పచ్చని పందిట్లో తీవ్ర విషాదం.. డీజేకు విద్యుత్‌ షాక్‌.. ఐదుగురు మృతి | Deeg district in Rajasthan witnessed a tragic incident | Sakshi
Sakshi News home page

పచ్చని పందిట్లో తీవ్ర విషాదం.. డీజేకు విద్యుత్‌ షాక్‌.. ఐదుగురు మృతి

Feb 20 2026 8:11 PM | Updated on Feb 20 2026 8:23 PM

Deeg district in Rajasthan witnessed a tragic incident

జైపూర్‌: రాజస్థాన్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పచ్చని పందిట్లో విషాదం ఛాయలు నెలకొన్నాయి. డిగ్‌ జిల్లా నియామత్‌పూర్‌లో జరిగిన పెళ్లి ఊరేగింపు డీజేలో విద్యుత్‌ షాక్‌ సంభవించింది. విద్యుత్‌ షాక్‌ గురై ఐదుగురు మృతి చెందారు. 11కే విద్యుత్‌వైర్లకు డీజే వాహనం తగలడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement