తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్‌ వాకౌట్‌.. గన్‌పార్క్‌ వద్ద ఆందోళన | Telangana Assembly Session 31st August Live Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్‌ వాకౌట్‌.. గన్‌పార్క్‌ వద్ద ఆందోళన

సభ నుంచి బీఆర్‌ఎస్‌ వాకౌట్‌  

  • శాసన సభ నుంచి  బయటకు వచ్చిన BRS ఎమ్మెల్యేలు

  • పోడియం వద్ద లేడీ మార్షల్స్ పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న BRS ఎమ్మెల్యేలు

  • BRS ఎల్పీ ముందు భారీగా మార్షల్స్ పెట్టడంపై ఆగ్రహం

  • మరికాసేపట్లో గన్ పార్కుకు BRS ఎమ్మెల్యేలు

  • గన్ పార్క్ వద్ద నిరసన చేయనున్న BRS ఎమ్మెల్యేలు

2025-08-31 21:41:34

కాళేశ్వరం కూలిపోలేదు కుంగింది

కాంగ్రెస్‌ హయాంలో కూలిన పాలెం ప్రాజెక్ట్‌ను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పునరుద్ధరించింది. 

 

 

 

2025-08-31 20:50:21

 సభలో BRS ఆందోళన..

  • సభలోఅట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆందోళన..

  • హరీష్ రావ్ మాట్లాడుతుంటే మైక్ కట్ చేసిన స్పీకర్..

  • స్పీకర్ పోడియం వద్ద ఆందోళన..

  • ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు..

స్పీకర్ 

  • బీఆర్‌ఎస్‌  సభ్యులు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

  • గంట 15 నిమిషాలు హరీష్ రావు సభలో మాట్లాడారు.

  • సబ్జెక్టు పై మాట్లాడకుండా రాజకీయ విమర్శలు చేస్తున్నారు.


డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క

  • హరీష్ రావు శాసనసభను శాసించాలని చూస్తున్నారు.

  • హరీష్ రావుకు ఇవ్వాల్సిన సమయం కంటే ఎక్కువే సమయం ఇచ్చాం.

శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

  • సభ ఆర్డర్లో పెట్టాలి

  • బీఆర్ఎస్ సభ్యులు సభకు సహకరించాలి

  • ప్రతిపక్షం అడిగినంత సమయం ఇస్తున్నాం

  • హరీష్ రావు సబ్జెక్టుపై మాట్లాడాలి

  • పార్టీకి ఒక్కరే మాట్లాడాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.

  • మాట్లాడే అవకాశం ఇస్తే కూర్చుంటాముంటున్న BRS సభ్యులు..

కాలేశ్వరం కమిషన్ నివేదికపై చర్చను ప్రభుత్వం అడ్డుకుంటుంది..

హరీష్ రావ్..

  • కమిషన్ ముందు మాకు మాట్లాడు అవకాశం  ఇవ్వలేదు

  • సభలో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు

  • మా గొంతు నొక్కుతున్నారు

  • సుంకిశాల, ఎస్ ఎల్ బి సి కూలిపోతే ఎందుకు కమిషన్ వేయరు

  • 7 వ బ్లాక్ మరమ్మతులు చేసి వర్కింగ్ లోకి తెచ్చుకోవచ్చని ఎన్ డి ఎస్ ఏ రిపోర్ట్ ఇచ్చింది
     

2025-08-31 20:50:21

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అసెంబ్లీ

  • మూడు బ్యారేజీల వల్ల తెలంగాణకు లక్ష కోట్ల నష్టం జరిగింది.
  • ఘోష్ కమిషన్ నుంచి కోర్టుకు వెళ్లి శిక్ష తప్పించుకునే పనిలో హరీష్ రావు ప్రయత్నం చేస్తున్నారు
  • మళ్ళీ BRS వస్తె పోలవరం వరకు లిఫ్ట్ లు పెట్టీ మరో లక్ష కోట్లు దాచుకుంటారు.
  • కాళేశ్వరంలో అవినీతి జరిగిందా లేదా అనేది చెప్పాలి.
  • ఘోష్ కమిషన్ రిపోర్ట్ పై మాట్లాడాలి.
  • తెలంగాణను అప్పుల పాలు చేసి ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నారు.
  • తప్పు చేశారు కాబట్టే కోర్టులు కేసుల పై హరీష్ రావు మాట్లాడుతున్నారు
  • కమిషన్ల కోసం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారు
  • తప్పు జరిగినట్లు BRS నాయకులు ఒప్పుకోవాలి
  • కాళేశ్వరాన్ని కేసీఆర్ కట్టారు... కేసీఆరే కూల్చారు
    తెలంగాణ పట్ల కేసీఆర్, BRS కు బాధ్యత లేదు.
  • తెలంగాణ పై బాధ్యత ఉంటే కేసీఆర్ సభకు ఎందుకు రాలేదు.
  • కాళేశ్వరం లో తన పాత్ర ఏంటో కేసీఆర్ సభకు వచ్చి చెప్పాల్సి ఉండేది.
  • సభకు రాకుండా కేసీఆర్ తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు.
  • హరీష్ రావు కు ఉన్న పోస్ట్ ఏంటి? BRS కు కార్యవర్గం ఉందా?
  • సభకు వచ్చి తప్పు అయిందని చెప్పుకోవాల్సి ఉండేది.
     

హరీష్ రావు..

  • Cm రేవంత్ మసిపూసి మారేడు కాయ చేయడంలో సిద్ధహస్తుడు
  • ఉమా భారతి రాసిన దాంట్లో మొదటి పేజీ మాత్రమే చదివారు
  • మూడో పేజీ చదవకుండా సభను తప్పుదోవ పట్టించిన cm రేవంత్ క్షమాపణ చెప్పాలి
  • CWCనీ కూడా పీసీ ఘోష్ కమిషన్ పిలిచి వివరాలు ఎందుకు తీసుకోలేదు
  • 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు
  • మీరు పెట్టే ఖర్చు వృథా అవుతుంది అని మహారాష్ట్ర ప్రభుత్వం అప్పటి కాంగ్రెస్ cm కిరణ్ కుమార్ రెడ్డికి లెటర్ రాశారు
  • కోర్టు కేసు గురించి మాట్లాడొద్దు అని మంత్రులు అంటున్నారు మరి ఇందిరా గాంధీ ఎందుకు కోర్టుకు పొయ్యారు
  • చరిత్రలో కాళేశ్వరం గొప్ప ప్రాజెక్ట్ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు
  • పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కోర్ట్ ముందు నిలబడదు
  • పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ చెత్త రిపోర్ట్
  • షా కమిషన్ ఇందిరా గాంధీకి 8బీ కిందా నోటీసులు ఇచ్చి విచారణ చేసింది 
  • రాజకీయ ప్రేరేపిత కోటలో భాగంగా అని కాంగ్రెస్ ఆరోపించింది
  • ఎల్‌కే అద్వానీపై జస్టిస్ లిబర్హాన్ కమిషన్ విచారణ నివేదిక కూడా రాజకీయ ప్రేరేపిత కుట్రలో  భాగం అని బీజేపీ ఆరోపించింది
  • ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ కూడా రాజకీయ ప్రేరేపిత కుట్రలో భాగంగా మాపై కమిషన్ వేసింది
  • ఇందిరా గాంధీపై వేసిన షా కమిషన్ నివేదికను కాంగ్రెస్ తప్పుబట్టింది 
  • సుప్రీంకోర్టు జస్టిస్ షా కమిషన్‌కు వ్యతిరేకంగా ఇదే కాంగ్రెస్ ధర్నాలు చేసింది
  • ఆరోజు షా కమిషన్ తప్పైంది. ఇప్పుడు ఈ చెత్త  కమిషన్ నివేదిక అ‍య్యింది
  • అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదటి రిపోర్ట్ పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రిలిమినరీ రిపోర్ట్, సిల్వర్ జూబ్లీ వేడుకల ముందు ఫైనల్ రిపోర్ట్, స్థానిక సంస్థల ఎన్నికల ముందు కమిషన్ నివేదిక
  • అసలు వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా
  • సర్కస్ నడిపిస్తున్నారా
  • 8బీ కింద మాకు ఘోష్ కమిషన్ నోటీస్‌లు ఇవ్వలేదు
  • క్రాస్ ఎగ్జామింగ్‌కు సమయం ఇవ్వలేదు
  • కాంగ్రెస్ పార్టీ ముందు నుండి కేసీఆర్‌కు ఎక్కడ పేరు వస్తుందో కాళేశ్వర్వాన్ని అడ్డుకుంది.. కేసులు వేసింది
  • కమిషన్ నివేదికను పొలిటికల్ వెపన్‌గా వాడుతుంది
  • రిపోర్ట్ న్యాయ బద్దంగా లేదు
  • కమిషన్ నిస్పక్ష పాతంగా కమిషన్ విచారణ జరగ లేదు
  • మినిమం రెండు గంటల సమయం కావాలి
  • ఎందుకు బయపడుతున్నారు.. మాట్లాడతాం అంటే
  • వర్షాలతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు
  • యూరియాతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు
  • కాళేశ్వరంపై నాలుగు రోజుల అయినా మాట్లాడుతా
  • మాపై ఇష్టం ఉన్నట్టు ఆరోపణలు చేస్తున్నారు
  • పీపీటీకి సభ అనుమతి ఇవ్వలేదు
  • 650 పేజీల రిపోర్ట్ ఒక్కో పేజీకి ఒక్కో పదానికి రిప్లై ఇస్తాను
  • ప్రభుత్వం అదర బాదరాగా సభలో కాళేశ్వరం కమీషన్ నివేదికను పెట్టారు

ఉత్తమ్‌ వ్యాఖ్యల్ని ఖండించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

  • శాసన సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్న BRS ఎమ్మెల్యేలు
  • ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో అసత్యాలు చెప్తున్నారని కామెంట్స్ చేస్తున్న హరీష్ రావు
  • పొలిటికల్ కామెంట్స్ తప్ప.. నిజాలు చెప్పడం లేదన్న హరీష్ రావు
  • ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పీచ్‌ను పదే పదే అడ్డుకుంటున్న BRS ఎమ్మెల్యేలు
2025-08-31 18:55:23

  • అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చ 
  • చర్చను కొనసాగిస్తున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
  • దేశంలో ఇంతపెద్ద డిజాస్టర్‌ ఎక్కడా జరగలేదు
  • కాళేశ్వరం డీపీఆర్‌,నిర్మాణానికి చాలా తేడా ఉంది
  • నిర్మాణం ,డిజైన్ లోపాలు ఉన్నాయని కమిషన్ తేల్చింది
  • ఆర్దిక క్రమశిక్షణ కొరవడింది
  • విచారణలో కక్ష్య సాధింపు లేదు
  • బీఆర్ఎస్ వల్ల తెలంగాణకు శాశ్వత నష్టం జరిగింది
  • నిండు సభలో సమగ్ర రిపోర్ట్ పెడితే... రిపోర్టును దాచిపెట్టామని విమర్శలు చేయడం ఏంటి?
  • గత ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మొదలు పెట్టారు
  • సీడబ్ల్యూడీసీ అనుమతులు రాకుండానే ప్రాజెక్టు పనులు మొదలు పెట్టారు
  • మాజీ సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది
  • మేడిగడ్డ వద్ద బ్యారేజి కట్టొద్దు అని నిపుణుల కమిటీ రిపోర్ట్ ఇచ్చింది 
2025-08-31 17:41:55

  • కేరళ పర్యటన ముగించుకుని అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
  • ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ 
  • కాళేశ్వరం కమిషన్‌పై చర్చ 
  •  చర్చ నేపథ్యంలో భారీ ఎత్తున మొహరించిన మార్షల్స్‌  
2025-08-31 16:52:53

  • మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ చట్టసవరణ బిల్లులను తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
  • బిల్లుల ఆమోదంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం
  • తొలుత మున్సిపల్‌, తర్వాత పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టి చర్చించారు.
  • అనంతరం ఆ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.
  • ప్రైవేట్‌ మెడికల్‌ కేర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ బిల్లు, ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ విస్తరణ.. ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు బిల్లుకు కూడా శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. 
2025-08-31 14:53:52

సాయంత్రం వరకు శాసనసభకు బ్రేక్

  • సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ శాసనసభలో  కాళేశ్వరం కమిషన్ రిపోర్టును పెట్టనున్న సర్కార్
  • కమిషన్ రిపోర్టుపై శాసన సభ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న సర్కార్
  • పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్న అసెంబ్లీ సిబ్బంది
  • PPT ఇవ్వనున్న ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • PPT ఇవ్వడానికి స్పెషల్ నోట్ తయారు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
2025-08-31 13:15:14

రేపు గవర్నర్‌ను కలుస్తాం: పొన్నం

  • మంత్రి పొన్నం ప్రభాకర్ చిట్ చాట్
  • అసెంబ్లీలో బీసీ బిల్లు సవరణపై గవర్నర్‌ను రేపు కలుస్తాం.
  • అన్ని పార్టీల నుంచి బృందంగా గవర్నర్‌ను కలిసి పంచాయతీ ఎన్నికలపై మాట్లాడతాం.
  • గవర్నర్ అపాయింట్మెంట్ రేపు ఉదయం అడిగాం. 
  • చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం సభ నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తాం.
  • కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో 42శాతం రిజర్వేషన్లు అమలుకు ప్రయత్నం చేస్తున్నాం.
  • తమిళనాడు లాంటి రాష్ట్రంలో అమలు అంశం తీర్పుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.
  • అన్ని పార్టీలకు లేఖలు పంపుతాం. 
  • ఎంఐఎం, సీపీఐ వారికి సమాచారం ఇచ్చాం. 
  • బీఆర్‌ఎస్‌ వాళ్లను కూడా ఆహ్వానిస్తాం. 
  • సెప్టెంబర్‌ 30వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి. 
     
2025-08-31 13:15:14

మంత్రి పొన్నంపై గంగుల సెటైర్లు..

  • మాజీ మంత్రి గంగుల కమలాకర్ చిట్ చాట్
  • పొన్నం ప్రభాకర్‌పై సెటైరికల్ కామెంట్స్ చేసిన గంగుల.
  • సభలో ఉత్తమ్‌, శ్రీధర్ బాబు, సీతక్క బిల్లులను ప్రవేశపెట్టారు.
  • పొన్నం ప్రభాకర్ సభలో ఉండి బిల్లులపై మాట్లాడటం​ లేదు
  • పొన్నంతో సంబంధం ఉన్న బిల్లుల గురించి తప్ప.. మిగతా విషయాలు మాట్లాడుతున్నారు.
  • పొన్నం ప్రభాకర్ పుష్కరాల మంత్రి.
  • మళ్ళీ 12 ఏళ్ల తర్వాతే పొన్నం గెలుస్తారు.
  • కరీంనగర్‌ నేతలతో పొన్నంకు సఖ్యత ఉండదు.
     
2025-08-31 13:15:14

మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం.

  • మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం.
2025-08-31 12:19:45

ఎమ్మెల్యే కూనంనేని కామెంట్స్‌..

  • ఎమ్మెల్యే కూనంనేని కామెంట్స్‌..
  • సంపూర్ణ మద్దతు ఇస్తామని అంటున్నారు.. కలిసి పోరాడదాం అని ఎందుకు చెప్పడం లేదు.
  • ఎవరు మద్దతు ఇస్తున్నారో.. ఎవరు వ్యతిరేకిస్తున్నారో అర్దం కావడం లేదు.
  • డొంకతిరుగుడు మాటలు మాట్లాడుతున్నారు..
  • సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెబుతున్నారు.  
  • పోరాటానికి మద్దతు ఇస్తాం అని ఎందుకు అనడం లేదు.
     
2025-08-31 12:19:45

సభలో వాడీవేడి చర్చ..

మంత్రి శ్రీధర్‌ బాబు కామెంట్స్‌..

  • మేము ఇక్కడే ఉన్నాం.. పారిపోయింది మీరే.
  • మేం ఏ అంశంపైనా అయినా చర్చకు సిద్ధం.
  • గతంలో తెలంగాణ సంపదను పంజాబ్‌, ఇతర రాష్ట్రాల్లో పంచింది కేసీఆర్‌: ఆది శ్రీనివాస్‌
  • రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్‌ అప్పుల కుప్పగా మార్చింది.
  • బీఆర్‌ఎస్‌లాగా కాంగ్రెస్‌కు బేషజాలు లేవు.
  • మా ముఖ్యమంత్రి రేవంత్‌, ప్రభుత్వ పని తీరును హైకమాండ్‌ మెచ్చుకుంది.
  • సీఎం రేవంత్‌కు హైకమాండ్‌ ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. 

కేటీఆర్‌ కామెంట్స్‌..

  • 15 రోజులపాటు సభ నిర్వహించాలి.
  • ఆర్డినెన్స్‌పై సంతకం పెట్టని గవర్నర్‌ బిల్లుపై ఎలా పెడతారు?.
  • పార్లమెంట్‌లో బిల్లు పాస్‌ అవకుండా రిజర్వేషన్లు సాధ్యం కాదు.
  • మేము ఢిల్లీ ధర్నాకు రాలేదని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు.
  • మరి ధర్నాకు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఎందుకు రాలేదు.
  • సీఎం తెలంగాణ సంపద దోచి బీహార్‌లో ఖర్చు పెడుతున్నారు.
  • ప్రధాని దగ్గరకు అఖిలపక్షం తీసుకెళ్లాలని సీఎంను కోరుతున్నాం.
  • బీఆర్‌ఎస్‌ కూడా మద్దతుగా వస్తాం.
  • రిజర్వేషన్లపై సీలింగ్‌ పెట్టింది సుప్రీంకోర్టులోని ధర్మాసనం.
  • మేం సర్వేలో పాల్గొనకుంటే రిజర్వేషన్‌ తగ్గుతుందా?.
2025-08-31 11:48:10

కాళేశ్వరం రిపోర్టుపై సాయంత్రం చర్చ..

  • మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్..
  • కాళేశ్వరం కమిషన్ రిపోర్టును హౌస్‌లో ఫ్లోర్ లీడర్లకు హార్డ్ కాపీ ఇచ్చాం..
  • మెంబర్స్ అందరికీ సాఫ్ట్ కాపీనే ఇచ్చాం..
  • సాయంత్రం నాలుగు గంటలకు కాళేశ్వరంపై చర్చ ఉంటుంది.
  • ఎంత ఆలస్యం అయినా ఈ రోజు సభలో కాళేశ్వరంపై సంపూర్ణ చర్చ జరుగుతుంది
  • కేసీఆర్‌ తరఫున హరీష్‌ రావుకి కాపీ ఇచ్చాం.
  • అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకుంటాం.
  • కోర్టు విషయాలపై మాట్లాడను.
  • సభలోనే అన్ని మాట్లాడతాం.  
  • చర్చ తర్వాతనే తదుపరి విచారణ ఏంటే దానిపై నిర్ణయం ఉంటుంది. 
2025-08-31 11:22:00

కేటీఆర్‌ కౌంటర్‌..

  • పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లుకు బీఆర్‌ఎస్‌ తరఫున స్వాగతిస్తున్నాం.
  • బీసీ సబ్‌ ప్లాన్‌ కూడా పెట్టాలి.
  • బలహీన వర్గాల గురించి ఇప్పుడే మాట్లాడటం లేదు.
  • గతంలో కూడా బీసీల కోసం కేసీఆర్‌ గట్టిగా మాట్లాడారు.
  • కేంద్రంలో ఓబీసీ వెల్పేర్‌ మంత్రిత్వశాఖ పెట్టాలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లింది కేసీఆర్‌.
  • బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అసెంబ్లీ స్పీకర్‌, మండలి చైర్మన్‌గా బీసీలను చేశాం.
  • బీసీ బిల్లులకు బీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు ఉంది. 
  • బీసీలకు న్యాయం జరగాలంటూ రాజ్యాంగ సవరణ జరగాలి. 
  • బీసీలను మభ్య పెట్టడానికి రిజర్వేషన్‌ బిల్లును తెచ్చారు.
  • బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్‌ రోజుకో మాట మాట్లాడుతోంది.
  • గతంలో బీసీ బిల్లుకు బీఆర్‌ఎస్‌ చిత్తశుద్దితో కృషి చేసింది.
  • బీఆర్‌ఎస్‌ ఐదు మంది బీసీలను రాజ్యసభకు పంపింది.
2025-08-31 11:15:33

పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి సీతక్క

  • పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి సీతక్క.
  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ బిల్లు తెచ్చాం.
  • బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉంది.

మంత్రి శ్రీధర్‌ బాబు కామెంట్స్‌..

  • అన్ని సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వానికి సిద్దం.
  • మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లును ఆమోదించిన అసెంబ్లీ.
  • ఏకగ్రీవంగా ఆమోదించిన అసెంబ్లీ. 
     
2025-08-31 11:07:00

అసెంబ్లీలో పాయల్ శంకర్ Vs ఆది శ్రీనివాస్

  • అసెంబ్లీలో పాయల్ శంకర్ Vs ఆది శ్రీనివాస్
  • ముఖ్యమంత్రి అయ్యే లక్షణాలు ఆది శ్రీనివాస్‌కు ఉన్నాయన్న పాయల్ శంకర్
  • పాయల్ శంకర్‌కు బీజేపీ పక్ష నాయకుడు కావాలని కోరుకుంటున్నా: ఆది శ్రీనివాస్
  • ఆది శ్రీనివాస్‌ కామెంట్స్‌..
  • మా ముఖ్యమంత్రి బీసీ కాకున్నా రిజర్వేషన్ల కోసం పాటుపడుతున్నారు.
  • బీసీల పక్షపాతిగా రాహుల్‌ గాంధీ ఉన్నారు.
  • పాయల్‌ శంకర్‌ కామెంట్స్‌..
  • బీసీ రిజర్వేషన్ల బిల్లుకు బీజేపీ సభలో మద్దతు ఇచ్చింది
  • బీజేపీపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారు
  • మాపై నెపం నెట్టి ఢిల్లీలో ధర్నాలు చేస్తారని ముందే చెప్పాము
  • బీసీలు అమాయకులు కాదు.. అన్నీ గమనిస్తున్నారు
  • 42 శాతం బీసీలకు మాత్రమే రిజర్వేషన్లు ఇస్తున్నామని ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదు
  • మంత్రి వర్గంలోకి ఎంత మంది బీసీలను తీసుకున్నారు.
  • బీసీల్లో ప్రభుత్వానికి నమ్మకస్తులు లేరా?
  • బీసీలను ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నారు.
  • మెజార్టీ ఎవరుంటే వారే ఈ రాష్ట్రాన్ని పాలించాలి.
  • బీసీలకు ఉన్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలి.
  • బీసీలు ఓట్లు వేయాడానికే పనికి వస్తారా?.
  • మంత్రి పదవులకు, కార్పొరేషన​్‌ చైర్మన్‌ పదవులకు పనికి రారా?.
  • బీసీలు MPTC, ZPTC లు మాత్రమే కావాలా ?
  • వివిధ ప్రభుత్వ విభాగాల్లో బీసీలకు న్యాయం ఎందుకు చేయడం లేదు.
2025-08-31 10:53:23

బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కామెంట్స్‌..

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కామెంట్స్‌..

  • బీసీల ఓట్లు కావాలి.. కానీ మంత్రి పదవులకు బీసీలు పనికిరారా?
  • మంత్రి పదవులు ఇవ్వకపోగా.. కనీసం కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు కూడా ఇవ్వలేదు
  • కనీసం DGP, ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్టులకు బీసీలు పనికిరారా?
  • బీసీగా తనకు మంత్రి పదవి ఇచ్చారని చెప్పిన వాకిటి శ్రీహరి
  • వాకిటి శ్రీహరి పెద్ద పెద్ద శాఖలు ఇస్తారని భావించా.. చిన్న శాఖలకే పరిమితం చేశారు
  • ముందు చట్టసభలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అవకాశం కల్పించేందుకు మద్దతు ఇవ్వాలని కోరిన వాకిటి శ్రీహరి
  • రాజకీయ పార్టీని నిందించాలని నేను మాట్లాడటం లేదు
  • బీసీలకు జరుగుతున్న అన్యాయం మాత్రమే సభలో ప్రస్తావిస్తున్నా.
  • చట్టాలు చేసే ముందు న్యాయ పరమైన ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి.
  • కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
  • బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి చెప్పాలి: మంత్రి శ్రీధర్ బాబు
  • కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ ప్రభుత్వం 9వ షెడ్యూల్‌లో చేర్చాలి: శ్రీధర్ బాబు
  • * ఇది షార్ట్ డిస్కషన్ కాదు.. బిల్లు సమర్థిస్తారా ? లేదా ? సూటిగా చెప్పాలని కోరిన శ్రీధర్ బాబు
  • * రాష్ట్ర ప్రభుత్వం తమ పరిధిలో ఉన్న అంశాలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం : మంత్రి శ్రీధర్ బాబు
2025-08-31 10:32:29

సెప్టెంబర్ 10 తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్: కోమటిరెడ్డి

కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి చిట్ చాట్..

  • కాళేశ్వరం రిపోర్టుపై సభలో నేను, ఉత్తమ్ మాట్లాడుతాం.
  • లిల్లిపుట్ అని కవిత జగదీష్ రెడ్డి పరువు తీసింది.
  • నల్లగొండకు నీళ్లు రాకుండా ఎండబెట్టిండు .
  • కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేయాలి..
  • కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఇబ్బంది అవుతుంది..
  • వరి విస్తీర్ణం పెరగడం వల్ల యూరియా వాడకం పెరిగింది.
  • సెప్టెంబర్ 10 తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ ఉంటుది..
  • సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్ ముగుస్తుంది.
2025-08-31 10:32:29

సభలో గందరగోళం

  • సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నేతలు గరం.. 
  • సభలో బీఆర్‌ఎస్‌ నేతల నినాదాలు.. 
2025-08-31 09:51:17

బిల్లుపై సీఎం రేవంత్‌ కామెంట్స్‌..

బిల్లుపై సీఎం రేవంత్‌ కామెంట్స్‌.. బీఆర్‌ఎస్‌పై సెటైర్లు.. 

  • తెలంగాణ ప్రజల్లో అపోహలు సృష్టించే విధంగా బీఆర్‌ఎస్‌ సభ్యులు మాట్లాడుతున్నారు.
  • హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మరు క్షణమే చిత్తశుద్దితో రిజర్వేషన్ల హామీ నిలబెట్టుకున్నాం.
  • భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం.
  • స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తాం.
  • కేసీఆర్‌ తెచ్చిన 50 శాతం రిజర్వేషన్లు పరిమితిని తొలగిస్తాం.
  • నాలుగు సార్లు ఎమ్మెల్యే గా పనిచేసిన గంగుల కు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు తెలియదా.
  • కోర్ట్ సూచన మేరకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసాం.
  • 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇచ్చేందుకు కమిట్మెంట్ తో పని చేస్తున్నాం
  • సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు డెడ్ లైన్ పెట్టింది.
  • బీఆర్ఎస్ తెచ్చిన చట్టం.. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు పెంచడానికి గుదిబండగా మారాయి..
  • గంగుల కమలాకర్ బిల్లుకు మద్దతు ఇస్తున్నా.. ఆ పార్టీలో కొందరికి నచ్చడం లేదు.
  • బీసీ రిజర్వేషన్ల కోసం ప్రధానమంత్రిని కలిసేందుకు ఐదు సార్లు లేఖ రాస్తే.. అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు
  • మేము జంతర్ మంతర్‌లో ధర్నా చేస్తే.. బీఆర్ఎస్ ఎందుకు అటెండ్ కాలేదు.
  • ఈ మేరకు ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చి గవర్నర్‌ వద్దకు పంపించాం.
  • ఇతర రాష్ట్రాల్లో వచ్చిన అడ్డంకులు తెలంగాణలో రావద్దని మా ఆలోచన.
  • ఆరు నూరైనా 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం. 
  • తెర వెనుక లాబీయింగ్‌ చేసి బిల్లును రాష్ట్రపతికి పంపించేలా చేశారు.
  • రాహుల్ గాంధీ ఆదేశం లేనిదే నేను ఏది చేయను..
  • కేటీఆర్, హరీష్ రావు గురించి గంగులకు తెలియంది కాదు..
  • గంగులకు మంచి చెడ్డలు ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను.
  • కల్వకుంట్ల కుటుంబం కాదు.. కలవకుండా చూసే కుటుంబం.
  • బీసీ రిజర్వేషన్లపై గంగుల ఒక్కడే సంతోషంగా ఉన్నారు.
  • మేము సహకరించడం, మా బుద్ది మారదు అంటే.. ప్రజలే సమాధానం చెప్తారు.
  • ఒకరిపై ఒకరు విమర్శల చేసుకుని విమర్శలు కావద్దు. 
2025-08-31 09:45:37

గంగుల Vs మంత్రులు..

  • మంత్రులు Vs గంగుల..
  • మంత్రి పొన్నం కామెంట్స్‌..
  • బీసీ రిజర్వేషన్ల కోసం యావత్‌ తెలంగాణ ఎదురు చూస్తోంది.
  • బీసీ కమిషన్‌ లేదన్నది తప్పుడు వాదన.
  • అన్ని తెలుసుకుని మాట్లాడాలి.
  • గంగుల కమలాకర్‌ కామెంట్స్‌..
  • పార్టీ పక్షాన బీసీ బిల్లు పాస్‌ కావాలని కోరుకుంటున్నాం.
  • బీసీ బిల్లును బీఆర్‌ఎస్‌ సంపూర్ణంగా స్వాగతించింది.
  • బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ప్రతిపక్షాల సూచనలు తీసుకోలేదు.
  • బీసీ రిజర్వేషన్లకు ప్రతిపక్షాల సహకారం అడుగుతున్నాం.
  • సవరణ పక్కాగా చేపట్టాలి.
  • మంత్రి పొన్నంకు వాస్తవాలు తెలియవు.
  • నేను అడిగిన వాటికి ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వాలి.
  • మంత్రి శ్రీధర్‌ బాబు కామెంట్స్‌..
  • బిల్లు వద్దని అవరోధం కలిగిస్తామంటే చెప్పండి: శ్రీధర్‌ బాబు.
  • ఓ మంత్రికి ఏమీ తెలియదని గంగుల అనడం సరికాదు.
  • నా మీద చేసిన వ్యాఖ్యలను గంగుల వెనక్కి తీసుకోవాలి. 
     
2025-08-31 09:39:41

పంచాయతీరాజ్‌ బిల్లుపై చర్చ..

  • కాళేశ్వరం కమిషన్‌ రిపోర్టును టేబుల్‌ చేసిన ప్రభుత్వం.
  • కమిషన్‌ రిపోర్టును సభ్యులకు పెన్‌డ్రైవ్‌లు ఇచ్చిన ప్రభుత్వం
  • పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్‌బాబు.
  • సభ ముందుకు మున్సిపల్‌ చట్టల సవరణ బిల్లు.
  • మంత్రి శ్రీధర్‌ బాబు కామెంట్స్‌..
  • సభ జరుగుతున్నప్పుడు ఆర్డినెన్స్‌లు చెల్లవు.. అందుకే బిల్లు తెచ్చాం.
  • ఇది తెలిసి కూడా హరీష్‌ రావు, ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడటం సరికాదు.
  • పంచాయతీ, మున్సిపల్‌ చట్టాల్లో 50 శాతం రిజర్వేషన్లు మించవద్దని చట్టాలున్నాయి.
  • మరోవైపు.. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లులను వ్యతిరేకించిన హరీష్‌ రావు. 
  • ఆషామాషీగా సర్వే చేయలేదు.
  • బీసీ రిజర్వేషన్లకు సభ్యులంతా సహకరించాలి.
  • వెనుకబడిన వర్గాలకు పురపాలక ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలి.
  • బలహీన వర్గాల ప్రజలంతా మాతో కలిసి వస్తారని ఆశిస్తున్నాను.
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్‌ సవరణ కోరుతున్నాం.
  • ఏకసభ్య కమిషన్‌ కూడా సామాజిక, ఆర్థిక పరిస్థితులపై నివేదిక ఇచ్చింది.
  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
  • అన్ని స్థానిక సంస్థల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సంకల్పించాం. 
2025-08-31 09:18:04

తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం..

  • రెండోరోజు తెలంగాణ అసెం‍బ్లీ ప్రారంభమైంది. 
  • సభ లోపల, బయట భారీగా మార్షల్స్‌ మోహరింపు 
  • జూబ్లీహిల్స్ నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి
2025-08-31 09:05:09

నేటితో శాసనసభ నిరవధిక వాయిదా..

  • నేటితో ముగియనున్న శాసనసభ..
  • నేడు నిరవధిక వాయిదా వేసే అవకాశం..
  • అర్దరాత్రి వరకు అయినా సభ నడిపి ముగించాలనే యోచనలో ప్రభుత్వం..
  • గణేష్ నిమజ్జనం, వరదల నేపథ్యంలో సభ నేటితో ముగించాలని ప్రభుత్వం నిర్ణయం

2025-08-31 08:45:39

కేసీఆర్ కాళేశ్వరంపై మాట్లాడాలి: ఆది శ్రీనివాస్‌

  • అసెంబ్లీ మీడియా పాయింట్
  • ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కామెంట్స్‌..
  • బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ అడిగాం..
  • ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం..
  • రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో విచారణ చేపిస్తాం..
  • కేసీఆర్ సభకు రావాలి.. కాళేశ్వరంపై మాట్లాడాలి.
  • ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కామెంట్స్‌..
  • కాళేశ్వరంలో ఎవరి దోపిడీ ఎంత అనేది ప్రజలకు తెలియాలి.
  • తమ అవినీతి బయటకు వస్తుందనే.. యూరియా అంశాన్ని బీఆర్ఎస్ తెరపైకి తెస్తుంది.
  • యూరియా కొంత కొరత ఉంది.
  • బాలు నాయక్ అనే రైతు 8 యూరియా బస్తాలు తీసుకున్నాడు.
  • అయినా బాలు నాయక్‌కు యూరియా అందలేదని బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది.
  • యూరియాపై చర్చ పెడదాం..
  • యూరియా ఎక్కడ నుంచి రావాలో బీఆర్ఎస్‌కు తెలియదా?.
2025-08-31 08:42:01

కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం.. మోహరించిన మార్షల్స్

  • నేడు అసెంబ్లీ కాళేశ్వరం కమిషన్‌ రిపోర్టుపై చర్చ.
  • ఈరోజు వాడీవేడీగా సాగనున్న తెలంగాణ అసెంబ్లీ
  • అసెంబ్లీ లాబీల్లో భారీగా మోహరించిన మార్షల్స్..
  • సభలో ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తనపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం.
  • స్పీకర్‌ పోడియం వద్దకు వస్తే వేటు వేయాలని నిర్ణయం.
  • సభ లోపల, బయట భారీ బందోబస్తు.
2025-08-31 08:24:47

విచారణ ఎలా అన్న దానిపై ఉత్కంఠ..

  • కాళేశ్వరం కమిషన్‌పై సీబీఐ లేదా సిట్‌ విచారణ అనే దానిపై ఉత్కంఠ.
  • బిల్లుల తర్వాత కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై స్వల్పకాలిక చర్చ.
  • గతంలో ఒకరిద్దరు ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్‌ సీరియస్‌
  • కాళేశ్వరంపై ప్రభుత్వం ఎలాంటి విచారణకు ఆదేశించబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
  • సీబీఐ విచారణకు ఇవ్వాలని ఒకరిద్దరు మంత్రుల ప్రతిపాదన
2025-08-31 08:24:47

బిల్లులపై చర్చ..

  • బిల్లులపై చర్చ.
  • ఉదయం ప్రభుత్వ బిల్లులపై చర్చ.
  • మొదటగా సభ ముందుకు పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ సవరణ బిల్లు.
  • బిల్లుల తర్వాత కాళేaశ్వరం కమిషన్‌ నివేదికపై స్వల్పకాలిక చర్చ.
  • క్వశ్చన్‌ అవర్‌ రద్దు.
2025-08-31 08:24:47
Advertisement
 
Advertisement

పోల్

Advertisement