ఆశలకు గండి.. టికెట్‌ రాకపోవడంతో రమేష్‌ రెడ్డి ఫ్యామిలీ కన్నీరు.. | Patel Ramesh Family Members Upset Over Congress Suryapet Ticket Issue - Sakshi
Sakshi News home page

ఆశలకు గండి.. టికెట్‌ ఇవ్వకపోవడంతో రమేష్‌ రెడ్డి ఫ్యామిలీ కంటతడి..

Published Fri, Nov 10 2023 12:41 PM | Last Updated on Fri, Nov 10 2023 1:05 PM

Patel Ramesh Family Members Upset Over Congress Seat Issue - Sakshi

సాక్షి, సూర్యాపేట: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఎంతో మంది నేతలు సిద్ధమయ్యారు. గత ఐదేళ్లుగా పార్టీనే నమ్ముకుని.. ప్రజలతో మమేకమై ఉన్నారు. ఈ క్రమంలో కొందరు నేతలు టికెట్‌ ఆశించి భంగపడ్డారు. టికెట్‌ కేటాయింపు ఎంతో ఆశగా ఉన్న క్రమంలో చివరి సమయంలో టికెట్‌ దక్కకపోవడంతో కన్నీటిపర్యంతమవుతున్నారు. 

ఇక, తాజాగా సూర్యాపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన పటేల్‌ రమేశ్‌రెడ్డికి సైతం నిరాశ ఎదురైంది. కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ రమేశ్‌ రెడ్డికి టికెట్‌ నిరాకరించింది. అక్కడ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి కాంగ్రెస్‌ అధిష్ఠానం టికెట్‌ ఖరారు చేసింది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ సన్నిహితుడైనప్పటికీ పటేల్‌ రమేశ్‌ రెడ్డికి టికెట్‌ దక్కలేదు. 

దీంతో, రమేశ్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీని నమ్ముకుంటే అన్యాయం చేశారని బోరున విలపించారు. మరోవైపు పటేల్‌ రమేశ్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నేడు సూర్యాపేటలోని ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించనున్నట్టు తెలుస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement