
మన దేశంలో ఏ పండుగ లేదా ఏదైనా వివాహ ఆచారంలో దేవుడి పాటలతో ఆధ్యాత్మికానుభూతి పొందడం అత్యంత సహజం. కానీ ఇలాంటి దైవిక పాటలు పాశ్చాత్య దేశాల్లో అందులోనూ యూరోపియన దేశమైన ఇటలీలో ప్లేచేస్తే..ఔను మీరు వింటుంది నిజమే..అక్కడ ఈ పాటతో అందరూ ఒక విధమైన తన్మయత్వంతో ఊగిపోయారు. అంతేగాదు ఈపాట వైబ్ అక్క ప్రజలను ఓ ఊపు ఊపేసింది. వెస్ట్రన్ కల్చర్‌తో విభన్నంగా ఉండే మ్యూజిక్ ఫెస్ట్‌వెల్ ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత విశేషం.
అసలేం జరిగిందంటే..ఇటలీలో జరిగిన ఒక మ్యూజిక్ వేడుకలో ఒక మహిళా డీజే శివతాండవ స్తోత్రాన్ని ఎలక్ట్రానిక్ డ్యాన్ మ్యూజిక్(ఈడీఎం) ట్రాక్‌గా ప్లే చేసి అందరిన్ని ఆశ్చర్యపరిచింది. అయితే ఆ సాంగ్ పవర్‌కో మరేమో గానీ అక్కడి ప్రజలు ఒక విధమైన ఎనర్జీతో ఊగిపోయారు. ఆ పాటకు లయబద్ధంగా డ్యాన్స్‌చేస్తూ ఆసక్తి కనబర్చడం విశేషం.
కూడా ఈ పాట జోష్‌కి మమైకమైపోతూ చిందులేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారి చర్చనీయాంశంగా మారింది. ఇదేంటి విదేశాల్లో మన శివుడి భక్తిపాట అని విస్తుపోయారు.
అయితే నెటిజన్లు కొందరూ భక్తిపాటలు ఇలా ప్లే చేయొచ్చా అని ఆగ్రహం వ్యక్తం చేయగా..శివుడిని అర్థం చేసుకున్నవారు, శివుడు తత్వం తెలుసకున్నావారికి ఇది కచ్చితంగా నచ్చుతుంది అని కౌంటరిస్తూ పోస్టులు పెట్టారు. రావణుడి బ్రహ్మ పాడిన ఈ పాట విదేశీ శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేయడమే గాక, భారతదేశంలోని భక్తి పారవశ్యంతో కూడిన సంగీతం పవర్ ఏంటో నొక్కి చెప్పింది కదూ..!.
(చదవండి: Man Name Makes Record: 'పేరు'తో ప్రపంచ రికార్డు..! ఏకంగా చట్టంలోనే మార్పులు చేసి..)