి వర ప్రదాయిని కాళేశ్వరం. ఇండియాలోనే మొత్తంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. ఎంత క్రమశిక్షణ పాటిస్తే.. 24 గంటల విద్యుత్ సాధ్యమవుతుంది. 24 గంటల కరెంట్ ఇస్తుంటే అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి పిండాలు పెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారు. కాంగ్రెస్ నేతలా మాకు నీతులు చెప్పేది. మన్యం కష్టాలు కాంగ్రెస్ చరిత్ర అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు వస్తా పోతా ఉంటారు.. నెల రోజుల్లో ప్రభుత్వాన్ని పడగొడతాం అంటారు. మోదీకి మన మీద ఏం పగనో మనకు తెలియదు. జీరో ఫ్లోరోసిస్ రాష్ట్రం ఇండియాలో ఒక్క తెలంగాణ మాత్రమే. బీజేపీ వైఖరేంటో ఎవరికీ అర్థం కాదు. వందేభారత్ రైళ్లకు వందసార్లు జెండా ఊపి ప్రారంభిస్తారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై కూడా కేసీఆర్ విమర్శలు చేశారు. రైల్వేస్టేషన్ లిఫ్టుని కూడా బీజేపీ నేతలు జాతికి అంకితం చేస్తారు’ అంటూ సెటైర్లు వేశారు. ఇది కూడా చదవండి: విషాదం.. ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత -
వీడిన ఉత్కంఠ.. ఆర్టీసీ విలీన డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ విలీన డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదంతో ఆర్టీసీ బిల్లుకు అడ్డంకులు తొలగిపోయాయి. గవర్నర్ ఆమోదించిన ఆర్టీసీ డ్రాఫ్ బిల్లును అధికారులు అసెంబ్లీకి తీసుకొచ్చారు. తమిళిసైతో జరిగిన భేటీ వివరాలను రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివసరాజు సీఎం కేసీఆర్‌కు తెలపనున్నారు. ఈమేరకు ఆయన అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌కు వెళ్లారు. దీంతో అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన ఇవాళే ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెటే అకాశముంది. కాగా ఆర్టీసీ బిల్లును ఆమోదించే ముదు ఆర్టీసీ ఉన్నతాధికారులతో గవర్నర్‌తో భేటీ అయ్యారు. రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, పలువురు ఆర్టీసీ అధికారులు తమిళిసైను రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం కలిశారు. గవర్నర్ అడిగిన వివరాలను అందించారు. తాత్కాలిక ఉద్యోగుల భవితవ్యంపై తమిళిసై ఆరాతీశారు. అధికారులు తెలిపిన వివరాలపై సంతృప్తి చెందిన గవర్నర్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చదవండి: బీఆర్ఎస్ ప్రభుత్వంపై అక్బరుద్దీన్ ప్రశంసలు.. కేసీఆరే మళ్లీ సీఎం! -
బీఆర్ఎస్ ప్రభుత్వంపై అక్బరుద్దీన్ ప్రశంసలు.. కేసీఆర్ మళ్లీ సీఎం!
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ పాలనపై అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రశంసలు కురిపించారు. తమ ప్రయాణం బీఆర్‌ఎస్‌తోనేనని స్పష్టం చేశారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. తమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని చెప్పారు. శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు-స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిపై అక్బరుద్దీన్ ఒవైసీ లఘుచర్చను ప్రారంభించారు. జైపూర్ రైలు ఘటనలో చనిపోయిన హైదరాబాద్ యువకుడికి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఇందుకు రాష్ట్ర సర్కారుకు, కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని అక్బరుద్దీన్ చెప్పారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని అన్ని రాష్ట్రాలు చూసి నేర్చుకోవాలన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండటం గర్వంగా భావిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో 50 లక్షల మంది ముస్లీం మైనార్టీలు ఉన్నారని వారి ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2200 కోట్లు కేటాయించిందన్నారు. మైనార్టీలకు షాదీముబారక్, ఓవర్సీస్ స్కాలర్షిప్ వంటి పథకాలు చేపట్టారని వెల్లడించారు. రెండో హజ్ హౌస్‌కు ప్రభుత్వం రూ.23 కోట్లు కేటాయించిందని చెప్పారు. 58, 59 జీవో కింద పట్టాలు ఇచ్చి ప్రభుత్వం పేదలను ఆదుకుంటుంన్నదని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సక్షేమాభివృద్ధికి కృషిచేస్తుందన్నారు. -
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నేను ఉండకపోవచ్చు: ఎమ్మెల్యే రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రెండో శాసనసభ ఆఖరి విడత సమావేశాలు చివరి అంకానికి చేరుకున్నాయి. మూడు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు నేటితో (ఆదివారం) తెరపడనుంది. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తాను ఉండకపోవచ్చని అన్నారు. తనను అసెంబ్లీలో ఉండొద్దని సొంతపార్టీ నేతలతోపాటు బయట వ్యక్తులు కోరుకుంటున్నారని ఆరోపించారు. తన చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతున్నాయని, సభకు ఎవరు వస్తారో.. రారో తెలియదని అన్నారు. ధూల్‌పేటలో పర్యటించి అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మాటిచ్చి తప్పారని రాజాసింగ్ ప్రస్తావించారు. అసెంబ్లీలో తాను లేకున్నా.. ధూల్‌పేటని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా స్పీకర్‌ను కోరారు. గుడుంబా నిషేధం తర్వాత ధూల్‌పేట ప్రజలు ఉపాధి కోల్పోయారని, తాను ఉన్నా లేకున్నా ధూల్‌పేట వాసులకు వచ్చే ప్రభుత్వ ఆశీర్వాదాలు ఉండాలని అన్నారు. తన తరుపున వారిని ఆదుకోవాలని కోరారు. రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. కాగా మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను రాజాసింగ్‌పై గతేడాది ఆగస్టు 23న బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయనపై చర్యలు తీసుకుంటున్నట్లు హైకమాండ్ తెలిపింది. శాసన సభాపక్ష పదవినుంచి కూడా తొలగించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయనను పార్టీ కార్యకలాపాలకు దూరంగా పెడుతూ వస్తున్నారు. చదవండి: సభ నుంచి ఎమ్మెల్యే సీతక్క వాకౌట్.. బీఆర్ఎస్పై సంచలన వ్యాఖ్యలు -
తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వద్ద ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ మెరుపు ముట్టడికి ఎస్ఎఫ్ఐ నేతలు, విద్యార్థులు యత్నించారు. 100 మందికి పైగా విద్యార్థులు ఒక్కసారిగి అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసనకు దిగిన మహిళలను సైతం ఈడ్చిపడేశారు. దీంతో అసెంబ్లీ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్లు ►మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియింబర్స్‌మెంట్ రూ. 5,177 కోట్ల బకాయిలు తక్షణమే విడుదల చేయాలి. ► పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ►హై స్కూల్స్, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్‌లోకి విద్యార్థి సంఘాలను అనుమతించవద్దని సెక్యులర్ పేరుతో విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఇచ్చిన ఆదేశాలు వెనక్కి తీసుకోవాలి. ►తక్షణమే అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలు కేజీబీవీ సంక్షేమ హాస్టల్ లను సొంత భవనాలు నిర్మించాలి. ► నూతన జాతీయ విద్యా విధానం 2020 తెలంగాణలో అమలు చేయకుండా అసెంబ్లీ తీర్మానం చేయాలి. -
తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా
UPDATES తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగింపు.. ఇవాళే(ఆదివారం) ఆర్టీసీ విలీనం బిల్లు ఆమోద ముద్ర పొందడంతో అసెంబ్లీ సమావేశాల పొడిగింపు నిర్ణయం ఉపసంహరణ. తొలుత రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని నిర్ణయించారు. కానీ ఆర్టీసీ విలీనం బిల్లు ఆమోదం పొందడంతో పొడిగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. దాంతో తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న సభ్యులకు హృదయ పూర్వక అభినందనలు అంటూ స్పీకర్ పేర్కొన్నారు. అసెంబ్లీలో తెలంగాణ ఆర్టీసీ విలీనం బిల్లు ఆమోదం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగం ►1969 తెలంగాణ ఉద్యమంపై కాంగ్రెస్ కర్కశంగా వ్యవహరించింది ►భట్టి విక్రమార్క తన పాదయాత్రను రమ్మంగా వర్ణించారు ►మరో పర్యాయం పాదయాత్ర చేయాలని కోరుతున్నా ►పాదయాత్రలో ప్రజలు సమస్యలు చెప్పుకుంటారు ►అది సహజమైన పరిణామం ►తెలంగాణను ముంచిందే కాంగ్రెస్ తెలంగాణ ప్రజల మనసుల్ని తీవ్రంగా గాయపరిచింది కాంగ్రెసే ►బీజేపీ కూడా తెలంగాణను కించపరిచింది ► తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరో రెండు రోజులు పొడిగింపు ►సీఎల్పీకి మంత్రి ప్రశాంత్ రెడ్డి ►నిన్న అసెంబ్లీలో అవమానం జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసంతృప్తి ►కేటీర్ వ్యాఖ్యలపై స్పీకర్‌కు ఫిర్యాదు ►స్పీకర్ ముందు నిరసన తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ►కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడిన మంత్రి ప్రశాంత్ రెడ్డి ► స్పీకర్‌తో ముగిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ ► సభను తప్పుదోవ పట్టించేలా అధికార పక్ష వ్యవహరిస్తోందని ఆరోపణ ► కేటీఆర్ సభలో అబద్దాలు మాట్లాడారు: సీఎల్పీ నేత భట్టి ► కట్టడి చేయాల్సిన స్పీకర్ కూడా పట్టించుకోవడం లేదు ►దీనిపై స్పీకర్ ముందు నిరసన చేస్తున్నాం. ►కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలి. అసెంబ్లీలో ప్రొఫెసర్ జయశంకర్ సార్‌కు నివాళులు ►తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అసెంబ్లీలోని హాల్లో ఆచార్య జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ బిల్లుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందన ► ఆర్టీసీ బిల్లుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కుటుంబం కన్నుపడిందని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులపై ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలోని గవర్నర్ అయినా బిల్లు పాస్ చేయాలంటే లీగల్ ఒపీనియన్ తీసుకుంటారని తెలిపారు. ► బిల్లుకు ఆమోదం తెలుపాలి అంటే ఒకటి రెండు రోజుల సమయం పడుతుందని, అవసరమైతే అసెంబ్లీని రెండు రోజులు పొడిగించి ఆర్టీసీ బిల్లును ఆమోదించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ బిల్లు కోసం ప్రత్యేకంగా సెషన్ పెట్టాలని, దీనిని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుందని విమర్శించారు. ►తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తాను ఉండకపోవచ్చని అన్నారు. తనను అసెంబ్లీలో ఉండొద్దని కొంతమంది కోరుకుంటున్నారని ఆరోపించారు. నా చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతున్నాయని, సభకు ఎవరు వస్తారో.. రారో తెలియదని అన్నారు. ►సభ నిర్వహాణ పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సభ నుంచి సీతక్క వెళ్లిపోయారు. ►వరంగల్‌లో వరద నష్టంపై సమీక్ష చేశామని సభలో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. త్వరలోనే రోడ్ల మరమ్మత్తులు పూర్తి చేస్తామని తెలిపారు. ధరణిలో చిన్న చిన్న సమస్యలున్నాయని వెంటనే వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో అన్ని నగరాల్లో డ్రగ్స్ సమస్య ఉందని, దీని నియంత్రణ కోసం పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. ►అసెంబ్లీలో జీరో అవర్ టైంలో ప్రజా సమస్యలు లేవనెత్తారు ఎమ్మెల్యేలు. ధూల్‌పేట సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. తాత్కాలిక ఉద్యోగుల సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోరారు. ►తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజైన ఆదివారం ప్రారంభమయ్యాయి. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రెండో శాసనసభ ఆఖరి విడత సమావేశాలు చివరి అంకానికి చేరుకున్నాయి. మూడు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు నేటితో (ఆదివారం తెరపడనుంది. బీఏసీ సమావేశంలో నిర్ణయించిన మేరకు ఆదివారం ప్రశ్నోత్తరాలు లేకుండా నేరుగా ‘తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణ ప్రగతి ప్రస్థానం’పై చర్చ జరుగుతుంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇచ్చే అవకాశముంది. మరోవైపు ‘ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు’శాసనసభలో పెట్టే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆదివారం ఉదయంలోగా ఈ బిల్లుకు గవర్నర్ అనుమతి తెలిపితే సభ ముందుకు ఈ బిల్లు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. ఐదు బిల్లులకు సభ ఆమోదం... మూడో రోజు సమావేశాల్లో ప్రశ్నోత్తరాల అనంతరం ‘పల్లె ప్రగతి– పట్టణ ప్రగతి’పై జరిగిన లఘు చర్చకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. అనంతరం ఐదు బిల్లులను సంబంధిత శాఖల మంత్రులు ప్రతిపాదించారు. తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ బిల్లు–2023, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు–2023ను ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రతిపాదించగా ఫ్యాక్టరీల (తెలంగాణ సవరణ) బిల్లు– 2023ను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర అల్ప సంఖ్యాక వర్గాల కమిషన్ (సవరణ) బిల్లు–2023ను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రతిపాదించారు. తెలంగాణ పంచాయతీరాజ్ రెండో సవరణ బిల్లు 2023ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ప్రవేశపెట్టిన ఈ బిల్లులను సభ ఆమోదించినట్లు శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత సభను ఆదివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం ప్రకటించారు. అంతకుముందు నిరుద్యోగ భృతి, నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ పరిగణనలోకి తీసుకోలేదు. -
ఎర్రగడ్డలో.. హైదరాబాద్‌ను కట్టింది నేనే! చంద్రబాబుపై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: శాసన సభలో లఘుచర్చ సందర్భంగా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి కేటీఆర్ పరోక్షంగా చురకలు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందంటూ ఆ పార్టీ నాయకులు చేసిన కామెంట్లపై కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘గతంలో ఓ పెద్ద మనిషి (చంద్రబాబు) ఇలాగే అన్నీ తానే చేశానని చెప్పుకునేవాడు. అట్లానే ఈ మధ్య ఆయన ఎర్రగడ్డ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడున్న పేషెంట్లను పలకరించాడు. నేనెవరో తెలుసా? అని ఓ పేషెంట్‌ను అడిగితే.. తనకు తెలియదని బదులిచ్చాడు. దీంతో ఆ పెద్దమనిషి.. ‘నేను తెలియదా.. ఈ హైదరాబాద్ కట్టింది నేనే..’ అని చెప్పాడు. అప్పుడా పేషెంట్ బదులిస్తూ.. ‘అవునా విశాఖపట్నం పక్కన సముద్రాన్ని నేనే ఏర్పాటు చేశా అని నేను చెప్పినా వినకుండా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు..’ అని బదులిచ్చాడు.. మీరు చెప్తున్నదీ అలాగే ఉంది’’ అని ఎద్దేవా చేశారు. రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ ఏపీకి వెళ్లిపోయింది! ఇక గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులలో బాగా పనిచేసిన వాళ్లు ఉన్నారని.. మంచి ఉంటే తామే చెప్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ తెచ్చారన్న విషయాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్వయంగా అసెంబ్లీలో చెప్పారని ఆయన గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ ఏపీకి వెళ్లిపోయిందని.. తెలంగాణ కాంగ్రెస్‌లో వేరే పార్టీ నుంచి వచ్చిన నాయకులు అధ్యక్షులు అయ్యారని వ్యాఖ్యానించారు. చదవండి: ఇంతకంటే అభివృద్ధా?.. రుజువు చేస్తే రాజీనామా చేస్తా.. కేటీఆర్ సవాల్ -
భట్టి Vs బీఆర్ఎస్.. అసెంబ్లీలో కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కాగా, సమావేశాల్లో భాగంగా శనివారం అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. కేసీఆర్ సర్కార్‌పై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయగా.. హస్తం నేతలకు మంత్రి కేటీఆర్ కౌంటరిచ్చారు. ► సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. గతంలో పనిచేసిన కొందరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మంచివారే. ఆరోగ్యశ్రీని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారని కేసీఆరే చెప్పారు. రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ ఇక్కడ లేదు.. ఏపీకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది వేరే కాంగ్రెస్ అని అన్నారు. ► కాంగ్రెస్.. ఎక్స్పైర్ అయిన మందు. చిన్న పిల్లలకు ఎక్కాలు రావు.. రాష్ట్రంలోని విపక్ష పార్టీలకు లెక్కలు రావు. కాంగ్రెస్‌కు విశ్వసనీయత పోయింది. ఓట్ల కోసమే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. మాకు కట్టడం మాత్రమే తెలుసు. విపక్షాలకు కూలగొట్టడం ఒక్కటే తెలుసు. కాంగ్రెస్‌లో ఉన్నది నలుగురు ఎమ్మెల్యేలు. ఆ పార్టీలో 10 మంది ముఖ్యమంత్రులని ప్రచారం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కాంగ్రెస్‌కు కనిపించడం లేదని విమర్శించారు. రాబోయే తరాలు గుర్తుపెట్టుకునేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో బతుకులు ఆగమయ్యాయన్నారు. కర్ణాటకలో గెలిచామని తెలంగాణలో కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ► అలాగే, తాము ప్రధాని మోదీకి భయపడలేదన్నారు. కేంద్రం సహకరించకపోయినా రాష్టాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. గల్లీలో బీజేపీ తిడుతుంటే ఢిల్లీలో బీజేపీ అవార్డులు ఇస్తున్నదని చెప్పుకొచ్చారు. గుజరాత్ మోడల్ అంటే అంతా డొల్ల అని విమర్శించారు. ప్రతిపక్షాలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తామని తెలిపారు. ► ఇక, అంతకుముందు.. పట్టణ ప్రగతి అంశంపై శాసన సభలో చర్చిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ఇప్పుడు వస్తున్న ఆదాయమంతా తమ హయాంలో పునాదులు వేసిన వాటి ఫలాలే అన్నారు. ఓఆర్ఆర్, మెట్రో, ఫ్లై ఓవర్లు తదితర ఎన్నో అభివృద్ధి పనుల్ని సిటీలో కాంగ్రెస్ చేపట్టడం వల్లే ఇంతలా అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. 2 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టామని గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్.. హైదరాబాద్ పరిధిలో 1లక్ష ఇళ్లను కూడా చూపించలేకపోయారని ఆరోపించారు. తాము సంపదను సృష్టిస్తే బీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వ స్థలాలు అమ్ముతోందని ఆరోపించారు. ► మంత్రి తలసాని కూడా భట్టికి కౌంటరిచ్చారు. పేదోళ్లు బాగుపడితే కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇష్టం ఉండదని మంత్రి ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గ లీడర్ కూడా లేరని అన్నారు. గతంలో పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయన్నారు. దేశ విదేశాల ప్రతినిధులు సీఎం కేసీఆర్ పాలనను మెచ్చుకుంటుంటే ప్రతిపక్షాలు ఓర్వలేని రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. డబల్ బెడ్రూం ఇళ్లపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తి అవాస్తవం అని కొట్టి పారేశారు. ఇది కూడా చదవండి: హలో కేటీఆర్‌గారూ.. ఈ ఫొటో గుర్తుందా? -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఐదు బిల్లులకు ఆమోదం
ఇవాళ ఐదు బిల్లులకు ఆమోదం తెలిపిన శాసనసభ. 1, టిమ్స్ ఆసుపత్రుల బిల్లు. 2, కర్మాగారాల చట్ట సవరణ బిల్లు. 3, మైనార్టీ కమిషన్ చట్ట సవరణ బిల్లు. 4, జీఎస్టీ చట్ట సవరణ బిల్లు. 5, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం. ► బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. కేసీఆర్ సర్కార్‌పై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయగా.. హస్తం నేతలకు మంత్రి కేటీఆర్ కౌంటరిచ్చారు. ► సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. గతంలో పనిచేసిన కొందరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మంచివారే. ఆరోగ్యశ్రీని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారని కేసీఆరే చెప్పారు. రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ ఇక్కడ లేదు.. ఏపీకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది వేరే కాంగ్రెస్ అని అన్నారు. ► కాంగ్రెస్.. ఎక్స్పైర్ అయిన మందు. చిన్న పిల్లలకు ఎక్కాలు రావు.. రాష్ట్రంలోని విపక్ష పార్టీలకు లెక్కలు రావు. కాంగ్రెస్‌కు విశ్వసనీయత పోయింది. ఓట్ల కోసమే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. మాకు కట్టడం మాత్రమే తెలుసు. విపక్షాలకు కూలగొట్టడం ఒక్కటే తెలుసు. ► కాంగ్రెస్‌లో ఉన్నది నలుగురు ఎమ్మెల్యేలు. ఆ పార్టీలో 10 మంది ముఖ్యమంత్రులని ప్రచారం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కాంగ్రెస్‌కు కనిపించడం లేదని విమర్శించారు. రాబోయే తరాలు గుర్తుపెట్టుకునేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో బతుకులు ఆగమయ్యాయన్నారు. కర్ణాటకలో గెలిచామని తెలంగాణలో కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ► అలాగే, తాము ప్రధాని మోదీకి భయపడలేదన్నారు. కేంద్రం సహకరించకపోయినా రాష్టాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. గల్లీలో బీజేపీ తిడుతుంటే ఢిల్లీలో బీజేపీ అవార్డులు ఇస్తున్నదని చెప్పుకొచ్చారు. గుజరాత్ మోడల్ అంటే అంతా డొల్ల అని విమర్శించారు. ప్రతిపక్షాలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తామని తెలిపారు. ► పట్టణ ప్రగతి అంశంపై శాసన సభలో చర్చిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ఇప్పుడు వస్తున్న ఆదాయమంతా తమ హయాంలో పునాదులు వేసిన వాటి ఫలాలే అన్నారు. ఓఆర్ఆర్, మెట్రో, ఫ్లై ఓవర్లు తదితర ఎన్నో అభివృద్ధి పనుల్ని సిటీలో కాంగ్రెస్ చేపట్టడం వల్లే ఇంతలా అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. 2 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టామని గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్.. హైదరాబాద్ పరిధిలో 1లక్ష ఇళ్లను కూడా చూపించలేకపోయారని ఆరోపించారు. తాము సంపదను సృష్టిస్తే బీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వ స్థలాలు అమ్ముతోందని ఆరోపించారు. ► మంత్రి తలసాని కూడా భట్టికి కౌంటరిచ్చారు. పేదోళ్లు బాగుపడితే కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇష్టం ఉండదని మంత్రి ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గ లీడర్ కూడా లేరని అన్నారు. గతంలో పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయన్నారు. దేశ విదేశాల ప్రతినిధులు సీఎం కేసీఆర్ పాలనను మెచ్చుకుంటుంటే ప్రతిపక్షాలు ఓర్వలేని రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. డబల్ బెడ్రూం ఇళ్లపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తి అవాస్తవం అని కొట్టి పారేశారు. ► కొల్లూరు డబుల్ బెడ్రూం సముదాయంలో ఇళ్లు చూస్తే కాంగ్రెస్ నేతల కళ్లు బైర్లు కమ్ముతాయని ఎద్దేవా చేశారు. సాక్షి, హైదరాబాద్: మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శనివారం మరో మూడు బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎనిమిది బిల్లులను ప్రవేశపెడతామని బీఏసీ సమావేశంలో ప్రభుత్వం తెలిపింది. అందులో గవర్నర్ తిప్పిపంపిన నాలుగు బిల్లులను శుక్రవారం సభలో ప్రవేశపెట్టారు. పురపాలక బిల్లును మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ఉద్యోగ (పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ) బిల్లును మంత్రి హరీశ్‌రావు, ప్రైవేటు వర్సిటీల బిల్లును మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీరాజ్ బిల్లును ఎర్రబెల్లి దయాకర్‌రావు సభకు సమర్పించారు. వాటిని పునః పరిశీలించి ఆమోదించాలని కోరారు. ఈ బిల్లులను తిరస్కరిస్తూ గతంలో గవర్నర్ కార్యాలయం నుంచి మూడు సందేశాలు అందాయని ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. వీటిపై సభ్యుల నుంచి అభ్యంతరాలు స్వీకరించాక.. బిల్లులను సభ ఆమోదించినట్టు ప్రకటించారు. ఇక శనివారం సభలో ‘తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ బిల్లు, ఫ్యాక్టరీల చట్టం సవరణ బిల్లు, రాష్ట్ర అల్పసంఖ్యాక వర్గాల కమిషన్ (సవరణ) బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. -
కేటీఆర్ Vs కాంగ్రెస్.. అసెంబ్లీలో బీఆర్ఎస్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సభలో వాడీవేడిగా చర్చ నడుస్తోంది. అసెంబ్లీ సెషన్స్‌లో భాగంగా మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నేతలకు కౌంటరిచ్చారు. సభలో శుక్రవారం కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు గాలి మాటలు మాట్లాడుతున్నారు. రుణమాఫీ చేయడంతో కాంగ్రెస్ నేతల ఫీజులు ఎగిరిపోయాయి. కాంగ్రెస్ హయాంలో ఏనాడైనా కనీసం ఆరు గంటలైనా కరెంట్ ఇచ్చారా?. ఎవరు రైతులను రాబందుల్లా పీక్కుతున్నారో ప్రజలకు తెలుసు అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో కులగజ్జి, మత పిచ్చి లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో స్టేబుల్ గవర్నమెంట్ ఉందన్నారు. బెంగుళూరును వెనక్కి నెట్టి ఐటీ ఉద్యోగాల కల్పనలో తెలంగాణ నెంబర్ వన్ అయిందని పేర్కొన్నారు. ఐటీ అభివృద్ధిని ప్రతిపక్షాలు మెచ్చుకోవాలని చెప్పారు. 1987లో ఇంటర్ గ్రాఫ్ అనే సంస్థ హైదరాబాద్‌కు వచ్చిందని, ఈ విషయం మేమే ఐటీ తెచ్చామనే వారు తెలుసుకోవాలని మంత్రి కేటీఆర్ హితవు పలికారు. రజనీకాంత్ లాంటి వ్యక్తి కూడా హైదరాబాద్ గురించి చెప్పారని కానీ కొంతమంది ఇంకా కళ్లు తెరవడం లేదని విమర్శించారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరిస్తున్నామని తెలిపారు. జిల్లాలకు విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. హుజురాబాద్‌లో ఐటీ కంపెనీ వచ్చిందని ఈటలకు కూడా తెలుసుకోవాలన్నారు. మరోవైపు.. హైదరాబాద్‌లోని కోకాపేట భూముల వేలంపై అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడారు. కోకాపేట భూముల ధర రికార్డు బద్దల కొట్టిందని చెప్పారు. ఎకరం వంద కోట్లు పలికిందంటే హైదరాబాద్ అభివృద్ధి అర్థం చేసుకోవచ్చని తెలిపారు. డైలాగులు, ధర్నాలతో ఇంత ధర రాదని చురకలంటించారు. ఇది కూడా చదవండి: కోకాపేటలో ఎకరం రూ.100 కోట్లు.. కేసీఆర్ ఏమన్నారంటే.. -
తెలంగాణలో కులగజ్జి, మతపిచ్చి లేదు: అసెంబ్లీలో కేటీఆర్
►శాసన మండలి రేపటికి వాయిదా ►తెలంగాణలో కులగజ్జి, మత పిచ్చి లేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో స్టేబుల్ గవర్నమెంట్ ఉందన్నారు. బెంగుళూరును వెనక్కి నెట్టి ఐటీ ఉద్యోగాల కల్పనలో తెలంగాణ నెంబర్ వన్ అయిందని పేర్కొన్నారు. ఐటీ అభివృద్ధిని ప్రతిపక్షాలు మెచ్చుకోవాలని చెప్పారు. ►1987లో ఇంటర్ గ్రాఫ్ అనే సంస్థ హైదరాబాద్‌కు వచ్చిందని, ఈ విషయం మేమే ఐటీ తెచ్చామనే వారు తెలుసుకోవాలని మంత్రి కేటీఆర్ హితవు పలికారు. రజనీకాంత్ లాంటి వ్యక్తి కూడా హైదరాబాద్ గురించి చెప్పారని కానీ కొంతమంది ఇంకా కళ్లు తెరవడం లేదని విమర్శించారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరిస్తున్నామని తెలిపారు. జిల్లాలకు విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. హుజురాబాద్‌లో ఐటీ కంపెనీ వచ్చిందని ఈటలకు కూడా తెలవాలన్నారు. ►కోకాపేట భూముల వేలంపై అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడారు. కోకాపేట భూముల ధర రికార్డు బద్దల కొట్టిందని చెప్పారు. ఎకరం వంద కోట్లు పలికిందంటే హైదరాబాద్ అభివృద్ధి అర్థం చేసుకోవచ్చని తెలిపారు. డైలాగులు, ధర్నాలతో ఇంత ధర రాదన్నారు. సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లోనూ మొదట ప్రశ్నోత్తరాలలకు సమయం కేటాయించారు. అనంతరం రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు, స్వల్పకాలిక చర్చ జరిగింది. అదే సమయంలో మండలిలో విద్య, వైద్యంపై చర్చ నిర్వహించారు. తెలంగాణలో వరదల తర్వాత జరిగిన పునరావాస సహాయక చర్యలు, ప్రజలకు ఇచ్చిన సహాయక హామీల చర్యలపై అసెంబ్లీలో బీజేపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. నేడు శాసనసభ ముందుకు 10 కీలక బిల్లులు రానున్నాయి. శని, ఆదివారాల్లో బిల్లులపై చర్చించి ఆమెదించనున్నారు. ఆదివారంతో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. -
ఈటలతో కేటీఆర్ ఆప్యాయ పలకరింపు.. అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను మంత్రి కేటీఆర్ అప్యాయంగా పలకరించారు. ఈటల సీటు వద్దకు వెళ్ళి ఆలింగనం చేసుకున్నారు. నేతలు ఒకరినొకరు హత్తుకున్నారు. దాదాపు పది నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. అదే విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డీతోనూ కేటీఆర్ భేటీ అయ్యారు. పలు అభివృద్ది పనుల కోసం కేటీఆర్ చాంబర్లో మంత్రికి సంగారెడ్డి ఎమ్మెల్యే వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్, జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. జగ్గారెడ్డిని చూడగానే పిల్లలతో కలిసి తిరిగితే ఎట్లా అన్న అంటూ కేటీఆర్ సరదాగా వ్యాఖ్యానించారు. అప్పటికే జగ్గారెడ్డితో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ఉండగా.. మీ ఇద్దరి దోస్తాన్ ఎక్కడ కుదిరిందని కేటీఆర్ అడిగారు. మాది ఒకే మంచం, ఒకే కంచం అంటూ మామిళ్ల బదులివ్వగా.. అయితే జగ్గారెడ్డిని గెలిపిస్తవా అని కేటీఆర్ ప్రశ్నించారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని గెలిపిస్తానని.. మన దగ్గరకు (బీఆర్ఎస్లోకి) పట్టుకొస్తానని మామిళ్ల రాజేందర్ నవ్వుతూ చెప్పారు. ఈ సంభాషణ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. చదవండి: 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీ మీటింగ్‌లో నిర్ణయం -
3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీ మీటింగ్‌లో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతమైన ఉదయం 11 గంటలకు మొదలైన సమావేశంలో ముందుగా కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్నతో పాటు ఇటీవలి కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం పాటించారు. సాయన్నకు అసెంబ్లీలో నివాళి అర్పించారు. ఆయన మృతికి శాసన సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించారు. సాయన్నతో ఎంతో సాన్నిహిత్యం: కేసీఆర్ సంతాప తీర్మానాన్ని కేసీఆర్ ప్రవేశ పెట్టగా.. సభ్యులు సాయన్న రాజకీయ జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కంటోన్మెంట్ అభివృద్ధికి సాయన్న ఎంతో కృషి చేశారని అన్నారు. సాయన్నతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని తెలిపారు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి సాయన్న.. నిత్యం ప్రజలతో మమేకమై నిరాడంబరంగా ఉండేవారని పేర్కొన్నారు. సాయన్న లేని లోటు తీర్చలేనిదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని.. కంటోన్మెంట్ అభివృద్ధికి చేసిన కృషిని మరవలేమని గుర్తుచేసుకున్నారు. తరువాత ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క్, రఘునందన్ రావు తదితరులు సాయన్నను గుర్తుచూస్తూ కాసేపుమాట్లాడారు. అనంతరం తెలంగాణ శాసన సభ రేపటికి వాయిదా పడింది. మూడు రోజులుపాటు అసెంబ్లీ సమావేశాలు స్పీకర్ పోచారం అధ్యక్షతన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం అయ్యింది. బీఆర్ఎస్ నుంచి మంత్రులు హరీష్‌రావు, ప్రశాంత్‌రెడ్డి హాజరవ్వగా.. కాంగ్రెస్ నుంచి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క్, ఎంఐఎం నేత అక్భరుద్దిన్ హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నేతలంతా చర్చించారు. కాగా మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ తీర్మానించింది. శుక్రవారం వరదలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. వివిధ బిల్లులపై శనివారం అసెంబ్లీలో చర్చ జరగనుంది. అయితే పని దినాలు పొడిగించాలని, పది రోజులపాటు సభ నిర్వహించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఇక అసెంబ్లీ సమావేశాలకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు దూరంగా ఉన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలని వనమా నిర్ణయం తీసుకోగా.. జలగం వెంకట్రావును ఇంకా ఎమ్మెల్యేగా పరిగణించని కారణంగా ఆయన కూడా అసెంబ్లీకి రాలేదు.


