
మనదేశంలో బహుబభార్యత్వం చట్టవిరుద్ధం. పైగా ఇద్దరమ్మాయిలను పెళ్లి చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఎక్కడో అరుదుగా జరుగుతుంటాయి. అది కూడా మహా అయితే ఇద్దరు కవలలు, లేదా తోడబుట్టిన అక్కా చెల్లెళ్లను పెళ్లాడిన ఘటనలు చూసుంటారు. కాని ఇద్దరు బాల్య స్నేహితురాళ్లును పెళ్లి చేసుకోవడం అనేది అత్యంత అరుదు. అలాంటి విచిత్ర ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది.
ఈ అరుదైన విచిత్రమైన పెళ్లిని చూసేందుకు జనాలు వేలాదిగా తరలి వచ్చారు. కర్ణాటకకు చెందిన 25 ఏళ్ల వసీం షేక్ తన చిన్న నాటి ప్రాణ స్నేహితులైన షిఫా షేక్, జన్నత్ మఖందర్‌ల పెళ్లి చేసుకున్నాడు. చిత్రదుర్గ జిల్లాలోని హోరాపేటలోని ఎంకే ప్యాలెస్‌లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఒకే వేడుక వద్ద పెళ్లితో ఒక్కటి కానున్న ఈ ముగ్గురి వివాహాన్ని చూసేందుకు బంధు మిత్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
కొందరూ ఈ పెళ్లిని స్వాగతించగా, మరికొందరు ఇదేం పెళ్లి అన్నట్లు ముఖం చిట్లించారు. ఈ ముగ్గురి వివాహాన్ని వారివారి కుటుంబాలు అంగీకరించడం, పెళ్లిచేయడం విశేషం. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతే ఈ పెళ్లి పెద్ద చర్చనీయాంశంగా మారింది.
కాగా, బహుభార్యత్వం భారతీయ పౌర చట్టం ప్రకారం..అనుమతి లేకపోయినా, కొన్ని వ్యక్తిగత చట్టాలకింద మినహాయింపులు ఉన్నాయట. ఇలాంటి పెళ్లిళ్లు చెల్లుబాటు అనేది సామాజిక అంగీకారం, నిబంధనలు, ఆయా సంఘాలు చట్టబద్ధత, మతపరమైన అంశాలు వంటి వాటిపై ఆధారపడి ఉంటుందట.
(చదవండి: బాణసంచా కాల్చడం ఎలా మొదలైందో తెలుసా..!)