
ఎవ్వరికైనా పేరు మహా అయితే ఓ నాలుగైదు పేర్లతో పెట్టుకుంటారేమో. అది కూడా అప్లికేషన్స్‌లో రాయడం అంత ఈజీ కాదు కూడా. అలాంటిది ఈ వ్యక్తి ఎంత పెద్ద పేరు పెట్టుకున్నాడో వింటే విస్తుపోతారు. అందులో ఎన్ని పదాలు ఉన్నాయో చూస్తే మతిపోతుంది. ఇలా కూడా పేరు పెట్టుకుంటారా అన్నంత వెరైటీగా పేరు పెట్టుకుని రికార్డు క్రియేట్ చేశాడు. అందరూ రకరకాల ఫీట్లతో కష్టపడి రికార్డు బద్దులు కొడితే..ఈ వ్యక్తి మాత్రం తన పేరుతోనే రికార్డులు ఎక్కాడు. వాటే క్రియేటివిటీ అనాలా..లేక అతని ఆలోచనకు సలాం కొట్టాలో తెలియదు గానీ..ప్రస్తుతం ఇతడి పేరు మాత్రం అత్యంత హాట్‌టాపిక్‌గా మారి వార్తల్లో నిలిచింది.
అతడే న్యూజిలాండ్‌కు చెందిన లారెన్స్. మాములుగా కొందరికి వంశపారంపర్య పేర్లే, ప్లస్ సెంటిమెంట్‌లు, ఆచారాలో కొందిరి పేర్లు ఎంత పొడవుగా ఉంటాయో తెలిసిందే. కానీ లారెన్స్ వాళ్లందర్నీ వెనక్కి నెట్టేలా ఎంత పెద్ద పేరు పెట్టుకున్నాడంటే..అధికారులే అభ్యంతరం చెప్పే రేంజ్‌లో పెట్టుకున్నాడు. చట్టబద్ధంగా ఆ పేరు మార్పుని పొంది వార్తల్లో నిలవడమే కాదు గిన్నిస్ వరల్డ్ రికార్డు( Guinness World Records)లకెక్కాడు.
ఇంతకీ ఈ వ్యక్తి పేరులో ఎన్న పదాలు ఉంటాయో తెలుసా..ఏకంగా 2,253 ప్రత్యేక పదాలు ఉన్నాయి. నిజానికి ఇంత పెద్ద పేర్లు ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో ఉపయోగించడం చాలా కష్టం. ఎందుకంటే..రాతపూర్వకంగా కాకుండా ఆన్‌లైన్‌లోనే దేనికైనా దరఖాస్తూ చేయాల్సిన పరిస్థితి. అందులోనూ ఇంత పెద్ద పేరుని టైప్ చేయడం ఇంకా కష్టం. పైగా అక్కడ అంత స్పేస్ కూడా ఉండదు. అలాగే పలకాలన్నా కూడా 20 నిమిషాలు పడుతుందట.
అయితే లారెన్స్ ఎక్కడ తగ్గలేదు అంత పెద్ద పేరు టైప్ చేసేలా వందల డాలర్ల ఖర్చు చేశాడు. అంతేగాదు జిల్లా కోర్టు ఇంత పెద్ద పేరుని పెట్టుకోవడాన్ని తిరస్కరిస్తే..హైకోర్టుకి అప్పీల్ చేసుకుని మరి న్యాయం పోరాటం చేశాడు. చివరికి కోర్టు అతడికి అనూకూలంగా తీర్పు ఇవ్వడమే కాదు..ఏకంగా చట్టంలోనే సంస్కరణలు చేసి.. రెండు చట్టాలను మార్చింది కూడా. పేరు మార్పు చేసుకోవడమే కాదు చట్ట బద్ధం చేసుకునేలా పోరాడటం అంటే మాటలు కాదు కదా..!.
(చదవండి: Karwa Chauth: భార్య కోసం బ్రిటిష్ వ్యక్తి కర్వా చౌత్ ఉపవాసం..! పాపం చంద్రుడి దర్శనం కోసం..)