స్వదేశంలో ఇవాల్టి నుంచి (జనవరి 11) భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. వడోదర వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ ప్రయోగం చేస్తుంది.
రొటీన్‌కు భిన్నంగా ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగుతుంది. స్పిన్నర్లుగా సుందర్, జడేజా, కుల్దీప్.. పేసర్లుగా సిరాజ్, ప్రసిద్ద్, హర్షిత్ బరిలో దిగుతున్నారు.
న్యూజిలాండ్ తరఫున క్రిస్టియన్ క్లార్క్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తున్నాడు. భారత మూలాలున్న ఆదిత్య అశోక్ ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ప్రధాన బౌలర్‌గా బరిలో దిగనున్నాడు. అశోక్ రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలర్. గూగ్లీలు వేయడంలో దిట్ట.
ఎవరీ ఆదిత్య అశోక్..?
ఆదిత్య అశోక్ తమిళనాడులోని వేలూర్‌లో 2002 సెప్టెంబర్ 5న జన్మించాడు. అతనికి నాలుగేళ్ల వయసు ఉండగా అతని న్యూజిలాండ్‌కు వలస వెళ్లి ఆక్లాండ్‌లో స్థిరపడింది. అశోక్ ఆక్లాండ్‌లోని మౌంట్ ఆల్బర్ట్ గ్రామర్ స్కూల్‌లో చదువుకున్నాడు.
అశోక్ 2020 అండర్-19 వరల్డ్ కప్‌తో న్యూజిలాండ్ తరఫున జూనియర్ విభాగంలో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత దేశీయ క్రికెట్‌లో ఆక్లాండ్ తరఫున మెరిసాడు.
- 2021 డిసెంబర్‌లో Super Smash టోర్నీతో టీ20 అరంగేట్రం చేశాడు.
- 2022 జనవరిలో Ford Trophyతో లిస్ట్ A అరంగేట్రం చేశాడు.
- 2022–23 Plunket Shieldతో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్లతో సత్తా చాటాడు.
అశోక్‌కు న్యూజిలాండ్ సీనియర్ జట్టు నుంచి 2023 మార్చిలో తొలిసారి పిలుపు వచ్చింది. తొలుత అతను ఏ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2023 ఆగస్టులో UAEపై అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు. 2023 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌పై వన్డే అరంగేట్రం చేశాడు. అశోక్ న్యూజిలాండ్ తరఫున ఇప్పటివరకు 2 వన్డేలు, ఓ టీ20 మాత్రమే ఆడాడు. అతన్ని న్యూజిలాండ్ స్పిన్ భవిష్యత్తుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటివరకు భారత మూలాలున్న చాలామంది క్రికెటర్లు న్యూజిలాండ్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. వీరిలో టామ్ పునా ప్రథముడు కాగా.. దీపక్ పటేల్, జీత్ రావల్, ఐష్ సోధి, ఎజాజ్ పటేల్, రచిన్ రవీంద్ర వంటి వారు బాగా పాపులయ్యారు. తాజాగా ఆదిత్య అశోక్ కూడా వీరి బాటలోనే పయనించేందుకు కృషి చేస్తున్నాడు.


