స్వదేశంలో ఇవాల్టి నుంచి (జనవరి 11) భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. వడోదర వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ ప్రయోగం చేస్తుంది. రొటీన్‌కు భిన్నంగా ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగుతుంది.
స్పిన్నర్లుగా సుందర్, జడేజా, కుల్దీప్.. పేసర్లుగా సిరాజ్, ప్రసిద్ద్, హర్షిత్ బరిలో దిగుతున్నారు. న్యూజిలాండ్ తరఫున క్రిస్టియన్ క్లార్క్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తున్నాడు. భారత మూలాలున్న ఆదిత్య అశోక్ ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ప్రధాన స్పిన్నర్‌గా బరిలో దిగనున్నాడు. అశోక్ కుటుంబం అతని చిన్నప్పుడే తమిళనాడులోని వేలూర్ నుంచి వెళ్లి న్యూజిలాండ్‌లో స్థిరపడింది.
తుది జట్లు..
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్‌వెల్(c), జకారీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ


